ప్రస్తుత జీవన విధానంలో టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వివాహిత మహిళల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పీసీఓఎస్. దీని కారణంగా మహిళలు పడే బాధ అంత ఇంత కాదు. అయితే అందుకోసం చాలామంది పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. నిజానికి పీసీఓఎస్ సమస్య ఉంటే పాల ఉత్పత్తులు నివారించాల్సిన అవసరమే లేదని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. నిక్షేపంగా వాటిని తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల పీసీఓఎస్ అవగాహన నెల సందర్భంగా దీని గురించి సవివరంగా తెలుసుకుందాం.!
పీసీఓస్ అంటే..
పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ అనేది ఒక సాధారణ హార్మోన్ల రుగ్మత. ఇది కొందరిలో గర్బందాల్చే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో అండోత్సర్గం జరగకపోవచ్చు లేదా ఆండ్రోజెన్ల స్థాయి(పురుష హార్మోన్లు) పెరగడం లేదా అండాశయాలపై చిన్న తిత్తులు రావడం జరుగుతుంది. కొందరికి పిరియడ్స్ అసంబంధంగా(ఇర్‌రెగ్యులర్)గా ఉండటం, బరువు పెరగటం, ముఖంపై వెంట్రుకలు, మొటిమలు, జిడ్డుగల చర్మం తదితర సమస్యలు ఎదురవుతాయి.
డైట్‌తో సంబంధం..
అధిక-కార్బోహైడ్రేట్, కొవ్వు ఆహారాలు, తక్కువ-ఫైబర్ ఆహారాలు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్‌తో కూడిన పాశ్చాత్య ఆహారాలు పీసీఓఎస్ సమస్యను పెంచే ప్రమాద కారకాలు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వంటివి పీసీఓస్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. ఇక్కడ డైరీ ఉత్పత్తులు పీసీఓఎస్ సమస్యను పెంచుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు.
డైరీ ఉత్పత్తుల్లో సంతృప్తకొవ్వులు కూడా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవాలని అన్నారు. అయితే కొందరికి లాక్టోస్ అసహనం ఉంటుంది. అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులు తీసుకుంటే అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా మొత్తం ఆరోగ్యాన్నే ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మేలని చెప్పారు.
లాక్టోస్ అసహనం లేనట్లయితే చక్కగా పెరుగు, మజ్జిగ రూపంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్‌లు శరీరానికి అందడమే కుండా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇలాంటి సమస్యతో బాధపడేవారు డైట్‌లో మార్పులు చేసుకునే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాలను తీసుకుని పాటించటం మంచిదని చెబుతున్నారు అమిత గాద్రే.
(చదవండి: యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!)
Comments
Please login to add a commentAdd a comment