Dairy
-
90 ఏళ్లుగా డైరీలు రాస్తూనే ఉంది!
కొందరు డైరీలు రాయరు. కొందరు డైరీ రాసే అలవాటును మధ్యలోనే వదిలేస్తారు. అమెరికాకు చెందిన ఎవీ రిస్కీ అలా కాదు. వంద సంవత్సరాల రిస్కీ తొంభై సంవత్సరాలుగా డైరీలు రాస్తూనే ఉంది... ఎవీ రిస్కీ తండ్రికీ డైరీలు రాయడం అంటే ఎంతో ఇష్టం. కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు కొత్త సంవత్సరం రోజున డైరీని కానుకగా ఇచ్చాడు. ఇక అప్పటినుంచి మొదలైన డైరీ రాసే అలవాటు ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ప్రతిరోజూ డైరీ రాస్తోంది. ఇది ఆమెకు జీవితకాలపు అలవాటు అయింది. చిన్ననాటి నుంచి మొదలైన ఈ అలవాటు వల్ల ఆమె వ్యక్తిగత ప్రయాణంతోపాటు చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని కూడా డాక్యుమెంటూ చేస్తూ వస్తోంది.నయాగరా అనే చిన్న పట్టణంలో పెరిగిన రిస్కీ ప్రతి సీజన్ గురించి రాసింది. కుటుంబ ప్రయాణాల నుంచి చారిత్రాత్మక సంచలన ఘటనల వరకు ఎన్నో చేసింది. కష్టకాలంలోనూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ డైరీ రాయడం ఆపలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా డైరీ రాయడం మానలేదు. ఎప్పుడైనా డైరీని చేరుకోలేనంత అనారోగ్యంగా ఉంటే చిత్తు కాగితాలపై నోట్సు రాసి ఆ తరువాత డైరీలో రాసేది. ప్రతిరాత్రి డైరీ రాయడం పూర్తి చేసిన తరువాత గత సంవత్సరం ఆరోజు విషయాలను తెలుసుకోవడం తనకు ఆసక్తిగా ఉంటుంది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఎవీ రీస్కీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆన్లైన్ సెన్సేషన్‌గా మారింది. -
గ్రామ స్వరాజ్య స్థాపనకు చర్యలెన్నో తీసుకున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: స్ధానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ని ఆయన ఆవిష్కరించారు. మన హయాంలో గ్రామ స్వరాజ్య స్థాపనకు అనేక చర్యలు తీసుకున్నాం. స్థానిక సంస్థల బలోపేతానికి ఎంతో కృషి చేశాం. ఆర్థికంగా వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎంపీపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరకపూడి గాంధీ, కడప మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు. -
నందిని నెయ్యి వద్దన్నది బాబే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచార కుట్ర కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పూటకో కట్టు కథ, రోజుకో అవాస్తవ ఆరోపణలతో కుతంత్రానికి పదును పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశి్నస్తుండటం ఈ కుట్ర కథలో తాజా అంకం. వాస్తవం ఏమిటంటే.. దశాబ్ద కాలంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డెయిరీని 2015లో తొలిసారిగా పక్కకు తప్పించింది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసేందుకు యతి్నస్తుండటం గమనార్హం. నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబే... కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలంపాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ ప్రక్రియను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. నాడు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచి్చంది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అప్పట్లో ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా ఉన్న సమయంలో నందినీ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ వార్తలు కూడా ప్రసారం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచి్చనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నందినీ డెయిరీని కాదని గోవింద్ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టింది. నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లలో పాల్గొనని నందిని ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వనందున టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనబోమని పేర్కొంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఇదీ అసలు విషయం. అయినా సరే ఎందుకు ఇవ్వలేదంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచడం విస్మయం కలిగిస్తోంది. అసలు వైఎస్సార్సీపీ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2015లో టీడీపీ హయాంలో టెండరు ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వనిది చంద్రబాబే అన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వెనుక చంద్రబాబు రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఏఆర్ డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు
సాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శనివారం సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. తిరుమలకు సరఫరా అయింది ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యేనన్న సమాచారంతో దిండుగల్‌లోని ఆ ఉత్పత్తి కేంద్రంపై అందరి దృష్టి పడింది. దీంతో శుక్రవారం రాత్రి తమిళనాడు ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిత ఆ పరిశ్రమలో తనిఖీలు చేసి, వ్యర్థ జలాలను పరిశీలనకు తీసుకెళ్లారు.అదే సమయంలో శనివారం సెంట్రల్ ఫుడ్ సేప్టీ అధికారి ఒకరితో పాటు మరి కొందరు సిబ్బంది ఆ పరిశ్రమలో సోదాలు చేశారు. ఏఆర్ డెయిరీకి చెందిన పాలు, నెయ్యి, పనీర్, వెన్న, పెరుగు, మజ్జిగ, స్వీట్లు తదితర ఉత్పత్తులను 2 గంటలకుపైగా పరిశోధించారు. వీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లారు. అదే సమయంలో ఏఆర్ డెయిరీ కంపెనీ తరఫున క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు లెని, కన్నన్ మీడియా ముందుకు వచ్చారు. తమ ఉత్పత్తులలో కల్తీకి ఆస్కారం లేదని, ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చని సూచించారు.తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించే ముందు పరిశీలించి, అందుకు సంబంధించిన సర్టీఫికెట్లను సిద్ధం చేస్తామని వివరించారు. జూన్, జూలై నెలల్లో పంపించామని, ఇప్పుడు అక్కడకు సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ పేరు బహిరంగంగా చెప్పనప్పటికీ, జరుగుతున్న పరిణామాలను చూసి వివరణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తమ ఉత్పత్తులు అన్ని చోట్ల ఉన్నాయని, ఏ సమయంలోనైనా సరే తనిఖీలు చేసుకోవచ్చునని సూచించారు. 16 వేల టన్నులను ఆ రెండు నెలలు నిరంతరాయంగా పంపిణీ చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల తనిఖీ, పరిశీలన సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. -
పీసీఓఎస్ ఉంటే పాల ఉత్పత్తులు నివారించాలా..?
ప్రస్తుత జీవన విధానంలో టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వివాహిత మహిళల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పీసీఓఎస్. దీని కారణంగా మహిళలు పడే బాధ అంత ఇంత కాదు. అయితే అందుకోసం చాలామంది పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. నిజానికి పీసీఓఎస్ సమస్య ఉంటే పాల ఉత్పత్తులు నివారించాల్సిన అవసరమే లేదని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. నిక్షేపంగా వాటిని తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల పీసీఓఎస్ అవగాహన నెల సందర్భంగా దీని గురించి సవివరంగా తెలుసుకుందాం.!పీసీఓస్ అంటే..పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ అనేది ఒక సాధారణ హార్మోన్ల రుగ్మత. ఇది కొందరిలో గర్బందాల్చే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో అండోత్సర్గం జరగకపోవచ్చు లేదా ఆండ్రోజెన్ల స్థాయి(పురుష హార్మోన్లు) పెరగడం లేదా అండాశయాలపై చిన్న తిత్తులు రావడం జరుగుతుంది. కొందరికి పిరియడ్స్ అసంబంధంగా(ఇర్రెగ్యులర్)గా ఉండటం, బరువు పెరగటం, ముఖంపై వెంట్రుకలు, మొటిమలు, జిడ్డుగల చర్మం తదితర సమస్యలు ఎదురవుతాయి. డైట్‌తో సంబంధం..అధిక-కార్బోహైడ్రేట్, కొవ్వు ఆహారాలు, తక్కువ-ఫైబర్ ఆహారాలు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్‌తో కూడిన పాశ్చాత్య ఆహారాలు పీసీఓఎస్ సమస్యను పెంచే ప్రమాద కారకాలు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వంటివి పీసీఓస్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. ఇక్కడ డైరీ ఉత్పత్తులు పీసీఓఎస్ సమస్యను పెంచుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు.డైరీ ఉత్పత్తుల్లో సంతృప్తకొవ్వులు కూడా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవాలని అన్నారు. అయితే కొందరికి లాక్టోస్ అసహనం ఉంటుంది. అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులు తీసుకుంటే అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా మొత్తం ఆరోగ్యాన్నే ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మేలని చెప్పారు. లాక్టోస్ అసహనం లేనట్లయితే చక్కగా పెరుగు, మజ్జిగ రూపంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్లు శరీరానికి అందడమే కుండా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇలాంటి సమస్యతో బాధపడేవారు డైట్లో మార్పులు చేసుకునే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాలను తీసుకుని పాటించటం మంచిదని చెబుతున్నారు అమిత గాద్రే. View this post on Instagram A post shared by Oh, Cheat Day ! (@ohcheatday) (చదవండి: యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!) -
వీళ్ళు తాగే పాలు ఏ డైరీ నుంచి వస్తాయో తెలుసా...?
-
పాడికి భరోసాపై కాలకూట విషం
సాక్షి, అమరావతి: సంక్షోభంలో చిక్కుకుని మూతపడ్డ సహకార పాల డెయిరీలను పునరుద్ధరించారు.. ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సహకార రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. లీటర్‌కు రూ.4 చొప్పున అదనపు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా లీటర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకూ అదనపు లబ్ధి చేకూరుస్తున్నారు. ఇప్పుడు పాడి రైతు చిరునవ్వులు చిందిస్తుంటే ఈనాడు రామోజీకి నచ్చడం లేదు. తన హయాంలో పాడి రైతును దగా చేసిన చంద్రబాబుకు బాకా ఊదడమే లక్ష్యంగా విషపు రాతలతో తెగబడుతున్నారు. తన బురద రాతలతో పాడి రైతుకు భరోసాపై ఓర్వలేనితనంతో కాలకూట విషం కక్కుతున్నారు. ‘పాడి కష్టం..అమూల్ పాలు’ అంటూ కాకిలెక్కలతో ఈనాడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈనాడు ఆరోపణ: ఏళ్లు గడుస్తున్నా..పెరగని పాలసేకరణ వాస్తవం: రాష్ట్రంలోని ప్రైవేటు డెయిరీలన్నీ కలిపి రోజుకు 22 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంటే..అమూల్ సంస్థ కేవలం 3.45 లక్షల లీటర్లు మాత్రమే సేకరిస్తోందని ఆరోపించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. నేడు 4778 గ్రామాల్లో 4.15 లక్షల మంది మహిళా పాడి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,09,763 మంది రోజూ పాలు పోస్తున్నారు. 2023 జూలైలో రోజుకు 1.74 లక్షల లీటర్లు పాలు సేకరణ చేయగా.. 2024 జనవరి నాటికి 3.75 లక్షల లీటర్ల పాలసేకరణకు చేరుకుంది. 4 లక్షల లీటర్ల పాల సేకరణకు ప్రైవేటు డెయిరీలకు రెండు దశాబ్దాలకుపైగా పడితే అమూల్ కేవలం మూడేళ్లలో 4 లక్షల లీటర్లకు చేరువలో ఉంది. ఆరోపణ: నమ్మించి నట్టేట ముంచారు వాస్తవం: మధ్యవర్తులు లేకుండా మహిళా పాడి రైతులకు నేరుగా ప్రతి పదిరోజులకోసారి పాల బిల్లులను చెల్లిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్‌కు పాల నాణ్యత మేరకు రూపాయి నుంచి రూ.2.75 చొప్పున అందిస్తున్నారు. 180 రోజులకు తక్కువకాకుండా పాలు పోసే మహిళా పాడి రైతులకు మూడేళ్లలో రాయిల్టీ ఇన్సెంటివ్ కింద ఇప్పటి వరకు రూ.4.93 కోట్లు చెల్లించారు. ఆరోపణ: ప్రైవేటు డెయిరీ కంటే తక్కువ ధర? వాస్తవం: జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి పాల సేకరణ ధరలు ఏడు సార్లు పెంచారు. ఫలితంగా గేదె పాలు లీటరుకు రూ.18.29(రూ.71.47 నుంచి రూ.89.76) ఆవు పాలకు రూ.9.49(రూ.34.20 నుంచి రూ.43.69)కు పెంచారు. 13 శాతం కొవ్వు, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటరుకు గరిష్టంగా రూ.104 చొప్పున పాడిరైతులకు ఇస్తున్నారు. ఈ ధర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేటు డెయిరీ చెల్లించడం లేదు. ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ధర, ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధర చెల్లిస్తుంటే, జగనన్న పాల వెల్లువలో సీజన్‌తో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర అందిస్తున్నారు. అమూల్ ధరలు పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా తమ పాలసేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా ప్రైవేటు డెయిరీల నుంచి పాలు పోసే రైతులకు ఈ ప్రాజెక్టు ఫలితంగా రూ.4818.05 కోట్ల అదనపు లబ్ధి చేకూరింది. ఆరోపణ: పాడి రైతులకు చేయూత ఏదీ? వాస్తవం: పాడి రైతులకు 20 శాతం సీపీతో అత్యంత నాణ్యమైన పశువుల దాణా సరఫరా చేస్తున్నారు. ఈ కారణంగానే గరిష్ట ధర పొందుతున్నారు. ఇంతవరకు 1065 టన్నుల దాణా పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా పాలుపోసే వారికి నిర్వహణ ఖర్చులు, దాణా, పశువైద్య సాయం, నీరు, విద్యుత్ సరఫరా వంటి వాటి కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలు కూడా అందిస్తున్నారు. పాల సేకరణకు 317 మండలాల్లో 6684 గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే 137 చోట్ల బీఏంసీయూ భవనాలు నిర్మించారు. గ్రామ స్థాయిలో పాల సేకరణ, పరీక్ష, శీతలీకరణ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.126 కోట్లు విడుదల చేసింది. ఆరోపణ: గలీజు ఒప్పందాలు..అప్పు తీర్చి అప్పగించారు.. వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రైవేటు డెయిరీలు మూతపడ్డాయి. అలాగే యూహెచ్‌టీ, పౌడర్ ప్లాంట్లు, ఎంసీసీలతో పాటు 141 బీఎంసీయూలను మూసేశారు. మూతపడిన డెయిరీలను పునరుద్దరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. లిక్విడేషన్‌లో ఉన్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. డెయిరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్‌కు లీజుకు ఇచ్చారు. వాటి ఆస్తులు, భూములపై అమూల్‌కు ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఈ ప్రాజెక్టు కోసం అమూల్ రూ.385 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చిత్తూరు డెయిరీకి రూ.182 కోట్లు అప్పులు తీర్చి అప్పగించారంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నవే. వాటిని క్లియర్ చేసిందే తప్ప అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు చెల్లించలేదు. ఒంగోలు డెయిరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అమూల్‌కు లీజుకు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు అమూల్ పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాంటపుడు రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేస్తున్నారని పస లేని రాతలు రాస్తున్నారు. -
ప్రధాని మోదీ డైరీలో మహాత్ముని వాక్కులు
జనవరి 30న అంటే ఈరోజు దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1948లో ఇదే రోజున నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. మహాత్మా గాంధీ గుజరాత్ నివాసి. మహాత్మా గాంధీ నేర్పిన పాఠాలు ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ గురించి లోతైన అధ్యయనం చేశారు. మహాత్మా గాంధీ తెలిపిన పలు విషయాలను ప్రధాని మోదీ తన పర్సనల్ డైరీలో రాసుకున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలు ట్విట్టర్ హ్యాండిల్ ‘మోదీ ఆర్కైవ్’లో షేర్ అయ్యాయి. ప్రధాని మోదీ తన డైరీలో రాసుకున్న మహాత్మా గాంధీకి సంబంధించిన అమూల్య విషయాలు దీనిలో ఉన్నాయి. నరేంద్ర మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలను యూజర్స్ కోసం అందుబాటులో ఉంచామని ‘మోదీ ఆర్కైవ్’ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీనిని చూస్తే ప్రధాని మోదీ మహాత్మాగాంధీ గురించి వివరంగా చదవడమే కాకుండా, గాంధీజీ చెప్పిన అమూల్యమైన విషయాలను తన వ్యక్తిగత డైరీలో రాసుకున్నారని తెలుస్తుంది. ఇవి ప్రధాని మోదీకి మార్గదర్శకంగా నిలిచాయి. మహాత్మా గాంధీ తన 78 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యారు. 1948 జనవరి 30న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ కాంప్లెక్స్‌లో నాథూరామ్ గాడ్సే మహాత్మాగాంధీని కాల్చి చంపాడు. భారతదేశ విభజనపై గాంధీ అభిప్రాయాలను గాడ్సే వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ గౌరవార్థం ఆయనను గుర్తుచేసుకుంటూ జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల అధిపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. We bring to you pages from @narendramodi's personal diary, which demonstrate that not only did he extensively read #MahatmaGandhi, but he also wrote down Gandhi's quotes in his personal diary as something of inspirational value to him. These entries continued to guide his… pic.twitter.com/MCvgCBMCx1 — Modi Archive (@modiarchive) January 30, 2024 -
ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్ డైరీ'లో ప్రతీ పేజీ..
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గెహ్లోత్ ఓ మాయాగాడు అంటూ ఫైర్ అయ్యారు. అతను రాష్ట్రంలో తుపాకులకే ఎక్కువ పనిచెప్పాడని విమర్శించారు. అతని రెడ్‌డైరి తన దగ్గరుందని అందులోని ప్రతి పేజీ గురించి చెబితే.. దెబ్బకు గెహ్లోత్ ముఖం మాడిపోవడం ఖాయం అని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బరాసన్ అంటాలో జరిగిన ప్రచారా ర్యాలీలో మోదీ ముఖ్యమంత్రి గెహ్లోత్‌పై ఈవిధమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెడ్ డైరీలో..ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్‌లోని ప్రతి భూమి, నీరు, అడవి ఎలా అమ్ముపోయాయో అనే వివరాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ తన దగ్గర ఉందన్నారు. ముఖ్యంగా గెహ్లోత్ పాలనలో జరిగిన నేరారోపణలకు సంబంధించిన సమాచారం అంతా ఉందన్నారు . అందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశం గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమావేశంలో అప్పటి రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ మహిళల భద్రతా అంశాన్ని లెవనెత్తారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన నేరాల విషయమై ఆత్మపరిశీలన చేసకోవాలని చురకలంటించారు. అంతే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గెహ్లోత్ ప్రభుత్వం ఆయన్ను తొలగించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆయన హాయాంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రస్తావించారు మోదీ. కాంగ్రెస్ అంటే అవినీతి, రాజవంశం, బుజ్జగింపులకు చిహ్నం అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ప్రస్తుతం మన ముందు అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దడమేనదే లక్ష్యం, కానీ రాజస్తాన్ అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడమనే లక్ష్యం ఎలా సంపూర్ణమవుతుందన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కి చిహ్నం అయినా ఆ మూడే.. దేశానికి అతిపెద్ద శత్రువులని, అవి మన మధ్య ఉన్నంతవరకు అభివృద్ధి చెందిన భారత్‌గా ఎలా మార్చగలం అని నిలదీశారు. ఇంకా మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలోని ప్రతిఒక్కరూ సంయమనం లేనివారనని తిట్టిపోశారు. అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఒకేలా ప్రవర్తిస్తారని, ఈ విషయంలో ప్రజలు సైతం చిరాకుపడుతున్నారంటూ చివాట్లు పెట్టారు. కాగా, కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కునార్ అకాల మరణంతో ఆ నియోజక వర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అందువల్ల 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌లో ప్రస్తుతం 199 స్థానాలకే అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 99 సీటులు దక్కించుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టుకుని గెహ్లోత్‌ని సీఎంగా ప్రమాణం స్వీకారం చేయించింది . (చదవండి: అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకే ఎత్తుగడతో ఇరు పార్టీలు! ఏది హిట్ అవుతుందో?) -
ఇండియన్ ఫుడ్‌కు భారీ డిమాండ్.. భారత్‌ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్‌ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్‌ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్‌కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్‌లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్‌కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్‌కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్‌కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
టీటీడీ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్
-
సీఎంకు టెన్షన్.. అసలు ఆ రెడ్ డైరీలో ఏముంది?
రెడ్ డైరీలో రాజస్థాన్ సీఎం అక్రమాల చిట్టా.. రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న బహిష్కృత మంత్రి -
హెరిటేజ్ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారు: సీఎం జగన్
Updates: ►సీఎంసీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►300 బెడ్స్ కెపాసిటీతో అత్యాధునిక సీఎంసీ హాస్పిటల్ నిర్మాణం ►చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది: సీఎం జగన్ ►చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైంది ►పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా ►182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం ►అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ►హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. ►చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు ►రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్ డెయిరీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాక్షి, అమరావతి\చిత్తూరు: రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాడి రైతులకు శుభ గడియ రానేవచ్చింది. దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు నోచుకోబోతోంది. 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. సహకార డెయిరీలకు పాతరేసిన బాబు రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పాలు సేకరించి, వినియోగదారులకు సరసమైన ధరకే నాణ్యమైన పాల సరఫరా లక్ష్యంతో 6 వేల లీటర్ల సామర్థ్యంతో చిత్తూరు డెయిరీని ఏర్పాటు చేశారు. దశల వారీగా విస్తరించడంతో రోజుకు 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో దేశంలోనే రెండో అతిపెద్ద డెయిరీగా అవతరించింది. 1992–93 వరకు విజయవంతంగా పనిచేసిన ఈ డెయిరీని 1995లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం నిర్వీర్యం చేయడంతో చిత్తూరు డెయిరీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. లాభాల్లో కొనసాగుతున్న డెయిరీని స్వార్థ ప్రయోజనాలతో నిరీ్వర్యం చేసి ఆర్థిక నష్టాలకు గురిచేయడం ద్వారా 2002లో మూతపడేటట్టు చేశారు. చిత్తూరు డెయిరీనే కాదు.. బాబు హయాంలో 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణా జిల్లాలోని మినీ డెయిరీ, 2019 మార్చి 15న చిత్తూరులోని మదనపల్లి డెయిరీతో సహా మరో 8 సహకార డెయిరీలను మూతపడేటట్టు చేశారు. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. తద్వారా సహకార రంగంలోఉన్న పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లేటట్టు చేశారు సహకార రంగం బలోపేతమే లక్ష్యంగా.. సహకార డెయిరీ రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రంలో 3,551 మహిళా పాడి రైతుల సంఘాలకు చెందిన 3.07 లక్షల మంది పాడి రైతుల నుంచి రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాలసేకరణ ధరల వల్ల ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.4,243 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకేసి చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం డెయిరీకు ఉన్న రూ.182 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. మంగళవారం చిత్తూరులో జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ షమల్బాయ్ బి.పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొననున్నారు. ఒక్క చిత్తూరు డెయిరీకే నష్టాలు ఎందుకు? ఒకే జిల్లాలో ఒకే సమయంలో ఉన్న రెండు డెయిరీల్లో ఒకటి ఏటా లాభాలను పెంచుకుంటూ పోతే.. మరో డెయిరీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. రైతులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్న చిత్తూరు డెయిరీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత క్రమంగా నష్టాలను పెంచుకుంటూ పోతే.. అదే సమయంలో ఆయన సొంత డెయిరీ మాత్రం లాభాలను రెట్టింపు చేసుకుంటూ పోయింది. ఇదే సమయంలో దేశంలోని అమూల్ వంటి పలు సహకార డెయిరీలు లాభాల్లో నడుస్తుంటే ఒక్క చిత్తూరు డెయిరీ మాత్రమే నష్టాలను మూటకట్టుకుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసి చివరకు 2002లో ఆ డెయిరీని మూసివేయించారు. ఇందుకోసం తనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు చిత్తూరు డెయిరీని మూసేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే హెరిటేజ్ పెట్టి 10 ఏళ్లు దాటింది. తన సొంత డెయిరీ కోసం సొంత జిల్లా రైతుల నోటిలో మట్టి కొడుతూ చిత్తూరు సహకార డెయిరీని మూయించేశారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి. చిత్తూరు డెయిరీ మూసివేత గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే హెరిటేజ్ డెయిరీ ఉలిక్కిపడటం చూస్తుంటే.. చేసిన తప్పును చెప్పకనే చెపుతోంది అని అర్థమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిత్తూరు పాలడెయిరీ పునరుద్ధరణ
-
'అమ్మ డెయిరీ'ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అనంతపురం:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం ఆలమూరులో అమ్మ డెయిరీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రూ.20 కోట్లతో అమ్మ డైరీని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఆయన అభినందించారు. సీఎం జగన్ పాదయాత్రలో పేర్కొన్న విధంగానే డెయిరీలకు ప్రోత్సాహకాలిచ్చారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ 99 శాతం హామీలను అమలు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు ప్రకటించారని అన్నారు. పది వేలకు పైగా ఉద్యోగులను రెగ్యులర్ చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు. సీఎం జగన్ కృషి ఫలితమే.. మహిళల స్వయం ఉపాధి కోసమే అమ్మ డైరీ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. పదివేల మంది మహిళలకు పాల వ్యాపారం ద్వారా లాభాలు పంచుతామని పేర్కొన్నారు. ఏపీకి అమూల్ సంస్థ రావటం వల్లే మిగిలిన కంపెనీలు పాడి రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాయని చెప్పారు. ఇదంతా సీఎం జగన్ కృషి ఫలితమే అని వివరించారు. లక్ష లీటర్లతో ప్రారంభించిన అమ్మడైరీని పది లక్షల లీటర్ల స్థాయికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. -
పేద రైతు కుటుంబం నుంచి కోట్ల రూపాయల సంపాదన ఎలా ?
-
అతని జీవితం ఎందరికో ఆదర్శం - రూ. 3 నుంచి రూ. 800 కోట్లు అధిపతిగా..
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస' అవుతుంది అనేది లోకోక్తి. ఆ మాటను నిజం చేసాడు రెడ్ కౌ డైరీ ఓనర్ 'నారాయణ్ మజుందార్'. ఇంతకీ అతడు ఏం చేసాడు? ఎలా సక్సెస్ అయ్యాడు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. 1975లో ఒక పేదరైతు కుమారుడు 17 ఏళ్ల వయసులో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NDRI) బయట పాలు అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. అతని చదువు కోసం పలు అమ్మడం పార్ట్‌టైమ్ ఉద్యోగం ప్రారంభించి, ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. బెంగాల్‌లోని నదియా జిల్లాలో జన్మించిన నారాయణ్ మజుందార్ తన గ్రామంలోనే పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత 'ఎన్డిఆర్ఐ'లో చదువుకోడానికి వెళ్ళాడు. అప్పట్లో అతడు తీసుకున్న కోర్సుకి అయ్యే ఖర్చు రూ. 250. ఇది అప్పట్లో ఎక్కువ మొత్తం అనే చెప్పాలి. తన చదువు కోసం ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని ఉదయం 5 నుంచి 7 గంటల వరకు పాలు అమ్మేవాడు. అంతే కాకుండా అతనికి స్కాలర్‌షిప్‌గా రూ.100, అతని తండ్రి నెలకు రూ. 100 అందేవి. (ఇదీ చదవండి: 2023 Skoda Kodiaq: కొత్త రూల్స్‌తో విడుదలైన లేటెస్ట్ కారు - పూర్తి వివరాలు) కాలేజీ విద్య పూర్తయ్యేనాటికి ఆ కుటుంభం వ్యవసాయ భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తరువాత నారాయణ్ కోల్‌కతాలోని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌లో డైరీ కెమిస్ట్‌గా ఉద్యోగం ప్రారభించారు. అప్పుడు అతని నెల జీతం సుమార్చు రూ. 600. తన ఉద్యోగం ఉదయం 4 నుంచి రాత్రియే 11 వరకు ఉండేది. అక్కడ ఉద్యోగం వదిలేసి సిలిగురి (హిమాలయన్ కోఆపరేటివ్)లో చేరాడు. ఆ తరువాత మదర్ డెయిరీలో మేనేజర్‌గా ఉన్న 'డాక్టర్ జగ్జీత్ పుంజార్థ్'ను కలిశారు. ఈ పరిచయం అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. 1981లో మదర్ డెయిరీలో చేరి 1955లో హౌరాలోని ఒక కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు. (ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ స్కూటర్లు - రోజువారీ ప్రయాణానికి మంచి ఆప్షన్..!) నారాయణ్ మజుందార్ 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో చిల్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఏడాది పాల ట్యాంకర్ కొనుగోలు చేసి తన భార్య భాగస్వామ్యంతో ఒక సంస్థను స్థాపించాడు. 2003లో రెడ్ కౌ డైరీని తయారు చేశాడు. ఎప్పటికప్పుడు వ్యాపారంలో ఎదుగుతూనే ఉన్నాడు. 2007లో కోల్‌కతా డెయిరీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని, పాలీ పౌచ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం వారికి మూడు ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కంపెనీలో 1000 మంది పనిచేస్తున్నారు. అంతే కాకుండా బెంగాల్‌లోని 12 జిల్లాల్లో సుమారు 3 లక్షల మందికి పైగా రైతులతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. నారాయణ్ మజుందార్ కంపెనీ ఇప్పుడు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. వీరికి 35 మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లతో పాటు 400 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. మొత్తం మీద సైకిల్ మీద పార్ట్‌టైమ్ ఉద్యోగిగా ప్రారంభించి ఈ రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తాతలు, తండ్రులు సంపాదనతోనే బ్రతికేయాలనుకునే వారికి 'నారాయణ్ మజుందార్' గొప్ప ఆదర్శం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అందరికీ ఎండాకాలం, మాకిదే మంచి కాలమంటున్న ఆ కంపెనీలు.. ఎందుకంటే?
వేసవి కాలం మొదలైపోయింది.. భానుడి వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ తరుణంలో ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాల డిమాండ్ ఎక్కువవుతోంది. కావున అమ్మకాలు మునుపటికంటే దాదాపు రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఎమ్‌సిజి అండ్ డెయిరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీల అమ్మకాలు మరింత వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్లో తమ ఉత్పత్తులకు డిమాండ్‌ని పెంచుకోవడానికి తగిన ఆఫర్స్ కూడా తీసుకురానున్నట్లు సమాచారం. పాలు, పాల పానీయాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్‌ల విక్రయదారులలో ఒకటైన మదర్ డైరీ ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అంచనా వేస్తూ ఉత్పత్తులను వేగవంతం చేయడానికి, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగటానికి తగిన విధంగా సిద్ధమవుతోంది. కోల్డ్-చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిఫర్ వెహికల్స్, షెల్ఫ్ స్ట్రెంగ్త్ నిర్ధారించడానికి కన్స్యూమర్ టచ్ పాయింట్లలో అసెట్ డిప్లాయ్మెంట్లో పెట్టుబడి పెట్టామని మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బండ్లీష్ తెలిపారు. మదర్ డెయిరీ ఈ సమ్మర్ సీజన్లో మరో 15 కొత్త ఉత్పత్తులు లేదా రుచులను ప్రారంభించడం ద్వారా వినియోగదారులను ఆకర్శించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే సీజన్లో ఐస్‌క్రీం వర్గం దాదాపు 25 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు కూడా బండ్లీష్ చెప్పుకొచ్చారు. శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సికో వేసవి ప్రారంభంమే చాలా ఉత్సాహంగా ఉందని, 2023 పానీయాల రంగానికి తప్పకుండా కలిసొస్తుందని ఆశాభావాలను వ్యక్తం చేసింది. అంతే కాకుండా స్వదేశీ ఎఫ్‌ఎమ్‌సిజి మేజర్ డాబర్ ఇండియా తన వేసవి ఉత్పత్తులు తప్పకుండా ఆశాజనకంగా అమ్ముడవుతాయని ప్రకటించింది. -
వ్యవసాయ శాఖలో అలజడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అలజడి చేలరేగింది. ఈ శాఖలోని ఒక సంఘానికి చెందిన ఉద్యోగులు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావుపై బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు సంబంధిత శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్ రావును ఆనవాయితీగా ఆహ్వానించాల్సి ఉండగా, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగక పుండు మీద కారం చల్లినట్లుగా ఈ శాఖకు సంబంధం లేని మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సభకు ఆహ్వానించడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. డైరీ ఆవిష్కరణ సభ వాడీవేడిగా కొనసాగింది. సగానికిపైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఒక సంఘం ఇలా చేయడంతో ఒక్కసారిగా వ్యవ సాయ శాఖలో కలకలం చెలరేగింది. వివక్ష.. వేధింపుల వల్లే? వ్యవసాయ శాఖలో రెండు సంఘాలున్నాయి. అందులో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కీలక మైంది. ఈ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరయ్యారు. సాధారణంగా ఏటా వ్యవసాయ శాఖ మంత్రిని, కార్యదర్శిని పిలవడం ఆనవాయితీ అయినా, కావాలనే వారిని ఆహ్వానించలేదని, ఈ శాఖ మంత్రిని కాకుండా మరో మంత్రిని పిలిచారని తీవ్ర మైన రచ్చ జరుగుతోంది. తమ సంఘంపై వివక్ష చూపడం, సంఘం సభ్యులను ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాలకు పంపించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విజిలెన్స్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు ఈ సభలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ, తమ సంఘంపై వివక్ష కొనసాగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ దాడుల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నార న్నారు. తమ అసోసియేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నందుకే ఈ వివక్ష అని మండి పడ్డారు. తమ సంఘానికి మద్దతు ఇచ్చే వారిని బదిలీ పేరుతో బయటికి పంపిస్తున్నారని ఆరోపించారు. 317 జీవో పేరుతో 15 మందిని బదిలీ చేశా రన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో 2018 తరువాత ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రెండు సంఘాల మధ్య గొడవలు ఉన్నందునే పదో న్నతులు ఇవ్వలేదని చెప్తున్నారన్నారు. తమ నిరస నను వ్యక్తం చేయడం కోసమే డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్‌రెడ్డిని, కార్యదర్శి రఘునందన్ రావును ఆహ్వానించలేదన్నారు. తమకు అను కూలంగా ఏమీ చేయకున్నా ఫర్వాలేదని, కానీ ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. శాఖలో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివక్ష తగదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాటి ఉద్యోగులపై వివక్ష చూపితే ఎలాగని ప్రశ్నించారు. ‘సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ లాంటి వారికే అవమానాలు తప్పలేదు.. ఎవరు, ఎంతగా అవమానపరచినా వారు బాధపడలేదు. వెనక్కు తగ్గలేదు. శరీరం కుంగిపోతున్నా మనసు కుంగిపోలేదు. అలా కుంగిపోతే రాజ్యాంగం, రిజర్వేషన్లు వచ్చేవి కాదు. పట్టుదలను వదలొద్దు. భయం, పిరికితం వద్దు. ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఒకరిద్దరు నాయకులను ఇబ్బంది పెట్టి వేధిస్తే అయ్యేదేమీ లేదు. ప్రమోషన్లు రాకపోతే చస్తమా. ధైర్యంగా ఉండాలి..’అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభయం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరిదని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అంటేనే ఎక్కువగా తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. గువ్వల బాల రాజు మాట్లాడుతూ, తాము ఎప్పుడూ ఉద్యమ స్పూర్తితోనే ఉంటామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.రాములు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
అమూల్‌పై టీడీపీ టిష్యూ పేపర్ తప్పుడు కథనాలు: మంత్రి అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: అమూల్ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్ ఈనాడులో సర్వం అమూల్ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్ కాదు.. సర్వం హెరిటేజ్ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు -
చిత్తూరు డెయిరీ మూయించింది చంద్రబాబే : మంత్రి సిదిరి అప్పలరాజు
-
మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!
ఆవులు, గేదెల్లో ఏ దూడలు కావాలని కోరుకుంటారు... సహజంగా ఎవరైనా పెయ్య దూడలు (ఆడ) కావాలని ఆకాంక్షిస్తారు. కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నా.. పుట్టేది ఆడదూడా.. మగదూడా అనేది తెలియని పరిస్థితి. ఇక నుంచి పాడి అభివృద్ధికి ఆడదూడలే పుట్టించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (సార్టెడ్ సెక్స్ సెమన్) ద్వారా 95 శాతం పెయ్య దూడలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. కర్నూలు (అగ్రికల్చర్): పెయ్య దూడల జననం ద్వారా పాల దిగుబడిని, రైతు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం, పాడి పరిశ్రమను మరింత అభివృద్ది చేసేందుకు దోహదపడుతోంది. నేడు విద్యావంతులైన నిరుద్యోగులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది జిల్లాలో 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని రైతుల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీపై కృత్రిమ గర్భధారణ వీర్యం లింగనిర్ధారణ వీర్యాన్ని పూణే, అహమ్మదాబాద్ల్లోని వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాల్లో అధిక పాలసార ఉన్న ఆంబోతుల నుంచి సేకరించారు. ఆడదూడలే పుట్టే విధంగా లింగనిర్ధారణ వీర్యాన్ని వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల్లో ఈ ప్రయోగం చేశారు. 200 ఆవులకు ఇటువంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టాయి. ఇందులో 47 పెయ్యదూడలు ఉండటం విశేషం. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, ఆవు జాతులైన గిర్, సాహివాల్, హెచ్ఎఫ్ ఆవులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. ఒక డోసు పూర్తి ధర రూ.700 ఉండగా... కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5,000 పశువులకు సార్టెడ్ సెక్స్ సెమన్ ద్వారా సూదులు వేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 95 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసుల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు సూదులు వేయించాల్సి ఉంది. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే రెండవసారి వేయంచవచ్చు. అపుడు కూడా చూడికట్టకపోతే మూడవ డోసు వేయించవచ్చు. ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంది. మూడు డోసులు వేసినా చూడికట్టకపోతే రూ.500 రైతుకు వెనక్కి ఇస్తారు. మూడు డోసుల సార్టెడ్ సెక్స్ సెమన్‌తో కృత్రిమ గర్భధారణ చేసినా మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ సెమన్ ప్రధాన లక్ష్యం పెయ్యదూడల అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గోపాలమిత్రలు అమలు చేస్తారు. సార్టెడ్ సెక్స్ సెమన్‌తో సూది వేస్తే రూ.100 ప్రోత్సాహకం ఇస్తారు. మొదటి డోసుతోనే చూడి కడితే రూ.150, రెండవ డోసుతో చూడి కడితే రూ.100 ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. దీని ద్వారా 90 నుంచి 95 శాతం వరకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది. – రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, కర్నూలు -
తెలుగింటి మురిపాలు.. నేడు అంతర్జాతీయ క్షీర దినోత్సవం
సూర్యుడు లేవడం డిలే అయినా పర్వాలేదు టైముకు పాలబ్బాయి పాల ప్యాకెట్ జార విడువకపోతే మన ఇల్లాళ్లకు తెల్లారదు. కాఫీ కొరకు ఒక అత్తగారు చాయ్ కోసం ఒక భర్తగారు పాల గ్లాసు కోసం బంగారుకొండలు అందరికీ సమాధానం చెప్పాల్సిందే. పాలు మనిషి ప్రాథమిక ఆహారం. సంస్కృతిలో భాగం. మొగుడూ పెళ్లాం పాలు నీళ్లలా కలిసిపోతేనే కాపురం. పాలుగారే పిల్లలతో మురిపాలు పోవడమే జీవితం. నేడు అంతర్జాతీయ క్షీర దినోత్సవం. అనుక్షణం జీవితంలో, జీవనంలో భాగమైన పాలకు పాలాభిషేకం చేసుకోవాల్సిన రోజు ఇది. ‘పాలు’ అనే మాటకు ఏకవాచకం లేదు. సదా బహువాచకమే. అందుకే ఇంట్లో చేరేప్పుడు పాలు పొంగిస్తారు. నలుగురూ కలిసి మెలిసి కళకళలాడాలని, ఆ తర్వాత ఆ పాలతో పాయసం చేస్తారు. తియ్యటి రోజులు ప్రాప్తించాలని. ప్రకృతి పాలకు తెల్లరంగు ఇచ్చింది. తెలుపు స్వచ్ఛతకు గుర్తు. అమ్మ పాలే కాదు ఏ పాలైనా స్వచ్ఛంగా ఉంటాయి. మన దేశంలో పాల వాడకం 6 వేల ఏళ్ల క్రితం నుంచి ఉందట. సైంటిస్టులు బిగ్‌బ్యాంగ్ థియరీలు చెబుతారుగాని ఆఫ్రికన్లలో కొన్ని తెగలు ఈ విశ్వం ఒక క్షీర బిందువు నుంచి మొదలైందని విశ్వసిస్తాయి. ప్రాచీన గ్రీస్‌లో చాలా కాలం మామూలు ప్రజలకు పాలు తాగే వీలు లేదు. ఆ అర్హత రాచకుటుంబాలకు, పురోహితులకూ ఉండేది. ఇవాళ మన దేశంలో పాలు అందరికీ దొరుకుతున్నాయి. కాని ఒక మోస్తరు రాబడి ఉన్నవారే ‘నెయ్యి’ వాడతారు. అంటే మన దగ్గర కూడా మరో విధంగా పాలు అందరికీ అందుబాటులో లేనట్టే. పేదల ఇళ్లలోనే కాదు మధ్యతరగతి ఇళ్లల్లో కూడా నెయ్యి గిన్నె నేడు కానరావడం లేదు. పాలు... మారుపాలు తల్లికి పాలు పడకపోతే పూర్వం పాలుతాపే మారుతల్లులు ఉండేవారు. చిన్న కోడలో పెద్ద కోడలో బిడ్డకు చనుమొన అందించేది. అమెరికాలో దొరలు కన్న బిడ్డలకు ఆఫ్రికన్ బానిస స్త్రీల పాలు తాపే వారు. ఒక గర్భంలో పుట్టకపోయిన మరో వక్షం నుంచి పాలు తాగితే ఆ తల్లికీ ఈ తల్లికీ పుట్టిన పిల్లలు సహోదరులు అవుతారని ఒక సెంటిమెంట్. ఈ దశను దాటించేందుకు డబ్బాపాలు వచ్చాయి. ‘పిల్లాడికి పాలు అయిపోయాయి. డబ్బా తీసుకురండి’ అని చెప్పిన భార్యకు, తేవడం వీలవని భర్తకు భీకరమైన సంగ్రామాలు జరిగేవి. కూలినాలి చేసుకునే తండ్రి పాలడబ్బా నిండుకుంటూ ఉందంటే బెంగటిల్లిపోయేవాడు. అయితే మధ్యతరగతి ఇళ్లలో ఖాళీ అయిన పాలడబ్బాల్లో ఉప్పు, చింతపండు పెట్టుకునే ఆనవాయితీ ఉండేది. వంటగది అల్మారా తెలిస్తే బోసినవ్వుల పాపాయి బొమ్మ ఉన్న డబ్బాలే అన్నీ. విషాదం ఏమిటంటే పాడిపశువుల మన దేశం 1960 వరకూ విదేశాల నుంచి దాదాపు 55 వేల టన్నుల పాలపొడి దిగుమతి చేసుకునేది. లాల్‌బహదూర్ శాస్త్రి, కురియన్ల పుణ్యమా అంటూ ‘అమూల్’తో ‘క్షీర విప్లవం’ వచ్చాక ఇటు పాడి రైతు, అటు సగటు మనిషి పాలతో అవస్థపడే స్థితి పోయింది. అందుకే తన రోజుల్లో గాంధీ గారు మేక పాలను ప్రమోట్ చేశారు. చల్లకొచ్చి ముంత దాస్తే పాలు ఉంటే పాలబువ్వ ఉంటుంది. పెరుగన్నం ఉంటుంది. మంది పెరిగితే మజ్జిగ పలుచనవుతుంది. ఆ తర్వాత వెన్న పోగవుతుంది. మరగపెట్టుకుంటే నెయ్యి అవుతుంది. ఒకనాటి స్త్రీలకు ఈ పాల వ్యాపకాలన్నీ ఉండేవి. పాలు మరిగాక పైన ఎర్రగా కట్టే మీగడ కొందరు పిల్లలకు ఇష్టం. విరిగిన పాలతో చేసే జున్ను మరికొందరికి ఇష్టం. గడ్డపెరుగులో ఆవకాయ నంజుకోవడం అందరికీ ఇష్టం. మంచి ముద్దపప్పు, ఆపకుండా పోసే నెయ్యితో పెట్టే పెళ్లి భోజనం శ్రేష్ఠం. మారాం చేసే పిల్లల చేత పాలు తాగించడానికి కొందరు తల్లులు మహా మహా కథకులైపోయేవారు. హార్లిక్స్‌లు, బూస్ట్లు వారి క్రియేటివిటీని చావు దెబ్బ తీశాయి. ఇంతకు మునుపే కాఫీ, టీ తోటలు వచ్చి టీ, కాఫీలను అలవాటు చేసి వాటిని ఇంటి పానీయాలు చేశాయి. ‘టీ చేసి భర్తను నిద్రలేపే ఇల్లాలు’ అనే స్టీరియోటైప్ సిద్ధమైంది.ఇవాళ్టికీ టీ ప్రకటనల్లో టీ చేసేది ఇల్లాలే. రెండు టీలు పెట్టాలంటే ఎన్ని చెంచాల టీ పౌడర్ వేయాలో తెలియని మహానుభావులు నేటికీ నిండా ఉన్నారు. ఫ్రిజ్జులు రానంత కాలం ప్రతి ఇల్లాలికి పిల్లి బెడద ఉండేది. పాలకు విలన్ అదే. ‘పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు’ అని ఒక సామెత. ‘చల్లకొచ్చి ముంత దాచడం’ మరో సామెత. అభిషేకాలు భారతీయ పండగల్లో, పూజల్లో పాలు ముఖ్యం. ప్రసాదాల్లో విరివిగా వాడతారు. దధ్యోజనం, చక్కెర పొంగలి, పంచామృతం... పాలు లేకుండా సాధ్యం కాదు. పాలాభిషేకం చేయించడం ఒక ఆరాధన. సినిమా అభిమానులు కూడా తన హీరోల కటౌట్లకు పాలాభిషేకం చేయిస్తారు. ఇరవై ఏళ్ల క్రితం వినాయకుడి విగ్రహం పాలు తాగిన ‘వింత’ చాలామందికి గుర్తు. తాగడానికి గుక్కెడు పాలు లేని పిల్లలు కోట్లాది మంది. నేటికీ మన దేశంలో ఉంటే ఐశ్వరవంతులు కొందరు ‘పాలు తాగడం పాత ఫ్యాషన్’ అంటున్నారు. ‘అతి శాకాహారులు’ పాలు తాగడం పాపం అంటున్నారు. ఏమీ లేనప్పుడు ఒక గ్లాసు పాలు తాగి నిద్రపోయే మధ్యతరగతి మనుషుల గురించి వీరికి తెలియదు. పాల గురించి ఎవరు ఏమి చెప్పినా కల్తీ లేని పాలు ఉన్నంత కాలం మనిషి జీవంతో ఉంటాడు. జీవితాన్ని నిర్వహిస్తాడు. పాలు తాగుదాం. -
బసవరాజ్ బొమ్మై (కర్ణాటక సీఎం) రాయని డైరీ
‘‘ముందింత పని పెట్టుకుని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణేంటి బొమ్మై.. ఎన్నికలు కానివ్వు..’’ అని విసుగ్గా ముఖం పెట్టారు అమిత్‌షా. నేను నవ్వుముఖం పెట్టాను. ఇచ్చేవాళ్లు ఏ ముఖమైనా పెట్టొచ్చు. అడిగి తీసుకోడానికి వెళ్లినవాళ్లు ముఖాన్ని సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ‘‘పీక్కుతింటున్నారు అమిత్జీ! ‘2023లో ఎలక్షన్స్ పెట్టుకుని ఇంకా ఎప్పుడు మంత్రి పదవులు ఇస్తారు? ఎప్పుడు మమ్మల్ని ప్రజాసేవ చేయనిస్తారు?’ అని అడుగుతున్నారు..’’ అన్నాను.. నవ్వుముఖంతోనే. ‘‘ఎవరు ఆ ప్రజాసేవకులు?’’ అని అడిగారు అమిత్‌షా. అసెంబ్లీలో అందరూ ప్రజా సేవకులే అయినప్పుడు నేను బసనగౌడ పేరో, రేణుకాచార్య పేరో ఎందుకు చెప్పాలి? ‘‘ముప్పై నాలుగులో నాలుగు ఖాళీగా ఉన్నాయి అమిత్జీ! ఆ నాలుగూ భర్తీ చేసి, పనిలో పనిగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు వెళ్లి, ఎవరి పనుల్లో వాళ్లు పడతారు’’ అన్నాను. ‘‘ఇప్పుడదా స్టేట్‌లో సమస్య బొమ్మై?!’ అన్నారు అమిత్‌షా. ‘‘ఇంకో సమస్య కూడా ఉంది అమిత్జీ! అయితే ఆ సమస్యని హైకోర్టు చూసు కుంటోంది. సుప్రీంకోర్టు చూసుకుంటా నంటోంది. ఇంకా.. ఒవైసీ చూసుకుంటు న్నారు. పాకిస్తాన్ మంత్రులు చూసు కుంటున్నారు. యూపీలో ప్రియాంకా గాంధీ చూసుకుంటున్నారు. ఢిల్లీలో కపిల్ సిబాల్ చూసుకుంటున్నారు. చెన్నైలో కమలహాసన్ చూసుకుంటున్నారు’’ అన్నాను. అమిత్‌షా చేతివాచీ చూసుకున్నారు. ‘‘సమస్యను మన దగ్గర్నుంచి ఎవరైనా లాగేసుకుంటే అది మన సమస్య కాకుండా పోతుందా బొమ్మై! పీక మీద రెండు సమస్యలు ఉన్నప్పుడు పీకకు ఏది ముఖ్యమైన సమస్యో నాయకుడికి తెలిసుండాలి. పీక మీద ఒకే సమస్య ఉన్నప్పుడు ఆ ఒక్క సమస్యా పీకకు ఎందుకు ముఖ్యం కాదో తెలుసుకోగలిగి ఉండాలి..’’ అన్నారు! ‘‘అలాగే అమిత్జీ’’ అన్నాను. అమిత్ షా దగ్గర్నుంచి నేరుగా జేపీ నడ్డా దగ్గరికి వెళ్లాను. ‘‘అరె! ఇంతక్రితమే నడ్డాజీ ఉత్తరాఖండ్ వెళ్లారే..’’ అన్నారు ఢిల్లీ పార్టీ ఆఫీస్‌లో. నడ్డాకు ఫోన్ చేశాను. ‘‘హా.. బొమ్మైజీ! క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నాను. మీరెప్పుడన్నారూ.. ఢిల్లీకి వస్తున్నది?’’ అన్నారు!! నేను ఢిల్లీలోనే ఉన్నానని చెప్పకుండా.. ‘‘ఢిల్లీ వచ్చే ముందు ఫోన్ చేస్తాను నడ్డాజీ..’’ అన్నాను. ‘‘అవునా. గుడ్ గుడ్’’ అన్నారు. ఆ వెంటనే.. ‘‘ఎలా ఉంది బొమ్మైజీ.. మీ స్టేట్‌లో ప్రాబ్లమ్?’’ అని అడిగారు.‘‘నో ప్రాబ్లమ్ నడ్డాజీ..’’ అన్నాను. బెంగళూరు తిరిగి వచ్చేటప్పటికి నాకోసం బసనగౌడ, రేణుకాచార్య ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు! ‘‘కబురేమైనా ఉందా బొమ్మై సర్?’’ అని రేణుకాచార్య, బసనగౌడ అడిగారు. ‘‘ఉంది. ‘రెండు సమస్యలు ఉన్నప్పుడు రెండింటిలో ఏది ముఖ్యమైన సమస్యో నాయకుడికి తెలిసుండాలి. ఒకటే సమస్య ఉన్నప్పుడు ఆ ఒక్క సమస్య ఎందుకు ముఖ్యం కాదో తెలుసుకోగలిగి ఉండాలి..’ అని అమిత్‌షా నా భుజం తట్టి చెప్పారు..’’ అన్నాను. ‘‘ మరి.. రెండు సమస్యల్లో ఏది ముఖ్యమైనదో తెలిసి ఉండటం వల్ల, లేక.. ఉన్న ఒక్క సమస్యా అది ఎందుకు ముఖ్యమైనది కాదో తెలుసుకోగలిగి ఉండటం వల్ల మూడో సమస్య వస్తేనో..?’’ అన్నారు రేణుకాచార్య! ఒక నిర్ఘాంతపు దిగ్భ్రమతో ఆయన వైపు చూశాను.‘‘నడ్డాజీ ఏమైనా చెప్పారా బొమ్మై సర్?’’ అని బసనగౌడ. ‘‘చెప్పేవారేనేమో.. నా భుజం తట్టి చెప్పేంత దగ్గర్లో ఉన్నట్లయితే..’’ అన్నాను. -
పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: టీడీపీ పాలనలో అవినీతి, దౌర్జన్యాలు చేసింది పరిటాల కుటుంబీకులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల సునీత, శ్రీరామ్ వంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తోపుదుర్తి మహిళా డైరీలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పరిటాల సునీత, శ్రీరామ్‌కు సవాల్ విసిరారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్) -
ఇలా చేస్తే చికాకు దానంతట అదే దూరమవుతుంది..!
పగలు జరిగిన విషయాలను మెదడులో నిల్వ చేసుకోవడం మంచిదా? కాగితం మీద పెట్టడం మంచిదా? తీపి జ్ఞాపకాలైతే మెదడు సంతోషంగానే నిక్షిప్తం చేసుకుంటుంది. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మది మురిసిపోతుంటుంది. అలా కాకుండా ఆ రోజు చేసిన పనులు, చికాకులు చిరాకు పెడుతుంటే మాత్రం వాటిని మెదడులో మోయాల్సిన పని లేదు. బుర్ర మీద అంత బరువు పెట్టవద్దు, ఏ రోజుకారోజు తేలిక పరుచుకోవాలి. కందిరీగల్లా తిరుగుతున్న విషయాలన్నింటినీ బుర్రలో నుంచి ఒక కాగితం మీదకు బదలాయించండి. బ్రెయిన్ డంప్ చేయడం అన్నమాట. చికాకు దానంతట అదే దూరమవుతుంది. మెదుడు హాయిగా విశ్రాంతిలోకి వెళ్తుంది. మనమూ మంచి నిద్రలోకి జారుకుంటాం. ఉదయం తాజాగా రోజును మొదలుపెట్టవచ్చు. అలా చేయనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మంచి–చెడుల పట్టిక రోజంతా పని చేసిన తర్వాత దేహం అలసిపోయి ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద పని చేసిన వాళ్లకు ఆ పని ఆపేసిన తర్వాత కనీసం రెండు గంటల సేపు నిద్రరాదు. పదకొండుకో, పన్నెండుకో నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ నిద్రలో మెదడు విశ్రాంతి దశకు చేరదు. పగలు జరిగిన పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ లోగా తెల్లవారు జామున మూడింటికి మెలకువ వచ్చేస్తుంది. ఇక మెదడు ఆ రోజు చేయాల్సిన పనులను గుర్తు చేస్తుంటుంది. ఎలా చేయాలో సూచనలు చేస్తుంటుంది. మెదడు అప్పటికి రిలాక్స్ అయి తెల్లవారు జామున విశ్రాంతికి సిద్ధమవుతుంటుంది. ముంచుకు వచ్చే నిద్రను వదిలించుకుని బలవంతంగా రోజు మొదలు పెట్టినా సరే... ఆఫీస్‌లో పనిగంటల్లో మెదడు మొరాయిస్తుంటుంది. ఇన్ని అసౌకర్యాలను సున్నితంగా తుడిచివేసే పరిష్కారమే బ్రెయిన్ డంప్. వెల్బీయింగ్ గురించి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిర్వహించిన ఓ సదస్సులో ఒక సైంటిస్ట్ ఈ అంశం మీదనే పేపర్ ప్రెజెంట్ చేశారు. బ్రెయిన్ డంప్ అనే పదం కూడా సైంటిస్ట్ సూచించినదే. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక పేపర్ మీద ఆ రోజు జరిగిన మంచి పనులు, సంతోషాన్నిచ్చిన విషయాలు రాసుకోవాలి. అలాగే బాధ కలిగించిన విషయాలను ఒక కేటగిరీలో, ఒత్తిడి, చికాకు కలిగించిన వాటిని ఒక కేటగిరీగానూ, వాటికి పరిష్కారాలను మరో కాలమ్‌లోనూ రాసుకోవాలి. వాటన్నింటినీ ఒకసారి చూసుకుని రేపటి రోజున చేయాల్సిన పనులను కూడా నోట్ చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే... డైరీ రాసుకున్నట్లేనన్నమాట. ఇలా రాయడం వల్ల మెదడు తేలికపడుతుంది. స్మార్ట్ ఫోన్లో వచ్చి పడిన మంచి–చెడు, అవసరం ఉన్న– అవసరం లేని మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలను వర్గీకరించుకుని డిలీట్ చేస్తూ ఫోన్ మెమరీ బరువు తగ్గించుకున్నట్లే ఇది కూడా. -
గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు ఇవే...
పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నివసించే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా గమనించారా? వీరు కల్తీలేని స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు కాబట్టి. సంపూర్ణ లేదా సమతుల్య ఆహారాల్లో పాలు చాలా ముఖ్యమైనవి. ఐతే చాలా మందికి పాలు, పాల ఆధారిత పదార్థాలు తినే అలవాటు అస్సలుండదు. హృద్యోగ సమస్యలకు దారీతీసే కొవ్వులు, కొలెస్ట్రాల్‌లు పాల ఉత్పత్తుల్లో అధికంగా ఉంటాయనేది వీరి బలమైన నమ్మకం. కానీ వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తాజా పరిశోధనల్లో కూడా తేలిందేమిటంటే పాల ఉత్పత్తులు గుండెను రక్షించడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయని ధ్రువీకరించాయి. కొంత మంది వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా పాలను నేరుగా తీసుకోలేరు. అలాంటప్పుడు ఇతర మార్గాల ద్వారా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ కింది సూచించిన 5 రకాల పాల ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం.. పన్నీర్ భారతీయుల ఆహారంలో పన్నీర్ చాలా ప్రసిద్ధమైనది. కూరగా వండుకున్నా లేదా ఇతర ఏ పద్ధతుల్లో వండినా రుచితో పాటు పోషకాలు అందుతాయి. దీనిలో కాల్షియం, విటమిన్ బి, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. ఎముకల పుష్టికి ఇది చాలా ఉపకరిస్తుంది. అంతేకాకుండా మీ హార్మొన్ల ఆరోగ్యానికి అవసరమైన మాగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు తగుమోతాదులో అందేలా చేస్తుంది. పెరుగు హృదయ ఆరోగ్యానికి, ఎముకల దృడత్వానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దీనిలో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కడుపులోని పేగుల్లో ఆరోగ్య సహాయక సూక్ష్మజీవుల (బ్యాక్టీరియా) వృద్ధికి ఇది చాలా అవసరం. మన శరీరంలోని జీర్ణక్రియ, ఇతర జీవక్రియలకు కూడా పెరుగు ఉపయోగపడుతుంది. పాలకోవ స్వీట్లలో పాలకోవ స్థానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే స్వీట్ ఇది. పాలను బాగా చిక్కబడేంత వరకూ వేడిచేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దీనిలో ‘డి, బి, కె’ విటమిన్లు, కార్బొహైడ్రేట్స్తోపాటు, పాస్పరస్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. మజ్జిగ ప్రొటీన్లు, విటమిన్ ‘ఎ, బి’లు, కాల్షియం, పొటాషియం, రైబోఫేవిన్, ప్రొబయోటిక్స్ నిండుగా ఉంటాయి. ప్రాచీన కాలం నుంచే ధనిక పేద భేదం లేకుండా మన భారతీయుల ఆహారపు అలవాట్లలో మజ్జిగ మిలితమైఉంది. నెయ్యి రోజువారీ ఆహారంలో నెయ్యి కూడా ముఖ్యమైనదే. ఇది ఎముక ఖనిజ సాంద్రతలో నష్టాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఐదు మార్గాల ద్వారా పాల సంబంధిత ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాన్ని మీరే తెలుసుకుంటారు! పలు పరిశోధనలు కూడా ఈ విషయానే దృవీకరించాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే తినండి, ఆరోగ్యంగా ఉండండి!! చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!! -
ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!!
ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్లాంట్లలో తయారవుతున్న బేవరేజెస్‌ని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొనడంపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. ఇకపై వాటిని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఫుడ్ సేఫ్టీ కి ఫిర్యాదులు మార్కెట్లో సోయా మిల్క్, బాదం మిల్క్, కోకోనట్ మిల్క్ ఇలా రకరకాల ఫ్లేవర్లలో కూల్‌డ్రింక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూల్‌డ్రింక్‌ల తయారీలో నిజానికి డెయిరీలలో తయారయ్యే పాలను ఉపయోగించరు. కానీ మార్కెటింగ్ చేసేప్పుడు మాత్రం మిల్క్ ప్రొడక్ట్‌లుగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై డెయిరీ సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో విచారణ చేపట్టిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ మిల్క్ ప్రొడక్టుల పేరుతో బేవరేజెస్ అమ్ముతున్న ఆయా కంపెనీలపై కన్నెర్ర చేసింది. 15 రోజుల్లోగా మార్చేయండి మిల్క్ ప్రొడక్టుల పేరుతో మార్కెట్లో బేవరేజ్పై ‘మిల్క్ పొడక్టు’ అంటూ ఉన్న అక్షరాలను తీసేయాలని, లేదంటూ కొత్త లేబుళ్లు అంటించుకోవాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. కేవలం పదిహేను రోజుల్లోగా ఈ మార్పులు చేపట్టాలని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 3 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుందని పేర్కొంది. భవిష్యత్తులో ఈ ప్రొడక్టులపై మిల్క్ అని ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే ఆన్లైన్లో అమ్ముడవుతున్న బేవరేజెస్‌ను మిల్క్ ప్రొడక్టుల కేటగిరీలో చూపొద్దంటూ ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలు అందాయి. గడువు పెంచండి ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులపై మిల్క్‌ను తొలగిస్తామని కానీ ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రొడక్టుల విషయంలో ఫుడ్ సేఫ్టీ తీర్పు అమలు చేయడం కష్టమని ఈ వ్యాపారంలో ఉన్న సంస్థలు అంటున్నాయి. తమకు గడువు పెంచాలని లేదంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్టులను ఈ ఆదేశాల నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేదంటే తమకు కోట్లలో నష్టం వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాయి. స్పష్టత కావాలి ఫ్యాక్టరీలో తయరయ్యే వస్తువులకు మిల్క్ ప్రొడక్టులు పేర్కొనడం వల్ల తమకు నష్టం వస్తోందని డెయిరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ బేవరేజేస్ మార్కెట్ దేశంలో విస్తరిస్తోందని, ఇప్పుడే ‘ మిల్క్ ప్రొడక్ట్ ’ విషయంలో స్పష్టత తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదనే అంచనాతో డెయిరీలో కఠినంగా వ్యవహారించాయి. మనదేశంలో మిల్క్ ప్రొడక్టుల పేరుతో అమ్ముడవుతున్న బేవరేజేస్ మార్కెట్ విలువ రూ. 185 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. చదవండి: ‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో! -
డెయిరీ విభజనపై ఇరు రాష్ట్రాలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య డెయిరీ ఆస్తుల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం ఇచ్చిన మెమో ప్రకారం ఏ ప్రాంతంలోని కార్యాలయాలు, ఆస్తులు ఆ ప్రాంతానికే చెందుతాయని తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి, న్యాయవాది వెంకట్‌రెడ్డిలు తెలిపారు. కేంద్రం మెమోకు విరుద్ధంగా హైకోర్టు ఏపీకి సోమాజిగూడలోని కార్యాలయం కేటాయించడం సరికాదన్నారు. డెయిరీకి ప్రధాన కేంద్రంగా ఉన్న లాలాగూడ భవనాలు ఏపీకి కేటాయించాలని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ రవీంద్రభట్ జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాల డెయిరీ విభజనకు ప్రభుత్వాలు చూసుకోవాలని, మధ్యవర్తిత్వాలు ఎందుకని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనల అనంతరం నోటీసులు జారీ చేసిన ధర్మాసనం నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. చదవండి: PV Sindhu: సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన పీవీ సింధు -
డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నం దున రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు, మినహాయింపులను ఇచ్చింది. కరెంటు బిల్లుల్లో ఒక్కో యూనిట్‌కు రూ.2 రాయితీని, ఆస్తి పన్నుల చెల్లింపుల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ, పంచాయతీరాజ్, ఇంధన శాఖలు బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే.. డెయిరీ, పౌల్ట్రీలకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ రాయితీలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, యూనిట్ విద్యుత్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇస్తుందని పేర్కొంటూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ రాయితీల అందజేతకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని పశుసంవర్థక, డెయిరీ, మత్స్యశాఖ కార్యదర్శిని కోరారు. వీటి ప్రకారం రాయితీలివ్వడానికి ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.100 చెల్లిస్తే చాలు పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను మినహాయింపు కోసం ‘తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల మదింపు నిబంధనలు–2020’కు సవరణ చేశారు. ‘పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లను ఆస్తి పన్నుల చెల్లింపు నుంచి మినహాయించారు. పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డుల నవీకరణ కోసం ఏటా నామమాత్రంగా రూ.100 చెల్లించి ఈ మినహాయింపును పొందవచ్చు’అన్న నిబంధనను కొత్తగా చేర్చారు. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు సైతం ఈ మినహాయింపును జీహెచ్‌సీఎం చట్టంలోని సెక్షన్ 679ఈ కింద అమల్లోకి తెస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
అక్కడ పాలు అమ్మబడవు.. ఫ్రీగా పోస్తారు!
కర్నూలు (రాజ్‌విహార్): ఆ గ్రామంలో పాడి ఉండే ఏ ఇంటికి వెళ్లినా కావాల్సినన్ని పాలు పోస్తారు. డబ్బు మాత్రం తీసుకోరు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లిలో చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆ గ్రామంలో సుమారు 1,100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జనాభా 4,750 మంది. గ్రామంలో 120 ఆవులు, 20 వరకు గేదెలు ఉన్నాయి. రోజుకు 800 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి అవుతున్నా ఏ ఒక్కరూ వాటిని విక్రయించడం లేదు. ఎవరైనా వెళ్లి పాలు కావాలని అడిగితే మాత్రం పైసా కూడా తీసుకోకుండా ఇస్తున్నారు. బడే సాహెబ్ తాత ఆజ్ఞతో.. గంజిహళ్లి గ్రామస్తులు ఆచరించే ఈ సంప్రదాయం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. మూడున్నర శతాబ్దాల క్రితం గ్రామంలో బడే సాహెబ్ తాత అనే ఆధ్యాత్మికవేత్త ఉండేవారు. గ్రామంలో ఆయన పేరిట ఇప్పటికీ ఓ దర్గా ఉంది. ఆ రోజుల్లో ఆయనకు నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంటినుంచి పాలు ఉచితంగా వచ్చేవి. ఒకరోజు బడే సాహెబ్ తాత కుమారుడు హుసేన్ సాహెబ్ పాల కోసం గిన్నెతో నాగిరెడ్డి ఇంటికి వెళ్లాడు. పాలిచ్చే ఆవు చనిపోవడంతో ఖాళీ గిన్నెతో తిరిగొచ్చాడు. పాలు ఎందుకు తీసుకు రాలేదని కుమారుణ్ణి అడగ్గా.. నాగిరెడ్డికి చెందిన ఆవు చనిపోయిందని, గ్రామంలో ఆవులున్న వారిళ్లకు వెళ్లి అడిగినా పాలు పోయలేదని చెబుతాడు. దీంతో బడే సాహెబ్‌తాత చనిపోయిన ఆవును బతికించి.. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరూ పాలు అమ్మరాదని, ఎన్ని రోజులైనా ఉచితంగానే పోయాలని, ఎవరైనా అమ్మితే ఆ ఇల్లు పాడైపోతుందని శపించాడని చెబుతారు. దీంతోపాటు ఆవును చంపడం, వాటికి పెట్టే గడ్డివాముల్ని తగులబెట్టడం వంటివి చేయొద్దని చెప్పాడట. అప్పట్లో ఒకరిద్దరు పాలను అమ్మడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడంతోపాటు ఆరోగ్య, ఇతరత్రా సమస్యలు వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో నాటినుంచి నేటి వరకు ఆవుతో పాటు గేదె, మేక, గొర్రె.. ఇలా వేటి పాలనూ గ్రామస్తులు అమ్మడం లేదు. గ్రామంలోని టీ స్టాల్స్ నిర్వాహకులు సైతం పొరుగూళ్లలో పాలను కొనుగోలు చేయడం విశేషం. శతాబ్దాలుగా ఇదే సంప్రదాయం బడే సాహెబ్ తాత ఆజ్ఞలను గ్రామస్తులంతా తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఏ ఇంట్లోనూ ఆవు, గేదె, మేక, గొర్రె ఇలా ఏ పాలనూ అమ్మరు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. – ఎస్.సుబహాన్, బడే సాహెబ్ తాత వంశీయుడు కుల, మతాలకు అతీతంగా.. కుల, మతాలకు అతీతంగా ఎవరూ పాలను విక్రయించరు. పాల కోసం వచ్చే వారికి ఎన్ని రోజులైనా ఉచితంగానే పోస్తాం. ఉచితంగా తెచ్చుకోవడం ఇష్టం లేని వాళ్లు ఆవునో, గేదెనో పెంచుకుంటారు. – తిరుమల్ రెడ్డి, గ్రామ పెద్ద, గంజిహళ్లి చెరకు కూడా నాటరు బడే సాహెబ్ తాత ఆజ్ఞలను ప్రతి ఒక్కరూ పాటిస్తారు. పాలు అమ్మడం, ఆవును చంపడం, గడ్డి వామి తగులబెట్టడం, చెరకు పంట నాటడం వంటివి ఎవరూ చేయరు. – తోలు రాముడు, సర్పంచ్, గంజిహళ్లి -
కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన
మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే మదనపల్లె పట్టణ సమీపంలోని సుధాకర్ అనే పాడి వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి సురక్షిత పద్ధతిలో పాల కొనుగోలు, అమ్మకాలను సాగిస్తున్నారు. ఇంటి ముందు ప్రధాన గేటు వద్దనే రెండు పెద్ద పైపులు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి పాడి రైతులు తనకు పాలు పోయడానికి, మరో పైపు కొనుగోలుదారులకు తాను పాలు పోయడానికి ఏర్పాటు చేసుకున్నారు. కొనుగోలుదారులు డబ్బులు గేటు వద్ద పెడితే ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని పైపు ద్వారా పంపుతున్నారు. పాడి రైతులు తీసుకొచ్చే పాలు పైపులో పోస్తే లోపల క్యానులో పడుతున్నాయి. పాలు కొలత కోసం వేబ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారు. కరోనా ప్రబలకుండా భౌతికదూరం పాటించేందుకు సుధాకర్ చేసిన ఈ సరికొత్త ఆలోచన పలువురిని ఆకర్షిస్తోంది. చదవండి: కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత -
మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డెయిరీ నిర్మాణానికి నమూనా సిద్ధం చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మామిడి పల్లిలో మెగా డెయిరీ నిర్మాణం కోసం పశుసంవర్థక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైయిరీకి 99 ఏళ్లు లీజుకు ఇస్తూ మంత్రి తలసాని, పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర సమక్షంలో ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డైయిరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని కోరారు. -
‘పూలన్‌దేవి’ కేస్ డైరీ మాయం
కాన్పూర్ దేహత్: బందిపోటు రాణి పూలన్ దేవి.. 1981 ఫిబ్రవరి 14వ తేదీన ఆ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్ కులస్తులైన 20 మందిని పూలన్‌దేవి ముఠా ఊచకోత కోసింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆగ్రహంతో ఆమె ఈ రూపంలో తీవ్ర ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు నలబై ఏళ్ల పాటు కోర్టులో వివిధ పరిణామాల మధ్య కొనసాగిన ఈ కేసు తుది దశకు రాగా, మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెహ్మాయి హత్యకాండగా పేరున్న ఈ ఘటనకు సంబంధించిన కీలకమైన కేసు డైరీ మాయమైంది. కోర్టు రికార్డుల్లో నుంచి బెహ్మాయి హత్యాకాండ కేసు డైరీ కనిపించకుండా పోయిందని సిబ్బంది చెప్పడంతో తీర్పును ప్రత్యేక కోర్టు (ఉత్తరప్రదేశ్‌లోని బందిపోటు ప్రభావిత ప్రాంత) జడ్జి సుధీర్ కుమార్ ఈనెల 24కు వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ పోర్వాల్ తెలిపారు. దీని వెనుక ఎటువంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసు తుది తీర్పులో అలవిమాలిన జాప్యం, అనుమానాస్పదంగా కేసు డైరీ మాయంకావడాన్ని అలహాబాద్ హైకోర్టు దృష్టికి తీసుకెళతామని తెలిపారు. భారత బందిపోటు రాణి! రాజకీయాల్లోకి ప్రవేశించిన పూలన్‌దేవి సమాజ్‌వాదీ పార్టీ తరఫున 1996, 1999 ఎన్నికల్లో మిర్జాపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమెపై ఉన్న 55 కేసులను ‘ప్రజాభీష్టం మేరకు’అప్పటి యూపీ సీఎం ములాయం సింగ్ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయాన్ని కాన్పూర్ కోర్టు పక్కనబెట్టింది. తనపై కేసులన్నిటినీ కొట్టేయాల్సిందిగా పూలన్‌దేవి సుప్రీంకోర్టులో 2001లో పిటిషన్ వేయగా.. ముందుగా కాన్పూర్ కోర్టులో లొంగిపోవాలని కోర్టు సూచించింది. అవేమీ జరగకుండానే, ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉండగా పూలన్‌దేవిని అదే ఏడాది దుండగులు కాల్చి చంపారు. సంచలనాలమయమైన ఆమె జీవిత కథ ఆధారంగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తీసిన ‘ఇండియాస్ బాండిట్ క్వీన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ పూలన్‌దేవి’ సినిమా హిట్టయ్యింది. పూలన్ దేవి పాత్రధారి సీమా బిశ్వాస్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందారు. అత్యాచారానికి తీవ్ర ప్రతీకారం బందిపోటు రాణి పూలన్ దేవి ముఠా 1981 ఫిబ్రవరి 14వ తేదీన కాన్పూర్ దేహత్ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్ కులస్తులైన 20 మందిని ఊచకోత కోసింది. ఆ గ్రామంలోని ఠాకూర్ కులస్తులు లాలా రామ్, శ్రీరామ్ అనే వారు తనపై అత్యాచారానికి పాల్పడినందుకు ప్రతీకారంగానే ఆమె ఈ హత్యాకాండకు ఒడిగట్టిందని చెబుతారు. ఈ ఘటన అప్పట్లో యూపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అప్పటి సీఎం వీపీ సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూలన్ దేవితోపాటు 35 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో 8 మంది పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో ముగ్గురు జాడ తెలియకుండా పోయారు. రెండేళ్ల తర్వాత 1983లో పూలన్‌దేవి మధ్యప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష పథకం కింద పూలన్‌దేవి ఆ రాష్ట్రంలో లొంగిపోయారు. దీంతో ఆమెను ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించడానికి బదులుగా అప్పటి సీఎం అర్జున్ సింగ్ ఆమెను జైలుకు తరలించారు. యూపీ పోలీసులు, కాన్పూర్ కోర్టు ఎన్ని సమన్లు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు పంపినా ప్రభుత్వం పూలన్‌దేవికి అందజేయకుండా వెనక్కి పంపింది. 11 ఏళ్లపాటు గ్వాలియర్, జబల్పూర్ జైళ్లలో గడిపిన ఆమె..ఎటువంటి విచారణ లేకుండానే 1994లో జైలు నుంచి విడుదలయ్యారు. హత్యాకాండకు సంబంధించి పూలన్‌దేవి ముఠాలోని పోషా జైలు జీవితం గడుపుతుండగా, బిఖా, విశ్వనాథ్, శ్యామ్‌బాబు అనే వారు బెయిల్‌పై బయట ఉన్నారు. మాన్సింగ్ సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులపై 2012లో నేరారోపణ జరిగింది. -
‘మా’ 2020 డైరీ ఆవిష్కరణ
-
‘మా’ డైరీని ఆవిష్కరించిన చిరంజీవి
-
అమ్మలా ఉండకూడదు
‘భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి’. పదమూడూ పద్నాలుగేళ్ల వయసులో యాన్ ఫ్రాంక్ తన డైరీలో రాసుకున్న ఒక వాక్యం ఇది! చిన్నారి యాన్ ఫ్రాంక్ చనిపోయి డెబ్బైనాలుగేళ్లు అవుతోంది. చనిపోయేటప్పుడు పదిహేనేళ్లు ఆ పాపకు. ‘ఎంత కష్టంలో కూడా మనిషి మరణాన్ని కోరుకోకూడదు’ అని యాన్ తన డైరీలో రాసుకుంది! పదమూడవ యేట డైరీ రాయడం విశేషం కాకపోవచ్చు. ఆ వయసుకు అంత పెద్దమాట రాసుకోవడం ఆశ్చర్యమే! యాన్ ఫ్రాంక్ చనిపోలేదు. చనిపోయి ఉంటే ఆమె ఎప్పుడు చనిపోయిందీ చరిత్రలో ఉండేదే. జర్మన్ నాజీల నిర్భంధ శిబిరంలోని అమానుష పరిస్థితులు ఆమెను చంపేశాయి. ఫిబ్రవరిలో, మార్చిలోనో యాన్ చనిపోయిందన్నంత వరకే ప్రపంచానికి తెలుసు. యాన్ పుట్టింది జూన్ 12, 1929. డచ్ సంతతి యూదుల అమ్మాయి యాన్. ఆమె పదమూడవ ఏట ఆమె తండ్రి ఒక డైరీని ఆమెకు కానుకగా ఇచ్చాడు. అది అతడికి వచ్చిన ఆలోచన కాదు. నిజానికి అది డైరీ కూడా కాదు. ఆటోగ్రాఫ్ బుక్. పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందు ఆమ్‌స్టర్‌డామ్‌లో తండ్రీ కూతుళ్లు షాపింగ్‌కి వెళితే యాన్‌కి అక్కడ తెలుపు, ఎరుపు రంగుల చదరపు పలకల వస్త్రంతో బౌండ్ చేసిన నోట్‌బుక్ కనిపించింది. అది ఆటోగ్రాఫ్ బుక్ అని యాన్‌కి తెలియదు. ‘‘నాకు అది కావాలి నాన్నా’’ అని తండ్రిని అడిగింది. ‘నీ పుట్టిన రోజుకు కొనిస్తాలే’ అని మాట ఇచ్చాడు. మాట ప్రకారం కొనిచ్చాడు. ఆ పుస్తకాన్ని ఎంతో ఆపురూపంగా చూసుకుంది యాన్. అందులో డైరీ రాయడం మొదలుపెట్టింది. రోజూ రాసింది. తేదీలు ముద్రించి ఉండని పుస్తకం అది. తనే తేదీలు వేసుకుని తన ఆలోచనలు రాసుకుంది. నాజీలకు ఆ కుటుంబం పట్టుబడడానికి మూడు రోజుల ముందువరకు యాన్ డైరీలు రాసింది. ఆమె తండ్రి దగ్గర మీప్కీస్ అనే వియన్నా యువతి టైపిస్టుగా పనిచేసేవారు. ఇటీవలే 2010తో తన నూరవ ఏట ఆమె మరణించారు. మీప్కీస్ యాన్‌కు సన్నిహితురాలు. మీప్కి, యాన్‌కి వయసులో ఇరవై ఏళ్ల వ్యత్యాసం. యాన్ ఆమెతో అనేక ఆలోచనలు పంచుకునేది. మీప్ కూడా యాన్ డైరీల కోసం తెల్లకాగితాలు అమర్చిపెట్టేవారు. అసలు మీప్ వల్లనే యాన్ డైరీలు వెలుగు చూశాయి. నిర్బంధ శిబిరంలో యాన్ చనిపోయిందని తెలిసినప్పుడు మీప్ కుప్పకూలిపోయారు. యాన్ నింపిన తెల్ల కాగితాలను గుండెకు హత్తుకున్నారు. వాటన్నిటినీ కలిపి యాన్ డైరీగా ముద్రించారు.‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ అనే పేరుతో ఇప్పుడా పుస్తకం ప్రతిదేశంలోనూ అందుబాటులో ఉంది. తెలుగులో కూడా కొన్ని అనువాదాలు న్నాయి. యాన్ తన డైరీని డచ్ భాషలో రాశారు. డచ్‌లో ‘రహస్యగృహం’ అనే పేరుతో ఆమె డైరీ అచ్చయింది. జర్మన్లు డచ్ని (నెదర్లాండ్స్‌ని) ఆక్రమించినప్పుడు నాజీలకు దొరక్కుండా ఉండడం కోసం ప్రతి యూదుల ఇల్లు ఒక రహస్యగృహాన్ని ఏర్పాటు చేసుకుంది. యాన్ అలాంటి గృహంలో కూర్చునే డైరీ రాసేది. యాన్ ఫ్రాంక్ డైరీ తొలిసారి 1946లో మార్కెట్లోకి విడుదలైనప్పుడు ‘ఆ.. చిన్న పిల్ల రాసేదేముంటుందిలే’ అని ఎవరూ అనుకోలేదు. ఆ కాలంనాటి పరిస్థితులు ప్రత్యేకమైనవి. అయితే యాన్ రాసిన కొన్ని విషయాలు ఇంకా ప్రత్యేకమైనవి! ఆ పసిదానిలో అంత లోతైన భావనలున్నాయా.. అని పాఠకులు విస్మయం చెందారు. ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా యాన్ భావాలు ఈ కాలానికీ వర్తించేలా ఉన్నాయి! 1944 ఏప్రిల్ 5, బుధవారం ఆమె రాసిన డైరీ ఇలా సాగింది : ‘మొత్తానికి నేనొకటి తెలుసుకున్నాను. నా లక్ష్యం నెరవేరాలంటే నేను బాగా చదువుకోవాలి. జర్నలిస్టును కావడం నా లక్ష్యం. నేను రాయగలనని నాకు తెలుసు. కానీ బాగా రాయగలనా అన్నది సందేహం. ఒకవేళ నాకు బుక్స్ గానీ, వార్తాపత్రికలకు వ్యాసాలు గానీ రాసే ప్రావీణ్యం లేకున్నా.. నా కోసం నేను రాసుకుంటాను. అయితే అంతకంటే కూడా ఎక్కువగా నేను సాధించాలి. అమ్మలా నేను జీవించలేను. అమ్మలా, మిసెస్ వాన్డాన్లా, ఇంకా చాలామంది ఆడవాళ్లలా శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేకుండా నేను పని చేయలేను. భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి. సమాజానికి నేనేదైనా చేయాలి. మనుషుల సంతోషానికి నేనొక కారణం కావాలి. అసలు నేనెవరో తెలియనివాళ్ల సంతోషానికి కూడా. చనిపోయాక కూడా నేను జీవించే ఉండాలి. నా లోపల ఉన్నదాన్ని బయటికి వ్యక్తపరిచే రచనాశక్తిని దేవుడు నాకు ప్రసాదించినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. రాసేటప్పుడు అన్ని విచారాలనూ వదిలేస్తాను. నా దుఃఖం మాయమైపోతుంది. నా మనసు పునరుజ్జీవనం పొందుతుంటుంది. అయితే ఒక సందేహం. ఎప్పటికైనా నేను ఒక గొప్ప విషయాన్ని రాయగలనా? ఒక గొప్ప జర్నలిస్టును గానీ, రచయిత్రిని గానీ కాగలనా?..’ అని ఆ వేళ్టి డైరీని ముగించింది యాన్ ఫ్రాంక్. అయితే యాన్ ఒక విషయం తెలుసుకోకుండానే ఈ లోకాన్ని శోకమయం చేసి వెళ్లిపోయింది. అమె గొప్ప జర్నలిస్టు, గొప్ప రచయిత్రి అయినా కాకున్నా గొప్ప మానవతావాదిగా నిలిచిపోయింది. అందుకు ఆమె డైరీలే సజీవ సాక్ష్యాలు. యాన్ తండ్రి తన కూతురికి డైరీని కానుకగా ఇవ్వలేదు. కూతుర్నే డైరీకి కానుకగా ఇచ్చాడు. మానవాళికి ఇది ఒక అందమైన, అపురూపమైన రోజు. -
నీదీ నాదీ ఒకే డైరీ
అమ్మ దాచుకునే డైరీ కూతురు.కూతురు రాసుకునే డైరీ అమ్మ.కూతురిలో అమ్మ నిక్షిప్తమై ఉంటుంది.అమ్మలో కూతురు వ్యక్తం అవుతుంది.ఊళ్లూ, ఉద్యోగాలు తల్లీకూతుళ్లను వేరు చేయవచ్చు. వాళ్లిద్దరి డైరీ ఒకటే. కలిసి సెల్ఫీ దిగినా కనిపించే బంధం ఒక్కటే. ‘‘కదలకుండా నిలబడు అమ్మడూ... కొంచెం ఓపికపట్టు..’’కూతురికి చీర కడుతూ బతిమాలుతోంది అమ్మ. తన అక్క కూతురి పెళ్లిలో తన కూతురిని కూడా పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తోంది ఆ తల్లి. అది ఆమె ముచ్చట. ఆ అమ్మాయికి 20 ఏళ్లు. ‘‘ముంబైలో ఎంబీఏ చేస్తోంది. తర్వాత ఉద్యోగం. అటు తర్వాత పెళ్లి. ఇక నా దగ్గర ఉండేదెప్పుడు. నా ముచ్చట తీరెదెప్పుడు. అందుకే ఇప్పుడు ఇదిగో ఇలా రెడీ చేసి కళ్లల్లో నింపుకుందామనుకుంటున్నా’’ చెప్పింది ఆ అమ్మ.. ‘‘మీ అమ్మాయే పెళ్లికూతురిలా కనబడుతుందే’’ అని అడిగిన వారికి సమాధానమిస్తూ! రెడీ చేశాక.. ముప్పైసార్లు చూసుకుంది బిడ్డను. దిష్టి తగలకుండా మెటికలు విరిచింది. కలిసి సెల్ఫీ తీసుకుంది.. అక్కడున్న వాళ్లకూ సెల్‌ఫోన్ ఇచ్చింది.. తామిద్దరినీ కలిపి ఫోటో తీసిపెట్టమని!వాళ్లకు కాస్త దూరంగా.. ఇదంతా గమనిస్తున్న సమీరకు ఒక్కసారిగా అమ్మ గుర్తొచ్చింది. ఇంటర్ నుంచి పేరెంట్స్‌కి దూరంగా హాస్టల్స్‌లో ఉండి చదువుకుంది. ఉద్యోగం వచ్చాకైతే దేశాలూ తిరిగింది. సింగపూర్ నుంచి బెంగుళూరుకు వస్తున్నప్పుడు అనుకుంది.. ‘‘ఇండియాకు వచ్చేస్తున్నా కాబట్టి.. మంత్లీ వన్స్ అయినా అమ్మావాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు’’ అని. కాని వచ్చాక సొంతూరు తప్ప అన్ని సిటీస్ తిరిగింది ఆఫీస్ పని మీద. ఆ ప్రయాణాలు విసుగొచ్చి.. హైదరాబాద్‌లోనే ఉండడానికి చిన్న కంపెనీలో ఆఫర్‌ను యాక్సెప్ట్ చేసింది. హైదరాబాద్‌కు వస్తే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మానాన్నల దగ్గరకు ప్రతి వీకెండ్‌కీ వెళ్లి వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయొచ్చు అని. అదీ సాధ్యం కాదని తేలిపోయింది వచ్చిన యేడాదిలోనే. చిన్న కంపెనీ కాబట్టి దాని గ్రోత్ కోసమూ కష్టపడాల్సి వస్తోంది. ఎన్ని అనుకుంది. శుక్రవారం రాత్రికే వెళ్లిపోయి.. శని, ఆదివారాలు కంప్లీట్‌గా అమ్మా, నాన్న, నానమ్మ, తమ్ముడితో ఉండాలని, అమ్మ నడుం నొప్పికి ఫిజియో థెరపీ చేయించాలనీ! అమ్మెప్పుడూ తమ కోసం ఆత్రపడ్డమే కాని తన గురించి ఆలోచించదు. పాదాలన్నీ పగిలి.. కాళ్లు కిందపెట్టలేకపోయింది లాస్ట్ టైమ్ తను వెళ్లినప్పుడు. ఈసారి అమ్మను మంచి పార్లర్‌కు తీసుకెళ్లి పెడీక్యూర్, మానీ క్యూర్ చేయించాలనుకుంది. అమ్మ అస్సలు కేర్ తీసుకోదు. తన చిన్నప్పుడు అమ్మ జడ ఎంత పెద్దగా ఉండేది? అమ్మ వీపునానుకుని కూర్చోని ఆమె జడను తన ముందుకువేసుకొని.. ఆ పెద్ద జడ తనకే ఉన్నట్టు ఎంత పోజ్ కొట్టేది? మొన్నీ మధ్య కూడా అలా అమ్మ జడను ముందు వేసుకొని సెల్ఫీ దిగి.. డీపీ పెట్టుకుంది. అంత థిక్ హెయిర్ అంతా ఊడిపోయి.. సన్నగా తయారైంది. అయినా తోకలా జడే అల్లుకుంటోంది. ఎన్నోసార్లు చెప్పింది.. ‘అమ్మా కట్ చేసుకో’ అని. వినదు. హైదరాబాద్ వచ్చాక వేసుకున్న ప్లాన్‌లో ముందు అమ్మ జుట్టును భుజాలకు కాస్త కింది వరకు యూ షేప్‌లో కట్ చేయించాలని, క్లచ్‌తో పోనీ వేసుకునేలా అలవాటు చేయిద్దామనీ అనుకుంది. థైరాయిడ్ టెస్ట్ చేయించాలనేది ఎప్పటికప్పుడు వాయిదా పడ్తూనే ఉంది. మామోగ్రామ్, పాప్‌స్మియర్ చేయించి కూడా అయిదేళ్లవుతోంది. మళ్లీ ఆ ఊసేలేదు. న్యూస్ పేపర్లో హెల్త్కాలమ్స్ చదివినప్పుడు ఈసారి కచ్చితంగా అనుకుంటుంది. మళ్లీ వర్క్ ప్రెజర్లో పడి మరిచిపోతుంది. కిందటిసారే తనూ తమ్ముడూ అనుకున్నారు.. అమ్మ వాళ్ల చిన్నప్పటి ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ల పిల్లలతో మాట్లాడి.. గెట్ టు గెదర్ అరెంజ్ చేసి పేరెంట్స్‌కి సర్ప్రయిజ్ ఇవ్వాలని. అసలు అన్నిటికంటే ముందు అమ్మానాన్నకు నచ్చిన ప్లేస్‌కి ప్లెజెంట్ ట్రిప్ ప్లాన్ చేయాలని. ఒక్కటంటే ఒక్కటీ కాలేదు. ‘‘ఇక్కడికి వచ్చినప్పుడల్లా.. ఆ పాత నైటీలేసుకొని ఉండే బదులు.. మంచి చుడీదారో... చీరో కట్టుకోవచ్చు కద నానీ’’ అని పాపం ఎన్నిసార్లు అడిగిందో అమ్మ. నాన్నకూ ఉంటుందేమో.. బయటపడలేదెప్పుడూ. ఎన్ని డ్రెస్సులు కొని పంపేది అమ్మ! తనకు తెలిసినంత వరకు అవేవీ అమ్మ ముందు వేసుకోలేదు. ఫొటోల్లో.. ఇప్పుడు ఎఫ్బీ.. డీపీల్లో చూడ్డమే. అమ్మకు ఫేస్బుక్ ఓపెన్ చేయడం కూడా రాదు. పెండింగ్ ప్లాన్స్‌లో అదీ ఒకటి.. ఎప్బీ ఎకౌంట్ ఓపెన్ చేయించడం.ఈ తలపులు, ఆలోచనలు సమీర కళ్లల్లో నీటిని తెప్పించాయి. వెంటనే పక్కకు వెళ్లి అమ్మకు ఫోన్ చేసింది. నాన్న లిఫ్ట్ చేశారు. ‘‘అమ్మకు నడుంనొప్పిరా.. బాలేదు. పడుకుంది’’ చెప్పారు బాధగా. ఇక అక్కడ ఉండాలనిపించలేదు ఆ అమ్మాయికి. తన ఫ్రెండ్ అయిన వధువుకి బై చెప్పి బయటపడింది.. ఊరెళ్లడానికి!చాలామంది అమ్మాయిలకు ఈ వెలితి ఉంది. చదువు, ఉద్యోగ రీత్యా వేరే ఊళ్లు, రాష్ట్రాలు, దేశాలు.. తర్వాత అత్తారింటికి వెళ్లినా అనుక్షణం బిడ్డ క్షేమం గురించే తపిస్తుంటారు తల్లులు. జడ కుచ్చులు, క్లిప్పులు దగ్గర్నుంచి తన చేతి వంట దాకా అన్నిటినీ దగ్గరుండి కొనిపించాలని, తినిపించాలనీ తాపత్రయ పడ్తుంటారు. సప్తసముద్రాల ఆవలిక్కూడా కొరియర్ చేసేస్తుంటారు. పిల్లలు అక్కడ వాటితో ఫోటోలు దిగి పంపిస్తే చూసుకొని ఆనంద పడ్తుంటారు. ‘‘అమ్మా ఫలానా వాళ్ల మదర్ ఫలానా పికిల్ ఎంత బాగా చేసిందో’’ అని బిడ్డ అన్యాపదేశంగా ఆదేశించిన మాటతో యూట్యూబ్‌లో చూసి, నేర్చుకుని మరీ పెట్టి పంపించే తల్లులూ ఉన్నారు. ఆ అమ్మల రుణం ఏ రకంగానూ తీర్చుకోవట్లేదని సమీరలా బాధపడే కూతుళ్లు ఎంతో మంది. ‘‘వర్క్ బిజీ, బాధ్యతలు.. పాపం మా చిట్టితల్లులను ఊపిరి సలపనివ్వవు’’ అంటూ తల్లులే సర్దుకుపోతుంటారు. – సరస్వతి రమ ఫేషియల్ చేయించాలని..! మాది నల్గొండ. జాబ్ వల్ల ఎక్కడెక్కడో ఉన్నప్పుడు చాలా ఫీలయ్యేదాన్ని పేరెంట్స్‌తో గడపలేకపోతున్నా అని. హైదరాబాద్‌కి ట్రాన్స్ఫర్ అవగానే.. హమ్మయ్య... ఎవ్రీ వీకెండ్ ఊరెళ్లిపోయి.. అమ్మావాళ్లతో స్పెండ్ చేయొచ్చు అని సంబరపడ్డ. ఎవ్రీ వీకెండ్ కాకపోయినా.. ఇదివరకన్నా ఫ్రీక్వెంట్గానే వెళ్తూ ఉన్నా. కాని.. నేనుకున్నట్టు టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నా.. చాలా సార్లు అనుకుంటా ఉన్న రెండు రోజులైనా అమ్మకు హెల్ప్ చేయాలని. కాని బద్దకంగా పడుకునే ఉంటా. అమ్మను గుడికి తీసుకెళ్లాలని, పార్లర్లో ఫేషియల్ చేయించాలని చాలా అనుకుంటా. ఒక్కటి కూడా కాదు. పై నుంచి వాళ్లే నా గురించి కేర్ తీసుకుంటూంటారు. బట్ లాస్ట్‌టైమ్ నుంచి కొంచెం స్ట్రిక్ట్‌గానే ఫాలో అవుతున్నా. కంటిన్యూ చేస్తా కూడా. – ఎస్. రీతూ రావు, హైదరాబాద్ వైటమిన్ టాబ్లెట్స్ తప్ప..! ‘‘ఇల్లినాయీ (షికాగో)లో ఉంటా. ఇక్కడికొచ్చి దాదాపు అయిదేళ్లవుతోంది. ఎమ్మెస్ కోసం వచ్చా. ప్రెజెంట్ జాబ్ చేస్తున్నా. అమ్మ నా కోసం ఎంత చేస్తుందో! అక్కడ ఏది బాగా అనిపిస్తే అది నాకు పంపుతుంది. వద్దమ్మా.. అన్నా వినదు. అమ్మా, నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గరుండి అంతా తిప్పాలనుకున్నా. ప్చ్... అప్పుడే నేను ప్రాజెక్ట్ మారడం.. జాబ్ టెన్షన్‌తో ఏమీ చూపించలేకపోయా. ఏమీ చేయలేకపోయా. ఇక్కడ దొరికే వైటమిన్ టాబ్లెట్స్ మాత్రం పంపిస్తుంటా. నాన్న సబ్ వే ఫూడ్ ఇష్టపడ్డారిక్కడ.. అదీ సంతృప్తిగా ఇప్పించలేకపోయానే అని బాధేస్తూంటుంది. ఈసారి నేను ఇండియాకు వెళ్లినా.. వాళ్లు నా దగ్గరకి వచ్చినా.. వాళ్లతోనే›ఉంటా. మా పేరెంట్స్‌కి షిరిడీ సాయిబాబా అంటే నమ్మకం. అక్కడికి తీసుకెళ్తా. ఇంకా చాలా ఉన్నాయి ప్లెజెంట్ సర్ప్రైజెస్ (నవ్వుతూ). – మౌనికా కొడాలి, అమెరికా అమ్మ యంగ్‌గా కనిపించాలి మాది నిజామాబాద్. నేను హైదరాబాద్‌లో జాబ్ చేస్తాను. మా అమ్మ టైలర్. నాన్న ప్రైవేట్ ఎంప్లాయ్. నా డ్రెస్సెస్ అన్నీ అమ్మనే డిజైన్ చేసి కుడుతుంది. కాని అవేవీ ఆమె దగ్గర వేసుకోలేదు. అమ్మ కంప్లయింట్ కూడా అదే. ఇంటి దగ్గర వేసుకుంటే చూసి ముచ్చట పడతా కదా అని. నాకేమో రిలాక్స్డ్గా ఉండాలనిపిస్తుంది. మెషీన్ తొక్కీతొక్కీ రాత్రయిందంటే ఆమె కాళ్లు లాగుతుంటాయ్. అంతకుముందు పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం కాళ్లు నొక్కుతా. పాదాలు మస్సాజ్ చేస్తా. మా అమ్మ యంగ్‌గా కనిపించాలనుకుంటా. అందుకే ఆమెను డిజైన్ బ్లౌజెస్ వేసుకొమ్మని వెంటపడుతుంటా. సల్వార్, కమీజ్ వేసుకొమ్మని కూడా ఇన్సిస్ట్ చేస్తా... మెషీన్ తొక్కేటప్పుడూ కన్వీనియెంట్గా ఉంటుందని. – లంకె శిరీష, ఐటీ ఎంప్లాయి, హైదరాబాద్ -
లంకేశ్ హత్య: హిట్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు
సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు అమోల్ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ డైరీని పరిశీలించిన సిట్ అధికారులు హిట్ లిస్ట్‌లోని పేర్లను చూసి షాక్ తిన్నారు. హిందూత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మంది హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం (సిట్) అధికారులు తెలిపారు. లిస్ట్‌లో మొదటి పేరు కన్నడ ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. రెండో వ్యక్తిగా జర్నలిస్ట్ గౌరి లంకేశ్ ఉన్నట్లు గుర్తించారు. హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలతో లంకేశ్‌ను గత ఏడాది సెప్టెంబర్ 5న తన ఇంటి సమీపంలోనే కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. రాడికల్ హిందూత్వ గ్రూప్ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. అదే ముఠాకి చెందిన కొందరు సభ్యులు కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందుత్వ ధర్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మందిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 2016 నుంచి హిట్ లిస్ట్‌లో ఉన్న వారిపై హత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు డైరీలో వారు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు వెల్లడించారు. హిట్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా ఉన్న గిరీష్ కర్నాడ్‌కు కర్ణాటక పోలీసులు గట్టి భద్రత కల్పించారు. -
హంతకుడి డైరీలో సంచలన విషయాలు..
బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో అనుమానితుడు అమోల్ కలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో నుంచి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. గౌరీ లంకేశే కాకుండా మరో 36 మంది ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు డైరీలో రాసుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు వెల్లడించారు. హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే వీరి టార్గెట్. వీరి టార్గెట్‌లోమహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. కర్ణాటకు చెందిన 10 మంది ప్రముఖులను హత్య చేయాలని డైరీలో రాసుకున్నారు. హత్యల కోసం 50 మందిని రిక్రూట్ చేసుకొని వారికి గన్స్, తుపాకీ, పెట్రోల్ బాంబ్ పేల్చడం టాంటి వాటిలో శిక్షణ కూడా ఇచ్చారని డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారని ఓ అధికారి తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 5న తన నివాసం వద్ద ఉన్న గౌరీలంకేశ్‌పై బైకుపై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు. గౌరీ లంకేశ్ హత్యకోసం వాగ్మారే రూ.3000 అడ్వాన్స్‌గా తీసుకున్నారు. హత్యకు ముందు రోజు రూ. 10,000 తీసుకున్నారని విచారణలో వాగ్మారే తెలిపారు. -
ఎన్నారై హత్యకేసు: సీక్రెట్ డైరీతో గుట్టురట్టు
మెల్బోర్న్ : మూడేళ్ల క్రితం మెల్బోర్న్లో హత్యకు గురైన సామ్ అబ్రహం కేసులో ఆస్ట్రేలియా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఆరెంజ్ జ్యూస్‌లో సైనేడ్ కలిపి సామ్‌ను హత్య చేసినందుకు అతడి భార్య, ఆమె ప్రియుడికి శిక్ష ఖరారు చేసింది. వివరాలు... కేరళకు చెందిన సామ్ అబ్రహం 2012లో ఉద్యోగ నిమిత్తం భార్య సోఫియా, కుమారుడితో సహా ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడ్డాడు. అయితే అక్టోబర్ 13, 2015లో సామ్ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపిన సోఫియా కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే మొదట గుండె నొప్పితోనే సామ్ మరణించాడని అందరూ భావించారు. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో విషప్రయోగం వల్లే అతడు మరణించాడని తేలింది. దీంతో స్థానిక పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నారు. సోఫియా ప్రవర్తనపై అనుమానంతో ఆమె కదలికలపై దృష్టి సారించారు. కొన్ని రోజుల తర్వాత సోఫియా, కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని వారు గమనించారు. ప్రాథమిక విచారణ అనంతరం సోఫియా, అరుణ్‌లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. కీలకంగా మారిన సీక్రెట్ డైరీ... కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్, సోఫియా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సోఫియా సామ్ అబ్రహంను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అరుణ్‌కు కూడా వేరొక అమ్మాయితో పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్‌లు తమ గతాన్ని మర్చిపోలేకపోయారు. సోఫియా భర్తతో కలిసి మొదట దుబాయ్‌లో ఉండేది. తర్వాత 2012లో వాళ్లు ఆస్ట్రేలియాకు వచ్చి సెటిలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్ భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అప్పటి నుంచి సోఫియా, అరుణ్‌లు రహస్యంగా కలుసుకునేవారు. వారు చర్చించుకున్న విషయాల గురించి సోఫియా తన డైరీలో రాసుకునేది. ఈ విషయాలేవీ భర్తకు తెలియకుండా జాగ్రత్తపడేది. ఈ క్రమంలో సామ్ అడ్డు తొలగించుకుంటే జీవితాంతం తామిద్దరం కలిసి ఉండొచ్చని భావించిన అరుణ్.. సోఫియాను ఒప్పించి సామ్‌ను హత్య చేసేందుకు పథకం రచించాడు. అందులో భాగంగానే 2015 అక్టోబర్‌లో సామ్‌కు సైనేడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి అతడిని హత్య చేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సోఫియా జాగ్రత్తపడింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు హత్య కేసును సునాయాసంగా ఛేదించారు. ఇదే సరైన శిక్ష... ‘సామ్ అబ్రహం కుటుంబంతో సహా తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. అతడిని చంపడానికి నిందితులు విషాన్ని(సైనేడ్) ఉపయోగించారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అయిన అరుణ్ కమలాసనన్‌కు 27 ఏళ్లు, అతడికి సహకరించిన సోఫియాకు 22 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధిస్తున్నానంటూ’ జస్టిస్ కోగ్లాన్ తీర్పు వెలువరించారు. నిందితులకు ఇదే సరైన శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. సోఫియాను నిందితురాలిగా నిరూపించడానికి ఆమె సీక్రెట్ డైరీ ఉపయోగపడిందని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. -
రామ్‌నాథ్ కోవింద్ రాయని డైరీ
తలనొప్పిగా ఉంది. ‘‘ఎక్కువ ఆలోచించకండి’’ అంది సవిత. ఆలోచిస్తే వచ్చిన నొప్పి కాదు, ఆలోచన లేకపోవడం వల్ల వచ్చిన తలనొప్పి ఇది. ఈ సంగతి ఆవిడకు చెబితే అర్థం చేసుకుంటుందో, అర్థం చేసుకోలేక తలనొప్పి తెచ్చుకుంటుందో?! ఐ అండ్ బి మినిస్ట్రీకి ఆలోచన లేకపోవడం వల్ల రాష్ట్రపతి భవన్‌కి వచ్చిన తలనొప్పి ఇది. ఐ అండ్ బి సెక్రెటరీ సిన్హా నెల క్రితమే వచ్చి కూర్చున్నాడు. ‘‘అవార్డులు ఎక్కడిద్దాం సార్? విజ్ఞాన్ భవన్‌లోనా? రాష్ట్రపతి భవన్‌లోనా?’’ అని. ‘‘ఏంటి తేడా?’’ అన్నాను. ‘‘ఎప్పుడూ రాష్ట్రపతి భవన్‌లోనే ఇస్తాం సర్. ఈసారి మంది ఎక్కువయ్యారు. విజ్ఞాన్ భవన్ అయితే స్పేషియస్గా వచ్చినవాళ్లంతా కూర్చోడానికి బాగుంటుంది’’ అన్నాడు. ‘మంది’ అనగానే నా కాళ్లు ఒణికాయి. ‘‘అంతమందికి ఇవ్వలేనయ్యా.. నన్ను త్వరగా పంపించు. ఓ పదిమందైతే ఫర్వాలేదు’’ అన్నాను. ‘‘నేను చూసుకుంటాను సార్’’ అన్నాడు. ఏం చూసుకున్నాడో ఏమో. ఆర్టిస్టులంతా అవార్డు తీసుకోకుండానే హర్టయి వెళ్లిపోయారు. కళలు బలమైనవి అంటారు. కళాకారులు ఇంత బలహీనంగా ఎందుకుంటారో అర్థం కాదు! ‘ఇస్తే రాష్ట్రపతి ఇవ్వాలి. ఇవ్వలేకపోతే రాష్ట్రపతి ఇవ్వలేకపోతున్నారని చెప్పాలి. రాష్ట్రపతి ఇస్తాడని పిలిపించి, రాష్ట్రపతేతరుల చేత ఇప్పించి పంపాలని చూడ్డం ఏంటని’ అంతా నొచ్చుకున్నారట. నా ప్రెస్ సెక్రెటరీని పిలిచి అడిగాను.. ‘‘అశోక్.. ఏంటయ్యా ఇది! స్టేజీ మీద ఎక్కువసేపు ఉండలేనని ముందే నువ్వు ఐ అండ్ బి కి చెప్పలేదా?’’ అని.‘‘చెప్పాను సార్. అయినా గానీ, అందరికీ మీరే అవార్డులు ఇస్తారని ఐ అండ్ బి ఇన్విటేషన్లు పంపింది’’ అన్నాడు! ఐ అండ్ బి సెక్రెటరీ అక్కడే ఉన్నాడు. ‘‘నిజమే సార్. మీరు కొద్దిసేపే ఉంటారని అశోక్ చెప్పాడు. రాష్ట్రపతి ఇచ్చే అవార్డులు రాష్ట్రపతి చేతుల మీదుగానే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు కదా అనీ.. ఏదో మాట వరసకి ‘ప్రెసిడెంట్ వుడ్ గివ్ ద అవార్డ్స్’ అని కార్డులో కొట్టించాం సార్. ఇంతగా ఆర్టిస్టులు హర్ట్ అవుతారని అనుకోలేదు సార్’’ అన్నాడు! ‘‘ఇప్పుడేం చేద్దాం! అంతా నన్ను ప్రణబ్జీతో కంపేర్ చేస్తున్నారయ్యా. లాస్ట్ ఇయరో, ఆ ముందు ఏడాదో.. నిలబడీ నిలబడీ కాళ్లు, అవార్డులు ఇచ్చీ ఇచ్చీ చేతులు అలసిపోయినా కూడా, చిన్న బ్రేక్ తీసుకుని మూడుగంటల పాటు ప్రణబ్‌జీ అలా స్టేజీ మీదే ఉండిపోయారట. చెప్పండి. ఏం చేద్దాం?’’ అన్నాను. ‘‘ఇప్పుడేం చెయ్యడానికి లేద్సార్’’ అన్నాడు ప్రెస్ సెక్రెటరీ. ‘‘నెక్ట్స్ ఇయర్ దాదాసాహెబ్ అవార్డు ఒక్కటే రాష్ట్రపతి చేతులు మీదుగా ఉంటుందని ముందే ప్రకటిస్తే ఏ గొడవా ఉండదు సర్’’ అన్నాడు ఐ అండ్ బీ సెక్రెటరీ! -మాధవ్ శింగరాజు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
బీజింగ్ ఫ్లయిట్ ఎక్కుతుంటే ఫోన్ వచ్చింది! ఫ్లయిట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అని!! ‘‘ముందే చూసుకోనక్కర్లేదా?’’ అన్నాను. ప్రధానికే ఇలా ఉంటే ప్రధాని కానివాళ్లకు ఇంకెలా ఉంటుందో?! ఫ్లయిట్ ఎక్కాక, ‘బండి ఫెయిలైంది దిగండి’ అంటారేమో మర్యాద లేకుండా. ‘‘ఇప్పుడేంటి? ఎక్కొద్దంటావా?’’ అన్నాను. ‘‘మీ ఫ్లయిట్ కాద్సార్ ప్రాబ్లమ్. రాహుల్ గాంధీ ఫ్లయిట్’’ అన్నారు అట్నుంచి. ‘‘ఎవరయ్యా నువ్వు?’’ అన్నాను. ‘‘కర్ణాటక నుంచి సార్. ట్విట్టర్లో మిమ్మల్ని ఫాలో అవుతుంటాను’’ అన్నాడు. ‘‘నా నంబర్ ఎవరిచ్చారు నీకు?’’ అని అడిగాను. ‘‘మీరు నాకు నంబర్ ఇవ్వలేద్సార్. నేనే మీ నంబర్ తీసుకున్నాను’’ అన్నాడు. ‘‘సరే చెప్పు. రాహుల్ గాంధీ ఫ్లయిట్‌కి ప్రాబ్లమ్ వస్తే నాకెందుకు ఫోన్ చేస్తున్నావ్?’’ అని అడిగాను. ‘‘అభిమానం సార్’’ అన్నాడు! ‘‘ఎవరి మీద? రాహుల్ మీదా?’’ అన్నాను. ట్విట్టర్ ఫాలోవర్ నవ్వాడు. ‘‘ఇద్దరి మీదా సార్’’ అన్నాడు. ‘‘ఫ్లయిట్ కదలబోతోంది. వచ్చాక మళ్లీ మాట్లాడతా’’ అన్నాను. ‘‘అది కాద్సార్. రాహుల్ గాంధీ ఫ్లయిట్లో మీరే ఏదో నట్టు లూజ్ చేయించారని అందరూ అనుకుంటున్నారు ఇక్కడ’’అన్నాడు. ‘‘అందరూ అనుకుంటే నేనేం చేసేదయ్యా?’’ అన్నాను. ‘‘రాహుల్ గాంధీ కూడా అలాగే అనుకుంటున్నారు సార్’’ అన్నాడు. ‘‘నేనెందుకు చేస్తానయ్యా. రాహుల్ నాకు పోటీగా వస్తున్నాడా ఏంటి.. చైనాలో జిన్‌పింగ్‌ని కలవడానికి?!’’ అన్నాను. ‘‘అక్కడికి రావడం లేద్సార్. మా కర్ణాటకలోనే ఇక్కడినుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు’’ అన్నాడు. ‘‘అయితే ఏం చెయ్యమంటావ్?’’ అన్నారు. ‘‘ఒక్కసారి మీరు రాహుల్‌గాంధీతో మాట్లాడితే బాగుంటుంది సార్’’అన్నాడు. ‘‘నేనెందుకు మాట్లాడాలి?’’ అన్నాను. ‘‘మీరు మాట్లాడితే, ఆ ఫ్లయిట్లో టెక్నికల్ ప్రాబ్లమ్‌కి మీరు కారణం కాదని తెలుస్తుంది’’ అన్నాడు. ఫోన్ పెట్టేసి, రాహుల్‌గాంధీకి ఫోన్ చేశాను. రాహుల్ ఎత్తుకోలేదు. ఇంకెవరో ఎత్తుకున్నారు. ‘‘హలో సార్. నేనే. ఇందాక కట్ అయింది. మీ ట్విట్టర్ ఫాలోవర్ని’’ అన్నాడు. ‘‘నా ఫాలోవర్ని అని చెబ్తూ రాహుల్ దగ్గర ఏం చేస్తున్నావయ్యా?’’ అని అడిగాను. ‘‘మీ ఫాలోవర్‌గా అందర్నీ ఫాలో చేస్తుంటాన్సార్’’ అన్నాడు!! ఫోన్ కట్ చేసి నా ఫారిన్ సెక్రెటరీకి ఇచ్చాను. ‘‘నాకో డౌట్ సార్’’ ఫారిన్ సెక్రెటరీ. ‘‘ఏంటి?’’ అన్నాను. ‘‘ఇప్పటివరకు మాట్లాడింది రాహులేనని’’ అన్నాడు!! - మాధవ్ శింగరాజు -
70వ రోజు పాదయాత్ర డైరీ
-
70వ రోజు పాదయాత్ర డైరీ
ఉదయం శిరసనంబేడు దాటి కాస్త ముందుకెళ్లగానే.. నడవలేక నడవలేక నాకేసి వస్తున్న ఓ అవ్వ కనిపించింది. నడుం పూర్తిగా వంగిపోయి, చేతికర్ర సాయంతో ఎంతో కష్టంగా వచ్చిన ఆ అవ్వను చూడగానే కదిలిపోయాను. ఆ అవ్వ నావద్దకు వచ్చి నా చెంపను తడిమింది. ఏం కావాలవ్వా.. అని అడిగాను. ‘నాకేమీ వద్దు నాయనా.. నువ్వు ముఖ్యమంత్రివై మా ఊరికి రావాలి.. అదే చాలు’ అని దీవించింది. ‘నీలో నాన్నను చూసుకుంటున్నానయ్యా’ అంటూ ఎంతో మురిసిపోయింది. 80 ఏళ్లు పైబడిన ఆ అవ్వ చూపించిన ఆప్యాయతకు, ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.? చావలి దాటాక, హైవేపై నడుస్తున్నప్పుడు.. దారి పక్కనే చాలా ఇటుక బట్టీలు కనిపించాయి. చాలామంది కూలీలు, మహిళలు నన్ను చూడాలని పరుగు పరుగున వచ్చారు. వారితోపాటు చిన్నచిన్న పిల్లలు కూడా పరుగులెడుతూ ఆతృతగా వచ్చి నన్ను కలిశారు. ఆ పిల్లలంతా మట్టికొట్టుకుని ఉన్నారు. తలలు మాసిపోయాయి. బట్టలు మాసిన చిరుగుపాతలు. ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని వారి చేతులు తడిమాను. ఆ అరచేతులు కాయలు కాసి ఉన్నాయి. ఏమైందమ్మా.. అని వారి తల్లులను అడిగాను. ఆ పిల్లలు కూడా ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారట. పలకాబలపం పట్టాల్సిన చిట్టిచేతులు మట్టితట్టలు మోయాల్సి వస్తో్తందని తెలిసి కలతచెందాను. ఆటపాటలతో, చదువులతో వెల్లివిరియాల్సిన బాల్యం ఇటుక బట్టీలలో వాడిపోతోందని తెలిసి చాలా బాధపడ్డాను. పిల్లలను బడులకు పంపించాలమ్మా.. అని అనగానే.. ‘తినడానికే లేదు. ఇక చదువులెక్కడ సార్.. మాకూ చదివించుకోవాలనే ఉంది. కానీ బడికెట్లా పంపం?’ అన్నారు. ఇలాంటి తల్లుల కోసమే నవరత్నాలలో పొందుపర్చిన అమ్మఒడి పథకం గురించి వివరించాను. పిల్లలను బడికి పంపితే ఆ తల్లులకు సంవత్సరానికి రూ.15,000 ఇస్తానని చెప్పాను. అది విన్నాక తమ పిల్లల్ని ఇబ్బందుల్లేకుండా బాగా చదివించుకునే రోజులు రానున్నాయన్న ఆనందం వారిలో కనిపించింది. ఆ పిల్లలను పెద్ద చదువులు చదివించి, గొప్ప స్థానాల్లో చూడాలన్న నా ఆశయాన్ని తెలియజేసినప్పుడు ఆ తల్లుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. భోజన విరామానికి ముందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు కలిశారు. చంద్రబాబు వారినెలా మోసం చేశాడో చెప్పారు. నాన్నగారి హయాంలో 13 వేల దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కింద రూ.2,500 ఇచ్చేవారు. బాబుగారు ఆ దేవాలయాల సంఖ్యను మూడు వేలకు కుదించివేశాడు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం.. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రూ.500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ కార్పొరేషన్‌కు ఇస్తానన్న నిధులు ఇవ్వకపోగా, అన్యాయాన్ని ప్రశ్నించిన సదరు కార్పొరేషన్ చైర్మన్‌ను రాత్రికిరాత్రి అవమానకరంగా తొలగించి, కార్పొరేషన్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వాపోయారు. మంచి పథకాలకు తూట్లు పొడవడం, అబద్ధపు హామీలతో నెట్టుకురావడం బాబుగారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యమరి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలకు ముందు ఓట్లకోసం అన్ని కులాలకూ తాయిలాలు ప్రకటించి, బూటకపు హామీలిచ్చి, అవసరం తీరాక వాటిని తీర్చకపోగా.. ప్రశ్నించిన కుల సంఘాలను బెదిరించడాన్ని ఏమనుకోవాలి? అది దేనికి సంకేతం? అదే మీ నైజమా? -
66వ రోజు పాదయాత్ర డైరీ
-
66వ రోజు పాదయాత్ర డైరీ
66వ రోజు 20–01–2018, శనివారం చిందేపల్లి, చిత్తూరు జిల్లా ఈ రోజు ఉదయం మోదుగపాలెంలో వాణెమ్మ అనే అవ్వ ‘మా ఊర్లో మందు షాపు తీయించు నాయనా.. ఊరంతా గుల్లయిపోతాంది’అంది. మద్యం వల్ల కాపురాలు కకావికలమవుతున్నాయి. కుటుంబ బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు కరువవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోయి, విచక్షణాజ్ఞానం కోల్పోయి, ఉచితానుచితాలు మరచి ప్రవర్తిస్తున్నారు. కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇన్ని జరుగుతున్నా.. ఈ ప్రభుత్వమే మద్యం రక్కసిని పెంచిపోషిస్తోంది. ఆ అవ్వకు ఉన్న కనీస సామాజిక స్పృహ ఈ ప్రభుత్వానికి ఉంటే ఎంత బావుండేది. అందుకే మన ప్రభుత్వంలో మద్యాన్ని నిషేధించాలన్న నా సంకల్పం మరింత బలపడింది. కొత్తవీరాపురం గ్రామంలో.. ఊరంతా సంక్రాంతి వాతావరణాన్ని తలపించింది. గ్రామ ప్రజలు ఉదయం నాలుగు గంటలకే లేచి, ఊరంతా కళ్లాపి చల్లి, ముగ్గులు వేసి, పూలు పరిచి.. నా కోసం ఎదురుచూశారు. ‘అన్నా.. ఈ రోజే మాకు అసలైన పండుగ’అన్నారు. వారి ప్రేమాభిమానాలు నన్ను కట్టిపడేశాయి. కోబాక వద్ద నరసింహనాయుడు అనే తాత కలిశాడు. గత మే నెలలో తుపాను కారణంగా తన ఇల్లు ధ్వంసమైందని, రెవెన్యూ అధికారులు వచ్చి రూ.65 వేలు నష్టం జరిగిందని అంచనా వేశారని, కానీ.. రాజకీయ కారణాలతో ఇంతవరకూ తనకు పరిహారం ఇవ్వలేదని చెప్పాడు. సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్న పొలంలోని ట్రాన్స్ఫార్మర్ కూడా అదే తుపానులో కూలిపోయిందని, దానిని ఇంతవరకూ పునరుద్ధరించకపోవడంతో వ్యవసాయం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వాపోయాడు. తన గ్రామంలో 20, 30 సంవత్సరాల కిందట కట్టుకున్న మరుగుదొడ్లకు కూడా టీడీపీ వారు బిల్లులు చేసుకున్నారని, తనలాంటి అర్హులైన వారిపట్ల అన్ని విషయాలలో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వ పక్షపాత వైఖరి వల్ల 70 ఏళ్లు పైబడిన ఆ తాత పడుతున్న ఇబ్బందిని చూసి చాలా బాధేసింది. సాయంత్రం.. మన్నసముద్రానికి చెందిన శివచంద్ర అనే యువకుడు తన తల్లితో కలిసి వచ్చి ‘అన్నా.. మేము ఎస్సీలం. చాలా పేదవాళ్లం. నేను ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేశాను. 80 శాతం పైగా మార్కులొచ్చాయి. 2014లో చదువు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ఉండి ఉంటే.. నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు’అని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఇప్పించామంటున్న పాలకులు.. ఇలాంటి యువకులకు ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మన రాష్ట్రంలో లక్షలాది మంది యువకులు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఏమైంది మీ ఇంటికో ఉద్యోగం? ఎక్కడికి పోయింది మీ నిరుద్యోగ భృతి? ఏర్పేడులో చిన్నారిని ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్ జగన్ -
65వ రోజు పాదయాత్ర డైరీ
-
65వ రోజు పాదయాత్ర డైరీ
65 వ రోజు 18–01–2018, గురువారం సదాశివపురం క్రాస్, చిత్తూరు జిల్లా ఉదయం శిబిరం నుంచి వెలుపలికి రాగానే ఆరోగ్యశ్రీ సేవలు అందని మరో విషాద గాథ తెలిసింది. కురుకాల్వకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శశిని ఎత్తుకుని వచ్చారు వాళ్ల అమ్మా, నాన్నలు. వారిది చాలా పెద్ద బాధ. కంటికి సంబంధించిన క్యాన్సర్‌తో ఆ పాప బాధపడుతోందట. ఒక కన్ను పోయిందట. ఇప్పుడు రెండో కంటికి సోకిందని, దానికి సంబంధించిన వైద్యం హైదరాబాద్‌లో మాత్రమే ఉందని చెబితే.. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు వెళితే ‘ఇప్పుడు ఇది చెల్లదు.. డబ్బు కడితేనే వైద్యం’ అన్నారట. కూలి పనులకు వెళ్లే ఆ దంపతులు లక్షల రూపాయలు ఖర్చు చేయడం సాధ్యమా? తమకంటి వెలుగులాంటి బిడ్డకు కనుచూపు కరువైతే.. ఆ అమ్మానాన్నలు ఎంతగా కుమిలిపోతారో కదా? కళ్ల ముందే ఆ వ్యాధి ముదు రుతూ, ప్రాణాంతక మవుతూ ఉంటే.. ఆ తల్లిదండ్రుల పరి స్థితి వర్ణనాతీతం. హైదరా బాద్‌తో పాటు పొరుగు రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ సేవల ఆవశ్యకతను ఇలాంటి సంఘటనలే తెలియజేస్తున్నాయి. కాస్త ముందుకు నడవగానే మునగలపాలెం వద్ద రోడ్డు పక్కన ఒక ఎత్తయిన స్తూపం కనిపించింది. చంద్ర బాబు అరాచక పాలనకు, తెలుగుదేశం నాయకుల దాష్టీకాలకు సాక్షీభూతం అది. ఇసుక మాఫియాపై పోరాడుతూ, న్యాయం కోసం పోలీసు ఉన్నతాధికారులను అర్థించడానికి ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, లారీ దుర్ఘటనలో అమరులైన 16 మంది ప్రజల మృతికి స్మారకం అది. ఆ దుర్ఘటనలో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఏ పనీ చేయలేక, సంపాదనలేక వారి కుటుంబాలు ఛిన్నాభిన్న మయ్యాయి. ఆ విషాద ఘటన తర్వాత బాధిత కుటుంబాలను నేను పరామర్శించే వరకూ ప్రభుత్వం స్పందించలేదంటే, పరిహారం ప్రకటించ లేదంటే, నిందితులపై చర్యలు తీసుకోలేదంటే.. ప్రభుత్వ ఉద్దేశమేంటో ప్రజలందరికీ అవగతమైంది. ఇప్పటికీ ఆ ఇసుక మాఫియా నిందితులు యథేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారంటే.. వారికి ప్రభుత్వ అండదండలు ఎంతగా ఉన్నాయో తెలుస్తోంది. తమ జీవనాధారమైన భూములను విమానాశ్రయాల విస్తరణ, పరిశ్రమల ఏర్పాటు కోసం వదులుకున్న నిరుపేదలైన రైతులు గ్రామగ్రామానా కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. వారి ఇష్టంతో పనిలేకుండా.. లక్షల రూపాయల విలువచేసే భూములను తీసుకుని, నామమాత్రపు పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు. పరిహారం కోసం టీడీపీ నాయకులు అధికారుల సహకారంతో అమాయకులైన పేదల భూముల రికార్డులను తారుమారు చేశారు. పేదల భూములు, మరికొన్ని అసైన్డ్ భూములకు సంబంధించి బినామీల పేర్లతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల పరిహారాన్ని తీసుకోగా, ఇష్టం లేకపోయినా.. బలవంతంగా భూములు లాక్కోవడంతో పేదలు, మరీ ముఖ్యంగా అసైన్డ్ భూముల పేదలు కోర్టును ఆశ్రయించారు. చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ఇసుక మాఫియా దురాగతాలపై ఎన్నో ఫిర్యాదులొచ్చినా, ఎన్నో ఆందోళనలు జరిగినా.. ఎందుకు స్పందించలేదు? ఒక్కదానిపై కూడా ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు? తీసుకుని ఉంటే.. ఏర్పేడు లాంటి ఘటనలు జరిగేవి కాదుకదా. ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారులపై దౌర్జన్యాలు జరిగినా.. వాటిని తీవ్రంగా పరిగణించా ల్సిందిపోయి.. నిందితులనే వెనకేసుకురావడం దేనికి సంకేతం? మీరే ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారనడం వాస్తవం కాదా? శశి తల్లిదండ్రులను ఓదారుస్తున్న వైఎస్ జగన్ -
64వ రోజు పాదయాత్ర డైరీ
64వ రోజు 17–01–2018, బుధవారం వికృతమాల, చిత్తూరు జిల్లా. పరిపాలించే నాయకుడు స్వార్థపరుడైతే, అవినీతిపరుడైతే.. ఒక రాష్ట్రం ఎంతగా నష్టపోతుందో, తన ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలనైనా, అమాయకుల ప్రాణాలనైనా.. ఎలా బలిపెడతారో తెలిపే ఉదంతం ఈ రోజు ఎదురైంది. తాట్నేరి క్రాస్ వద్ద మునికోటి అనే వ్యక్తి కుటుంబ సభ్యులు కలిశారు. మునికోటి ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలిసే ఉంటుంది. ప్రత్యేక హోదా కోసం 2015, ఆగస్టు 9న తిరుపతిలో ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి ఆయన. తనను తాను అగ్ని జ్వాలలకు ఆహుతి చేసుకున్న ఆ అన్న సాక్షిగా.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని టీడీపీ పెద్ద లు హామీ ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శిం చి, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రెండున్నర సంవత్సరాలు దాటినా ఆ ఊసే లేదంట. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న మనిషి కుటుంబాని కి సాయం చేస్తామని చెప్పి, మాట తప్పడాన్ని ఏమంటారు? వంచన కన్నా మించిన పదం ఏమైనా ఉందా? చంద్రబాబుగారు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. పది సంవత్సరాలు సరిపోదు.. పదిహేనేళ్లు కావాలన్నారు. రాష్ట్ర ప్రజల్లో, యువతలో, నిరుద్యోగుల్లో కోటి ఆశలు నింపారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ.. ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రిగారు సాక్ష్యాధారాలతో 2015, మేలో పట్టుబడ్డాక.. ఆ కేసు నుంచి, ఇతర అవినీతి కేసుల నుంచి బయటపడటానికి కేంద్రం ముందు పూర్తిగా సాగిలపడి, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా? అంటూ మాటమార్చారు. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. అది జరిగిన మూడు నెలలకే మునికోటి ఆత్మార్పణ చేసుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబును వేలెత్తి చూపడంతో మంత్రులను, ఎమ్మెల్యేలను పంపి కంటితుడుపు పరామర్శలు జరిపించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విషయం కాస్త మరుగునపడగానే మాట తప్పారు. హోదా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి కుటుంబానికిచ్చే పరిహారం విషయంలో మోసం చేయడం ఒక ఎత్తయితే, ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చి, మునికోటి లాంటి యువకుల ప్రాణత్యాగాలకు విలువే లేకుండా చేయడం ఎంత దారుణం? మొన్నటికి మొన్న ప్రధాని దగ్గరకు పోయి కోట్లాది మంది నిరుద్యోగుల కోసం ప్రత్యేక హోదా అడుగుతారనుకుంటే.. తన అవినీతి సొమ్ముతో కొన్న ఎమ్మెల్యేలకు రాజకీయ ఉద్యోగావకాశాల కోసం.. నియోజకవర్గాలు పెంచాలని అడిగారట..వంచనలో ఆయనకు ఆయనే సాటి! తన స్వార్థం కోసం ఎవ్వరినైనా బలిపెట్టే నైజం.. పిల్లనిచ్చిన మామనైనా.. రాష్ట్ర ప్రజలనైనా. మధ్యాహ్నం స్వర్ణముఖి వంతెన మీద చెన్నంపల్లి గ్రామానికి చెందిన యువకులు.. ఒక చేతితో వారి గ్రామ సమీపంలో ప్రవహించే వాగు నీరు, మరో చేతితో ఆ గ్రామంలో లభ్యమయ్యే తాగునీళ్లున్న బాటిళ్లను చూపించారు. గాజులమండ్యం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు వ్యర్థ, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండా సమీపంలోని నక్కల వాగులోకి వదులుతున్నాయని, ఆ విష జలాల వల్ల దాదాపు 15 గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, మంచి పంటలు పండే భూములు కూడా నిస్సారమవుతున్నాయని, భూగర్భ జలాలు కలుషితమై, తాగునీరు, సాగునీరు కూడా విషపూరితమవుతోందని వాపోయారు. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో అధికారులు కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా గాలికొదిలేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసేది పారిశ్రామిక అభివృద్ధి ఎలా అవుతుంది? సామాన్యుల ప్రాణాలంటే అంత చులకనా? ప్రజల ప్రాణాలంటే.. విలువే లేదా? పాపానాయుడుపేటలో బలహీనవర్గాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటల్లో బాబుగారి మోసాలు బహిర్గతమయ్యాయి. బాబుగారు తన రంగుల మేనిఫెస్టోలో బీసీలకు నాలుగు పేజీలు కేటాయించారు. దాదాపు 120 హామీలను కుమ్మరించారు. అందులో ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు. కోట్లాదిమంది జనాన్ని నమ్మించి మోసం చేయడమంటే.. అది మామూలు మనుషులకు సాధ్యంకాని పని. కాస్త చిత్తశుద్ధి, ప్రజల పట్ల బాధ్యత ఉన్న నాయకులెవరైనా అలా చేయడం మహాపాపంగా భావిస్తారు. చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. నిజంగా మీకు ఓటుకు కోట్లు, ఇతర అవినీతి కేసుల భయం లేకపోతే.. ప్రత్యేక హోదాపై ఎందుకు మాట మార్చారు? మీ భాగస్వామ్య పక్షమైన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? కృష్ణా, గోదావరి జలాలపై మన రాష్ట్ర హక్కును ఎందుకు తాకట్టుపెట్టారు? రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు? వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌తో తనకున్న మూడు తరాల అనుబంధాన్ని, అభిమానాన్ని చాటుతూ జననేత కటౌట్‌ను భుజంపై మోస్తూ పాదయాత్రలో పాల్గొన్న భూమన కరుణాకర్‌రెడ్డి -
58వ రోజు పాదయాత్ర డైరీ
58వ రోజు 10–01–2018, బుధవారం గుండుపల్లి, చిత్తూరు జిల్లా ఉదయం నడక ప్రారంభించే సమయానికి వాతావరణం చాలా చల్లగా అనిపించింది. అల్పపీడన ప్రభావం ఈ రోజు కూడా కొనసాగినట్లుంది. జెట్టివానిఒడ్డు సమీపంలో మోపిరెడ్డిపల్లెకు చెందిన కొందరు రైతులు వినతిపత్రంతో నా వద్దకు వచ్చి ‘అన్నా.. మా పొలాల్లో బోరు వేసుకున్నాం. నీళ్లు పడ్డాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి, డబ్బులు కూడా చెల్లించి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకూ కరెంటు రాలేదు. పొలాలను బీడు పెట్టుకుంటున్నాం’ అన్నారు. ‘కరెంటు కనెక్షన్ల కోసం అధికారుల చుట్టూ చాలాసార్లు తిరిగాం. కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చాం. మంత్రి గారికి కూడా మొరపెట్టుకున్నాం. వచ్చే నెల, ఇంకో నెల అంటూ తిప్పుకొంటున్నారు.. ఫలితం మాత్రం లేదు’ అని వాపోయారు. ఈ పాదయాత్రలో ఇదే విషయాన్ని దాదాపు 40 నుంచి 50 మంది రైతులు నా వద్ద ప్రస్తావించారు. ఏమిటీ రైతుల దయనీయ పరిస్థితి? విత్తనాలు, ఎరువులు, నీళ్లు, రుణాలు, గిట్టుబాటు ధర.. అన్నీ సమస్యలే. ఈ ఇబ్బందులన్నీ తట్టుకుని ఏదో విధంగా కష్టపడి సేద్యం చేసుకుందామనుకుంటే.. కరెంటు కనెక్షన్లు ఇవ్వడంలేదట. ఏ ప్రభుత్వమైనా వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో తాగునీటి వసతులు లేని, వర్షాధార ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కనెక్షన్ల కోసం డబ్బులు కట్టించుకుని, ఏళ్ల తరబడి మంజూరు చేయకపోవడం ఏమిటి? లక్షల్లో విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఏం చేయాలనుకుంటోంది? ఉచిత విద్యుత్ పథకం ఏమైంది? ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మిగతా పథకాల్లాగా నిర్వీర్యం చేయాలనుకుంటోందా? సాయంత్రం శిబిరానికి చేరేముందు ఓ కౌలు రైతు నన్ను తన బెల్లం బట్టీ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన పేరు ఆర్ముగం. ఆయన ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని, రూ.50 వేలు అప్పుచేసి చెరకు వేశాడట. విత్తనం వేసిన మొదట్లో వర్షాల్లేక, ఆ తర్వాత పంటకు తెగులు సోకి.. ఈ సంవత్సరం దిగుబడి బాగా తగ్గిపోయిందట. నిరుడు ఎనిమిది బండ్లు దాకా అయిన దిగుబడి ఈసారి ఐదు బండ్ల కన్నా మించకపోవచ్చట. బెల్లం మీద ఆంక్షల వల్ల రేటు కూడా తగ్గిపోయిందట. లక్ష రూపాయలు కూడా ఆదాయం రాకపోవచ్చట. అందులో దాదాపు రూ.50 వేలు కౌలు చెల్లిస్తే.. ఇక అప్పు ఎలా తీర్చాలి? తామెలా బతకాలంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ‘కష్టపడి వండిన బెల్లాన్ని అమ్ముకోడానికి లేకుండా ఆంక్షలు విధించడంతో, కొనేవాడు ముందుకు రాకపోవడంతో, వచ్చిన కాడికి తెగనమ్మి తీవ్రంగా నష్టపోయాను’ అన్నాడు. ‘ఈ కష్టాలన్నీ తెలిసి కూడా చెరకు ఎందుకు వేశావన్నా..’ అని అడిగాను. ‘ఏం చేయాలన్నా.. నేను కౌలు రైతునని ఏ బ్యాంకూ నాకు రుణం ఇవ్వలేదు. ప్రయివేటు వ్యక్తుల వద్ద ప్రయత్నం చేస్తే.. ఒక్క బెల్లం వ్యాపారి తప్ప వేరే ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో చెరకు పంట వేసుకోవాల్సి వచ్చింది’ అన్నాడు. ఇది ఎంత అన్యాయం? ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కౌలు రైతులు ఇదే రకంగా బ్యాంకు అప్పులు అందక, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి, భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తే.. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల పాలై.. అటు కౌలు కట్టలేక, ఇటు అప్పు తీర్చలేక నలిగిపోతున్నారు. కౌలు రైతుకు బ్యాంకు రుణం ఇప్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కౌలు రైతులున్నారు. వారిలో కనీసం పదిశాతం మందికైనా బ్యాంకు రుణం ఇప్పించగలిగారా? అసలు కౌలు రైతుల సమస్యలు మీకు తెలుసా? తెలిసినా తెలియనట్టు నిద్ర నటిస్తున్నారా? గుండుపల్లి వద్ద బెల్లం వండుతూ చెరకు రైతుల సమస్యలు వింటున్న వైఎస్ జగన్ -
57వ రోజు పాదయాత్ర డైరీ
-
57వ రోజు పాదయాత్ర డైరీ
57వ రోజు 09–01–2018, మంగళవారం చిప్పారపల్లి శివారు, చిత్తూరు జిల్లా. అసలే చలికాలం.. ఆపై ఉదయం నుంచి ఆకాశమంతా మబ్బులు పట్టినట్టే ఉంది.. భానుడి జాడే లేదు.. ఆ చలిగాలిలోనే పూతలపట్టు నియోజకవర్గం నుంచి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టాను. జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇదొకటి. సమస్యలు ఎన్నెన్నో. ఉన్న సమస్యలు చాలక, ఈ నాలుగేళ్లలో ఒక్క పనీ జరగక.. ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. దారికి ఇరువైపులా చెరకు, జామ, పూల తోటలు కనిపించాయి. కానీ పండించిన రైతన్నలకు మాత్రం కష్టాలు తప్పడంలేదు. పంటను సరైన ధరకు అమ్ముకునే వీలు లేదు, నిల్వ చేసుకునే వెసులుబాటూ లేదు. పంట చేతికొచ్చాక చచ్చినట్టు దళారులు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సిందే. అందుకే ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల బతుకులు అంతలా నీరసించి కనిపిస్తున్నాయి. చెరకు అంటేనే తీపికి ప్రతీక. ఆ రైతులది మాత్రం.. నష్టాల కష్టాల చేదును దిగమింగుతూ మనకు తీపిని పంచే తాపత్రయం. భోజన విరామానికి ముందు మాణిక్యరాయపల్లి వద్ద కాలికి కట్టు కట్టుకుని కుంటుతూ.. చేతిలో చెరకు రసం, నల్లని బెల్లంతో ఓ రైతన్న వచ్చాడు. ఏమైందీ.. అని అడిగాను. ‘అన్నా.. పొలంలో పనిచేసుకుంటుంటే కాలికి గాయమైంది. దాంతో జ్వరం వస్తోంది. అయినా నీకు నా కష్టం చెప్పుకోవాలని వచ్చాను’ అన్నాడు. ఆ రైతన్న చెప్పిన కష్టానికి, ఆరోగ్యం సహకరించకున్నా నాతో చెప్పుకోవాలన్న తపనకు, నాపై ఉంచిన నమ్మకానికి గుండె బరువెక్కింది. వారి కుటుంబ సభ్యులంతా సంవత్సర కాలం కష్టపడి.. బెల్లం తయారు చేసి.. అమ్ముకుందామనుకుంటే గిట్టుబాటు ధర లేదట. అమ్మినా ఆ వచ్చే డబ్బు.. తెచ్చిన అప్పులకు, వడ్డీలకే సరిపోదట. పోనీ చక్కెర ఫ్యాక్టరీలకు చెరకు అమ్ముదామంటే.. అది మరింత దారుణం. అన్నీ ప్రైవేటు చక్కెర కర్మాగారాలే. వారు విదిలించే రేటుకే పంటను కట్టబెట్టాలి. దానికన్నా బెల్లం తయారీయే నయం. కానీ చంద్రబాబు ఇక్కడ పండే బెల్లంపై నల్ల బెల్లం అనే ముద్ర వేసి, ఆంక్షలు విధించి, గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలకే అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాడు. ప్రభుత్వం సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయించి, చెరకు రైతుల వెన్ను విరుస్తోంది. ఈ జిల్లాలో ఉన్న గ్రానైట్ పరిశ్రమదారులదీ దాదాపు ఇలాంటి వ్యథే. బాబు గారు ముఖ్యమంత్రి కాగానే గ్రానైట్‌పై రాయల్టీని, కరెంటు చార్జీలను విపరీతంగా పెంచాడు. దాంతో ఈ పరిశ్రమలన్నీ నష్టాల బాట పట్టాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పంలో మాత్రం రాయల్టీని వెయ్యి రూపాయలు తగ్గించాడు. దీంతో అక్కడ ఆయన బినామీలు, అనుయాయులైన గ్రానైట్ వ్యాపారులు బాగా లబ్ధి పొందుతున్నారు. మిగతా ప్రాంతాల్లోని గ్రానైట్ వ్యాపారులు అదే రేటుకు అమ్ముకుంటే వారికి గిట్టుబాటు కాదు. పోనీ రేటు పెంచుదామనుకుంటే మార్కెట్ ఉండదు.. విధిలేక పరిశ్రమలను మూసివేసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి. ఎంత దారుణం! చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు అనూహ్యంగా రాయితీలు, సడలింపులు ఇవ్వడం సబబేనా? మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు ఏం పాపం చేశాయి? ఎందుకీ వివక్ష? అధికారం ఉందికదా అని ప్రభుత్వ వ్యవస్థలను మీ అనుయాయులకు, మీ బినామీలకు లబ్ధి చేకూర్చేలా మలచుకోవడం ఎంత వరకు సమంజసం? ఇదేనా మీ పారదర్శకమైన సుపరిపాలన? పెనుమూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్.జగన్ -
55వ రోజు పాదయాత్ర డైరీ
-
55వ రోజు పాదయాత్ర డైరీ
55వ రోజు 07–01–2018, ఆదివారం చౌడేపల్లి క్రాస్, చిత్తూరు జిల్లా. తప్పెట్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితులు, హారతులతో బారులు తీరిన అక్కాచెల్లెమ్మలు, నాన్నగారి ప్రతిమలను తలపై ఉంచుకుని నడుస్తున్న అభిమానులు, పార్టీ పతాకాలను చేతబట్టిన కార్యకర్తలు, పలు రకాల వేషధారులు, పౌరాణిక పాత్రధారులతో ఉత్సాహభరితంగా చంద్రగిరి నియోజకవర్గంలో యాత్ర సాగింది. పండుగ వాతావరణాన్ని తలపించింది. ఇక్కడి ప్రజల ఇబ్బందులు, ఈ ప్రాంతంలో నెలకొన్న అనేకానేక సమస్యలు వింటుంటే ముఖ్యమంత్రి సొంత ప్రాంతంలోనే ఇన్ని సమస్యలా.. అని విస్మయం కలిగింది. ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసి’ అన్నారు. అంతేకాదు, పుట్టిన ప్రాంతం కన్నతల్లితో సమానం అంటారు. ఎక్కడెక్కడో ఉన్న ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. సొంత ప్రాంతానికి మంచి చేసే అవకాశం రావడమే అదృష్టం. అటువంటి అవకాశం ఉండి కూడా ఏమీ చేయకపోవడాన్ని ఏమనుకోవాలి? ఈ నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, హాస్పిటల్, చంద్రబాబు చదువుకున్న స్కూలు, మామిడి మార్కెట్టు.. ఇలా చెప్పుకుంటూపోతే అన్నింట్లోనూ సమస్యలే. ముఖ్యమంత్రిగా ఉండి సొంత ప్రాంతానికి ఏమీ చేయని వ్యక్తి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటాడు. ఏ దేశానికి పోతే ఆదేశంలాగా చేస్తానంటాడు. దీన్ని చూస్తుంటే చంద్రబాబుగారి గురించి నాన్నగారు తరచూ చెప్పే సామెత.. ‘అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ గుర్తొచ్చింది. దామలచెరువులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చొక్కా లేకుండా వచ్చిన తాత మాట్లాడాడు. ఆయన పేరు వెంకటాచలంనాయుడు. వేలాది మంది రైతులకు, ఎంతో మంది కార్మికులకు జీవనాధారమైన చిత్తూరులోని విజయా డెయిరీ ఒకప్పటి ప్రాభవాన్ని, సొంత కంపెనీ హెరిటేజ్ ఎదుగుదల కోసం దాన్ని మూత వేయించడానికి చంద్రబాబు పన్నిన కుట్రలను, అది మూతపడటంతో నష్టపోయిన రైతాంగం గురించి, రోడ్డున పడ్డ కార్మిక కుటుంబాల గురించి కళ్లకు కట్టినట్టు వివరించాడు. అంతేకాదు, చంద్రబాబు నిర్వాకంతో రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, అదే సమయంలో ప్రయివేటు చక్కెర ఫ్యాక్టరీలు మాత్రం లాభాలతో విలసిల్లాయని తెలిపాడు. చంద్రబాబుగారి మోసాన్ని, చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ.. విజయా డెయిరీ తిరిగి ప్రారంభమయ్యే దాకా చొక్కా, చెప్పులు ధరించనని శపథం చేశాడట. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తే గాంధేయ మార్గంలో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నాడంటేనే అది చంద్రబాబుకు సిగ్గుచేటయిన విషయం. దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం మరింత దారుణం. మధ్యాహ్నం గుండ్లపల్లి దగ్గర కూడా విజయా డెయిరీ కార్మికులు కలిసి ‘అన్నా.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే డెయిరీని తెరిపించండి.. మమ్మల్ని, రైతుల్ని ఆదుకోండి’ అని విన్నవించారు. మనసుకు చాలా బాధేసింది. కేవలం తన ఒక్కడి స్వార్థం కోసం ఇంతమంది రైతుల, కార్మికుల జీవితాలను బలిచేయడం ఎంత దారుణం. వారందరి ఉసురు పోసుకుని ఏం సాధించాలని! ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంతమంది గుండెల్లో బతికామన్నది ముఖ్యం. చివరిగా, ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పుట్టిన ఊరు, చదువుకున్న స్కూలు బాగోగులు పట్టించుకోని మీరు.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేస్తాననడం హాస్యాస్పదం కాదా? పుదిపట్లబైలు వద్ద వేదవిద్యార్థితో మాట్లాడుతున్న వైఎస్ జగన్ -
4వ రోజు పాదయాత్ర డైరీ
-
3వ రోజు పాదయాత్ర డైరీ
-
ప్రియాంకా చోప్రా రాయని డైరీ
మాధవ్ శింగరాజు ఇండియాపై బెంగ పట్టుకుంది. అమెరికా నాకు కొత్తేం కాదు. టీనేజ్‌లో ఇక్కడే చదువుకున్నాను.. ఆంటీ వాళ్ల ఇంట్లో ఉండి. టీనేజ్‌లో అయినా, ఈ థర్టీఫోర్ ఇయర్స్ ఏజ్‌లో అయినా ఇండియా ఇండియానే. ‘‘ఈ మాట బయటికి అంటే ఉద్యోగాలు పోతాయ్ ఆంటీ’’ అని నవ్వుతూ అంటుంది నా కజిన్ కూతురు. వాళ్ల ఆఫీస్‌లోనూ ఒక హార్వీ వైన్‌స్టీన్ ఉన్నాడట. ‘‘ఏమంటాడు.. ఇండియాను పొగిడితే పింక్ స్లిప్ ఇస్తానంటాడా?’’ అన్నాను. అది నవ్వింది. ‘‘అలా ఏం కాదు ఆంటీ.. పింకీ అంటాడు నన్ను, నా లిప్స్ పింకిష్గా ఉంటాయట. ‘షిట్’ అన్నాన్నేను. ఆ సాయంత్రమే పిలిచి, ‘ఇండియాలో మన బ్రాంచికి అవసరమట. వెళ్తావా?’ అని అడిగాడు. ‘వెళ్లను’ అన్నాను. ‘మరి షిట్ అని ఎందుకన్నావ్?’ అన్నాడు. ‘లిప్స్ జనరల్‌గా పింకిష్గానే కదా సర్ ఉండేది’ అన్నాను. వాడు వదిల్తేనా! ‘నీ లిప్స్ స్పెషల్’ అంటాడు’ అని పడీపడీ నవ్వుతూ చెప్పింది అది. నిన్న యాన్ ఫ్యూలేవైడర్ నన్ను అడిగింది. ‘‘ప్రియాంకా.. మీ కంట్రీలో కూడా ఎవరైనా హార్వీ వైన్‌స్టీన్ ఉన్నాడా’’ అని. యాన్ పెద్ద పత్రికకు చీఫ్ ఎడిటర్. ఫిల్మ్ ప్రొడ్యూసర్ల గురించి ఆమెకు తెలియకుండా పోతుందా? ఔటాఫ్ ఇంట్రెస్ట్.. ఊరికే అడిగి ఉంటుంది. ‘‘టెల్ అజ్ మిస్ ప్రియాంక.. ఇండియాలో మీరు పెద్ద స్టార్ కదా. మీకలాంటి అనుభవాలేమీ లేవా?’’ అని యాన్ మళ్లీ అడిగింది. నవ్వాన్నేను. ‘‘ఏ కంట్రీలోనైనా ఒక్కడే హార్వీ వైన్‌స్టీన్ ఉంటాడని ఎందుకు అనుకుంటున్నారు మిస్ యాన్’’ అన్నాను. అక్కడున్న అమ్మాయిలంతా గలగల నవ్వారు. ఇంటికొచ్చేశాను. అలసటగా ఉంది. ప్రతిచోటా హార్వీ వైస్స్టీన్ టాపిక్కే. మరో ట్రంప్ అయిపోయాడు ఈ హాలీవుడ్ ప్రొడ్యూసర్. ఎందుకిలా పెద్ద పెద్ద మగాళ్లంతా అమ్మాయిల వెంట పడి వేధించుకు తింటారు? ఎందుకంటే పవర్! పవర్లో మగాడు.. ఊరికే చేతికండల్ని చూసుకుని తృప్తి పడే మామూలు మగాడిలా.. తన పవర్‌ని తన చేతికింద ఉన్న అమ్మాయిలకు ఫ్లెక్స్ చేసి చూపించి తృప్తి పడుతుంటాడు. కూర్చోమంటే కూర్చునే అమ్మాయి, నిలుచోమంటే నిలుచునే అమ్మాయి అతడి పవర్ ఇగోని శాటిస్ఫై చేస్తుంది. తనకు లొంగని స్త్రీ కాళ్లు, చేతులు కదలకుండా చేయడానికి మగవాడికి తెలిసిన విద్య.. ఆమె ఉద్యోగాన్ని పోగొట్టడం. ఆమె కెరీర్‌పై దెబ్బ కొట్టడం. అదేనా పవర్! ‘ఎ కిడ్ లైక్ జేక్’ కంప్లీట్ అయింది. ‘ఈజెంట్ ఇట్ రొమాంటిక్’ కంప్లీట్ కావస్తోంది. బ్రేక్ దొరికితే ఇండియాకి వెళ్లి రావాలి. అక్కడా ఇదే అడుగుతారేమో.. హాలీవుడ్లో మీకు చాన్స్‌లు ఇవ్వడం కోసం హార్వీ వైన్స్టీన్లాంటి వాళ్లెవరైనా మిమ్మల్ని కూడా.. అంటూ. చెప్పాలి. అమ్మాయిల్లో పవర్ లేకపోతే కదా, బయటి పవర్లకు లొంగిపోవడం! -
లాలూ ప్రసాద్ యాదవ్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు తినకూడనిదేదో తింటున్నట్లున్నాడు నితీశ్ కుమార్. మోదీ లంచ్‌కి పిలవగానే బిహార్‌లో తను తింటూ ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా వదిలేసి ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేశాడు! సోనియా లంచ్‌కి పిలిస్తే వెళ్లనివాడు, మోదీ లంచ్‌కి పిలవగానే ఆ ఎంగిలిచేత్తోనే వెళ్లిపోయాడు. ‘ఏమయ్యుంటుంది ప్రసాద్’’ అని రఘువంశ్ ప్రసాద్ సింగ్‌ని అడిగాను. ఇలాంటి ప్రశ్నలకు ప్రసాద్ మీసాలతో నవ్వుతాడు. గడ్డంతో నవ్వుతాడు. ముక్కుతో నవ్వుతాడు. కనుబొమలతో నవ్వుతాడు. అంతే తప్ప, నవ్వు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుండి మాత్రం నవ్వడు. ‘‘చెప్పు ప్రసాద్.. శుక్రవారం సోనియాజీ లంచ్‌కి పిలిస్తే వెళ్లకుండా, శనివారం మోదీ లంచ్‌కి పిలిస్తే నితీశ్ ఎందుకు వెళ్లి ఉంటాడు?’’ అని అడిగాను. మళ్లీ అంతకుముందులానే నవ్వాడు ప్రసాద్. ‘‘సోనియాజీ ఇచ్చే లంచ్ కన్నా, పీఎం ఇచ్చే లంచ్ టేస్ట్‌గా ఉంటుందని అనుకుని ఉంటాడు’’ అన్నాడు. ప్రసాద్ సరిగ్గానే గెస్ చేశాడు. మోదీ ఏం చేసినా నితీశ్‌కి నచ్చుతోంది. సర్జికల్ స్రై్టక్లు నచ్చాయి. డీమోనిటైజేషన్ నచ్చింది. నా మీద, నా ఇద్దరు కొడుకుల మీద, నా పెద్ద కూతురు మీద బినామీ ఆస్తుల కేసులు పెట్టడం నచ్చుతోంది. అంటే.. నితీశ్‌కి మోదీజీ ముఖం నచ్చుతోంది! వెంటనే నితీశ్‌కి ఫోన్ చేశాను. ‘‘నా ముఖానికి ఏమయింది నితీశ్! నచ్చలేదా?’’ అని అడిగాను. రిప్లయ్ లేదు. ‘‘నాకు సీట్లు ఎక్కువొచ్చినా, నిన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టాను కదా నితీశ్’’ అన్నాను. రిప్లయ్ లేదు. ‘‘చెప్పు నితీశ్.. మళ్లీ బీజేపీతో టై అప్ అయ్యి, ఎన్డీయేలోకి వెళ్లిపోతావా?’’ అన్నాను. ‘‘సార్ లేరు.. ఢిల్లీ వెళ్లిపోయారు’’ అన్నాడు! ‘‘నిన్ను నువ్వు సార్ అనుకునే స్థాయికి దిగజారిపోయావా నితీశ్!’’ అని అడిగాను. ‘‘నిజంగానే నేను సార్‌ని కాదు సార్’’ అన్నాడు వాడెవడో. చిరాకొచ్చేసింది. ‘‘నువ్వెవరు?’’ అన్నాను. ‘‘సార్ దగ్గర ఉంటాను సార్’’ అన్నాడు! ‘‘ఏమైంది లాలూజీ’’ అంటున్నాడు ప్రసాద్. ‘‘సోనియాజీ ఫోన్ ఎత్తుతుంది. మమతా బెనర్జీ ఫోన్ ఎత్తుతుంది. మాయావతి ఫోన్ ఎత్తుతుంది. అఖిలేశ్ యాదవ్ ఫోన్ ఎత్తుతాడు. చెయ్యను కానీ.. చేస్తే నరేంద్ర మోదీ, అమిత్‌షా కూడా ఫోన్ ఎత్తుతారు. నితీశ్ ఎందుకు ఫోన్ ఎత్తడు ప్రసాద్!’’ అని అడిగాను. ‘‘తింటున్నాడేమో లాలూజీ’’ అన్నాడు ప్రసాద్. కళ్లు మూసుకున్నాను. కనురెప్పల్ని వేళ్లతో అదుముకున్నాను. నిజమే. ఢిల్లీలో ఒక మతవాది, ఒక లౌకికవాది కలిసి కూర్చొని లంచ్ చేస్తున్నారు! మళ్లీ కళ్లు మూసుకుని, మళ్లీ కనురెప్పల్ని వేళ్లతో అదుముకున్నాను. లంచ్ పూర్తయింది. ఇద్దరు మతవాదులు సోంపు నములుకుంటూ డైనింగ్ హాల్లోంచి పెద్దగా నవ్వుకుంటూ బయటికి వస్తున్నారు. -
పాలు.. కరువు!
జిల్లాలో తగ్గిన పాల ఉత్పత్తి - జనాభాకు అనుగుణంగా రోజుకు 10 లక్షల లీటర్లు అవసరం - ప్రస్తుతం 6.75లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి - డెయిరీల్లో పాల పొడి వినియోగం - అతీగతీ లేని ఊరూరా పశుగ్రాసం క్షేత్రాలు - గత నాలుగు నెలల్లో 2లక్షల పాడి పశువుల అమ్మకం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. నీటి సమస్య, పశుగ్రాసం కొరత రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరువులో పశుగ్రాసం కొరతను ఎదుర్కొనేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు రూ.15.66 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేసి పశుగ్రాసం కొరతను నివారిస్తామని అధికారులు 10 నెలల నుంచి హడావుడి చేస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు. పశుసంపదకు అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. డెయిరీ నిర్వాహకులు పాల పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. పాల ఉత్పత్తి తగ్గడంతో ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న పాలలో నాణ్యత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజూ 220 ఎంఎల్ పాలు తీసుకోవాలి. ప్రస్తుత జిల్లా జనాభా 45 లక్షలు. ఈ ప్రకారం రోజుకు దాదాపు 10 లక్షల లీటర్ల పాలు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 6 లక్షల లీటర్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పాల కొరత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. రోజూ పాల ఉత్పత్తి 6.75లక్షల లీటర్లు మాత్రమే.. జిల్లాలో పాడి పశువులు దాదాపు 8.25 లక్షలు. అయితే కరువు ప్రభావంతో గత రెండు నెలల్లో దాదాపు 2లక్షల పాడి పశువులను అమ్మేసినట్లు తెలుస్తోంది. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. పాల ఉత్పత్తి బాగుండాలంటే పచ్చి మేత అవసరం. కానీ పచ్చి మేతకు తీవ్ర కరువు ఏర్పడింది. ఎండు మేత కూడా అందని పరిస్థితి. మనుషులు తాగడానికే నీళ్లు లేవు. ఇక పశువుల దాహార్తి తీర్చలేని రైతులు పాడి పశువులను సైతం సంతలకు తరలిస్తున్నారు. ఇటీవలి కాలంలోనే జిల్లాలో 2లక్షల పాడిపశువుల అమ్మారంటే కరువు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మిగిలిన ఆరు లక్షల పశువుల్లో దాదాపు 4లక్షల పశువులు వట్టి పోయాయి. ప్రస్తుతం పాలిచ్చే పశువులు 2.25 లక్షలు మాత్రమే. వీటిల్లోనూ పచ్చిమేత, నీళ్లు లేకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గింది. సగటును రోజుకు ఒక పాడి పశువు 3 లీటర్ల పాలు మాత్రమే ఇస్తోంది. అంటే రోజుకు జిల్లా వ్యాప్తంగా 6.75 లక్షల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. శీతాకాలం, వానా కాలంలో సగటున ఆరు లీటర్ల వరకు పాల ఉత్పత్తి ఉంటుంది. వేసవి, కరువు ప్రభావం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతోంది. రోజుకు 10 లక్షల లీటర్ల పాలు అవసరం ఉండగా ప్రస్తుతం 6.75 లక్షల లీటర్లు మాత్రమే పాలు ఉత్పత్తి అవుతున్నాయంటే కొరత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. మార్చిలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పాల ఉత్పత్తి ఏ స్థాయికి పడిపోతుందో ఉహించవచ్చు. పాల పొడే శరణ్యం పాల కొరతను ఎదుర్కొనేందుకు డెయిరీల్లో పాల పొడిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందువల్ల పాలకొరత కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో విజయ డెయిరీ కీలకమైనది. ఈ డెయిరీ రోజు 1.20 లక్షల లీటర్లు పాలు సరఫరా చేస్తోంది. పాల మార్కెటింగ్‌లో విజయ డెయిరీది 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంది. మరో 20శాతం మార్కెటింగ్ ఇతర ప్రయివేటు డెయిరీలది. మొత్తంగా 35 శాతం వరకు డెయిరీలు సరఫరా చేస్తుండగా మిగిలినæ 65 శాతం పాలు రైతులు సరఫరా చేస్తున్నారు. రైతుల పాల ఉత్పత్తి తగ్గడం వల్ల డెయిరీ పాలకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ప్రయివేటు డెయిరీలు అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. వసతులు కల్పించడంలో అధికారుల వైఫల్యం గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా పశు సంవర్ధక శాఖ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో నీటితోట్లు ఏర్పాటు చేసి వాటిని ప్రతి రోజు నీటితో నింపాల్సి ఉన్నా 80శాతం గ్రామాల్లో నీటి తోట్లు లేవు. ఉన్న తొట్లలోను నీళ్లులేవు. వరుసగా కరువు వస్తోంది. ఇందువల్ల వేసవిలో నీటి తొట్లు అంటూ అధికారులు హడావుడి చేస్తున్నా కార్యరూపం దాల్చని పరిస్థితి. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమే. గత ఏడాది సైలేజిగడ్డి సబ్సిడీపై పంపిణీ చేసినా ఈ ఏడాది ఆ దిశగా కనీస చర్యలు కరువయ్యాయి. అజొల్లా, మొలకగడ్డి యూనిట్లును పాడి పరిశ్రమ నడిపే వారు వినియోగించుకుంటున్నా.. గ్రామీణ రైతులకు ధర అందుబాటులో లేకపోవడం గమనార్హం. కాగితాలపైనే కొత్త పాడి పశువులు కొత్త పాడి పశువులు కాగితాలపై కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ ఊసే కరువయింది. డీఆర్డీఏ–వెలుగులో సబ్సిడీపై రెండేళ్లుగా వేలాది పాడి పశువులు కొని స్వయం సహాయక సంఘల మహిళలకు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కనిపించట్లేదు. ఇతర జిల్లాల నుంచి గ్రేడెడ్ ముర్రా గేదెలను తెచ్చి పంపిణీ చేయాల్సి ఉన్నా.. స్థానికంగానే ఇతరుల పశువులు చూపి మమ అనిపించినట్లు విమర్శలు ఉన్నాయి. పశుసంవర్ధక శాఖలో గతంలో పశుక్రాంతి పథకం ఉండేది. దీని కింద రైతులకు మేలు జాతి పశువులు పంపిణీ చేసే వారు. వీటికీ ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రస్తుతం క్షీరసాగర్, సునందిని పథకాలు ఉన్నా.. అమలులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉన్న పశువులను కరువు కారణంగా అమ్మేస్తుండటంతో జిల్లాలో పాల ఉత్పత్తి పెరుగకపోగా.. తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వట్టిపోతున్న పాడి
► ఫిబ్రవరిలోనే మొదలైన ఎండలు ► రోజుకు పది నుంచి 15 లక్షల లీటర్ల తగ్గుదల ► వేసవిలో దాదాపు రూ.వెయ్యి కోట్ల నష్టం అంచనా ► పశుగ్రాసం కొరత, అనారోగ్యాలు, డీహైడ్రేషన్ ప్రభావం ► ఆందోళనలో పోషకులు వేసవి వస్తుందంటే చాలు పాడి రైతులు భయపడుతుంటారు. మండే ఎండలు, పచ్చిమేత కొరత, తాగునీరు లేక పోవడం తదితర కారణాలు పాడిగేదెలపై ప్రభావం చూపుతాయి. దీంతో రైతులు మార్చి నుంచి జూలై వరకూ పాలదిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతుంటారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది ఎండలు ఒక నెల ముందుగానే ఫిబ్రవరిలో మొదలవడంతో అప్పుడే పాలు తగ్గుతున్నాయని పోషకులు చెప్తున్నారు. దీంతో ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర రైతులు నష్టపోయే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. చీమకుర్తి రూరల్: ఎండాకాలం ప్రభావం పాల దిగుబడిపై స్పష్టంగా కనిపిస్తుందని పశువైద్యులు, పశుపోషకులు చెప్తున్నారు. జిల్లాలోని 22 లక్షల పశువులపై వేసవి ప్రభావం కనిపిస్తోంది. సాధారణ కాలంలో జిల్లాలో రోజుకు 45 లక్షల లీటర్ల పాలదిగుబడి వస్తుంటే వేసవిలో 30–35 లక్షలకు పడిపోతుంది. పది శాతం వెన్న ఉన్న పాలకు రూ.53లు చెల్లిస్తున్నారు. దాని ప్రకారం వేసవికాలంలో తగ్గుతున్న 15 లక్షల లీటర్లకు దాదాపు రోజుకు రూ.7 కోట్లు తగ్గుదల పశుపోషకులపై పడుతుంది. ఆ లెక్కన నెల రోజులకు కలిపి రూ. 210 కోట్లు నష్టం వస్తునట్లు అంచనా. వేసవి ప్రభావం మార్చి నెల నుంచి జూలై నెల వరకు ఉంటుంది. ఆ లెక్కన 5 నెలల కాలానికి దాదాపు వెయ్యి కోట్లు వరకు పాలదిగుబడిలో ఆదాయం తగ్గిపోతుందని పాలకేంద్రం నిర్వాహకుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పశుగ్రాసం కొరత, అనారోగ్యాల ప్రభావం పాడి పశువులపై వేసవి ఎండలతో పాటు పశుగ్రాసం కొరత, తాగునీటి ఇబ్బంది కారణంగా మురుగు నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు కూడా పాలదిగుబడిపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా గేదె పాలలో వచ్చే వెన్నశాతం 10 ఉంటే లీటరుకు రూ.53, ఆవుపాలలో 3.5 శాతం వెన్న ఉంటే రూ. లీటర్‌కు రూ. 26 వంతున చెల్లిస్తారు. శీతాకాలంలో పాలలో వెన్నశాతం 7–12 శాతం వరకు వస్తోంది. వేసవికాలంలో అది కాస్త 5–8 శాతానికి పడిపోతుంది. వెన్నశాతంతో పాటు ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్) శాతం ఆధారంగా కూడా వెన్నశాతాన్ని నిర్ణయిస్తారు. పాలలో ఎక్కువగా నీళ్లు కలిపితే ఎస్ఎన్ఎఫ్ 9 శాతం కంటే తగ్గిపోతుంది. అలాంటి పాలను పాలకేంద్రం వారు స్వీకరించరు. పశుపోషకులు తీసుకోవాలసిన జాగ్రత్తలు వేసవికాలంలో పాలదిగుబడి తగ్గకుండా ఉండాలంటే పశువులను ఎండలో తిప్పకుండా నీడపట్టున మేపుకోవాలి. దాంతో పాటు కాయజాతికి చెందిన ప్రోటీ¯ŒSలు ఉండేటువంటి పిల్లిపెసర, జనుము, అలసంద వంటి పచ్చిమేతను ఆహారంగా ఇవ్వాలి. అంతేగాని గింజ జాతికి చెందిన సజ్జ, జొన్న రకాలకు చెందిన చొప్పను ఆహారంగా తగ్గించాలి. దాంతో పాటు పశువులను మేపుకోవడానికి తీసుకుపోయినప్పుడు పొలాల్లో అడుగంటిన మురుగు నీరు తాగుకుండా జాగ్రత్తలు వహించాలి. దాని వల్ల లేనిపోని రోగాలు రావడంతో పాలదిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేయటం వల్ల కూడా డీహైడ్రేషన్ ప్రభావం పడుతుంది. పాలు పిండే వేళలు కూడా నిర్ధిష్టవైన షెడ్యూల్‌ను అమలు చేయాలి. ఇలా చేయటం వలన వేసవి పాలదిగుబడి నష్టాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయినా కొంతమేరకు నివారించవచ్చని అధికారులు చెప్తున్నారు. అనారోగ్యం దరిచేరకుండా చూడాలి వేసవికాలంలో సహజంగా పాల దిగుబడిపై ఎండల ప్రభావం ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే దానిని కొంతలో కొంత నివారించవచ్చు. అందులో భాగంగా కాయజాతి దాణా అయిన పిల్లిపెసర, అలసంద, జనుము వంటి ఆహారాన్ని అందించాలి. మురుగు నీరు తాగకుండా క్రమపద్ధతిలో పాలు తీసేందుకు షెడ్యూల్‌ను పాటించాలి. – పారా శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్ -
డెయిరీ.. ఆపసో‘పాలు’!
20 శాతం దాకా తగ్గిన ఉత్పత్తి • అధికమైన తయారీ వ్యయం • ఇటీవలే రేట్లు పెంచిన పాల కంపెనీలు • మరోమారు ధర పెరిగే అవకాశం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాల సరఫరా రోజురోజుకూ తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతోంది. చేస్తున్న వ్యయానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర రాకపోవడంతో పాడి రైతుల ఆసక్తి సన్నగిల్లుతుండడమే ప్రస్తుత పరిస్థితికి కారణం అవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు రుణ లభ్యత క్లిష్టమైంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో పశువులను విక్రయిస్తున్నారు. వచ్చిన సొమ్మును వ్యవసాయంపై ఖర్చు చేస్తున్నారు. ఇంకేముంది పాల డిమాండ్–సరఫరాలో అంతరం అధికమవుతోంది. ఇప్పటికే 20 శాతం దాకా ఉత్పత్తి పడిపోయింది. దీంతో విక్రయ కంపెనీలు పాల రేట్లను పెంచాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోమారు ధరలు పెంచాల్సిందేనని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమూల్, నందిని బ్రాండ్ల రాకతో పాల విపణిలో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. తక్కువ ధరతో ఇవి ఎంట్రీ ఇవ్వడమే కారణం. ఈ బ్రాండ్ల ప్రవేశంతో ఇప్పటికే ఇక్కడ వ్యాపారం సాగిస్తున్న బ్రాండ్లు ధరలను తగ్గించాయి. ఆ తర్వాత పోటీపడి మరీ ఆఫర్లు ఇచ్చాయి. మార్కెట్ స్థిరపడగానే ఒకదాని వెంట ఒకటి తిరిగి రేట్లను పెంచుతూ పోయాయి. తిరిగి ఇటీవలే విజయ బ్రాండ్ లీటరు టోన్డ్ మిల్క్ ధరను రూ.38 నుంచి రూ.40కి చేసింది. నార్ముల్ సైతం రూ.2 పెంచడంతో ధర రూ.40కి చేరింది. తిరుమల పాల ధర రూ.40 నుంచి రూ.42 అయింది. ఇతర కంపెనీలు వీటి బాట పట్టనున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు 28 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంది. ఇందులో 22 లక్షల లీటర్లు ప్యాకెట్లలో అమ్ముడవుతున్నాయి. లాభాలు తగ్గడంతో.. దాణా, పశుగ్రాసం, కూలీ రేట్లు.. ఇలా అన్నీ పెరుగుతూనే ఉన్నాయని నల్లగొండ–రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ యూనియన్ (నార్ముల్) చైర్మన్ జితేందర్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రైతులకు వ్యవసాయమే తొలి ప్రాధాన్యత. ఆ తర్వాతే పాడి. పెద్ద నోట్ల రద్దుతో రైతు వద్ద డబ్బులు లేకుండా పోయాయి. వ్యవసాయానికి ఖర్చు చేయడానికి చిల్లిగవ్వ లేక పశువులను అమ్ముకుంటున్నారు. ఇవన్నీ పాల ఉత్పత్తి తగ్గడానికి కారణమయ్యాయి. నగదు సరఫరా లేక పశువులను కొనేవారూ కొన్ని ప్రాంతాల్లో కరువయ్యారు’ అని అన్నారు. పాల విక్రయ ధర పెరగకపోవడం, రైతుకు చెల్లించే ధరలో మార్పు లేకపోవడంతో కంపెనీల లాభాలు కుచించుకుపోయాయని చెప్పారు. దేశంలో రైతుకు ఒక లీటరుకు అధికంగా రూ.34 చెల్లిస్తున్న కంపెనీ తమదేనని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ మార్కెట్లో పోటీ ఉండడంతో నెట్టుకొచ్చాం. తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంచామని ఆయన వెల్లడించారు. తమ సంస్థ రోజుకు 1,35,000 లీటర్ల పాలను సేకరించేదని, ఇప్పుడు సరఫరా తగ్గడంతో ఇది 1,15,000 లీటర్లకు వచ్చి చేరిందన్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 20 శాతం దాకా సరఫరా తగ్గిందని వెల్లడించారు. కష్టాల్లో రైతన్న.. ‘వ్యయాలు తడిసిమోపెడు అవుతున్నాయి. దాణా ధరలు దిగిరావడం లేదు. ప్రభుత్వం ప్రతి లీటరుకు చెల్లించే రూ.4 ప్రోత్సాహం ఇప్పుడు అందడం లేదు. ఆగస్టు నుంచి ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన మొత్తం బకాయి ఉంది. ప్రైవేటు డెయిరీలు లీటరుకు పాల నాణ్యతనుబట్టి రూ.24–27 చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే సమస్య ఇక్కడి దాకా వచ్చేది కాదు’ అని మహబూబ్‌నగర్ జిల్లా చుక్మాపూర్ రైతు ఎలుక రామకృష్ణారెడ్డి అన్నారు. లీటరుకు రూ.35 వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యయాలకు తగ్గట్టుగా విక్రయ ధర పెరగకపోవడంతో కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతోందని జెర్సీ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ ఎండీ కె.భాస్కర్ రెడ్డి తెలిపారు. పాల సరఫరా తగ్గితే మరోమారు ధరలను సవరించాల్సి వస్తుందని అన్నారు. పాడి రైతులకూ లాభసాటి తగ్గిందని అన్నారు. కొన్ని కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయని గుర్తు చేశారు. పాడి రైతుల విషయంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. -
మీడియాకు చిక్కిన మహేష్ షా డైరీ
కమీషన్ల కోసం కక్కుర్తి పడి కటకటాల పాలైన అహ్మదాబాద్ వ్యాపారి మహేష్ షా డైరీ మీడియాకు చిక్కింది. ఈ డైరీలో ఐడీఎస్ స్కీమ్ కింద మహేష్ షా ప్రకటించిన ఆస్తులు గుజరాత్, మహారాష్ట్ర వ్యాపారులకు చెందినవిగా గుర్తించారు. ఒక శాతం లంచం ఇస్తామనడంతో రూ.13,860 కోట్ల బ్లాక్‌మనీని కేంద్రప్రభుత్వం ఆదాయ డిక్లరేషన్ పథకం కింద తనదిగా మహేష్ షా ప్రకటించాడు. అయితే ఆ బడాబాబులు చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో రూల్స్ ప్రకారం కట్టాల్సిన 45 శాతం పన్నులో తొలి వాయిదా రూ. 1,560 కోట్లను చెల్లించలేక పారిపోయాడు. దీంతో షాపై అనుమానంతో ఐటీ అధికారులు అతని వెతుకులాట ప్రారంభించారు. ఇటీవలే అతన్ని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ అధికారుల విచారణలో ఆ నగదు అతనిది కాదని గుర్తించారు. ఐడీసీ కింద బయటపెట్టిన బ్లాక్‌మనీ అంతా తనది కాదని, అది కొందరు రాజకీయనేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలది షా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అది ఎవరిదో కూడా త్వరలోనే బయటపెడతానని షా పేర్కొన్నాడు. ఈ పరిణామాల అనంతరం షా డైరీ మీడియాకు కంట పడింది. -
అన్నదాతకు కాసుల కష్టాలు
► పరిష్కారం కాని నగదు, చిల్లరి సమస్య ► కొనసాగుతున్న ప్రజల ఇబ్బందులు ► చేతికి డబ్బు అందక అన్నదాతల అవస్థలు ► పాడిరైతులకు అందని బిల్లులు ►విత్‌డ్రా ఆంక్షలతో రూ. 8.50కోట్ల మేర చెల్లింపులకు బ్రేక్ ►నగదు సమస్యతో మందగించిన క్రయవిక్రయాలు ► సరకు విక్రరుుంచుకోలేకపోతున్న మొక్కజొన్న, పత్తి రైతులు ► దళారులు ముందుకు రాక, కొనుగోలు కేంద్రాల్లేక లావాదేవీలు నిల్ పెద్దనోట్ల రద్దు వ్యవహారం అన్నదాతల బతుకును కుంగదీసింది. పండిన పంట అమ్ముకోలేక.. కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపులు లేక పత్తి, మొక్క జొన్న రైతు సతమతమవుతున్నాడు. చేసేది లేక దళారులు కోరిన మొత్తానికి తెగనమ్ముకోవాల్సి వస్తోంది. పాడిరైతులు రోజూ పాలు పోస్తున్నా... విత్‌డ్రాపై ఆంక్షలతో సకాలంలో బిల్లులు అందక పశువుల దాణా కొనుగోలు చేయలేక.. ఇంటి ఖర్చులు గడవక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఏ రైతును కదిపినా... రోజువారీ ఖర్చులకు తామెంత అవస్థలు పడుతోందీ వేదనతో... కన్నీటి రోదనతో చెబుతున్నాడు. అలా సర్దుకుపోతున్నారు.. విజయనగరం గంటస్తంభం: పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన సమస్య ఇంకా కొనసాగుతోంది. బ్యాంకుల్లో నగదు లేకపోవడం, ఏటీఎంలో రాకపోవడంతో ప్రజలకు సర్దుకుపోవడం మినహా మరో గత్యంతరం కనిపించడం లేదు. పన్నెండురోజులైనా జిల్లాలో సమస్యలు అలాగే ఉన్నారుు. సోమవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. బ్యాంకుల్లో వారానికి రూ. 24వేలు నగదు, ఏటీఎంల్లో రూ. 2వేలు మాత్రమే ఉపసంహరణ చేసుకునే పరిస్థితి ఉండడంతో జనం ఆమాత్రం సొమ్ముతోనే సరిపెట్టుకున్నారు. నగదు లేక ఇబ్బంది ఇదిలాఉంటే ఆ మాత్రం సొమ్ము కూడా కొన్ని బ్యాంకుల్లో లభించడంలేదు. జిల్లాలో సోమవారం చాలా బ్యాంకులు నగదు కొరతతో పూర్తిస్థారుులో సేవలందించలేకపోయారుు. నగదు జిల్లాకు వస్తుందని అధికారులు చెప్పినా సోమవారం లావాదేవీలకు అందుబాటులోకి రాలేదు. కొన్ని బ్యాంకుల్లో రోజంతా విత్‌డ్రాలకు అవకాశం ఉండగా మరికొన్ని బ్యాంకులు ఆ రోజు వచ్చిన డిపాజిట్ల ధర, బిల్లు ఎప్పుడిస్తారో భరోసా లేకుండా ఉన్న పళంగా పంటను అమ్ముకున్నారు. వీరే కాదు మొక్కజొన్న, ధాన్యం రైతులు కూడా పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నారు. విత్‌డ్రా ఆంక్షలు ఉండటం, దళారుల దగ్గర నగదు లేకపోవడం, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య దళారుల గొంతెమ్మ కోర్కెలెక్కువవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం డివిజన్లో మొక్కజొన్న, ప్రత్తి సాగు రైతులు ఎక్కువగా ఉన్నారు. వారంతా పండిన పంటను ఏం చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ వరి సీజన్ ముందు కావడంతో ఇప్పటికే ధాన్యం గింజలు చేతికొచ్చేసారుు. ఇప్పుడవి అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లేక, నోట్లు రద్దుతో దళారులు మొండికేయడం వంటి పరిస్థితుల మధ్య రైతన్నలు నష్టపోతున్నారు. మొన్నటి వరకు క్వింటా ప్రత్తి ధర రూ. 4,800ఉండగా దళారుల ఇష్టారాజ్యంతో ఇప్పుడది రూ. 4,300కి పడిపోరుుంది. అలాగే, క్వింటా మొక్కజొన్న రూ. 1350వరకు ఉండగా ఇప్పుడది రూ. 1100కి పడిపోరుుంది. పాడి రైతులపై తీవ్ర ప్రభావం పెద్ద నోట్ల రద్దు పాడి రెతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరికి నోట్ల కష్టాలు తప్పడం లేదు. 15రోజులుగా బిల్లులు అందకపోవడంతో కుటుంబాలను నెట్టుకు రాలేకపోతున్నారు. ఒకవైపు కుటుంబాన్ని పోషించుకోలేక, మరోవైపు పశువులకు దాణా కొనుగోలు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 79వేల మంది పాడి రైతులు వివిధ పాలకేంద్రాలకు పాలు సరఫరా చేస్తున్నారు. 15రోజులకు 2లక్షల 46వేల లీటర్ల పాలు పోస్తున్నారు. వీరికి 15రోజుల కొకసారి రూ. 8కోట్ల 50లక్షల మేర బిల్లులు చెల్లిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో వీరికి చెల్లింపులు నిలిచిపోయారుు. విత్‌డ్రాపై ఆంక్షల ప్రభావం చెల్లింపులపై పడింది. సాధారణంగా సొసైటీ కార్యదర్శులు బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసి, సొసైటీల వద్ద రైతులకు చెల్లిస్తారు. ఇప్పుడా బ్యాంకుల వద్ద నగదు విత్‌డ్రాపై ఆంక్షలుండటంతో కార్యదర్శులు నగదు డ్రా చేయలేకపోతున్నారు. పాడి రైతులకు చెల్లించలేకపోతున్నారు. ప్రస్తుతానికి రూ. 8.5కోట్ల మేర బిల్లులు అందక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించలేకపోవడంతో పాటు ఉపాధిగా మారిన పాడి పశువులకు దాణా కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. డెయిరీల వారీగా లావాదేవీలివి డెయిరీ సొసైటీలో వేసే పాలు(లీ) 15రోజులకు రైతులు చెల్లించాల్సినది (రూ.) విశాఖ 58,950 1,82,000 రూ. 6.28కోట్లు హెరిటేజ్ 24వేలు 6,700 రూ. 79.20లక్షలు తిరుమల 4800 15వేలు రూ. 52.14లక్షలు జెర్సీ 3,940 12,800 రూ. 42.24లక్షలు సిటీమిల్క్ 2600 8వేలు రూ. 26.40లక్షలు సుప్రజ 1100 4,200 రూ. 13.23లక్షలు -
నాలుగు తరాలు..
బంజారాహిల్స్: ఇది చాలాకాలం కిందటి సంఘటన.. ఓ వ్యక్తికి డైరీ రాసే అలవాటుంది. దానిలో తన అనుభవాలను రాసుకున్నాడు. దానిని తన చివరి కాలంలో కొడుకుకు ఇచ్చాడు. అనంతరం ఆ డైరీ ఆ కొడుకు నుంచి కూతురు వద్దకు చేరింది. అనంతరం ఆ డైరీలోనిక విశేషాలను ఆమె తమ ఇద్దరు కూతుళ్లకు చెప్పింది. దాంతో ఆ ఇద్దరూ ఆ పుస్తకంలోని వింతలు, విశేషాలు తెలుసుకునేందుకు బయలుదేరారు. అలా పర్యటిస్తూ ఫ్రాన్స్ లోని సెయిన్ నదీతీరం నుంచి నుంచి మూసీ నది తీరానికి వచ్చారు. ఇక్కడి తమ పూర్వికుల మూలాలు తెలుసుకుని మురిసిపోయారు. దశాబ్దాల వెనక్కు వెళ్లి తాత, ముత్తాతల జ్ఞాపకాలను డైరీ ఆధారంగా ఆనాటి సంఘటనలు గుర్తించి ఆనందించారు. హాలీవుడ్ అడ్వంచర్ సినిమాను తలపిస్తున్న ఈ కథాకమామీషు ‘సాక్షి సండే స్పెషల్’... బంధాలు దూరమై.. అనుబంధాలు మాయమవుతున్న కాలం ఇది. కానీ తమ పూర్వికులు నివశించిన ప్రాంతానికి చూడాలని, వారి విశేషాలు తెలుసుకోవాలని పాశ్చాత్య సంస్కృతికి, ఫ్యాషన్ కు నెలవైన ఫ్రాన్స్ దేశం నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మూలాలు వెతుక్కుంటూ నగరానికి వచ్చారు. సౌత్ ఫ్రాన్స్ లో నివసించే క్రిస్టెన్ హోవే (25), కమిలా(25) ఇద్దరు కవలలు.. ఇక్కడ తమ ముత్తాత, తాత నివసించిన ప్రాంతాలను సందర్శించి, అప్పటి ఫొటోలను చూసి మురిసిపోయారు. వారిని పలకరించిన ‘సాక్షి’తో తమ అనుభవాలు పంచుకున్నారు. క్రిస్టెన్ సోషల్ ఆంథ్రోపాలజీ చదవగా, కమిలా ఆర్ట్స్ అండ్ ఫొటోగ్రఫీలో డిప్లొమా చేసింది. ఇద్దరికీ చదువుతో పాటు పర్వతారోహణం అంటే ఎంతో ఇష్టం. ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడ పర్వతారోహణతో పాటు చరిత్రను చదువుకున్నారు. ఇండియాలో కూడా పర్యటించాలని తలపెట్టినప్పుడు వీరి తల్లి కేట్ కొన్ని ఆసక్తికర విషయాలను వీరికి చెప్పింది. వీరి ముత్తాత థియోడర్ టస్కర్ హైదరాబాద్ రాష్ట్రానికి 1927 నుంచి 1943 వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూగా పనిచేశారని.. తన భార్య జెఫీ టస్కర్‌తో కలిసి ఆదర్శనగర్ పక్కనున్న ‘హిల్‌ఫోర్ట్ ప్యాలెస్’ (ఇప్పటి రిడ్జ్ హోటల్)లో ఉండేవారని ఆధారాలతో సహా అందజేసింది. దీంతో తమ పూర్వికులు నివశించిన నగరాన్ని చూడాలన్న కోరికతో ఈ అక్కాచెల్లెళ్లు ఈనెల 7న సిటీకి వచ్చారు. ఇప్పుడున్న రిడ్జ్ హోటల్‌ను సందర్శించారు. ఇక్కడ తమ ముత్తాత 17 సంవత్సరాల పాటు నివాసంగా ఉన్నారట. అదే సమయంలో కౌన్సిల్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్‌లో కూడా ఆయన పని చేశారని వెల్లడించారు. కొడైకెనాల్లో పుట్టిపెరిగిన టస్కర్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు హ్యారీ టస్కర్ అనే కొడుకు హైదరాబాద్‌లోనే జన్మించాడు. హ్యారీ కూతురు కేట్ కాగా కేట్ పిల్లలే క్రిస్టెన్, కమిలా. ఇక్కడ టస్కర్ పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు జూబ్లిహాల్లో జరిగిన కార్యక్రమంలో ’సర్’ బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసింది. చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించినప్పుడు తన ముత్తాత భార్య జెఫీ ఫొటోను ప్రిన్సెస్ నిలోఫర్ పక్కన చూశామని వీరు చెప్పారు. తమ ముత్తాత ప్రతి విషయాన్ని డైరీలో రాసేవారని.. ఆ డైరీని తన తాత హ్యారీకి ఇవ్వగా.. హ్యారీ చనిపోయే ముందు ఆ డైరీని తమ తల్లి కేట్కు ఇచ్చారని.. దాని ద్వారా తమకు హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం తెలిసిందన్నారు. హైదరాబాద్‌లో తమ మూలాలు ఉన్నాయని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డామని మురిసిపోయారు. సౌత్ ఫ్రాన్స్ లో నివశిస్తున్న వీరు ప్రస్తుతం ఫిమేల్ అడ్వెంచర్స్పై డాక్యుమెంటరీ తీసే పనిలో ఉన్నారు. రాక్ క్లైంబింగ్పై ఆసక్తి ఉన్న నగరానికి చెందిన గచ్చిబౌలి వాసి రిత్విక్‌రెడ్డి నివాసంలో వీరు బసచేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వీరు పలు గుట్టలను కూడా ఎక్కి సరదా తీర్చుకున్నారు. శనివారం నగర పర్యటన అనంతరం తన ముత్తాత పుట్టి పెరిగిన కొడైకెనాల్‌కు వెళ్లారు. అక్కడ కూడా జ్ఞాపకాలను నెమరువేసుకంటామని వెల్లడించారు. ఇది మరిచిపోలోని ఘటన మా ముత్తాతకున్న డైరీ రాసుకునే అలవాటు మాకెంతగానో సహాయపడింది. ఎందుకంటే ఆయన రాసిన డైరీ వల్లనే హైదరాబాద్‌తో మాకున్న అనుబంధాన్ని తెలుసుకోగలిగాం. ఇక్కడ 30 సంవత్సరాల పాటు మా ముత్తాత, తాత నివసించినట్లు తెలిసింది. ఆయన నివాసిత ప్రాంతాన్ని సందర్శించడం జీవితంలో మరిచిపోలేం. – క్రిస్టెన్ హోవే సీటీతో ఎక్కువ అనుబంధం మా పూర్వికులు నివసించిన ప్రాంతాలను సందర్శించడం తియ్యని జ్ఞాపకం. ఇందుకోసమే మేము కష్టపడి ఫ్రాన్స్ నుంచి వచ్చాము. మా ముత్తాత కాలం నుంచి నివాసిత ప్రాంతాలను అనుసంధానిస్తూ ఒక డాక్యుమెంట్‌ను తీస్తున్నాం. హైదరాబాద్‌తోనే ఎక్కువగా అనుబంధం ఉంది. ఇక్కడ తాత, ముత్తాతకు సంబంధించిన ఎన్నో ఫొటోలు భద్రంగా ఉంచారు. మా అమ్మ కూడా చిన్నతనంలో ఇక్కడ విశేషాలను తెలుసుకుంది. – కమిలా -
జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటు
– పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ బనగానపల్లె రూరల్: జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని పాతపాడు గ్రామంలో డ్వాక్రా మహిళతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలదిగుబడిని పెంచేందుకు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో మినీ డెయిరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్క మహిళా రైతుకు ఐదు గేదెల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద పశువుల హాస్టల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గేదెల కొనుగోలుకు ఆసక్తి ఉన్న మహిళలు 25 శాతం వాటా చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీఆర్డీఎ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. మాదసుపల్లె, పాతపాడు గ్రామాల్లో పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను వారు పరిశీలించారు. డీఆర్డీఏ ఏపీవో డాక్టర్ అచ్చన్న, తహసీల్దార్ అనురాధ, ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీను, గ్రామ సర్పంచ్ పాపారాయుడు తదితర వెలుగు సీసీలు పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిలో ఇందూరే నెంబర్‌వన్
లింగంపల్లి (సదాశివనగర్): పాల ఉత్పత్తిలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని విజయ డెయిరీ జిల్లా జనరల్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 38 వేల క్వింటాళ్ల పశుగ్రాసం విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆదివారం మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల పాల కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పాల ఉత్పత్తిలో ఇందూరు మొదటి స్థానంలో ఉందని.. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి జిల్లాకు 1.14 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. జిల్లాలో 14,158 మంది పాడి రైతులు ఉన్నారని, 323 పాల కేంద్రాలు పని చేస్తున్నాయని, రోజూ 65 వేల లీటర్ల పాల సేకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లింగంపల్లిలో దాణా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు జీఎంకు విన్నవించారు. సదాశివనగర్ బీఎంసీ మేనేజర్ బాల్‌రెడ్డి, పాల కేంద్రం అధ్యక్షుడు రాములు, కామారెడ్డి డెయిరీ మేనేజర్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. -
విక్రమ్ భట్ రాయని డైరీ
నేనెప్పుడూ దేవుణ్ణి చూడలేదు. అయినా దేవుణ్ణి నమ్ముతాను! దెయ్యాన్ని కూడా చూడలేదు. అయినా దెయ్యాన్నీ నమ్ముతాను. కనిపించని దేవుణ్ణి, కనిపించని దెయ్యాన్ని నమ్ముతున్నప్పుడు... కళ్లెదుట ఇంత ప్రేమను పెట్టుకుని, ఆ ప్రేమలో నేను ఎందుకని నమ్మకంగా నిలబడలేకపోతున్నాను?! ప్రతి స్త్రీలోనూ నాకు ప్రేమే కనిపిస్తుంది. స్త్రీ నవ్వులో, స్త్రీ చూపులో, స్త్రీ మాటలో, స్త్రీ కోపంలో, స్త్రీ ద్వేషంలో కూడా ప్రేమే! స్త్రీలోని అన్ని ప్రేమల్నీ నేను ఫీల్ అవుతాను. కానీ స్త్రీలోని ఏ ఒక్క ప్రేమలోనూ ఉండిపోలేను! స్త్రీలో నాకు కనిపిస్తున్న ప్రేమలో దేవుడు, దెయ్యం అనే రెండు పార్ట్లు కనుక ఉన్నట్లయితే, బహుశా దెయ్యం పార్ట్ నేనై ఉంటాను. అందుకే స్త్రీ ప్రేమలో నేను ఎక్కువసేపు ఉండలేను. దేవుడున్న చోట దెయ్యం ఉండలేదు కదా. అలానేమో! ‘‘ఇంకా నిద్రపోలేదా డాడీ...’’ అంటూ వచ్చింది కృష్ణ. నా కూతురు! తను అచ్చంగా నాలాగే ఉంటుంది. తన కళ్లు నా కళ్లలాగే ఉంటాయి. అదితి మా ఇద్దర్నీ ఎప్పుడైనా కలవడానికి వచ్చివెళుతుంది. నా భార్య, నా చైల్డ్‌హుడ్ స్వీట్హార్ట్ అదితి. నా మీద కోపంతో కూతుర్నీ కాదనుకుని వెళ్లిపోయింది. ‘‘అమ్మ గుర్తొస్తోందా డాడీ?’’... కృష్ణ అడిగింది. తనకు అమ్మ గుర్తుకొచ్చిన ప్రతిసారీ ‘అమ్మ గుర్తొస్తోందా డాడీ’ అని నన్ను అడగడానికి వస్తుంది. ‘‘అవున్రా... ’’ అని చెప్పాను. అబద్ధం చెప్పాను. నిజానికి అదితి ఒక్కటే నాకు గుర్తుకు రావడం లేదు. సుస్మిత, అమీషా కూడా గుర్తొస్తున్నారు. అంతరాత్రప్పుడు ఏ స్మృతీ, ఏ సందర్భమూ లేకుండా నా పూర్వపు స్త్రీమూర్తులంద రి ఔన్నత్యాన్నీ గుర్తు చేసుకుంటూ దిగులు మొహం వేసుకుని కూర్చున్నాను. గుడ్‌నైట్ చెప్పి వెళ్లింది కృష్ణ. గుడ్‌నైట్ అనే మాటంటే నాకు భయం. అది నాకు ‘గుడ్‌బై’ లా వినిపిస్తుంది. అదితి నాకు గుడ్‌బై చెప్పి వెళుతున్నప్పుడు ఇదిగో... ఈ ఆరో అంతస్తులోంచే కిందికి దూకి చచ్చిపోదామనిపించింది. కానీ బతికాను. చావు ఆలోచన నుంచి స్త్రీ ప్రేమే నన్ను బతికించిందేమో! అది అదితిపై ప్రేమా, ఇంకే స్త్రీ మీదనైనా ప్రేమా అన్నది చెప్పలేను. ‘‘ఎందుకు విక్రమ్.. బయటి స్త్రీల ప్రేమ కోసం అంతగా వెంపర్లాడుతుంటావ్?’’ అని అడిగేది అదితి. ఏం చెప్పను? చెబితే, ‘నేను వాళ్లతో ఉన్నప్పుడు నువ్వు కూడా నాకు బయటి స్త్రీ లాగే కనిపిస్తావ్’ అని చెప్పాలి. చెప్పలేను. దాచేస్తాను. ఒక స్త్రీ దగ్గర ఇంకో స్త్రీని దాచేస్తాను. ఆ గిల్ట్ నన్ను తినేస్తుంది. ఆ దాపరికం నన్ను ఒంటరిని చేస్తుంది. ప్రేమించిన స్త్రీని హర్ట్ చెయ్యడమంత హీనత్వం లేదు మగజన్మకు. నా లైఫ్‌ని రీబూట్ చేసుకునే అవకాశమే వస్తే... క్షమించమని నేను వేడుకోవలసిన స్త్రీలు ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉంటారేమో.. నా గత జన్మలనుంచి కూడా! మాధవ్ శింగరాజు -
పట్టభద్రులు... పాడి రైతులు
పొట్టనింపని పీజీ, డిగ్రీ పట్టాలు పాడితో ముందడుగు వేస్తున్న యువత హుస్నాబాద్: ‘ఉద్యోగం పురుష లక్షణం..’ అన్నది పెద్దల మాట. అయితే ఉన్నత చదువులు చదివి.. చేతిలో డిగ్రీ పట్టాలు ఉన్నా కనీసం ప్రైవేట్ ఉద్యోగం దొరకని పరిస్థితి. అయితే కొలువు కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఆలోచించారు. కుటుంబపోషణకు పాడిపరిశ్రమను ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు హుస్నాబాద్ మండలం మల్లంపల్లికి చెందిన యువకులు. ఆర్థికంగా నిలదొక్కుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీజీ, డిగ్రీ పట్టాలందుకున్న నిరుద్యోగ యువకులు పాడిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. మండలంలోని మల్లంపల్లికి చెందిన మ్యాక సంపత్(ఎమ్మెస్సీ, బీఈడీ), గూళ్ల రంజిత్ కుమార్(బీఏ, బీఈడీ), గిరిమల్ల రాజు(బీఎస్సీ), ఆల్ల మల్లేష్ (బీఏ,బీఈడీ), పిరిశెట్టి జయంత్‌కుమార్ (ఎమ్మెస్సీ, బీఈడీ), ఎండీ.సాదిక్ (బీఏ), కందారపు సతీశ్(బీఏ), వేముల శ్యాం(బీఏ)తోపాటు దాదాపు మరో 10మంది నిరుద్యోగులు పట్టభద్రులై పాడిపరిశ్రమతో కుటుంబపోషణ సాగిస్తున్నారు. వీరి కుటుంబ నేపథ్యమంతా వ్యవసాయమే. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు రాకపోవడంతో కుటుంబపోషణ కష్టసాధ్యంగా మారింది. చదివినా ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి దిక్కైంది. ఉన్నతచదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో దిగాలు చెందక గేదేలు, ఆవులను పెంచిపోషించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువకులు. ఉద్యోగాలు దొరకకా.. –మ్యాక సంపత్, ఎమ్మెస్సీ, బీఈడీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. మేము ఉన్నత ఉద్యోగాలు చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. తీరా పీజీ పట్టా సాధించిన నిరుద్యోగిగా మారిన. తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఆర్థిక భారం మీద పడింది. ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో మూడుగేదెలు కొన్నా. పాలతో రోజుకు రూ.300 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కుటుంబ పోషణ భారమై... –గూళ్ల రంజిత్ కుమార్, బీఏ, బీఈడీ ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో కుటుంబపోషణ భారమైంది. డిగ్రీ పట్టా పట్టుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ప్రైవేట్ ఉద్యోగం సైతం దొరకలేదు. దీంతో నాలుగు గేదెలను కొనుగోలు చేసి పాడిని అభివృద్ధి చేస్తున్నా. రోజుకు 8 లీటర్ల పాలు డెయిరీలో పోస్తున్నా. రోజుకు రూ.400 వస్తున్నాయి. పాల ద్వారా ఉపాధి.. –గిరిమల్ల రాజు, బీఎస్సీ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయా. అన్నయ్య, అక్కయ్య ప్రోద్బలంతో డిగ్రీ వరకు చదువుకున్నా. పై చదువులు చదువుదామంటే ఆర్థిక స్థోమత లేక ఫుల్స్టాప్ పెట్టా. డిగ్రీ పట్టాతో ఏదైనా ఉద్యోగం చేయాలని తిరిగినా. అయినా దొరకక ఇబ్బందులకు గురయ్యా. పాల ద్వారా ఉపాధి దొరుకుతుందని ఆశించి మూడు ఆవులను కొనుగోలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నా. పాలద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న. -
ఇది డైరీ కథ!
డీజీపీ పదవికే ఎసరు పెట్టిన వైనం సచివాలయంలో రసవత్తర చర్చ సాక్షి ప్రతినిధి, చెన్నై: అత్యంత ప్రముఖుల జీవితాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల వెనుక ఆసక్తికరమైన విషయాలు దా గి ఉంటాయని మాజీ డీజీపీ అశోక్‌కుమార్ విషయంలో మరోసారి రుజువైంది. కీలకమైన ఒక డైరీ వ్యవహారమే ఆయన నిష్ర్కమణకు దారితీసినట్లు తెలుస్తోంది. సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర చెన్నైలో పాన్, గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయనే సమాచారాన్ని అందుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇటీవల ఆకస్మికదాడులు నిర్వహించారు. మాధవరావు, శ్రీనివాసరావు అనే సోదరులకు చెందిన గిడ్డంగుల నుంచి కోట్ల రూపాయల విలువైన సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సమయంలో రావు సోదరుల నుంచి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో అప్పటి చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న జార్జ్ పేరు మొదలుకుని సచివాలయంలోని పలువురి అధికారులకు చెల్లిస్తున్న ‘కప్పం’ లెక్కల వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఎంతో కీలకమైన ఈ డైరీ ఆదాయపు పన్నుశాఖ అధికారుల చేతికి చిక్కడం కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు పుట్టించి హాట్ టాపిక్‌గా మారింది. అంతేగాక అమ్మ సామ్రాజ్యానికి కొందరు అధికారులను దూరంగా పెట్టి ఏకాకిగా మారుస్తున్న గార్డెన్‌కు చెందిన అధికారుల పేర్లు కూడా డైరీలో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి నెలకు రూ.20 లక్షల ‘కప్పం’ కడుతున్నట్లు డైరీలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అనాడు పోలీస్ కమిషనర్‌గా ఉండిన జార్జ్‌కు గార్డెన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నందున డీజీపీ అశోక్‌కుమార్ ఆదేశాలను ఖాతరు చేయలేదని తెలుస్తోంది. అయితే అదనుకోసం వేచిఉన్న అశోక్‌కుమార్ ఎట్టకేలకూ కమిషనర్ బాధ్యతల నుంచి జార్జ్‌ను తప్పించి టీకే రాజేంద్రన్‌ను నియమించగలిగారు. కమిషనర్ బాధ్యతల్లో లేకున్నా గార్డెన్ సంబంధాలను జార్జ్ కొనసాగించగలిగారు. తనంటే లెక్కచేయని జార్జ్ తదితర అధికారులను గుప్పిట్లో ఉంచుకునేందుకు సదరు డైరీని చేజిక్కించుకోవాలని అశోక్‌కుమార్ పథకం పన్నారు. డైరీలోని వివరాలతో ఒక నకలును ఆదాయపు పన్నుశాఖాధికారుల నుంచి సంపాదించాల్సిందిగా సీబీఐలో ఉన్న ఒక ఉన్నతాధికారిని అశోక్‌కుమార్ ఆదేశించారు. సదరు అధికారి ఆదాయపు పన్నుశాఖ అధికారుల వద్దకు స్వయంగా వెళ్లి కోరగాతమ వద్ద ఉన్న డైరీ నుంచి నక ళ్లను ఇవ్వడం కుదరదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా గార్డెన్‌కు చెందిన సచివాలయ అధికారుల బృందం చెవినపడింది. అశోక్‌కుమార్ సదరు డైరీ నకళ్లను సంపాదించి డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి ఇచ్చే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి జయలలితకు గార్డెన్ అధికారులు ఫిర్యాదులు మోసారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కరుణానిధిని డీజీపీ అశోక్‌కుమార్ కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిణామంతో జయలలిత మరింతగా మండిపడ్డారు. తన పట్ల జయ అగ్రహంతో ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న అశోక్‌కుమార్ ఇక పదవిలో ఉండడం సాధ్యం కాదని తెలుసుకుని రాత్రికి రాత్రే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) నిర్ణయం తీసుకున్నారు. అశోక్‌కుమార్‌ను డీజీపీ పదవి నుంచి సాగనంపేందుకు ఇదే సమయమని భావించి జయలలిత సైతం వీఆర్ఎస్కు ఆమోదముద్ర వేయడంతో రాత్రికి రాత్రే ఆయన ఆఫీసును వదిలి వెళ్లిపోయారు. డీజీపీ స్థాయి అధికారి పదవీ విరమణ పొందినపుడు ప్రొటోకాల్ ప్రకారం ఇతర అధికారులందరూ కలిసి ఇవ్వాల్సిన ఘనమైన వీడ్కోలు స్వీకరించకుండానే అశోక్‌కుమార్ నిష్ర్కమించాల్సి వచ్చింది. -
నయీం డైరీలో ఏముందో..?
– ఎవరి నోట విన్నా అదే చర్చ – ఫిర్యాదు చేస్తే భూములు వస్తాయా భువనగిరి : పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందిన నయీం డైరీలో ఏముందోనన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. నయీం కేసును సిట్‌కు అప్పగించిన నేపథ్యంలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయకున్నా, పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా నయీం ముఠాలకు సహకరిస్తూ అతని దందాల్లో సహకరించిన అధికారులు,ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, విలేకరులు, ఇలా పలువురి పేర్లు ఉన్నాయన్న సమాచారం డైరీలో ఉందని వస్తున్న వార్తలు అన్ని వర్గాల్లో అసక్తిని రేకిస్తోంది. డైరీలో పేర్లు ఉన్నందున అతని దందాలతో సంబంధం ఉన్న వారంతా వెలుగులోకి రావడం ఖాయం. డైరీలో ఉన్న పేర్లు ఎవరివై ఉంటాయన్నా చర్చ జరుగుతోంది. మా భూములు మాకు వస్తాయా .. నయీం బెదిరింపులతో భూములు కోల్పోయిన బాధితులు మా భూములు మాకు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, వలిగొండ,బీబీనగర్, బొమ్మలరామారం ఇలా పలు మండలాల్లో కోట్ల రూపాయల విలువచేసే భూములను బెదిరించి నయీమ్ం తక్కువ ధరకు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాము నష్టపోయిన భూములు తమకు ప్రభుత్వం ఇప్పిస్తుందా అన్న కోణంలో బాధితులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాలా ఎవరికి చేయాలి అన్న మీమాంసలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో బుధవారం కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఫిర్యాదు దారులు తమ పేర్లు బయటపెట్ట వద్దని కోరుతున్నట్లు సమాచారం. మరో వైపు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. గుట్టుగా సాగుతున్న విచారణ మరో వైపు నయీం ముఠాతో వివిధ వర్గాలకు ఉన్న సంబంధాలపై గుట్టుగా విచారణ సాగుతోంది. ఇప్పటికే భువనగిరి, వలిగొండల్లో అక్రమ అయుధాలు కలిగిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం అనుచరులు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఇప్పటికే పోలీసుల వద్ద ఉంది. దీంతోపాటు ఎవరెవరు అతనికి సహకరించారన్న విషయంలో పోలీసులు దృష్టి సారించారు. భూములు, డబ్బుల విషయంలో ఎక్కువ దందా నడవడంతో అందులో సంబంధం ఉన్నవారెవరన్న విషయంపై విచారణ అత్యంత గోప్యంగా జరుగుతోంది. -
నయీం డైరీల్లో కీలక వివరాలు
హైదరాబాద్: ఎన్కౌంటర్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. డబ్బు, బంగారం, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వందల సంఖ్యలో బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్బుక్లతో పాటు నయీం డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు శంషాబాద్ డీసీపీ చెప్పారు. ల్యాండ్ సెటిల్మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని తెలిపారు. నయీం తనకుతానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు చెప్పారు. బలవంతపు వసూళ్ల వివరాలను నయీం డైరీలో రాసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఇచ్చినది, ఖర్చు చేసిన వివరాలు డైరీలో ఉన్నాయని చెప్పారు. నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని తెలిపారు. షెల్టర్లు, డెన్లకు సంబంధించిన తాళాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నయీం టార్గెట్ చేసిన ధనవంతుల వివరాలను డైరీలో రాశాడని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నయీం బంధువులు, అనుచరులు ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. -
పాడిని పెంచి...కరువును తరిమి
లాభాల బాటలో ‘మిల్క్’నూర్ స్వకృషి డెయిరీ రూ. 88కోట్లతో వ్యాపారం నేడు 14వ మహాసభ భీమదేవరపల్లి: ఓ వైపు అనావృష్టి వెంటాడగా మరో వైపు అప్పుల బాధ తీవ్రమైంది. గత్యంతరం లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దైనందిన రోజులవి. మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేక వర్షాలు సక్రమంగా కురవక గ్రామల ప్రజలు కరువుతో అల్లాడిపోయారు. కుటుంబాల్లో దర్భర పరిస్థితులు చూసిన మహిళలు మొక్కవోని ధైర్యంతో ముందడుగువేశారు. పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పైసా పైసా కూడబెట్టుకొని సమష్టిగా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. క్రమక్రమంగా గ్రామాల్లో సంఘాలను విస్తరించుకొని పొదుపు ద్వారా కూడబెట్టుకున్న డబ్బులతోనే ముల్కనూర్ మహిళ స్వకృషి డెయిరీని ఏర్పాటు చేసుకున్నారు. నేడు ఆ డెయిరీ లాభాసాటిగా వ్యాపారం సాగిస్తూ అనేక కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారింది. మండలంలో ముల్కనూర్ స్వకృషి స్థాపించి 13 ఏళ్ళు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగిడుతున్న తరుణంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రారంభం... కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 72 గ్రామాల్లో 6 వేల మంది సభ్యులు రూ.7 కోట్లతో మండలంలోని ముల్కనూర్‌లో 2002 ఆగస్టు 17న మహిళ స్వకృషి డెయిరీ ప్రారంభించారు. క్రమంగా వ్యాపారం విస్తరించడంతో ప్రస్తుతం 131 గ్రామాల్లో 21 వేల సభ్యులతో రూ.88 కోట్ల వ్యాపారం చేస్తూ లాభాల బాటలో డెయిరీ పయనిస్తుంది. ప్రతి రోజు సంఘాల నుంచి 45 వేల పై చిలుకు లీటర్ల పాలను సేకరిస్తూ 22 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. అవినీతికి చెక్... అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి గ్రామంలోని పాల సంఘాన్ని కంప్యూటరీకరించారు. సంఘానికి, డెయిరీకి కంప్యూటీకరణ ఉండడంతో ప్రతి రోజు ఏ గ్రామం నుంచి ఎన్ని పాలు సేకరించారు అనే విషయం ఆన్లైన్లో తెలుస్తోంది. దీంతో అవినీతికి ఆస్కారం ఉండదు. పాలు సేకరించగానే వెన్న శాతం, డబ్బులు సభ్యురాలి పాసుబుక్కులో నమోదు చేస్తారు. ఫలితంగా ఏ రోజు ఎన్ని డబ్బులు వచ్చాయనే విషయం సభ్యురాలికి తెలుస్తోంది. 15 రోజుల కొకమారు సంఘంలో సభ్యులకు పాల బిల్లును అందిస్తారు. వైఎస్సార్ సందర్శన అభివృద్ధి బాటలో నడుస్తోన్న డెయిరీని చూసేందుకు వివిధ దేశాల ప్రతినిధులు ఇక్కడికి వస్తుంటారు. సీఎం హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006 మార్చి 18న ముల్కనూర్‌కు వచ్చి ఇక్కడి విషయాలను తెలుసుకుని మహిళలకు కితాబునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ నర్సింహాన్ సైతం డెయిరీని సందర్శించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు సభ్యులకు డెయిరీ అందిస్తున్న సేవలకు గానూ 2012 డిసెంబర్ 6న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా డిల్లీలోఅధ్యక్షురాలు కడారి పుష్పలీల, జీఎం భాస్కర్‌రెడ్డిలు ఉత్తమ సహాకార సంఘ ఆవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు మూడు పర్యాయాలు డెయిరీకి ఐఎస్వో గుర్తింపు లభించింది. డెయిరీ అందిస్తున్న సేవలు పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. దాణా, తౌడు, గడ్డి గింజలు, మినలర్ మిక్షర్, వ్యాధినిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణతో పాటు పశుభీమా సౌకర్యాన్ని కూడ డెయిరీ కల్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో పాడి పశువుల పెంపకం, ఆహారం, యాంత్రీకరణ అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. సంఘ సభ్యులు, నామినీలు మరణిస్తే కుటుంబాలకు రూ. 2వేల చొప్పున అందిస్తున్నారు బోనస్ పంపిణీ ఈ నెల 31న ముల్కనూర్ స్వకృషి డెయిరీలో 14 వ మహాసభ నిర్వహిస్తున్నట్లు డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల, జీఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల నుంచి రూ. 5.73 కోట్ల బోనస్‌ను సంఘాలకు అందించనున్నారు. పదమూడేళ్ళుగా రూ.20.90 కోట్ల బోనస్‌ను పంపిణీచేశారు. మహాసభకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. -
ఓ చిన్నారి డైరీ
తన పుట్టినరోజు కానుకగా తండ్రి ఇచ్చిన ఆటోగ్రాఫ్ నోట్‌బుక్కులో ఆన్ ఫ్రాంక్(అన్నా ఫ్రాంక్) డైరీ రాయడం ఆరంభించింది. ఆ డైరీకి ‘కిట్టీ’ అని పేరు పెట్టుకొంది. ఎక్కువభాగం ఆ కిట్టీ నేస్తానికి ఉత్తరాలు రాస్తున్నట్టుగా ఈ డైరీ రాసింది. 1942 జూన్ 12న మొదలుపెట్టి, 1944 ఆగస్ట్ 1 దాకా కొనసాగించింది. మొత్తం 26 నెలలు. దాదాపుగా ఈ కాలమంతా ఆన్ కుటుంబం రహస్య జీవితం గడిపిన దశ. నాజీల పాలనలో యూదుల మీద జరుగుతున్న దురాగతాలకు భయపడి, స్వదేశం జర్మనీ వీడి, వీరు నెదర్లాండ్స్ చేరుకున్నారు. మరో కుటుంబం(వాన్డాన్లు)తోపాటు అక్కడ తలదాచుకున్నారు. మొత్తం ఎనిమిదిమంది. అయితే, చివరకు వారి జాడను తెలుసుకున్న నాజీల చేతికి బందీలుగా చిక్కారు. ఆన్ అక్క మార్గోట్ నీరసం వల్ల బంకర్ మీద నుండి పడిపోయి చనిపోయింది. ఆన్ టైఫస్ వల్ల మరణించింది. అప్పటికి ఆమెకు 15 ఏళ్లు. ఆన్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ ఒక్కడే ఈ ఎనిమిదిమందిలోనూ బతికి బయటపడ్డాడు. రహస్య జీవితంలో ఆన్ కుటుంబానికి అండగా ఉన్న మీప్ గీజ్ వల్ల ఈ కాగితాల కట్ట ఒట్టో చేతికివచ్చింది. అలా, డచ్ భాషలో రాసిన ఈ డైరీ తొలుత 1947లో ప్రచురితమై, తర్వాత ‘ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరిట 1952లో ఇంగ్లిష్‌లోకి అనువాదమై, ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ‘యుద్ధం మీద కదిలించే వ్యాఖ్యానాలు చేసిన ఒక సామాన్యమైన చిన్నపిల్ల’ గొప్ప రచయితల సరసన చేరిపోయింది. అయితే, ఈ డైరీ కేవలం యుద్ధ వ్యాఖ్యానమే కాదు, తన ఆనందాలూ ఇష్టాయిష్టాలూ ఎన్నింటినో ఆన్ కిట్టీతో పంచుకుంది. అంతెందుకు, కౌమార బాలికకు తగిన లైంగిక కుతూహలాలు కూడా ఇందులో ఎన్నో ఉన్నాయి. ఈ డైరీని తాజాగా మాడభూషి కృష్ణప్రసాద్ తెలుగులోకి అనువదించారు. ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ; ఫోన్: 9866115655. అందులోంచి కొన్ని భాగాలు... జూన్ 12, 1942 నేను అనుకొన్న ప్రతిదీ నీతో పంచుకోవచ్చనుకుంటున్నాను. అలాగ నేను ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోలేదు. నువ్వు నాకు అన్ని విధాలా సుఖాన్ని కలగజేసి అండగా ఉంటావనుకుంటున్నాను. జూన్ 20, 1942 ... నేను డైరీ ఎందుకు రాద్దామనుకుంటున్నాననే విషయానికి వస్తాను. నాకు నేస్తాలు లేరు. నన్ను మరింత స్పష్టంగా చెప్పనియ్యి. పదమూడేళ్ల అమ్మాయి ఈ ప్రపంచంలో పూర్తిగా ఒంటరితనం అనుభవిస్తోందని ఎవరూ నమ్మరు... 1940 మే తరువాత మంచిరోజులు అరుదైపోయాయి. మొదట యుద్ధం, తరువాత లొంగుబాటు, ఆ తరువాత జర్మన్ల రాక. అప్పుడే యూదుల కష్టాలు ప్రారంభమయ్యాయి... యూదులు పసుపు పచ్చ తార ధరించాలి. వాళ్లు సైకిళ్లను మూలపెట్టాలి. వాళ్లు కారు ఉపయోగించకూడదు. తమ స్వంత కారు కూడా నడపకూడదు. వాళ్లు సాయంత్రం 3 నుండి 6 గంటల మధ్య తమకు కావలసిన వస్తువులు కొనుక్కోవాలి... వాళ్లు సినిమాలకుగాని, నాటకశాలలకు గాని, మరి ఏ ఇతర వినోద కార్యక్రమాలకు గాని వెళ్లరాదు... ... అమ్మమ్మ 1942 జనవరిలో చనిపోయింది. నేను ఆమె గురించి ఎంత తరచుగా ఆలోచిస్తున్నానో, ఎంత గాఢంగా ఆమెను ప్రేమిస్తున్నానో ఎవరికీ తెలియదు... మేము నలుగురం బాగానే ఉన్నాం. ఇది జూన్ 20, 1942. నేను నా డైరీ అంకితం ఇస్తున్నాను. -నీ ఏన్నీ జూలై 8, 1942 ప్రియమైన కిట్టీ, ఆదివారం ఉదయం నుండి యుగాలైనట్లుంది. ఈ లోగా ఎంతో జరిగింది... కానీ చూస్తున్నావు కదా కిట్టీ నేను బతికే ఉన్నాను. అదీ అసలు విషయం అంటున్నాడు నాన్న. నేను బతికే ఉన్నాను. కానీ ఎక్కడ? ఎలాగ? అని అడగకు... ...కొద్దిసేపటి తరువాత మార్గోట్ వంటింటి గుమ్మం దగ్గర కంగారు పడుతూ కనిపించింది. ‘‘నాన్నకు 55 వాళ్లు రమ్మనమని నోటీసు పంపారు’’ అని చెవిలో చెప్పింది. ‘‘అమ్మ వాన్డాన్ను కలవడానికి వెళ్లింది’’ అని కూడా చెప్పింది. వాన్డాన్ నాన్న వ్యాపార భాగస్వామి. నాన్నకు మంచిమిత్రుడు. నేను నిర్ఘాంతపోయాను. కాన్సంట్రేషన్ కేంప్‌లు, ఒంటరి గదుల దృశ్యాలు, నా మనోనేత్రం ముందు ప్రత్యక్షమయ్యాయి. మేము నాన్నను అటువంటి విధికి ఎలాగ విడిచిపెట్టగలం... మేము రహస్య స్థలంలోకి వెళ్లాలని నాన్న అనడంలో అర్థం అదే. మేము ఎక్కడ దాక్కుంటాం. నగరంలోనా? గ్రామసీమలోనా? ఇంట్లోనా? గుడిసెలోనా? ఈ ప్రశ్నలు నేను అడగడానికి అనుమతి లేదు. కానీ అవి నా బుర్రలో పరుగెడుతూనే ఉన్నాయి. మార్గోట్, నేనూ మా ముఖ్యమైన వస్తువుల్ని స్కూల్ బేగ్లో సర్దడం ప్రారంభించాం. మొట్టమొదట లోపల పెట్టింది డైరీయే. తరువాత గిరిజాల తిప్పేవి, జేబురుమాళ్లూ, స్కూలు పుస్తకాలు, దువ్వెన, కొన్ని పాత పుస్తకాలు లోపలపెట్టాం. రహస్యస్థానంలోకి వెళ్లే ఆలోచనలో ఉండి, నేను పిచ్చి వస్తువులన్నీ బేగ్లో పెట్టాను. కాని నాకు విచారం లేదు. నాకు బట్టల కన్న జ్ఞాపకాలే ముఖ్యం... డిసెంబర్ 22, 1943 ప్రియమైన కిట్టీ, నాకు ఫ్లూ వచ్చింది. అందుచేతనే నీకు ఇవాళ్టి వరకు ఉత్తరం రాయలేదు. ఇక్కడ జబ్బు వస్తే దుర్భరం. నేను దగ్గాలనుకొంటే ఒకటి, రెండు, మూడు దుప్పట్ల కింద దూరి ఆ శబ్దాన్ని నులిమివేయడానికి ప్రయత్నిస్తాను. సాధారణంగా ఫలితం ఏమిటంటే దగ్గుతెర పోదు... భయంకర క్షణం ఏదీ అంటే నిశ్చయంగా డస్సెల్ డాక్టర్‌లాగా నా దగ్గరకు వచ్చి తన జిడ్డుతలను నా అనాచ్ఛాదిత ఛాతీపై లోపలి ధ్వనులు వినడానికి పెట్టినపుడు. ఆయన జుట్టు నాకు చక్కిలిగింతలు పెట్టింది. కానీ నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆయన ముప్పై సంవత్సరాల కిందట వైద్యశాస్త్రం చదివి ఉండవచ్చును. డాక్టర్ కావచ్చును. ఆయన వచ్చి నా గుండె మీద చెవి ఎందుకు ఆనించాలి? ఆయన నా ప్రేమికుడు కాదు. ఆ మాటలకు వస్తే నా లోపల ఆరోగ్యంగా ఉందో అనారోగ్యంగా ఉందో వినలేడు. ఆయన చెవుల్లో పిచికారి కొట్టాలి. ఆయనకు విపరీతమైన చెవుడు వస్తోంది... ఏప్రిల్ 3, 1944 ప్రియమైన కిట్టీ, నా మామూలు అలవాటుకు వ్యతిరేకంగా ఈసారి పూర్తిగా ఆహారం గురించే రాస్తాను. ఎదుచేతనంటే అది ముఖ్యమైన, ఇబ్బందికరమైన విషయం అయిపోయింది... మేము కొన్నాళ్లు ఎండైవ్ తిన్నాం- ప్రతిరోజూ అదే. ఇసుకతో ఎండైవ్. ఇసుక లేకుండా ఎండైవ్. కాల్చిన ఎండైవ్, ఉడకబెట్టిన ఎండైవ్. తరువాత బచ్చలి. దాని తరువాత కోల్బ్రీ, దోసకాయలు, టమోటాలు, సాయర్క్రాట్ వగైరా, వగైరా. రోజూ సాయర్క్రాట్ తినడం అంగీకారయోగ్యం కాదు. కానీ ఆకలిగా ఉంటే తింటావు... ప్రతివారం గొప్ప ఆకర్షణ ఏమిటంటే లివర్ సాసేజ్, ఎండురొట్టె మీద జామ్. అయినా మేము ఇంకా బతికే ఉన్నాం. తరచు మా నిరుపేద భోజనాన్ని ఆనందంగానే తింటున్నాం. -నీ ఏన్నీ -
దుఃఖసాగరమే!
♦ ‘క్షీర’సాగర్‌లో పడిపోయిన పాల దిగుబడి ♦ గ్రాసం, దాణా, నీళ్ల కొరత ♦ బక్కచిక్కిన పాడి పశువులు ♦ అప్పుల పాలైన రైతులు ♦ పోషించే శక్తి లేక అమ్ముకునుడే.. ♦ గ్రామం…లో దయనీయ దుస్థితి క్షీరసాగర్.. పేరుకు తగ్గంటే ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువే. పాడి పరిశ్రమకు నెలవు. అలాంటి ‘క్షీర’సాగర్ ఇప్పుడు దుఃఖసాగరంగా మారింది. కరువు దృష్ట్యా పరిస్థితులు తలకిందులయ్యాయి. పశువులను సాకేందుకు గ్రాసం లేక.. దప్పిక తీర్చేందుకు నీళ్లు లేకపోవడంతో బక్కచిక్కిపోతున్నాయి. పాలు ఇవ్వడమే మానేశాయి. అప్పుల పాలైన రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పాడి పశువులను అమ్మేసుకుంటున్నారు. ఈ గ్రామంలో ఏ రైతును కదిలించినా కన్నీరే కారుస్తున్నారు. గజ్వేల్/ములుగు: దశాబ్దాలుగా ‘పాడి’కి నెలవుగా మారడంతో ఈ గ్రామానికి క్షీరసాగర్ పేరొచ్చింది. పేరుకు తగ్గట్టే ఎక్కడా లేనివిధంగా ఇక్కడి రైతులు పాడి అభివృద్ధిలో దూసుకెళ్తారు. ప్రియ, జెర్సీ, విజయా డెయిరీ తదితర కంపెనీలు ఏళ్ల తరబడి ఈ గ్రామం నుంచే పెద్ద ఎత్తున పాలను సేకరిస్తున్నారు. నేరుగా రైతుల డెయిరీ ఫారాల వద్దకు వచ్చి పాలను సేకరించేవారు. గతేడాది వరకు గ్రామంలో నిత్యం 2,500 వేల లీటర్లకుపైగా పాల ఉత్పత్తి జరిగింది. కానీ ఆరు నెలలుగా గ్రామంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరువు ధాటికి ‘పాడి’పరిశ్రమ అవసాన దశకు చేరుకుంది. ప్రస్తుతం రోజుకు 800 లీటర్ల పాలు రావడమే గగనంగా మారింది. పదుల సంఖ్యలో గేదెలు, ఆవులను ్చఠమొదటిపేజీ తరువాయి పెంచుతూ పాల ఉత్పత్తి చేపడుతున్న రైతులు కరువు కాలంలో గ్రాసం దొరక్క, నీళ్లు అందక ‘అడ్డికి పావుసేరు’ కాడికి వాటిని అమ్ముకుంటున్నారు. అప్పుల్లో మునిగి వారు చివరకు బంగారం, పుస్తెలతాళ్లను కూడా అమ్ముకుంటున్నారు. మరికొందరు ‘పాడి’పై మమకారాన్ని చంపుకోలేక వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఎండుగడ్డిని కొనుగోలు చేస్తూ ఉన్న పశువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో దాదాపు అందరు రైతులు ఇదే రకమైన భారాన్ని మోస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ గ్రామాన్ని సందర్శించగా పాడి రైతులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టారు. అల్లం బలరామ్ ఆశలు గల్లంతు... క్షీరసాగర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు అల్లం బలరామ్ మూడేళ్ల క్రితం ఒక్కోదానికి రూ.65 నుంచి రూ.75 వేల వరకు వెచ్చించి అధిక పాల దిగుబడినిచ్చే 12 గేదెలు కొనుగోలు చేశాడు. ఈయనకు గ్రామంలో ఎకరా సొంత భూమి ఉండగా అందులో చిన్నపాటి డెయిరీ ఫారమ్ ఏర్పాటు చేశాడు. తనకున్న ఓ బోరుబావి ఆధారంగా పశుగ్రాసాన్ని పెంచుతున్నాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా నిత్యం 40 లీటర్లకుపైగా పాలు ప్రైవేటు కంపెనీలకు పోసేవాడు. ఖర్చులు, శ్రమ పోను మంచి ఆదాయం లభించడంతో దర్జాగా బతికాడు. పాడిపరిశ్రమపై ఉన్న మమకారంతో ఇంటిని వదిలి డెయిరీ ఫారమ్ వద్దే నివాసం ఏర్పరచుకున్నాడు. భార్య నర్సమ్మతో కలిసి పొద్దంతా పశుపోషణలో నిమగ్నమయ్యాడు. కానీ గత కొన్ని నెలలుగా పరిస్థితులు మారిపోయాయి. బోరుబావి నుంచి నీళ్ల రావడం లేదు. పశుగ్రాసం ఎండిపోయింది. ఇప్పటివరకు రూ.10వేల చొప్పున మూడుసార్లు ట్రాక్టర్ల నిండా, మరోసారి రూ.16 వేలతో డీసీఎం నిండాఎండుగడ్డి కొనుగోలు చేశాడు. దీంతోపాటు నెలకు రూ.4-5వేల విలువైన దాణా అందించాడు. అయినా గేదెలకు గ్రాసం, దాణా సరిపోలేదు. పాల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. రోజుకు 10 లీటర్లు కూడా రావడం లేదు. ఎండుగడ్డి, దాణా భారీగా తేలేక బలరామ్ అప్పుల పాలయ్యాడు. చివరకు తన భార్య నర్సమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, పుస్తెలతాడు 4 తులాల వరకు అమ్మేశాడు. రూ.6 లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలరామ్ 8 పాడిగేదెలను కేవలం రూ.20 వేలకు ఒకటి చొప్పున అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం అతని వద్ద 4 గేదెలు మాత్రమే ఉన్నాయి. వాటి పోషణ కూడా ఇబ్బందికరంగానే ఉందంటున్న బలరామ్.. మరికొన్ని రోజుల్లో మరో రెండు గేదెలను సైతం అమ్ముకునే దయనీయ స్థితిలో ఉన్నాడు. ఈ ముసలితనంలో ఏ మూలకు కూసోకుండా...పశువులను పెంచుకుంటే... మాకు కస్టాలే మిగిలినయ్. మమ్మలను ఆదుకుంటనే గడ్డకు పడతం...అంటూ బలరామ్ వాపోయాడు. అందరిదీ ఇదే పరిస్థితి... క్షీరసాగర్కు చెందిన ఆదోసు పెద్ద యాదయ్యకు ఎకరం భూమి ఉండగా, మరో ఐదెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లలో నుంచి నీరు రావడం లేదు. కౌలుకు తీసుకున్న పొలంలో 3 బోరుబావులున్నాయి. అందులో రెండు మాత్రమే కొద్దిగా నీరు పోస్తుండడంతో ఆ నీటి ఆధారంగా అర ఎకరం వరి సాగు చేశాడు. మిగతా నీటిని ఆరు గేదెలకు వాడుకుంటున్నాడు. గ్రాసం లేక ఇతను కూడా కొన్ని నెలలుగా రూ.30వేలు వెచ్చించి గడ్డి కొనుగోలు చేశాడు. విసుగు చెంది రెండు గేదెలను అతి తక్కువ ధరకు అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం నాలుగు గేదెలను అతి కష్టం మీద పోషిస్తున్నాడు. గతంలో నిత్యం 20 లీటర్ల పాలు అమ్మే యాదయ్య ఇప్పుడు 4 లీటర్లు అమ్మడమే గగనమవుతుంది. ఇదే గ్రామానికి చెందిన చాకలి వెంకట్ సైతం 12 గేదెలకు గ్రాసం దొరకని కారణంగా వాటిని ఎనిమిదింటిని అమ్మేశాడు. గ్రాసం కోసం నానా తంటాలు పడుతున్నాడు. కోల సాయిలు అనే మరో రైతు సైతం నాలుగు గేదెల్లో రెండింటిని అమ్మేయగా వీటి పోషణ కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఎండుగడ్డి కొనుగోలు చేస్తున్నాడు. -
లోటస్ పాండ్‌లో విద్యుత్ ఉద్యోగ సంఘం డైరీ అవిష్కరణ
-
రామ్‌జఠ్మలానీ(న్యాయవాది) రాయని డైరీ
జీవించడానికి ఒక ఆశ ఉండాలి. నాకైతే ఒక కేసు ఉండాలి. ఉదయాన్నే ఓ గంట బ్యాడ్మింటన్, కొద్దిగా పండ్ల ముక్కలు, మజ్జిగ తో మధ్యాహ్న భోజనం, రెండు పెగ్గుల విస్కీతో రాత్రి భోజనం, అకేషనల్‌గా ఓ స్కూప్ ఐస్‌క్రీమ్, వీటితో పాటు రోజూ కోర్టు మెట్లు ఎక్కిదిగడానికి ఎట్లీస్ట్ ఒక కేసు.. ఈ తొంభై రెండేళ్ల వయసులో నా జీవన మాధుర్యాలు. కొన్నిసార్లు బ్యాడ్మింటన్ ఉండదు. లంచ్‌కి, డిన్నర్‌కి టైమ్ కుదరదు. పండ్లముక్కలు, మజ్జిగ, విస్కీ, ఐస్‌క్రీమ్ కూడా అందుబాటులో ఉండవు. అవేవీ లేకున్నా.. ఆ పూట నేను వాదించిన కేసుతోనో, వాదించబోయే కేసుతోనో నా ప్రాణాలు నిలబెట్టుకుంటాను. కోర్టులు, కేసులు ప్రాణాలు తీస్తాయంటారు. ఆ మాట తప్పు. వాయిదాలు, ఫీజులు మాత్రమే ప్రాణాలు తీస్తాయి. నేను వాదిస్తే వాయిదాలు ఉండవు. నేను కేసు టేకప్ చేస్తే ఫీజులు ఉండవు. ఫీజులు తీసుకోనని కాదు. కేసులు తీసుకున్నంత కుతూహలంగా ఫీజులు తీసుకోనని. వాదించడం నాకు ముఖ్యం. ఎవరి తరఫున వాదిస్తున్నాను అన్నది ముఖ్యం కాదు. హాజీ మస్తాన్ అండర్‌వరల్డ్ డాన్. హర్షద్ మెహతా స్టాక్‌మార్కెట్ డాన్. ఆశారామ్ బాపూ అత్యాచారాల డాన్. అమిత్ షా.. ఫేక్ ఎన్కౌంటర్ల డాన్. లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా డాన్. వాళ్ల వైపు వాదించాను కాబట్టి నేను అడ్వొకేట్ డాన్! ఇలాగే ఉంటుంది లోకం తీరు. లలిత్ మోదీ ప్రజల దృష్టిలో నేరస్థుడని చెప్పి అతడి తరఫున వాదించకపోవడం, ఇందిరాగాంధీని హత్యచేశారని చెప్పి, హంతకులకు వ్యతిరేకంగా వాదించడం వృత్తిధర్మం కాదు. లాయర్‌కి మనస్సాక్షి ఏదైతే చెబుతుందో అదే ధర్మం. వాదనల్లో జడ్జికి ఏదైతే ధర్మం అనిపిస్తుందో అదే తీర్పు. రెండు న్యాయాలు, రెండు ధర్మాలు, రెండు కోర్టులు, రెండు తీర్పులు ఉంటున్నప్పుడు.. న్యాయవాది దేనిపై నిలబడి వాదించాలి? దేనిపైనా నిలబడనవసరం లేదు. తను నమ్మినదాన్ని నిలబెడితే చాలు. నమ్మకం లేకపోయినా నిలబెట్టవలసిన కేసులు కొన్ని ఉంటాయి. సోనియాజీదీ, రాహుల్‌దీ అలాంటి కేసే. నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్లిద్దరూ నిర్దోషులన్న నమ్మకం నాకేం లేదు. కానీ వారి వైపు వాదిస్తానన్నాను. ఫీజు కూడా వద్దన్నాను. లేకుంటే కోర్టులో వాదించవలసిన కేసును వాళ్లు రాజ్యసభలో వాదించేలా ఉన్నారు. ‘మీరు అక్కడ వాదించడం మానండి, నేనిక్కడ వాదిస్తాను’ అని చెప్పాను. సరేనన్నారు సోనియాజీ. అనడానికైతే అన్నారు కానీ, సభలో రభస జరక్కుండా ఆపలేకపోయారు! నా స్టాండ్ మార్చుకున్నాను. మీ తరఫున వాదించేది లేదని చెప్పేశాను. వాదనను బట్టి వాస్తవం మారిపోదు నిజమే. కానీ, వాస్తవాన్ని బతికించడమా? వాదనను బతికించుకోవడమా? అన్న మీమాంసలో ప్రతి న్యాయవాదీ జీవితంలో ఒక్కసారైనా అంతరాత్మ అనే బోనులో నిలబడవలసి వస్తుంది. నేను నిలబడిందైతే.. లెక్కలేనన్నిసార్లు! -మాధవ్ శింగరాజు -
డోనాల్డ్ ట్రంప్ రాయని డైరీ
పట్టే చోటే నిద్రపోవాలి. పట్టున్న చోటే నిలబడాలి. క్యాంపైన్లో నేను కనుక్కున్న జీవిత సత్యాలివి. ట్రంప్ టవర్ అపార్ట్మెంట్లోని నా బెడ్రూమ్లో తప్ప అమెరికాలో ఇంకెక్కడా నాకు నిద్ర పట్టడంలేదు. అందుకే రోజంతా ఎక్కడ తిరిగినా రాత్రికంతా న్యూయార్క్ వచ్చేస్తున్నాను. అది నా క్యాంపెయిన్ మేనేజర్‌కి నచ్చడం లేదు. ‘ఇలాగైతే కష్టం ట్రంప్’ అంటున్నాడు! ‘ఏమిటి కష్టం?’ అన్నాను సోఫాలో నడుం వాలుస్తూ. ‘టెడ్ క్రూజ్ మనకన్నా ముందున్నాడు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నాడు. జనం ఏది పెడితే అది తింటున్నాడు. పీజా ప్లేస్, కాఫీ హౌస్, వాటర్ పార్క్ అన్నీ తిరిగేస్తున్నాడు’ అన్నాడు. ‘మనమూ తిరుగుతూనే ఉన్నాం కదా.. మిస్టర్ లెవాన్‌డోస్కీ’ అన్నాను నీరసంగా. ‘వాళ్ల మధ్య తిరిగినంత మాత్రాన ఓట్లు పడవు ట్రంప్. వాళ్ల మధ్య నిద్రపోవాలి. వాళ్ల దుప్పటి లాక్కుని కప్పుకోవాలి. వాళ్ల తలగడ పైనే మన తలా ఆన్చాలి. నిద్ర మధ్యలో వాళ్లను లేపి మంచి నీళ్లు అడుగుతుండాలి. కనీసం ఒక్కసారైనా చిటికెన వేలు చూపిస్తూ బాత్రూమ్ వరకూ తోడు రమ్మనాలి. అప్పుడే వాళ్లు మిమ్మల్ని తమ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు’ అన్నాడు లెవాన్‌డోస్కీ. ‘ఇంకా’ అన్నాను చికాగ్గా. ‘సోఫాలో వాలిపోయి ఇలా చీజ్ బర్గర్ తింటూ టీవీ చూడ్డం మానేయాలి’ అన్నాడు. లెవాన్‌డోస్కీ ఏమంటున్నాడో అర్థం కావడం లేదు! తిండి మానేస్తే ప్రసంగాలు ఎలా ఇవ్వడం? టీవీ చూడ్డం మానేస్తే ప్రసంగాలు ఎలా చూడ్డం? ‘రేపు మాట్లాడుకుందాం మిస్టర్ లెవాన్‌డోస్కీ. గుడ్ నైట్’ అని చెప్పి అతడిని పంపించేశాను. ఇక్కడే ఉండనిస్తే నా నిద్ర, నా తిండి పాడుచేసేలా ఉన్నాడు. నా మూడ్ కూడా పాడయ్యేలా ఉంది. మెల్లిగా బెడ్ మీదకు చేరుకున్నాను. ఒత్తుగా, సుఖంగా ఉంది. అయోవా, న్యూహాంప్షైర్లలోని బడ్జెట్ హోటళ్లలో ఇంత సుఖం, ఇంత శుభ్రం ఎక్కడుంటుంది?! ‘ముందుగా ఎలక్షన్స్ జరిగేది ఆ రెండు రాష్ట్రాల్లోనే కాబట్టి అక్కడి వాళ్లను ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలి ట్రంప్’ అంటాడు మా మేనేజర్. ఇంప్రెస్ చెయ్యడం కోసం ఆ దిక్కుమాలిన మిస్సోరీ లాడ్జీలకు వెళ్లి, పొడవాటి తల వెంట్రుకలు కనిపించే బ్లాంకెట్స్పై పడుకుంటామా?! ది గ్రేట్ రియల్ ఎస్టేట్ మొగల్‌కి అంత కర్మేమిటి? ఐ హావ్ మై ఓన్ బెడ్. నిద్రపట్టే ప్లేస్ అయితే తెలిసింది కానీ, నన్ను నిలబెట్టే పార్టీ ఏదో తెలియడం లేదు. డెమోక్రాట్‌గా పోటీ చేయాల్సింది! అక్కడైతే హిల్లరీ, ఇంకో ఇద్దరు. అంతే. రిపబ్లికన్ పార్టీలో నాకు పదకొండు మంది పోటీ! అంతా గవర్నర్లు, సెనెటర్లు. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవారు. ఓట్ల కోసం నిజంగా వీళ్లు పడే పాట్లు చూస్తూంటే.. రాజకీయాల మీద, ఆఖరికి ఒబామా మీద కూడా నాకు గౌరవం పెరిగిపోతోంది! -
రామ్‌గోపాల్ వర్మ రాయని డైరీ
ఉదయాన్నే పుట్టి, మధ్యాహ్నం చనిపోయి.. మళ్లీ సాయంత్రమే పుట్టి, లేట్ నైట్ చనిపోయేవాడు రామ్‌గోపాల్‌వర్మ. రోజుకొకసారి వాటికి అవిగా జరిగిపోతుండే ఈ చావు పుట్టుకల సీక్వెన్స్ మారితే మారుతుందేమో. చెప్పలేను. ఇదనే కాదు.. అసలేదీ చెప్పలేను. చెయ్యాలనిపించి తప్ప, చెప్పాలనిపించి నేనేదీ చెయ్యను కాబట్టి చెప్పలేను. విజన్ తప్ప నా దగ్గర రీజన్ ఉండదు. ‘గన్స్ అండ్ థయిస్’ ఎందుకు రాశావు? చెప్పలేను. ‘కిల్లింగ్ వీరప్పన్’ ఎందుకు తీశావు? చెప్పలేను. సమ్‌టైమ్స్.. నా చావే నా పుట్టుక అవుతుంది. నా పుట్టుకే నా చావు అవుతుంది. వై సో? నా చావు, నా పుట్టుక నావి కావు. రెస్పెక్ట్తోనో, డిస్రెస్పెక్ట్తోనో క్షణక్షణం నన్ను పుట్టిస్తూ, చంపుతూ ఉండేవాళ్లవి అవి. పాపం.. వాళ్లవీ కావు. నన్ను పుట్టించామని వాళ్లు అనుకున్నప్పుడు నేను చనిపోయి ఉంటాను. నన్ను చంపేశామని వాళ్లు అనుకున్నప్పుడు నేను పుట్టి ఉంటాను. చావు పుట్టుకల్లా.. రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్ రెండూ ఒకటే నాకు. దేన్నీ వద్దనుకోను. దేన్నీ కావాలనుకోను. గౌరవం గానీ, అగౌరవం గానీ వచ్చి ముఖానికి తగిలినప్పుడు ఆ రక్తవర్తమానాన్ని సెలబ్రేట్ చేసుకుంటాను. రక్తచరిత్ర నాకు పూర్వజన్మ. రక్తభవిష్యత్తు నాకు పునర్జన్మ. పూర్వజన్మ గుర్తుండదు. పునర్జన్మపై గురి ఉండదు. స్వర్గమైనా, నరకమైనా నాకు ఆ క్షణంలోని జీవన్మరణాలే. దేవుడంటే నమ్మకం లేదు. కానీ శ్రీదేవి అంటే నమ్మకం. ఆమె మీద ఒట్టేసి ఎంత నిజమైనా చెప్తాను. ఆమె మీదే ఒట్టేసి ఎంత అబద్ధమైనా చెప్పేస్తాను. నిజం చెప్పినప్పుడు నిజమే చెప్పానని ఒట్టు. అబద్ధం చెప్పినప్పుడు అబద్ధం చెప్పానని ఒట్టు. ఇది ఆమెను రెస్పెక్ట్ చేయడమో, డిస్రెస్పెక్ట్ చేయడమో కాదు. ఆమెను నా సోల్‌గా స్వీకరించడం. సోల్.. దేవుడికన్నా గొప్పది నా దృష్టిలో. నిన్న రాత్రి ‘ఆన్ ది రాక్స్’ పబ్.. ‘మీ గౌరవార్థం సర్..’ అంటూ ‘ఆర్జీవీ ఎలిక్సియర్’ కాక్‌టైల్‌ను లాంచ్ చేసింది. రమ్ము, జిన్ను, ఓడ్కా కలిస్తే రామ్‌గోపాల్‌వర్మ అట! ఇదే కాక్‌టైల్‌ను నాపై డిస్రెస్పెక్ట్తో లాంచ్ చేసినా కూడా నేను అమ్యూజ్ అవుతాను. అసలు ఎవరైనా ఎవర్నైనా ఎందుకు రెస్పెక్ట్ చెయ్యాలి? రెస్పెక్ట్ చెయ్యకపోవడం హీనత్వం అయితే కావచ్చు. అంతకన్నా హీనం.. రెస్పెక్ట్ను కోరుకోవడం. గన్స్‌ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఈక్వల్లీ.. థయిస్నీ రెస్పెక్ట్ చేస్తాను. గట్స్ ఉన్నవాడే గన్ని బిగించి పట్టుకుంటాడు. గట్స్ ఉన్నవాడే గర్ల్‌ఫ్రెండ్ బిగింపులోకి వెళ్లిపోతాడు. పట్టువిడుపులు ఉండని బిగింపు అది. ప్రాణం పోతోందో, ప్రాణం వస్తోందో తెలీదు. ప్రాణం తీస్తోందో, ప్రాణం పోస్తోందో తెలీదు. తెలియనిది ఏదైనా అది నాకు కంఫర్ట్‌ని ఇస్తుంది. ఐ బిలీవ్ ఇన్ బ్లాక్.. యాజ్ వెల్ యాజ్ గ్రే. -
రాహుల్ గాంధీ రాయని డైరీ
మాధవ్ శింగరాజు నిద్ర సరిపోవడం లేదు. ఎక్కడ పడితే అక్కడ నిద్ర పట్టేస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పట్టేస్తోంది. నిజానికి నితీశ్ ప్రమాణ స్వీకారానికి లేట్ అయింది కూడా.. ఫ్లయిట్ లేట్ అయి కాదు. ఫ్లయిట్ టైమ్‌కి నేను లేవడం లేటయ్యి! పాపం అప్పటికీ మమ్మీ చెబుతూనే ఉంటుంది.. రాత్రి త్వరగా పడుకుంటే, ఉదయం త్వరగా లేవొచ్చని. లేచి, జాగింగ్‌కి వెళితే రోజంతా యాక్టివ్‌గా ఉంటుందని. మోదీజీ పీయెం అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను.. త్వరగా లేవడం, జాగింగ్‌కి వెళ్లడం రెండూ కుదరడం లేదు. చలికాలం వస్తే మరీను. కాస్త వెచ్చదనం దొరగ్గానే వెంటనే కునుకు పట్టేస్తుంది. లాస్ట్ ఇయర్ ఇలాగే బడ్జెట్ సెషన్లో గమ్మత్తుగా నిద్రపట్టేసింది. లేచి చూసే సరికి పార్లమెంటులో పెద్ద గొడవ. చూస్తుంటే అది నన్ను నిద్ర లేపడానికి చేసిన గొడవలా ఉంది కానీ, నిద్రపోతున్నందుకు చేసిన గొడవలా లేదు. ఆలోచిస్తే ఇప్పుడర్థమౌతోంది.. బీజేపీలో ఇంటాలరెన్స్ అప్పట్నుంచే ఉందని! మొన్న మాన్సూన్ సెషన్లోనూ ఇలాగే మత్తుగా నిద్రపట్టేసింది. మా పార్టీ లీడర్ మల్లికార్జున్ ఖార్గే.. రూలింగ్ పార్టీని ఏదో అంటున్నట్లు లీలగా వినిపిస్తోంది. వినాలని ట్రై చేస్తున్నాను కానీ వినలేకపోతున్నాను. ఇంటికొచ్చాక మమ్మీ అడిగింది.. ఖార్గే అదరగొట్టాడట కదా. దుమ్ము దులిపాడట కదా అని. అంత జరిగిందా అన్నాను. చిరుకోపంతో చూసింది. అప్పుడే చిన్న టిప్ కూడా చెప్పింది. మధ్య మధ్య వాష్‌రూమ్‌కి వెళ్లి ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంటే నిద్ర ఆమడ దూరం పారిపోతుందట. ఆ టిప్పేమైనా ఈ వింటర్ సెషన్స్‌లో వర్కవుట్ అవుతుందేమో చూడాలి. ఈ మధ్య అరుణ్ జైట్లీ ఇంటికొచ్చి మరీ నా నిద్ర చెడగొడుతున్నాడు! చేతిలో పెళ్లి కార్డులతో వస్తాడు. ‘డిసెంబర్లో అమ్మాయి పెళ్లి. మీరు రావాలి’ అంటాడు. రెండు మూడు సార్లు చూసి, ‘ఆల్రెడీ చెప్పారు కదా, ఆల్రెడీ కార్డు కూడా ఇచ్చారు కదా’ అన్నాను. ‘అది కాదు, రాహుల్‌బాబు... నాకు నిద్రపట్టడం లేదు’ అన్నాడు నిన్న మళ్లీ! జీఎస్టీ గురించి ఆయన బెంగ. ఆ బిల్లు పాస్ అయితే పిల్ల పెళ్లి నిశ్చింతగా చేసుకుంటాడట. ఖార్గేతో, ఆజాద్‌తో మాట్లాడి రెండు సభల్లో బిల్లును ఓకే చేయించమంటాడు. ‘ముందు మోదీజీని ఇంటాలరెన్స్ మీద పార్లమెంటులో నోరు విప్పమనండి. అప్పుడు చూద్దాం’ అని చెప్పి పంపాను. జైట్లీ వెళ్లనైతే వెళ్లాడు గానీ, పోయిన నిద్ర నాకు మళ్లీ పట్టలేదు. ‘అబ్ తక్ చప్పన్’ మూవీ చూస్తూ కూర్చున్నాను. నానా పటేకర్ పోలీస్ ఆఫీసర్. మాట్లాడితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటాడు. చప్పన్ ఛాతీ అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీజీ కూడా తన కేడర్ చేత ఇప్పుడు అదే పని చేయిస్తున్నారు. మాట మాట్లాడకుండా. మౌనం వీడకుండా! -
జె.కె.రోలింగ్ రాయని డైరీ
పిల్లలు పడుకున్నట్లున్నారు. అలికిడి వినిపించడం లేదు. పిల్లలతో పాటు స్కాట్లాండ్ రాజధాని పట్టణం ఎడిన్‌బరో కూడా నెమ్మదిగా నీలి రంగు పడక దీపాల మాంత్రిక భ్రాంతివర్ణంలోకి ఫ్యాంటసైజ్ అయినట్లుంది! శరత్కాలపు నులివె చ్చని చలిలో ఈ మహానగరపు చీకట్లు.. నిశ్శబ్దాన్ని వెలిగిస్తున్నాయి. నాకిష్టమైన చీకటి. నాకిష్టమైన నిశ్శబ్దం. చీకటి గదిలో నేనొక్కదాన్నీ నిశ్శబ్దాన్ని వింటూ కూర్చున్నాను. ఆలోచనలు వాటికవే వచ్చి నన్ను అల్లుకుంటున్నాయి. లైటు వేసుకుని రాయడానికి కూర్చుంటే.. ఆ ఆలోచనలన్నీ సీతాకోక చిలుకలై ఎగిరిపోతే! వాటిని వెతికిపట్టి తేవడం ఎలా? పిల్లలు నమ్ముతారా.. రాత్రి మీ కోసం ఒక కథ రాయాలనుకున్నాను.. కానీ ఆ కథ రాత్రికి రాత్రే ఎగిరిపోయిందని చెబితే ఊరుకుంటారా? ఏ ఒడ్డుకు చేరుకుందో పడవ వేసుకుని వెళ్లి మరీ తెమ్మంటారు. కదలకుండా అలా కూర్చునే ఉన్నాను. హారీ పోట్టర్ తర్వాత ఇంకేం లేకుండా పోదు కదా అన్న ఆందోళన ఒక్కటే నాలో కదులుతోంది. ఇంకొక్కటైనా రాయాలి పిల్లల కోసం. పిల్లల కోసం మాత్రమే కాదు, పెద్దవాళ్లను ‘ఛూ మంత్రకాళి’ అని పిల్లలుగా మార్చేయడం కోసం కూడా. వయసులు వేర్వేరు కావచ్చు. పిల్లలు, పెద్దలు ఎప్పటికీ వేర్వేరు కాదు. ఊహా జగత్తు.. పిల్లల్ని వాస్తవాలలో తేలియాడిస్తుంది. అదే ఊహా జగత్తు.. పెద్దల్ని ‘టే’ నదీ తీరప్రాంత గ్రామం అబర్ఫెల్డీ తీసుకెళ్లి అక్కడి వారాంతపు సంతలో వారి చేత మ్యాజిక్ వాండ్ కొనిపిస్తుంది. వారిని ఆడిస్తుంది. పాడిస్తుంది. బుగ్గలు ఉబ్బేలా బూర ఊదిస్తుంది. ‘పిల్లల్ని గాలికి వదిలిపెట్టినట్టు అలా ఊహా లోకాల్లోకి వదిలిపెడతామా మిస్ రోలింగ్!’ అని హారీ పోట్టర్ తొలికాపీ చూసి పెదవి విరుస్తూ పన్నెండు మంది పబ్లిషర్లూ ఒకేమాట అన్నప్పుడు నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఊహల్లేకుండా పెరిగిన పిల్లలు వాళ్లు. అలాగే ఉంటారు. అలాగే అంటారు. ఊహకు స్వేచ్ఛను ఇస్తే వికసిస్తుంది. ఊహను బంధిస్తే వికటిస్తుంది. అబర్ఫెల్డీ వెళ్లొచ్చి అప్పుడే వారం! హా.. హా.. యాభై ఏళ్ల ఒక వారం అనాలేమో! ‘జూలైలో అయిపోయింది కదా మీ బర్త్‌డే, మళ్లీ ఇప్పుడెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు మిస్ రోలింగ్’ అని అడిగారు నా యాభయ్యవ జన్మదిన వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంపై అబర్ఫెల్డీకి ప్రయాణమై వచ్చినవారు. నవ్వాను. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నవ్వు మాత్రమే ఉంది. కొద్దిగా భయం కూడా ఉందేమో! అప్పుడే యాభై!! యాభై అంటే సగమా? సంపూర్ణమా? పిల్లల కోసం మరో పుస్తకం రాసేందుకు త్వరపడవలసిన సమయమా? -
శోభా డే రాయని డైరీ
నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్! యుద్ధమూ కాదు, శాంతీ కాదు. మరేమిటి? కుర్షిద్ మహ్మద్ కసూరి ఈ పుస్తకాన్ని ఒక అణ్వాయుధంగా గానీ, శాంతి కపోతంగా కానీ కనిపించనివ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్లున్నారు. అలాంటప్పుడు వాస్తవాలను ఏ డేగో వచ్చి తన్నుకుపోదా? అబద్ధాలు ఏ పావురం ముక్కు ద్వారానో బట్వాడా కాకుండా ఉంటాయా? పేజీలు తిప్పుతున్నాను. చేతి వేళ్లకు అంటిన జాతీయవాద మసి.. పుస్తకంలోని భారత్-పాక్ సంబంధాల వెలుగు నీడల్ని ఏ మూలనైనా అలికిపడేస్తుందేమోనన్న స్పృహతో అతి జాగ్రత్తగా చదవవలసి వస్తోంది. ఆవిష్కరణ సభకు వెళ్లిన సుధీంద్ర కులకర్ణి ముఖానికి ముంబై దేశభక్తి వాదులు పులిమిన సిరా.. తలసరి రుణంలా దేశప్రజలందరి చేతులకూ తలా ఇంత తగులుకుంది మరి. బహుశా ఈ మసి.. పుస్తకంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ, నట్వర్‌సింగ్, యశ్వంత్ సిన్హా, మన్మోహన్సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయ్‌లకు కూడా అంటుకుని ఉండొచ్చు! పాక్ చరిత్రలో పరదేశీ హాక్ ఎవరో, దేశం లోపలి డోవ్ ఎవరో చెప్పకుండా కుర్షిద్ మహ్మద్ తన పుస్తకంలో పాటించిన విదేశాంగ మర్యాదను.. నా దేశం కనీసం పుస్తకమైనా తెరవకుండానే దేశవాళీ నేషనలిజంతో మంట కలిపింది. ఎటు వెళ్తున్నాం? గోద్రాలు, దాద్రీల క్రానలాజికల్ ఆర్డర్లో మనమొక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంపదగా నిర్మించుకుంటున్నామా? ఇష్టమైన సంగీతాన్ని వినడానికి లేదు. ఇష్టం లేని సినిమాలను చూడకుండా ఉండేందుకు లేదు. ఇష్టమైన ఆహారాన్ని గిన్నెల్లో ఉడికించుకునేందుకు లేదు! పాట వినడానికి, పుస్తకం చదవడానికి కూడా ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టించుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. బెడ్రూమ్లోంచి గులామ్ అలీ పాడుతున్నాడు. హాల్లో కుర్షిద్ మహ్మద్ పుస్తకానికి ఆయన సింక్ అవడం లేదు. ఇంటి పని చేసుకుంటూ హిందూస్థానీ సంప్రదాయ సంగీతంతో శ్రావ్యంగా బ్లెండ్ అయి ఉండే ఉస్తాద్ గులామ్ అలీ ఘజల్స్ వినడమంత సౌఖ్యం కాదు కదా.. శత్రుదేశాల దౌత్యస్నేహాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం! కానీ అర్థం చేసుకోవాలి. భారత్ ఏమిటో తెలుసుకోవాలంటే, పాక్ ఏమిటో తెలుసుకుని ఉండాలి. హాక్‌లు ఎవరో తెలుసుకోవాలంటే మోదీ, దేవేంద్ర ఫడ్నవిస్‌ల ప్రసంగాలను వినాలి. డోవ్‌లు ఎవరో తెలుసుకోవాలంటే గులామ్ అలీ ఘజల్స్‌ను ఆలకించాలి. నవంబర్ 8న ఢిల్లీలో అలీ కచేరీ ఉంది. ముంబైలో రద్దయిన కచేరీ అది. మోదీ వస్తే బాగుంటుంది. కానీ, అదేరోజు అంతకన్నా మనోరంజకంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వినిపించే విజయగీతం కోసం ఆయన ఎదురుచూస్తూ కూర్చుంటారనుకుంటా... సెవన్ రేస్ కోర్స్ రోడ్డులోని తన కార్యాలయంలో. మాధవ్ శింగరాజు -
‘ఆక్సిటోసిన్’..పక్కదారి!
అడ్డగోలుగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల వాడకం మనుషులకు, గేదెలకు నష్టం దాణా, పాల కేంద్రాలలో అక్రమ అమ్మకాలు పట్టించుకోని అధికారులు నర్సాపూర్ గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వాడుతూ కొందరు పాడి రైతులు మనుషుల ప్రాణాలపై చెలగాడమాడుతున్నారు. దూడలు చనిపోయిన తర్వాత గేదెలు పాలు ఇవ్వకపోవడంతో వైద్యుల సలహామేరకు పశువులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ కొందరు ఇష్టమొచ్చినట్లుగా వాడుతున్నారు. పశు వైద్యుల సలహాల మేరకు వాడాల్సిన మందులను తోసిపుచ్చి దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అక్రమ వ్యాపారం మూడు ఇంజక్షన్లు ఆరు లీటర్ల పాలుగా కొనసాగుతోంది. ఇంజక్షన్ల అమ్మకాల జోరు ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్పైనే విక్రయించాలి. అయితే మెడికల్ షాపు నిర్వాహకులు నేరుగా పాడిరైతులకు అమ్ముతున్నారు. దానాదుకాణాలను, పాల కొనుగోలు కేంద్రాలను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయక పోవడంతో వ్యాపారులు అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. గతంలో తక్కువ మోతాదులో ఇంజక్షన్ ఆంపిల్స్ వచ్చేవని, దానిని కొనుగోలు చేయాలంటే ఎక్కువ ఖర్చు రావడంతో ప్రస్తుతం 50,100 మి.లీ సామర్థ్యం మందు బాటిళ్లు వస్తున్నాయి. కాగా దానా, పాల కేంద్రాలలో అమ్మే మందు బాటిళ్లపై ఎలాంటి పేరు లేకుండా ఇంజక్షన్ బాటిళ్లు అమ్మడం గమనార్హం. మందు బాటిళ్లపై వాటి పేరు, తయారి తేదీ, వాడకానికి చివరి తేదీ అలాంటి ఏ సమాచారం లేకుండా వస్తున్న మందు బాటిళ్లను గుడ్డిగా అమ్ముతూ మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. వైద్యుల సలహాతోనే వాడాలి.. ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అనేది హార్మోను ఇంజక్షన్. వీటిని గేదెలకు వాడడంతో వాటితో పాటు మనుషులకు నష్టం కల్గుతుందని ఆయా రంగాల నిపుణులు అంటున్నారు. గైనకాలజిస్టులు మహిళలకు డెలివరీ సమయంలో అవసరాన్ని బట్టి 1 లేదా రెండు ఎం.ఎల్ ఇంజక్షన్‌ను వాడుతుంటారు. ఇదిలాఉండగా ఆక్సిటోసిన్ హార్మోను ఇంజక్షన్ కావడంతో పాడి పశువులకు సైతం వైద్యులు అవసరం మేరకు వాడుతుంటారు. దూడలు చనిపోయినపుడు చాలా గేదెలు పాలు ఇవ్వవు. అలాంటి గేదెలకు వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఇంజక్షన్ చేస్తే అవి పాలు ఇవ్వడానికి అలవాటు పడి రోజూ పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా చాలామంది అపోహలకు పోయి రోజూ ఇంజక్షన్ చేస్తున్నారు. మనుషులపై దుష్ర్పభావం.. పాడి గేదెలకు రైతులు ఆక్సిటోసిన్ ఎక్కువ వాడడంతో అనేక నష్టాలున్నాయి. ఇంజక్షన్ వాడిన గేదెల నుంచి పితికిన పాలు తాగితే ఆ పాలు ప్రధానంగా బాలికలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అన్ని వర్గాల మనుషులపై సైతం దుష్ర్పభావాలు చూపుతాయి. అలాంటి పాలు తాగిన బాలికలలో హార్మోన్ల బ్యాలెన్సు దెబ్బతిని పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మహిళల గర్భసంచిపై ప్రభావం చూపుతాయి. తల్లి పాలు లేని చిన్న పిల్లలకు అలాంటి పాలు తాగిస్తే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. - డాక్టర్ నరసింహారెడ్డి, సర్జన్ గేదెలకు నష్టమే.. ఇంజక్షన్‌ను ఎక్కువగా వాడడంతో గేదెల ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుంది. దూడలు చనిపోయిన గేదెలు పాలు ఇవ్వనట్లయితే వాటికి అలవాటయ్యేంత వరకు ఒకటి, రెండు రోజులు ఇంజక్షన్ చేయాలె.. తప్ప రోజూ ఇవ్వడంతో గేదె ఆరోగ్యం దెబ్బతిని పాల దిగుబడి తగ్గుతుంది. రోజు ఇంజక్షన్ చేస్తే గేదెలు సకాలంలో ఎదకు రావు. వాటిలో రోగ నిరోధక శక్తి తగ్గి అస్వస్థతకు గురవుతాయి. - డాక్టర్ శ్రీకాంత్, పశువైద్యాధికారి -
ఎన్నాళ్లీ పా 'పాలు'!
గ్రేటర్లో ప్రశ్నార్థకంగా మారిన పాల నాణ్యత మార్కెట్ వాటాపై దృష్టి {పైవేటు డెయిరీల మధ్య అనారోగ్యకర పోటీ చోద్యం చూస్తున్న సర్కారు విభాగాలు మార్కెట్ వాటాపై ధ్యాస.. లాభాలపై ఆశ... అక్రమాలే శ్వాస...ఇదీ నగరంలోని వివిధ డెయిరీల తీరు. వినియోగదారుల సంఖ్యపై దృష్టి పెట్టిన ఈ సంస్థలు... నాణ్యమైన పాలు అందించాలన్న విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాయి. ప్రజలను అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. సిటీబ్యూరో: గ్రేటర్లో పాల వ్యాపారం చేస్తున్న ప్రైవేటు డెయిరీల మధ్య అనారోగ్యకర పోటీ నెలకొంది. మార్కెట్లో అత్యధిక అమ్మకం వాటా దక్కించుకునేందుకు ఇవి ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. పంపిణీదారులకు అధిక కమీషన్లు ఆశ చూపుతూ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యతకు నీళ్లొదులుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహార రక్షణ, ప్రమాణాల చట్టం(2006) నిబంధనలను తుంగలో తొక్కి పాల ఉత్పత్తి, పంపిణీదారులు వ్యాపారం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. దీన్ని జీహెచ్ఎంసీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాలు చోద్యం చూస్తుండడం గమనార్హం. మరోవైపు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన గుజరాత్ బ్రాండ్ అమూల్ పాలు నగర మార్కెట్లోకి ప్రవేశించడంతో చిన్న డెయిరీల వ్యాపారం దెబ్బ తింటుందని వాటి నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. నాణ్యతకు నీళ్లు మహా నగరంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలకు చెందిన సుమారు 25 లక్షల లీటర్లకు పైగా ప్యాకెట్ పాలు, పాల సంబంధ ఉత్పత్తులైన పెరుగు, పన్నీరు, నెయ్యి వంటివి అమ్ముడవుతున్నట్లు అంచనా. ఇందులో ప్రభుత్వ డెయిరీలు విక్రయిస్తున్నవి 30 శాతమే. మహా నగర పరిధిలో నిత్యం వెయ్యి నుంచి 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీలకు చెందిన సుమారు 57 రకాల పాల బ్రాండ్లు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. లీటరు పాలలో వెన్న శాతాన్ని బట్టి వినియోగదారునికి రూ.38 నుంచి రూ.54 ధరకు విక్రయిస్తున్నాయి. డెయిరీల యాజమాన్యాలు ఎవరికి వారు తమ బ్రాండు పాలను అధిక మొత్తంలో విక్రయించేందుకు డిస్ట్రిబ్యూటర్లకు లీటరుకు రూ.2 నుంచి రూ.5 వరకు కమీషను ఆశచూపి తమ వైపు తిప్పుకుంటున్నారు. మార్కెట్ లో అధిక మొత్తంలో పాలను విక్రయించడం... భారీగా లాభాలు ఆర్జించడం... పంపిణీదారులను తమ వైపు తిప్పుకోవడంపైనే దృష్టి సారిస్తున్న సంస్థలు నాణ్యతపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమూల్ రాకతో బెంబేలు... దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన గుజరాత్ అమూల్ పాల బ్రాండ్ నగర మార్కెట్లోకి ప్రవేశించడం చిన్న డెయిరీల నిర్వాహకులను బెంబేలెత్తిస్తోంది. ఆ సంస్థ నగరంలో నిత్యం 50 వేల లీటర్ల పాలను విక్రయిస్తోంది. మార్కెట్ వాటా పెంచుకునేందుకు నగరంలో తమ పాలను మాత్రమే విక్రయించే డిస్ట్రిబ్యూటర్లకు అధిక మొత్తంలో కమీషన్లు ముట్టజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామంతో నగరంలోని చిన్న డెయిరీలకు నష్టం తథ్యమని నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రోగాల పాలు... నగరంలో విక్రయిస్తున్న పాల ప్యాకెట్లలో జీర్ణకోశ వ్యాధులకు కారణమయ్యే ఇ.కోలి, టైఫాయిడ్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాలతోపాటు కళ్లు, మెదడుకు హాని తల పెట్టే యూరియా ఆనవాళ్లు బయటపడుతున్నాయి.డెయిరీల నిర్వాహకులు పాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. వీటితో మెదడు, నరాలు, జీర్ణకోశవ్యవస్థ దెబ్బ తింటుంది. కొన్ని ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు గేదెలు అధిక పాలు ఇచ్చేందుకు పరిమితికి మించి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తుండడంతో వాటి ఆనవాళ్లు పాలల్లో కలిసిపోతున్నాయి. ఈ పాలను తాగిన పిల్లల్లో అసాధారణ పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి అనర్థాలు తలెత్తుతున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు డెయిరీల నిర్వాహకులు పాలు, పెరుగు, పన్నీరుల్లో కలిపే పౌడరు నాణ్యత లేనిది వాడుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టడంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు విఫలమవుతున్నారు. డెయిరీల్లో సరైన వసతులు, నిపుణులు లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో జనం రోగాల పాలు కావాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. నగరంలో విక్రయించే డబుల్ టోన్డ్, టోన్డ్, స్టాండర్డ్, హోల్ మిల్క్ ప్యాకెట్ల తయారీలో ఆహార రక్షణ చట్టం నిబంధనలను కంపెనీలు పాటించడం లేదు. పాలల్లో కొవ్వు శాతం, కరిగిన ఘన పదార్థాలను సంతృప్త స్థాయిలో ఉంచడం, బాక్టీరియా ఆనవాళ్లను తొలగించే విషయంలో డెయిరీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ కమిటీ అవసరం నగరంలో విక్రయిస్తున్న ప్రైవేటు డెయిరీల పాల నాణ్యత తనిఖీకి సాంకేతిక నిపుణులతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు, గుర్తింపు లేని కంపెనీలకు చెందిన పాల పౌడరు కలుపుతున్న డెయిరీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి. కల్తీ ఆనవాళ్లు బయట పడితే ఆ డెయిరీలను మూసేయాలి. - ఎస్వీడీబీఆర్ కృష్ణారెడ్డి, సీనియర్ డెయిరీ టెక్నాలజిస్టు అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలి పాలల్లో క ల్తీకి పాల్పడుతున్న డెయిరీలు, వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. సాల్మొనెల్లా, యూరియా, ఇ.కోలి ఆనవాళ్లున్న పాలు తాగిన పిల్లల కళ్లు, మెదడు, జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై ఫుడ్ యాక్ట్-34 ప్రకారం చర్యలు చేపట్టాలి. - అనురాధరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు -
సెల్‌ఫోన్ అడిగినందుకు హత్య
- వెదిరలో బాలుడి కిరాతకం - హతుడు బీహార్‌కు చెందిన కూలీ వెదిర(రామడుగు) : తీసుకున్న సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ యువకుడిని దారుణంగా చంపాడో బాలుడు. స్థానికుడిననే గర్వంతో బీహార్‌కు చెందిన వలస కూలీని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. గురువారం మండలంలోని వెదిరకు చెందిన బాలుడు(17) బీహార్‌కు చెందిన అమర్నాథ్(23)ను మారుకత్తితో నరికి చంపాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్ర కారం.. బీహార్‌కు చెందిన అమర్నాథ్ కొద్దిరోజులుగా వె దిరలో రాళ్లబండి నాగరాజురెడ్డికి చెందిన డెయిరీలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ క్రమంలో డెయిరీ సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న బాలుడితో ఆయనకు స్నేహం కుదిరింది. పనుల్లో ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. నాలుగు రోజుల క్రితం ఆ బాలుడు అమర్నాథ్కు చెందిన సెల్‌ఫోన్ తీసుకున్నాడు. వెంటనే ఇస్తానని తన వద్దే ఉంచుకుంటున్నాడు. గురువారం వ్యవసాయ బావి వద్దకు వచ్చిన బాలుడిని అమర్నాథ్ తన బంధువులతో మాట్లాడాలని, తన సెల్‌ఫోన్ ఇవ్వాలని అడిగాడు. ఇందుకు ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఒకరినొకరు తోసేసుకున్నారు. తన సెల్‌ఫోన్ లాక్కున్న అమర్నాథ్ గొడవ విషయాన్ని తన యజమాని నాగరాజురెడ్డికి ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన బాలుడు అక్కడున్న మారుకత్తి తీసుకుని అమర్నాథ్పై దాడి చేశాడు. దీంతో అతడు భయంతో పారిపోతుండగా వెంటాడి కింద పడేసి గొంతు కోసి చంపాడు. సమీప పంట పొలాల్లో పనిచేసుకుంటున్న కొందరు రైతులకు కేకలు వినిపించడంతో అటువైపు వచ్చారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న అమర్నాథ్ను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కత్తితో పారిపోతున్న బాలుడిని వెంబడించి పట్టుకున్నారు. అంతలోనే అమర్నాథ్ మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో చొప్పదండి సీఐ సత్యనారాయణ, రామడుగు ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాలకుండలో నష్టాల పొంగు
పాడి రైతుల కష్టంతో డెయిరీలకు లాభాలు పాల సేకరణ ధర పెంచని యాజమాన్యాలు ఏటా రెండుసార్లు పాల పదార్థాల ధర పెంపు తరచూ దాణా ధరల పెంపుతో రైతుల ఆందోళన పంట కలిసి రాకపోతేనేం... పాడి ఆదుకుంటుందని ఆశపడ్డారు. అష్టకష్టాలు పడి పశువులను పెంచుతున్నారు. ఎంత శ్రమించినా గిట్టుబాటు కాక విలవిల్లాడుతున్నారు. రైతుల కష్టంతో డెయిరీలు లాభాలార్జిస్తున్నాయి. పాల సేకరణ ధరను పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పశుగ్రాసం దొరక్క రైతాంగం అవస్థలు పడుతోంది. డెయిరీలు దాణా ధరను తరచూ పెంచుతుండటంతో నష్టాల బాట పడుతోంది. యలమంచిలి/యలమంచిలి రూరల్: జిల్లాలో పాడి పరిశ్రమకు కష్టకాలం దాపురించింది. పాడిపశువుల ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. పెరుగుతున్న దాణా ధరలు, అందుబాటులో లేని పశుగ్రాసంతో అన్నదాతలు పశువుల పెంపకంలో అష్టకష్టాలు పడుతున్నారు. దాణా ధరలు పెంచడంలో డెయిరీలు బహిరంగ మార్కెట్‌తో పోటీ పడుతున్నాయి. విశాఖ డెయిరీతోపాటు హెరిటేజ్, సుప్రజ, తిరుమల తదితర ప్రయివేట్ డెయిరీల ద్వారా పాలసేకరణ కేంద్రాల్లో పాలకు సరైన ధర లభించడం లేదు. మినీ డెయిరీలు, పాడిపశువుల పెంపకంపై అందరు ఆసక్తి చూపించేవారు. నిరుద్యోగులకు పాడి పరిశ్రమ ఉపాధి అవకాశంగా ఉండేది. ప్రస్తుతం పాల డెయిరీలు చెల్లిస్తున్న ధరలతో మినీ డెయిరీలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా డెయిరీల ద్వారా ఉత్పత్తి చేస్తున్న పాల పదార్థాల ధరలను ఏడాదికి రెండుమూడు సార్లు పెంచేస్తున్న యాజమాన్యాలు రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు ధర పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డెయిరీ యాజమాన్యాలు పాలకు గిట్టుబాటు ధరను చెల్లించడం లేదని రైతులు యాజమాన్యాలను కూడా నిలదీస్తున్నారు. పాల ఉత్పత్తి వ్యయం బోలెడు పూటకు 2 లీటర్ల పాలిచ్చే పశువుకు రోజుకు సుమారు 2 కేజీల దాణా పెట్టాలి. పచ్చగడ్డి లేదంటే అందుబాటులో ఉన్నట్టయితే ఎండు గడ్డిని పెట్టాలి. రోజుకు 4 లీటర్ల పాలకు 8.0 వెన్న శాతం వస్తే లీటరుకు రూ.37 వరకు డెయిరీలు చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన 4 లీటర్లకు రూ.148 వస్తే దాణాకు సుమారుగా రూ.60 ఖర్చవుతుంది. రైతుకు రోజు కూలీ ద్వారా వచ్చే ఆదాయం రూ.200 నుంచి రు.250లు. దీంతో పాడిపశువులను మేపుతున్న రైతులు రోజుకు రూ.100 నుంచి రూ.150ల వరకు నష్టపోవలసి వస్తోంది. క్షీణిస్తున్న వెన్న శాతం ప్రస్తుతం దాణా, పశుగ్రాసం కొరత వల్ల వెన్నశాతం కూడా తక్కువగానే ఉంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పాలసేకరణ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలలో వెన్నశాతం 6 నుంచి 8 శాతం వరకు మాత్రమే ఉంటోంది. పది శాతం వెన్న ఉన్నట్టయితే డెయిరీలు లీటరు గేదె పాలకు రూ.43 చెల్లిస్తున్నాయి. వెన్నశాతం లేకపోవడంతో రైతులు నష్టాలు చవిచూడవలసి వస్తోంది. గిట్టుబాటు చెల్లిస్తేనే జిల్లాలో చాలా కుటుంబాలు పాడిపశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. విశాఖ డెయిరీతోపాటు ప్రయివేటు డెయిరీల ద్వారా రోజుకు 8 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోంది. విశాఖ డెయిరీ మాత్రం గుడ్డిలో మెల్లగా (ప్రయివేటు డెయిరీలతో పోటీ ఉన్న గ్రామాల్లో) రూ.2 నుంచి రూ.3 వరకు అదనంగా చెల్లిస్తోంది. ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోవడంతో లీటరు గేదె పాలకు రూ.70, ఆవుపాలకు రూ.40 చెల్లిస్తేనే గిట్టుబాటువుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దంపతుల రోజు ఆదాయం రూ.50 అచ్యుతాపురం మండలం, తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లపు వెంకట ఆదిబాబుకు రెండు ఆవులున్నాయి. ఏడాది పొడవున సరాసరి రోజుకు 8 లీటర్ల పాలు పోస్తున్నాడు. ఏడాదిలో ఈయనకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. దాణా, మందులు, గడ్డికి 30 శాతం ఖర్చవుతుంది. రైతుకు మిగిలింది ఏటా రూ.30 వేలే. నెలకు రూ.1500 గిట్టుబాటవుతుంది. అంటే రోజుకు రూ.50 ఆదాయం వస్తుందన్నమాట. ఉదయం నుంచి రాత్రివరకూ రెండు ఆవులతో ఆదిబాబు, ఆయన భార్య పనిచేస్తారు. కూలి గిట్టుబాటు కాలేదని ఆదిబాబు వాపోతున్నాడు. దడ పుట్టిస్తున్న దాణా ధర మార్కెట్లో పెరుగుతున్న దాణా ధరలతో పాడిరైతులు మరింత నష్టపోవలసి వస్తోంది. విశాఖ డెయిరీ ద్వారా 50 కేజీల దాణాను రూ.550కి సరఫరా చేస్తున్నారు. అయిదు నెలల క్రితం దాణా ధర రూ.500 ఉండేది. ఇక మార్కెట్లో ఏడాది క్రితం వరకు రూ.350 ఉన్న తౌడు బస్తా ధర రూ.450కు చేరింది. వరిగడ్డి అందుబాటులో లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా నుంచి ట్రాక్టరు ఎండుగడ్డిని రూ.6 వేల నుంచి రూ.7వేల వరకు కొలుగోలు చేస్తున్నారు. నీళ్ల ధర భేష్ మార్కెట్లో లీటర్ మంచినీళ్ల సీసా ధర రూ.20లు, మంచినీళ్ల ప్యాకెట్ ధర రూ.2. నీరు ఉచితంగా వచ్చేదే. నీటిని శుద్ధి చేసేందుకు, బాటిల్, ప్యాకింగ్ తదితర ఖర్చు రూ.5 నుంచి రూ.6. రిటైల్ వ్యాపారులు లీటరు సీసాను రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని రూ.20కి వినియోగదారులకు అమ్ముతున్నారు. కూలికెళ్తే రూ.250...పాలు పోస్తే రూ.40 అచ్యుతాపురం మండలం, తిమ్మరాజుపేటకు చెందిన జగన్నాథరావుకు ఆవు, గేదెలున్నాయి. జగన్నాథరావు డెయిరీకి ఏడాది పొడవున సరాసరి లెక్కవేస్తే 4 లీటర్ల పాలు పోస్తున్నాడు. ఏడాదికి జగన్నాథరావుకి రూ.25 వేలు చెల్లిస్తారు. దాణా, ఇతర ఖర్చులకు రూ.10 వేలు అవుతుంది. జగన్నాథరావుకు మిగిలేది రూ.15 వేలే. నెలకు రూ.1250 మిగులుతుంది. అంటే రోజుకు రూ.40 గిట్టుబాటవుతుంది. రాత్రింబవళ్లు పశువులను కనిపెట్టుకుని ఉండాలి. కూలికి పోతే రోజుకు రూ.250 ఇస్తున్నారు. పాడి గిట్టుబాటు కావడం లేదని జగన్నాథరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
ప్రభుత్వ ఉద్యోగం కన్నా స్వయం ఉపాధి మిన్న
అధునాతన మిషన్ల సాయంతో పాల సేకరణ సాక్షి, బళ్లారి : నేటి యువత మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ పెంచుకుంటున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వశక్తితో ముందుకు వెళుతూ పలువురికి మార్గదర్శకంగా నిలిచాడు ఒక ఇంజనీరింగ్ పట్టుభద్రుడు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా గుండుముణుగు గ్రామానికి చెందిన తిప్పేస్వామి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. అనంతరం మరొకరి కింద ఎందుకు పని చేయాలనుకుని ఉద్యోగానికి స్వస్తి చెప్పి తనకున్న పొలంలో వ్యవసాయంపై దృష్టి పెట్టారు. పండ్ల తోటల పెంపకంతోపాటు పాడి పరిశ్రమపై మరింత దృష్టి సారించాడు. రూ.40 లక్షలతో పాడి పరిశ్రమను స్థాపించాడు. 20 జర్సీ ఆవులతో పాడి పరిశ్రమను ఏర్పాటు చేశాడు. అందుకు అధునాతన షెడ్లు, యంత్రాలు ఏర్పాటు చేసి పాలు పితకడానికి ప్రత్యేక మిషన్లు ఏర్పాటు చేశారు. ఆవు పేడతో గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆవు పేడతో వచ్చిన గ్యాస్ వల్ల విద్యుత్ ప్లాంటును కూడా ఏర్పాటు చేశాడు.తద్వారా రెండు మోటార్లు ఆడే విధంగా సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి రోజు 200 నుంచి 300 లీటర్ల పాల ఉత్పత్తితోపాటు ఈ సందర్భంగా న్యూస్‌లైన్‌తో తిప్పేస్వామి మాట్లాడుతూ రైతే రాజు అని నిరూపించేందుకు తాను 20 ఆవులను పెంచి ప్రతి రోజు 300 లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నానన్నారు. నలుగురు కూలీలు, మేత, దాణా ఖర్చు పోను నెలకు లక్ష రూపాయలు మిగులుతోందన్నారు. పాడిపరిశ్రమ వల్ల పాలు పితికే యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నానని, దీని వల్ల పని ఒత్తిడి తగ్గిందన్నారు. -
కష్టాలకు ‘మంగళం’
ఇప్పుడందరూ గుజరాత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ గత ఐదేళ్లుగా ‘మంగళం మిషన్’ పేరుతో జరుగుతున్న అభివృద్ధి పనులు మహిళలకు అండగా నిలిచాయి. మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం రావడంతో సగం కష్టాలు తీరిపోతాయన్నది అక్షరాలా నిజం. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పాలనాయంత్రాంగం ‘మంగళం మిషన్’ని ఏర్పాటు చేసింది. దీనికింద రెండు లక్షలకు పైగా ‘సఖి మండల్స్’ పనిచేస్తున్నాయి. దాదాపు పాతిక లక్షలమంది మహిళలు ఈ మండలాలలో సభ్యులుగా ఉన్నారు. స్వయం ఉపాధి బృందాలుగా ఏర్పడి ఈ మహిళలంతా రకరకాల వ్యాపారాలు చేస్తూ...చూస్తుండగానే తిరుగులేని వ్యాపారస్థులుగా స్థిరపడిపోయారు. పసుపు తయారీ నుంచి పాడిపరిశ్రమ వరకూ కొన్ని వందల ఉపాధి మార్గాలతో ఉద్యోగినులకు దీటుగా నిలబడ్డారు. ‘కెర్గామ్’ అనే గ్రామంలో లిల్లీతోటను సాగుచేస్తూ అక్కడి సఖి మండల్ మహిళలు ఆర్జిస్తున్న లాభాలను చూసి మామూలు రైతులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. వడోదరా జిల్లాలోని మరో మారుమూల గ్రామానికెళితే 300 మంది మహిళలు సభ్యులుగా ఉన్న సఖి బృందం ‘డెయిరీ’ వ్యాపారం చేస్తున్నారు. నెలకు 7 లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న వీరి పనితీరు చూడడానికి పాలవ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. -
పాల కంపెనీ కొంప ముంచిన 'మిల్కీ బ్యూటీలు'
డెయిరీ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ ఉద్యోగులందరూ స్వీట్లు, చాకొలెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే టబ్బుల కొద్దీ పాలల్లో సరిగంగ స్నానాలు చేయడం ఇప్పుడు రష్యాలోని ఒక చీజ్ ఫ్యాక్టరీ కొంప ముంచేసింది. ఉద్యోగులు స్నానాలు చేయడమే కాదు, తమ పాలజలకాలాటను వీడియో తీసి యూట్యూబ్ లో కూడా పెట్టేశారట. అదిప్పుడు ప్రపంచమంతా చూసేసింది. కంపెనీ ఉత్పత్తులు కొనడానికి ఇక ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు సైబీరియా ప్రాంతంలోని ఓమ్స్క్ అనే చోట ఉన్న ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రష్యన్ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది. 'ఈ పాలతోనే కంపెనీ పాలుత్పత్తులను తయారు చేస్తోందన్నది నిజం. కాబట్టి విచారణ చేసి దోషులను శిక్షించడం తప్పనిసరి.' అని ఒక అధికారి ప్రకటించాడు. ఆరుగురు ఉద్యోగులు షార్ట్ర్ తప్ప మరేమీ లేకుండా ఈ పాల తొట్టిలో మునిగి తేలుతూ విక్టరీ సింబల్ ను చూపిస్తున్న వీడియోలను యూట్యూబు లో మూడు లక్షల మంది చూశారు. ఓమ్స్క్ చీజ్ కంపెనీ ఏటా 49 టన్నుల చీజ్ ను తయారు చేసి అమ్ముతుంది. ఇప్పుడు ఈ జలకాలాట ఫ్యాక్టరీ యజమానికి ప్రాణసంకటంగా మారింది.