గేటు వద్ద పాడి రైతు ఏర్పాటు చేసిన పైపులు
మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే మదనపల్లె పట్టణ సమీపంలోని సుధాకర్ అనే పాడి వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి సురక్షిత పద్ధతిలో పాల కొనుగోలు, అమ్మకాలను సాగిస్తున్నారు. ఇంటి ముందు ప్రధాన గేటు వద్దనే రెండు పెద్ద పైపులు ఏర్పాటు చేశారు.
అందులో ఒకటి పాడి రైతులు తనకు పాలు పోయడానికి, మరో పైపు కొనుగోలుదారులకు తాను పాలు పోయడానికి ఏర్పాటు చేసుకున్నారు. కొనుగోలుదారులు డబ్బులు గేటు వద్ద పెడితే ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని పైపు ద్వారా పంపుతున్నారు. పాడి రైతులు తీసుకొచ్చే పాలు పైపులో పోస్తే లోపల క్యానులో పడుతున్నాయి. పాలు కొలత కోసం వేబ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారు. కరోనా ప్రబలకుండా భౌతికదూరం పాటించేందుకు సుధాకర్ చేసిన ఈ సరికొత్త ఆలోచన పలువురిని ఆకర్షిస్తోంది.
చదవండి: కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు
కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment