
సాక్షి, తిరుపతి: కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు వైఎస్ జగన్ సర్కార్ అండగా నిలిచింది. చిత్తూరు జిల్లాలో ఐదు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది. జీడీనెల్లూరు మండలం బుక్కపట్నంలో శివకుమార్ అనే వ్యక్తి కరోనాతో మృతి చెందగా, ఆయన కుమార్తె సంజుకు రూ.10 లక్షల చెక్కును మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి అందజేశారు. కరకంబాడికి చెందిన సుబ్రహ్మణ్యం ఇటీవల కరోనాతో మృతి చెందగా, సుబ్రహ్మణ్యం కుమార్తె పూజితకు రూ.10 లక్షల చెక్కు మంత్రులు అందజేశారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు
చదవండి: ప్రైవేట్ ఆసుపత్రులు: రెండోసారి తప్పు చేస్తే క్రిమిన్ కేసులు
2 years YSJagan ane nenu: మానవీయ కోణంలో అభివృద్ధి అడుగులు
Comments
Please login to add a commentAdd a comment