Idea
-
సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..
జియో, ఎయిర్టెల్ కంపెనీలు యూజర్లను ఆకర్షిస్తున్న వేళ.. 'వోడాఫోన్ ఐడియా' (VI) వినియోగదారుల కోసం ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 209 మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ అన్ని రకాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 209 రూపాయల ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా, రోజుకు 2జీబీ డేటా అందిస్తుంది. అంతే కాకుండా 300 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు రూ.199 ప్లాన్‌కు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.209 ప్లాన్‌లో కంపెనీ అపరిమిత కాలర్ ట్యూన్లను అందిస్తోంది. రూ. 209 ప్లాన్ కాకుండా.. కంపెనీ రూ. 218, రూ. 249, రూ. 289 ప్లాన్స్ కూడా అందిస్తోంది.రూ. 218 ప్లాన్కంపెనీ రూ.218 ప్లాన్ ద్వారా 1 నెల వాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో, మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 3జీబీ డేటాను పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ప్లాన్‌లో.. కంపెనీ అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. 300 ఎస్ఎమ్ఎస్ల పరిమితి ముగిసిన తర్వాత.. ఒక్కో లోకల్ ఎస్ఎమ్ఎస్ కోసం రూ.1, ఎస్టీడీ ఎస్ఎమ్ఎస్ కోసం రూ. 1.5 పైసలు చెల్లించాల్సి వస్తుంది.రూ. 249 ప్లాన్కంపెనీ అందించే.. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, ప్లాన్‌లో అందించే ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 100 ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. దీనితో పాటు, మీరు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు.రూ. 289 ప్లాన్ఈ ప్లాన్ ద్వారా మీరు 40 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. 4 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ఈ ప్లాన్ 600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండిమొబైల్ రీఛార్జ్ మరింత భారం అవుతుందా?రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది. -
Business Idea: చలికాలంలో అల్లం వ్యాపారం.. జేబుకు ‘వెచ్చదనం’.. లక్షల్లో ఆదాయం
ప్రస్తుతమున్న రోజుల్లో అందరూ అధిక ఆదాయాన్ని సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఇందుకు తగిన ప్రయాత్నాలు కూడా చేస్తుంటారు. దీనిలో కొందరు సఫలమవుతుంటారు. మరికొందరు విఫలమవుతుంటారు. అయితే ప్రస్తుత శీతాకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయమిచ్చే వ్యాపారం గురించి తెలుసుకుందాం.ఇటీవలి కాలంలో చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనికి ప్రభుత్వసాయం కూడా అందుతుంది. అందుకే అధిక లాభాలనిచ్చే అల్లంసాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం అనేది టీలో వినియోగించడం మొదలుకొని కూరలలో వేసేవరకూ అన్నింటా ఉపయుక్తమవుతుంది. అందునా చలికాలంలో అల్లాన్ని విరివిగా వినియోగిస్తుంటారు. పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో కూరలు వండేటప్పుడు అల్లాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు.అల్లాన్ని నీటి ఆధారితంగా సాగు చేస్తుంటారు. హెక్టారు భూమిలో అల్లం సాగుచేయాలనుకుంటే రెండు క్వింటాళ్ల నుండి మూడు క్వింటాళ్ల వరకూ విత్తనాలు అవసరమవుతాయి. సాగు సమయంలో సరైన గట్లను సిద్ధం చేసుకోవాలి. సరైన కాలువలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అల్లం సాగుకు నీరు సక్రమంగా అందుతుంది. నీరు నిలిచిపోయే పొలాల్లో అల్లం సాగు చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అల్లం సాగుకు పీహెచ్(పొండస్ హైడ్రోజెని) 6 నుండి పీహెచ్ 7 వరకు ఉన్న భూమి మెరుగైనదిగా పరిగణిస్తారు.అల్లం మొక్కల మధ్య దూరం 25 నుండి 25 సెం.మీ మధ్య ఉండాలి. విత్తనాల మధ్య దూరం 30 నుండి 40 సెం.మీ మధ్య ఉండాలి. సమయానుసారంగా ఆవు పేడను ఎరువు మాదిరిగా వేయాలి. అల్లం పంట చేతికి వచ్చేందుకు 8 నుంచి 9 నెలల సమయం పట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అల్లం మంచి ధరలకు అమ్ముడవుతోంది. ఒక హెక్టారుకు అల్లం దిగుబడి సుమారు 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు ఉంటుంది. దీనిని విక్రయించడం ద్వారా లక్షల రూపాయాల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇది కూడా చదవండి: 10 లక్షల పూలతో ఫ్లవర్ షో.. చూసి తీరాల్సిందే! -
రైతు అదిరిపోయే ఐడియా
-
వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త..అదనంగా
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ వీఐ నెట్ వర్క్ సబ్ స్క్రైబర్లు 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం అదనపు డేటాను అందిస్తోంది.ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ‘వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. 5జీ, 4జీ ఫోన్ వినియోగదారులందరికీ 130 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌ను ఎంచుకున్న యూజర్లకు మరో ఏడాది పాటు ఈ డేటాను పొందవచ్చని వీఐ పేర్కొంది. 13 వరుస సైకిళ్లకు ప్రతి 28వ రోజు ఆటోమేటిక్‌గా 10జీబీ జమ అవుతుందని కంపెనీ ఒక విడుదలలో తెలిపింది.ఈ సందర్భంగా వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ..దేశంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్ల వారి 4జీ/5జీ స్మార్ట్ ఫోన్ వినియోగం సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదని చెప్పారు. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
'దీపెన్' దారి దీపం..
'సమస్య గురించి నిట్టూర్చేవారు కొందరు. సమస్యకు పరిష్కారం వెదకాలని ప్రయత్నించేవారు కొందరు. దీపెన్ బబారియా రెండో కోవకు చెందిన వ్యక్తి. కాలేజీ రోజుల్లో ఎదురైన సమస్య స్టార్టప్ ఐడియాకు ఊపిరి పోసింది. ఇనోవేటర్గా, ‘రోడ్మాట్రిక్స్’ రూపంలో సక్సెస్ఫుల్ ఎంటర్ ప్రెన్యూర్‌గా దీపెన్ను మార్చింది..' దీపెన్ బబారియా అతని ఫ్రెండ్ ఒకరోజు రాత్రి పనిపై బైక్‌పై ఎక్కడికో వెళుతున్నారు. లొకేషన్ తెలియక నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేశారు. ‘ఫాస్టెస్ట్ రూట్’ అని చూపించింది. తీరా చూస్తే అది గుంతలతో కూడిన రోడ్డు. మరోవైపు స్ట్రీటు లైట్లు లేకపోవడంతో బైక్ ముందుకు వెళ్లడానికి ఇబ్బంది ఎదురైంది. ‘దూరం, వేగాన్ని లెక్కలోకి తీసుకొని ఈ మ్యాప్స్ షార్టెస్ట్ రూట్‌ను గుర్తిస్తాయి తప్ప అధ్వానంగా ఉన్న రోడ్లను మాత్రం గుర్తించవు’ అంటున్న దీపెన్ ఈ సమస్యకు ఏఐ ద్వారా పరిష్కారం చూపాలని కాలేజిరోజులలో గట్టిగా అనుకున్నాడు. సూరత్(గుజరాత్)కు చెందిన దీపెన్ ఏఐ స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజుల్లో రోడ్ల స్థితిగతులను తెలిజేసే అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్ల కోసం రూపొందించానుకున్నాడు. ఈ ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదై స్టార్టప్ రూపం తీసుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కలతో స్టార్టప్‌ల కేంద్రం అయిన బెంగళూరులో అడుగు పెట్టాడు దీపెన్. అక్కడ దీపెన్ ఐడియాపై నిఖిల్ ప్రసాద్ ఆసక్తి చూపించాడు. యూఎస్‌లో ఆటోమోటివ్ కారు కంపెనీలలో పని చేసిన నిఖిల్ ఇండియాకు తిరిగి వచ్చాడు. స్టార్టప్ కో–ఫౌండర్లలో నిఖిల్ ఒకరు. తక్కువ సమయంలోనే ఈ స్టార్టప్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు. 100ఎక్స్.వీసి ఫస్ట్ ఫండింగ్ చేసింది. రోడ్ మేనేజ్మెంట్ ప్లానును అందించే ఏఐ–బేస్డ్ స్టార్టప్ ‘రోడ్‌మెట్రిక్స్’ బెంగళూరు కేంద్రంగా ్రపారంభమైంది. ‘కాలేజీరోజుల్లో ఎన్నో ప్రాజెక్ట్‌ల్లో పనిచేసిన నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా అనిపించింది. రోడ్డు సేఫ్టీ అనేది ముఖ్యమైన అంశం. అయితే రోడ్డు హెల్త్‌ను తెలియజేసే సాఫ్ట్వేర్లు మన దగ్గర లేవు. ఈ లోటును పూరించేలా రోడ్మెట్రిక్స్ను తీసుకువచ్చాం’ అంటాడు దీపెన్. మొబైల్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని మొదట్లో అనుకున్న ఐడియాపై వర్క్ చేశాడు దీపెన్. మొబైల్ అప్లికేషన్‌గా పనిచేసే సెన్సర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం బాగున్నప్పటికీ వైబ్రేషన్స్‌ను క్యాప్చర్ చేయడానికి రోడ్డు ప్రతి భాగంలో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇదొక సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర కో–ఫౌండర్లతో కలిసి దీపెన్ మరింత రిసెర్చ్ చేసి ఇమేజ్ బేస్డ్, కంప్యూటర్ విజన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. వీరు రూపొందించిన ఏఐ అల్గారిథమ్ పది రకాల రోడ్ డిఫెక్ట్స్‌ను గుర్తిస్తుంది. ఫాస్టెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్, ట్రాఫిక్లెస్ రోడ్లను గుర్తించడానికి వినియోగదారులకు ఉపకరించే రోడ్‌మెట్రిక్స్ మ్యాప్స్‌ను కూడా అభివృద్ధి చేశారు. మొదట బెంగళూరు, ముంబై రోడ్లను మ్యాపింగ్ చేసిన తరువాత అస్సాం, బిహార్లలో కూడా పనిచేశారు. ‘మా సాఫ్ట్వేర్ అంచనా వేసిన డ్యామేజ్ రిపోర్ట్‌ల ఆధారంగా మున్సిపాలిటీలు, ప్రైవేటు సంస్థలు నిధుల కేటాయింపు గురించి సరిౖయెన నిర్ణయం తీసుకోవచ్చు’ అంటున్న దీపెన్ రోడ్డు సమస్యలను గుర్తించడంలో జంషెడ్‌పూర్‌లోని టాటాగ్రూప్‌నకు సహాయం అందించాడు. టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్న ‘రోడ్‌మెట్రిక్స్’ ప్రభుత్వ మున్సిపాలిటీలతో పనిచేయడానికి చర్చలు జరుపుతోంది. మన దేశంలో వేలాది కిలోమీటర్లు కవర్ చేసిన కంపెనీ ఇక్కడితో ఆగిపోలేదు. ‘సిటీ ఆఫ్ లండన్’ మ్యాపింగ్ కూడా స్టార్ట్ చేసింది. అక్కడ కూడా స్టార్టప్‌కు క్లయింట్స్ ఉన్నారు. ‘మన రహదారులను సాధ్యమైనంత సురక్షితంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలనుకుంటున్నాం’ అంటున్నాడు దీపెన్ బబారియ. ‘రోడ్ మెట్రిక్స్’ స్టార్టప్ మొబిలిటీ ఏఐ గ్రాండ్ ఛాలెంజ్, బెస్ట్ ఏఐ స్టార్టప్ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్‌లను సొంతం చేసుకుంది. ఇవి చదవండి: వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్ ఏంటంటే..? -
మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా సంస్థలో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, క్లిప్‌లు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా స్పందించింది. స్టార్లింగ్ తమ కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రకటించింది. వాటా కొనుగోలుకు అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. సామాజికమధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మకూడదని చెప్పింది. ఏ సమాచారమైన అధికారిక వెబ్‌సైట్‌ల్లో సరిచేసుకోవాలని తెలిపింది. ఇదీ చదవండి: కొత్త కార్ల పరుగు దేశంలో తొలిసారి టెలికాం రంగంలో ప్రవేశించేందుకు స్టార్‌లింక్ వోడాఫోన్ ఐడియాతో జతకట్టవచ్చనే ప్రచారం వల్ల వీఐ షేర్లు ఇటీవల భారీగా ర్యాలీ అయ్యాయి. స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రభుత్వం వీఐలో తన 33.1 శాతం వాటాను మస్క్‌కు విక్రయించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. మస్క్ వచ్చే వారం వైబ్రెంట్ గుజరాత్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత్ రానున్న నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధ్యాన్యం సంతరించుకుంది. -
ఆ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది! అదే!..ఆర్ట్ ఆఫ్ జోషిగా..
‘ఈ పనికి నేను తగను’ అనుకునే వాళ్లు కొందరు. ‘తగ్గేదే లే’ అని ముందుకు వెళ్లే వాళ్లు కొందరు. రెండో వర్గం వారికి తమ దారిలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయితే వారిలోని ఉత్సాహ శక్తి ఆ అవరోధాలను అధిగమించేలా చేసి విజేతను చేస్తుంది. సౌరవ్ జోషి ఈ కోవకు చెందిన కుర్రాడు. 24 సంవత్సరాల జోషి ఫోర్బ్స్ ‘టాప్ డిజిటల్ స్టార్స్–2023’లో చోటు సంపాదించాడు...జోషి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఆల్మోర. హరియాణాలోని హన్సిలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. తండ్రి కార్పెంటర్. తల్లి గృహిణి. ఇంటర్మీడియెట్‌లో ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్లో తన స్కెచ్–మేకింగ్ వీడియోలను పోస్ట్ చేసేవాడు. తొలి రోజుల్లో ‘హౌ ఐ డ్రా యంఎస్ ధోనీ’ టైటిల్‌తో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే లాక్డౌన్ టైమ్‌లో ఈ వీడియో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఉత్సాహంతో ‘365 వీడియోస్ ఇన్ 365 డేస్’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జోషి. ఈ చాలెంజ్ అతడి జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. సౌరవ్ జోషిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఏ వీడియో చేసినా లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం మొదలైంది. పన్నెండు మిలియన్ల సబ్స్క్రైబర్లతో జోషి చానల్ ‘ఫాస్టెస్ట్–గ్రోయింగ్ యూట్యూబ్ చానల్’జాబితాలో చేరింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు జోషి. జోషి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరిచాడు జోషి. ‘ఇప్పటికీ ఇది నిజమా? కలా? అని అనుకుంటాను. మొదట్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చాలా నిరాశగా అనిపించేది. 365 డేస్ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది’ అంటాడు జోషి. షేడింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్, హౌ టూ డ్రా ఏ పర్ఫెక్ట్ ఐ, హూ టూ యూజ్ చార్కోల్ పెన్సిల్, డ్రాయింగ్ టూల్స్ ఫర్ బిగినర్స్... ఒకటా రెండా జోషి చానల్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు పాపులర్ అయ్యాయి. ఎంతోమందిని ఆర్టిస్ట్‌లను చేశాయి. ‘మీరు వయసులో నా కంటే చాలా చిన్నవాళ్లు. నేను అప్పుడెప్పుడో బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత ఉద్యోగ జీవితంలో పడి డ్రాయింగ్ పెన్సిల్‌కు దూరమయ్యాను. మీ వీడియోలు చూసిన తరువాత మళ్లీ పెన్సిల్, పేపర్ పట్టాను. నేను మళ్లీ ఆర్టిస్ట్‌గా మారడానికి మీరే కారణం’ .....ఇలాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది ఎందుకూ పనికి రాని వీడియో’లాంటి ఘాటైన కామెంట్స్ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంటాయి. అయితే ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు కృంగిపోవడం అంటూ జోషి విషయంలో జరగదు. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆర్ట్‌లోనే కాదు ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్లోనూ దూసుకుపోతున్నాడు సౌరవ్ జోషి. ఒక్క ఐడియా చాలు మనం వెళ్లగానే ‘సక్సెస్’ వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటాం. అది జరగకపోయేసరికి నిరాశ పడతాం. ‘ఇది మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు’ అని వెనక్కి వెళ్తాం. సక్సెస్ కావడానికి, కాకపోవడానికి అదృష్టం ప్రమేయం ఎంత మాత్రం ఉండదు. మన టాలెంట్ మీద మనకు ఎంత నమ్మకం ఉంది, విజయం కోసం ఎదురుచూడడంలో ఎంత ఓపిక ఉంది అనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. అందరిలాగే నేను కూడా మొదట్లో బాగా నిరాశపడిపోయాను. అయితే వెనక్కి మాత్రం పోలేదు. మరో సారి ట్రై చేసి చూద్దాం...అని ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఐడియాతో నా జీవితమే మారిపోయింది. – సౌరవ్ జోషి (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్
దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారత మార్కెట్లో 5జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. వొడాఫోన్ ఐడియా 5జీ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వొడాఫోన్ ఐడియా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఢిల్లీ, పూణేలోని నిర్దిష్ట ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే 'విఐ 5జీ రెడీ సిమ్' ఉపయోగించి కనెక్షన్ పొందవచ్చు అని పేర్కొంది. దేశంలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలకు ఊతం ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా ఆగస్టులో 26జీహెచ్, 3.3జీహెచ్‌జెడ్ బ్యాండ్లను ఉపయోగించి పూణేలో 5G సేవలను విజయవంతంగా పరీక్షించింది. గత ఏడాది జులైలో స్పెక్ట్రమ్ వేలం అయితే, గత ఏడాది జూలై నెలలో జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 17 టెలికం సర్కిళ్లను సొంతం చేసుకుంది. కానీ వాటిల్లో 15 సర్కిళ్లలో 5జీ నెట్వర్క్ని అందించలేమని ఆ సంస్థ సీఈవో అక్షయ్ మూంద్రా తెలిపారు. ఆసక్తికర పరిణామాలు ఈ నేపథ్యంలో ఇండియా ముబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఈవెంట్లో వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ.. దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు దశల వారీగా 4జీ, 5జీ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ తరుణంలో వొడాఫోన్ 5జీ సేవలు రానున్నాయనే నివేదికలతో టెలికం రంగంలో ఆసక్తిర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. -
పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!
జీవితంలో నువ్వు గొప్ప వాడివి కావాలంటే డబ్బు సంపాదించాలి.. అయితే ఇది అనుకున్న సులభమైతే కాదు, కానీ మనిషి అనుకుంటే అసాధ్యం మాత్రం కాదు. ఇప్పుడు కంపెనీలు ప్రారంభించాలా అని సందేహం రావొచ్చు.. అవేమీ అవసరం లేకుండానే మొక్కలు పెంచి కూడా నీదైన మెలకువలతో తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. ఈ కథనంలో బోన్సాయ్ మొక్కలు పెంచి లక్షలు ఎలా సంపాదించాలో వివరంగా తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా నర్సరీకి లేదా గార్డెన్ వంటి వాటికి వెళ్ళినప్పుడు చిన్నగా.. ఎంతో ముద్దుగా కనిపించే 'బోన్సాయ్' (Bonsai) మొక్కలు పెంచి తప్పకుండా లాభాలను పొందవచ్చు. జపనీస్ కళాకృతి మాదిరిగా ఉండే మొక్కలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఎంతోమందిని ఆకర్షిస్తాయి. వీటిని ఇంట్లో ఓ మూల కుండీలో ఉంచి కూడా సులభంగా పెంచుకోవచ్చు. మార్కెట్లో ధర.. ప్రపంచ వ్యాప్తంగా గ్రీనరీని ఇష్టపడే చాలామంది ఈ మొక్కలను ఎంతో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో వీటి ధర రూ. 200 నుంచి రూ. 2500 వరకు ఉన్నాయి. వీటి పెంపకం సాధారణ మొక్కల పెంపకం కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. అయితే దీని పెంపకం గురించి కొంత అవగాహనా కలిగి మొదలు పెడితే చాలా సులభంగా పెంచుకోవచ్చు. బోన్సాయ్ మొక్కలు పెంపకానికి ప్రధానంగా కావలసింది మట్టిని ఎంచుకోవమే. మొక్క నాటడం, చిగురించే ప్రక్రియ, పొడవు వంటివన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని పువ్వులు వచ్చే వారకు సాగు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కావున కొంత ఓపిక అవసరం. పెంపకం విధానం.. ఈ మొక్కల పెంపకం ప్రారంభించాలనుకునే వారు కొంత భూమి కలిగి నీటి వసతి కూడా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. భూమిలేని వారు కూడా 100 నుంచి 150 చదరపు అడుగుల టెర్రస్ ఉన్నా చేసుకోవచ్చు. దీనికి మట్టి కుండలు లేదా గాజు కుండలు, శుభ్రమైన గులకరాళ్లు, నీటిని చల్లడానికి ఒక స్ప్రే బాటిల్ వంటివి సమకూర్చుకోవాలి. ఒక చిన్న షెడ్ మాదిరిగా నిర్మించాలనుకుంటే నెట్ కూడా అవసరం ఉంటుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! తక్కువ పెట్టుబడితో కూడా బోన్సాయ్ మొక్కల పెంపకం ప్రారభించవచ్చు. కానీ లాభం పొందటానికి కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. మొక్క కొంత పెరిగిన తరువాత సుమారు 30 నుంచి 50 శాతం అధిక ధరకు విక్రయించవచ్చు. గతంలో ఓ బోన్సాయ్ మొక్క ఏకంగా రూ. 9 కోట్లకు అమ్ముడైంది అంటే దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! సగటు ఖర్చు.. ఒక మొక్కను మూడు సంవత్సరాలు సాగు చేయడానికి సగటున రూ. 240 ఖర్చు అవుతుంది. అయితే ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఒక్కో మొక్కకు రూ. 120 అందిస్తుంది. ఇందులో కూడా మీకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తాయి. ఉదాహరణకు మీరు వంద మొక్కలు పెంచడానికి రూ. 24000 ఖర్చవుతుంది. ప్రభుత్వం మొక్కకు 120 అందిస్తుంది కావున వంద మొక్కలకు 12000 అందిస్తుంది. ఇందులో మీకు సబ్సిడీ రూ. 6000 లభిస్తుంది. ఈ లెక్కన మీకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ సబ్సిడీలను పూర్తిగా ముందుగానే తెలుసుకుంటే మంచిది. కొంత మంది రైతులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒక హెక్టారులో 3 x 2.5 మీటర్ల విస్తీరణంలో 1500 నుంచి 2500 చెట్లను పెంచవచ్చు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో కూడా మరో పంట పండించుకోవచ్చు. మొత్తం మీద నెలకు సుమారు రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించవచ్చు. రీప్లాంటేషన్ కూడా పెద్దగా అవసరం ఉండదని చెబుతున్నారు. -
పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
చంటిపిల్లలతో ఏదైనా పనిచేయించాలంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకువస్తుంటుంది. అదొక పెద్ద టాస్క్‌లా మారిపోతుంది. చిన్నపిల్లలకు హెయిర్ కటింగ్ చేయించాలన్నా, ఇంజక్షన్ చేయించాలన్నా, ఫొటో తీయాలన్నా అది పెద్దలకు శక్తికి మించిన పనిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏడుపునకు దిగితే ఇక తల్లిదండ్రుల తల పట్టుకోవాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి అనుసరించిన పద్దతి ఎంతో చక్కగా ఉన్నదంటూ, అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయించాలనుకున్నాడు. అయితే అతని కుమార్తె ఫొటోకు అనుగుణంగా కుర్చీలో కూర్చొనేందుకు సహకరించ లేదు. ఆ చిన్నారి కుర్చీలో కూర్చుంటేనే ఫొటో తీయగలనని ఫొటోగ్రాఫర్ అన్నాడు. దీనికి అతని తండ్రి సమాధానమిస్తూ తన కుమార్తె తన చంకలో నుంచి దిగడం లేదని, కుర్చీలో కూర్చొనేందుకు సహకరించడం లేదని తెలిపాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? ఫొటోగ్రాఫర్ అడగగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని తండ్రి సమాధానమిచ్చాడు. కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రికి వచ్చిన ఐడియా ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తన కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రి కుర్చీలో కూర్చుని, తనపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆ చిన్నారికి ఫొటో తీశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన యూజర్స్ తండ్రి అనుసరించిన టెక్నిక్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ‘మీ అమ్మాయి ఎంతో ముద్దొస్తోంది. మీరు ఎంతో తెలివైనవారు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘నా కుమారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఇలానే తీయాల్సి వచ్చిందని’ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..! Passport worker - We're gonna need the baby to sit on the chair for the photo. Dad - She won't let me put her down. Passport worker - You're gonna need to figure something out if you want a passport picture. Dad - I got an idea... pic.twitter.com/cx9sm5EsBl — Yair Menchel (@yairmenchel) July 20, 2023 -
ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!
మనదేశంలో ప్రముఖ టెలికాం సర్వీసులైన జియో, ఎయిర్ టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పుట్టుకొస్తున్నాయి. 5జీ రంగంలో దూసుకెళ్తున్న కంపెనీలతో పోటీ పడటంలో వోడాఫోన్ ఐడియా కొంత వెనుకపడ్డాయి. ఈ కారణంగా ఈ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వోడాఫోన్, ఐడియా కొత్త ప్లాన్లు, ఆఫర్స్ తీసుకువచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువగా జియో సేవలకు ఆసక్తి చూపుతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించడానికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 5జీబీ డేటా ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఆఫర్ కింద రూ. 299తో గానీ అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఆఫర్ పొందవచ్చని వోడాఫోన్ ఐడియా ప్రకటించాయి. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న మూడు రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 199 నుంచి రూ. 299 మధ్య ఉన్న వివిధ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకున్న వారికి 2జీబీ డేటా ఫ్రీగా వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ డేటాతో మీరు వీఐ మూవీస్, టీవీ, వీఐ మ్యూజిక్, వీఐ గేమ్స్, ఆండ్రాయిడ్ గేమ్స్ మొదలైనవి వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఇటీవల రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్ తొలగించి, దీని ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ అందించింది. ఇందులో అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఓటీటీ బెనిఫీట్స్ వంటివి ఇందులో అందుబాటులో ఉండేవి, దీనికి ఆశించినంత ఆదరణ లేకపోవడం వల్ల సంస్థ దీనిని నిలిపివేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
చిన్న ఐడియా.. 670 కొలువులు! పోలీసు అభ్యర్థులకు లబ్ధి
‘ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది..’ అన్నది చాలాసార్లు నిరూపితమైనదే. అలాంటి ఓ ఆలోచన పోలీస్ రిక్రూట్మెంట్లో ఇబ్బందులను పోగొట్టింది. ముందు నుంచే ఉన్న ఇబ్బందిపై సరిగా దృష్టిపెట్టకపోవడంతో సమస్యగా మారితే.. ఒక చిన్న మార్పుతో దాన్ని సరిచేసి వందల మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించగలిగారు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు. సమస్య ఏమిటి? పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వేసిన ప్రతీ సారి కూడా ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతుంది. అభ్యర్థుల్లో తక్కువ మంది మాత్రమే కేవలం ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేస్తారు. నూటికి 99% మంది ఎస్సైతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకూ పోటీపడుతుంటారు. వారిలో ప్రతిభావంతులు రెండు పరీక్షల్లోనూ పాసవుతారు. అయితే ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచీ తొలుత కానిస్టేబుల్ సెలక్షన్స్, తరువాత ఎస్సై సెలక్షన్స్ జరిగేవి. దీనివల్ల మొదట కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికై, శిక్షణకు వెళ్లినవారు కూడా.. తర్వాత ఎస్సై పోస్టుకు ఎంపికైతే కానిస్టేబుల్ పోస్టును వదులుకునేవారు. ఇలా వందలాది పోస్టులు ఖాళీ అయ్యేవి. అప్పటికే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయి, ఖాళీ పోస్టులను డీజీపీకి సరెండర్ చేసి ఉండేవారు. పరీక్షల్లో అర్హత సాధించినవారు ఎందరో ఉన్నా ఈ ఖాళీల్లో భర్తీ చేసే అవకాశం ఉండేది కాదు. ఆ పోస్టులను తర్వాతి రిక్రూట్మెంట్లోనే భర్తీ చేయాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మంది అభ్యర్థులు వయసు పెరగడం, శారీరక ఇబ్బందులతో పోటీపడే అవకాశం కోల్పోయేవారు. ఏం మార్పులు చేశారు? ఈ లోపాన్ని గుర్తించిన టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు.. విషయాన్ని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డికి వివరించారు. ఆయన ఆమోదంతో గత రిక్రూట్మెంట్ సందర్భంగా ముందుగా ఎస్సై సెలక్షన్స్ చేపట్టారు. ఎస్సై ట్రైనీలతో సమావేశం నిర్వహించి.. వారిలో 670 మంది కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించారని గుర్తించారు. ముందే ఎస్సై పోస్టులో చేరుతున్నందున కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరబోమంటూ అండర్ టేకింగ్ (నిరభ్యంతర పత్రం) తీసుకున్నారు. తర్వాత చేపట్టిన కానిస్టేబుల్ సెలక్షన్స్ జాబితా నుంచి ఆ 670 మందిని తొలగించారు. దీంతో ఇదే సంఖ్యలో ఇతర అభ్యర్థులు ఎంపికయ్యారు. ఖాళీలేమీ ఏర్పడలేదు. మరోవైపు ట్రాఫిక్ అఫెన్స్‌లు, తెలిసీ తెలియని చిన్న నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న 350 మందికిపైగా అభ్యర్థులపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి.. ఉద్యోగ అవకాశం లభించేలా చేశారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
ఇది మోదీ ఆలోచన కాదు! ఫ్రెంచ్ నటి కీలక వ్యాఖ్యలు
ఫ్రెంచ్ నటి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 75 ఏళ్ల మరియన్ బోర్గ్ ఆస్తి వివాదం కారణంగా గోవాలోని తన ఇంట్లోనే తాను బంధీగా ఉన్నాని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లీ టూరిజం కోసం పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసనప్పటికీ తాను చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చారు. గోవాలోని బీచ్ టౌన్లో కలాంగుట్లో ఉన్న తన బంగ్లాను వదలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తన ఆస్తిని లాక్కుకుని కొందరూ వ్యక్తులు.. ఆ ఇంటికి విద్యుత్, నీళ్లు రాకుండా చేసి వేధించారని చెప్పారు. తాను స్నానం చేయకుండా ఉండలేని కారణంగా ఆ ఇంటిన ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులు కారణంగా తన ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్గో అన్నారు. మోదీ సానుకూల స్నేహపూర్వక పర్యాటక ఇమేజ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. బహుశా ఇది మోదీ ఆలోచన కాకపోవచ్చు కానీ ఇటీవల జరిగిన సంఘటనలు నన్ను ఎంతగానో నిరాశపరిచాయి. ఆయన సాధించిన విజయాలు గోవా రాష్ట్ర స్థాయికి చేరుకోక పోవడం బాధకరం అన్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ నటి బోర్గో ఫ్రాన్సిస్కో సౌసా అనే న్యాయవాది నుంచి 2008లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు మరణించడం పరిస్థితులన్ని ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. గోవా స్థానిక పోలీసుల ఈ కేసు కోర్టులో నడుస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెబుతున్నారు. నేషనల్ డి'ఆర్టే డ్రామాటిక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్)లో శిక్షణ పొందిన బోర్గో యూరప్, భారతదేశ అంతటా చలనచిత్రాలు, టెలివిజన్, థియేటర్లలో విస్తృతంగా పనిచేశారు. ఆమె ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ “ప్రొఫైలేజ్”లో ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఇటీవల భారతీయ నిర్మాణంలో “డానీ గోస్ ఓమ్”కి కూడా దర్శకత్వం వహించింది బోర్గ్. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
నూతన వధువరుల వినూత్న ఆలోచన.. కుటుంబాలను ఒప్పించి..
నిడదవోలు(తూర్పుగోదావరి): పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన పెళ్లి సందర్భంగా అవయవ దానంపై అందరి దృష్టి పడేలా చేసి అవగాహన కల్పించాలనుకున్నాడు. కాబోయే భార్యతో ఈ విషయం పంచుకున్నాడు. ఆమె సరే అంది. ఇంకేముంది తమతోపాటు ఓ సామాజిక బాధ్యతకూ పెళ్లిరోజున పెద్దపీట వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇరువురూ పెద్దలు ముందుకు రావడంతో 60 మంది అవయవదాన హామీ పత్రాలను ఇచ్చే ఘట్టానికి నిడదవోలులో వివాహ వేడుక వేదిక కానుంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్ చిన్నప్పటి నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. దొమ్మేరు గ్రామానికి చెందిన యువతి సజీవ రాణితో ఇటీవల ఇతనికి పెళ్లి కుదిరింది. వివాహం రోజున సతీశ్ కుమార్ తనతో పాటు బంధువులు, స్నేహితులు కలసి ఇచ్చే అవయవ దాన హమీ పత్రాలే తన వివాహానికి పెద్ద బహుమానమని చెప్పాడు. వారంతా ఇందుకు అంగీకరించారు. కాబోయే జీవిత భాగస్వామి కూడా సతీష్ ఆలోచనను మెచ్చుకుంది. తాను కూడా అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం ఈ నవ దంపతుల వివాహ వేడుక జరుగుతుంది. 60 మంది అవయవదాన హామీ పత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంపై సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ గూడూరు సీతామహలక్ష్మి (విశాఖపట్నం) సంతోషం వ్యక్తం చేశారు. ఆమె స్వయంగా పెళ్లికి హాజరై అవయవదాన హామీ పత్రాలు స్వీకరించనున్నారు. పెళ్లి పత్రికలో అవయవదానం చేయండి–ప్రాణదాతలు కండి అని ముద్రించడం అందరినీ ఆలోచింపజేసింది. అవయవదాన ఆవశ్యకతను విస్త్రతంగా ప్రచారం చేస్తున్న కొత్త దంపతులను పలువురు అభినందిస్తున్నారు. చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. ఓ బాలుడి మరణం కదిలించింది వేలివెన్నులో పదేళ్ల బాలుడు కిడ్నీ పనిచేయక చనిపోయాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స దశలో బాధిత బాలుడికి కిడ్ని దానం చేయడానకి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. ఈ విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. అప్పటి నుంచి అవయవదానం అవసరాన్ని గ్రహించాను. చేతనైన మేర దీనిపై ప్రచారం చేస్తున్నాను. నాపెళ్లి శుభలేఖలో కూడా ఇదే అంశాన్ని నినాదంగా ప్రచురించాను. కాబోయే భార్య సజీవరాణికి చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించింది. ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులు 60 మంది అవయవదాన హామీపత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. – సతీశ్‌కుమార్, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం ఆయన ఆలోచన నచ్చింది నిశ్చితార్థానికి ముందు సతీశ్‌కుమార్ అవయవదానం గురించి చెప్పారు. ఇంత మంచి సేవా కార్యక్రమానికి వివాహం వేదిక కావడం సంతోషం అనిపించింది. అవయవదానంపై మా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. వారంతా అవయవదానానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అవయవదానంపై ఇద్దరం కలిసి ప్రచారం చేస్తాం. – సజీవరాణి, దొమ్మేరు, కొవ్వూరు మండలం -
పోలీసులకు రక్షణగా ‘పాములు’!! ఎక్కడంటే..
ఇడక్కి(కేరళ): సమాజంలో శాంతిభద్రతలను కాపాడే రక్షక భటులను వానర దండు నుంచి కాపాడేవారే లేరు. తమిళనాడు సరిహద్దు ప్రాంతం వెంట కేరళలోని అటవీప్రాంతంలోని కుంబుమెట్టు పోలీస్ స్టేషన్‌పై కోతుల గుంపులు దూసుకొచ్చి నానా హంగామా చేయడం అక్కడ నిత్యకృత్యమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే పోలీసులకు తమ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలియక తెగ హైరానా పడ్డారు. వీరికి స్థానికంగా యాలకులు సాగు చేసే ఒక రైతు చక్కని ఉపాయం చెప్పి ఆదుకున్నాడు. చైనా తయారీ రబ్బర్ పాములను రంగంలోకి దించారు. కోతుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్న పోలీస్‌స్టేషన్ పై కప్పుపై, స్టేషన్ ప్రాంగణంలోని కూరగాయల తోటలో, స్టేషన్ గ్రిల్స్‌కు, చెట్లకు ఇలా పలు చోట్ల రబ్బర్ పాములను ఉంచారు. దీంతో పాములను చూసి హడలిపోయిన కోతులు స్టేషన్ పరిసరాలకు రావడం మానేశాయని పోలీస్‌స్టేషన్ సబ్–ఇన్స్పెక్టర్ పీకే లాల్‌భాయ్ ఆనందం వ్యక్తంచేశారు. చాలా సంవత్సరాలుగా స్టేషన్‌ను వేధిస్తున్న ఈ సమస్యకు సర్పాల రూపంలో పరిష్కారం దొరకడం సంతోషకరమని సునీశ్ అనే పోలీసు అన్నారు. అడవి జంతువులను హడలగొట్టేందుకే తమ సాగుభూమిలో అమలుచేస్తున్న చిట్కానే వీరికి చెప్పానని ఉదంబన్చోళ తాలూకాకు చెందిన ఒక రైతు వెల్లడించారు. చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. -
ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్!
సాక్షి,హైదరాబాద్: టెలికాం రెగ్యులేటరీ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇదే నెలలో భారతీ ఎయిర్టెల్ 71,312 మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 78,423 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. జాతీయంగా, రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను సంపాదించి, భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా, దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది, దీంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్( BSNL ) వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది. చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
ఈ రంగానికి చెందిన ఉద్యోగులకు శుభవార్త,పెరగనున్న జీతాలు.. ఎంతంటే!
టెలికాం రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. త్వరలో టెలికాం సంస్థలు భారీ ఎత్తున శాలరీలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టైమ్స్ కథనం ప్రకారం...టెలికాం దిగ్గజాలైన రిలయన్స్,ఎయిటెల్,వొడాఫోన్ ఐడియా సంస్థలు వారి ఉద్యోగుల జీతాల్ని ఈ ఏడాదిలో 10నుంచి 12శాతం వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది.గతేడాది పెంచిన శాలరీ 7.5శాతంగా ఉండగా..ఈ ఏడాది అత్యధికంగా పెంచే యోచనలో ఉన్నాయని, పైన పేర్కొన్న మూడు టెలికాం సంస్థలు ఉద్యోగులకు కనీసం 8 నుంచి 12శాతం శాలరీ హైక్ చేయోచ్చని టైమ్స్ తన కథనంలో హైలెట్ చేసింది. జులైలో పెరగనున్నాయి టెలికాం కంపెనీలు జీతాలు పెంచుతున్నట్లు తమకు సమాచారం అందించాయని ఐటీ,ఐటీఈఎస్,మీడియా, గవర్నమెంట్ శాఖల్లో స్టాఫింగ్ సర్వీస్ సంస్థ టీం లీజ్ సర్వీస్ వెల్లడించింది. అంతేకాదు ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల జీతాలు పెంచామని,జులై నుంచి మిగిలిన వారి జీతాలు పెంచుతున్నామని టీం లీస్ సర్వీస్ బిజినెస్ హెడ్ దేవాల్ సింగ్ తెలిపారు. అప్డేట్ అవ్వాల్సిందే టెలికాం రంగంలో దేశ వ్యాప్తంగా 4మిలియన్ల మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే టెలికాం రంగంలో టక్నాలజీ అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఉద్యోగులు జీతాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరగనున్నట్లు టీం లీస్ సర్వీస్ పేర్కొంది. 5జీ సర్వీసుల వినియోగంతో మార్కెట్లో ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉందని, వారి ఎంపిక విషయంలో సైతం కంపెనీలు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. -
ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..!
కొత్తపేట/రావులపాలెం(కోనసీమ జిల్లా): ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా.. ఆ ఆర్టీసీ డ్రైవర్ మదిలో పుట్టిన ఓ ఐడియా.. ఎన్నో ప్రమాదాలను నివారిస్తోంది. బస్సుకు ఆయన అమర్చిన స్టీల్ బాల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. ఈ ఐడియా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజుది. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. చదవండి: ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన రోడ్డుపై వాహనంలో వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలను గుర్తించేందుకు వాటికి కుడి, ఎడమ వైపు రియర్ వ్యూ అద్దాలు ఉంటాయి. వాటి ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతూంటారు. సాధారణంగా బస్సు డ్రైవర్‌కు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ కనిపించదు. బస్టాండ్లు, బస్టాపుల్లో ఆగి ఉన్న బస్సు ముందు నుంచి ప్రయాణికులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అలా ఎవరైనా వెళ్తున్నప్పుడు వారు కనిపించక, ఎవరూ లేరని భావించి, డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తూంటారు. దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే రెండు ప్రమాదాలు జరిగి, ఆయా డ్రైవర్లు 6 నెలల పాటు సస్పెండయ్యారు. బాధితులకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి ప్రమాదాలను, ఆర్టీసీ పరిహారాలు చెల్లించే పరిస్థితిని అరికట్టాలని సత్యనారాయణరాజు తీవ్రంగా ఆలోచించారు. ఆ క్రమంలోనే ఆయనకు స్టీల్ బాల్ పెట్టాలనే ఐడియా వచ్చింది. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్ బాల్‌ను 2 అడుగుల రాడ్‌కు అమర్చి, దానిని డ్రైవర్ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించారు. ఆ స్టీల్ బాల్లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్ డోర్ వరకూ కనిపిస్తోంది. దీంతో బస్సు ముందు ఎవరూ లేరని గుర్తించడం సులభమైంది. తద్వారా ఇటువంటి ప్రమాదాలకు చెక్ పడింది. ఈ స్టీల్ బాల్‌ను అన్ని బస్సులకూ అమర్చాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ఈ స్టీల్ బాల్ తయారీకి కేవలం రూ.100 ఖర్చయినట్టు సత్యనారాయణరాజు తెలిపారు. ఆయన వినూత్న ఆలోచనను ఆర్టీసీ అధికారులు, సహచర డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఎంతగానో మెచ్చుకుని, అభినందించారు. -
జనం దృష్టిని మళ్లించేందుకు పొలంగట్టులో హీరోయిన్ల ఫ్లెక్సీల ఏర్పాటు
-
మంచిమాట..నీ నిశ్చలమైన మనసే నీవు
అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది ‘నేను’ అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే. ఏ భావమైనా దేనినో ఒకదానిని ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారమే భావాలకి నిలయం. అంటే, భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే. నువ్వు, అతడు, అది అంటూ మధ్యమ ప్రథమ పురుషలకి సంబంధించినవి ‘నేను’ అనే ఉత్తమ పురుషలకి తప్ప ఇంకెవరికీ గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి. అంటే కలిసే వస్తాయి. కలిసే అణగిపోతాయి. .ఈ ‘నేను’ అనేది ఎక్కడినుండి ఉదయిస్తున్నది? దాని కోసం లోపల వెతకాలి. అప్పుడు అది మాయమవుతుంది. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకు మూలం ‘నేను’ అనే భావం. కాబట్టి మనస్సు అంటే ‘నేను’ అనే ఆలోచనే. ‘నేను’ అనే ఆలోచన పుట్టుకే వ్యక్తి జననం కూడ. దాని మరణమంటే వ్యక్తి మరణమే. ఈ ‘నేను’ అనే భావాన్ని వదిలించుకోవాలి. అది సజీవంగా ఉన్నంతకాలమూ బాధ తప్పదు. ‘నేను’ పోతే, బాధా పోతుంది. నేను ఫలానా వ్యక్తినని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనే విజ్ఞానాన్ని పక్కన పెట్టి, నీవు నువ్వుగా ఉండటం ‘నీ నిజస్వరూపం’. ఆత్మయే చైతన్యంగా మారి ’నేను ఫలానా’ అని గిరిగీసుకోవటమే ’అహం’. అంతకు మించి ‘అహం’ అంటూ ప్రత్యేకంగా లేదు. విషయాలతో మమేకం చెందకుండా మనసును గమనిస్తే దైవమే మన మనసు, తనువు, ఇంద్రియాలు, ప్రపంచంగా మారిందని అర్ధం అవుతుంది. దీనికి కారణం నువ్వు కాదని తెలుసుకుంటే, కర్తృత్వంపోయి శాంతి వస్తుంది. మనకి మనసు స్వరూపమే కాదు, దాని క్రియలు కూడా పూర్తిగా తెలియవు. కేవలం ఆలోచనల ద్వారా ఈ శరీర బాహ్యక్రియలు చేయించేది మాత్రమే మనసని అనుకుంటున్నాం. మనస్సుతో కుస్తీ పడకండి. మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేని గురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయా రంటే మీరు మీ మనస్సు మరెక్కడో ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు, గుర్తించుకుంటున్నారు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు... మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే.. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు మీ శరీరంతో.. మీరు వేసుకొన్న దుస్తులతో.. మీ జుట్టుతో.. ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బయటికి వెళ్ళడం గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి అని. మీరు ఆ భగవంతుని గురించి ఆలోచించినప్పుడు మీమనస్సు ఎక్కడెక్కడికో వెళుతుంది. మనస్సు తత్త్వం అలాంటిది. దీనిని మీరు ఆపలేరు. ఎందుకంటే, మీరు ఏవైతే కాదో అటువంటి విషయాలతో, మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇక్కడ మనం మీ మనస్సుని నియంత్రించడం గురించి మాట్లాడడం లేదు. మీరు ఏది కాదో, అన్న దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. మీ మొట్టమొదటి గుర్తింపు మీ శరీరం. మీరు మీ శరీరంతో, మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో, ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీ భార్యా, మీ పిల్లలూ, మీ కుటుంబం, మీ విద్యా, మీ మతమూ ఇవన్నీ అంతులేనన్ని గుర్తింపులు.. ఇన్ని గుర్తింపులతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అది అలా కుదరదు. అందుకనే, నేను శూన్యం అని ఒక చిన్న, సరళమైన సాధన చేయాలి. దీని ద్వారా మీరు మీకూ, మీ మనస్సుకీ కొంత దూరం ఏర్పరచుకోవచ్చు. ఈ దూరం ఏర్పడిన తరువాత, అది గోల చేసే మనసైనా సరే.. పర్వాలేదు. మీరు, దాని నుంచి విడవగలరు. ఒకసారి మీరు, మీ మనసు నుంచి విడిపడిపోయిన తరువాత మీరు, మీ గుర్తింపులన్నింటి నుంచీ విడవగలరు. ఎందుకంటే, ఈ మనస్సే మీలో ఈ గుర్తింపులని తయారు చేస్తూ ఉంది. అందుకని అన్ని రకాల విషయాలనూ ఆలోచించకండి. ప్రతి రోజూ రెండుసార్లు, పదిహేను నిమిషాల పాటూ, మీ గందరగోళాన్నంతా పక్కన పెట్టి కూర్చోండి. మీరు ధ్యానం కూడా చెయ్యనక్కర్లేదు. కేవలం కూర్చోండి. జరగాల్సినవి అవే జరుగుతాయి. – భువనగిరి కిషన్ యోగి ► మీ పొరపాటు ఆలోచనలన్నిటినీ విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ► మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. ► నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండే నీ ఉనికే ‘నీ నిజస్వరూపం’ -
లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది దీన్నే అవకాశంగా మలుచుకని తమ జీవితాలను మూడుపూవులు ఆరుకాయల్లా మార్చుకున్నారు. ఆ కొంతమందిలో అమెరికాలోని అలబామా, పెల్ సిటీకి చెందిన 32 ఏళ్ల బ్రాంట్లీ గెర్హార్డ్ట్ ఒకడు. లాక్డౌన్ సమయంలో అతనికొచ్చిన ఓ ఐడియా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే.. గ్రిన్చ్ ( ఒళ్లంతా జుట్టు ఉండే ఓ వింత జంతువు) వేషాన్ని ధరించి ఆ పరిసరాలు మొత్తం చక్కర్లు కొట్టడం. అలా ఎందుకంటే.. లాక్డౌన్ సమయం కాబట్టి పిల్లల్ని బయటికి రాకుండా చూడటం వారి తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కనుకు అతను పిల్లలను భయపెట్టి వాళ్లు ఇళ్లలోంచి బయటకు రాకుండా చూడాలి. అతడి ఆలోచన నచ్చి భార్య సరేనంది. దీంతో అతడు గ్రిన్చ్ వేషంలో దగ్గరలోని నిత్యవసర వస్తువుల దుకాణాలు తిరగటం మొదలుపెట్టాడు. అలా ప్రతీ షాపు దగ్గర కొంత సేపు చక్కర్లు కొట్టేవాడు. కొంతమంది పిల్లలు అతడ్ని చూసి భయపడగా, మరికొంతమంది ఫొటోలు తీసుకోవటానికి ఎగబడేవారు. అలా కొంత మేర డబ్బు సంపాదించిన అది సరిపోయేది కాదు. ఓ రోజు గ్రిన్చ్ దుస్తుల్లో బ్రాంట్లీని చూసిన ఓ వ్యక్తి తన పిల్లల్ని భయపెట్టాలని, అందుకోసం 20 డాలర్లు (సుమారు 1500రూపాయలు) ఇస్తానని అన్నాడు. ఆ రోజు నుంచి గత సంవత్సరం వరకు ఆ వ్యక్తి పిల్లలను భయపెట్టేందుకు దాదాపు 20 వేల కుటుంబాలను కలుసుకున్నాడు. రోజుకు కనీసం 20 ఇళ్లలోని పిల్లల్ని భయపెడుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇందులోనూ కొత్తదనం కోరుకుంటూ ఎప్పటికప్పుడు తన వేషాలను మారుస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆ నగరంలో అతనో సెలబ్రిటీలా మారిపోయాడు దీంతో అతడితో ఫొటోలు దిగటానికి జనం ఎగబడుతున్నారట. ప్రస్తుతం అతను పిల్లల్ని భయపెట్టడానికి 30 డాలర్లు(2,251రూపాయలు) వసూలు చేస్తున్నాడు. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు కదా.. బహుశా అది ఇదేనేమో. చదవండి: Niloufer Cafe Hyderabad: కప్పు చాయ్ రూ.1000.. ఎక్కడో తెలుసా? -
ఉద్యోగం కావాలంటూ ఏకంగా హోర్డింగ్నే ఏర్పాటు చేశాడు.. అయినా..?
డబ్లిన్: ఐర్లాండ్‌కు చెందిన క్రిస్ హార్కిన్ అనే నిరుద్యోగి.. తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ వినూత్నంగా అభ్యర్ధించిన ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన 24 ఏళ్ల క్రిస్ 2019 సెప్టెంబర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాటి నుంచి వందల సంఖ్యలో ఇంటర్వ్యూలకు వెళ్లిన క్రిస్‌కు అన్నీ చోట్ల మొండిచెయ్యే ఎదురైంది. దీంతో విసుగెత్తిపోయిన క్రిస్.. ఇలా అయితే కాదని వినూత్నంగా ఉద్యోగ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. 400 డాలర్లు ఖర్చు పెట్టి ఓ ప్రాంతంలో హోర్డింగ్ ఏర్పాటు చేయించాడు. ఆ హోర్డింగ్‌పై ప్లీజ్ హైర్ మీ అని పెద్ద అక్షరాలతో రాయించి దాని కింద తన అర్హతలు, తన ఫోటో, వ్యక్తిగత వివరాలు, తాను ఏ రంగంలో ఉద్యోగం ఆశిస్తున్నాడో వాటి వివరాలు పొందుపరిచాడు. ఇంతటితో ఆగని క్రిస్.. ఎలాగైనా ఉద్యోగం రాకపోదా అని, ఈ తతంగం మొత్తాన్ని యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేశాడు. కానీ, ఇంత చేశాక కూడా క్రిస్‌కు ఉద్యోగం రాలేదు. ఇలా దాదాపు 2 వారాలు వేచి చూసిన క్రిస్.. ఏ ఉపయోగం లేకపోవడంతో తన వినూత్న ఉద్యోగ ప్రయత్నానికి స్వస్థి పలికాడు. బిల్ బోర్డు(హోర్డింగ్) ఖర్చు భరించే స్తోమత లేకే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కాగా, క్రిస్‌కు ఈ ఐడియాను సోషల్ మీడియా మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరి ఇచ్చిందట. చదవండి: Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే.. -
వీఐలో వాటా అప్పగించేందుకు రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) లిమిటెడ్‌లో తమకున్న వాటాను ప్రభుత్వం లేదా ఏ ఇతర సంస్థకైనా అప్పగించేందుకు సంసిద్ధమంటూ కేఎం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. కంపెనీ కొనసాగింపునకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మేలు చేయగలదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ జూన్ 7న కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబాకు బిర్లా లేఖ రాశారు. వీఐఎల్‌లో బిర్లాకు 27 శాతం వాటా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం వీఐఎల్‌కున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు(లయబిలిటీ) రూ. 58,254 కోట్లుకాగా.. వీటిలో రూ. 7,854 కోట్లకుపైగా చెల్లించింది. సుప్రీం నో: ఏజీఆర్ మదింపులో దిద్దుబాట్లకోసం భారతీ ఎయిర్‌టెల్‌సహా వీఐఎల్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. కాగా.. ఏజీఆర్ బకాయిలపై స్పష్టత లోపించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడులకు ముందుకురావడంలేదని లేఖలో బిర్లా పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ చెల్లింపులపై అవసరమైనంత మారటోరియం విధింపు, ప్రధానంగా సర్వీసు వ్యయాలకు మించిన ఫ్లోర్ ధరల విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భారీ రుణ భారం: రూ. 25,000 కోట్లు సమీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో బోర్డు వీఐఎల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీ నిధుల సమీకరణ చేపట్టలేకపోవడం గమనార్హం! లీజ్ లయబిలిటీలను మినహాయిస్తే కంపెనీకి స్థూలంగా రూ. 1,80,310 కోట్ల మేర రుణభారముంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 96,270 కోట్లుకాగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు రూ. 23,080 కోట్లుగా నమోదయ్యాయి. -
కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన
మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే మదనపల్లె పట్టణ సమీపంలోని సుధాకర్ అనే పాడి వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి సురక్షిత పద్ధతిలో పాల కొనుగోలు, అమ్మకాలను సాగిస్తున్నారు. ఇంటి ముందు ప్రధాన గేటు వద్దనే రెండు పెద్ద పైపులు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి పాడి రైతులు తనకు పాలు పోయడానికి, మరో పైపు కొనుగోలుదారులకు తాను పాలు పోయడానికి ఏర్పాటు చేసుకున్నారు. కొనుగోలుదారులు డబ్బులు గేటు వద్ద పెడితే ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని పైపు ద్వారా పంపుతున్నారు. పాడి రైతులు తీసుకొచ్చే పాలు పైపులో పోస్తే లోపల క్యానులో పడుతున్నాయి. పాలు కొలత కోసం వేబ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారు. కరోనా ప్రబలకుండా భౌతికదూరం పాటించేందుకు సుధాకర్ చేసిన ఈ సరికొత్త ఆలోచన పలువురిని ఆకర్షిస్తోంది. చదవండి: కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత -
అమ్మో ఎండలు: ఈ ఐడియా అదుర్స్..
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడి పోతున్నారు. ఎండకు ఒక్క నిమిషం కూడా రోడ్డుపై నిలబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ వన్‌టౌన్ తారాపేటలో వ్యాపారస్తులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఆయా దుకాణాలకు వచ్చే వినియోగదారులకు ఎండ బారి నుంచి తప్పించేందుకు గ్రీన్ షేడ్ పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’ మహమ్మారికి ‘మాస్క్’ దెబ్బ -
వొడాఫోన్ ఐడియా బంపరాఫర్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో 2020 ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కువ శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీలు యూజర్లకు తక్కువ ధరకే ఇంటర్ నెట్ ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విఐ(వోడాఫోన్ ఐడియా) కూడా ప్రీపెయిడ్ చందాదారుల కోసం వార్షిక రూ.1,499 ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఈ అదనపు డేటా అనేది ఎంపిక చేసిన సర్కిల్లలోని వినియోగదారులకు లభిస్తుంది అని విఐ పేర్కొంది. (చదవండి: రూ.500 లోపు బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఇవే!) ఈ డేటా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి వోడాఫోన్ ఐడియా యూజర్లు విఐ యొక్క అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ని సందర్శించాలని పేర్కొంది. అలాగే ఎంపిక చేసిన వినియోగ దారులకు ఈ ఆఫర్ గురించి విఐ టెక్స్ట్ సందేశాలను కూడా పంపుతున్నట్లు పేర్కొంది. వోడాఫోన్ ఐడియా రూ.1,499 వార్షిక ప్రణాళిక కింద సాధారణంగా 24జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 50జీబీ డేటా కలుపుకొని మొత్తం 75జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్, టీవీ షోలు, సినిమాలు, లైవ్ టీవీ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది. -
వొడాఫోన్ ఐడియా 'వై-ఫై కాలింగ్' సేవలు ప్రారంభం
వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వై-ఫై కాలింగ్' లేదా 'వోవీ-ఫై' సేవను నేడు ప్రారంభించింది. ప్రస్తుతం వీ 'వై-ఫై కాలింగ్' కాలింగ్ సేవలు మహారాష్ట్ర & గోవా, కోలకతా వంటి సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ ఇండియా దశలవారీగా ఇతర సర్కిల్‌లలో ఈ సేవను ప్రారంభించనున్నట్లు తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ వంటి సంస్థలు ఏడాది క్రితమే వై-ఫై కాలింగ్ సేవలను ప్రారంభించాయి. టెలికాం టాక్ నివేదిక ప్రకారం, వై వై-ఫై కాలింగ్ ప్రారంభించినట్లు కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీం ట్విట్టర్లో ధృవీకరించింది. ఎయిర్టెల్ ప్రారంభించిన VoWi-Fi కాలింగ్ సేవల మాదిరిగానే ఈ సేవలు ఉండనున్నాయి. వోడాఫోన్ ఇండియా గత కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సేవలను పరీక్షించింది. వాస్తవానికి, 2019 ప్రారంభంలో వీ వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను ఇతర టెల్కోల కంటే ముందుగానే ప్రారంభించనున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే, వోడాఫోన్- ఐడియా యొక్క నెట్వర్క్ ఇంటిగ్రేషన్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది.(చదవండి: వివో సబ్ బ్రాండ్ కొత్త 5జీ మొబైల్) -
కొత్త ప్లాన్ ని ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియాగా రీబ్రాండ్ చేయబడిన తర్వాత 1197 ప్రీపెయిడ్ ప్లాన్ లభ్యతను విస్తరించింది. ఈ ప్లాన్ గతంలో హోమ్ క్రెడిట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ బండిల్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. 2019లో వోడాఫోన్ ఐడియా... హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థతో పాట్నర్‌షిప్ ఒప్పందం చేసుకుంది. దీంట్లో భాగంగా కస్టమర్లు రూ.15వేల లోపు ఏదైనా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఆ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇప్పుడు తాజాగా భారత్‌లోని అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబందించిన సమాచారాన్ని వోడాఫోన్ ఐడియా వెబ్సైట్లో ఉంచింది. అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.(చదవండి: ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్) వోడాఫోన్ ఐడియా 1197 ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా రోజుకి 1.5జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. దీని కాలపరిమితి వచ్చేసి 180 రోజులు, అలాగే రోజుకి ఉచిత 100 ఎస్సెమ్మెస్ లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వోడాఫోన్ ఐడియా మూవీస్ & టీవీని కస్టమర్లు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఆ వారంలో వాడకుండా మిగిలి ఉన్న డేటాను తిరిగి వారం చివరి రోజులో వాడుకోవచ్చు. రూ.1197 ప్రీపెయిడ్ ప్లాన్ ని అందరికి అందుబాటులోకి తీసుకోని రాకముందు, టెల్కో రూ.599కు 1.5 జీబీ రోజువారీ డేటాను 84 రోజులు, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వరుసగా 365 రోజుల వాలిడిటీతో అందించింది. రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకి 2జీబీ డేటాతో పాటు ఒక సంవత్సరం వరకు ఉచితంగా ZEE5 ప్లాట్‌ఫామ్ మెంబర్షిప్ లభిస్తుంది. -
వొడాఫోన్ ఐడియాకు భారీ నిధులు!
ముంబై: దేశీ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో భారీ పెట్టుబడులకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓక్ట్రీ క్యాపిటల్ అధ్యక్షతన ఏర్పడిన కన్సార్షియం 2-2.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వీలున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. తద్వారా వొడాఫోన్ ఐడియాలో కొంత వాటాను సొంతం చేసుకునే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వొడాఫోన్ ఐడియా 3.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 25,000 కోట్లు)ను సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. షేర్ల విక్రయం, రుణ సమీకరణ ద్వారా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు వేసినట్లు తెలియజేసింది. దీంతో ఓక్ట్రీ క్యాపిటల్ పెట్టుబడుల వార్తలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు టెలికం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్) పోటీ తీవ్రం.. కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ భారీస్థాయిలో కస్టమర్లను పొందుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు కంపెనీలూ వొడాఫోన్ ఐడియా కస్టమర్లను సైతం ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దేశీ మొబైల్ టెలికం రంగంలో పెరిగిన తీవ్ర పోటీ, నిధుల ఆవశ్యకత నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పెట్టుబడుల సమీకరణ సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా తిరిగి మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా లాభదాయకతను సైతం పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో డిసెంబర్ చివరికల్లా 20 శాతంవరకూ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు వేసినట్లు వివరించాయి. -
కొత్త ఏడాదిలో ఫోన్ బిల్లుల మోతే!
న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా(వి), ఎయిర్టెల్ వంటి టెల్కో సంస్థలు టారిఫ్‌లు పెంచాలని చూస్తున్నందున రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఫోన్ బిల్లు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. వోడాఫోన్ ఐడియా ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో చార్జీలను 15-20 శాతం పెంచాలని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో కంపెనీలు నష్టాల నుండి బయటపడానికి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. వొడాఫోన్ ఐడియా ఇటీవల కొద్ది రోజులుగా రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ సంస్థలకు వినియోగదారులను కోల్పోతున్నట్లు నివేదికలో తెలియ జేసింది. కొంత మేరకు ఎయిర్టెల్ సంస్థ రిలయన్స్ జియోను అనుసరిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ఎయిర్టెల్ కూడా రేట్లను సవరించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ నిపుణలు తెలుపుతున్నారు. "టెలికం రెగ్యులేటర్ ఫ్లోర్ ధరలను ప్రకటించడానికి ముందే టెల్కో కంపెనీలు టారిఫ్‌లను పెంచే అవకాశం ఉంది" అని ఒక వ్యాపార దినపత్రిక పేర్కొంది. వోడాఫోన్ ఐడియా డిసెంబరు నాటికి రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. టెల్కో సంస్థలు 20 శాతం చార్జీల పెంపుపై ప్రజలలో అంతర్గత చర్చ జరుగుతుండగా, ఒకే సారి ఇంత మొత్తంలో పెంపు అమలు చేయడం భారమవుతుందని ప్రజల అభిప్రాయం. 2016లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రవేశించిన తరువాత దేశంలోని మూడు ప్రైవేట్ టెల్కోలు గతంలో 2019 డిసెంబరులో రేట్లు పెంచాయి. -
తగ్గిన నెట్ స్పీడ్; జియోనే నంబర్‌వన్
రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ అక్టోబర్‌లో 1.5 ఎంబీపీఎస్ పడిపోయింది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. అక్టోబర్ లో జియో డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 17.8 ఎంబీపీఎస్‌గా ఉంది. రెండవ స్థానంలో కొనసాగుతున్న ఐడియా కంటే జియో స్పీడ్ వచ్చేసి 95% శాతం ఎక్కువ. అక్టోబర్ లో ఐడియా డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 9.1 ఎంబీపీఎస్‌గా ఉంది. అప్ లోడ్ స్పీడ్ విషయంలో కూడా జియో ఇంకా వెనుక బడే ఉంది. గత ఏడాది కలిసిపోయిన వొడాఫోన్, ఐడియాలను ట్రాయ్ ఇంకా ప్రత్యేక టెల్కోలుగానే పరిగణిస్తోంది. సెప్టెంబర్‌లో 19.1 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్లోడ్ స్పీడ్, అక్టోబర్‌లో 17.8 ఎంబీపీఎస్‌కు పడిపోయింది. ఇప్పటికీ ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో జియోనే నంబర్ వన్. ఇక ఐడియా విషయానికి వస్తే.. జియో తర్వాత రెండో స్థానంలో 9.1 ఎంబీపీఎస్‌తో ఉంది. సెప్టెంబర్‌లో ఐడియా డౌన్ లోడ్ స్పీడ్ 8.6 ఎంబీపీఎస్‌గా ఉండగా, 0.5 ఎంబీపీఎస్ మెరుగు పరుచుకుంది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం మూడో స్థానంలో వొడాఫోన్ ఉంది. వొడాఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ 8.8 ఎంబీపీఎస్‌గా ఉంది. సెప్టెంబర్‌లో వొడాఫోన్ 7.9 ఎంబీపీఎస్‌గా ఉండేది. అయితే ఇది కూడా 0.9 ఎంబీపీఎస్ వరకు పెరిగింది. ఇక 7.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో ఎయిర్ టెల్ నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ టెల్ డౌన్లోడ్ స్పీడ్ రెండు నెలల నుంచి అలాగే ఉంది. అందులో ఎటువంటి మార్పూ లేదు. -
అదానీ గ్రీన్- వొడాఫోన్ ఐడియా జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్‌తోపాటు.. మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ గ్లోబల్ సోలార్ విద్యుదుత్పత్తిలో అదానీ గ్రూప్.. ప్రపంచ నంబర్‌వన్‌గా ఆవిర్భవించినట్లు మెర్కామ్ క్యాపిటల్ తాజాగా పేర్కొంది. నిర్వహణ, నిర్మాణంలో ఉన్న యూనిట్లతోపాటు.. ఇంతవరకూ దక్కించుకున్న ప్రాజెక్టుల రీత్యా అదానీ గ్రూప్ టాప్ ర్యాంకులో నిలుస్తున్నట్లు వివరించింది. యూఎస్‌లో 2019లో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యంకంటే అదానీ గ్రూప్ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో అధికమని మెర్కామ్ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు.. పూర్తిస్థాయిలో సమీకృత సౌర విద్యుదుత్పత్తి కంపెనీగా అదానీ గ్రూప్ నిలుస్తున్నట్లు అభిప్రాయపడింది. జీవిత కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా 1.4 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలదని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి జూన్‌లో 8 గిగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అదానీ గ్రీన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2.5 గిగావాట్ విద్యుత్ సామర్థ్యాన్ని గ్రూప్ కలిగి ఉన్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 544 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు తాజాగా మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇందుకు ఈ నెల 4న(శుక్రవారం) బోర్డు సమావేశంకానున్నట్లు తెలియజేసింది. పబ్లిక్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ కేటాయింపు, ప్రయివేట్ ప్లేస్మెంట్ తదితర మార్గాలలో నిధుల సమీకరణపై బోర్డు చర్చించనున్నట్లు వెల్లడించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికిప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 9.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 10.15 వరకూ ఎగసింది. -
అత్యధిక నష్టాలొచ్చిన భారత కంపెనీగా..
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో రూ.73,878 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి నష్టాలు ఇప్పటివరకూ ఏ భారత కంపెనీకి రాలేదు. ఏజీఆర్ (సవరించిన స్థూల రాబడి) సంబంధిత బకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19)లో నికర నష్టాలు రూ.14,604 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.37,093 కోట్ల నుంచి రూ.44,958 కోట్లకు పెరిగింది. (హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!) ∙గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ నష్టాలు మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,882 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత క్యూ4లో రూ.11,644 కోట్లకు ఎగిశాయి. గత క్యూ3లో నష్టాలు రూ.6,439 కోట్లుగా ఉన్నాయి. ∙గత క్యూ4లో ఆదాయం రూ.11,754 కోట్లు. సీక్వెన్షియల్‌గా కార్యకలాపాల ఆదాయం 6 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది డిసెంబర్ నుంచి టారిఫ్‌లు పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. ∙గత క్యూ3లో రూ.109గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి(ఏఆర్పీయూ) గత క్యూ4లో రూ.121కు పెరిగింది. ఇదే కాలంలో వినియోగదారుల సంఖ్య 30.4 కోట్ల నుంచి 29.1 కోట్లకు తగ్గింది. ∙ఐడియా సెల్యులర్‌లో వొడాఫోన్ ఇండియా 2018, ఆగస్టులో విలీనమైంది. అందుకని అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో గత ఆర్థిక సంవత్సరం ఫలితాలను పోల్చడానికి లేదు. ∙కంపెనీ రూ.51,400 కోట్ల మేర ఏజీఆర్ బకాయిలు చెల్లించాలి. మొత్తం రూ.58,254 కోట్ల బకాయిల్లో రూ.6,854 కోట్లు చెల్లింపులు జరిపింది. -
ఈ 3 షేర్ల దూకుడుకు కారణమేంటట?
ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో పరుగు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 34,543కు చేరగా.. నిఫ్టీ 64 పాయింట్లు పుంజుకుని 10,206 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న వార్తల కారణంగా టైటన్ కంపెనీ, యస్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టైటన్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ప్రస్తుతం టైటన్ కంపెనీ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 3.5 శాతం పెరిగి రూ. 1025 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,050 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. జ్యువెలరీ, ఐవేర్, వాచీలు తదితర లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల ఈ కంపెనీ అమ్మకాలు ఇటీవల లాక్‌డవున్ నేపథ్యంలో నీరసించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పసిడి ధరలు పుంజుకోవడంతో మార్క్‌టు మార్కెట్ క్యాష్‌ఫ్లో పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్టోర్లను తిరిగి తెరుస్తున్న కారణంగా అమ్మకాలు గాడిన పడగలవన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. యస్ బ్యాంక్ యస్ బ్యాంకుకు చెందిన రూ. 18,000 కోట్ల బాండ్లకు BBB రేటింగ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు క్రిసిల్ తాజాగా పేర్కొంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ దన్ను కారణంగా యస్ బ్యాంక్ జారీ టైర్-2, ఇన్ఫ్రా బాండ్లకు స్టేబుల్ రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు తొలుత 10 శాతం జంప్‌చేసి రూ. 32ను తాకింది. ఇది 10 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 30.4 వద్ద ట్రేడవుతోంది. వొడాఫోన్ ఐడియా వరుసగా 10వ సెషన్లోనూ మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా కౌంటర్ జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 20 శాతం దూసుకెళ్లి రూ. 12.6ను తాకింది. ప్రస్తుతం 11.5 శాతం ఎగసి రూ. 11.7 వద్ద ట్రేడవుతోంది. గత 10 రోజుల్లోనూ ఈ కౌంటర్ 129 శాతం ర్యాలీ చేయడం విశేషం! గత 26న ఈ షేరు రూ. 5.5 వద్ద ట్రేడైన సంగతి తెలిసిందే. కాగా.. టెక్ దిగ్గజం గూగుల్ వొడాఫొన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి గతేడాది జులైలో చేపట్టిన రైట్స్ ఇష్యూ ధర రూ. 12.5ను తాజాగా అధిగమించినట్లు తెలియజేశారు. ఈ అంశాన్ని కంపెనీ తోసిపుచ్చినప్పటికీ.. ఇటీవల దేశీయంగా మొబైల్ టారిఫ్‌ల పెంపు.. వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం వంటి అంశాలు మొబైల్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు చెబుతున్నారు. -
ప్రస్తుతానికి వొడాఫోన్ ఐడియా షేరును కొనవద్దు
ప్రస్తుత పరిస్థితుల్లో వోడాఫోన్ ఐడియా షేరును కొనవద్దని ఎంఎస్ఎల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా సలహానిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా నగదు ప్రవాహ ఒత్తిళ్లను ఎదుర్కోంటుందని, కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీవ్ర రుణాభారాన్ని కలిగి ఉందన్నారు. త్రైమాసిక నగదు ప్రవాహం సజావుగా కొనసాగాలంటే ఏఆర్పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) ఛార్జీలను కనీసం 40-50శాతం పెంచాల్సి ఉంటుందని ఖేమ్కా అన్నారు. ఇదే పరిస్థితుల్లో ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ కేవలం 15-20శాతం ఏఆర్పీయూ పెంచినా వారికి వ్యాపారాభివృద్ధికి మేలు చేసే అంశమవుతుందని ఖేమ్కా చెప్పుకొచ్చారు. ఇటీవల టెలికాం రంగం నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నట్లు ఖేమ్కా తెలిపారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో వరుసగా వాటాలు విక్రయించడంతో పాటు మరికొంత వాటాను అమ్మేందుకు సిద్ధంగా ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను టెలికాం రంగం వైపు దృష్టి మళ్లించేలా చేశాయన్నారు. ఇక భారతీ ఎయిర్టెల్ విషయానికొస్తే.., ఇటీవల ఏఆర్పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)గణీయంగా మెరుగపడటాన్ని ఖేమా గుర్తు చేశారు. నిరాధరమైన వార్తల ఆధారంగా మాత్రమే వోడాఫోన్ షేరు ఇటీవల మూమెంట్‌ను కనబరుస్తుందని, ఈ సమయంలో వోడాఫోన్‌కు దూరంగా ఉండటం మంచిదని ఆయన సలహానిస్తున్నారు. అయితే ఇదే రంగంలో భారతీ ఎయిర్టెల్ షేరు కొనుగోలు చేయడం మంచిదని ఖేమా చెప్పుకొచ్చారు. వొడాఐడియాలో దాదాపు 5 శాతం వాటా కొనేందుకు గూగుల్ సిద్ధంగా ఉందనే వార్తలు వెలుగులోకి రావడంతో శుక్రవారం ఒకదశలో షేరు దాదాపు 35శాతం లాభపడి రూ.7.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే తమ కంపెనీలో గూగుల్ పెట్టుబడులు పెడుతున్న ప్రతిపాదన తమ పరిశీలనలోకి రాలేదనే వొడాఫోన్ ఐడియా తెలిపడంతో షేరు మార్కెట్ ముగిసే సరికి 12.71శాతం లాభంతో రూ.6.56 వద్ద స్థిరపడింది. -
మరో రూ. 8వేల కోట్లు కట్టిన టెల్కోలు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలు మంగళవారం మరో రూ. 8,000 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. వొడాఫోన్ ఐడియా రూ. 3,043 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ. 1,053 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 2,000 కోట్లు కట్టాయి. ఇప్పటికే పూర్తి సెటిల్మెంట్ కోసం రూ. 2,197 కోట్లు కట్టామన్న టాటా టెలీసర్వీసెస్.. ఒకవేళ లెక్కల్లో వ్యత్యాసాలేమైనా వచ్చినా సర్దుబాటు చేసేందుకు వీలుగా అదనపు మొత్తం కట్టినట్లు వెల్లడించింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ మరోసారి టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో భేటీ అయ్యారు. అయితే, సమావేశం వివరాలు ఆయన వెల్లడించలేదు. అటు.. వీఐఎల్ ఎప్పట్లోగా బాకీల స్వీయ మదింపు పూర్తి చేస్తుందన్న ప్రశ్నకు స్పందించేందుకు టక్కర్ నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీ (ఎస్‌యూసీ) బాకీల కింద 15 టెలికం సంస్థలు.. సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. ఏజీఆర్ బాకీల విషయంలో టెల్కోల స్వీయ మదింపు, తమ లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయా సంస్థలకు టెలికం శాఖ త్వరలోనే లేఖలు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఏజీఆర్ ‘పరిష్కారం’పై వొడా–ఐడియా కసరత్తు..
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల కారణంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) .. ఈ సమస్య నుంచి గట్టెక్కడంపై కసరత్తు చేస్తోంది. కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా .. మంగళవారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన చర్చల్లో వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ కూడా పాల్గొన్నారు. అయితే, చర్చల సారాంశాన్ని వెల్లడించేందుకు బిర్లా నిరాకరించారు. ‘ఇప్పుడే ఏం చెప్పలేము‘ అంటూ భేటీ అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. వీఐఎల్ సంస్థ ఏజీఆర్ బాకీలు కట్టగలదా, దివాలా ప్రకటించే అవకాశం ఉందా వంటి ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వడానికి నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ డిమాండ్ చేస్తోంది. వీఐఎల్ సుమారు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. బాకీల చెల్లింపుల్లో ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగతా టెల్కోలతో పాటు వీఐఎల్ సోమవారం రూ. 2,500 కట్టింది. మరో వారం రోజుల్లోగా ఇంకో రూ. 1,000 కోట్లు కడతామని పేర్కొంది. మరోవైపు, బాకీలు కట్టని టెల్కోల బ్యాంకు గ్యారంటీలను స్వాధీనం చేసుకోవాలని టెలికం శాఖ భావిస్తోంది. అదే జరిగితే వీఐఎల్ వంటివి మూతబడే ప్రమాదముంది. బాకీలపై వెసులుబాటు లభించకపోతే మూసివేత తప్పదంటూ బిర్లా గతంలోనే వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఐడియా!
ముంబై: భారీ రుణభారంతో కుదేలైన వొడాఫోన్ ఐడియా కంపెనీ ఆస్తుల విక్రయానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆప్టిక్ ఫైబర్ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్తోనూ, నవీ ముంబైలో ఉన్న డేటా సెంటర్‌ను అమ్మేయడానికి ఎడెల్వీజ్ గ్రూప్‌తోనూ ఐడియా చర్చలు జరుపుతోందని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... వొడాఫోన్ ఐడియా కంపెనీ తన 1,56,000 కిమీ. ఆప్టిక్ ఫైబర్ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ వ్యాపారం విలువ 150–200 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. ఇక నవీ ముంబైలోని డేటా సెంటర్‌ను ఎడెల్వీజ్ సంస్థకు చెందిన ఎడెల్వీజ్ ఈల్డ్ ప్లస్ ఫండ్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డేటా సెంటర్ విలువ 6–10 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చు. సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్)కు సంబంధించి వొడాఫోన్ ఐడియా రూ.53,000 కోట్ల బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్ట్ ఈ ఏడాది అక్టోబర్24న తీర్పునిచి్చంది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా ఈ బకాయిలను కొంతైనా తీర్చాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అయితే టెలికం రంగానికి రూ.7 లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఆప్టిక్ ఫైబర్ ఆస్తుల విక్రయానికి బ్యాంక్‌లు అభ్యతరం చెప్పే అవకాశాలున్నాయి. -
ప్రభుత్వం సాయం చేయాలి..లేదంటే మూతే!!
న్యూఢిల్లీ: కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్యలేమీ తీసుకోకపోతే కంపెనీని మూసివేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్– ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. సంస్థను మూసేయాల్సి ఉంటుంది‘ అని శుక్రవారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అయితే, ఎకానమీని గాడిలో పెట్టే దిశగా.. సంక్షోభంలో ఉన్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టెలికం అనేది చాలా కీలక రంగమని ప్రభుత్వం గుర్తించింది. మొత్తం డిజిటల్ ఇండియా కార్యక్రమమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ప్రభుత్వం నుంచి మరింత తోడ్పాటు అవసరం‘ అని ఆయన చెప్పారు. ఏ రకమైన ఊరట చర్యలు కోరుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ప్రధానమైన సమస్య .. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదమే. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ప్రభుత్వమే టెల్కోలకు వ్యతిరేకంగా ఈ కేసు వేసింది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు‘ అని బిర్లా పేర్కొన్నారు. ఏజీఆర్ లెక్కింపు వివాదంలో ఇటీవల కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయీలు కట్టాల్సి రానుంది. దీంతో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడం వల్ల వొడాఫోన్ ఐడియా సెపె్టంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ.50,921 కోట్ల మేర రికార్డు స్థాయిలో నష్టాలు ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి.. ఎకానమీకి ఊతమిచ్చేందుకు కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించటం మాత్రమే సరిపోదని, ఆర్థికంగా తోడ్పాటునిచ్చేలా పటిష్టమైన ఉద్దీపన ప్యాకేజీలాంటిది అవసరమని బిర్లా చెప్పారు. ఆ రూపంలో వచ్చే నిధులతో కొన్ని కార్పొరేట్లు రుణభారం తగ్గించుకోగలవని, మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించుకోగలవని ఆయన వివరించారు. ఎకానమీని గట్టెక్కించడానికి ఆదాయ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలపై స్పందిస్తూ.. ‘ఇది కేవలం వినియోగ డిమాండ్ పెంచడానికే పరిమితమైన సమస్య కాదు. ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ప్రజలు మరింతగా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీన్నుంచి బైటపడాలంటే.. ఉద్దీపన చర్యలు ప్రకటించడం ఒక్కటే మార్గం. జీఎస్టీని 15 శాతానికి తగ్గించారనుకోండి.. అదే పెద్ద ఉద్దీపన చర్య కాగలదు‘ అని బిర్లా చెప్పారు. మరోవైపు ఇన్ఫ్రాపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం కూడా ఎకానమీపై బాగా సానుకూల ప్రభావం చూపగలదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 6.1 శాతం నుంచి 5 శాతానికి కుదించిన నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఐడియా పేమెంట్స్ బ్యాంక్ మూసివేత!
ముంబై: మరో పేమెంట్స్ బ్యాంక్ మూసివేత ఖరారైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లిక్విడేషన్‌కు తాజాగా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్ ఈ ఏడాది సెపె్టంబర్ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్ నియమించిందని వివరించింది. అయ్యర్ డెలాయిట్ టచ్ తొమత్సు ఇండియా ఎల్ఎల్పీలో సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించలేమని, స్వచ్ఛంద మూసివేతను ఈ ఏడాది జూలైలోనే ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. 2015 ఆగస్టులో ఆర్బీఐ మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకింగ్ కార్యకలాపాల లైసెన్స్‌లను ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. నాలుగో కంపెనీ...: పేమెంట్స్ బ్యాంకింగ్ రంగం నుంచి వైదొలగిన నాలుగో కంపెనీగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. గతంలో దిలిప్ సంఘ్వి, ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ల కన్సార్షియంతో పాటు టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్లు ఈ రంగం నుంచి వైదొలిగాయి. -
ఎజిఆర్ ఛార్జీలతో ఖంగుతిన్న టెలికాం సంస్థలు
-
వొడాఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పుతో వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ సీఈవో నిక్‌రీడ్ వ్యాఖ్యానించారు. వొడాఫోన్– ఐడియా జాయింట్ వెంచర్ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా రీడ్ ఈ విషయాలు చెప్పారు. ‘చాన్నాళ్లుగా భారత్ సవాళ్లమయంగా ఉంటోంది. అనుకూలంగా లేని నిబంధనలు, భారీ పన్నులు.. వీటికి తోడు సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల తీర్పు .. ఇవన్నీ కలిసి సంస్థకి ఆర్థికంగా పెనుభారం అవుతున్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం చార్జీల కింద భారత్‌లో సుమారు రూ.40 వేల కోట్ల దాకా బకాయిలు వొడాఫోన్–ఐడియా కట్టాల్సి రావొచ్చని అంచనా. దీంతో పాటు ఏప్రిల్– సెపె్టంబర్ మధ్యలో వొడాఫోన్ భారత విభాగం నిర్వహణ నష్టాలు 692 మిలియన్ యూరోలకు ఎగిశాయి. తాజా పరిణామాలతో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ వెల్లడించింది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో వొడాఫోన్ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. స్పెక్ట్రం వేలంలో పాల్గొనేదెవరు: సీవోఏఐ 5జీ సేవలకు సంబంధించి కావాలనుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని.. కాకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాత టెల్కోలు ఇందులో పాల్గొనకపోవచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ వ్యాఖ్యానించింది. -
ఆ కంపెనీలు బకాయిలు చెల్లించాల్సిందే..
కోల్కత్తా: ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు మినహాయింపులు ఇవ్వొద్దని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రిలయన్స్ జియో రెండో లేఖ రాసింది. వడ్డీ చెల్లింపులు, పెనాల్టీలను తగ్గించాలన్న వొడాఫోన్ ఐడియా అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయాన్ని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో గుర్తు చేసింది. కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం కంపెనీలకు మినహాయింపులు ఇచ్చే అవకాశమే లేదని జియో స్పష్టం చేసింది. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే సుప్రీం తీర్పును ఉల్లంఘించినట్లేనని జియో తెలిపింది. మరోవైపు ఐడియా వొడాఫోన్లు ఆర్థికంగా బలంగా ఉన్నాయని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఆ కంపెనీలకు ఉందని జియో తెలిపింది. కాగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పెనాల్టీలు, వడ్డీ చెల్లింపులు, లైసెన్స్ రుసుములు పరంగా 81,000కోట్లు చెల్లించాలని టెలికాం వర్గాలు తెలిపాయి. -
కేంద్రం వద్దకు వొడాఫోన్–ఐడియా
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రతికూల తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించాలని టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా నిర్ణయించుకుంది. వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికం శాఖను (డాట్) కోరాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టెల్కోలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం ఫీజులు కట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 21,000 కోట్లు కట్టాల్సి రానుంది. -
జియో: ఎగబాకిన వోడాఫోన్, ఎయిర్టెల్ షేర్లు
ముంబై : జియో షాకింగ్ నిర్ణయంతో ఎయిర్టెల్, వోడాఫోన్ పంట పండింది. వోడాఫోన్, ఐడియా ఏకంగా 18శాతం లాభదాయక షేర్లతో ఎగబాకింది. మరోవైపు ఎయిర్టెల్ 4.8 లాభదాయక షేర్లతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఇతర నెట్‌వర్క్‌ల పై ఉచిత కాల్స్ సదుపాయాన్ని అందిస్తున్న జియో సంస్థ తాజాగా వేరే నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జియో మాత్రం కాల్ టెర్మినేషన్ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగిస్తామని పేర్కొంది. అయితే తమ సంస్థ ప్రారంభించినప్పటి నుండి ప్రత్యర్థి ఆపరేటర్లకు వినియోగదారుల రుసుము 13,500 కోట్లు చెల్లించినట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో బిజినెస్ అనలిస్ట్ క్రిస్ లేన్ స్పందిస్తూ జియో లాభదాయక వృద్దిని ఆశిస్తున్నట్లు తెలిపాడు. -
ఎయిర్టెల్, జియో.. ఏది స్పీడ్?
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగమైన మొబైల్ నెట్వర్క్ సేవలందిస్తున్న కంపెనీగా ‘భారతీ ఎయిర్టెల్’ నిలిచిందని స్పీడ్‌టెస్ట్ డేటా సేవలందించే సంస్థ ‘ఊక్లా’ ప్రకటించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు సేకరించిన సమాచారం ప్రకారం ఎయిర్టెల్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించింది. ఢిల్లీ పరిధిలో అత్యంత వేగమైన 4జీ మొబైల్ నెట్‌వర్క్‌గా వొడాఫోన్ నిలిచింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోవడంతో డేటా వేగం పెరిగినట్టు వెల్లడించింది. గతనెల్లో రిలయన్స్ జియో నెట్వర్క్ చాలా నెమ్మదిగా ఉందని పేర్కొంది. అయితే, ఊక్లా నివేదిక ట్రాయ్ తాజాగా ప్రకటించిన సమాచారానికి విరుద్ధంగా ఉండడం విశేషం. బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రథమ స్థానంలో ఉండగా.. వేగం విషయంలో పోటీ కంపెనీలకు రెట్టింపు వేగంతో ఉందని ట్రాయ్ విశ్లేషణ కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది మే నెల నేంచి ఎయిర్టెల్, జియో డౌన్లోడ్ స్పీడ్ తగ్గిందని ‘ఊక్లా’ తెలిపింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోయిన తర్వాత ఈ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల డౌన్లోడ్ స్పీడ్ పుంజుకుందని గణాంకాలతో వివరించింది. (చదవండి: ఇండియా, రిలయన్స్ రైజింగ్.. ఎవ్వరూ ఆపలేరు!) -
వొడాఫోన్ ఐడియా నష్టాలు 4,874 కోట్లు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో రూ.4,874 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.4,882 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంటే రూ.8 కోట్ల నష్టాలను తగ్గించుకుంది. వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ రెండూ 2018 ఆగస్ట్ 31 నుంచి విలీనమై వొడాఫోన్ ఐడియాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రితం ఏడాది జూన్ త్రైమాసికం ఫలితాలతో ఈ ఏడాది జూన్ త్రైమాసికం ఫలితాలను పోల్చి చూడడం సరికాదు. జూన్ క్వార్టర్లో ఆదాయం మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.11,775 కోట్ల నుంచి రూ.11,270 కోట్లకు తగ్గింది. కొంత మంది కస్టమర్లను కోల్పోవడం, ఉన్న కస్టమర్లలో కొంత మంది తక్కువ విలువ కలిగిన ప్లాన్లకు మారిపోవడం, సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం తగ్గడం (ఏఆర్పీయూ) ప్రభావం చూపించాయి. ‘‘మేము చెప్పిన విధానాన్నే ఆచరణలో అమలు చేస్తున్నాం. దీని తాలూకు ఫలితాలు ఇంకా కనిపించలేదు. మా నెట్వర్క్ అనుసంధానత, కస్టమర్ల డేటా వినియోగ అనుభవం చాలా ప్రాంతాల్లో మెరుగుపడింది’’ అని వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4జీ కవరేజీ విస్తరిస్తామని, డేటా సామర్థ్యాలను కూడా పెంచుకుంటామని చెప్పారు. జూన్ త్రైమాసికంలో రూ.2,840 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టామని కంపెనీ తెలిపింది. కంపెనీ యూజర్ల సంఖ్య 33.4 కోట్ల నుంచి 32 కోట్లకు తగ్గడం గమనార్హం. -
ఎయిర్టెల్, వొడా, ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నెట్వర్క్ కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చనందుకు గాను భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు భారీ పెనాల్టీ భారం పడింది. టెలికం శాఖ అత్యున్నత నిర్ణయాల విభాగం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) పెనాల్టీ విధించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే, టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల నేపథ్యంలో రూ.3,050 కోట్ల జరిమానాను అమలు చేసే ముందు దీన్ని సవరించే విషయంలో ట్రాయ్ సూచనలను తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. టెలికం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియోకు ఇంటర్కనెక్షన్ పాయింట్లను ఇచ్చేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై రూ.3,050 కోట్ల పెనాల్టీని విధించాలని 2016 అక్టోబర్‌లో ట్రాయ్ సిఫారసు చేసింది. ఇందులో ఎయిర్టెల్, వొడాఫోన్లకు రూ.1,050 కోట్ల చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా అమలు చేయాల్సి ఉంది. వొడాఫోన్, ఐడియాలు విలీనమై ఒకే సంస్థగా ఏర్పడడంతో ఇప్పుడు ఉమ్మడి జరిమానాను వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సి ఉంటుంది. పోటీ సంస్థలు సరిపడా ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చకపోవడంతో తమ నెట్‌వర్క్‌కు సంబంధించి 75 శాతం కాల్స్ ఫెయిల్ అవుతున్నాయంటూ జియో చేసిన ఫిర్యాదు ఆధారంగా ట్రాయ్ నాడు చర్యలకు ఆదేశించింది. అయితే, నాణ్యమైన సేవలను తన కస్టమర్లకు అందించనందుకు రిలయన్స్ జియోపై కూడా పెనాల్టీ విధించాల్సి ఉంటుందని, నాణ్యమైన సేవలందించే ప్రాథమిక బాధ్యతను ఇతరులపై మోపవచ్చా? అంటూ డీసీసీలో భాగమైన ఓ శాఖా కార్యదర్శి ప్రశ్నించగా... దీన్ని డీసీసీ సభ్యులు కొట్టిపారేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
కాల్‌డ్రాప్స్‌పై ఐడియా, బీఎస్ఎన్ఎల్కు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెల్కో సంస్థలు ఐడియా, బీఎస్ఎన్ఎల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా లోక్‌సభకు తెలిపారు. నాలుగు సర్వీస్ ఏరియాల్లో (అస్సాం, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు) ఐడియాకు, ఒక సర్వీస్ ఏరియాలో (పశ్చిమ బెంగాల్లో) ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కు జనవరి 18న వీటిని జారీ చేసినట్లు వివరించారు. మరోవైపు, 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో సేవల కోసం టెలికం ఆపరేటర్లు 1.02 లక్షల టవర్లు ఇన్స్టాల్ చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
వొడాఫోన్ ఐడియా నష్టం 5,005 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్– ఐడియాకు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,006 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటం, నెట్వర్క్ ఇంటిగ్రేషన్ వ్యయాలు కూడా ఎక్కువగా ఉండటం, మొబైల్ టవర్ వ్యాపారం నుంచి నిష్క్రమించిన వ్యయాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ రెండు కంపెనీలకు కలసి రూ.1,285 కోట్ల నష్టాలొచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ఐడియా, వొడాఫోన్ల విలీనం పూర్తయినందువల్ల ఫలితాలను పోల్చడానికి లేదు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాలు మరింతగా పెరిగాయి. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లు... ఈ క్యూ3లో మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లకు పెరిగిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఈ క్యూ2లో సాధించిన మొత్తం ఆదాయం రూ.7,879 కోట్లతో పోల్చితే 52 శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ బాలేశ్ శర్మ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.6,552 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లుగా ఉన్నాయని, మొబైల్ టవర్ల వ్యాపారం నుంచి బైటకు వచ్చామని, దీనికి గాను వెండర్లకు రూ.725 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉందని తెలిపారు. ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ వాటా విలువ రూ.4,960 కోట్లుగా ఉండొచ్చ న్నారు. అలాగే 1.58 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నామని, ఈ విక్రయాల ద్వారా సమకూరిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. రూ.89కు ఏఆర్పీయూ.. ఈ క్యూ3లో ఎబిటా రూ.1,137 కోట్లుగా నమోదైందని, ఈ క్యూ2లో 6 శాతంగా ఉన్న మార్జిన్ ఈ క్యూ3లో 9.7 శాతానికి పెరిగిందని బాలేశ్ శర్మ పేర్కొన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 1.5 శాతం పెరిగి రూ.89కు చేరిందని తెలిపారు. ఒక్కో వినియోగదారుడు వినియోగించే డేటా 5.6 జీబీనుంచి 6.2 జీబీకి పెరిగిందన్నారు. 75 కోట్ల మందికి 4జీ సర్వీసులందేలా 11,123 సైట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ క్యూ3లో కొత్తగా 95 లక్షల 4జీ యూజర్లు జతయ్యారని, దీంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 7.53 కోట్లకు చేరిందని వివరించారు. 4జీ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టామని బాలేశ్ శర్మ చెప్పారు. అలాగే 4జీ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనేది లక్ష్య మన్నారు. మూలధన సమీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రణాళికకనుగుణంగా సమీకరించిన నిధులతో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తాజా ఏడాది కనిష్టానికి షేరు.. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.29.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.28.80ను తాకింది. -
జియో తగ్గింది..అందులో వొడాఫోన్ టాప్!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అన్లిమిటెడ్ డేటాతో వినోదాన్ని అందిస్తున్న టెలికాం సంచలనం రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా తగ్గిందని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. గతేడాది నవంబరులో 20.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో సరికొత్త రికార్డును నమోదు చేసిన జియో.. డిసెంబరులో మాత్రం ఈ స్పీడును 8 శాతానికి తగ్గించి(18.7 ఎంబీపీఎస్) యూజర్లను నిరాశపరిచింది. కాగా జియో దాటికి తట్టుకోలేక చతికిల పడిన ఎయిర్టెల్, వొడాఫోన్- ఐడియా మాత్రం ఓ మోస్తరుగా స్పీడును పెంచాయి. నవంబరులో 9.7 ఎంబీపీఎస్‌గా ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడు డిసెంబరులో 9.8 ఎంబీపీఎస్‌కు చేరింది. ఇక జియో నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ఒకే గొడుగు కిందకి వచ్చినప్పటికీ వొడాఫోన్- ఐడియాల డౌన్లోడ్ స్పీడు మాత్రం మెరుగుపడలేదు. అయితే ఈ రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించిన గణాంకాలను ట్రాయ్ విడివిడిగానే ప్రకటించింది. నవంబరులో 6.8 ఎంబీపీఎస్‌గా ఉన్న వొడాఫోన్ స్పీడు.. డిసెంబరులో 6.3 ఎంబీపీఎస్.. అదేవిధంగా ఐడియా డౌన్లోడ్ స్పీడు నవంబరులో 5.6 ఎంబీపీఎస్ కాగా డిసెంబరులో 5.3 ఎంబీపీఎస్‌కు తగ్గింది. అయితే డౌన్లోడ్ స్పీడు తగ్గినప్పటికీ ఏడాది కాలంగా ఈ కేటగిరీలో జియో తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. డేటా షేరింగ్, బ్రౌజింగ్, వీడియోల వీక్షణ తదితర అంశాల్లో కీలకమైన నెట్వర్క్ స్పీడు యూజర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీడు కాస్త తగ్గినప్పటికీ ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియోనే తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక అప్లోడింగ్ విషయానికొస్తే... నవంబరులో 4.5 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో స్పీడు డిసెంబరులో 4.3కి తగ్గగా.. వొడాఫోన్ మాత్రం 4.9 నుంచి 5.1ఎంబీపీఎస్‌కి స్పీడును పెంచిందని ట్రాయ్ పేర్కొంది. మైస్పీడ్ యాప్ రూపొందించిన డేటా స్పీడ్ వివరాల ఆధారంగా ట్రాయ్ ఈ గణాంకాలను వెల్లడించింది. -
టాప్ ప్లేస్ నిలబెట్టుకున్న జియో, ఐడియా
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్ డౌన్లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే4జీ వేగంకొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో టాప్ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది. యూజర్లకు 4జీ సర్వీసు అందించడంలో మిగతా నెట్‌వర్క్‌ల కంటే జియో ముందుంది. ట్రాయ్ అందించిన లెక్కల ప్రకారం నవంబరులో డౌన్లోడ్ స్పీడ్‌లో జియోదే పైచేయి. అప్లోడ్ స్పీడ్‌లో ఐడియా సెల్యులార్ టాప్‌లో నిలిచింది. మరోవైపు సమీప ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ ఈ నెలలో కొంచెం మెరుగుపడింది. ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ 9.7 ఎంబీపీఎస్ నమోదైంది. గత నెలలో ఇది 9.5గా ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ కూడా స్వల్పంగా మెరుగుపడింది. అక్టోబర్ 6.7 ఎంబీపీఎస్గాఉండగా.. ప్రస్తుత నెలలో 6.8స్థాయికి పెరిగింది. ఐడియా సెల్యులార్ 4జీ డౌన్లోడ్ స్పీడ్ 6.4 నుంచి 6.2 కి పడిపోయింది. అయితే అప్లోడ్ స్పీడ్‌లో (5.9ఎంబీపీఎస్) తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది ఐడియా. సెకండ్ ప్లేస్‌లో వోడాఫోన్ (4.9)నిలవగా, జియో (4.5) మూడవస్థానంతో సరి పెట్టుకుంది. అయితే ఇక్కడ కూడా ఎయిర్టెల్ స్వల్పంగా పుంజుకుంది. అయితే యూజర్ల విషయంలో డౌన్లోడ్ స్పీడే చాలా ముఖ్యం. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, యాప్స్ ఆపరేట్ చేయడంలో డౌన్లోడ్ స్పీడ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే మాత్రం అప్లోడ్ స్పీడ్ చూస్తారు. మైస్పీడ్ అప్లికేషన్లో రియల్ టైమ్ ఆధారంగా సగటు స్పీడ్ తెలుసుకోవచ్చు. -
విలీనం పూర్తి : 2500 మంది ఉద్యోగులకు ఎసరు
న్యూఢిల్లీ : ఐడియా-వొడాఫోన్ కంపెనీల విలీనం పూర్తయింది. ఈ రెండు సంస్థలు కలిసి దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఐడియా-వొడాఫోన్లు తమ హెడ్‌కౌంట్‌ను(ఉద్యోగుల సంఖ్యను) 15వేలకు కుదించాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల్లో 17,500 నుంచి 18వేల మంది ఉద్యోగులున్నారు. అంటే వీరిలో 2500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసేయాలని ఐడియా-వొడాఫోన్లు నిర్ణయించాయి. విలీనం సందర్భంగా 10 బిలియన్ డాలర్ల పొదుపు ప్రణాళికను అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులపై వేటు పడుతోంది. కొంతమంది ఉద్యోగులను పేరెంట్ కంపెనీలు వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి తీసుకుని, మిగతా కొంతమందిపై వేటు వేయాలని ఈ విలీన సంస్థ ప్లాన్ చేసింది. అంతేకాక ఉద్యోగులకు ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను కూడా ప్రస్తుతం పక్కన పెట్టింది. అయితే ఉద్యోగుల వేటుకు సంబంధించిన వార్తలు మార్కెట్లో చక్కర్లు కొడుతుండటంతో, ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని వొడాఫోన్ ఇండియాకొట్టిపారేసింది. ‘కొంతవరకు హేతుబద్దీకరణ ఉంటుంది. అది సర్వసాధారణం. కంపెనీ వచ్చే కొన్ని నెలల్లో ఉద్యోగుల సంఖ్యను 2000 నుంచి 2500 మందిని తగ్గించుకోవాలనుకుంటుంది’ అని ఈ విషయం తెలిసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే ఉద్యోగుల సంక్షేమాన్ని కంపెనీ పట్టించుకుంటుందని, సెవరెన్స్ ప్యాకేజీలను అందిస్తుందని, పేరెంట్ గ్రూప్ ఆదిత్యా బిర్లా గ్రూప్‌లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే టెలికాం కంపెనీల్లో ఉద్యోగుల కోత ఇదేమీ కొత్త కాదు. రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, టెలికాం రంగం అస్తవ్యస్తమైంది. ఇక అప్పటి నుంచి టెలికాం కంపెనీలు పోటీని తట్టుకోలేక, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేటు వేయడం ప్రారంభించాయి. వొడాఫోన్ ఇండియా కూడా వాలంటరీ అట్రిక్షన్‌ను ఆఫర్చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగుల సంఖ్య తగ్గించేస్తుంది. అయితే వొడాఫోన్ ఇండియా ఉద్యోగులను, ఐడియా సెల్యులార్ ఉద్యోగులను విలీన సంస్థ సమానంగా చూస్తోంది. ఉద్యోగులందరిన్నీ ఎంతో గౌరవంగా చూస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా హెచ్ఆర్ హెడ్ చెప్పారు. -
రూ.75కే 1జీబీ డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్లు
టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ నిన్ననే రూ.597తో ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాయిస్ కాల్స్ ఎక్కువగా చేసుకునే వారిని ఉద్దేశించి 168 రోజుల వాలిడిటీలో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఒక్కరోజుల్లోనే మరో సరికొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆవిష్కరించింది. బేసిక్ లెవల్ యూజర్ల కోసం 75 రూపాయలతో సరికొత్త ప్లాన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ లాంచ్ చేసిన ఈ ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ కింద యూజర్లకు 28 రోజుల పాటు 300 నిమిషాల ఉచిత కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 1 జీబీ 2జీ/3జీ/4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. వాయిస్ కాల్స్‌లో లోకల్, ఎస్టీడీ, అవుట్ గోయింగ్ రోమింగ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి. కాగ, అంతకముందే ఎయిర్టెల్ రూ.47తో ఓ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దాని వాలిడిటీ కూడా 28 రోజులే. ఇప్పటికే ఎయిర్టెల్ ప్రత్యర్థి ఐడియా సెల్యులార్ కూడా రూ.75 ప్లాన్‌ను కలిగి ఉంది. ఐడియా కూడా తన ప్లాన్‌పై 300 నిమిషాల కాలింగ్, 1జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లనే ఆఫర్ చేస్తోంది. అయితే ఐడియా కేవలం ఈ ప్లాన్‌ను తన 4జీ సర్కిల్ వినియోగదారులకే అందిస్తోంది. ప్రభుత్వ రంగ టెల్కో బీఎస్ఎన్ఎల్కు కూడా రూ.75 ప్లాన్ ఆఫర్ చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వాలిడిటీ 15 రోజులే. ఇది అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. అయితే దానిపై ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేవు. బీఎస్ఎన్ఎల్ యూజర్లకు ఈ ప్లాన్ కింద 10 జీబీ 3జీ డేటా, 500 ఉచిత ఎస్ఎంఎస్లు అందుతున్నాయి. -
లాభాల్లోకి ఐడియా
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ క్వార్టర్లో లాభాల బాట పట్టింది. అంతకు ముందటి క్వార్టర్లో (గత ఆర్థిక సంవత్సరం క్యూ4) రూ.962 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.257 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ. 815 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. తమ పూర్తి అనుబంధ సంస్థ, మొబైల్ టవర్ల కంపెనీ, ఐడియా సెల్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌లో పూర్తి వాటాను రూ.3,365 కోట్లకు ఏటీసీ టెలికమ్‌కు విక్రయించామని, దీంతో ఈ క్యూ1లో నష్టాలు నమోదు చేయకుండా గట్టెక్కామని కంపెనీ వివరించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,758 కోట్ల స్థూల నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని ఐడియా తెలియజేసింది. 54 శాతం తగ్గిన నిర్వహణ లాభం.... అంతకు ముందటి క్వార్టర్లో రూ.6,137 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ1లో 4 శాతం తగ్గి రూ.5,889 కోట్లకు చేరిందని ఐడియా తెలిపింది. నిర్వహణ లాభం రూ.1,447 కోట్ల నుంచి 54 శాతం క్షీణించి రూ.659 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నిర్వహణ లాభ మార్జిన్ 23.6 శాతం నుంచి 11.2 శాతానికి పడిపోయింది. అంతకు ముందటి క్వార్టర్లో రూ.105గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ.100కు తగ్గిపోయింది. సేవల ఆదాయం రూ.8,167 కోట్ల నుంచి 28 శాతం క్షీణించి రూ.5,866 కోట్లకు తగ్గింది. మొబైల్ సర్వీసుల వ్యాపారం రూ.7,943 కోట్ల నుంచి 28 శాతం తగ్గి రూ.5,745 కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్ఈలో ఐడియా సెల్యులర్ షేర్ 3.6 శాతం లాభంతో రూ.58.45 వద్ద ముగిసింది. గత ఆరు నెలల్లో ఈ షేర్ 40 శాతం పతనమైంది. -
మెగా టెల్కో ఆవిర్భావం
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ల మెగా విలీన ప్రతిపాదనకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లయింది. విలీన సంస్థకు మొత్తం 43 కోట్ల మంది యూజర్లతో 35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. ఇప్పటిదాకా 34.4 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారతీ ఎయిర్టెల్... ఇకపై రెండో స్థానానికి పరిమితం కానుంది. వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు గురువారం తుది అనుమతులిచ్చినట్లు టెలికం శాఖ (డాట్) సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ఇక సంబంధిత శాఖల నుంచి పొందిన అనుమతులను ఇరు సంస్థలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి సమర్పించి, విలీన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. టెలికం ట్రిబ్యునల్, ఇతర కోర్టుల ఆదేశాలకు విలీన సంస్థ కట్టుబడి ఉండాలనే షరతులతోనే తుది అనుమతులిచ్చినట్లు స్పష్టం చేశారు. విలీనం ప్రక్రియ ఆగస్టు ఆఖరికల్లా పూర్తి కాగలదని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో ఇటీవలే పేర్కొన్నారు. ఈ డీల్‌కు సంబంధించి జూలై 9న డాట్ కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీని ప్రకారం ఇరు సంస్థలు రూ. 7,269 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. ఇందులో రూ. 3,926 కోట్లు నగదు రూపంలో, మిగతాది బ్యాంక్ గ్యారంటీల రూపంలో సమర్పించాయి. తమపై విధించిన షరతులను వ్యతిరేకిస్తూనే.. ఈ మొత్తాన్ని చెల్లించినట్లు రెండు సంస్థలు తెలిపాయి. విలీన సంస్థ స్వరూపం ఇలా.. బ్రిటన్ సంస్థ వొడాఫోన్‌కి భారత్‌లో ఉన్న టెలికం కార్యకలాపాలతో ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన ఐడియా సెల్యులార్ సంస్థను విలీనం చేయాలన్న ఆలోచన 2017 మార్చిలోనే ఇరు సంస్థలూ ప్రకటించాయి. అనేక ప్రతిబంధకాలన్నీ అధిగమించిన తర్వాత ఈ ఏడాది జూన్ కల్లా డీల్ ముగియొచ్చని ముందుగా భావించారు. అయితే, జూలై 9కి గానీ డాట్ నుంచి అనుమతులు రాలేదు. మొత్తం మీద.. కొత్తగా ఏర్పడే విలీన సంస్థ విలువ సుమారు 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) స్థాయిలో ఉండనుంది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 4జీ స్పీడ్‌తో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడానికి వీలవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా దీనికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, బాలేశ్ శర్మ కొత్త సీఈవోగాను ఉంటారు. ఇది లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుంది. ఇందులో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లాకు 26 శాతం, ఐడియా షేర్హోల్డర్లకు 28.9 శాతం వాటాలు ఉంటాయి. నాలుగేళ్ల వ్యవధిలో సమాన వాటాల స్థాయిని సాధించేందుకు వొడాఫోన్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ మరో 9.5 శాతం వాటాలు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ అప్పటికీ రెండు సంస్థల వాటాలు సమాన స్థాయిలో లేని పక్షంలో వొడాఫోన్ కొంత వాటాలు విక్రయిస్తుంది. భారీ రుణభారం ఉన్న ఐడియా, వొడాఫోన్లు.. టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో రాకతో పెరిగిన తీవ్ర పోటీని గట్టిగా ఎదుర్కొనేందుకు ఈ డీల్ తోడ్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. షేరు 4% అప్.. విలీన ప్రతిపాదనకు డాట్ అనుమతుల నేపథ్యంలో.. గురువారం బీఎస్ఈలో ఐడియా సెల్యులార్ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 56.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 4.64 శాతం ఎగిసి రూ.57.50 స్థాయిని కూడా తాకింది. ఎన్ఎస్ఈలో 4.18 శాతం పెరిగి రూ. 57.20 వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద కంపెనీ మార్కెట్ విలువ రూ. 873 కోట్లు పెరిగి రూ. 24,830 కోట్లకు చేరింది. బీఎస్ఈలో 1.77 లక్షలు, ఎన్ఎస్ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారాయి. కొత్త ప్రయాణానికి శ్రీకారం: కుమార మంగళం బిర్లా వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు డాట్ నుంచి తుది అనుమతులు వచ్చినట్లు అటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. గ్రూప్ సంస్థ హిందాల్కో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ఐడియా, వొడాఫోన్ విలీనంతో.. ఉత్తేజకరమైన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. దీనిపై ఎంతో ఆశావహంగా ఉన్నాం‘ అని ఆయన చెప్పారు. మరికొద్ది వారాల్లో విలీన ప్రక్రియ పూర్తి కాగలదన్నారు. కొత్త సంస్థకు ఇంకా బ్రాండింగ్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కుమార మంగళం బిర్లా వివరించారు. -
బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ టెలిఫోనీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ దేశీయంగా తొలి ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. మొబైల్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్ నంబరుకైనా కాల్ చేసే సదుపాయం దీనితో అందుబాటులోకి రానుంది. జూలై 25 నుంచి ఈ సర్వీసులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ ’వింగ్స్’ను కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా బుధవారం ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటాను పెంచుకోగలగడం ప్రశంసనీయం. సిమ్ అవసరం లేకుండా ఫోన్ కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించే ఇంటర్నెట్ టెలిఫోనీని అందుబాటులోకి తెచ్చినందుకు బీఎస్ఎన్ఎల్ను అభినందిస్తున్నా‘ అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దేశీ సేవల కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజును చెల్లించి, వై–ఫై లేదా ఇతరత్రా ఏ టెలికం ఆపరేటరు ఇంటర్నెట్ సర్వీస్‌నైనా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్ నంబరుకైనా ఈ యాప్ ద్వారా అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా మొబైల్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే వీలున్నప్పటికీ, సదరు యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే చేసే అవకాశం ఉంది. త్వరలో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. మరికొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభిస్తామని, జూలై 25 నుంచి అధికారికంగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ‘వింగ్స్ యాప్‌ను ఉపయోగించి కస్టమర్లు.. భారత్‌లోని నంబర్లకు విదేశాల నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ యాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. దేశీయంగా అన్లిమిటెడ్ కాల్స్ కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజు ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్ జారీ చేసే మొబైల్ నంబరుకు ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని తెలిపారు. ఐడియా–వొడాఫోన్ విలీనానికి ఆమోదం.. ప్రైవేట్ టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని మనోజ్ సిన్హా చెప్పారు. అయితే, రెండు కంపెనీలూ ఇంకా కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత తుది ఆమోదముద్ర లభిస్తుందని వివరించారు. డీల్‌కు పూర్తి స్థాయిలో అనుమతులివ్వాలంటే వొడాఫోన్ ఇండియాకు చెందిన స్పెక్ట్రం కోసం ఐడియా రూ. 3,976 కోట్లు కట్టాలని, ఇరు సంస్థలు రూ. 3,342 కోట్ల మేర బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని టెలికం శాఖ షరతులు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఐడియా, వొడాఫోన్ వీటిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్లు విలీనమైతే దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల నికర విలువ, 35 శాతం మార్కెట్ వాటా, 43 కోట్ల యూజర్లతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఆవిర్భవించనుంది. -
ఆలస్యమైతే కస్టమర్లు, రెవెన్యూలు హుష్‌కాకి
ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించేందుకు.. వొడాఫోన్, ఐడియాలు విలీనం కాబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రితమే ఇరు కంపెనీలు విలీనంపై తుది ప్రకటన ఇచ్చేశాయి. అప్పటి నుంచి ఈ కంపెనీలు విలీన ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తి కాలేకపోయింది. వొడాఫోన్ ఇండియా-ఐడియా సెల్యులార్ విలీనం ఆలస్యమైతే, వీటి మెగా కంపెనీ భారీగా కస్టమర్లను, రెవెన్యూలను నష్టపోయే ప్రమాదముందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విలీన ప్రక్రియ ముగియడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశముందని, ఈ సమయంలో రెవెన్యూ మార్కెట్ షేరులో ఈ సంస్థ 150 బేసిస్ పాయింట్లను కోల్పోయే ప్రమాదముందని తెలుస్తోంది. దీంతో ప్రతి రెండు నెలల జాప్యానికి 600 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు రెవెన్యూలను ఈ విలీన సంస్థ కోల్పోతుందని ఫిలిప్‌క్యాపిటల్ టెలికాం విశ్లేషకుడు నవీన్ కులకర్ని చెప్పారు. కీలక కస్టమర్లను, రెవెన్యూ మార్కెట్ షేరును భారతీ ఎయిర్‌టెల్‌కు, రిలయన్స్ జియోకు వదులుకోవాల్సి వస్తుందని కులకర్ని తెలిపారు. మార్కెట్ వ్యూహాల విధంగా వెళ్లి, విలీనాన్ని త్వరగా ముగించేయాలని చెప్పారు. గత నెల చివరి వరకే వొడాఫోన్, కుమార్ బిర్లాకు చెందిన ఐడియాల విలీన ఒప్పందం పూర్తి కావాల్సి ఉంది. కానీ మూడో పార్టీ ఆసక్తి మేరకు ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. మెగా విలీనాన్ని వొడాఫోన్, ఐడియాలు రెండూ విజయవంతంగా ముగిస్తాయని, కొంత సమస్యం ఆలస్యమైతే అంత ప్రమాదకరమేమీ కాదని కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ అన్నారు. విలీన సంస్థలో ఇరు కంపెనీలకు సమానమైన యాజమాన్య హక్కులు ఉంటాయి. విలీన సంస్థ పేరును వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ప్రతిపాదించారు. విలీన సంస్థలో వొడాఫోన్ గ్రూప్ 45.1 శాతం, ఐడియా ప్రమోటర్లు 26 శాతం వాటా కలిగి ఉండనున్నారు. మిగతా 28.9 శాతం వాటా పబ్లిక్ షేర్ హోల్డర్ల వద్ద ఉండనుంది. -
జియోకి కౌంటర్ : ఐడియా సూపర్ ప్లాన్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోకి కౌంటర్‌గా ఐడియా సెల్యులార్ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరసమైన ధరల్లో డేటాను అందిస్తున్న టాప్ టెలికాం ఆపరేటర్ జియోకు పోటీని ఎదుర్కొనేలా ఇతర కంపెనీలు కొత్త టారిఫ్‌లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐడియా కూడా కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ను అందిస్తోంది. 28రోజుల వాలిడిటీలో ఈ కొత్త రూ. 227ల ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఇందులో అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలతో పాటు అన్లిమిటెడ్ ఉచిత డయలర్ టోన్లు అందిస్తుంది. రోజుకు 3జీ/ 2జీ 1.4జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తంగా 39.4జీబీ డేటాను కస్టమర్లు వాడుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100ఎస్ఎంస్లు ఉచితం. ముఖ్యంగా అన్లిమిటెడ్ డయలర్ టోన్, మిస్డ్ కాల్ అలర్ట్ ఈ ప్లాన్‌లో ప్రత్యేక ఆకర్షణ. దీంతోపాటు ఐడియా అన్లిమిటెడ్ ధమాకా ఆఫర్‌ను కూడా ప్రకటించింది. 199 రూపాయల రీచార్జ్ ప్లాన్లతో కలిపి కొన్ని ఎంపిక చేసిన రీచార్జ్‌లపై ప్రిపెయిడ్ కస్టమర్లకు క్యాష్‌బ్యాక్, ఇతర బహుమతులను ఆఫర్ చేస్తోంది. -
ఐడియా–వొడాఫోన్ విలీనం ఆలస్యం!
న్యూఢిల్లీ: ఐడియా–వొడాఫోన్ విలీనం ముందు అనుకున్నట్టు ఈ నెల 30లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్ ఇండియా వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల రూపంలో రూ.4,700 కోట్ల మేర బకాయి ఉంది. దీంతో ఐడియాలో విలీనానికి ముందే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ కోరనుంది. లేదా బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని కోరనున్నట్టు సమాచారం. నిజానికి 2015లో వొడాఫోన్ తన సబ్సిడరీలైన వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ సెల్యులర్, వొడాఫోన్ డిజిలింక్‌లను వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లో విలీనం చేసింది. ఇదే ఇప్పుడు వొడాఫోన్ ఇండియాగా మారింది. అయితే, విలీనం సమయంలోనే రూ.6,678 కోట్ల వన్‌టైమ్ స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ డిమాండ్ నోటీసు చేయడంతో వొడాఫోన్ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వొడాఫోన్ రూ.2,000 కోట్ల బకాయిలనే చెల్లించింది. దీంతో బకాయిలపై టెలికం శాఖ న్యాయ సలహా కోరగా, వొడాఫోన్ నుంచి బకాయిల చెల్లింపునకు డిమాండ్ చేయవచ్చని వచ్చింది. దీంతో వడ్డీ సహా మొత్తం ఎంత బకాయి అన్నది ఖరారు చేసే పనిలో ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు. -
సరైన తీర్పు
ఒకవ్యక్తి పనిమీద దూరప్రాంతానికి వెళుతూ తనవద్ద ఉన్న సొమ్మును మిత్రుడివద్ద దాచాడు. కొన్నాళ్ళకు తిరిగొచ్చి తన పైకం ఇమ్మని మిత్రుణ్ణి అడిగాడు. దానికి మిత్రుడు, ఏమి పైకం? నాకెప్పుడిచ్చావు? అని అమాయకంగా ఎదురు ప్రశ్నించాడు. దాంతో సొమ్ము దాచుకున్న వ్యక్తి లబోదిబోమంటూ, న్యాయస్థానం గడప తొక్కాడు. ‘నువ్వతనికి సొమ్ము ఇచ్చినట్లు ఏమైనా సాక్ష్యం ఉందా?’ అని అడిగారు న్యాయమూర్తి. లేదని సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. డబ్బు తీసుకున్న వ్యక్తిని కూడా హాజరు పరిచి ప్రశ్నించారు. ఇరువురి వాదనా విన్న తరువాత ఇతను సొమ్ము దాచింది నిజమే, అతను అబద్ధమాడుతున్నదీ నిజమే అని న్యాయమూర్తికి అర్ధమైపోయింది. కాని సాక్ష్యం లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్ధంకాక, విచారణను మరుసటి రోజుకు వాయిదా వేశాడు. ఇంటికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. భర్త పరధ్యానంగా ఉండడం చూసి, ఏమిటని ప్రశ్నించింది. న్యాయమూర్తి ఏమీలేదని దాటవేసే ప్రయత్నం చేశాడు. కాని ఆమె గుచ్చిగుచ్చి అడగడంతో చెప్పక తప్పింది కాదు. ‘ఓస్ ఇంతేనా! నేనొక ఉపాయం చెబుతా వినండి’ అన్నదామె. న్యాయమూర్తి నవ్వుకున్నారు. కాని నిజంగానే ఆమె చెప్పిన ఉపాయానికి ఆశ్చర్యపోవడం అతని వంతయింది. మరునాడు న్యాయమూర్తి ఇద్దర్నీ పిలిచి, నువ్వు పైకం అతనికిచ్చినప్పుడు సాక్షులెవరూ లేరంటున్నావు. కనీసం అక్కడ ఏదైనా చెట్దుగాని, పుట్టగాని మరేవైనా ఇతర వస్తువులన్నా ఉన్నాయా? అని ఇచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు. అప్పుడా వ్యక్తి, అవునండీ అక్కడొక జామచెట్టు ఉంది. అని చెప్పాడు. ‘‘అయితే ఆ జామ చెట్టునే వచ్చి సాక్ష్యం చెప్పమను’’ అన్నాడు న్యాయమూర్తి. దీంతో సభికులంతా ఆశ్చర్యపోయారు. చివరికి మిత్రద్రోహానికి ఒడి గట్టిన వాడు కూడా ‘జామ చెట్టు ఎలా సాక్ష్యమిస్తుంది’ అని వెటకారంగా నవ్వుకున్నాడు. కాని న్యాయమూర్తి ఇవేమీ పట్టించుకోకుండా, నువ్వు వెంటనే వెళ్ళి జామచెట్టును సాక్ష్యంగా తీసుకురమ్మని బలవంతంగా పంపించాడు.అతడు వెళ్ళిన కొద్దిసేపటికి న్యాయమూర్తి డబ్బుతీసుకున్న వ్యక్తినుద్దేశించి, ‘అతనా జామచెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటాడా?’అని అడిగాడు. దానికతను, ‘ఇంకా చేరుకోక పోవచ్చు’. అన్నాడు ఆద్రోహి.అంతలో వెళ్ళిన వ్యక్తి తిరిగొచ్చి,’అయ్యా..! మీరు చెప్పినట్లే నేను ఆ జామచెట్టు దగ్గరికెళ్ళి సాక్ష్యం చెబుదువు గాని పద.. అని అడిగాను. కాని అది చెట్టుకదా.. ఎలా వస్తుంది... ఎలా మాట్లాడుతుంది? మీరు నన్ను ఆటపట్టిస్తున్నట్లున్నారు.’ అన్నాడా వ్యక్తి.‘లేదు లేదు జామచెట్టు వచ్చి నువ్వు సొమ్ము ఇతని దగ్గర దాచినమాట నిజమేనని చెప్పి వెళ్ళిపోయింది’ అన్నారు న్యాయమూర్తి. దీంతో సభికులంతా నోరెళ్ళబెట్టారు. సొమ్ము తీసుకొని అబద్ధమాడుతున్న వ్యకి ్తకూడా, ‘అదేంటీ.. జామచెట్టు ఇక్కడికెప్పుడొచ్చిందీ?’ అన్నాడు. అప్పుడు న్యాయమూర్తి,‘అతనా జామచెట్టు వరకు వెళ్ళి ఉంటాడా? అని ఇంతకుముందు నేనడిగినప్పుడు, నువ్వు, అప్పుడే వెళ్ళి ఉండడని సమాధానం చెప్పావు. అతను గనక నీకు పైకం ఇచ్చి ఉండకపోతే, నాకేం తెలుసు.. జామచెట్టో, గీమచెట్టో నాకేమీ తెలియదనేవాడివి. కాని, అతడింకా వెళ్ళి ఉండకపోవచ్చు అని చెప్పావు. అంటే, అతను నీకు పైకం ఇచ్చిందీ నిజమే, నువ్వు తీసుకుందీ నిజమే. ఎగ్గొట్టే ఉద్దేశ్యంతోనే నువ్వు అబద్ధమాడావు. వెంటనే అతని సొమ్ము అతనికి చెల్లించు. లేకపోతే జైలుకు పోతావు.’ అన్నారు న్యాయమూర్తి కఠినంగా.. ఈ మాటలు వినగానే అతనికి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే అతని పైకం అతనికి చెల్లించి,క్షమించమని ప్రాధేయపడ్డాడు. –ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మోదీ ఐడియా.. సెటిలైన కాంగ్రెస్ నేత!
గాంధీనగర్, గుజరాత్ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడాలు (పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగమే’ అన్న సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కానీ నేడు మోదీ ఇచ్చిన ‘పకోడా ఐడియా’నే ఒక కాంగ్రెస్ కార్యకర్త జీవితాన్ని మార్చేసింది. వడోదరకు చెందిన నారాయణభాయ్ రాజ్‌పుత్ హిందీ లిటరేచర్‌లో పోస్టు గ్రాడ్యూయేట్. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. ఎన్ఎస్యూఐలో కార్యకర్తగా చేరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అయితే పీజీ చేసిన నారాయణభాయ్ నిరుద్యోగి. మోదీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను అతడు కూడా చూశాడు. మోదీ చెప్పిన ‘పకోడా ఐడియా’ అతనికి బాగా నచ్చింది. పనిపాటా లేకుండా ఖాళీగా ఉండటం కంటే పకోడా బిజినెస్ చేయడం మంచిదని భావించాడు. తొలుత ఒక స్టాల్‌తో ప్రారంభమైన నారాయణభాయ్ పకోడా వ్యాపారం నేడు మొత్తం 35శాఖలుగా, వడోదర నగరమంతా విస్తరించింది. ఈ విషయం గురించి నారాయణభాయ్ ‘ప్రధాని ‘పకోడా బిజినెస్ ఐడియా’ విన్న తర్వాత నేను ఎందుకు ఆ మార్గంలో వెళ్లకూడదు అనుకున్నాను. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడా అమ్మి రోజుకు కనీసం 200 రూపాయలు సంపాదించడం మంచిదే కదా అనిపించింది. అందుకే ఒకసారి ప్రయత్నించి చుద్దామని భావించాను. మొదట 10 కేజీల పదార్థాలతో, 100 గ్రాముల పకోడా ఒక్కొక్కటిగా 10 రూపాయలుగా ఒక స్టాల్‌ను ప్రారంభించాను. నేడు నగరవ్యాప్తంగా నా పకోడా స్టాల్స్ 35 ఉన్నాయి. ప్రతిరోజు 500 - 600 కేజీల పకోడాలు అమ్ముతున్నాను’ అని తెలిపాడు. వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే నారాయణభాయ్ ‘పకోడా బిజినెస్’కు మంచి పేరు వచ్చింది. నారాయణభాయ్ రోజు ఉదయం 7 - 11 గంటల వరకూ అలానే సాయంత్రం కూడా ఇదే సమయంలో పకోడాను అమ్ముతుంటాడు. -
ఐడియా, వొడాఫోన్ కొత్తపేరు.. వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియాతో విలీనాంతరం అవతరించే కొత్త కంపెనీకి ‘వొడాఫోన్ ఐడియా’ పేరు పెట్టాలని ఐడియా తాజాగా ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పడే కంపెనీ దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవిస్తుంది. కంపెనీ పేరులో మార్పును నిర్ణయించడానికి జూన్ 26న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఐడియా తెలిపింది. అలాగే ఇందులో ఎన్సీడీల ద్వారా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ అంశం చర్చకు రానుంది. కాగా ఐడియా, వొడాఫోన్ ఇండియా వాటి వ్యాపారాలను విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విలీనానికి టెలికం డిపార్ట్మెంట్ ఆమోదం తుది దశలో ఉంది. విలీనం తర్వాత ఏర్పడే కంపెనీలో వొడాఫోన్ కు 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%, ఐడియా వాటాదారులకు 28.9% వాటాలు రావొచ్చు. -
వొడాఫోన్ లాభం రూ. 9,805 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియా కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,805 కోట్ల నిర్వహణ లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.30,690 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయని వొడాఫోన్ తెలిపింది. ఐడియా సెల్యులార్తో విలీనం వచ్చే నెల కల్లా పూర్తవ్వగలద ని అంచనాలున్నాయని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ కొలావో పేర్కొన్నారు. బహుశా ఇవే తమ చివర స్టాండలోన్ ఫలితాలు కావచ్చని వ్యాఖ్యానించారు. 86 శాతం తగ్గిన డేటా చార్జీలు... టారిఫ్‌ల యుద్దం తమపై తీవ్రంగానే ప్రభావం చూపించిందని కొలావో అంగీకరించారు. మొబైల్ టర్మినేషన్ చార్జీలను తగ్గించడం మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని తెలిపారు. 2016–17లో రూ.42,927 కోట్లుగా ఉన్న సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 19 శాతం క్షీణించి రూ.35,045 కోట్లకు పడిపోయిందని వివరించారు. తీవ్రమైన పోటీ కారణంగా డేటా చార్జీలు 86 శాతం తగ్గాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో కోటి మంది కొత్త వినియోగదారులు లభించారని, దీనికి చాలా ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. ఇదే క్వార్టర్లో 5.76 లక్షల పోస్ట్–పెయిడ్ వినియోగదారులను కోల్పోయామని తెలిపారు. -
జియో దెబ్బకు ఎయిర్టెల్, ఐడియా పతనం
ముంబై : ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొత్త పోస్టుపెయిడ్ ప్లాన్ రూ.199తో టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, ఐడియాలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌పై అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో దెబ్బకు భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్‌లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఐడియా షేర్లు 8.1 శాతం మేర క్షీణించాయి. ఇది 2011 ఫిబ్రవరి నాటి కనిష్ట స్థాయిలు. అదేవిధంగా ఎయిర్టెల్ షేర్లు కూడా 5.8 శాతం కిందకి పడిపోయాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్న ఈ టెలికాం కంపెనీలను, ఎప్పడికప్పుడూ జియో దెబ్బతీస్తూనే ఉంది. ప్రస్తుతం జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌కు కౌంటర్‌గా తాము ఎలాంటి ప్లాన్లను ప్రకటించాలి? అని కంపెనీలు యోచిస్తున్నాయి. త్వరలోనే ఈ కంపెనీలు కూడా కొత్త ప్లాన్లను ప్రకటించే అవకాశాలున్నాయని జెఫెరీస్ పేర్కొంది. దీంతో ఒక్కో యూజర్‌తో పొందే సగటు రెవెన్యూ పడిపోనుంది. ఒకవేళ పోస్టు పెయిడ్ ధరల్లో 10 శాతం కోత పెడితే, ఈబీఐటీడీఏలు ఐడియావి 12 శాతం, ఎయిర్టెల్ కంపెనీలు 6 శాతం తగ్గిపోయే అవకాశాలున్నాయని జెఫెరీస్ తెలిపింది. -
వోడాఫోన్ డీల్ వలన ఐదు వేల ఉద్యోగాలు ఫట్
-
ఒక్క ఐడియాతో రూ.10 లక్షలు గెల్చుకోండి
మీరు చక్కటి ఐడియాలు ఇవ్వగలరా...? మీ ఆలోచనతో అందరిని ఒప్పించి, మెప్పించగలరా..? అయితే ఇది మీ కోసమే. భారత రైల్వే శాఖ మీరు పది లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఓ మంచి ఐడియా చెప్పడమే. భారత రైల్వే శాఖ జన్ భాగీదారి ప్రోగ్రామ్ పేరిట ఓ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొన్న వారు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఐడియా చెబితే చాలు. మీ ఆలోచన కొత్తగా, అద్భుతంగా ఉందంటే పది లక్షల రూపాయలు మీవే. అంతేకాదు ఆ తర్వాత మరో మూడు నగదు బహుమతులు కూడా ఉన్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి మీరు ‘ఇన్నోవేటివ్.మైగోవ్.ఇన్’ వెబ్సైట్లోకి వెళ్లి మీ ఆలోచనను ఆన్లైన్లో పంపితే సరిపోతుంది. రైల్వే స్టేషన్లలో చక్కటి సౌకర్యాలు కల్పించడానికి డబ్బును ఎలా సమకూర్చాలో క్లుప్తంగా వివరించాలి. మీ ఆలోచన మన ప్రస్తుత రైల్వే వ్యవస్థకు సరిపోయేదిగా ఉండాలి, ఆచరణ సాధ్యంగా కూడా ఉండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మెదడుకు పదును పెట్టిండి, పది లక్షలు గెల్చుకోండి! -
ఏటీసీకి వొడాఫోన్ టవర్లు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా టవర్ల వ్యాపార విక్రయం పూర్తయింది. భారత్‌లోని టవర్ల వ్యాపారాన్ని అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ) టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.3,850 కోట్లకు విక్రయించడం పూర్తయిందని వొడాఫోన్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం తమకు 58,000 మొబైల్ టవర్లున్నాయని ఏటీసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్(ఏషియా) అమిత్ శర్మ తెలిపారు. వొడాఫోన్ నుంచి కొనుగోలు చేసిన 10,200 టవర్లతో తమ మొబైల్ టవర్ల వ్యాపారం మరింత శక్తివంతం అవుతుందని వివరించారు. భారత్‌లోని తమ క్లయింట్లు 4జీ సేవలను విస్తరిస్తుండటంతో వారికి మరింత సమర్థవంతమైన సేవలందించడానికి వీలవుతుందని వివరించారు. ఐడియాతో కుదుర్చుకున్న రూ.4,000 కోట్ల టవర్ల కొనుగోలు ఒప్పందం పూర్తికావలసి ఉందని తెలిపారు. ఐడియా డీల్‌కు ఈ నెలాఖరుకల్లా సంబంధిత అనుమతులు వస్తాయని భావిస్తున్నామని, వచ్చే నెల చివరికల్లా ఈ డీల్ పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐడియా, వొడాఫోన్ల నుంచి కొనుగోలు చేసే 20,000 టవర్ల కారణంగా ఏటీసీకి తొలి పూర్తి ఏడాదికి రూ.2,100 కోట్ల ప్రోపర్టీ ఆదాయం, రూ.800 కోట్ల స్థూల మార్జిన్ వస్తాయని అంచనా. వొడాఫోన్, ఐడియాకు చెందిన మొత్తం 20,000 టవర్లను రూ.7,850 కోట్లకు కొనుగోలు చేయడానికి గతేడాది నవంబర్‌లో ఏటీసీ డీల్ కుదుర్చుకుంది. ఐడియా–ఏటీసీ టవర్ల డీల్ పూర్తయిన తర్వాతనే ఐడియా, ఓడాఫోన్ విలీనం పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐడియాతో విలీనం ఈఏడాది జూన్‌కల్లా పూర్తవ్వగలదని వొడాఫోన్ పేర్కొంది. -
బరువు భారాన్ని తగ్గించింది... ఐడియా
దండేపల్లి(మంచిర్యాల) : ఒక్క ఐడియా అతని బరువు భారాన్ని తగ్గించింది. సాధారణంగా తడుకల్ని అమ్మేవారు నెత్తిన ఎత్తుకుని తిరుగుతుంటారు. కానీ ఓ వృద్దుడు తన నెత్తి భారాన్ని తగ్గించేందుకు ఓ ఆలోచన చేశాడు. తడకల్ని నెత్తిన మోస్తూ ఇబ్బంది పడకుండా సైకిల్‌కు ఒక కర్రను అమర్చాడు. కర్రకు తడకల్ని సపోర్ట్‌గా పెట్టి వెనకా ముందు తాళ్లతో కట్టి మద్యలో నిలబడి సైకిల్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతడు నెత్తితో మోయాల్సిన బరువును సైకిల్‌తో మోస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని దండేపల్లి సమీపంలో సాక్షి క్లిక్‌మనిపించింది. -
దానిలో జియోనే అగ్రగామి
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరింత ముందుకు దూసుకెళ్తోంది. కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకోవడంలో జియో అగ్రగామిగా ఉందని ట్రాయ్ డేటాలో వెల్లడైంది. నేడు విడుదల చేసిన ట్రాయ్ డేటాలో జనవరి నెలలో భారత్ టెలికాం సబ్‌స్క్రైబర్ బేస్ మొత్తంగా 15.66 మిలయన్లు తగ్గి 1,175.01 మిలియన్లుగా నమోదైనట్టు తెలిసింది. మొత్తంగా వైర్లెస్ సబ్స్క్రైబర్లు కూడా 15.5 మిలియన్లు తగ్గి 1,151.94 మిలియన్లుగా నమోదయ్యారు. ఆశ్చర్యకరంగా ఈ నెలలో జియో 8.3 మిలియన్ల మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకున్నట్టు వెల్లడైంది. ఈ సంఖ్య తన ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ల చేర్చుకున్న సబ్స్క్రైబర్ల సంఖ్య కంటే రెండింతలు ఎక్కువని తెలిసింది. 2017 డిసెంబర్ నెలలో 1,190.67 మిలియన్లుగా ఉన్న టెలికాం సబ్స్క్రైబర్ల సంఖ్య, 2018 జనవరి నాటికి 1,175.01 మిలియన్లకు తగ్గినట్టు ట్రాయ్ నేడు తెలిపింది. దిగ్గజ టెలికాం ఆపరేటర్లు మొత్తంగా 1.26 కోట్లకు పైగా కస్టమర్లను యాడ్ చేసుకున్నట్టు పేర్కొంది. దీనిలో జియో 8.3 మిలియన్ కొత్త సబ్స్క్రైబర్లతో టాప్‌లో ఉందన్నారు. దీంతో మొత్తంగా జియో సబ్స్క్రైబర్లు 168.3 మిలియన్లకు చేరుకున్నట్టు చెప్పింది. అయితే మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ పరంగా చూసుకుంటే 291.6 మిలియన్లతో ఎయిర్టెల్ కంపెనీనే టాప్‌లో ఉంది. కానీ కంపెనీ కేవలం 1.5 మిలియన్ మంది కొత్త సబ్స్క్రైబర్లను మాత్రమే ఈ కంపెనీ చేర్చుకుంది. అదేవిధంగా ఐడియా 1.1 మిలియన్ల మంది కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకుంది. వొడాఫోన్ 1.28 మిలియన్ల మందిని, బీఎస్ఎన్ఎల్ 0.39 మిలియన్ల మందిని యాడ్ చేసుకున్నాయి. ఆర్‌కామ్ తన టెలికాం సర్వీసులను డిసెంబర్లో మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో 21 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్‌సెల్ కూడా 3.4 మిలియన్ల మందిని, టాటా టెలి 1.9 మిలియన్ల మందిని, టెలినార్ 1.6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను వదులుకుంది. -
ఐడియా యూజర్లకు రోజుకి 5జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు, రిలయన్స్ జియోకు ఐడియా సెల్యులార్ గట్టి కౌంటర్ ఇచ్చింది. 998 రూపాయలతో సరికొత్త ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్ కింద రోజుకు 5జీబీ 4జీ/2జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 35 రోజుల పాటు అందిస్తోంది. ఇది ఐడియా మ్యాజిక్ ఆఫర్‌తో వచ్చింది. అంటే ఐడియా యాప్, వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకునే తన ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లకు రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాక్‌పై ఒక వారంలో 100 యూనిక్ నెంబర్లకు మాత్రమే కాల్ చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాక వారానికి 1000 నిమిషాలు, రోజుకు 250 నిమిషాలను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్యాక్ తొలుత ఒడిశా సర్కిల్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఐడియా మ్యాజిక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లేకుండా ఇదే రకమైన ప్రయోజనాలను కర్నాటక సర్కిల్ వారికి కూడా 28 రోజుల పాటు ఐడియా ఆఫర్ చేస్తోంది. అయితే ఐడియా రూ.998 ప్యాక్ మాదిరిగా కాకుండా... జియో తన సబ్స్క్రైబర్లకు రోజుకు 5జీబీ 4జీ డేటాను, అపరిమిత కాల్స్‌ను రూ.799కే 28 రోజుల పాటు అందిస్తోంది. ఎయిర్టెల్ కూడా రూ.799 ప్లాన్‌పై రోజుకు 3.5జీబీ 4జీ డేటాను తన వినియోగదారులు కూడా వాడుకునేలా వీలు కల్పించింది. రూ.998 ప్యాక్‌తో పాటు ఎంపిక చేసిన సర్కిల్స్ వారికి ఐడియా రోజుకు 7జీబీ డేటా అందించే రూ.1,298 ప్యాక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టెలికాంటాక్ రిపోర్టు చేసింది. ఈ ప్యాక్‌ను కూడా 35 రోజుల పాటు అందుబాటులో ఉంచుతుందని తెలిపింది. రూ.1,298 ప్యాక్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఐడియా ఆఫర్ చేస్తోంది. అంతేకాక రూ.3,300 రూపాయల విలువైన ప్రయోజనాలతో ఐడియా మ్యాజిక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. -
వొడాఫోన్, ఐడియాలకు లాభం
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వల్ల అన్నింటికంటే ఐడియా– వొడాఫోన్ విలీన కంపెనీకే అధిక ప్రయోజనం అందిస్తుందని డాయిష్ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. వేలంలో స్పెక్ట్రమ్‌ను పొందిన టెలికం కంపెనీలు చెల్లింపులకు మరింత గడువునివ్వడం, స్పెక్ట్రమ్ పరిమితులను సడలించడం, తదితర అనుకూల నిర్ణయాలతో కూడిన రిలీఫ్ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలపిన విషయం తెలిసిందే. స్పెక్ట్రమ్ చెల్లింపుల కాలాన్ని ప్రస్తుతమున్న పదేళ్ల కాలం నుంచి పదహారేళ్లకు పొడిగించడం వల్ల వొడాఫోన్–ఐడియా విలీన కంపెనీకి బాగా ప్రయోజనం కలుగుతుందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఈ విలీన కంపెనీకి స్పెక్ట్రమ్ వార్షిక ఇన్స్టాల్మెంట్ 30 శాతం మేర తగ్గుతుందని తెలిపింది. అంతేకాకుండా స్పెక్ట్రమ్ పరిమితులను పెంచడం కూడా ఈ విలీన కంపెనీకి ప్రయోజనకరమని పేర్కొంది. మరోవైపు స్పెక్ట్రమ్ చెల్లింపులకు మరింత గడువునివ్వడం వల్ల టెలికం కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లోస్‌కు ఒకింత ఊరటనిస్తుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. స్పెక్ట్రమ్ పరిమితిని పెంచడంవల్ల విలీనాలకు ఊతం లభిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ వివరించింది. -
మరో పేమెంట్స్ బ్యాంకు వచ్చేసింది
సాక్షి,ముంబై: దేశీయంగా మరో పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆదిత్య బిర్లా సొంతమైన ఐడియా సెల్యూలర్ కు చెందిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు షురూ అయ్యాయి. గురువారం నుంచి దేశవ్యాప్తంగా తమ చెలింపుల బ్యాంకు ఆపరేషన్స్ మొదలయ్యాయయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ సేవలను అందిస్తున్న ఇతర కంపెనీలు ఎయిర్టెల్, పేటీఎం, ఇండియా పోస్ట్ సరసన చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 1949 లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22 (1) ప్రకారం తమకు లైసెన్స్ జారీ అయిందని ప్రకటించింది. సుధాకర్ రామసుబ్రమణియన్ దీనికి సీఈవోగా వ్యవహరించనున్నారు. అయితే ఈ బ్యాంకు అందించే వడ్డీ రేటు,ఇ తర సేవల గురించి సమాచారం ఇంకా వెల్లడికాలేదు. కాగా చెల్లింపుల బ్యాంకు లైసెన్స్ కోసం .ఆదిత్య బిర్లా నువో భాగస్వామ్యంతో కంపెనీ 2015 లో దరఖాస్తు చేసుకుంది పేమెంట్ బ్యాంకు సేవల అనుమతికి దరఖాస్తు చేసుకున్న11 మందితో ఐడియా కూడా ఒకటి. ఇప్పటికే ఎయిర్టెల్, పేటీఎం పేమెంట్‌బ్యాంకు సేవల్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు త్వరలో రిలయన్స్ జీయో తన చెల్లింపులు బ్యాంకును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. -
ఐడియా రూ.2వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్
సాక్షి, ముంబై: టెలికా ఆపరేటర్ ఐడియా గురువారం కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రటకించింది. ఇప్పటివరకూ డేటా వార్తో కస్టమర్లను ఆకట్టుకున్న టెలికాం సంస్థలు ఇపుడిక క్యాష్‌బ్యాక్‌లపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా జియో, ఎయిర్టెల్ తరహాలో ఐడియా కూడా 4 జీ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందించనుంది. ఫిబ్రవరి 23 శుక్రవారం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఐడియా ప్రకటించింది. 4జీ హ్యాండ్సెట్స్ ద్వారా 4జీ నెట్వర్క్కి కస్టమర్ అప్ గ్రేడ్ చేయడమే తమ లక్ష్యమని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ప్రకటించిన ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ యూజర్లకి వర్తిస్తంఉది. అయితే ప్ రీపెయిడ్ యూజర్లు ప్రతినెలా రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో రోజుకు 1.4 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ లోకల్ ఎస్టీడీ) పాటు, రోజుకి వంద ఎస్ఎంస్లు ఉచితం. ఈ 199 రూపాయల రీచార్జ్ మొదటి 18 నెలల కాలంలో మూడువేల రూపాయల విలువైన రీఛార్జ్‌లు చేసుకుంటే మొదటి దఫాగా రూ. 750 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మరో 18 నెలల రీచార్జ్ అనంతరం మరో 1,250 రూపాయల క్యాష్ బ్యాక్ కస్టమర్లకు అందిస్తుంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు, అన్ని నిర్వాణ వాయిస్ కాంబో పధకాలకు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. 36 నెలల వ్యవధిలో రూ. 389 రీచార్జ్ ప్లాన్‌తో మొదలయ్యే ప్లాన్లపై ఆఫర్ ఏప్రిల్ 30, 2018 వరకు అందుబాటులో ఉంటుంది. -
ఐడియా నిధుల సమీకరణ!
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ రూ.3,500 కోట్లు సమీకరించనున్నది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) విధానంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ పెట్టుబడులు సమీకరిస్తామని ఐడియా సెల్యులర్ తెలిపింది. ఈ నిధుల సమీకరణకు తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ తుది ఆమోదం తెలిపిందని పేర్కొంది. కంపెనీ ప్రమోటర్ ఆదిత్య బిర్లా గ్రూప్(ఏబీజీ)కు చెందిన సంస్థలకు షేర్ల కేటాయింపు ద్వారా ఇటీవలనే ఈ కంపెనీ రూ.3,250 కోట్లు సమీకరించింది. ఐపీ ద్వారా రూ.3,500 కోట్లు, ఏబీజీ ద్వారా రూ.3,250 కోట్లు.. మొత్తం రూ.6,750 కోట్ల నిధుల కారణంగా ఐడియా నికర రుణ భారం తగ్గుతుంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఐడియా నికర రుణ భారం రూ.55,782 కోట్లుగా ఉంది. కాగా వొడాఫోన్ కంపెనీ ఐడియాలో విలీనమవుతున్న విషయం తెలిసిందే. -
ఆ ఫోన్లపై ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజాలు భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ తరహాలో మరో దిగ్గజం ఐడియా సెల్యులర్ కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై ఈ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్‌లాంటి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ తాజా ఆఫర్లను లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ద్వారా సరసమైన ధరలో మంచి నాణ్యమైన 4జీ ఫోన్లను కస్టమర్లకు అందించాలనేది తమ ఉద్దేశమని ఐడియా ఎండీ శశి శంకర్ ప్రకటించారు. ఇండియాలో 4జీ నెట్వర్క్ విస్తరిస్తుందని భావిస్తున్నామన్నారు. ఇందుకు కార్బన్‌తో భాగస్వామ్యం సంతోషంగా ఉందన్నారు. కార్బన్ స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై అందిస్తున్న ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 1 నుంచి అమలుకానుంది. ముఖ్యంగా కార్బన్ యువ 2 4జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేల దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్. స్మార్ట్ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ కార్బన్ ఎ 41 పవర్, ఎ9 ఇండియన్ (ధర రూ. 2,999, ఎ 9 ధర రూ. 3,699) ఈ రెండిటింపై రూ. 1,500 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే దీనికి ఐడియా మనీ వాలెట్ ద్వారా 169 రూపాయల ప్యాక్, (అన్లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం వాలిడిటీ 28రోజులు)18 నెలలపాటు రీచార్జ్ చేసుక్ను అనంతరం తొలివిడతగా రూ. 500 , 36నెలల రీచార్జ్ పూర్తయిన తరువాత మిగిలిన వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఫీచర్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ కార్బన్ కె310ఎన్, కె24ప్లస్, కె9 జంబో ఫీచర్ ఫోన్లను రూ.999, రూ.1,199 రూ. 1,399 ధరకే అందిస్తుంది. అంటే రూ 1,000 క్యాష్ బ్యాక్ తరువాత . ఐడియా వినియోగదారులకు కె310 ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు లెక్క ( 36 నెలల రీచార్జ్‌ల తరువాత). గమనించాల్సిన అంశం ఏమిటంటే..టాక్ టైం రూపంలో ఈ క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. -
ఐడియా నష్టాలు రూ.1,284 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐడియా సెల్యులర్కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.384 కోట్ల నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.1,284 కోట్ల నష్టాలు వచ్చాయని ఐడియా తెలిపింది. కాల్ కనెక్షన్ చార్జీలు భారీగా తగ్గడం, టారిఫ్‌ల ఒత్తిడి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించింది. ఆదాయం రూ.8,668 కోట్ల నుంచి 25 శాతం తగ్గి రూ.6,510 కోట్లకు చేరిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.1,501 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో రూ.1,223 కోట్లకు తగ్గిందని వివరించింది. ఇంటర్ కనెక్షన్యూసేజీ (ఐయూసీ) చార్జీలను ప్రభుత్వం 57 శాతం తగ్గించడం వల్ల ఆదాయం రూ.820 కోట్లు, ఇబిటా రూ.230 కోట్ల చొప్పున తగ్గాయని ఐడియా పేర్కొంది. ఐయూసీ చార్జీల కోత గత ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిందని, అందుకని ఈ క్యూ3, గత క్యూ3 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. వొడాఫోన్ విలీనం తుది దశకు చేరిందని, ఈ ఏడాది జూన్‌కల్లా విలీనం పూర్తవుతుందని తెలిపింది. నిరుత్సాహకరమైన ఫలితాల ప్రభావంతో ఐడియా షేర్ 5.3 శాతం నష్టంతో రూ.94 వద్ద ముగిసింది. -
ఐడియాకు క్యూ3లోనూ తప్పని నష్టాలు
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం ఆపరేటర్, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ ఐడియా సెల్యులర్ మళ్లీ ఫలితాల్లో నిరాశపర్చింది. ఆర్థిక సంవత్సరం క్యూ3లో నష్టాలను నమోదు చేసింది. మంగళవారం విడుదల చేసిన కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,284 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 6510 కోట్లను తాకింది. క్యూ2లో రూ. 7466 కోట్ల ఆదాయం సాధించింది. ఆపరేటింగ్ మార్జిన్ 18.8శాతంగా ఉంది.గత ఏడాది ఇది 20శాతంగాఉంది. అయితే వినియోగరుదాల మార్కెట్లో వృద్ధిని సాధించింది. డిసెంబర్ నాటికి 20.3 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 2017 డిసెంబర్ నాటికి నికర రుణాలు రూ. 55,780 కోట్లకు చేరినట్లు ఐడియా సెల్యులర్ ఫలితాల విడుదల సందర్భంగా వివరించింది. మరోవైపు యూకే దిగ్గజం వొడాఫోన్తో విలీన ప్రక్రియ తుది దశకు చేరిందని, 2018 మొదటి త్రైమాసిం నాటికి ఈ విలీనం పూర్తికావచ్చని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ఆరంభంనుంచి నష్టాల్లో ఉన్న ఐడియా కౌంటర్ మరింత బలహీనపడి దాదాపు 5శాతం పతనాన్ని నమోదు చేసింది. -
టెలికాం షేర్లకు జియో దెబ్బ
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొత్త గరిష్టాల హోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా నిఫ్టీ 11,100స్థాయిని కూడా దాటేసింది. ఆరంభంలో కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లు లాభాలతో పుంజుకున్నాయి. ఈ క్రమంలో నిష్టీ ఈ గరిష్టాన్ని తాకింది. అయితే తీవ్ర ఊగిసలాటలమధ్య మార్కెట్లు మళ్లీ ఫ్లాట్‌గా మారాయి. మరోవైపు గురువారం డెరివేటివ్ కౌంటర్‌కు చివరి రోజు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతగా వ్యవహరిస్తున్నట్టు ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మెటల్, ఆటో, నష్టపోతుండగా, బ్యాంక్స్ ,ఐటీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు కొత్త గరిష్టాన్ని తాకింది. కానీ ప్రాఫింట్‌బుకింగ్ కారణంగా నష్టాల్లోకి మళ్లింది. టీసీఎస్ షేరు కూడా ఆల్ టైం ని తాకింది. మరోవైపు రిలయన్స్ జియో ప్రకటించిన రిపబ్లిక్ డే ఆఫర్లదెబ్బతో టెలికాం దిగ్గజాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. భారతి ఎయిర్టెల్ 4 శాతం క్షీణించి, ఐడియా 5 శాతం పతనమై టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. వీటితోపాటు ఆర్‌కాం కూడా 2శాతం నష్టాలతో కొనసాగుతోంది. -
ఐడియా మ్యాజిక్ : రూ.3,300 క్యాష్‌బ్యాక్
కొత్త కొత్త ప్లాన్లతో ఇన్ని రోజులు తీవ్ర ధరల యుద్ధానికి తెరలేపిన టెలికాం కంపెనీలు, ప్రస్తుతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. రిలయన్స్ జియోకి కౌంటర్ ఐడియా సెల్యులార్ 'మ్యాజిక్ క్యాష్‌బ్యాక్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 3,300 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, పలు ఆన్లైన్ ఛానళ్లను వాడుతూ 398 రూపాయలు, ఆపై మొత్తాలతో కూడిన అపరిమిత ప్లాన్లను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని ఐడియా పేర్కొంది. క్యాష్‌బ్యాక్ కింద 50 రూపాయలతో కూడిన ఎనిమిది డిస్కౌంట్ ఓచర్లను అందించనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ ఓచర్లను కస్టమర్లు తర్వాత రీఛార్జ్ చేయించుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాలపై ఏడాదిపాటు రిడీమ్ చేసుకోవచ్చు. అంతేకాక 2,700 రూపాయల విలువైన ఐదు షాపింగ్ కూపన్లను కూడా అందించనున్నట్టు తెలిపింది. వీటిని తమ పార్టనర్ స్లోర్లు లేదా వెబ్సైట్లలో వినియోగించుకోవచ్చని కుమార్‌మంగళం బిర్లా చెప్పారు. మై ఐడియా యాప్ లేదా కంపెనీ వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేయించుకున్న కస్టమర్లకు, 200 రూపాయల వరకు వాలెట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. 398 రూపాయల ప్లాన్ కింద ఐడియా అపరిమిత వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్)ను, రోజుకు 1జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను 70 రోజుల పాటు అందించనుంది. ఈ మ్యాజిక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ 2018 ఫిబ్రవరి 10 వరకు అందుబాటులో ఉండనుంది. -
అటెన్షన్ ఐడియా యూజర్స్..
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో వొడాఫోన్ -ఐడియా మెగా విలీనానికి మరో కీలక ముందడుగు పడింది. తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపిందని ఐడియా సెల్యులార్ శుక్రవారం తెలిపింది. ఇక ఫైనల్‌గా రెండు కంపెనీలకు టెలికామ్ విభాగం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. దీంతో ఈ డీల్ అమల్లోకి వస్తుంది. టెలికాం రంగలోకి దూసుకొచ్చిన రిలయన్స్జియో పోటీని తట్టుకునే వ్యూహంలో భాగంగా ఈ మెగాడీల్‌కు పునాది పడింది. గత ఏడాది మార్చిలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూపునకు చెందిన భారతీయ విభాగం..ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్తో విలీనం కాబోతున్నట్టు వెల్లడించాయి. 23 బిలియన్ డాలర్ల విలువైన, 35 శాతం మార్కెట్ వాటాతో ఈ అతిపెద్ద విలీనానికి ఇరు సంస్థలు అంగీకరించాయి. అటు అక్టోబర్‌లో ఐడియా వాటాదారులు వొడాఫోన్తో విలీనానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీ సెబీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ (డాట్) ఇచ్చే తుది ఆమెదంతో ఏడాది జూన్ నాటికి ఈ పక్రియ పూర్తి చేయాలని రెండు కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ ఉమ్మడి సంస్థలో బ్రిటిష్ కంపెనీ 45.1 శాతం వాటా, ఐడియా పేరెంట్ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూపు 26 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 28.9 శాతం ఇతర వాటాదారుల సొంతం. ప్రస్తుతం భారతదేశంలో నంబర్ 2 , 3 స్థానాల్లో కొనసాగుతున్న వొడాఫోన్ ఇండియా, ఐడియాల జాయింట్ వెంచర్ సంస్థ ఆవిష్కారంతో ప్రపంచ రెండవ అతిపెద్ద టెలికాం భారతి ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీగా నిలుస్తుందని అంచనా. -
టెల్కోలకు షాకిచ్చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ : టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అనుకున్నంత పని చేసేసింది. టెల్కోలకు షాకిస్తూ ఇంటర్నేషనల్ టర్మినేషనల్ రేటును సగం తగ్గించేసింది. కాల్స్ స్వీకరించేందుకు గాను, లోకల్ నెట్‌వర్క్‌లకు ఇంటర్నేషనల్ ఆపరేటర్ చెల్లించే టర్మినేషన్ రేటును నిమిషానికి 30 పైసలకు తగ్గిస్తున్నట్టు ట్రాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ రేటు 53 పైసలుగా ఉండేది. ఇంటర్నేషనల్ టర్మినేషనల్ రేటును తగ్గిస్తున్నట్టు రెగ్యులేటరీ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని టాప్ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లకు భారీగా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తూ ఉంటాయి. వీటిపై విధించే ఛార్జీలతో కంపెనీలు బాగానే రెవెన్యూలను పొందుతున్నాయి. ప్రస్తుతమున్న ఛార్జీలే చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ ఛార్జీలను ఒక్క రూపాయికి, అనంతరం రూ.3.50 కు పెంచాలని ఈ కంపెనీలు అంతకముందు కోరాయి. కానీ వీటికి షాకిస్తూ ఈ ఛార్జీలను సగం తగ్గించేసింది. ట్రాయ్ ఈ నిర్ణయంతో కంపెనీలు భారీగా తమ రెవెన్యూలను కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే దేశీయంగా మొబైల్ టర్మినేషన్ రేటును తగ్గించడంతో, టెల్కోల ఆదాయానికి భారీగా గండికొడుతోంది. టర్మినేషనల్ ఛార్జీలను తగ్గించడంతో, దేశీయంగా కాల్ టారిఫ్‌లలో మధ్యవర్తిత్వాన్ని తగ్గించవచ్చని ట్రాయ్ చెబుతోంది. దీంతో అక్రమ వీఓఐపీ(వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) గేట్‌వే బిజినెస్‌లకు చెక్ పెట్టొచ్చని పేర్కొంటోంది. ఇలా ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ ట్రాఫిక్‌లో గ్రే మార్కెట్‌ను నిర్మూలించవచ్చని తెలిపింది. గ్రే మార్కెట్ ద్వారా దేశ భద్రతకు భారీగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అంతేకాక రెవెన్యూలు లీకవుతాయని ట్రాయ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఇన్కమింగ్కాల్ టర్మినేషనల్ ఛార్జీలను నిమిషానికి 0.53 పైసల నుంచి 0.30 పైసలకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఈ ఛార్జీల తగ్గింపుతో టెలికాం కంపెనీలు తమ రెవెన్యూల నుంచి 5వేల కోట్ల రూపాయల వరకు కోల్పోయే అవకాశముందని తెలిసింది. -
ఐడియాలోకి మరో రూ.3,250 కోట్లు!
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ ప్రమోటర్ గ్రూప్ సంస్థ, ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి భారీగా నిధులు సమీకరించనున్నది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకు 32.66 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించి రూ.3,250 కోట్లు సమీకరిస్తున్నట్లు ఐడియా సెల్యులర్ తెలిపింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.99.50 ధరకు కేటాయించాలని తమ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని ఐడియా సెల్యులర్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన బిర్లా టీఎమ్‌టీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలైనె ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), ఒరియానా ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), సూర్య కిరణ్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్)లకు ఈ షేర్లు కేటాయిస్తామన్నారు. ఈ షేర్ల కేటాయింపు వచ్చే నెల ప్రారంభంలోనే పూర్తవుతుందని, దీనివల్ల ఐడియాలో ప్రమోటర్‌గ్రూప్ వాటా ప్రస్తుత 42.4 శాతం నుంచి 47.2 శాతానికి పెరుగుతుందని బిర్లా పేర్కొన్నారు. అదనంగా మరో రూ3,5000 కోట్లు సమీకరణ అదనంగా మరో రూ.3,500 కోట్ల నిధుల సమీకరణ కోసం అన్వేషించాల్సిన మార్గాల నిమిత్తం ఒక ప్యానెల్‌ను నియమించామని కుమార మంగళం తెలిపారు. ఇండస్ టవర్స్‌లో కంపెనీకున్న 11.15% వాటాను కూడా విక్రయించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారాయన. ఈ ఏడాది వోల్ట్ (వాయిస్ ఓవర్ 4జీ) సేవల నూ అందించాలని యోచిస్తున్నామని వివరించారు. -
వొడాఫోన్-ఐడియా డీల్: భారీ నిధుల సేకరణ
సాక్షి,ముంబై: భారత్‌లో మూడవ అతిపెద్ద మొబైల్ సేవల ఆపరేటర్ ఐడియా సెల్యులర్ లిమిటెడ్ గురువారం భారీ నిధుల సేకరణ ప్రణాళను విడుదల చేసింది. వొడాఫోన్ విలీనానికి ముందు ఈ ఫండ్ రైజింగ్ ప్లాన్‌ను రివీల్ చేసింది. రూ.6750 కోట్ల నిధుల సేకరణ ప్రణాళికను గురువాం వెల్లడించింది. ముఖ్యంగా షేర్ల విక్రయం ద్వారా 35 బిలియన్ రూపాయలు సేకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా ఐడియా 326.6 మిలియన్ల షేర్ల అమ్మకం ద్వారా 32.5 బిలియన్ల రూపాయలను సమకూర్చుకోనుంది. ప్రిఫరెన్షియల్ బేసిస్ కింద షేరుకు రూ.99.5చొప్పున మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ కు విక్రయించనుంది. దీంతో ఆదిత్యా బిర్లా వాటా 42.4 శాతంనుంచి 47.2 శాతానికి పెరగనుంది. గత ఏడాది మార్చిలో వోడాఫోన్ తో ఈ విలీనాన్ని ప్రకటించింది. అతిపెద్ద భారత ఫోన్ క్యారియర్ సృష్టించేందుకు చేసుకున్న ఈ ఒప్పందం ఈ ఏడాది చివరకు ముగియనుంది. ఈ వార్తలతో ఇవాల్టి ట్రేడింగ్‌లో ఐడియా షేరు 3శాతం లాభపడింది. -
వాటికి పోటీగా ఐడియా కొత్త ప్లాన్
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తరువాత మరో టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను. ప్రకటించింది. ఎయిర్టెల్, జియో రీచార్జ్ ప్లాన్ తరహాలోనే ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను వెల్లడించింది.రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ 3జీ డేటా అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులు. ఐడియా వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే రోజుకు 250 నిమిషాలు , వారానికి వెయ్యి నిమిషాల టాక్ టైం వరకే ఈ ఉచిత ఆఫర్ పరిమితం. ఈ పరిమితి దాటిన తరువాత సెకనుకు 1 పైసా వసూలు చేస్తుంది. అయితే ఉచిత ఎస్ఎంఎస్లు, రోమింగ్స్ కాల్స్ లాంటి ప్రయోజనాలు లేవీ లేవు. అలాగేరూ. 93 ప్రీ పెయిడ్ ప్లాన్ ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా ఎయిర్టెల్ రూ.93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా 10 రోజుల పాటు 3జీ / 4జీ డేటా 1జీబీ అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. జియో కూడా రూ.98ల ప్రీపెయిడ్ రీఛార్జి ప్రణాళికలో 14 రోజుల వ్యవధిలో 2.1జీబీ 4జీ డేటాను 140 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా అందిస్తుంది. -
జియో ఎఫెక్ట్ : ఐడియా కొత్త కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో ఐడియా తన పోస్టు పెయిడ్ యూజర్లకూ కొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. నిర్వానా పోస్టు పోస్టు పెయిడ్ ప్లాన్స్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఈ పోస్టు పెయిడ్ ప్లాన్స్ రిలయన్స్ జియోతో పాటు, ఎయిర్టెల్, వొడాఫోన్లకు కౌంటర్‌గా నిలువనున్నాయి. నిర్వానా ప్లాన్స్ రూ.389 నుంచి ప్రారంభమై.. రూ.2,999 వరకు ఉన్నాయి. ఎనిమిది ఆఫర్లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ కింద అపరమిత కాలింగ్, ఉచిత రోమింగ్ సౌకర్యం, అపరమిత మెసేజింగ్ వంటి అందిస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్లలో అందిస్తున్న డేటా రోల్ ఓవర్ ఆఫర్ తరహాలోనే ఐడియా కూడా నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడే కస్టమర్లకు డేటా క్యారీ ఫార్వార్డ్ ఆఫర్‌ను వీటిలో ప్రవేశపెట్టింది. దీని వల్ల ఒక నెలలో యూజర్ తనకు లభించిన మొబైల్ డేటా వాడకపోతే అది మరుసటి నెలలో వచ్చే డేటా లిమిట్లో యాడ్ అవుతుంది. కొత్త ప్లాన్ల వివరాలు.. రూ.389 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్, 10 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, మూవీలు, గేమ్స్, మ్యూజిక్కు 12 నెలల వరకు ఉచిత సబ్స్క్రిప్షన్ రూ.499 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రోమింగ్ కాల్స్, 20 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.649 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్, నెలంతా 35 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్, నెలంతా 60 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.1,299 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 100 ఇంటర్నేషనల్ కాలింగ్ నిమిషాలు, నెలంతా 85 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.1,699 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రోమింగ్ కాల్స్, 110జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.1,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 135జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.2,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 220జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ -
అతడు ఆంధ్రావాడై ఉండాలి!
హీరోయిన్లు కూడా మామూలు మనుషులే. అందరిలానే వారికీ కోరికలు, కలలు ఉంటాయి. అవి నెరవేరాలని కోరుకుంటారు. అలాంటి ఆశలు తనకూ ఉన్నాయంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. కోలీవుడ్‌లో స్ట్రాంగ్‌గా పాగా వేయాలన్న కోరిక మొదట్లో నెరవేరకపోయినా టాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ టాప్ హీరోలతో జత కట్టి సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చున్నది. తాజాగా ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంతో కోలీవుడ్‌లో విజయ దాహాన్ని కొంచెం తీర్చుకుంది. ఇంకా ఇక్కడ పలు చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్న ఈ అమ్మడు తాజాగా విజయ్ 62వ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యతోనూ నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే టాలీవుడ్లో మాత్రం అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. ఈ బ్యూటీ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన మనసులోని భావాలను విలేకరులకు వ్యక్తపరిచింది. సాధారణంగా హీరోయిన్ కనపబడితే ముందో, చివర్లోనో విలేకరులు అడిగే కామన్ ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎలాంటి భర్త ఉండాలని కోరుకుంటున్నారు? ఎవరినైనా ప్రేమించారా? వంటివే. అందుకు ఎవరికి తోచినవి వారు చెబుతుంటారు. అదే ప్రశ్నను రకుల్‌ప్రీత్‌సింగ్‌ను అడిగతే తనేమన్నదో చూద్దాం. పెళ్లి జీవితంలో ముఖ్యమైన అంశం. ఆ సమయం ఆసన్నమైనప్పుడు నేనూ పెళ్లికి సిద్ధం అవుతాను. అయితే ఒక్క కండిషన్.. నాకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారని అడుగుతున్నారు. అతడెవరనే విషయాన్ని పక్కనపెడితే ముఖ్యంగా తను ఆంధ్రావాడై ఉండాలి అని బదులిచ్చింది. దీంతో ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగువాడిని కోరుకుంటున్నదంటే టాలీవుడ్‌కు చెందిన ఎవరితోనే లవ్‌లో పడి ఉంటుందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. -
డైరెక్ట్ పోటీ : ఐడియా కొత్త ప్యాక్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లకు పోటీగా ఐడియా తన ప్రీపెయిడ్ కస్టమర్లకు సరికొత్త ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ 3జీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్(హోమ్, నేషనల్ రోమింగ్), రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను 84 రోజుల పాటు ఆఫర్ చేయనుంది. దీని కోసం ఐడియా కస్టమర్లు రూ.509తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో రూ.459 ప్యాక్‌కు, ఎయిర్‌టెల్‌కు రూ.509 ప్యాక్‌కు ఇది డైరెక్ట్ పోటీ. రిలయన్స్ జియో తన రూ.459 ప్యాక్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను, ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. జియోకు కూడా రూ.509 ప్యాక్ ఉంది. కానీ ఈ ప్యాక్ కింద రోజుకు 2జీబీ డేటాను 49 రోజుల పాటే అందిస్తోంది. అదేవిధంగా ఎయిర్టెల్, వొడాఫోన్లు కూడా రూ.509 ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఒకే రకమైన టారిఫ్‌తో ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్లు పోటీపడనున్నాయి. ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.300, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై వచ్చే ఏడాదిలో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదేవిధంగా ఐడియా తన రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్‌ను ఇటీవల అప్‌గ్రేడ్ చేసింది. రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటా కాకుండా 1.5జీబీ 3జీ డేటాను ఆఫర్ చేస్తోంది. -
టెల్కోల 'క్యాష్'బ్యాక్..!
దేశీ టెలికం పరిశ్రమలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఉన్న కస్టమర్లను కాపాడుకోవటమే కాక... కొత్త యూజర్లను ఆకర్షించాలి కనుక పోటీ మరింత పెరిగింది. అన్నింటికీ మించి ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యతా పడింది. అందుకే టెలికం సంస్థలు ఇపుడు వరుసపెట్టి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కంపెనీల 100 శాతం క్యాష్‌బ్యాక్..!! రిలయన్స్ జియో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ప్రైమ్ యూజర్లు రూ.399, ఆపై టారిఫ్‌ల రీచార్జ్‌లపై ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఇదే దార్లో ఎయిర్టెల్ కూడా ఇలాంటి ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. రూ.349 రీచార్జ్‌పై ఇది వర్తిస్తుంది. ఐడియా సైతం రూ.357తో రీచార్జ్ చేస్తే 100 శాతం క్యాష్‌బ్యాక్ అని ప్రకటించింది. కాకపోతే ఈ ఆఫర్లు అన్నిటికీ పరిమితులుంటాయి. మొత్తం క్యాష్‌బ్యాక్ వచ్చినా... దాన్ని యూజర్లు ఒకే సారి వినియోగించుకోలేరు. వరుసగా ఓ ఏడాదో, పదిసార్లో రీచార్జ్ చేస్తే ఆ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. అంటే... అప్పటిదాకా యూజర్లను తమ సర్వీసులకు కట్టుబడేలా చూసుకోవచ్చు. అదీ కథ. ఏఆర్‌పీయూలో 40 క్షీణత టెలికం కంపెనీలకు ఏఆర్‌పీయూనే కీలక కొలమానం. ఇందులో వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ సెప్టెంబర్‌లో 40 శాతం క్షీణత నమోదైంది. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా జియో ఎంట్రీతో ధరల పోటీ మొదలైంది. దీంతో బండిల్ వాయిస్, డేటా ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!! ‘టెలికం పరిశ్రమలోని తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెల్కోలు కస్టమర్లను రక్షించుకునేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నాయి. అందుకే పలు ప్లాన్లను ఆవిష్కరిస్తున్నాయి. క్యాష్‌బ్యాక్ అనేది వాటిల్లో ఒక రకం’ అని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. కాగా టెలికం సంస్థలు ప్రస్తుతం రూ.340–రూ.380 ధరల శ్రేణిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయని కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ రీసెర్చ్ అనలిస్ట్ సత్యజిత్ సిన్హా చెప్పారు. ‘‘ఇది వరకు టెల్కోలు వేర్వేరు ధరల శ్రేణిలో వివిధ ఆఫర్లను ప్రకటించేవి. ఇవి తక్కువ ధరల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆపరేటర్లు రూ.340–రూ.380 ధరల శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నారు’’ అని ఆయన వివరించారు. దీంతో ఏఆర్పీయూ అనేది పెరిగితే పెరుగుతుంది, లేకపోతే స్థిరంగా ఉంటుంది, అంతేకానీ తగ్గదని తెలిపారు. ఏడాది కిందట టెల్కోలు రూ.250–260 ధరల శ్రేణిపై దృష్టి కేంద్రీకరించాయన్నారు. టారిఫ్‌లు పెరుగుతాయ్!! క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కొన్నాళ్లే పనిచేస్తాయని ఐఐఎఫ్ఎల్ మార్కెట్స్, కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ చెప్పారు. వీటి ద్వారా పరమిత కాలమే యూజర్లను ఆకర్షించొచ్చన్నారు. ఆఫర్లతో స్వల్పకాలంలో ఏఆర్‌పీయూలో పెరుగుదల ఉండొచ్చన్నారు. పరిశ్రమలో వచ్చే 6–9 నెలల్లో స్థిరీకరణ పూర్తవుతుందని అంచనా వేశారు. ‘‘అప్పుడు మూడు కంపెనీలే ఉంటాయి. ఆ తర్వాత నుంచి టారిఫ్‌లు క్రమంగా పెరుగుతాయి. ఎందుకంటే జియో ఎంట్రీతో ఐడియా, వొడాఫోన్ విలీనమౌతున్నాయి. భారతీ ఎయిర్టెల్.. టాటా టెలీసర్వీసెస్ వైర్లెస్ బిజినెస్‌ను సొంతం చేసుకుంటోంది. ఇది టెలినార్ ఇండియాను కొనేసింది. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన 2జీ, 3జీ వాయిస్ బిజినెస్‌ను మూసేసింది. ఎయిర్‌సెల్ తన కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది’ అని వివరించారు. -
క్యూ2లో ఐడియా ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యులర్ క్యూ2 లో భారీగా నష్టపోయింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో మరోసారి నష్టాలను నమోదు చేసి రూ.11వందలకోట్లకు పైగా భారీ నష్టాన్ని చవిచూసింది.ముఖ్యంగా రిలయన్స్ జియో ఎంట్రీతో గత క్వార్టర్లో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఐడియా సెప్టెంబరు 30 తో ముగిసిన రెండవ క్వార్టల్లో త్రైమాసికంలోపన్ను తర్వాత 169.45 మిలియన్ డార్ల నష్టపోయినట్టు ఐడియా సెల్యులార్ సోమవారం తెలిపింది. ప్రత్యర్థులనుంచి భారీ పోటీ నెలకొన్న మార్కెట్ల పరిస్థితుల మధ్య ఎనలిస్టులు అంచనాలను మించి వరుసగా నాలుగవ క్వార్టర్లలో కూడా భారీ నష్టాల్లో కూరుకు పోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మొబైల్ టెలికం సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో రూ. 1,107 కోట్ల నికర నష్టం ప్రకటించింది. తొలి క్వార్టర్లో రూ. 815 కోట్లమేర నష్టం నమోదుకాగా.. మొత్తం ఆదాయం రూ. 7465 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1502 కోట్లుకాగా.. ఇబిటా మార్జిన్లు 23 శాతం నుంచి 20.1 శాతానికి బలహీనపడ్డాయి. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 132ను తాకింది. మరోవైపు తన టవర్ బిజినెస్‌ను ఏటీసి టెలికాంకు విక్రయిస్తున్నట్లు ఐడియా వెల్లడించింది. అలాగే బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ ఇండియాతో విలీనం అంశం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ వాటా టవర్ బిజినెస్‌ను రూ. 4000 కోట్లకు విక్రయించనున్నామని, దీనికి బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. ఈ పలితాల నేపథ్యంలో ఐడియా కౌంటర్ 3 శాతానికి పైగా నష్టాల్లోకి జారుకుంది. -
చాపచుట్టేస్తున్న టెలికాం కంపెనీలు
-
సామాన్యుడి వినూత్న ఐడియాలు
-
ఐడియా, వొడాఫోన్ నుంచి 4జీ స్మార్ట్ఫోన్లు
ముంబై : రిలయన్స్ జియో ఇచ్చిన షాక్‌తో టెలికాం కంపెనీలు ఒక్కోటి 4జీ స్మార్ట్ఫోన్ల దిశగా యోచన ప్రారంభించాయి. జియో ఫీచర్‌ఫోన్‌కు కౌంటర్‌గా ఎయిర్టెల్ తన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. తాజాగా ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా తమ 4జీ ఫోన్లతో ఈ పండుగ సీజన్లో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. రూ.1,500 లేదా అంతకంటే తక్కువ ధరకు 4జీ ఫోన్లను ఆఫర్ చేయాలని ఐడియా, వొడాఫోన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వొడాఫోన్, ఐడియాలు రెండూ కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి దేశీయ హ్యాండ్ సెట్ తయారీదారులు లావా, కార్బన్లతో సంప్రదింపులు జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇవి సునిల్ మిట్టల్‌కు చెందిన ఎయిర్టెల్, అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు కౌంటర్‌గా వీటిని ప్రవేశపెట్టబోతున్నట్టు పేర్కొన్నాయి. ఎయిర్టెల్ ఈ బుధవారమే రూ.1,399కు ఎంట్రీ-లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్చేసింది. కార్బన్‌తో కలిసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ప్రస్తుతం అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించబోతున్న ఐడియా, వొడాఫోన్లు కూడా 4జీ స్మార్ట్ఫోన్ల విడుదలపై దృష్టిసారించాయి. మెగా విలీనంతో ఈ కంపెనీల యూజర్ల సంఖ్య 500 మిలియన్‌కు చేరబోతుంది. దీంతో అత్యధిక మొత్తంలో మొబైల్ యూజర్లు కలిగిన సంస్థగా ఇవి అవతరించబోతున్నాయి. మొబైల్ ఆపరేటర్లతో చర్చలు జరిపినట్టు లావా, కార్బన్లు కూడా ధృవీకరించాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. దివాలి కంటే ముందుగానే ఈ డీల్స్ చివరి దశకు వస్తాయని తెలిపాయి. మూడు టెల్కో కంపెనీలతో తాము చర్చలు జరిపామని, కానీ ఇంకా ప్లాన్లు చివరి దశకు చేరుకోలేదని లావా ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ చెప్పారు. అయితే ఏ టెల్కోలతో ఆయన చర్చలు జరిపారో వెల్లడించలేదు. వొడాఫోన్, ఐడియాలు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. -
జియోని బీట్ చేసిన ఐడియా
సాక్షి, న్యూఢిల్లీ : రెండో టెలికాం దిగ్గజంగా పేరున్న ఐడియా, టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని అధిగమించింది. అత్యధిక 4జీ అప్లోడ్ స్పీడులో సెప్టెంబర్ నెలలో మొదటి స్థానంలో ఐడియా సెల్యులార్ నిలిచింది. టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ మై స్పీడు యాప్ డేటాలో ఈ విషయం వెల్లడైంది. సగటు 4జీ అప్లోడ్ స్పీడు సెప్టెంబర్‌లో ఐడియాది 6.307 ఎంబీపీఎస్ ఉందని ట్రాయ్ డేటా తెలిపింది. ఇదే నెలలో కంపెనీ సగటు డౌన్లోడ్ స్పీడు 8.74 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు పేర్కొంది. మైస్పీడు యాప్‌ను మరింత బలోపేతం చేయనున్నామని, తమ గణాంక పద్ధతిని మరింత పారదర్శకత చేస్తామని ట్రాయ్ చెప్పింది. ట్రాయ్ సైటులో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 4జీ అప్లోడ్ స్పీడులో ఐడియా తర్వాత వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు నిలిచాయి. అయితే 4జీ డౌన్లోడ్ స్పీడులో మాత్రం జియో, వొడాఫోన్ తర్వాత ఐడియా మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను 2.60 లక్షల సైట్లకు విస్తరిస్తామని ఐడియా సెల్యులార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు వరకు గత 12 నెలల కాలంలో 50వేల బ్రాడ్‌బ్యాండు సైట్లను కంపెనీ ఏర్పాటుచేసింది. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రి మద్దతుతో స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 41.81 పాయింట్ల లాభంలో 32,444 వద్ద, నిఫ్టీ 4.85 పాయింట్ల లాభంలో 10,152 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రాయ్ మంగళవారం వెలువరించిన మొబైల్ కాల్ కనెక్షన్ ఛార్జీల తగ్గింపుతో టెలికాం స్టాక్స్ కుప్పకూలాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్ 3-6 శాతం నష్టపోతున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 14 పైసలున్న ఇంటర్ కనెక్షన్ ఛార్జీలను 6 పైసలకు తగ్గించింది. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా, మిగతా టెల్కోలకు షాక్‌గా ఉంది. దీంతో టెల్కో షేర్లు నేటి ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. అంతేకాక టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఎన్టీపీసీ, విప్రో కంపెనీలు ప్రారంభంలో ఒత్తిడికి గురయ్యాయి. రిలయన్స్ ఇంటస్ట్రీస్ 4 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది. ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ, టాటా పవర్, యస్ బ్యాంకు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.4 శాతం పైకి ఎగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలహీన పడి 64.26 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 88 రూపాయల లాభంలో 29,635 రూపాయలుగా నమోదవుతున్నాయి. -
ఐడియాకు షాక్: రూ.3కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్కు మార్కెట్ రెగ్యులేటరీ భారీ షాక్చింది. అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసినందుకుగా సుమారు మూడుకోట్ల రుపాయలు చెల్లించాలని ఆదేశించింది. రూ. 2.97 కోట్లను చెల్లించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఆదేశించింది.ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కాల్ చేసిన తన చందాదారులపై అధిక ఫీజు వసూలు చేసిందని ఆరోపిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. ట్రాయ్ సలహాదారు అబ్బాస్ సంతకం చేసిన ఆగస్టు 24, 2017 నాటి ఉత్తర్వు ప్రకారం రూ. 2,97,90,173 రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఐడియాని ఆదేశించింది. మే 2005 నుంచి 2007 మధ్య కాలంలో కస్టమర్లనుంచి ఈ చార్జీలను వసూలు చేసినట్టు తెలిపింది. అంతేకాదు ఈ సొమ్మును 15 రోజుల్లోగా చెల్లించాలని తెలిపింది. టెలికాం వినియోగదారుల విద్య మరియు భద్రతా నిధి (టీసీఈపీఎఫ్) లో డిపాజిట్ చేయవలసిందిగా ఆదేశించింది. ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన రేటెడ్ కాల్ డేటా రికార్డు అందుబాటులోలేదని ఈ సొమ్మును ఐడియా చందాదారులకు తిరిగి చెల్లించలేమని ఐడియా పేర్కొన్న కారణంగా టీసీఈపీఎఫ్‌లో జతచేయాలని కోరింది. -
మనసులో మంచి ఆలోచనలే ఉంటే...
మంచి పనులే చేస్తాం! మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. కర్మకీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. అందుకే ముందు మన మనసులోని చెడును, చెత్తను తొలగించేసుకుందాం.. అప్పుడు మనకు మంచి ఆలోచనలే తడతాయి. మంచి పనులే చేస్తాం. ఆటోమేటిగ్గా మంచే జరుగుతుంది. -
టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ల వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల గట్టును కాగ్ రట్టు చేసింది. 2010-11, 2014-15 మధ్య కాలంలో వీరు తక్కువ చేసి చూపించిన రెవెన్యూ విలువపై కాగ్ ఓ నివేదిక రూపొందించి పార్లమెంట్‌కి సమర్పించింది. ఈ రిపోర్టులో ఆరు ప్రైవేట్ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల చెల్లింపులు తగ్గిపోయాయని కాగ్ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శుక్రవారంపార్లమెంట్‌లో సమర్పించింది. కాగ్ తన ఆడిట్లో ఆరు ఆపరేటర్లు అడ్జెస్టడ్ గ్రాస్ రెవెన్యూలు మొత్తం రూ. 61,064.56 కోట్లకు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్ రిపోర్టులో ఇవి బయటపడగా.. సిస్టెమా శ్యామ్ అనే కంపెనీ 2006-07 నుంచి 2014-15 ఈ చర్యకు పాల్పడిందని తెలిసింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టుకుందని కాగ్ రిపోర్టు తేల్చింది. -
టెల్కోల తాజా ప్రతిపాదన: ఇక కాల్ రేట్లు మోత
న్యూఢిల్లీ : ప్రస్తుతం మార్కెట్లో టెలికాం కంపెనీలు ఆఫర్ చేస్తున్న కాల్ రేట్లు ఇక మోతమోగనున్నాయి. ఇప్పటివరకున్న ఇంటర్కనెక్షన్ యూసేజ్ ఛార్జీలను(ఐయూసీ) రెండింతలు పెంచాలని టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్‌లు ప్రతిపాదించాయి. మొబైల్ కాల్ రేట్లకు ఐయూసీ కీలక ఇన్పుట్. తమ నెట్‌వర్క్‌లకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్‌ను టర్మినేట్ చేయడానికి నిమిషానికి 30 పైసలు వసూలుచేయాలని నిర్ణయించాలని ఈ దిగ్గజాలు చెప్పాయి. మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ కూడా ఈ రేటును ప్రస్తుతమున్న దానికంటే రెండింతలు ఎక్కువగా 34 పైసలుగా ప్రతిపాదించింది. ఈ ప్రభావం డైరెక్ట్‌గా మొబైల్ కాల్ రేట్లపై పడనుందని తెలుస్తోంది. ఐయూసీలో ఎలాంటి మార్పు వచ్చిన తొలుత ప్రభావితమయ్యేది మొబైల్ కాల్స్ రేట్లే. ఈ ఛార్జీలతోనే టెలికాం కంపెనీలు టారిఫ్‌లను నిర్ణయిస్తాయి. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ నిర్వహించిన ఐయూసీ రివ్యూ వర్క్‌షాపులో ఈ ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించినట్టు టెలికాం ఆపరేటర్లకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ప్రతి ఇన్కమింగ్ కాల్స్‌కు ఇంటర్కనెక్షన్ ఛార్జీ కింద వీటిని వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు మొబైల్ సబ్స్క్రైబర్లు చెల్లించే ఛార్జీల్లోనే కలిసి ఉంటాయి. ఐయూసీను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ నిర్ణయిస్తోంది. ప్రస్తుతం ప్రతి ఇన్కమింగ్ కాల్‌కు నిమిషానికి 14 పైసల ఐయూసీ ఉంది. ఈ రేట్ల పెంపుతో టెలికాం ఆపరేటర్లు ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ లోడ్ వ్యయాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ట్రాయ్ నిర్వహించిన సమావేశంలో టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో కూడా పాల్గొంది. అయితే ఇన్కమింగ్ కాల్స్‌పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని జియో పోరాడుతోంది. ఎయిర్టెల్ ఒక్కో ఇన్కమింగ్ కాల్ నిర్వహించడానికి అయ్యే వ్యయాలు 30 పైసలుగా పేర్కొంది. దీంతో ఐయూసీని పెంచాలని డిమాండ్ చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐయూసీ పెంపుతో ఈ వ్యయాలను అది రికవరీ చేసుకోవాలని చూస్తోంది. వొడాఫోన్‌కు కూడా ఈ వ్యయాలు 30 పైసలవుతున్నాయి. దీనిలో లైసెన్సు ఫీజులను కలుపలేదు. లైసెన్సు ఫీజులను కలిపితే ఒక్కో ఇన్కమింగ్ కాల్‌కు 34 పైసల ఖర్చవుతుంది. ట్రాయ్ మెథడాలజీ ప్రకారం ఐడియా సెల్యులార్‌కి కూడా ఒక్కో ఇన్కమింగ్ కాల్ నిర్వహించడానికి సమారు 30 పైసలు ఖర్చవుతోంది. దాని లెక్కల ప్రకారం ఇది 35 పైసలుగా ఉంది. -
టెలికంలో నష్టాలకు ఆ టెల్కోలే కారణం
♦ భారీగా ఆర్జించినా టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయడం లేదు ♦ ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్‌పై జియో ఆరోపణ ♦ అంతర్మంత్రిత్వ శాఖకు ప్రెజెంటేషన్ న్యూఢిల్లీ: టెలికం రంగంలో నష్టాలకు భారతీ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి ప్రస్తుత ఆపరేటర్లే కారణమని వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఆరోపించింది. సదరు సంస్థలు భారీ రుణాలతో వ్యాపారాలను నిర్వహిస్తున్నాయని, సంబంధంలేని రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. అంతర్మంత్రిత్వ శాఖల గ్రూప్‌నకు రిలయన్స్ జియో ఈ మేరకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. జియో నెలల తరబడి ఉచిత వాయిస్, డేటా ఆఫర్లిస్తుండటమే టెలికం నష్టాలకు కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ఇప్పటిదాకా టెలికం రంగం నుంచి భారీగా ప్రయోజనాలు పొందాయని, ఇక ఇప్పుడు వినియోగదారులు లబ్ధి పొందుతుంటే వివాదం ఎందుకు జరుగుతోందని జియో ప్రశ్నించింది. ఆయా సంస్థలు కొత్త టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయడం మానేసి.. టెలికం రంగ నష్టాలకు బాధ్యతంతా కొత్త ఆపరేటర్దేనంటూ తమపై తోసేసే ప్రయత్నం చేస్తున్నాయని జియో ఆరోపించింది. బోలెడు ఆదాయం గడించాయి.. అనేక సంవత్సరాలుగా ప్రస్తుత ఆపరేటర్లు భారీ స్థాయిలో రాబడులు ఆర్జించినప్పటికీ.. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయలేదని జియో ఆరోపించింది. ఆయా సంస్థలు ఎక్కువగా రుణాలపైనే ఆధారపడ్డాయని పేర్కొంది. ఉదాహరణకు 2010 నుంచి చూస్తే భారత ఎయిర్టెల్ రుణ భారం రూ. 2,28,831 కోట్లుగా ఉండగా.. అది కేవలం రూ. 6,978 కోట్లు మాత్రమే వ్యాపారంలో తాజా ఈక్విటీ కింద పెట్టిందని జియో వివరించింది. ఇక ఏడేళ్ల వ్యవధిలో రూ. 32,986 కోట్ల రుణం సమీకరించిన ఐడియా రూ. 3,846 కోట్లు మాత్రమే కొత్తగా ఈక్విటీ కింద సమకూర్చిందని, అటు రిలయన్స్ కమ్యూనికేషన్ సైతం రూ. 56,319 కోట్లు సమీకరించినప్పటికీ రూ. 6,071 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేసిందని జియో పేర్కొంది. సదరు కంపెనీల ప్రమోటర్లు ‘పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని సంబంధం లేని వ్యాపారాల్లో లేదా విదేశీ కంపెనీల కొనుగోళ్లపైనా’ ఇన్వెస్ట్ చేశారే తప్ప సొంత వ్యాపారంలో కొత్త టెక్నాలజీలకు ఊతమివ్వడం కోసం.. తమ వాటాలను విక్రయించి నిధులు సమీకరించేందుకు ఇష్టపడలేదని జియో తెలిపింది. చిన్న కంపెనీలపై ప్రతికూల ప్రభావం.. స్పెక్ట్రం కొనుగోలు కోసం రుణ లభ్యత సులభతరం చేయడం కూడా ప్రస్తుత ఆర్థిక కష్టాలకు కారణమేనని, దీనివల్ల పరిస్థితులు మరింతగా దిగజారాయని జియో పేర్కొంది. 2014–16 మధ్యకాలంలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాల మూలం గా చిన్న ఆపరేటర్ల వ్యాపారం దెబ్బతిందని తెలిపింది. కొత్త ఆపరేటర్లను రానివ్వకుండా టారిఫ్‌లు తదితర విషయంలో ఈ మూడు సంస్థలూ కుమ్మక్కై వ్యవహరించినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని జియో పేర్కొంది. పోటీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ సీవోఏఐ కూడా టెలికం రంగంలో ప్రస్తుత పరిస్థితులకు కారణమేనని వ్యాఖ్యానించింది. -
ఐడియా ఆఫర్: 10జీబీ ఫ్రీ 4జీ డేటా..
టెలికాం దిగ్గజం ఐడియా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కొత్త, పాత కస్టమర్లకు 10జీబీ ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ప్యాన్-ఇండియా బేసిస్ లో 4జీ సేవలను ప్రారంభిస్తున్న క్రమంలో తన కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది. మూడు నెలల కాలంలో ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చట. ముంబై సర్కిల్ లో ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసు ప్రొవైడర్ 4జీ సర్వీసులను ప్రారంభించింది. తన 20 సర్కిళ్లలో ఈ సేవలందించడం కోసం 4జీ స్పెక్ట్రమ్ ను ఐడియా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 34ఎంబీపీఎస్ స్పీడుతో ఈ సేవలను కస్టమర్లు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ మైలురాయిని సాధించిన క్రమంలో ఐడియా 'ఇన్విటేషన్ ఆఫర్' ను తన కొత్త, పాత సబ్ స్క్రైబర్లకు పొడిగిస్తోందని కంపెనీ తెలిపింది. ఈ పొడిగింపుతో 10జీబీ ఉచిత 4జీ డేటా మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ 2017 మే 25, 2017 ఆగస్టు 22 మధ్యలో ఐడియా కొత్త 4జీ కొనుగోలు చేసిన లేదా అప్ గ్రేడ్ అయిన కస్టమర్లకే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఐడియా సబ్ స్క్రైబర్లు 4జీలోకి అప్ గ్రేడ్ అయితే అదనంగా మరో 4జీబీ 4జీ డేటాను 14 రోజుల పాటు అందించనుందని పేర్కొంది. ఈ సర్వీసులు కూడా కేవలం ముంబైలోని ఐడియా సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ముంబైలో ఈ కంపెనీకి 4.4 మిలియన్ ప్రస్తుత కస్టమర్లతో 10.2 శాతం రెవెన్యూ మార్కెట్ షేరు కలిగి ఉంది. ముంబై సర్కిల్ లో కొత్త ప్రీపెయిడ్ సబ్ స్క్రైబర్లకు రూ.395 రీఛార్జ్ తో ఇన్వెటేషన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ తో అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యం, 1జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఇవే ప్రయోజనాలను రూ.192తోనూ 28 రోజుల పాటు పొందవచ్చు. -
టెల్కోలపై ఫైన్.. పరిశీలించనున్న ప్రభుత్వం
మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియోకు అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వకుండా కుట్రలు పన్నిన మూడు టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలకు 3050 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ జరిమానాను ప్రతిపాదించింది. అయితే ట్రాయ్ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించనుందని కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే పరిశీలన చేపడతామని సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని సిన్హా తెలిపారు. టెల్కోలకు విధించిన శిక్ష సరియైనదేనని, పెద్ద ఎత్తున్న ప్రజల ప్రయోజనాలు దీనిలో భాగమై ఉన్నాయని ట్రాయ్ పేర్కొంది. దీనికి సంబంధించి టెలికాం డిపార్ట్ మెంట్ కు రెగ్యులేటరీ బుధవారం ఓ లేఖను రాసింది. లైసెన్సు సర్వీసు ఏరియాలను ఆధారంగా చేసుకుని తాము ఈ పెనాల్టీలను విధించామని ట్రాయ్, డీఓటీకి చెప్పింది. ఎయిర్ టెల్ కు 1,050 కోట్లు, వొడాఫోన్, ఐడియాలకు రూ.950 కోట్లు జరిమానాలు విధించినట్టు పేర్కొంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వకుండా టెలికాం దిగ్గజాలు కుట్రపన్నుతున్నాయని వీటికి అక్టోబర్ లోనే ఈ మేర జరిమానాను ట్రాయ్ విధించింది. అవసరమైన పోల్ ఇవ్వకపోవడం లైసెన్సు నిబంధనలు ఉల్లంఘించడమేనని టెలికాం రెగ్యులేటరీ పేర్కొంది. -
వారి వల్ల రూ. 400కోట్ల నష్టం- జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీలపై మరోసారి దాడికి దిగింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలపై తీవ్ర ఆరోపణలతో డిపార్టమెంట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గడప తొక్కింది. వీటి కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని ఆరోపిస్తూ డాట్‌కు ఫిర్యాదు చేసింది. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మార్చిలో అవసరమైన లైసెన్స్ ఫీజును జమ చేయలేదంటూ జియో టెలికాం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. గత త్రైమాసికంలో ముందస్తు లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లింపు కారణంగా ప్రభుత్వానికి రూ .400 కోట్ల నష్టం వచ్చిందని పేర్కింది. దీనిపై డాట్ సంబంధిత చర్యలు తీసుకోవాల్సిందిగా జియో కోరింది. లైసెన్సులను ఏకపక్షంగా నిర్ణయించడం, తక్కువ లైసెన్స్ ఫీజులను అనుమతించడం లాంటి చర్యలు నిబంధనల ఉల్లంఘనగా ఉందని తన లేఖలో పేర్కొంది. లైసెన్సు ఉల్లంఘన (టెలికాం సర్వీసు ప్రొవైడర్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని, ఫైనాన్షియల్ పెనాల్టీలు, లేదా లైసెన్స్ రద్దు లేదా లైసెన్స నిలిపివేయడం చేయాలని కోరింది. ఆర్థిక జరిమానాగా రూ.50 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్ చేస్తోంది. లైసెన్స్ ఫీజు చెల్లించడంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లైసెన్సు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాయంటూ ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియో పిటిషన్ దాఖలు చేసింది. 2016-17 నాటికి అంచనా వేసిన స్థూల రాబడి ఆధారంగా చెల్లించిన ఫీజు, లైసెన్స్ నిబంధనలకు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు కంటే తక్కువగా ఉందని పేర్కొంది ఫిర్యాదు ప్రకారం, ఎయిర్టెల్ జనవరి-మార్చి 2017 నాటికి రూ. 950 కోట్ల లైసెన్స్ ఫీజుగా చెల్లించింది. అక్టోబర్-డిసెంబరు 2017 వరకు ఎయిర్టెల్ చెల్లించిన 1,099.5 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే ఇది రూ. 150 కోట్ల తక్కువ. అదేవిధంగా, వోడాఫోన్ రూ. 550 కోట్లు చెల్లించింది, ఇది మూడవ త్రైమాసికంలో చెల్లించిన రూ. 746.8 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే రూ. 200 కోట్లు తక్కువ . అలాగే మూడవ త్రైమాసికంలో చెల్లించిన రూ.609 కోట్లతో పోలిస్తే ఐడియాఈ క్వార్టర్లో రూ.60కోట్లు తక్కువ చెల్లించింది. కాగా నిబంధనల ప్రకారం, టెలికం ఆపరేటర్ ఆశించిన ఆదాయాల ఆధారంగా జనవరి-మార్చి కాలానికి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, కానీ అదే ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో చెల్లించిన రుసుము కన్నా తక్కువగా ఉండకూడదు. -
జియో ఎఫెక్ట్: ఐడియా ఆశ్చర్యకర ఫలితాలు
ఉచిత ఆఫర్లతో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో దెబ్బతో టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ మార్చి క్వార్టర్లో మరోసారి చతికిలబడింది. టెలికాం మార్కెట్ లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఐడియా వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా నష్టపోయింది. అయితే మార్కెట్ వర్గాలను ఆశ్చరపరుస్తూ నష్టాలనుంచి భారీగా కోలుకుంది. నష్టం రూ.765 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేయగా బాటమ్ లైన్ లాభాలతో భారీగా పుంజుకుని రూ.328 కోట్లను నికర నష్టాలను నమోదుచేసింది. 2015-16 సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,714 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆదాయం 8126.1 కోట్ల రూపాయల వద్దే నమోదైంది. ఆదాయం రూ .8,135 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల , రుణ విమోచన (ఎబిటాలు) రూ. 2,196 కోట్లు, ఎబిటా మార్జిన్ 27 శాతంగా ప్రకటించింది. కాగా జియో మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఇండియా ఆదాయం కూడా 6.25 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. భారతి ఎయిర్‌టెల్‌తో పోల్చితే, 100శాతం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడిన భారీగా నష్టపోయింది. అయితే వోడాఫోన్‌తో విలీనం కారణంగా 2017 లో స్టాక్ 22 శాతం పెరిగడంతో ఐడియా నష్టాలనుంచి భారీగా కోలుకుంది. -
డబుల్ స్పీడులో జియో
సంచలనమైన ఆఫర్లతోనే కాకుండా.. ప్రత్యర్థుల కంటే డబుల్ స్పీడులో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. జియో సగటు డౌన్లోడ్ స్పీడు 16.48ఎంబీపీఎస్‌గా నమోదైంది. ఈ స్పీడు ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువని టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. మే నెలలో జియో సెకనుకు 16.48 మెగాబిట్ సగటు డౌన్లోడ్ స్పీడును అందించినట్టు ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. దీని తర్వాత ఐడియా 8.33ఎంబీపీఎస్ ఇచ్చిందట. టెలికాం దిగ్గజంగా పేరున్న భారతీ ఎయిర్ టెల్ స్పీడడ్ 7.66 ఎంబీపీఎస్ అని వెల్లడైంది. జియో ప్రస్తుతమందిస్తున్న ఈ 16ఎంబీపీఎస్ స్పీడులో యూజర్లు ఒక బాలీవుడ్ సినిమాను 5 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశముంటుందని తెలిసింది. అదేవిధంగా టెలికాం మార్కెట్లో ఉన్న మిగతా కంపెనీలు వొడాఫోన్ 5.66 ఎంబీపీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్ 2.64ఎంబీపీఎస్, టాటా డొకొమో 2.52ఎంబీపీఎస్,ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2.26ఎంబీపీఎస్, ఎయిర్ సెల్ 2.01 డౌన్ లోడ్ స్పీడును అందిస్తున్నట్టు ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. 'మై స్పీడ్ యాప్' ద్వారా సేకరించిన డేటా ప్రకారం 4జీ డౌన్ లోడ్ స్పీడును ట్రాయ్ గణిస్తుంది. -
డేటా వార్: బెస్ట్ ప్లాన్ ఏది?
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, టెల్కోలతో గతేడాది సెప్టెంబర్ నుంచి కొనసాగిస్తున్న హోరాహోరీ పోరును ఇప్పట్లో ముగించేటట్టు లేదు. ఉచిత సర్వీసులతో చుక్కలు చూపెడుతోంది. ఓవైపు సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ చెక్ పెట్టడంతో, ఆ ఆఫర్‌ను రీచార్జ్ చేసుకోలేకపోయిన ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లే లక్ష్యంగా ధన్ ధనా ధన్ ఆఫర్ ను ప్రకటించింది. జియో ఈ ప్లాన్ ప్రకటించిన అనంతరం టెల్కోలు సైతం తమ కస్టమర్లను కాపాడుకోవడానికి హెవీ-డేటా ఆఫర్లను తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్లాన్ ఏది? ఏ కంపెనీ ఎంత రీఛార్జ్ తో ఏ మేర డేటాను ఆఫర్ చేస్తోందో ఓ సారి తెలుసుకుందాం... ఎయిర్ టెల్ రూ.244 ప్యాక్ ఈ కొత్త 244 రూపాయల ఆఫర్ కింద, ఎయిర్ టెల్ యూజర్లు రోజుకు 1జీబీ డేటాను 70 రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే యూజర్లకు కచ్చితంగా 4జీ స్మార్ట్ ఫోన్, 4జీ సిమ్ కార్డు ఉండాల్సిందే. 1జీబీ డేటా ఎఫ్‌యూపీ మినహా డేటా వినియోగంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఆ ఆఫర్ కిందనే అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్ ను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో, మైఎయిర్ టెల్ యాప్ లో పేర్కొంది.. కానీ రోజుకు గరిష్టంగా 300 నిమిషాల ఉచిత ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ కాల్స్ మాత్రం చేసుకోవడానికి వీలుంటుంది. అదే ఇతర నెట్ వర్క్ కు అయితే వారంలో 1200 నిమిషాల ఉచిత కాల్స్ వస్తున్నాయి. ఎయిర్ టెల్ రూ.399 ప్యాక్ ఈ ప్యాక్ కింద 4జీ స్మార్ట్ ఫోన్, 4జీ సిమ్ కార్డు ఉన్న యూజర్లు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. ఏ నెట్ వర్క్ కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఆ పరిమితి 3000 నిమిషాలు మాత్రమే. అది కూడా 70 రోజులు మాత్రమే. ఉచిత నిమిషాలు అయిపోయిన తర్వాత నిమిషానికి 0.10 ఛార్జ్ ను కంపెనీ వసూలు చేస్తోంది. ఎయిర్ టెల్ నెంబర్లకు కాల్స్ చేసుకోవాలంటే రోజుకు 300 నిమిషాల పరిమితి, వారానికి 1200 నిమిషాల పరిమితిని కంపెనీ విధించింది. ఎలాంటి టెక్ట్స్ మెసేజ్ లను కంపెనీ ఆఫర్ చేయడం లేదు. ఎయిర్ టెల్ కొత్త రూ.345 ప్యాక్ ఈ ప్లాన్ 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 345 తో రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకు 2జీబీ 4జీ డేటాను కంపెనీ యూజర్లకు అందిస్తోంది. ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ కాల్స్ రోజుకు 300 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు. ఎలాంటి ఉచిత మెసేజ్ లకు అవకాశముండదు. అయితే రూ.244, రూ.399 ప్లాన్స్ అందరికీ అందుబాటులో లేవట. ఆ ప్లాన్స్ కావాలంటే ముందస్తుగా మైఎయిర్ టెల్ యాప్ లేదా ఎయిర్ టెల్ వెబ్ సైట్లోకి లాగిన్ అయి, మీరు అర్హులో కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది. వొడాఫోన్ ఇండియా రూ.352 ప్లాన్ ను వొడాఫోన్ ఇండియా అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. రోజుకు 300 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ ను, వారానికి 1200 నిమిషాల కాల్స్ ను అందిస్తోంది. అయితే ఈ కంపెనీ కూడా ఎలాంటి ఉచిత మెసేజ్ లను అందించడం లేదు. ఐడియా సెల్యులార్ ఐడియా సెల్యులార్ సైతం తన యూజర్ల కోసం రెండు రకాల ప్లాన్స్ ను అందుబాటులో ఉంచింది. ఒకటి రూ.297 ప్లాన్(70రోజులు), రెండు రూ.447 ప్లాన్(70రోజులు). ఈ రెండు ప్లాన్స్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను అందిస్తోంది. అపరిమితి ఐడియా టూ ఐడియా కాల్స్(లోకల్ ప్లస్ ఎస్టీడీ). అదే ఇతర నెట్ వర్క్ లకైతే రూ.297 ప్లాన్ కింద రోజుకు 300 నిమిషాలను, వారానికి 1200 నిమిషాలను వాడుకోవచ్చు. అదే రూ.447 ప్లాన్ కిందైతే 3000 నిమిషాలను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ తన కొత్త యూజర్ల కోసం రూ.249 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు అపరిమిత కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. ఆదివారం రోజు మాత్రం రోజంతా ఈ ఉచిత కాల్స్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జియో జియో తన కస్టమర్లకు రూ.309 రీచార్జ్‌తో 84 రోజులకు 84 జీబీ డేటాను, రూ.509 రీచార్జ్‌తో 84 రోజులకు 168 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే రోజుకు దాదాపుగా 1 జీబీ (రూ.309), 2 జీబీ (రూ.509) డేటాను పొందొచ్చు. దీనితోపాటు ఇక ఎస్ఎంఎస్, కాల్స్, జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలపాటు ఉచితం. ఇక నాన్ ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను రూ.408, రూ.608 రీచార్జ్‌లతో పొందొచ్చు. ధన్ ధనా ధన్ ఆఫర్ కేవలం ఒక రీచార్జ్‌కు మాత్రమే పరిమితం. -
ఐడియా ‘జాక్‌పాట్’ ఆఫర్
న్యూఢిల్లీ: సమ్మర్ సర్ప్రైజ్ అంటూ ఖాతాదారులను ఊరించిన రిలయన్స్ జియోకు ట్రాయ్ షాకిస్తే.. మరో టాప్ టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులర్ మాత్రం కూల్ కూల్ ఆఫర్ తో దూసుకువచ్చింది. తన పోస్ట్ పెయిడ్ కస్టమర్లకోసం 'డేటా జాక్‌పాట్' ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం నెలకు రూ.100కే 10 జీబీ డాటాను అందించనుంది. పరిమిత కాలానికి దీన్ని లాంచ్ చేసింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ గా లాంచ్ చేసిన ఈ జాక్‌పాట్ ఆఫర్ కేవలం మూడు నెలల కాలానికి చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో రూ.100కి నెలకు 10 జీబీ డేటా, రూ .300కు నెలకు 30జీబీ అందించనున్నట్టు ఐడియా ప్రకటించింది. అంతేకాదు ఈ మూడు నెలల కాలం అయిపోయిన తరువాత కూడా ఫ్రీ డేటా ఆఫర్ కంటిన్యూ అవుతుంది. ఎలా అంటే..రూ.100రీచార్జ్‌పై 1జీబీ డేటాను అదనంగా అందించనుంది. మై ఐడియా యాప్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు ఆయా ప్రాంతాల్లో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. -
పోస్ట్ పెయిడ్ యూజర్స్‌కి ఐడియా సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యులర్ శుక్రవారం కొత్త ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను పరిచయం చేసింది. దీని ప్రకారం 4జీ మొబైల్ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ డాటాను అందించనుంది. లిమిటెడ్ రెంటెడ్ ప్లాన్స్‌లో ప్రీ పెయిడ్ వినియోగదారులందరికీ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పింది. కొత్త ఐడియా ప్యాక్స్ రూ.199 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త పథకం ప్రకారం రూ.499 ఆ పైన ప్లాన్‌లో రూ.300 విలువైన డేటా సేవలు ఉచితమని కంపెనీ చెబుతోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రూ.349- రూ.498లమధ్య రెంటల్ ప్లాన్ లో రూ.50 డిస్కౌంట్. అలాగే రూ.149-రూ.349 రెంటల్ ప్లాన్‌పై సబ్‌స్క్రైబ్ అయిన ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. రూ. 300 యాడ్ ఆన్ ప్యాక్‌తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ. 50 అదనంగా చెల్లించి మూడు నెలలపాటు ఈ ఆఫర్‌ను పొందొచ్చని ఐడియా స్పష్టం చేసింది. అలాగే మూడు నెలల తరువాత మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే రూ.199-రూ.349మధ్యప్లాన్లో అదనంగా రూ. 200, రూ.349- రూ.498 మధ్య ప్లాన్‌లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని ఐడియా తెలిపింది. ఏప్రిల్ 30, 2017 వరకు దీని సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ 4జీ హ్యాండ్సెట్లకు మాత్రమే. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ తరహా భారీప్రయోజనాల ఆఫర్ అందుబాటులోకి తీసుకు రావడం ఇదే ప్రథమమని ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్తెలిపారు. -
టెలికం 'బాహుబలి' వస్తోంది..!
⇒ ఐడియా–వొడాఫోన్ విలీనానికి ఓకే ⇒ పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం... ⇒ విలీనం కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ⇒ ఐడియాకు 26% వాటా... మిగిలింది ఇన్వెస్టర్ల చేతిలో ⇒ 43% మార్కెట్ వాటా.. 40 కోట్ల మంది కస్టమర్లు... ⇒ చైర్మన్ బాధ్యతలు కుమార మంగళం బిర్లా చేతికి ⇒ నియంత్రణ పగ్గాలు ఇరు గ్రూప్‌ల చేతిలో... ముంబై: దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి లైన్‌క్లియర్ అయింది. బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్ విలీనం అవుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. తమ డైరెక్టర్ల బోర్డులు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయని ఇరు గ్రూప్‌లు పేర్కొన్నాయి. దీంతో విలీనం ద్వారా ఏర్పాటయే కొత్త కంపెనీ అటు ఆదాయ మార్కెట్ వాటా, కస్టమర్ల సంఖ్య పరంగా దేశీయంగా అగ్రగామి టెల్కోగా అవతరించనుంది. పూర్తిగా షేర్ల రూపంలో కుదిరిన ఈ డీల్ రెండేళ్లలోపు పూర్తికావచ్చని భావిస్తున్నారు. డీల్ స్వరూపం ఇదీ... షేర్ల లావాదేవీ రూపంలో విలీనం ఉంటుంది. విలీనం ద్వారా ఏర్పడే కొత్త కంపెనీలో వొడాఫోన్ ఇండియా, దాని పూర్తిస్థాయి అనుబంధ సంస్థ వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లు కలిసిపోతాయి. ఐడియా సెల్యులార్ వొడాఫోన్‌కు కొత్తగా షేర్లను జారీ చేస్తుంది. తద్వారా వొడాఫోన్ ఇండియా ప్రత్యక్షంగా భారత్ కార్యకలాపాల నుంచి వైదొలగుతుంది. విలీనం తర్వాత ఆవిర్భవించే కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ఉంటుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ వొడాఫోన్ ఇండియాకు చెందిన 4.9 శాతం వాటాను రూ.3,874 కోట్ల మొత్తానికి దక్కించుకోవడం ద్వారా కొత్త కంపెనీలో వొడాఫోన్ వాటా తగ్గనుంది. దీనిప్రకారం విలీన సంస్థలో ఐడియాకు 26 శాతం వాటా లభిస్తుంది. మిగతా వాటా ఇతర వాటాదారుల(పబ్లిక్) చేతిలో ఉంటుంది. కాగా, విలీన కంపెనీ నియంత్రణను వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌లు సంయుక్తంగా చేపడతాయి. కొత్త కంపెనీకి చైర్మన్‌గా కుమార మంగళం బిర్లా వ్యవహరించనున్నారు. వొడాఫోన్ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) నామినీగా ఉంటారని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ విటోరియో కొలావో... బిర్లా సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. రానున్న కాలంలో విలీన సంస్థలో ఇరు గ్రూపుల వాటా సమాన స్థాయికి చేరుతుందని బిర్లా, కొలావో పేర్కొన్నారు. తద్వారా వొడాఫోన్ భారత్ నుంచి క్రమంగా వైదొలగుతుందన్న సంకేతాలిచ్చారు. కాగా, ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు ఉన్న 42 శాతం వాటా ఈ విలీన ఒప్పందంలోకి రాదు. భారతీ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు కలిపి ఇండస్ టవర్స్‌ను ఏర్పాటు చేశాయి. బిర్లా గ్రూపునకు మరింత వాటా... కొత్తగా ఆవిర్భవించే విలీన సంస్థలో మరింత వాటాను కొనుగోలు చేసే హక్కు ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు ఉంటుందని.. కొంతకాలానికి ఇరు గ్రూప్‌ల వాటా సమానమవుతుందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందంలో అంగీకరించిన ఈ యంత్రాంగం ప్రకారం.. నాలుగేళ్ల తర్వాత బిర్లా గ్రూప్ వాటాను పెంచుకోవడం మొదలుపెడుతుందని కొలావో చెప్పారు. అప్పటినుంచి ఐదేళ్ల వ్యవధిలో వొడాఫోన్ షేర్లను విక్రయిస్తుందన్నారు. షేరు ఒక్కంటికి రూ.130 చొప్పున 9.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు బిర్లా గ్రూపునకు అవకాశం ఉంటుంది. వాటా సమానమయ్యేవరకూ వొడాఫోన్‌కు ఉన్న అదనపు షేర్లకు సంబంధించి ఓటింగ్ హక్కులకు ఆస్కారం ఉండదు. ఇరు గ్రూప్‌లూ సంయుక్తంగానే ఓటింగ్ హక్కు లను కలిగిఉంటాయని ప్రకటన తెలిపింది. విలీనం ద్వారా నాలుగో ఏడాది నుంచి వార్షికంగా 2.1 బిలియన్ డాలర్లమేర వ్యయాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. విలీనం సాహసోపేత నిర్ణయం: సీఓఏఐ వొడాఫోన్–ఐడియాల విలీనాన్ని సాహసోపేతమైన చర్యగా సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) అభివర్ణించింది. విలీనం ద్వారా ఆవిర్భవించే పటిష్ట కంపెనీ వల్ల అటు ప్రభుత్వానికి.. ఇటు దేశీ టెలికం మార్కెట్‌కూ ప్రయోజనం చేకూరుతుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ‘ఇరు కంపెనీలూ చాలా సాహసంతో నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో అత్యంత బలోపేతమైన టెల్కో ఆవిర్భవించడం వల్ల ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అత్యున్నత స్థాయి టెలికం నెట్వర్క్ ఆసరాతో వినియోగదారులకూ మేలు చేకూరుతుంది. వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ విలీనానికి సాధ్యమైనంత త్వరగా నియంత్రణపరమైన అనుమతులు లభిస్తాయని భావిస్తున్నాం’ అని మాథ్యూస్ పేర్కొన్నారు. జియో దెబ్బతో... దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో సంచలన అరంగేట్రం తర్వాత విలీనాలు, కొనుగోళ్లు జోరందుకున్నాయి. మొట్టమొదటిగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో సిస్టెమా శ్యామ్, ఎయిర్‌సెల్‌ల విలీనంతో దీనికి తెరలేచింది. ఆర్వాత వొడాఫోన్–ఐడియా విలీనం తెరపైకి వచ్చింది. కాగా, భారతీ ఎయిర్టెల్ కూడా ఈ రేసులో తాను ఉన్నానంటూ ఇటీవలే నార్వే టెలికం సంస్థ టెలినార్ ఇండియాను విలీనం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విలీనం పూర్తయితే... ఎయిర్టెల్ టెలికం యూజర్ల సంఖ్య 30 కోట్ల మార్కును అధిగమిస్తుంది. అదేవిధంగా మార్కెట్ వాటా కూడా 35 శాతానికి చేరుతుంది. అయినప్పటికీ.. వొడాఫోన్–ఐడియా విలీన సంస్థ తర్వాత రెండో స్థానానికే పరిమితం కావాల్సి వస్తుంది. కాగా, ఇటీవలే టాటా టెలీతో జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమో దీర్ఘకాల వివాదానికి కోర్టు వెలుపల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో టాటా టెలీ నుంచి డొకోమో వైదొలిగేందుకు మార్గం సుగమమైంది. మొత్తమ్మీద ఇప్పుడు భారత్‌కు దాదాపు విదేశీ టెలికం కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా గుడ్‌బై చెప్పేస్తున్నట్లు కనబడుతోంది. కాగా, భారత్‌కు నాలుగైదు పెద్ద టెల్కోలు ఉంటే సరిపోతుందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా విలీనాలకు అనుకూలంగా సంకేతాలివ్వడం గమనార్హం. నంబర్ వన్ స్థానానికి... ⇔ ట్రాయ్ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి వొడాఫోన్‌కు ఇండియాలో 20.46 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఉంది. మార్కెట్ వాటా 18.16 శాతంగా ఉంది. ⇔ ఇక ఐడియా సెల్యులార్ 16.9 శాతం మార్కెట్ వాటా, 19.05 కోట్లమంది యూజర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ⇔ భారతీ ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 26.58 కోట్లు కాగా, ఆదాయంలో మార్కెట్ వాటా 33 శాతం. ఆదాయం, కస్టమర్ల సంఖ్య పరంగా ప్రస్తుతం ఎయిర్టెల్ నంబర్ వన్ ర్యాంకులో ఉంది. ⇔ అయితే, ఇప్పుడు ఐడియా–వొడాఫోన్ విలీనంతో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టేసి టాప్ ర్యాంకును చేజిక్కించుకోనుంది. ఈ విలీన సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య దాదాపు 40 కోట్ల మందికి చేరనుంది. మొత్తం దేశీ టెలికం యూజర్ల సంఖ్యలో ఇది 40 శాతం. ⇔ బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం.. విలీనం సంస్థ ఆదాయం రూ.80,000 కోట్లుగా ఉంటుంది. ఆదాయంపరంగా దేశీ టెలికం పరిశ్రమలో 43 శాతం మార్కెట్ వాటా దీని సొంతం అవుతుంది. దీంతో నంబర్ వన్ కంపెనీగా ఆవిర్భవిస్తుంది. ⇔ విలీనం ఒప్పందం ప్రకారం వొడాఫోన్ ఇండియా ఎంటర్ప్రైజ్ విలువ రూ.82,800 కోట్లు(12.4 బిలియన్ డాలర్లు)గా లెక్కతేలుతోంది. ఇక ఐడియా విలువ రూ.72,200 కోట్లు(10.8 బిలియన్ డాలర్లు)గా అంచనా వేసినట్లు ఐడియా సెల్యులార్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. ⇔ వొడాఫోన్ ఇండియా, ఐడియాలకు డిసెంబర్ 2016 నాటికి రూ.1.07 లక్షల కోట్ల రుణ భారం ఉంది. ⇔ విలీన సంస్థకు సంయుక్తంగా దేశంలో ఇప్పటిదాకా కేటాయించిన స్పెక్ట్రంలో 25 శాతానికిపైగా ఉంటుంది. అయితే, స్పెక్ట్రం పరిమితి నిబంధనల ప్రకారం దా దాపు 1 శాతం స్పెక్ట్రం(విలువ సుమారు రూ.5,400 కోట్లు)ను ఈ విలీన సంస్థ విక్రయించాల్సి ఉంటుంది. ⇔ విలీనం పూర్తయిన తర్వాత వొడాఫోన్ గ్రూప్ నికర రుణ భారం దాదాపు 8.2 బిలియన్ డాలర్ల మేర తగ్గుతుందని అంచనా. విలీనం ద్వారా ఆవిర్భవించే కొత్త కంపెనీకి 10 బిలియన్ డాలర్ల మేర విలువ చేకూరుతుంది. వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూపుల నుంచి చెరో ముగ్గురు ప్రతినిధులు బోర్డులో ఉంటారు. ఇరు బ్రాండ్ల పటిష్టతల దృష్ట్యా విడివిడిగానే కొనసాగుతాయి. విలీన ప్రక్రియలో కొత్తగా పన్ను సంబంధ వివాదాలు తలెత్తే అవకాశం లేదు. – విటోరియో కొలావో, వొడాఫోన్ గ్రూప్ సీఈఓ ఈ విలీనం ఇరు గ్రూప్‌ల వాటాదారుల విలువ పెంచేందుకు దోహదం చేస్తుంది. డీల్‌లో భాగంగా వొడాఫోన్ నుంచి రూ.3,874 కోట్ల మొత్తానికి గాను 4.9 శాతం వాటాను ప్రమోటర్లు(ఆదిత్య బిర్లా గ్రూప్) కొనుగోలు చేస్తారు. ఐడియా దీనికి ఎలాంటి చెల్లిం పులూ చేయదు. అదేవిధంగా విలీనం తర్వాత ఐడియాలో ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రసక్తే లేదు. – కుమార మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ -
మెగా డీల్‌కు ఐడియా గ్రీన్ సిగ్నల్
-
ఉద్యోగాలు సేఫ్..భరోసా ఇస్తున్న సీఈవోలు
కోల్ కత్తా : ఐడియా, వొడాఫోన్ల మెగా విలీన ప్రకటన అనంతరం తమ ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అని ఆందోళన చెందుతున్న ఎంప్లాయీస్ కు కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల జాబ్స్ సేఫ్ గానే ఉంటాయని ప్రకటించాయి. ఐడియాలో ఎలాంటి ఉద్యోగాల కోత లేదని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పష్టంచేశారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో విలీనాంతరం ఏర్పడబోయే అతిపెద్ద టెలికాం కంపెనీకి చైర్మన్ గా కుమార్ మంగళం బిర్లానే వ్యవహరించనున్నారని తెలిసింది. వొడాఫోన్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయనుంది. తమ సంబంధిత సర్కిళ్లలో బలమైన ఉనికిని చాటుకోవడానికి ఇరు కంపెనీలు వేరువేరుగానే కార్యకలాపాలు నిర్వహించనున్నాయని ఈ టెలికాం దిగ్గజాలు పేర్కొన్నాయి. ఇండియన్ స్టాఫ్ కు కొత్త ప్రొఫిషనల్ అవకాశాలు కల్పించడానికి ఈ విలీనం ఎంతో సహకరించనుందని తెలుపుతూ వొడాఫోన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విట్టోరియో కోలో తమ భారత ఉద్యోగులకు ఓ ఈ-మెయిల్ పంపారు. ఎంతో ఆకట్టుకునే కంపెనీగా వొడాఫోన్ ను తీర్చిదిద్దడానికి వొడాఫోన్ ఇండియా టీమ్ కు ఈ డీల్ సహకరించనుందని పేర్కొన్నారు. గట్టి పోటీ ఉండే ఇండియా మార్కెట్లో విజయం సాధించడానికే వొడాఫోన్ ఇండియా ఉద్యోగులు ఎక్కువగా ఫోకస్ చేస్తారని కృషిచేస్తారని అభిప్రాయపడ్డారు. -
మెగా డీల్‌కు ఐడియా గ్రీన్ సిగ్నల్
దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించడానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలిపింది. వొడాఫోన్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. వొడాఫోన్ ఇండియా మొబైల్ సర్వీసులను తమలో విలీనం చేసుకుని దేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ కంపెనీగా అవతరించనున్నామని ఐడియా పేర్కొంది. దీంతో ఐడియా సెల్యులార్ షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. మార్కెట్లు 15 శాతం ర్యాలీ నిర్వహిస్తూ లాభాలు పండిస్తున్నాయి. విలీనం తర్వాత అవతరించబోయే కంపెనీలో వొడాఫోన్ 45.1 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది. ఈ డీల్ ప్రకారం ఐడియా, వొడాఫోన్లు రెండూ చెరో ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉంటాయి. అయితే చైర్మన్ అపాయింట్ చేసే అధికారం మాత్రం ఐడియా చేతికే వెళ్లిపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ను అపాయింట్ మెంట్ ఇరు ప్రమోటర్లు నిర్ణయించనున్నారు. ఇండస్ టవర్స్ లోని వొడాఫోన్ 42 శాతం వాటాను ఈ డీల్ నుంచి మినహాయించారు. ఈ విలీనం అనంతరం ఏర్పడబోయే కంపెనీకి 40 కోట్ల మంది కస్టమర్లు ఉండనున్నారు. అంటే ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కంపెనీకే కస్టమర్. ఐడియా, వొడాఫోన్ ల కలయిక టెలికాం సెక్టార్ కు పాజిటివ్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్ :నష్టాల్లో మార్కెట్లు
ముంబై : అంచనావేసిన మాదిరిగానే సోమవారం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ నెలకొంది. దీంతో గత వారం 2.5 శాతం ర్యాలీ నిర్వహించిన దేశీయ బెంచ్ మార్కు సూచీలు ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంలో 29,528 వద్ద, నిఫ్టీ 25.20 పాయింట్ల నష్టంతో 9134 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వొడాఫోన్ ఇండియా విలీనానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలుపడంతో ఐడియా షేర్లు ఒక్కసారిగా 15 శాతం మేర పైకి ఎగిశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలు అతివాదిగా ముద్రపడిన యోగి ఆదిత్యానాథ్ కు అప్పగించడంతో ఈ వారంలో మార్కెట్లు ప్రకంపనాలు సృష్టించనున్నాయని విశ్లేషకులు ముందుగానే అంచనావేశారు. అత్యధిక జనాభా ఉన్న యూపీ రాష్ట్ర సీఎంగా యోగి ఎన్నికైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ భవిష్యత్ సంస్కరణలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపవచ్చని, లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకులు భయాందోళనలు వ్యక్తంచేశారు. వారి భయాందోళనలకు అనుగుణంగా మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. 6 పైసల లాభంతో 65.40 వద్ద ప్రారంభమైంది. -
2జీ, 3జీ, 4జీ.. డేటాకు ఒకే రేటు: ఐడియా
ఈ నెలాఖరు నుంచి అమలు న్యూఢిల్లీ: ఈ నెలాఖరు నుంచి 1 జీబీకి మించిన 2జీ, 3జీ, 4జీ మొబైల్ డేటా ప్యాకేజ్‌లను ఒకే రేటుకు అందించనున్నట్లు టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ వెల్లడించింది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం కొన్ని టెలికం సర్కిల్స్‌లో 2జీ డేటా కన్నా 4జీ డేటా చౌకగా ఉంటోంది. 2జీకి సంబంధించి 1జీబీ డేటా రీచార్జ్ (నెల రోజుల వాలిడిటీ) రూ. 170 ఉండగా, 4జీ డేటా ఖరీదు రూ. 123గా ఉంది. మార్కెట్లో పోటీ తీవ్రతరమవుతుండటంతో ఐడియా సెల్యులార్ రేట్లను క్రమబద్ధీకరిస్తోంది. సాధారణ వేగం ఉండే 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 4జీ వంటి అధిక స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్స్‌లో డేటా పరిమితి చాలా త్వరగా కరిగిపోతుంది. రిలయన్స్ జియో ఉచిత కాల్స్ వంటి ఆఫర్లతో ఊదరగొడుతుండటంతో టెలికం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఐడియా ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కస్టమర్లకు ఐడియా తీపికబురు
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు శుభవార్త. టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐడియా 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లన్నింటికి కూడా ఒకే ధరల్లో డేటా ప్లాన్స్‌ను విక్రయించనుంది. మార్చి ఆఖరు నుంచి ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రారంభించనుంది. ‘1జీబీ అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్స్‌ను 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు సమాన ధరల్లో విక్రయించాలని నిర్ణయించాం. డేటా ప్లాన్స్ ధరల్లో నెట్‌వర్క్‌ను బట్టి మార్పు ఉండదు. 2017, మార్చి 31నుంచి దీనిని అమలుచేస్తున్నాం’ అని ఐడియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు వేర్వేరుగా ఐడియా డేటా ప్లానింగ్స్ ధరలు ఉంటాయి. అయితే, రిలయన్స్ జియో అందిస్తున్న 4జీ మొబైల్ డేటా సర్వీసు ఐడియా 2జీకి ఇచ్చే ధరకంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జియో నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తాజాగా తన నిర్ణయాన్ని ఐడియా మార్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. -
ఐడియా: ఆరునెలలు 6జీబీ డేటా ఫ్రీ ...ఎలా?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఆపరేటర్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారీ సంస్థ ఐటెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలకు 1 జీబీ డ్యాటాను ఆరు నెలలపాటు ఉచితంగా అందించనుంది. అంతేకాదు ఈ ఆఫర్ ఈ రోజునుంచే ( బుధవారం) చెల్లుబాటులోకి రానుందని ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా ఐటెల్ అందిస్తున్న ఈ ఆఫర్ ఐటెల్‌కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో మాత్రమే అందుబాటులోఉంటుంది. దేశవ్యాప్తంగా పెద్దమొత్తం వినియోగదారులకు దీని మూలంగా లాభం చేకూరనుందనే విశ్వాసాన్ని ఐటెల్ సీఈవో సుధీర్ కుమార్ వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నిత్యావసరంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో మన జీవితాలు డిజిటల్ ప్లాట్ ఫాంలోకి మారిపోతున్నాయన్నారు . ఈ క్రమంలో ఐటెల్, ఐడియా యూజర్లకు సరసమైన ధరలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఆఫర్ పొందాలంటే యూజర్లు ఐటెల్ స్మార్ట్ ఫోన్ల లోని ఐడియా ద్వారా http://i4all.ideacellular.com/offers సైట్‌ను సందర్శించాలని కోరింది. అనంతరం గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేస్తే.. యూజర్ డివైజ్ ఐఎంఈఐ, ఫోన్ నెంబర్ వెబ్ సైట్ గుర్తిస్తుందని తెలిపింది. ఇక్కడ షో మై ఆఫర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, 1 జీబీ ఆఫర్ ను సెలెక్ట్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందని తద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ లో మొదటి నెల డాటా పూర్తిగా ఉచితం. ఆ తర్వాత ఆరునెలలు వరుసగా నెలలు 1 జీబీ డాటా ఫ్రీ. అలాగే నెలకు రూ. 50 లేదా అంతకు మించి ప్యాక్‌లు చెల్లించడం ద్వారా అదనపు డేటా, లేదా వాయిస్ కాల్స్‌ను పొందవచ్చని తెలిపింది. మరోవైపు టవర్ల బిజినెస్‌ను కొనుగోలు చేసే యోచనలో అమెరికన్ టవర్ కంపెనీ(ఏటీసీ) అధికారులు ప్రస్తుతం ఐడియాతో చర్చలు జరుపుతోందిట. అటు వొడాఫోన్తో విలీనానికింటే ముందుగానే టవర్ల డీల్‌ను కుదుర్చుకోవాలని ఐడియా యాజమాన్యం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఇంట్రాడేలో ఐడియా షేరు 10 శాతం లాభపడింది. -
బెస్ట్ 'అన్ లిమిటెడ్ డేటా' ఆఫర్లేమిటో తెలుసా?
సంచలన ఆఫర్లతో రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ లన్నీ ఒక్కసారిగా రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ జియో తన ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఛార్జీల విధింపుకు సిద్ధమైంది. అయినప్పటికీ కంపెనీలు మాత్రం తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారికి కౌంటర్ గా జియో కూడా బెస్ట్ డీల్స్ నే ప్రకటిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందిస్తున్న బెస్ట్ అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లేమున్నాయో ఓ సారి చూద్దాం... రిలయన్స్ జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్+రూ.303 రీఛార్జ్ ప్యాక్: రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు రూ.303 ప్రీపెయిడ్ రీఛార్జ్ తో 28జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీలో ఉండనుంది. జియో ప్రైమ్ పోస్ట్ పెయిడ్ యూజర్లకైతే, ఇదే ధర కింద 30జీబీ డేటాను కంపెనీ అందించనుంది. ఈ ప్లాన్ కింద కస్టమర్లు రూ.99 జియో ప్రైమ్ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే, రోజుకు 1జీబీ 4జీ డేటా కూడా పొందవచ్చు. దాంతో పాటు అపరిమిత ఉచిత కాల్స్. 1జీబీ డేటా సరిపోదనుకునే ప్రీపెయిడ్ యూజర్లు రూ. 499 జియో ప్రైమ్ రీఛార్జ్ ప్యాక్ ను వేసుకుంటే 56జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ వాడుకోవచ్చు. ఇదే బిల్లింగ్ సైకిల్ కింద పోస్ట్ పెయిడ్ కస్టమర్లైతే 60జీబీ 4జీ డేటాను పొందవచ్చని కంపెనీ తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ రూ.345 రీఛార్జ్ ప్యాక్: రూ.345 తో రీఛార్జ్ చేసుకునే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు 28 రోజుల వరకు 28జీబీ హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు. అదేవిధంగా డైలీ ఎఫ్‌యూపీ కింద 1జీబీ పొందవచ్చు. రోజంతా 500 ఎంబీని వాడుకొని, అర్థరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మరో 500 ఎంబీని వాడుకునేలా ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఒకవేళ ఎలాంటి టైమింగ్ నిబంధనలు లేకుండా రోజంతా 1జీబీ వాడుకోవాలనుకునే వారు రూ.549 రీఛార్జ్ ప్యాక్ ను వేసుకోవాల్సి ఉంటుంది. రూ.345, రూ.549 రీఛార్జ్ ప్యాక్ లపై ఉచిత కాల్స్ ను కూడా పొందవచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి. 1200 నిమిషాలకు పైగా కాల్స్ ను వాడుకునే వారికి నిమిషానికి 30పైసల ఛార్జ్ పడుతుంది. 30 పైసల ఛార్జ్ వేసిన తర్వాత ఎయిర్ టెల్ రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్ ను అందిస్తోంది. అటు పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఎయిర్ టెల్ మార్చి 13 నుంచి ఉచిత డేటా అందించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కానీ ఎంత మేరకు ఉచిత డేటా అందిస్తోందో తెలుపలేదు. అయితే ఈ ఉచిత డేటాను పొందాలంటే మైఎయిర్ టెల్ యాప్ ను సబ్ స్క్రైబర్లు ఓపెన్ చేసుకోవాలని సూచించింది. వొడాఫోన్ రూ.346 రీఛార్జ్ ప్యాక్ : రూ.346 రీఛార్జ్ ప్యాక్ ను లాంచ్ చేసిన వొడాఫోన్ 28జీబీ మొబైల్ డేటాను, అపరిమిత ఉచిత కాల్స్ ను అందించనున్నట్టు తెలిపింది. ప్రత్యర్థుల మాదిరిగానే రోజూ 1జీబీ ఉచిత డేటాను వాడుకునే అవకాశం కల్పించిన వొడాఫోన్, అంతకంటే ఎక్కువ వాడితే ఛార్జ్ చేయనున్నట్టు పేర్కొంది. ఐడియా రూ.348 రీఛార్జ్ ప్యాక్ : ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా రూ.348 రీఛార్జ్ తో 14జీబీ ఉచిత డేటా, రోజుకు 500 ఎంబీ డేటాను వాడుకునే అవకాశాన్ని పొందనున్నారు. వీటితో పాటు అపరిమిత కాల్స్ ను పొందవచ్చు. 4జీ హ్యాండ్ సెట్ ఉన్న వారికి మాత్రమే ఈ కొత్త ఆఫర్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. -
ఐడియా సెల్యులర్‌లో ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ వాటా విక్రయం
డీల్ విలువ రూ.1,288 కోట్లు న్యూఢిల్లీ: ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా. ఐడియాలో వొడాఫోన్ విలీనమవుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయం జరగడం విశేషం. ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, తన ఇన్వెస్ట్మెంట్ విభాగం పీ5 ఏషియా ఇన్వెస్ట్మెంట్ (మారిషస్) ద్వారా 12 కోట్ల షేర్లను విక్రయించిందని బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ షేర్ల సగటు విక్రయ ధర రూ.107.32గాఉంది. -
మార్కెట్లో దూసుకెళ్తున్న టెలికాం దిగ్గజాలు
టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్‌లు గురువారం ట్రేడింగ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. మార్నింగ్ ట్రేడింగ్‌లో టెలికాం సర్వీసు ప్రొవైడర్ షేర్లు 11 శాతం మేర పైకి దూసుకెళ్లాయి. పోస్టు టెలినార్ డీల్ అనంతరం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ గా పేరున్న భారతీ ఎయిర్ టెల్ 52 వారాల గరిష్టంలో 11 శాతం పైకి ఎగిసి, రూ.397 వద్ద ట్రేడైంది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడంతో షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. ఈ కొనుగోలు ఒప్పందంతో ఏడు సర్కిళ్లలో టెలికాం ఇండియా ఆపరేషన్లు ఇక ఎయిర్ టెల్ సొంతం కానున్నాయి. 1800 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో అదనంగా 43.4 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ దీనికి లభించనుంది. ఉదయం 9.35 సమయంలో 7 శాతం పైకి ట్రేడయిన ఎయిర్ టెల్, తొలి 25 నిమిషాల్లో 11.28 మిలియన్ షేర్లు చేతులు మారడంతో మరింత పైకి ఎగిసింది. అదేవిధంగా ఐడియా సెల్యులార్ కూడా 6 శాతం పైకి జంప్ చేసి, రూ.120 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 5.31 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది.. -
లాభాల్లో మార్కెట్లు: భారతీ, ఐడియా జంప్
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు వారాంతంలో పాజిటివ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 61.36 పాయింట్ల లాభంలో 28,926 వద్ద, నిఫ్టీ 19.30 పాయింట్ల లాభంలో 8946 వద్ద ట్రేడవుతోంది. టెలినార్ ఇండియాను కొనుగోలు చేయబోతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 10 శాతం పైకి దూసుకెళ్లాయి. ఈ కొనుగోలు ఒప్పందంతో 1,800 మెగాహెడ్జ్ బ్యాండ్ లో కంపెనీకి అదనపు స్పెక్ట్రమ్ లభించనుంది. మరోవైపు ఐడియా షేర్లు 7 శాతం పైకి రివ్వున ఎగిరాయి. వొడాఫోన్-ఐడియా విలీనంలో సాప్ట్ బ్యాంకు మైనారిటీ స్టాక్ ను అంటే 15-20 శాతం స్టాక్ ను కొనుగోలచేయనున్నట్టు తెలియడంతో ఐడియా షేర్లు రయ్ మని దూసుకెళ్లాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 66.96వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 103 నష్టంతో 29,198 వద్ద ట్రేడవుతోంది. కాగ, మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లు సెలవును పాటించనున్నాయి. -
జియో దెబ్బ: ప్రత్యర్థులు మరింత కుదేలు
జియో దెబ్బకు మేజర్ టెలికాం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక్కసారిగా మూడో క్వార్టర్లో భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో క్వార్టర్లోనూ ఈ దిగ్గజాలకు పరిస్థితి ఇదే మాదిరే ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్లు కొనసాగించినంత వరకు టెలికాం దిగ్గజాలు మార్జిన్లకు భారీగానే గండికొడుతూ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడైతే జియో తన ఉచిత ఆఫర్లను విత్ డ్రా చేసుకుని, డేటా సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందో అప్పటినుంచి టెలికాం దిగ్గజాల పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని టెలికాం ఇండస్ట్రి ప్రాక్టిస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా అర్పితా పాల్ అగర్వాల్ చెప్పారు. 2016 సెప్టెంబర్ నుంచి వెల్ కమ్ ఆఫర్ కింద జియో ఉచిత ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం డిసెంబర్లో జియో తమ ఉచిత డేటా ఆఫర్లను 2017 మార్చి వరకు పొడిగిస్తున్నామని పేర్కొంది. దీంతో టెలికాం దిగ్గజాలు రెవెన్యూలు భారీగా కోల్పోతున్నాయి. భారతీ ఎయిర్ టెల్ 55 శాతం, ఐడియా సెల్యులార్ రూ.478.9కోట్లను, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ.531 కోట్ల నష్టాలను నమోదుచేశాయి. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో దోపిడీ ధరల విధానం వల్లనే తాము రెవెన్యూలను భారీగా కోల్పోతున్నామని టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ల దూకుడే టెలికాం కంపెనీలకు భారీగా దెబ్బకొడుతుందనే దానికి ఎలాంటి సందేహం లేదని టెలికాం కన్సల్టెన్సీకి చెందిన ఓ సంస్థ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ చెప్పారు. ధరల విధానంపై భారత మార్కెట్ ఆధారపడి ఉంటుందని, అలాంటి ఆఫర్లు మార్కెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని గార్టనర్ టెలికాం బిజినెస్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్టు రిషి తేజ్ పాల్ చెప్పారు. -
నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్ విలీన ఒప్పందం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, దేశీయ అగ్రగామి సెల్యులర్ కంపెనీ ఐడియాల మధ్య విలీన ఒప్పందం నెలలోపు ఖరారు కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈ నెల 24–25 నాటికి ఈ రెండు సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన విలీన ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. డీల్‌పై సంతకాలకూ సిద్ధమైపోయాయి. అయితే, విలీనంపై అటు వొడాఫోన్, ఇటు ఐడియాలు మాత్రం గోప్యతను పాటిస్తున్నాయి. వొడాఫోన్ మాత్రం ఈ విలీన బాధ్యతలను తన భారత విభాగానికి లోగడ చీఫ్‌గా వ్యవహరించిన మార్టిన్ పీటర్స్‌కు అప్పగించింది. వొడాఫోన్ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విట్టోరియో కొలావో సైతం తన భారత విభాగంలోని అన్ని విభాగాల అధిపతులకు విలీనం గురించి వచ్చేవారం వివరించనున్నారు. ప్రథమ స్థానానికి: ఇండియా రేటింగ్స్ ఈ డీల్ సాకారమైతే రెండు సంస్థల విలీనం ద్వారా ఏర్పడే సంస్థ దేశీ టెలికం రంగంలో... 40% వాటాతో, 38 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెల్కోగా నిలుస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే, ఆదాయం రూ.77,500 – 80,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. ఇక స్పెక్ట్రమ్, మౌలిక వసతులపై ఇరు సంస్థలు వేర్వేరుగా భారీగా వ్యయం చేయాల్సిన అవసరం కూడా తప్పుతుంది. -
దిగ్గజాలను మరింత ఉడికిస్తూ జియో ట్వీట్
న్యూఢిల్లీ : దేశీయ టెలికం మార్కెట్‌ను హోరెత్తించేస్తూ దిగ్గజ కంపెనీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న రిలయన్స్ జియో ఆ కంపెనీలను మరింత ఉడికిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా టెలికాం కంపెనీలన్నింటికీ శుభాకాంక్షలు పంపించింది. ''డియర్, ఎయిర్టెల్ ఇండియా, ఐడియా సెల్యులార్, వొడాఫోన్లకు హ్యాపీ వాలెంటైన్స్ డే విత్ లవ్ ఫ్రమ్ జియో'' అని తన అధికారిక ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది. 14 ఫిబ్రవరి ఉదయం 10 గంటలకు జియో ఈ ట్వీట్ చేసింది. అయితే జియో ప్రేమతో పంపిన ప్రేమ శుభాకాంక్షలకు ఏ టెలికాం కంపెనీ రిటర్న్ రిప్లే ఇవ్వలేదు. ఈ ట్వీట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీన్ని 'ట్వీట్ ఆఫ్ ది డే'గా పేర్కొంటున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దీనికి 2వేల రీట్వీట్లు, లైక్స్ వచ్చాయి. జియో నేటి వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రమోషన్స్ అన్నింటికీ హ్యాష్ ట్యాగ్ గా #WithLoveFromJioను వాడుతోంది. రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్‌ను పొడిగిస్తూ ఉచిత సేవా ఆఫర్లను మార్చి వరకు అందించడానికి హ్యాపీ న్యూఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది. అప్పటికే ఉచిత కాలింగ్, ఉచిత డేటా ఆఫర్లపై గుర్రుగా టెలికాం కంపెనీలు, ఆఫర్ల పొడిగింపుపై మరింత మండిపడుతున్నాయి. వారిని మరింత ఉడికిస్తూ జియో ఈ ట్వీట్ చేసింది. Dear @airtelindia, @VodafoneIN, @ideacellular, Happy Valentine’s Day. #WithLoveFromJio — Reliance Jio (@reliancejio) February 14, 2017 -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 100 పాయింట్ల మేర, నిఫ్టీ 8800 పైకి ఎగిసింది. అయితే ఒక్కసారిగా మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 51.91 పాయింట్ల లాభంలో 28,386 వద్ద, నిఫ్టీ 15.35 పాయింట్ల లాభంలో 8808 వద్ద ట్రేడవుతున్నాయి. మెటల్, ఎంపికచేసిన బ్యాంకింగ్, పవర్ స్టాక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్లను పైకి ఎగిసేలా చేశాయి. ఫలితాలు నిరాశపరచడంతో బ్యాంకు ఆఫ్ బరోడా 5 శాతం, ఐడియా సెల్యులార్ 4 శాతం పడిపోయాయి. హిందాల్కో, మహింద్రా అండ్ మహింద్రా, ఎన్టీపీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్ టాప్ గెయినర్లుగా 1 శాతం మేర లాభాలు పండించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.17 బలహీనపడి 67.02గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 101 రూపాయల లాభంతో 29,190 వద్ద కొనసాగుతోంది. -
వొడాఫోన్.. విలీనం ‘ఐడియా’!
భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావం ►వొడాఫోన్, ఐడియా విలీనానికి చర్చలు... ►పూర్తిగా షేర్ల రూపంలో డీల్‌కు అవకాశం ►ధ్రువీకరించిన వొడాఫోన్... ►విలీనం పూర్తయితే ఉమ్మడి కంపెనీకి దాదాపు 40 కోట్ల మంది యూజర్లు ►30 శాతం దూసుకెళ్లిన ఐడియా షేరు ధర న్యూఢిల్లీ: భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఐడియా సెల్యులార్‌లు ఒక్కటవుతున్నాయి. చాన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ... ఐడియాతో విలీనం కోసం చర్చలు జరుగుతున్నాయని వొడాఫోన్ గ్రూప్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. షేర్ల రూపంలో జరిగే ఈ లావాదేవీగనుక పూర్తి అయితే, దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించనుంది. రిలయన్స్ జియోతో టారిఫ్‌ల యుద్ధం పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో దేశీ టెలికం రంగంలో స్థిరీకరణ(కన్సాలిడేషన్) ఊపందుకుంటుండటం గమనార్హం. ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా... ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా వొడాఫోన్ ప్రస్తుతం పటిష్టమైన స్థానంలో ఉంది. భారత్‌లోనూ రెండో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ఇక ఐడియా సెల్యులార్ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ విలీనం ద్వారా ఏర్పాటయ్యే కంపెనీకి 39 కోట్ల మందికి పైగా యూజర్లు ఉంటారు. తద్వారా దేశంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంతోపాటు, ప్రపంచంలోని అతిపెద్ద టెల్కోల్లో ఒకటిగా అవతరిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా 24 కోట్ల మందికి పైగా యూజర్లతో భారతీ ఎయిఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వొడాఫోన్–ఐడియా విలీన సంస్థకు వార్షిక ఆదాయం రూ.78,000 కోట్లు, మార్కెట్ వాటా 43 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఎయిర్టెల్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.50,008 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. మార్కెట్ వాటా 33 శాతం. కాగా, కొత్తగా 4జీ సేవలను ఆరంభించిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో... ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌ను మార్చి 31 వరకూ పొడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం 7.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. టవర్ల వ్యాపారానికి మినహాయింపు... షేర్లరూపంలో జరిగే ప్రతిపాదిత డీల్ ఇంకా సంప్రదింపుల దశలో ఉందని వొడాఫోన్ పేర్కొంది. అయితే, ఇండస్ టవర్స్ జాయింట్ వెంచర్లో తమకున్న 42 శాతం వాటాను ఈ ఒప్పందంలో చేర్చబోమని తెలిపింది. భారతీ ఎయిర్టెల్, ఐడియాతో కలిసి టవర్ల వ్యాపారం కోసం వొడాఫోన్ ఇండస్ టవర్స్ పేరుతో జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేసింది. ‘ఐడియా నుంచి వొడాఫోన్‌కు కొత్తగా షేర్లను జారీ చేసేవిధంగానే విలీన ఒప్పందం ఉంటుంది. దీనివల్ల భారత్‌లో మా కార్యకలాపాల నుంచి వైదొలిగేందుకు వీలవుతుంది. ప్రతిపాదిత ఒప్పందం కుదురుతుందనిగానీ, ఎప్పటికల్లా డీల్ కుదరవచ్చు లేదా నిబంధనలు తదితర అంశాలపై ఎలాంటి కచ్చితత్వం లేదు’ అని వొడాఫోన్ గ్రూప్ పేర్కొంది. కేసులే కారణమా? 2007లో వొడాఫోన్ గ్రూప్ భారత్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి ‘హచ్’ టెలికంలో హచిసన్ ఎస్సార్ జాయింట్ వెంచర్‌కు ఉన్న 67 శాతం వాటాను సుమారు 13.1 బిలియన్ డాలర్లకు(హచ్కు ఉన్న 2 బిలియన్ డాలర్ల రుణాన్ని కలిపితే) కొనుగోలు చేసింది. అప్పటి నుంచీ దేశంలో నంబర్ 2 టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్ కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ డీల్‌కు సంబంధించి 2 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత ఒప్పందాలకూ పన్ను వర్తింపు) నిబంధనలతో వొడాఫోన్ న్యాయపోరాటాన్ని ఆరంభించింది. ఈ కేసులో మన సుప్రీం కోర్టు కూడా వొడాఫోన్‌కు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీనిపై ఇంకా న్యాయవివాదం నడుస్తూనే ఉంది. కాగా, గతేడాది భారతీయ వ్యాపార ఆస్తుల విలువలో 5 బిలియన్ పౌండ్లను(దాదాపు 3.35 బిలియన్ డాలర్ల) వొడాఫోన్ తగ్గించుకుంది(రైటాఫ్) కూడా. భారతీయ కార్యకాలాపాలపై వొడాఫోన్ 7 బిలియన్ డాలర్లకుపైగానే పెట్టుబడిగా వెచ్చించింది.ట్యాక్స్ కేసుల నేపథ్యంలో భారత్‌లో వ్యాపార నిర్వహణ చాలా కష్టమంటూ వొడాఫోన్ ఎప్పటినుంచో చెబుతూవస్తోంది. ఈ తరుణంలో ఐడియాతో విలీనం తెరపైకి వచ్చింది. సర్దుకుంటున్న విదేశీ కంపెనీలు... స్పెక్ట్రం కుంభకోణం తర్వాత నెమ్మదిగా విదేశీ టెల్కోలు భారత్ నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన సిస్టెమా ఆర్‌కామ్‌లో కలిసిపోయేందుకు ఒప్పందం కుదరింది. ఎయిర్‌సెల్ కూడా ఆర్‌కామ్‌తో విలీనం అవుతోంది. మరోపక్క, నార్వే కంపెనీ టెలినార్ కూడా ఇక్కడ తమకు సరైన వ్యాపార పరిస్థితులు కనబడటం లేదని... అవకాశం వస్తే భారత్‌కు గుడ్‌బై చెప్పేసేందుకు సిద్ధంగా ఉంది. ఇబ్బందులు తప్పవు... ►ప్రతిపాదిత విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆమోదం చాలా కీలకం. దీనికోసం విలీనం తర్వాత ఏర్పడే సంస్థ గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, కేరళ, ఉత్తర ప్రదేశ్(పశ్చిమం) సర్కిళ్లలో స్పెక్ట్రంను వదిలేసుకోవాల్సి ఉంటుంది. ►మరోపక్క, టవర్ కంపెనీ ఇండస్‌లో వాటాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం దీనిలో భారతీ, వొడాఫోన్లకు 42 శాతం చొప్పున, ఐడియాకు 16 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత టవర్లకు సంబంధించి అద్దెలు తగ్గడంతో ఇండస్ విలువపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ►ఇరు కంపెనీల యాజమాన్యాలు కలిసే విషయంలో వాటాల పంపకం, ఇతరత్రా కొన్ని అవాంతరాలు, రిస్కులకు ఆస్కారం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌కల్లా విలీనం పూర్తయ్యే అవకాశం ఉంది. షేరు రయ్ రయ్... వొడాఫోన్తో విలీనం వార్తల నేపథ్యంలో ఐడియా సెల్యులార్ షేరు ధర దూసుకుపోయింది. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ఒకానొక దశలో 29.2 శాతం ఎగబాకి రూ.100.5 స్థాయిని తాకింది. చివరకు 26 శాతం లాభపడి రూ.97.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 26శాతం లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ఐడియా లిస్టింగ్ తర్వాత కంపెనీ షేరు విలువ ఒకే రోజు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. షేరు ర్యాలీతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.7,257 కోట్లు పెరిగి... రూ.34,279 కోట్లకు చేరింది. కాగా, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను ప్రైవేటు ప్లేస్మెంట్ రూపంలో జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సమీకరించనున్నట్లు సోమవారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐడియా వెల్లడించింది. ఐడియా సంగతిదీ... కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీల్లో ఐడియా సెల్యులార్ కీలకమైనది. ప్రస్తుతం ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 42.2 శాతం వాటా ఉంది. మలేసియాకు చెందిన యాక్సిటా గ్రూప్‌నకు 19.8 శాతం వాటా ఉండగా.. మిగిలినది ఇతర ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. 2007లో వొడాఫోన్ భారత్‌లోకి అడుగుపెట్టినప్పుడే ఐడియా సెల్యులార్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుతం ఐడియా సెల్యులార్కు 19 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. నంబర్ 3 స్థానంలో ఉంది. మార్కెట్ వాటా దాదాపు 20 శాతం. కాగా, ఐడియాకు ప్రస్తుతం రూ. 55,000 కోట్లకుపైగానే రుణ భారం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 88 శాతం పడిపోయి రూ.762 కోట్ల నుంచి రూ.91 కోట్లకు దిగజారింది. డిసెంబర్ క్వార్టర్(క్యూ3) ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. వొడాఫోన్ ఇండియా... వొడాఫోన్ గ్రూప్‌నకు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా వొడాఫోన్ ఇండియా ఉంది. వొడాఫోన్‌కు భారత్‌లో యూజర్ల సంఖ్య 20.1 కోట్లు. గతేడాది సెప్టెంబర్ నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.76,800 కోట్లు. అయితే, నవంబర్‌లో మాతృ సంస్థ వొడాఫోన్ గ్రూప్ నుంచి రూ.47,700 కోట్లు పెట్టుబడి రావడంతో రుణ భారం రూ.35,430 కోట్లకు దిగొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో కంపెనీ మార్కెట్ వాటా 23 శాతం. -
టెలికాం ఇండస్ట్రీలో మరో భారీ విలీనం
న్యూఢిల్లీ : టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పుచేతల్లో నడవాలని భావిస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు, కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ అయిన జియోకు పెద్ద ముప్పు ఎదురుకాబోతుంది. మరో రెండు దేశీయ టెలికాం దిగ్గజాలు ఐడియా, వొడాఫోన్లు ఒకటి కాబోతున్నాయి. వొడాఫోన్‌ను ఐడియాలో విలీనం చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌తో చర్చలు సాగుతున్నాయని బ్రిటిష్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీలు చేతులు కలుపబోతున్నాయని మార్కెట్లోనూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ వొడాఫోన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసేసింది. దీంతో రెండు కంపెనీల మధ్యే ఉంటుందన్న పోటీ త్రిముఖంగా మారింది. ఇన్నిరోజులు నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌తో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియో పోటీపడుతోంది. ఎయిర్‌టెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల విడుదైన ఫలితాల్లోనూ ఎయిర్టెల్ లాభాలకు జియో ఏ మేర గండికొడుకుతుందో అర్థమైంది. ప్రస్తుతం ఐడియాలో వొడాఫోన్ విలీనమైతే నెంబర్ వన్ స్థానం కోసం మూడు దిగ్గజాలు పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రిటీష్‌కు చెందిన దిగ్గజం వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియాలు భారత మార్కెట్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. లాభాలను సమంగా పంచుకోనేలా డీల్ కుదుర్చుకోవాలని భావిస్తున్న ఈ రెండు కంపెనీలు.. దీనివల్ల మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. వొడాఫోన్‌కు ఐడియా కొత్తగా షేర్లు జారీ చేస్తేనే ఈ విలీనం జరుగుతుందని స్పష్టంచేసింది. అయితే కచ్చితంగా ఈ విలీనం ఎప్పుడు ఉంటుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ విలీనంతో రెండు కంపెనీల సంస్థ సబ్‌స్క్రైబర్ సంఖ్య 39 కోట్లకు ఎగబాకనుంది. ఇది ఎయిర్టెల్కున్న 27 కోట్ల కంటే ఎక్కువ. జియోకు ప్రస్తుతం 7.2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు ఉన్న 42 శాతం వాటాతో ఈ విలీనానికి ఎలాంటి సంబంధం ఉండదు. విలీన చర్చలను వొడాఫోన్ ధృవీకరించడంతో ఐడియా సెల్యులార్ 26 శాతం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ఇతర టెలికాం స్టాక్స్‌లోనూ నెలకొంది. భారతీ ఎయిర్టెల్ 8 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 12.5 శాతం పెరిగాయి. -
మరో భారీ విలీనానికి రంగం సిద్ధం
-
జియో ఎఫెక్ట్: ఐడియా కొత్త ఎత్తుగడ
ముంబై: టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడతో వస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కి పోటీగా పూర్తి స్థాయి డిజిటల్ సేవల్లోకి ఏంట్రీ ఇస్తోంది. పూర్తి డిజిటల్ సేవల సంస్థగా మార్చే చర్యల్లో భాగంగా కొత్త యాప్ లను లాంచ్ చేయబోతోంది. సినిమాలు, టీవీ, సంగీతం, గేమ్స్ ఇలా అంతటా కొత్త యాప్ లను త్వరలోనే ప్రారంభించబోతోంది. మ్యూజిక్ అండ్ మూవీ కంటెంట్ ను అందించేందుకు ఒప్పందాలు చేసుకుంది. వాల్యూ ఏడెడ్ సర్వీసుల విస్తరణకు, వినోదం, సమాచారం, కమ్యూనికేషన్ అండ్ యుటిలిటీస్ లాంటి వివిధ కేటగిరీల్లో బ్రాండెడ్ డిజిటల్ సేవలకోసం ఒప్పందాలపై సంతకాలు చేసింది. వాయిస్ కాల్స్, డాటా సర్వీసులతో పాటు తాము పూర్తి డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ గా అవతరించనున్నట్టు ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా వెల్లడించారు. భారతీయ వినియోగదారుల వినోదం, ఆన్ లైన్ డిమాండ్ లను నెరవేర్చే దిశగా తమ వాగ్దానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డాటా ట్రాఫిక్ లో వీడియో డిమాండ్ 2020 నాటికి 60 శాతం పెరిగనున్నట్టు ఇటీవల ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించింది. కాగా జియో ప్రభావంతో గత కొన్ని నెలలుగా టెల్కో లు కంటెంట్ ఆఫర్స్ పై దృష్టిపెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో 4జీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత డిజిటల్ కంటెంట్ సంస్థగా రూపొందుతున్నాయన్నారు. డేటా ట్రాఫిక్ లో క్లిష్టమైన కంటెంట్ పై దృష్టిపెడుతున్నట్టు చెప్పారు. -
మేమూ ఇస్తాం ఫ్రీ కాల్స్..
• పోటా పోటీగా అన్లిమిటెడ్ ప్యాక్స్ • రిలయన్స్ జియో బాటలో టెల్కోలన్నీ • తాజాగా ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ ఆఫర్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగం మళ్లీ వేడెక్కుతోంది. ఒకవైపు కస్టమర్లంతా డేటా వైపు వేగంగా మళ్లుతుంటే.. అంతే వేగంగా ఇప్పుడు వాయిస్ కాల్స్‌పైన ఆఫర్ల మీద ఆఫర్లను టెల్కోలు ప్రకటిస్తున్నారుు. అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్‌తో చొచ్చుకుపోతున్న రిలయన్స్ జియోకు మేమూ పోటీ ఇస్తామంటున్నారుు. కస్టమర్లు మరో కంపెనీ వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు కుస్తీ పడుతున్నారుు. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ యూజర్లు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు వాట్సాప్ వంటి యాప్‌లను విరివిగా వాడుతున్నారు. ఇటువంటి యూజర్ల వారుుస్ కాల్స్ వాడకం తగ్గుతోంది కూడా. అరుునప్పటికీ టెల్కోలు వారుుస్ కాల్స్‌ను ఫ్రీగా ఇస్తున్నారుు. దీంతో కస్టమర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అపరిమిత వారుుస్ కాల్స్ ప్యాక్స్ అందుబాటు ధరలో ఉండడం ప్రీపెరుుడ్ వినియోగదార్లకు కలసి వచ్చే అంశం. కంపెనీలన్నీ రూ.149 ధరలో.. అపరిమిత డేటాతోపాటు వారుుస్ కాల్స్‌ను జియో ప్రస్తుతం అందిస్తోంది. ఈ వెల్కం ఆఫర్‌ను 2017 మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆఫర్ ముగిసిన తర్వాత కస్టమర్ ఏ డేటా ప్యాక్ తీసుకున్నా దేశవ్యాప్తంగా అన్ని వారుుస్ కాల్స్ ఉచితం. అలాగే రూ.149 ప్యాక్ కాల పరిమితి 28 రోజులు. 0.3 ఎంబీ 4జీ డేటా కూడా పొందవచ్చు. ఈ ప్యాక్ అన్ని కంపెనీల దృష్టి పడేలా చేసింది. జియో దూకుడుకు ముందుగా రిలయన్స కమ్యూనికేషన్స(ఆర్‌కాం) జవాబిచ్చింది. రూ.149 ధరలో 28 రోజుల వాలిడిటీతో అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వారుుస్ కాల్స్ ప్యాక్‌ను ప్రకటించింది. అలాగే 300 ఎంబీ 4జీ డేటాను ఉచితంగా ఇస్తోంది. త్వరలో బీఎస్ఎన్ఎల్.. భారత టెలికం రంగంలో ప్రస్తుతం అతి తక్కువ కాల్, డేటా రేట్లను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఆర్‌కాం మాదిరి ప్యాక్‌ను జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. రూ.149 ధరలో అన్లిమిటెడ్ వారుుస్ ప్యాక్‌ను ప్రవేశపెట్టనున్నట్టు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. రిలయన్స జియో మాదిరి ఆఫర్లను అందిస్తామని ఇది వరకే ఆయన స్పష్టం చేశారు. ఇక టెలినార్ తన సొంత నెట్‌వర్క్‌లో అన్లిమిటెడ్ కాల్ ప్యాక్స్‌ను తీసుకొచ్చింది. టెలికం సర్కిల్లో టెలినార్ నుంచి టెలినార్‌కు రూ.64 ప్యాక్‌తో 28 రోజుల పాటు ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. ఐడియా నుంచి ఐడియాకు అపరిమిత లోకల్ కాల్స్‌ను 28 రోజుల వాలిడిటీతో రూ.247 ధరలో ప్యాక్‌ను పొందవచ్చు. లోకల్, ఎస్టీడీ అన్లిమిటెడ్ ప్యాక్ రూ.698 ధరలో ఉంది. వొడాఫోన్ రూ.349 ప్యాక్‌లో సొంత నెట్‌వర్క్‌లో లోకల్ కాల్స్‌ను అందిస్తోంది. ఎయిర్టెల్ సైతం.. పోటీలో నేను సైతం అంటూ ఎయిర్టెల్ తాజాగా రెండు ప్యాక్‌లను 28 రోజుల వాలిడిటీతో ప్రకటించింది. రూ.349 ప్యాక్‌తో దేశవ్యాప్తంగా అన్ని కాల్స్ ఉచితం. 1 జీబీ 4జీ/3జీ డేటా కూడా దీనికి అదనం. అలాగే రూ.148 ప్యాక్ కింద దేశవ్యాప్తంగా ఎరుుర్‌టెల్ నంబర్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎంబీ 4జీ/3జీ డేటా సైతం అందిస్తోంది. రెండింటిలో బేసిక్ మొబైల్ యూజర్లు ఏ ప్యాక్ తీసుకున్నా 50 ఎంబీ డేటా ఉచితమని ఎయిర్టెల్ ఇండియా మార్కెట్ ఆపరేషన్స డెరైక్టర్ అజయ్ పురి తెలిపారు. -
జియో 4జీ వేగం ఇంత తక్కువా?
కొత్తగా 4జీ మార్కెట్లోకి అరంగేట్రం చేసిన రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్, ఇతర టెలికాం కంపెనీలు ఆఫర్ చేసే నెట్ స్పీడ్ లతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ట్రాయ్ వెల్లడించింది. జియో కంటే వేగవంతమైన ఇంటర్నెట్ను ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్లే అందిస్తున్నాయని ట్రాయ్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఎయిర్టెల్ 4జీ వేగం 11.4 ఎంబీపీఎస్, ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.3 ఎంబీపీఎస్, ఆర్‌కామ్ 7.9ఎంబీపీఎస్లు ఉన్నట్టు తెలిపింది. అదే ముఖేష్ అంబానీ జియో విషయానికి వస్తే 4జీ నెట్‌వర్క్‌పై కేవలం 6.2ఎంబీపీఎస్ స్పీడ్‌లోనే ఇంటర్నెట్ ను అందిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ట్రాయ్ డేటాతో రిలయన్స్ కంపెనీ విభేదిస్తోంది. యూజర్ డౌన్లోడ్ చేసుకునే 4జీబీ డేటా ఫేర్ యూసేజ్ పాలసీ(ఎఫ్‌యూపీ) లిమిట్ మొత్తాన్ని వినియోగదారులు ఖర్చుచేశాక వేగాన్ని ట్రాయ్‌ను లెక్కగట్టిందని పేర్కొంటోంది. ఒక్కసారి వినియోగదారులు ఎఫ్‌యూపీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నాక, వేగం 256 కేబీపీఎస్ వరకు పడిపోతుందని జియో ఓ ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు 4జీ స్పీడ్‌ను బాగా సద్వినియోగ పరుచుకుంటున్నారని, వేగం తగ్గిపోయిందనడంలో ఎలాంటి నిజం లేదని కంపెనీ పేర్కొంటోంది. మరోవైపు జియో వచ్చిన తొలి రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ 40 ఎంబీపీఎస్ వరకూ ఉండేదని, క్రమంగా ఆ వేగం తగ్గిపోతుందని వినియోగదారులూ వాపోతున్నారు. జియో సర్వీసులన్నీ 4జీలో ఉండడంతో చార్జింగ్ కూడా త్వరగా అయిపోతోందని, దీంతో మాటిమాటికి బ్యాటరీని రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 31 వరకు ఉచిత డేటా, ఉచిత వాయిస్ వంటి సంచలన ప్రకటనలు చేస్తూ జియో సెప్టెంబర్‌లో టెలికాం పరిశ్రమలోకి అడుగు పెట్టింది. వాయిస్ కాల్స్‌పై అసలు వినియోగదారులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయమని, రూ.50కు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తామని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రాఫిక్ పోలీసులు ఐడియా ప్రమాదాలను ఆపేస్తుంది
-
ఏనుగంత సమస్య... దూదిపింజలా తేలిపోయింది!
ఐడియా ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది. మొన్నటి వరకు పరమ శత్రువులుగా భావించిన ఏనుగులను వారిప్పుడు పరమ మిత్రులుగా భావిస్తున్నారు. ఏనుగు బొమ్మలతో తయారు చేసిన కళాకృతులు వారి జీవితాల్లో కొత్త కాంతులు నింపుతున్నారుు. అక్కడి మనుషుల ప్రాణాలతోపాటు వారి వ్యవసాయ పంటలను విధ్వంసం చేస్తూ వచ్చిన గజరాజులు ఇప్పుడు వారికి, వారి పంటలకు దూరంగా మసలుతున్నారుు. ‘వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ అండ్ కన్జర్వేటివ్ సొసైటీ’ ఒక ఐడియాతో కర్ణాటకలోని సిద్దూ కమ్యూనిటీ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చింది. సిద్దూ తెగకు చెందిన ఈ గిరిజనులు దేశవ్యాప్తంగా 55 వేల మంది ఉండగా, కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వారంతా ఎల్లాపూర్ వైల్డ్ ఫారెస్ట్‌కు సమీపంలోని గడ్గెరా లాంటి గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి వ్యవసాయ భూములన్నీ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో తరచు ఏనుగుల మంద వారి పంటలపై దాడిచేసి విధ్వంసం సృష్టించేవి. మనుషులను కూడా పొట్టనపెట్టుకునేవి. ఏనుగుల దాడుల్లో ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఏటా 25 నుంచి 30 మంది మరణిస్తున్నారు. మనుషుల ప్రతీకార దాడుల్లో ఏటా దాదాపు 100 ఏనుగులు మరణిస్తున్నారుు. అయితే ఏనుగులను చంపాల్సిన అవసరం లేకుండా, వాటి చేతుల్లో చావకుండా ఎన్నో సులభమైన మార్గాలను వన్యప్రాణి సంరక్షణ అధికారులు సిద్దూ తెగ గిరిజనులకు సూచించారు. ఏనుగులను పరమ శత్రువులుగా భావిస్తున్న ఆ గిరిజనులు ఏనుగులు తమకు కనిపిస్తే చాలు, ప్రాణం పోరుునా వాటిని చంపేస్తామని తీర్మానించుకున్నారు. ముందుగా వారి ఆలోచనల్లో మార్పు తీసుకొస్తే తప్ప వారి వైఖరిలో మార్పు రాదని భావించిన అధికారులు ‘ఐరావత్’ పేరిట ఓ పథకాన్ని చేపట్టారు. అందుకు సిద్దూ తెగకు చెందిన మహిళలను ఎంపిక చేసుకున్నారు. వారికి రుమాలు నుంచి తువ్వాలువరకు దుస్తులపై ఏనుగు బొమ్మలను అల్లడం. వాటిపై ఏనుగుల ఆకారంలో పూసలను గుచ్చడం, ఏనుగు బొమ్మలతో కీచైన్లు తయారు చేయడం, కారు అద్దాల ముందు వేలాడేసుకొనే ఏనుగు బొమ్మలను తయారు చేయడం లాంటి చేతికళలను నేర్పించారు. వాటి తయారీకి ముడిసరుకులను సరఫరా చేశారు. తయారు చేసిన వస్తువుల కు మార్కెట్ కూడా చూపించారు. ఆ గిరిజన మహిళలకు గిట్టుబాటు అవుతోంది. వారంతా స్వయంపోషక బృందాలుగా ఏర్పాటి ముడి సరకులు కొనుగోలు నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ వారే చూసుకుంటున్నారు. తమకు ఇంత ఆదాయాన్ని తీసుకొస్తున్న ఏనుగుపట్ల వారికి ఆరాధ్యభావం ఏర్పడింది. వారి భర్తల వైఖరి కూడా మారిపోరుుంది. అధికారులు సూచించిన ప్రకారం వారు ఏనుగులు పొలాల వద్దకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమ ఐడియా ఫలించినందుకు అధికారుల ఆనందానికి అంతులేకుండా పోయింది. -
ఆ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
• రూ.9,900 కోట్లు రాబట్టాలి... • టెలికం మంత్రికి జస్టిస్ బీసీ పటేల్ లేఖ న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు ఇంటర్కనెక్షన్ కల్పించకుండా లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా కింద రూ.9,900 కోట్లు వసూలు చేయాలని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీసీ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హాకు లేఖ రాశారు. ఆపరేటర్ల చర్యలు స్పష్టంగా నిబంధనల ఉల్లంఘనేనని జస్టిస్ పటేల్ అన్నారు. ఈ విషయంలో టెలికం శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని అవి తమ చర్యల ద్వారా కల్పించాయని, ఒక్కో ఆపరేటర్‌పై విడివిడిగా రూ.3,300 కోట్ల చొప్పున జరిమానా విధించాలని కోరారు. ఈ అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసి చూడగా వినియోగదారుడి వ్యతిరేక, పోటీ వ్యతిరేక చర్యలను ఆపరేటర్లు అనుసరించినట్టు తెలుస్తోందని, వీటికి వెంటనే అడ్డుకట్ట వేయాలన్నారు. కస్టమర్ల పోర్టబిలిటీ దరఖాస్తులను సైతం సరైన కారణం లేకుండా తోసిపుచ్చాయన్నారు. ఇందుకు సంబంధించి మీడియా కథనాలను ఆయన ఉదహరించారు. న్యాయ చింతన కలిగిన ఈ దేశ పౌరుడిగా తాను ఈ పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండిపోదలచుకోలేదని.. ఈ మూడు టెలికం ఆపరేటర్ల చర్యలు చట్ట వ్యతిరేకమని, లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించాయని జస్టిస్ పటేల్ లేఖలో పేర్కొన్నారు. సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించాలని టెలికం శాఖను కోరారు. కాల్ డ్రాప్స్ డేటా బహిర్గతం రిలయన్స్ జియో కాల్ డ్రాప్స్ డేటాను తన వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. తన నెట్వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తగినన్ని ఇంటర్కనెక్షన్ పాయింట్లను ఇవ్వడం లేదంటూ జియో మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ అంశంపై ట్రాయ్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇది నిజమేనని ట్రాయ్ పరిశీలనలోనూ తేలింది. ఈ నేపథ్యంలో జియో సెప్టెంబర్ 22వ తేదికి సంబంధించి కాల్డ్రాప్స్ డేటాను వెబ్సైట్లో ఉంచింది. ఈ ఒక్కరోజే 15 కోట్ల కాల్స్‌కు గాను 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయినట్టు పేర్కొంది. 6.13 కోట్ల కాల్స్ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు వెళ్లే ప్రయత్నంలో 4.8 కోట్ల కాల్స్ (78.4 శాతం) ఫెయిల్ అయ్యాయి. వొడాఫోన్ నెట్‌వర్క్‌కు 4.69 కోట్ల కాల్స్‌కు గాను 3.95 కోట్ల కాల్స్ (84.1 శాతం) ఫెయిల్ అయ్యాయి. ఐడియా నెట్‌వర్క్‌కు వెళ్లే 4.39 కోట్ల కాల్స్‌లో 3.36 కోట్ల కాల్స్ విఫలం అయినట్టు ఈ డేటా ఆధారంగా జియో తెలిపింది. -
‘జియో’ ముడి వీడిందా!!
• ఇంటర్ కనెక్షన్ వివాదంపై ఎవరి వాదన వారిదే • ట్రాయ్ భేటీకి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా హాజరు • సేవలు దెబ్బతినకుండా సమస్య పరిష్కరించుకోవాలన్న ట్రాయ్ • సీఓఏఐ ప్రతినిధులకు రాని పిలుపు; ఇది జియో పనే: మాథ్యూస్ న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, ప్రస్తుత టెలికం కంపెనీల మధ్య పోరు తారస్థాయికి చేరింది. ప్రధానంగా మొబైల్ నెట్వర్క్ ఇంటర్కనెక్షన్ విషయంలో తలెత్తిన వివాదాన్ని చర్చించేందుకు నియంత్రణ సంస్థ ట్రాయ్ శుక్రవారం సమావేశం నిర్వహించింది. దీనికి జియోతో పాటు దిగ్గజ టెల్కోలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా ప్రతినిధులు హాజరయ్యారు. మొబైల్ వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో నాణ్యత దెబ్బతినకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ ట్రాయ్ కార్యదర్శి సుధీర్ గుప్తా టెల్కోలకు సూచించినట్లు సమాచారం. అయితే, ఈ భేటీకి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏఐ) ప్రతినిధులను ట్రాయ్ ఆహ్వానించకపోవడం గమనార్హం. సమావేశంలో కంపెనీల ప్రతినిధులు ట్రాయ్‌కి తమతమ వాదనలను వినిపించారు. మరోపక్క, ఆపరేటర్లు జియోతో విడివిడిగా సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించినట్లు సీఓఏఐ పేర్కొంది. జియోకు తగిన ఇంటర్‌కనెక్టివిటీ సామర్థ్యం పెంచడానికి ప్రస్తుత టెల్కోలు సంప్రదింపులు జరుపుతాయని.. అయితే, ఒప్పందం ప్రకారం జియో విజ్ఞప్తి చేసిన 90 రోజుల్లో ఈ చర్యలకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. న్యాయం కోసం పోరాటం: జియో దాదాపు గంటపాటు జరిగిన భేటీ అనంతరం జియో బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా విలేకరులతో మాట్లాడారు. ‘మా మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్స్‌ను తమ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడానికి సరిపడా పోర్ట్స్ ఆఫ్ ఇంటర్‌కనెక్ట్(పీఓఐ) పరికరాలను ప్రస్తుత టెల్కోలు అందుబాటులో ఉంచడం లేదని ట్రాయ్‌కు తెలిపాం. దీనివల్ల జియో కస్టమర్లు కాల్‌డ్రాప్ సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించాం. ఇక ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సింది ట్రాయ్ అధికారులే. అయితే, ఇందుకు నిర్ధిష్ట కాల వ్యవధిని ట్రాయ్ సమావేశంలో సూచించలేదు. కస్టమర్ల తరఫున మేం న్యాయం కోసమే పోరాడుతున్నాం’ అని పేర్కొన్నారు. అసాధారణ విషయం: సీఓఏఐ తాజా భేటీకి తమను ఆహ్వానించకపోవడం అసాధారణమైన విషయమని, జియో ఒత్తిడి కారణంగానే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్.మాథ్యూస్ ఆరోపించారు. ఈ ఆరోపణలను నహతా ఖండించారు. మరోపక్క, సీఓఏఐ ఆరోపణలకు ట్రాయ్ కూడా తీవ్రంగా స్పందించింది. జియో ఒత్తిడి కారణంగానే సీఓఏఐ ప్రతినిధులను సమావేశానికి పిలవలేదంటూ డెరైక్టర్ జనరల్ చేసిన ప్రకటన నిరాధార, హానికరమైనదిగా పేర్కొంది. దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ సీఓఏఐ చైర్మన్ గోపాల్ విట్టల్‌కు ట్రాయ్ లేఖ రాసింది. ఉచిత ‘ట్రాఫిక్’ సునామీని అడ్డుకోండి: ఎయిర్టెల్ రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లపై ఎయిర్టెల్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘‘ఇష్టానుసారంగా ఇస్తున్న ఉచిత కాల్స్ ట్రాఫిక్ సునామీతో ఇతర కంపెనీల నెట్‌వర్క్‌లకు విఘాతం కలుగుతుంది. అలా జరగకుండా జియోను నిలువరించాలని ట్రాయ్‌ను కోరాం. ఇందుకు ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీల (ఐయూసీ) అస్త్రాన్ని ట్రాయ్ న్యాయబద్ధంగా ఉపయోగిస్తుందని భావిస్తున్నాం. జియోకు తగిన ఇంటర్‌కనెక్షన్‌ను కల్పించటంపై నిర్మాణాత్మక చర్చలకు ఆస్కారం కల్పించినందుకు ట్రాయ్‌కు కృతజ్ఞతలు. కాకుంటే నిబంధనల ప్రకారం ఐయూసీ ప్రైసింగ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత ట్రాయ్‌కి ఉంది. బాధ్యతగల టెలికం కంపెనీగా ఇతర ఆపరేటర్లకు తగిన ఇంటర్‌కనెక్టివిటీని కల్పించడంలో మేమెప్పుడూ నిబంధనలు, లెసైన్స్ షరతుల మేరకే నడుచుకుంటాం. జియో పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమైతే ట్రాఫిక్ సమతౌల్యం మెరుగుపడుతుంది. అప్పటివరకూ జియోతో ఒప్పందం మేరకు తగినన్ని పీఓఐల ఏర్పాటుకు మేం చర్యలు తీసుకుంటాం’’ అని ఎయిర్టెల్ వివరించింది. వివాదం ఇదీ... ఒక టెలికం కంపెనీకి చెందిన కస్టమర్ మరో టెలికం కంపెనీకి చెందిన కస్టమర్‌కు కాల్ చేయటమనేది సాధారణం. ఉదాహరణకు ఎయిర్టెల్ కస్టమరు ఐడియా కస్టమర్‌కు ఫోన్ చేయటం వంటిదన్నమాట. ఇలా కాల్ చేసినపుడు నెట్‌వర్క్‌ను అనుసంధానించాలి కనక ఇంటర్కనెక్షన్ అవసరం. నిబంధనల ప్రకారం టెల్కోలు పరస్పర అవగాహన ఒప్పందం ప్రకారం ఈ సదుపాయాన్ని కల్పించాలి. దీనిపై ఏదైనా వివాదం తలెత్తితే ట్రాయ్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాగా, ఈ నెల 5 నుంచి 4జీ సేవలను ప్రారంభించిన జియో... డిసెంబర్ 31 వరకూ వాయిస్, డేటా అన్నీ ఉచితంగా అందిస్తామని ప్రకటించడం తెలిసిందే. పూర్తిస్థాయి వాణిజ్య సేవలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. అప్పటి నుంచీ టారిఫ్‌లను వసూలు చేస్తామని వెల్లడిం చింది. అయితే ప్రస్తుతం తమ సర్వీసులను అడ్డుకోవడానికి ప్రస్తుత టెల్కోలు కావాలనే కుట్రపూరితంగా ఇంటర్‌కనెక్షన్‌ను సరిపడా ఇవ్వడం లేదని.. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని జియో చెబుతోంది. కాకపోతే జియో ఇష్టానుసారంగా ఉచిత సేవలను అందించడవల్ల వచ్చే కాల్స్ సునామీకి సరిపడా ఇంటర్‌కనెక్షన్‌ను అందించలేకపోతున్నట్లు అవి చెబుతున్నాయి. దీంతో వివాదం తీవ్రతరమైంది. ఇప్పుడున్న టెల్కోల తరఫున పోరాడుతున్న సీఓఏఐ... ట్రాయ్తోపాటు ప్రధాని కార్యాలయానికి కూడా లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రాయ్ సమావేశం నిర్వహించింది. కాగా, ప్రస్తుతం అందిస్తున్నవి వాణిజ్య సేవలా కాదా అనేది స్పష్టత ఇవ్వాలని.. ఒకవేళ వాణిజ్య సేవలయితే 90 రోజులకు మించి ఉచిత సర్వీసులనివ్వడం కుదరదనేది టెల్కోల వాదన. -
ప్రముఖ టెల్కోలకు ట్రాయ్ ఆదేశాలు
జియో వార్ లోఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ప్రధాన టెలికాం ఆపరేటర్లకు మొట్టికాయలేసింది. చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా భారతి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లతో పాటు రిలయన్స్ ఇన్ఫో కాం అధికారులను కోరింది. ఈ పోరుపై శుక్రవారం సమావేశంలో చర్చించాలని కోరింది. ఈ పోరుపై శుక్రవారం సమావేశంలో చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా భారతి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లతో పాటు రిలయన్స్ ఇన్ఫో కాం అధికారులను కోరింది. మరోవైపు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో భాగమైన జీఎస్ఎం టెల్కోస్ లోని ఎయిర్ టెల్ ,ఐడియా, వోడాఫోన్ తో పాటు జియో కూడా ఇతర టెల్కోలను పిలిని మాట్లాడాల్సిందిగా ఒక లేఖ రాశాయి. వారు కూడా ఈ అసోసియేషన్ లో భాగమని జియో ఆఫర్లతో హోరెత్తించిన ముకేష్ ప్రకటన నేపథ్యంలో ప్రధాన ఆపరేట్లర్లయిన ఎయిర్ టెల్, ఐడియా,వోడాఫోన్ జియో మధ్య వివాదం నిలకొంది. పరస్పర ఆరోపణలతో ఇరువర్గాలు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాంను ఆశ్రయించాయి. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన డాట్ టెలికాం రెగ్యులేటర్ వద్ద పరిష్కరించుకోవాల్సిందిగా తెలిపింది. దీంతో ట్రాయ్ ఈ ఆదేశాలిచ్చింది. మరోవైపు జియో కాల్ నెట్వర్క్ లో కస్టమర్లకు తలెత్తిన సమస్యను అతిత్వరలో తీరుస్తామని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ హామీ ఇచ్చారు. కొత్తగా ప్రవేశపెట్టిన జీయోతో అవతలి నెట్ వర్క్ కు కాల్స్ వెళ్లకపోవడంపై ఆయన స్పందించారు. రెండుమూడు వారాల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. టెక్నికల్ (ట్రాఫిక్ భారం)గా ఏలాంటి సమస్యలున్నా కస్టమర్లకు మాత్రం ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమదేనని ముకేష్ మీడియాకు చెప్పారు. రూ.1.5లక్షకోట్ల భారీ వ్యయంతో ప్రారంభించిన అతిపెద్ద స్టార్టప్ జీయోనేనని తెలిపిన ముకేష్ దీనికి తనకు ఆరేళ్లు పట్టిందన్నారు. ...తాము రాత్రికి రాత్రి లాభాలు ఆశించడం లేదని స్పష్టం చేశారు. సోదరుడు అంబానీ రియలన్స్ కమ్యూనికేషన్స్ తో ప్రస్తుతం తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఇబ్బందలు ఉండవని, వ్యక్తిగతంగా తమ మధ్య అనుబంధం బలంగా ఉందని తెలిపారు. అయితే వ్యాపారంలో ఎవరి వ్యూహాలు వారివేనని తెలిపారు. కాగా జియో ఆఫర్ల సంచలనంతో అనేక అనుమానాలు వినియోగదారులను వెంటాడుతుండగా, జియో కమర్షియల్ లాంచింగ్ నాలుగు రోజుల ముందు ఈ సమావేశం జరగనుండటం విశేషం. -
వొడాఫోన్, ఐడియా మెగా మెర్జర్?
న్యూఢిల్లీ: దేశ టెలికం రంగంలో భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.! అగ్రగామి కంపెనీలు ఐడియా సెల్యులర్, వొడాఫోన్ విలీనానికి ఉన్న అవకాశాలపై ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదే నిజమైతే ఐడియా, వొడాఫోన్ విలీనంతో మార్కెట్ పరంగా దేశ టెలికం రంగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భవించనుంది. ఒకపక్క సేవల పరంగా టెలికం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నడుస్తుండగా... మరోవైపు రిలయన్స్ జియో అత్యంత వేగంతో కూడిన 4జీ సేవలను అతి తక్కువ ధరలకే అందించడం ద్వారా మార్కెట్‌ను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో తాజా విలీన వార్తలు రావడం ఆసక్తికి దారితీసింది. విలీనానికి అడ్డంకులు... వొడాఫోన్ ఐపీవోకు రావాలని గత కొంత కాలంగా ఆలోచన చేస్తోంది. ఈ సంస్థ విలువ 11 బిలియన్ డాలర్లుగా ఉంటుందని... ఐడియా సెల్యులర్ విలువ 5 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. రెండు కంపెనీలు విలీనమైతే సంయుక్త సంస్థ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది. ఐడియా సెల్యులర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉండడంతో వొడాఫోన్ ఐపీఓకు రావాల్సిన అవసరం తప్పుతుంది. అయితే, సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా కొన్ని సర్కిళ్లలో 50 శాతానికి మించనుండడంతో నియంత్రణపరమైన అనుమతులు కష్టతరం కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. వొడాఫోన్ గతంలో టాటా టెలీసర్వీసెస్ వంటి ఇతర సంస్థలతోనూ విలీనంపై చర్చలు సాగించినా కార్యరూపం దాల్చలేదు. కాగా, తాజా విలీన వార్తలపై స్పందించేందుకు వొడాఫోన్ నిరాకరించగా... ఐడియా మాత్రం ఆధార రహితం, తప్పుడు కథనంగా పేర్కొంది. మూడు సంస్థల వద్దే మూడొంతుల వాటా 2015-16 ఆర్థిక సంవత్సరాంతానికి భారతీ ఎయిర్టెల్ 31.7 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. వొడాఫోన్ 22.7 శాతం, ఐడియా 20.2 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ మూడు సంస్థల చేతుల్లోనే 74.6 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా టాటా టెలీ, ఎయిర్‌సెల్, టెలినార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తదితర సంస్థలు పంచుకున్నాయి. -
ఐడియా మరో బంపర్ ఆఫర్...
న్యూఢిల్లీః ఐడియా నెట్వర్క్ వినియోగదారులకు వారంలోనే వరుసగా రెండోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న 4జి, 3జి మొబైట్ ఇంటర్నెట్ ప్యాక్ ధరలపై 67 శాతం తగ్గింపును ప్రకటించింది. తన పోటీదారులు భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తో పోల్చితే భారీగా తగ్గింపును ఐడియా ప్రకటించింది. రెండు రోజుల క్రితం 1జిబి కన్నా తక్కువ ప్యాక్స్ పై ధరలో 45 శాతం తగ్గింపు విధిస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ... తాజాగా అత్యధికంగా ఇంటర్నెట్ వాడే 2జిబి నుంచి 10 జిబి ప్యాక్స్ కలిగిన వినియోగదారులకు 67 శాతం ధరలు తగ్గిస్తున్నట్లు ఐడియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్ 3జి, 4జి కస్టమర్లకోసం భారతి ఎయిర్ టెల్ 67 శాతం ధరలు తగ్గించడంతో.. ఐడియా ఒకే వారంలో రెండోసారి ధరల తగ్గింపును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐడియా 10 జిబి 4జి, 3జి ఇంటర్నెట్ ప్యాక్స్ ను కేవలం 990 రూయాయలకే అందిస్తోంది. అలాగే ఇంతకు ముందు 449 రూపాయలుండే 2జిబి డేటాను 349 రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుత 67 శాతం భారీ తగ్గింపులతో ఐడియా కస్టమర్లు ఇంతకు ముందు 3జి డేటా ధరలకు దగ్గరగా 5జిబి 4జి, 3జి డేటా ప్యాక్ లకు 649 రూపాయలకే పొందే అవకాశం లభిస్తోంది. ఈ నూతన టారిఫ్ ను ప్రీ పెయిడ్ వినియోగదారులు 4జి, 3జి ప్రొవైడర్లద్వారా వెంటనే పొందవచ్చని ఐడియా వెల్లడించింది. రిలయన్స్ జియో అతి తక్కువ రేటుకు ఇంటర్నెట్ ప్యాక్స్ ను అందిస్తుండటంతో మిగిలిన అన్ని టెలికాం కంపెనీలు ధరలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఐడియా ఆఫర్ అదుర్స్
న్యూఢిల్లీ : టెలికాం సెక్టార్ లో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు మిగతా టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న హ్యాపీ అవర్స్ డేటాతో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ వినియోగదారుల ముందుకు రాగా.. ఇపుడు ఆ కోవలోకి మరో టెలికాం దిగ్గజం ఐడియా కూడా చేరిపోయింది. డేటా ప్యాక్ రేట్లలో 45శాతం కోత విధిస్తున్నట్టు ఐడియా సెల్యులార్ శుక్రవారం ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉన్న ఐడియా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్టు తెలిపింది. జీయో దీటుగా....తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు ఐడియా ఈ సేవలను ఆవిష్కరించింది. 175 మిలియన్ యూజర్లు కలిగి ఉన్న ఐడియా సెల్యులార్, తన 4జీ, 3జీ, 2జీ యూజర్లకు 1జీబీ డేటాలో 45 శాతం డేటా రాయితీని అందించనుంది. ఇప్పటివరకూ మూడు రోజుల 75ఎంబీ డేటాకు రూ.19 లు చార్జ్ చేసేవారు. అయితే ఈ 45శాతం ఆఫర్ కింద అదే చార్జ్ మీద 110ఎంబీ డేటాను ఇకనుంచి కస్టమర్లు పొందుతారు. అదేవిధంగా 4జీ/3జీ డేటా ప్యాక్ లో రూ.22లకు 65ఎంబీ డేటాను మూడు రోజుల పాటు వినియోగదారులు పొందేవారు. ప్రస్తుతం ..90ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. దీంతో 38శాతం ఎక్కువ డేటా సౌకర్యాన్ని కస్టమర్లకు అందుతాయి. రూ.8 నుంచి రూ.225 ల మధ్య విస్తృతమైన సాచెట్ డేటా ప్యాక్స్ ను కూడా ఐడియా ప్రకటించింది. ఈ డేటా ప్యాక్ ఆఫర్లు అన్ని సర్కిల్స్ లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఐడియా తెలిపింది. గురువారమే ఎయిర్ టెల్ కూడా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డేటాలో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డేటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారీగా పతనమైన టెలికాం షేర్లు
ముంబై : టెలికాం స్కాం ఎఫెక్ట్ తో మొబైల్ ఆపరేటర్ల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. టెలికాం శాఖ త్వరలో ఆరుగురు టెలికాం ఆపరేటర్లకు రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్ జారీచేయనుందని నేపథ్యంలో నాలుగు మేజర్ టెలికాం షేర్లు శుక్రవారం ట్రేడింగ్ లో భారీగా పతనమయ్యాయి. ఐడియా సెల్యులార్ 2.86 శాతం నష్టంతో రూ.101.90 వద్ద, భారతీ ఎయిర్ టెల్ షేర్లు 2.3శాతం నష్టంతో రూ.355 వద్ద, రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు 3.15 శాతం నష్టంతో రూ.50.80 వద్ద, టాటా టెలి సర్వీసు షేర్లు 3.75 శాతం నష్టంతో రూ.6.93 వద్ద ముగిశాయి. ఈ షేర్ల పతనంతో సెన్సెక్స్ 0.3శాతం కిందకు నమోదైంది. కేంద్రంలో రూ.45వేల కోట్లకు పైగా టెలికాం కుంభకోణం చోటు చేసుకుందని.. కాగ్ బయటపెట్టిన ఈ కుంభకోణంతో ప్రమేయమున్న ఆరు ప్రముఖ టెలికాం సంస్థలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం తెరవెనుక చర్యలు చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘తాజా భారీ టెలికాం కుంభకోణం విలువ రూ. 45,000 కోట్లకు పై మాటే. దానిని మోదీ సర్కారు చాప కింద దాచేస్తోంది’’ అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. భారతి ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్, ఐడియా, టాటా, ఎయిర్‌సెల్ టెలికాం సంస్థలు ఈ స్కాంకు పాల్పడినట్టు ఆరోపణలు గుప్పించారు. దానివల్ల.. ప్రభుత్వానికి రావాల్సిన రూ.12,488.93 కోట్ల మొత్తం రాలేదని కాగ్ పేర్కొనట్టు తెలిపారు. దీనికి జరిమానాలు, ఇతర చార్జీలు అదనం. ఆయా టెలికాం సంస్థల వ్యాపారం, వినియోగదారుల పరిధి, ఆదాయం గణనీయంగా పెరిగినా కూడా - కాగ్ లెక్కించిన ప్రాతిపదికనే ఆయా సంస్థల నిర్వాకం వల్ల 2010-11 నుంచి 2015-16 వరకూ ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని లెక్కిస్తే.. ఆ మొత్తం రూ. 45,000 కోట్లకు పైగా ఉంటుందని ఆరోపించారు. మరోవైపు 2006-2010 మధ్య దాదాపు రూ.46,000 కోట్ల మేర తక్కువ ఆదాయం చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొన్న ఆరు కంపెనీలకు ఈ మేరకు నోటీసులు జరీ చేయనున్నట్లు టెలికం మంత్రిత్వశాఖలో ఒక అధికారి తెలిపారు. -
కస్టమర్లకు ఐడియా షాక్!
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఐడియా నెట్ వర్క్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్స్ ప్రాబ్లమ్ తో సతమవుతున్నారు. ఒక్కో సమయంలో కనీసం బీప్ కూడా అవకుండానే ఫోన్ కాల్స్ తొలి డయల్ కే కట్ అయిపోతున్నాయి. దీంతో తమ ఫోన్లకు సమస్యలు ఏర్పడ్డాయా.. లేక నెట్ వర్క్కా అని తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. మొత్తం నగరమంతటా కూడా శనివారం ఉదయం ఇదే సమస్య తలెత్తింది. ఇప్పటికే పలువురు అసలు తమ ఐడియా నెట్ వర్క్ పనిచేయడం లేదని, సిగ్నల్స్ రావడం లేదని చెబుతున్నారు. దీనిపై సదరు నెట్ వర్క్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కొంతమంది వినియోగదారులు మాత్రం సిగ్నల్స్ వచ్చి వెంటనే పోతున్నాయని, కాల్స్ కూడా వెంటవెంటనే కట్ అయిపోతున్నాయని చెబుతున్నారు. -
'బేటీ బచావో' ఐడియా కేంద్రానిది కాదు.. నాది!
ఉదయ్ పూర్: దేశంలో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు, ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పించాలని ప్రారంభించిన 'బేటీ బచావో బేటీ పడావో' పథకం టైటిల్ తనదని, కేంద్రం తన అనుమతి లేకుండా దాన్ని ఉపయోగించుకుంటోందని ఓ మహిళా పోలీసు ఆరోపించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కేంద్రానికి ఈ టైటిల్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఉదయ్ పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చేతన భాతి తెలిపారు. ఆర్టీఐ ఇచ్చిన వివరాలు సంతృప్తికరంగా లేవని, అందుకే ఈ విషయంపై ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో' టైటిల్ తన క్రియేటివిటీ అని, తనను టైటిల్ రూపకర్తగా గుర్తించాలంటూ లేఖలో రాసినట్లు వివరించారు. చరిత్ర, ఇంగ్లీష్ లలో పీజీ పూర్తిచేసిన భాతి మొదట్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం మీద ఆసక్తితో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 20ఏళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. 1999లో తొలిసారి 'బేటీ బచావో బేటీ పడావో'ను పొయెట్రీకి వాడానని, ఆ తర్వాత 2005లో ఓ కార్యక్రమంలో చెప్పినట్లు ఆమె తెలిపారు. పబ్లిసిటీ కోసమో, డబ్బు కోసమో ఈ పని చేయడం లేదని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలకు పంపిన ఆర్టీఐ సమాధానాలు సరిగా లేవని చెప్పారు. బాలికల సంరక్షణ, అబార్షన్లపై తాను కొన్ని రచనలు చేశానని, రాష్ట్రంలో బాలికల సంరక్షణకు సంబంధించి కొన్ని పోస్టర్లను తయారుచేసి 2002లో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు మెయిల్ కూడా చేశానని, కానీ వాటికి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. ప్రధానమంత్రి తన వినతిని పరిశీలించి సమాధానం ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో దేశంలో తగ్గిపోతున్న బాలికల సంఖ్యను పెంచేందుకు 'బేటీ బచావో బేటీ పడావో' పథకాన్ని హర్యానాలో ప్రారంభించారు. -
ఐడియా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉంటున్న యూజర్లను ఆకట్టుకోవడానికి ఐడియా సెల్యులార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. "ఇంటర్నెట్ ఫర్ ఆల్" అనే ఆవిష్కరణతో ఇంటర్నెట్ వాడని యూజర్ల ముందుకు వచ్చింది. ఐడియా ప్రీపైడ్ కస్టమర్లు, రిటైలర్లకు నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. *756# కు డయల్ లేదా ఐఎఫ్ఏ అని 56756కు మెసేజ్ పంపినా ఈ సర్వీసు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఇతర యాక్సస్ లకు ఓ టూల్ లా వాడుతున్న ఇంటర్నెట్ గురించి యూజర్లు తెలుసుకునేలా ప్రోత్సహించడంలో ఈ ఆవిష్కరణ ఎంతో ఉపకరిస్తుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇంటర్నెట్ సేవలు వినియోగం పెంచడానికి ఇది దోహదంచేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఇంటర్నెట్ లో కనెక్టు కాని స్నేహితుల, కుటుంబసభ్యులకు, ఇంటర్నెట్ యూజర్లు ఈ సర్వీసులను పరిచయం చేస్తారని వెల్లడించారు. దీంతో వారి జీవితాలను కొత్తపథంలో నడుస్తాయన్నారు. ఇంటర్నెట్ వరల్డ్ గూటికిందకు తన కస్టమర్లలందరినీ చేర్చాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. నాన్ ఇంటర్నెట్ యూజర్లు ఎలా ఈ ఉచిత డేటా సర్వీసులను అందిపుచ్చుకోవాలో పిరియాడిక్ గా యూజర్లకు సమాచారం పంపుతుంటామని ఐడియా చెప్పింది. -
ఐడియా, రిలయన్స్ డేటా యూజర్లకు న్యూ స్కీమ్స్
న్యూఢిల్లీ : కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించే లక్ష్యంతో, రెండు అతిపెద్ద టెలికాం సర్వీసు ప్రొవైడర్లు కొత్త స్కీమ్ లను ప్రవేశపెట్టాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ తన 3జీ, 2జీ నెట్ వర్క్ ప్రీ పెయిడ్ కస్టమర్ల కోసం డేటా లోన్ సర్వీసును ఆవిష్కరించగా... ఐడియా సెల్యులార్ రాత్రిపూట నెట్ వాడుకునే యూజర్లకు 4జీ, 3జీ డేటా ధరలను 50శాతం తగ్గించనుందని ప్రకటించింది. డేటా యూజర్లకు ఈ స్కీమ్ లు ఎంతో సహకరించనున్నట్టు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. డేటా లోన్ సర్వీసు ద్వారా తక్కువ డేటా ఉన్న ప్రీఫైడ్ కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి, వెంటనే 60ఎమ్ బీ వరకూ డేటా లోన్ పొందవచ్చని రిలయన్స్ కమ్యూనికేషన్ తెలిపింది. రిలయన్స్ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లకు డేటా సర్వీసులు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, ఏ సమయంలో కూడా (రాత్రిపూట కూడా) డేటా సర్వీసులకు ఆటంకం వాటిల్లకుండా ఉంటుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుర్ దీప్ సింగ్ తెలిపారు. ఐడియా ప్రకటించిన స్కీమ్ ద్వారా నెలకు రూ.125 కే 1జీబీ డేటాను రాత్రిపూట అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల మామూలు ధరల కంటే తక్కువగా 50శాతం పొదుపు చేసుకోవచ్చని ఐడియా సెల్యులార్ తెలిపింది. అదేవిధంగా డే అండ్ నైట్ ట్విన్ ప్యాక్ నూ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా నెలకు 500 ఎమ్ బీ డేటా నుంచి 40జీబీ డేటా రీఛార్జ్ వరకూ 30శాతం డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించింది. -
పేదల కూలర్ బహు బాగు!
బంగ్లాదేశ్ : చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. జీవితాలేమో కానీ ఓ చిన్న ఐడియా పైసా ఖర్చు లేకుండా గుడిసెలకు కూలర్లను తీసుకొచ్చింది. బంగ్లాదేశ్‌లో వేసవితాపాన్ని తీర్చింది. ‘గే ఢాకా’, ‘గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్’ సంస్థలు అభివృద్ధి చేసిన ఎకో కూలర్ కరెంట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకునేందుకు మీ ఇంటి కిటికీ సైజుండే కార్డ్‌బోర్డు అట్ట, ప్లాస్టిక్ సీసాలు ఉంటే చాలు చల్లచల్లని కూలర్ రెడీ! అయితే దీని పనితీరు తెలుసుకోవాలంటే మీరు చిన్న ప్రయోగం చేయాల్సి ఉంటుంది. మీ చేతిని నోటికి కొంత దూరంలో నోరు తెరిచి గట్టిగా గాలి ఊదండి.. వెచ్చటి గాలి మీ చేతులను తాకుతుంది కదా..? సరే ఇప్పుడు పెదవులను గుండ్రంగా చుట్టి ఇంకోసారి ఊదండి.. తేడా తెలిసిందా.. గాలి కొంచెం చల్లగా మారడం గమనించారా.. ఎకో కూలర్ కూడా పనిచేసేది ఇలాగే. ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి రంధ్రాలు చేసిన కార్డ్‌బోర్డుకు బిగిస్తే చాలు. ఇంటి లోపలకి వచ్చే గాలి ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. చిన్న మార్గాల గుండా ప్రయాణించేందుకు గాలి పీడనానికి లోనవుతుంది. ఈ క్రమంలో గాలి ఉష్ణోగ్రత కూడా తగ్గి చల్లబడుతుంది. భలే ఐడియా కదూ..! -
కూలీల 'కూల్' ఐడియా అదుర్స్
ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పట్టణ ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. చెట్లు లేవుకాబట్టి! ఇక ఊళ్లలో చెట్లున్నా ఉక్కపోత సమస్య. వడదెబ్బకు గురై చనిపోతున్నవారిలో కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకునేవారి సంఖ్యే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఎండ తీవ్రతను అధిగమించేందుకు కేరళలోని కొందరు కూలీలు అమలుచేసిన ఐడియా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాసరగోడ్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో బావి తవ్వేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కూలీలు.. పంకాను ఏర్పాటుచేసుకుని పనికానిస్తున్నారు. భూ ఉపరితలం కంటే లోతుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని తెలిసిందే. ఆ వేడిగాలిని బయటికి పంపి, బయటి గాలిని లోపలికి నెట్టే ఫ్యాన్ సాయంతో పనిచేయగలుగుతున్నామని చెబుతున్నారు కూలీలు. హీట్ ను బీట్ చెయ్యడానికి భలే ఐడియా కదా ఇది! మారణహోమం సృష్టిస్తూ ఇప్పటికే దాదాపు 1000 మంది తెలుగువాళ్లను పొట్టన పెట్టుకుంది మాయదారి ఎండ. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరం కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినాసరే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉపశమన చర్యలు చేపట్టేదిశగా అడుగులు వేయట్లేదు! అటు కర్ణాటకలోనైతే ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీఅయింది. కేరళ, తమిళనాడులలోనైతే భానుడిప్రతాపానికి తోడు 'ఎన్నికల' రాజకీయవేడీ జనాన్ని అతలాకుతలం చేస్తోంది. -
300 పట్టణాల్లో తొలిసారిగా ఐడియా 4జీ
♦ జూన్ నాటికి మరో 100 కేంద్రాల్లో ♦ ఐడియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ రజత్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులార్ 4జీ సేవల రంగంలో భారీ ప్రణాళికలు వేస్తోంది. దేశవ్యాప్తంగా 100 రోజుల్లో 10 సర్కిళ్ల పరిధిలోని 575 పట్టణాల్లో కంపెనీ 4జీ సేవల్ని ఆరంభించింది. ఇందులో 300 కేంద్రాల్లో తొలిసారి 4జీ సర్వీసులను పరిచయం చేస్తున్నది ఐడియానే కావటం గమనార్హం. మూడు నెలల్లో మరో 100 పట్టణాల్లో మొదటిసారిగా ఐడియా 4జీ సేవలను ఆరంభించవచ్చని అంచనా వేస్తున్నట్టు కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల ప్రధాన అధికారి రజత్ ముఖర్జీ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీవోవో టి.జి.బి.రామకృష్ణతో కలిసి గురువారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 121 పట్టణాలకుగాను 102 చోట్ల మొదటిసారిగా 4జీ సర్వీసులను తామే ప్రారంభించామని చెప్పారు. జూన్ నాటికి మొత్తం 750 పట్టణాలకు 4జీని విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం. ధర ఒక్కటే కాదు.. ఐడియా 10 సర్కిళ్లలో 14,500కుపైగా 4జీ టవర్లను నెలకొల్పింది. ఇందులో 2,250 సైట్లు ఒక్క ఏపీ సర్కిల్లోనే ఉన్నాయి. 4జీ మొబైల్ కస్టమర్ల సంఖ్యను బట్టి ఒక్కో పట్టణంలో సేవలను విస్తరిస్తున్నట్టు రజత్ తెలిపారు. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే చార్జీలు ఒక అంశం మాత్రమేనని అన్నారు. అనుభూతి, కంటెంట్, కవరేజ్ తదితర అంశాలూ కీలకమేనన్నారు. ఈ ఏడాది చివరికల్లా హ్యాండ్సెట్లు రూ.4 వేల నుంచి లభించడం ఖాయమన్నారు. ఇక కంపెనీకి నాన్ వాయిస్ ఆదాయం 2014లో 15 శాతం ఉంటే, ఏడాదిలోనే ఇది 20 శాతానికి చేరింది. 2016లో నాన్ వాయిస్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని కంపెనీ భావిస్తోంది. డేటా వినియోగం అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని చెబుతోంది. -
మిర్రర్ అండ్ ఎర్రర్!
హ్యూమర్ మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ అండ్ కో అనే అద్దాల కంపెనీలోని ఉద్యోగులంతా కొత్త బిజినెస్ ఐడియా కోసం మేధోమథనం చేస్తున్నారు. అద్దాలన్నీ రొటీన్‌గా ఉంటు న్నాయి. కొత్తరకం అద్దం ఏదైనా తయారు చేద్దామన్నది ఆ మీటింగ్ ఉద్దేశం. అంతలో ఓనర్‌కు తటాలున ఒక ఐడియా తట్టింది. దాన్ని ప్రకటించగానే మిగతా భాగస్వాములంతా సంతోషంగా ఆమోదించారు. ‘‘నువ్వు వెంటనే ఆ ఫార్ములా ఏమిటో తెలుసుకొని ఆ తరహా అద్దాలు తయారు చెయ్. ఇక పిచ్చి సేల్స్. బ్లాకులో అమ్మినా అమ్ముతారు’’ అని ఆదేశించాడు కంపెనీ ఓనర్. వెంటనే రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ వాళ్లను పిలిపించారు. అందులో ఒక చీఫ్ సైంటిస్టుకూ ఆ ఐడియా విపరీతంగా నచ్చింది. ‘‘భలే వచ్చింది సార్ మీకు ఐడియా. ఈ ఐడియాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా?’’ అడిగాడు సైంటిస్ట్. ‘‘ఏమీ లేదయ్యా. రాత్రి మాయా బజార్ సినిమా చూశా. అందులోని పాత్ర ధారులంతా ఒక అద్దంలోకి చూస్తుంటారు కదా. మన టీవీలాంటిదే కదా ఆ అద్దం అనిపించింది మొదట్లో. కానీ తర్వాత గబుక్కున ఒక ఐడియా వచ్చింది. ఆ సినిమాలో ఉన్న తరహా మిర్రర్స్ చేసి అమ్మాం అనుకో.. సావిత్రికి ఏఎన్నార్ కనిపించినట్టు... దానిలోకి చూసిన వాళ్లందరికీ వాళ్ల లవర్స కనిపిస్తారని చెప్పామనుకో... ఇక అందరూ దాని కోసం ఎగబడతారు. ఓల్డేజి వాళ్లూ తమ లవర్స్ ఎవరో చూసుకోడానికి ఉవ్వి ళ్లూరుతారు. ‘వాలెంటైన్స్ డే’ నాడు ఈ ‘లవర్స్ మిర్రర్స్’ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తే సందర్భానికి తగినట్లుగా కూడా ఉంటుంది’’ అన్నాడు మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ యజమాని సంతోషంగా. ‘‘చాలా బాగుంటుంది సార్. అసలు ఐడియా వినడానికే ఎక్సైటింగ్‌గా ఉంది. అంతెందుకు, నా లవర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది సార్’’ అన్నాడు అప్పుడే చేరిన యంగ్ అప్రెంటిస్ ఒకడు. ‘‘ఈ బిజినెస్ ఐడియా సూపర్‌గా ఉంది సార్. మారేజ్ బ్యూరోలూ, మ్యాట్రి మోనియల్ కంపెనీలకూ అమ్మవచ్చు. నిజానికి మనం అమ్మాల్సిన అవసరం లేదు సార్. తమ దగ్గర ఇలాంటి సదు పాయం ఉందనీ, సంబంధాలు వెతకడం అంతా షార్ట్‌కట్‌లో అయిపోతుందని వాళ్లంతా మనకు బోలెడు ఆర్డర్స్ ఇస్తారు’’ అన్నాడు బిజినెస్ డెవెలప్మెంట్ వింగ్ అధికారి. ‘‘అవున్సార్. మన టీవీ యాడ్స్‌లో ఈ క్లిప్పింగ్నూ చూపిద్దాం. ‘శశిరేఖకు అభిమన్యుడు, మరి మీకు ఎవరు...?’ అనేది మన టీవీ యాడ్ క్యాంపెయినింగ్ క్యాప్షన్. యూత్‌ను ఆక ర్షించే పవర్ఫుల్ స్లోగన్స్ కూడా తయారు చేద్దాం’’ అన్నాడు క్రియేటివ్ డెరైక్టర్. ‘‘నిజమే సార్. బ్రాండ్ అబాసిడర్స్గా స్టార్సని తీసుకోవాలి. మీరు చెప్పిన మాయాబజార్లోని శ్రీకృష్ణుడినే తీసుకుంటే దిగులే లేదు. పైగా ఆయన తనను లవ్ చేసిన రుక్మిణిని చేసుకున్నాడు. సొంత చెల్లెలు సుభద్ర అర్జునుడిని లవ్ చేస్తే వాళ్లకి పెళ్లి చేశాడు. అన్న కూతురు శశిరేఖ, చెల్లెలి కొడుకు అభిమన్యుడిని లవ్ చేస్తే అదీ సక్సెస్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా చూసే కద్సార్ మీకు ఈ ఐడియా వచ్చింది’’ అన్నాడు మరో సబార్డినేట్. ‘‘వాట్ యాన్ ఐడియా సర్జీ’’ అన్నాడు మరో ఉద్యోగి. ‘‘ఇదంత వర్కవుట్ కాదనుకుంటా సర్’’ ఆ సంతోషపు మూడ్స్ చెడగొడుతూ మూల నుంచి ఒక గొంతు వినిపించింది. ‘‘ఏం మాట్లాడుతున్నారండీ...’’ అంటూ ఒక్కసారే అరిచారంతా. బాస్ ఐడియాను మెచ్చుకోని వాళ్లంతా మూకుమ్మడిగా ఆ గొంతు తాలూకు ఓనర్ ఎవరా అని ఆ వైపునకు తిరిగారు. అందరూ అవుననే దాన్ని ఎవడైతే కాదంటాడో వాడే రాంబాబు. ‘‘అయినా ఎంత ధైర్యం... ఇంత సేలబుల్ ఐడియాను బాస్ చెబితే కాదం టారా? పైగా అంత క్రియేటివ్ ఫ్యాంటసీ అద్దాన్ని రియల్‌గా తయారు చేయ బోతుంటే... తయారు కాకముందే ఆ అద్దాన్ని బద్దలు కొడు తున్నారా? హౌ శాడ్’’ అంటూ నిట్టూర్చారు ఒకరిద్దరు. ‘‘అవున్సార్. ఇది ఫ్యాంటసీ రియాలిటీ అయినా... అది అందు బాటులోకి రాకముందే ప్రొడక్ట్ చచ్చి పోతుంది సార్. ఇందులో పెద్ద ఆలో చించాల్సిందేమీ లేదు, చిన్న లాజిక్.’’ ‘‘మీకు మాత్రమే తెలిసిన ఆ లాజిక్ ఏమిటో?’’ వ్యంగ్యంగా అడిగాడు ఓనర్. ‘‘ఏమీ లేదు సార్. మీరు మీ లవర్ ఎవరో అందులో చూస్తారు. మీ ఆవిడ అదే మిర్రర్‌లోకి చూసినప్పుడు... ఇంకెవడో గానీ కనపడితే ఏముంద్సార్. కాపురం కొలాప్స్. అదే ఈ మిర్రర్‌లోని ఎర్రర్’’ అన్నాడు రాంబాబు. - యాసీన్ -
ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్
హ్యూమర్ ప్లస్ ‘‘నేనొక బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాన్రా’’ అన్నాడు మా రాంబాబు గాడు. ‘‘ఏంట్రా అదీ’’ అడిగాను. ‘‘ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్’’ అని చెప్పాడు. ‘‘ఏం ఎగుమతి చేస్తావు. ఏమేమి దిగుమతి చేసుకుంటావ్’’ అని అడిగాను. చెప్పాడు. అంతేకాదు... వాడి బిజినెస్ ఐడియాకి బ్యాక్గ్రౌండునూ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నౌ ద ఫ్లాష్‌బ్యాక్ బిగిన్స్: ఒక ఆనవాలు : మా రాంబాబు గాడు చదువులో పెద్ద క్లవరేమీ కాదు. అయితే వాడికి మాసార్లూ, మాస్టార్లూ టిక్కు పెట్టి ఇచ్చిన కొన్ని ఐఎంపీ ప్రశ్న-జవాబులు మాత్రం వచ్చు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైమ్‌లో వాడికి వచ్చిన ఆన్సర్లలో ఒకటి నాకు చూపించాడు. రానే వచ్చింది రిజల్ట్స్ టైమ్! వాడు అత్తెసరు మార్కులతో పాస్. నాకు ఫస్ట్ క్లాస్. మరో తార్కాణం : డిగ్రీ అయ్యాక గ్రూప్-ఒన్ రిటెన్ టెస్ట్ రాయడానికి హైదరాబాద్ వెళ్లాలి. ప్రయాణంలో తోడు కోసం వాడు రంగారావు గాడితోనూ అప్లై చేయించాడు. రంగా విన్నయ్యాడు. మా రాంబాబు సేఫ్‌గా రిటర్న్ అయ్యాడు. అంతేకాదు... గవర్నమెంట్ జాబ్ వచ్చిన కొన్నాళ్లకే మా రాంబాబుగాడు రహస్యంగా ప్రేమించే పిల్ల వాళ్ల నాన్న కూడా... సదరు అమ్మాయిని రంగారావుగాడికే ఇచ్చి పెళ్లి చేశాడు. దాంతో రాంబాబుగాడు రహస్యంగా దేవదాసు వేషాలు వేసుకుంటూ, మనసులోనే శాలువా కప్పుకుంటూ, ఊహల్లోనే కుయ్ కుయ్ అనే కుక్కపిల్లల ఒళ్లు నిమురుతూ, బయటకు మాత్రం రయ్ రయ్ మంటూ తిరుగుతూ ఉండేవాడు. ఇంకో దృష్టాంతం : ఏదో కొనడానికి వెళ్తూ వెళ్తూ రాంబాబు గాడు నన్ను తోడుతీసుకెళ్లాడు. షాపింగ్ అంటే బోరురా అని నేను మొత్తుకుంటున్నా వాడు విన్లేదు. తీరా వెళ్లాక అక్కడ నాకు అవసరమైందేదో కనిపించి కొన్నాను. రెండ్రోజుల తర్వాత షాపు వాళ్లు నిర్వహించిన లక్కీడిప్‌లో నాకు ఇరవైనాలుగించుల టీవీ బహుమతిగా వచ్చింది. అదే రోజు రాంబాబు గాడి టీవీ రిపేరుకు వచ్చింది. వాడి మతిపోయింది. ఈ వరస సంఘటనల తర్వాత రాంబాబు మాకో ఫిలాసఫీ బోధిస్తూ ఉండేవాడు. ‘‘ఒరేయ్... మామిడికాయ్ పచ్చడి పెట్టిన కొత్తలో ఆ ముక్క తింటే కొత్తకారం వల్ల నోరు పొక్కిపోయేది. అందుకే మా అమ్మ ఒక పని చేసేది. కాయను కడిగిచ్చేది. కడిగితే కారం పోతుంది. కానీ ఆ ముక్కలోని పులుపెక్కడికి పోతుందీ! నా దురదృష్టపు బలుపెక్కడికి పోతుంది!!’’ అంటూ నవ్వేసేవాడు. బ్యాక్ టు ఫ్యూచర్ : రాంబాబు గాడి ఫ్లాష్బ్యాక్కూ వాడి బిజినెస్ ఐడియాకూ సంబంధం ఏమిటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? తన ఫ్యూచర్ బాగుండాలనుకునేవాడు మావాడితో ఫ్రెండ్షిప్ చేయవచ్చట. అందుకు నిర్ణీత రుసుం చెల్లించాలట. అలా తమ దురదృష్టాన్ని రాంబాబుగాడికి అంటగట్టేసి, తమ అదృష్టాలకు అంటు కట్టేసుకోవచ్చట. దురదృష్ట-అదృష్టాల ఈ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు బిజినెస్‌కు... వాడో ట్యాగ్‌లైన్‌నూ రెడీ చేశాడు. అది... ‘అదృష్టం అమ్మబడునూ... దురదృష్టం కొనబడును’ అట! - యాసీన్ -
చౌదరికి ఐడియా లేదు..
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘చౌదరి గారు (కేంద్రమంత్రి సుజనా చౌదరి) ఐడియా లేకుండా మాట్లాడుతున్నారు.. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు.. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే.. నేను ప్రధాని పిలుపుకోసం చూస్తున్నా.. ఆయనతో అన్నీ మాట్లాడుతా’’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో ‘కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తీరు, పార్టీల వైఖరి, పార్లమెంటులో ఆమోదం’ అనే అంశాలపై వివరణ పత్రం-2ను సీఎం విడుదల చేశారు. అన్ని పార్టీలూ ఏపీకి ప్రత్యేక హోదాకోసం అడుగుతుంటే కేంద్రమంత్రి సుజనాచౌదరి నెలాఖరులోగా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చెప్పిన విషయంపై మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంను ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు బదులిస్తూ చౌదరి గారికి ఐడియా లేక అలా మాట్లాడారని బదులిచ్చారేతప్ప.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? లేదా? అన్నవిషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల విభజన చేసినా ఎటువంటి ఇబ్బందులు రాలేదని సీఎం అన్నారు. కానీ యూపీఏ హయాం లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. తమిళనాడు ప్రయోజనాలకోసం అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం, మహారాష్ట్ర ప్రయోజనాలకోసం నాటి హోంమంత్రి షిండే, కొడుకును ప్రధానిని చేయాలని సోనియా విభజన ప్రక్రియకు కొమ్ముకాశారని ఆయన ఆరోపిం చారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీఎంతో మైక్రోసాఫ్ట్ ఎండీ భేటీ మైక్రోసాఫ్ట్ ఎండీ అనిల్ బన్సారీ శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు తోడ్పడాలని సీఎంను కోరారు. రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ హబ్‌లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ అకాంక్షకు అనుగుణంగా సేవలు అందిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ‘వైట్‌స్పేసెస్’ వినియోగంలోలేని టీవీ స్పెక్ట్రంను ఉపయోగించి తక్కువధరకే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ‘వైట్‌స్పేసెస్’ ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్ సంస్థ శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సామాన్యులకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటన సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాలపై ప్రధానిమోదీతో పాటు పలువురు మంత్రులను కలసి చర్చించడంతో పాటు వినతిపత్రాలను సమర్పించనున్నారు.ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఇటీవలే ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో ధర్నా ద్వారా చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.