మార్కెట్లో దూసుకెళ్తున్న టెలికాం దిగ్గజాలు
టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్లు గురువారం ట్రేడింగ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్లు గురువారం ట్రేడింగ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. మార్నింగ్ ట్రేడింగ్లో టెలికాం సర్వీసు ప్రొవైడర్ షేర్లు 11 శాతం మేర పైకి దూసుకెళ్లాయి. పోస్టు టెలినార్ డీల్ అనంతరం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ గా పేరున్న భారతీ ఎయిర్ టెల్ 52 వారాల గరిష్టంలో 11 శాతం పైకి ఎగిసి, రూ.397 వద్ద ట్రేడైంది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడంతో షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. ఈ కొనుగోలు ఒప్పందంతో ఏడు సర్కిళ్లలో టెలికాం ఇండియా ఆపరేషన్లు ఇక ఎయిర్ టెల్ సొంతం కానున్నాయి.
1800 మెగాహెడ్జ్ బ్యాండ్లో అదనంగా 43.4 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ దీనికి లభించనుంది. ఉదయం 9.35 సమయంలో 7 శాతం పైకి ట్రేడయిన ఎయిర్ టెల్, తొలి 25 నిమిషాల్లో 11.28 మిలియన్ షేర్లు చేతులు మారడంతో మరింత పైకి ఎగిసింది. అదేవిధంగా ఐడియా సెల్యులార్ కూడా 6 శాతం పైకి జంప్ చేసి, రూ.120 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 5.31 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది..