
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగమైన మొబైల్ నెట్‌వర్క్ సేవలందిస్తున్న కంపెనీగా ‘భారతీ ఎయిర్‌టెల్’ నిలిచిందని స్పీడ్‌టెస్ట్ డేటా సేవలందించే సంస్థ ‘ఊక్లా’ ప్రకటించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు సేకరించిన సమాచారం ప్రకారం ఎయిర్‌టెల్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించింది. ఢిల్లీ పరిధిలో అత్యంత వేగమైన 4జీ మొబైల్ నెట్‌వర్క్‌గా వొడాఫోన్ నిలిచింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోవడంతో డేటా వేగం పెరిగినట్టు వెల్లడించింది.
గతనెల్లో రిలయన్స్ జియో నెట్‌వర్క్ చాలా నెమ్మదిగా ఉందని పేర్కొంది. అయితే, ఊక్లా నివేదిక ట్రాయ్ తాజాగా ప్రకటించిన సమాచారానికి విరుద్ధంగా ఉండడం విశేషం. బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రథమ స్థానంలో ఉండగా.. వేగం విషయంలో పోటీ కంపెనీలకు రెట్టింపు వేగంతో ఉందని ట్రాయ్ విశ్లేషణ కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది మే నెల నేంచి ఎయిర్‌టెల్, జియో డౌన్‌లోడ్ స్పీడ్ తగ్గిందని ‘ఊక్లా’ తెలిపింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోయిన తర్వాత ఈ మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారుల డౌన్‌లోడ్ స్పీడ్ పుంజుకుందని గణాంకాలతో వివరించింది. (చదవండి: ఇండియా, రిలయన్స్ రైజింగ్.. ఎవ్వరూ ఆపలేరు!)
Comments
Please login to add a commentAdd a comment