Vodafone
-
సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..
జియో, ఎయిర్టెల్ కంపెనీలు యూజర్లను ఆకర్షిస్తున్న వేళ.. 'వోడాఫోన్ ఐడియా' (VI) వినియోగదారుల కోసం ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 209 మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ అన్ని రకాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 209 రూపాయల ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా, రోజుకు 2జీబీ డేటా అందిస్తుంది. అంతే కాకుండా 300 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు రూ.199 ప్లాన్‌కు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.209 ప్లాన్‌లో కంపెనీ అపరిమిత కాలర్ ట్యూన్లను అందిస్తోంది. రూ. 209 ప్లాన్ కాకుండా.. కంపెనీ రూ. 218, రూ. 249, రూ. 289 ప్లాన్స్ కూడా అందిస్తోంది.రూ. 218 ప్లాన్కంపెనీ రూ.218 ప్లాన్ ద్వారా 1 నెల వాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో, మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 3జీబీ డేటాను పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ప్లాన్‌లో.. కంపెనీ అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. 300 ఎస్ఎమ్ఎస్ల పరిమితి ముగిసిన తర్వాత.. ఒక్కో లోకల్ ఎస్ఎమ్ఎస్ కోసం రూ.1, ఎస్టీడీ ఎస్ఎమ్ఎస్ కోసం రూ. 1.5 పైసలు చెల్లించాల్సి వస్తుంది.రూ. 249 ప్లాన్కంపెనీ అందించే.. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, ప్లాన్‌లో అందించే ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 100 ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. దీనితో పాటు, మీరు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు.రూ. 289 ప్లాన్ఈ ప్లాన్ ద్వారా మీరు 40 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. 4 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ఈ ప్లాన్ 600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండిమొబైల్ రీఛార్జ్ మరింత భారం అవుతుందా?రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది. -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త..అదనంగా
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ వీఐ నెట్ వర్క్ సబ్ స్క్రైబర్లు 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం అదనపు డేటాను అందిస్తోంది.ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ‘వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. 5జీ, 4జీ ఫోన్ వినియోగదారులందరికీ 130 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌ను ఎంచుకున్న యూజర్లకు మరో ఏడాది పాటు ఈ డేటాను పొందవచ్చని వీఐ పేర్కొంది. 13 వరుస సైకిళ్లకు ప్రతి 28వ రోజు ఆటోమేటిక్‌గా 10జీబీ జమ అవుతుందని కంపెనీ ఒక విడుదలలో తెలిపింది.ఈ సందర్భంగా వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ..దేశంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్ల వారి 4జీ/5జీ స్మార్ట్ ఫోన్ వినియోగం సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదని చెప్పారు. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా సంస్థలో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, క్లిప్‌లు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా స్పందించింది. స్టార్లింగ్ తమ కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రకటించింది. వాటా కొనుగోలుకు అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. సామాజికమధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మకూడదని చెప్పింది. ఏ సమాచారమైన అధికారిక వెబ్‌సైట్‌ల్లో సరిచేసుకోవాలని తెలిపింది. ఇదీ చదవండి: కొత్త కార్ల పరుగు దేశంలో తొలిసారి టెలికాం రంగంలో ప్రవేశించేందుకు స్టార్‌లింక్ వోడాఫోన్ ఐడియాతో జతకట్టవచ్చనే ప్రచారం వల్ల వీఐ షేర్లు ఇటీవల భారీగా ర్యాలీ అయ్యాయి. స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రభుత్వం వీఐలో తన 33.1 శాతం వాటాను మస్క్‌కు విక్రయించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. మస్క్ వచ్చే వారం వైబ్రెంట్ గుజరాత్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత్ రానున్న నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధ్యాన్యం సంతరించుకుంది. -
‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదనైతే లేదు’
నగదు కొరతతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టంచేసింది. వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నకు బుధవారం లోక్‌సభలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ తమ శాఖ వద్ద అలాంటి ఏ ప్రతిపాదన లేదని తెలిపారు. అయితే కంపెనీని ఆర్థికంగా ఆదుకునేందుకు మాత్రమే ఆ వాటాను తీసుకున్నామనీ స్పష్టం చేశారు. మేజర్ వాటా కేంద్రానిదే.. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.1 శాతం వాటా ఉంది. ఆ కంపెనీ టెలికం శాఖకు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ షేర్లుగా మార్చుకుంది. దీంతో ప్రభుత్వానికి ఆ వాటా సమకూరింది. ఇప్పుడు కంపెనీలో అతిపెద్ద వాటాదారు కేంద్ర ప్రభుత్వమే. భాగస్వామ్య సంస్థ బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 32.3 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 18.1 శాతం..రెండింటికీ కలిపి 50.4 శాతం వాటా ఉన్నది. మిగిలిన వాటా రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. వొడాఫోన్ చెల్లించాల్సిన మరో రూ.40,000 కోట్లకు నాలుగేళ్లపాటు మారటోరియం ఉంది. అయితే ఈ మొత్తాన్ని 2026 నుంచి కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బకాయిల్ని ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకుని వాటాను 70 శాతానికి పెంచుకుంటుందన్న అంచనాలున్నాయి. ఇదీ చదవండి: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..? ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎన్ఎన్ఎల్)పై అడిగిన ప్రశ్నకు చౌహాన్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 4జీ సేవలను ప్రారంభించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన 1,00,000 సైట్ల కోసం కొనుగోలు ప్రణాళికలు చేసిందని తెలిపారు. -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్
దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారత మార్కెట్లో 5జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. వొడాఫోన్ ఐడియా 5జీ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వొడాఫోన్ ఐడియా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఢిల్లీ, పూణేలోని నిర్దిష్ట ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే 'విఐ 5జీ రెడీ సిమ్' ఉపయోగించి కనెక్షన్ పొందవచ్చు అని పేర్కొంది. దేశంలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలకు ఊతం ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా ఆగస్టులో 26జీహెచ్, 3.3జీహెచ్‌జెడ్ బ్యాండ్లను ఉపయోగించి పూణేలో 5G సేవలను విజయవంతంగా పరీక్షించింది. గత ఏడాది జులైలో స్పెక్ట్రమ్ వేలం అయితే, గత ఏడాది జూలై నెలలో జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 17 టెలికం సర్కిళ్లను సొంతం చేసుకుంది. కానీ వాటిల్లో 15 సర్కిళ్లలో 5జీ నెట్వర్క్ని అందించలేమని ఆ సంస్థ సీఈవో అక్షయ్ మూంద్రా తెలిపారు. ఆసక్తికర పరిణామాలు ఈ నేపథ్యంలో ఇండియా ముబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఈవెంట్లో వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ.. దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు దశల వారీగా 4జీ, 5జీ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ తరుణంలో వొడాఫోన్ 5జీ సేవలు రానున్నాయనే నివేదికలతో టెలికం రంగంలో ఆసక్తిర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. -
జియో దెబ్బకు నష్టాల్లోకి వోడాఫోన్! ఏకంగా..
Reliance Jio: ఏప్రిల్ 2023లో టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో తన ఆధిపత్య స్థానాన్ని నిలుపుకోవడంలో 'రిలయన్స్ జియో' (Reliance Jio) ముందు వరుసలో నిలిచినట్లు 'టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో 2023 ఏప్రిల్ నెలలో కొత్తగా 3.04 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందగలిగింది. ఇదే సమయంలో భారతి ఎయిర్టెల్ (Bharti Airtel) 76,328 మంది వినియోగదారులను పొందినట్లు తెలిసింది. వోడాఫోన్ ఏకంగా 2.99 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. కాగా మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య మార్చి 2023లో 1,143.93 మిలియన్ల నుంచి ఏప్రిల్ 2023లో 1,143.13 మిలియన్లకు తగ్గింది. దీని ప్రకారం నెలవారీ క్షీణత రేటు 0.07 శాతం. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో సంఖ్య పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) టెలికామ్ రంగంలో ప్రైవేట్ హవా కొనసాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 90 శాతం వాటా వీరిదే ఉందని తెలుస్తోంది. ఒక్క రిలయన్స్ జియో వాటా 37.9 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఎయిర్టెల్ 32.4 శాతం, వోడాఫోన్ 20.4 శాతంలో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్ (BSNL), ఎమ్టీఎన్ఎల్ (MTNL) వాటా కేవలం 9.2 శాతం కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో మరింత తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
వొడాఫోన్‌లో ఉద్యోగుల తొలగింపు.. 11 వేల మందిపై వేటు!
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ లేఆఫ్స్ ప్రకటించింది. రానున్న 3 ఏళ్లలో 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్గరీటా డెల్లా వల్లే తెలిపారు. తమ సామర్ధ్యం తగినంతగా లేదని, నిరంతరం మెరుగైన సేవలు అందించే క్రమంలో వొడాఫోన్ విధిగా మారాలని డెలా వలె స్పష్టం చేశారు. ‘కస్టమర్లు, సరళత, వృద్ధి ఈ మూడు అంశాలే మా లక్ష్యం. వీటి ఆధారంగా మార్కెట్లో నెలకొన్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు సంస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతేకాదు కస్టమర్లకు నాణ్యమైన సేవల్ని అందించేలా వనరులను కేటాయిస్తూ మరింత వృద్ధి సాధిస్తామని మార్గరీటా డెల్లా ధీమా వ్యక్తం చేశారు. సంస్థ సైతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి నేపథ్యంలో వొడాఫోన్ ఈ నిర్ణయం తీసుకోవడం టెలికాం రంగానికి చెందిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా, గత ఏడాది వొడాఫోన్‌లో 104,000 మంది సిబ్బంది ఉండగా.. తాజాగా మొత్తం వర్క్ ఫోర్స్‌లో 10శాతానికి పైగా సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. చదవండి👉 అమెజాన్‌లో లేఆఫ్స్.. భారత్‌లో 500 మంది ఉద్యోగుల తొలగింపు! -
వొడాఫోన్ ఐడియాకి భారీ షాక్!
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీ షాక్ తగిలింది. ఫిబ్రవరి నెలలో వొడాఫోన్ ఐడియా 20 లక్షల మంది వినియోగదారులను చేజార్చుకున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలను రిలీజ్ చేసింది. అదే నెలలో జియోలోకి 10 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లోకి 9,82,554 మంది చేరినట్లు తెలిపింది. ఇక సబ్స్క్రైబర్ల పరంగా జియో 37.41శాతం వాటా కలిగి ఉండగా ఎయిర్ 32.39శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. 10లక్షల మంది కస్టమర్లను కోల్పోయినప్పటికీ వొడాఫోన్ ఐడియాకు మార్కెట్లో 20శాతం ఉంది. కాగా, టెలికాం విభాగంలో వొడాఫోన్ ఐడియా వెనకంజలో ఉండటమే కారణమని సమాచారం. ముఖ్యంగా ఆ సంస్థను అప్పులు బిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ కంపెనీకి రూ.2.2లక్షల కోట్ల వరకు అప్పులు ఉండగా, ఏజీఆర్ బకాయిల కింద దాదాపు రూ.16వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకుంది. టెలికాం నెట్ వర్క్‌లైన జియో, ఎయిర్టెల్ 5జీ సేవల్ని అందిస్తుండగా.. వొడాఫోన్ ఐడియాలు మాత్రం లేటెస్ట్ నెట్‌వర్క్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెరసీ యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. -
ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!
మనదేశంలో ప్రముఖ టెలికాం సర్వీసులైన జియో, ఎయిర్ టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పుట్టుకొస్తున్నాయి. 5జీ రంగంలో దూసుకెళ్తున్న కంపెనీలతో పోటీ పడటంలో వోడాఫోన్ ఐడియా కొంత వెనుకపడ్డాయి. ఈ కారణంగా ఈ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వోడాఫోన్, ఐడియా కొత్త ప్లాన్లు, ఆఫర్స్ తీసుకువచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువగా జియో సేవలకు ఆసక్తి చూపుతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించడానికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 5జీబీ డేటా ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఆఫర్ కింద రూ. 299తో గానీ అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఆఫర్ పొందవచ్చని వోడాఫోన్ ఐడియా ప్రకటించాయి. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న మూడు రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 199 నుంచి రూ. 299 మధ్య ఉన్న వివిధ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకున్న వారికి 2జీబీ డేటా ఫ్రీగా వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ డేటాతో మీరు వీఐ మూవీస్, టీవీ, వీఐ మ్యూజిక్, వీఐ గేమ్స్, ఆండ్రాయిడ్ గేమ్స్ మొదలైనవి వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఇటీవల రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్ తొలగించి, దీని ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ అందించింది. ఇందులో అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఓటీటీ బెనిఫీట్స్ వంటివి ఇందులో అందుబాటులో ఉండేవి, దీనికి ఆశించినంత ఆదరణ లేకపోవడం వల్ల సంస్థ దీనిని నిలిపివేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!
వోడాఫోన్ కస్టమర్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారతదేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వోడాఫోన్ సిద్ధమవుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా ఓ వార్తాచానెల్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ధ్రువీకరించారు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) వోడాఫోన్ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను వేగంగా కోల్పోతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. రాబోయే 5జీ సేవల కోసం వోడాఫోన్ మోటరోలా, షావోమీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం వోడాఫోన్ భారతదేశంలో 4జీ సేవలను మాత్రమే అందిస్తోంది. దేశంలో 5జీ సేవలను ఇప్పటివరకూ ప్రారంభించని ఏకైక టెలికాం కంపెనీ ఇదే. జియో, ఎయిర్టెల్ రెండూ ఇప్పటికే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారత్‌లో వోడాఫోన్ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ అది ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేది స్పష్టం చేయలేదు. దేశంలో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్, రిలయన్స్ జియోలకు వొడాఫోన్ ఐడియా క్రమంగా కస్టమర్లను కోల్పోతున్న క్రమంలో ఈ ప్రకటన వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి వోడాఫోన్ 42.4 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. 2022 డిసెంబర్ నాటికి 12 నెలల వ్యవధిలో 24.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్-బేస్ కోతను చవి చూసింది. (tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా రూ. 7,990 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 7,595.5 కోట్లు. అయితే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.10,620.6 కోట్లు కాగా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.10,614.6 కోట్లు. ఎయిర్టెల్, జియో 5జీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దూసుకెళ్తుంటే వోడాఫోన్ ఐడియా వెనుకబడి ఉంది. ఏది ఏమైనప్పటికీ త్వరలో 5జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు వోడాఫోన్ ఐడియా ప్రకటించడం వల్ల కోల్పోయిన కస్టమర్లను తిరిగి పొందడంలో కొంతైనా సహాయపడవచ్చు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
వొడాఫోన్ ఐడియా నష్టాలు అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో మొబైల్ టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర నష్టం పెరిగి రూ. 7,990 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,234 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతంపైగా బలపడి రూ. 10,621 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. రూ. 9,717 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో కంపెనీ రూ. 16,133 కోట్లమేర (స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై) చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం ఈక్విటీగా మారి్పడి చేసుకుంది. దీంతో వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం 33 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. మరోపక్క కంపెనీ బోర్డు ఏటీసీ ఇండియాకు రూ. 1,600 కోట్ల విలువైన అప్షనల్లీ కన్వరి్టబుల్ డిబెంచర్ల జారీకి ఆమోదించింది. కాగా, తాజా సమీక్షా కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 17 శాతంపైగా మెరుగై రూ. 135ను తాకింది. మొత్తం కస్టమర్ల సంఖ్య 23.44 కోట్ల(క్యూ2) నుంచి 22.86 కోట్లకు నీరసించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 7.70 వద్ద ముగిసింది. -
వొడా ఐడియాకు ఊరట.. ప్రభుత్వానికి మెజారిటీ వాటా!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కట్టాల్సిన రూ. 16,133 కోట్ల వడ్డీ బాకీలను ఈక్విటీ కింద మార్చుకునే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. స్పెక్ట్రం వాయిదాలు, సవరించిన స్థూల లాభాలపై కట్టాల్సినది (ఏజీఆర్) కలిపి ప్రభుత్వానికి వీఐఎల్ భారీగా బాకీ పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను వాటాగా కేటాయించింది. దీంతో రూ.10 షేర్ విలువతో రూ.16,133 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కేంద్రానికి బదిలీ చేసింది. తమ భాకీలను ఈక్విటీగా మార్చుకుంటే తమ సంస్థలో ప్రభుత్వానికి 33.14 శాతం వాటా లభించగలదని వీఐఎల్ గతంలో తెలిపింది. పలు కారణాలతో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే తాజాగా దీనికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ టెలికాం రంగంలో బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జియో దెబ్బకు ఈ రంగంలోని పలు టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బకాయిలు కూడా టెలికాం రంగం ఇబ్బందులను మరింత పెంచాయి. చదవండి: అదానీ గ్రూప్: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ -
దూసుకుపోతున్న జియో, ఎయిర్టెల్.. కొత్తగా ఎన్ని లక్షల కస్టమర్లంటే!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నవంబర్‌లో కొత్తగా 25 లక్షల మంది మొబైల్ కస్టమర్లను సొంతం చేసుకున్నాయి. వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది వినియోగదార్లను కోల్పోయింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. జియో నూతనంగా 14.26 లక్షల మందిని చేర్చుకుంది. దీంతో సంస్థ మొబైల్ చందాదార్ల సంఖ్య నవంబర్ చివరినాటికి 42.28 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ 10.56 లక్షల మంది కొత్త కస్టమర్ల చేరికతో మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 36.60 కోట్లను తాకింది. వొడాఫోన్ ఐడియా చందాదార్లు 24.37 కోట్లకు వచ్చి చేరారు. భారత్‌లో మొ త్తం మొబైల్ కనెక్షన్లు 114.3 కోట్లు ఉన్నాయి. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్!
ఎస్ఎంస్ల మోసాలను నివారించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS) సేవలకు సంబంధించి కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియాతో సహా టెలికాం ఆపరేటర్లను సిమ్ మార్పిడి లేదా అప్‌గ్రేడ్ ప్రక్రియలో ఎస్ఎంఎస్ (SMS) సౌకర్యాన్ని (ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రెండూ) నిలిపివేయాలని ఆదేశించింది. కొత్త SIM కార్డ్‌లను యాక్టివేట్ చేసిన తర్వాత 24 గంటల పాటు ఎస్ఎంఎస్ (SMS) సేవలు నిలిపివేయాలని సూచించింది. కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాయి.. కొత్త నిబంధన ప్రకారం, సిమ్ కార్డ్ లేదా నంబర్‌ను మార్చమని రిక్వెస్ట్ వచ్చిన తర్వాత, టెలికాం ఆపరేటర్లు కస్టమర్లకు అభ్యర్థనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా పంపాలి. సిమ్ కార్డ్ హోల్డర్ ఐవీఆర్ఎస్ ( IVRS ) కాల్ ద్వారా ఈ అభ్యర్థనను మరింత ధృవీకరించాలి. కస్టమర్ ఏదైనా సమయంలో సిమ్ కార్డ్ అప్‌గ్రేడ్ అభ్యర్థనను తిరస్కరిస్తే, వెంటనే దీన్ని నిలిపివేయాలి. సిమ్ స్విచ్ స్కామ్‌లు, ఇతర సంబంధిత సైబర్ నేరాలను తగ్గించేందుకు టెలికాం శాఖ ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి తెచ్చింది. వీటిని అమలు చేసేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది. చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్‌పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా! -
ఓటీటీ ప్రియుల కోసం వోడాఫోన్ చవకైన ప్లాన్.. రూ.151తో డేటా, 3 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
టెలికాం రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అదిరిపోయే ఆఫర్లతో పాటు ట్రెండ్‌ని కూడా ఫాలో అవుతూ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా ప్రజలు ఓటీటీలకు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేటగిరి కస్టమర్లను దృష్టిలో వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఓటీటీ( OTT) ప్రయోజనాలతో వస్తుంది. ఓటీటీ ప్రియుల కోసం ప్రత్యేక ప్లాన్.. ఓటీటీ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌లోని బెనిఫిట్స్‌పై ఓ లుక్కేద్దాం.. వీఐ కొత్త రూ.151 ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్‌ని ప్రకటించింది. ఈ చవకైన రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఇందులో ప్రధానంగా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు మొత్తం 8GB డేటాను కూడా పొందుతారు. అయితే ఈ రీచార్జ్ ప్లాన్‌పై కాలింగ్, ఉచితంగా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అధిక డేటాతో హాట్ స్టార్, డిస్నీ సబ్స్క్రిప్షన్ కోరుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పువచ్చు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
యూజర్లకు బంపరాఫర్: అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్.. ఫ్రీ,ఫ్రీ
గతంలో గ్రామాల్లో సంతలు జరిగేవి, అక్కడికి వెళ్లి మనకి నచ్చిన వస్తువుని కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుత రోజుల్లో అలాంటివి కనుమరుగైనా ఆ స్థానంలోకి ఆన్లైన్ షాపింగ్‌లు వచ్చాయి. అందులో ప్రధానంగా అమెజాన్ సంస్థ నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఒకటి. తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 జూలై 23, 24 తేదీల్లో జరగబోతోంది. అయితే ఇందులో అమెజాన్ ప్రైమ్ సభ్యులు మాత్రమే పాల్గొనాలి. వారికి అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఉచితంగా డెలివరీ, కొన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్, ప్రైమ్ వీడియో యాక్సెస్ లాంటి బెనిఫిట్స్ బోలెడు ఉంటాయి. ఇతరులు ఈ సేల్‌లో షాపింగ్ చేయాలంటే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తప్పక తీసుకోవాల్సిందే. అయితే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొందేందుకు ఆ సంస్థ మొబైల్ వినియోగదారులకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం మొబైల్‌ని రీచార్జ్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందేలా ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ని.. ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్ జియో నెట్వర్క్ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. అయితే అందులో కొన్ని సెలక్టడ్ ప్లాన్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని లింక్ చేశారు. ఈ రీచార్జ్‌లు చేసుకున్నవారికి నిబంధనల ప్రకారం ఉచిత సబ్స్క్రిప్షన్ వర్తిస్తుంది. అవేంటో చూద్దాం. ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే: Airtel Rs 359 postpaid plan: ఎయిర్టెల్ రూ.359 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే 28 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజుకు 2 జీబీ డేటీ వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ తరహాలోనే ఎయిర్టెల్ కస్టమర్లు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందేందుకు .. 499, 699, 999, 1199, 1599. Jio Rs 399 PostPaid Plan: జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. 75జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందేందుకు జియో ప్లాన్ జాబితా.. 599, 399, 1499, 799. Vi Rs 999 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నవారికి ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 220 డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఉచిత సబ్స్క్రిప్షన్ పొందేందుకు వొడాఫోన్ ప్లాన్ జాబితా..699, 1099, 499, 999, 1299,1699, 2299. -
ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్!
సాక్షి,హైదరాబాద్: టెలికాం రెగ్యులేటరీ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇదే నెలలో భారతీ ఎయిర్టెల్ 71,312 మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 78,423 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. జాతీయంగా, రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను సంపాదించి, భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా, దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది, దీంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్( BSNL ) వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది. చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
ఈ రంగానికి చెందిన ఉద్యోగులకు శుభవార్త,పెరగనున్న జీతాలు.. ఎంతంటే!
టెలికాం రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. త్వరలో టెలికాం సంస్థలు భారీ ఎత్తున శాలరీలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టైమ్స్ కథనం ప్రకారం...టెలికాం దిగ్గజాలైన రిలయన్స్,ఎయిటెల్,వొడాఫోన్ ఐడియా సంస్థలు వారి ఉద్యోగుల జీతాల్ని ఈ ఏడాదిలో 10నుంచి 12శాతం వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది.గతేడాది పెంచిన శాలరీ 7.5శాతంగా ఉండగా..ఈ ఏడాది అత్యధికంగా పెంచే యోచనలో ఉన్నాయని, పైన పేర్కొన్న మూడు టెలికాం సంస్థలు ఉద్యోగులకు కనీసం 8 నుంచి 12శాతం శాలరీ హైక్ చేయోచ్చని టైమ్స్ తన కథనంలో హైలెట్ చేసింది. జులైలో పెరగనున్నాయి టెలికాం కంపెనీలు జీతాలు పెంచుతున్నట్లు తమకు సమాచారం అందించాయని ఐటీ,ఐటీఈఎస్,మీడియా, గవర్నమెంట్ శాఖల్లో స్టాఫింగ్ సర్వీస్ సంస్థ టీం లీజ్ సర్వీస్ వెల్లడించింది. అంతేకాదు ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల జీతాలు పెంచామని,జులై నుంచి మిగిలిన వారి జీతాలు పెంచుతున్నామని టీం లీస్ సర్వీస్ బిజినెస్ హెడ్ దేవాల్ సింగ్ తెలిపారు. అప్డేట్ అవ్వాల్సిందే టెలికాం రంగంలో దేశ వ్యాప్తంగా 4మిలియన్ల మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే టెలికాం రంగంలో టక్నాలజీ అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఉద్యోగులు జీతాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరగనున్నట్లు టీం లీస్ సర్వీస్ పేర్కొంది. 5జీ సర్వీసుల వినియోగంతో మార్కెట్లో ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉందని, వారి ఎంపిక విషయంలో సైతం కంపెనీలు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. -
బధిరులకూ సంగీతానుభూతి...
ఫొటోలో ఉన్నవాళ్లు ఏదో సంగీతానికి అనుగుణంగా సంతోషంగా చిందులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు కదా! సంగీతం వింటూ సంతోషంగా చిందులు వేయడం మామూలే కదా అనుకుంటున్నారా? మామూలే అనుకోండి. కాని, ఈ ఫొటోలో కనిపిస్తున్న వాళ్లంతా బధిరులు. అయితే, వాళ్లు సంగీతానికి అనుగుణంగానే చిందులు వేస్తున్నారు. బధిరులు సంగీతానికి అనుగుణంగా చిందులు వేయడమేంటని అవాక్కవుతున్నారా? ఫొటోను జాగ్రత్తగా గమనించండి. వాళ్ల ఒంటిపై ముందువైపు కనిపిస్తున్న స్ట్రాప్స్ వెనక్కు వేలాడేలా భుజాన తగిలించుకున్న బ్యాగులవి కావు. ఇవి వాళ్లు తొడుక్కున్న ‘హాప్టిక్ సూట్’కు చెందినవి. చేతి మణికట్లకు, ఒంటికి అంటిపెట్టుకునేలా ఉండే ఈ స్ట్రాప్స్‌తో కూడిన సూట్‌ను ధరిస్తే, ఈ సూట్ సంగీతానికి అనుగుణమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. దాంతో బధిరులూ సంగీతాన్ని అనుభూతించగలరు. దీనిని ‘వోడాఫోన్’ కంపెనీ రూపొందించింది. -
పాపం వొడాఫోన్.. జెట్స్పీడ్తో జియో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది. దీంతో సంస్థ మొత్తం మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు ఎగసింది. ఎయిర్టెల్ ఖాతాలో నూతనంగా 8.1 లక్షల మంది చేరికతో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 36.11 కోట్లను తాకింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా 15.7 లక్షల మంది చందాదార్లను పోగొట్టుకుంది. ఈ సంస్థ మొత్తం సబ్‌స్కైబ్రర్లు 25.9 కోట్లకు వచ్చి చేరారు. ఇక అన్ని కంపెనీలవి కలిపి మొత్తం వైర్లెస్ చందాదార్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 114.3 కోట్లుగా ఉంది. కస్టమర్లు పట్టణాల్లో 0.07 శాతం తగ్గి, గ్రామాల్లో 0.20 శాతం పెరిగారు. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కొద్దిగా అధికమై 78.87 కోట్లకు చేరారు. చదవండి: బడ్జెట్ ధరలో రియల్మీ.. విడుదల ఎప్పుడంటే! -
ఎయిర్,జియో,వొడాఫోన్..అదిరిపోయే ప్లాన్లు ఇవే!
ఈ ఏడాది జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మరోసారి టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం పెరగనున్నాయని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. అందుకే ప్రస్తుతానికి, రోజువారీ ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్, లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాల్ని అందించే టారిఫ్ ధరల్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అయితే ఇప్పుడు మనం మూడు టెలికాం సంస్థల్లో ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వోడాఫోన్ ఐడియా వోడాఫోన్ ఐడియా రూ.400లోపు ప్లాన్లను అందిస్తుంది. ముఖ్యంగా రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 డేటా,అపరిమిత కాల్లు, రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, వారాంతపు డేటా రోల్ఓవర్, వీఐ సినిమాలు, ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్లు, రోజుకు 100ఎస్ఎంఎస్లను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. వారాంతపు డేటా రోల్ఓవర్, వీఐ సినిమాలు, టీవీని ఫ్రీగా యాక్సిస్ చేయోచ్చు. ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. రూ.399 ప్లాన్‌లో 28రోజుల వ్యాలిడిటీతో 3నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటాను పొందవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా,వారాంతపు డేటా రోల్ఓవర్, వీఐ సినిమాలు, టీవీని ఫ్రీగా యాక్సిస్ చేయోచ్చు. ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. ఎయిర్టెల్ 28రోజుల వ్యాలిడిటీతో ఎయిర్టెల్ రూ.399 ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత కాల్లు, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్స్క్రిప్షన్లను పొందవచ్చు. 28రోజుల వ్యాలిడిటీతో రూ. 359 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్‌లను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 319 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ పొందచ్చు. జియో 28రోజుల వ్యాలిడిటీతో రూ.299 ప్రీపెయిడ్ పెయిడ్ ప్లాన్. 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ పొందవచ్చు. రిలయన్స్ జియో 30 రోజుల వ్యాలిడిటీతో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. మీ రోజువారీ డేటా ముగిసిన తర్వాత, మీరు 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయోచ్చు. రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, రిలయన్స్ జియో ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. మీరు రోజుకు 100ఎస్ఎంఎస్, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. -
ఎయిర్టెల్, జియోకు కొత్త యూజర్లు
న్యూఢిల్లీ: టెలికం చందాదారులు 2021 నవంబర్ నాటికి 119.05 కోట్లకు చేరుకున్నారు. గతేడాది నవంబర్ నెలలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ నికరంగా కొత్త యూజర్లను సంపాదించుకోగా, వొడాఫోన్ ఐడియా యూజర్లను కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్ను వెనక్కి నెట్టి రిలయన్స్ జియో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల పరంగా మొదటి స్థానానికి చేరుకుంది. వైర్లెస్ కస్టమర్లు మొత్తం మీద దేశంలో 116.7 కోట్లుగా ఉన్నారు. టెలికం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) గతేడాది నవంబర్ నెల గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. ♦రిలయన్స్ జియో 20,19,362 మంది చందారులను నికరంగా చేర్చుకుంది. మొత్తం చందాదారుల సంఖ్య 42.8 కోట్లకు పెరిగింది. ♦ ఎయిర్టెల్ 13,18,251 మంది చందాదారులను సంపాదించుకుంది. మొత్తం చందాదారుల సంఖ్య 35.52 కోట్లుగా ఉంది. ఈ సంస్థ అక్టోబర్‌లో నికరంగా చందాదారులను నష్టపోవడం గమనార్హం. ♦వొడాఫోన్ ఐడియా 18,97,050 కస్టమర్లు కోల్పోయింది. ఈ సంస్థ మొత్తం చందాదారులు 26.7 కోట్లకు పరిమితమయ్యారు. ♦బీఎస్ఎన్ఎల్ 2,40,062 మంది మొబైల్ కస్టమర్లను కోల్పోయింది. ♦ఎంటీఎన్ఎల్ 4,318 కనెక్షన్లను నష్టపోయింది. ♦ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లు 2.35 కోట్లు పెరిగాయి. రిలయన్స్ జియో 2,07,114, ఎయిర్టెల్ 1,30,902 కనెక్షన్లను సంపాదించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 77,434 కనెక్షన్లను కోల్పోయింది. ♦బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య 80.16 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ చివరికి ఇది 79.89 కోట్లుగా నమోదైంది. -
'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది', పోటీపడుతున్న టెలికాం దిగ్గజాలు!
'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది' అంటూ దేశీయ టెలికాం దిగ్గజాలు యూజర్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే జియో' బ్రాండ్ బ్యాండ్ తన వినియోగదారులకు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తుంది. తాజాగా టెలికాం నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్‌ఐడియాకు పోటీగా కొన్నిప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా'లు ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను పెంచాయి.ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో కొన్ని అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఆయా కంపెనీల యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ప్రత్యేకంగా డిస్కౌంట్లను ప్రకటించాయి. ముఖ్యంగా యాప్ ద్వారా రీఛార్జ్ చేయించుకునే వినియోగదారులు కొంతమేర డబ్బును ఆదా చేసుకోవచ్చని టెలికాం కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా చాలా మంది వినియోగదారులు అపరిమిత కాల్లు, రోజుకు 100ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను పొందవచ్చు. 2జీబీ రోజువారీ డేటా, నెలవారీ, వార్షిక ప్లాన్లు ధరల పరంగా విభిన్నంగా ఉన్నాయి. ముందుగా ఎయిర్ టెల్ 2జీబీ నెలవారీ ప్లాన్లు vs వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ఎయిర్టెల్ 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో పాటు.. ఈ నాలుగు ప్లాన్లకు రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ల ధరలు వరుసగా రూ.359, రూ.549, రూ.839, రూ.2999 ఉన్నాయి. ఇక యాప్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.309కే వస్తుంది. దీంతో రూ.50 ఆదా అవుతుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అపరిమిత కాల్‌లను పొందవచ్చు. రోజువారీ డేటా ఎక్కువ పొందితే..వాటిపై ధరలు తక్కువగా ఉంటున్నాయి. ప్లాన్ల ధరలు పెరిగే కొద్ది ప్రయోజనాలు పెరుగుతున్నాయి. ►ఉదాహరణకు వినియోగదారులు సంవత్సరానికి ప్రతి నెల రూ.359 చెల్లిస్తున్నట్లయితే ఆమొత్తం రూ.4308 అవుతుంది. కానీ నేరుగా వార్షిక ప్లాన్‌కు సబ్స్క్రయిబ్ అయినప్పుడు ధర రూ.2999 అవుతుంది. దీని వల్ల వినియోగదారులకు రూ.1309 ఆదా చేసుకోవచ్చు. ►అలాగే వినియోగదారులు రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు నెలకు రూ. 250 ఖర్చవుతుంది. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ ప్యాక్ తో నెలకు ఖర్చు రూ.200 లోపు అవుతుందని ప్రచారం చేస్తుంది. జియో నెలకు 2జీబీ vs వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ►జియో 28రోజుల వ్యాలిడిటీతో రూ.299ప్లాన్‌లో భాగంగా 2జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్లు,రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ►రూ.533 ప్లాన్‌లో భాగంగా 56 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. ►84రోజుల వ్యాలిడిటీతో రూ.719 ప్లాన్‌ను అందిస్తుంది ►చివరిగా వార్షిక ప్లాన్ కింద రూ.2879తో సూపర్ వాల్యూ ప్లాన్‌ను అందిస్తుంది. మొత్తం డేటా ప్రయోజనాలు నెలవారీ ప్లాన్ కంటే ఎక్కువ, ప్లాన్ మొత్తం సంవత్సరం పాటు కొనసాగుతుంది. వొడాఫోన్ ఐడియా నెలకు 2జీబీ vs త్రైమాసిక ప్రీపెయిడ్ ప్లాన్లు వొడాఫోన్ ఐడియా 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఈ ప్లాన్ల ధరలు వరుసగా రూ.359, రూ.539, రూ.839. అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్,రోజుకు 100ఎస్ఎంఎస్లను పొందవచ్చు. వార్షిక ప్లాన్ లేదా 84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ రూ.279కి తగ్గింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 2జీబీ రోజువారీ డేటాను అందించే వార్షిక ప్లాన్లను అందించడం లేదు. అయితే, ఇది రూ.2899 ధరతో 1.5GB రోజువారీ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఎక్కువ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్లకు సబ్స్క్రయిబ్ చేసుకోవడం వల్ల యూజర్లకు డబ్బు ఆదా అవుతుంది. వార్షిక ప్లాన్లకు సబ్స్క్రయిబ్ చేసినట్లయితే, వారు పూర్తి సంవత్సరం వ్యాలిడిటీతో పాటు అదే డేటా, కాలింగ్ ప్రయోజనాలను పొందుతారని పై ప్లాన్లు చూపుతున్నాయి. చదవండి: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సేవలను ఉచితంగా ఇలా పొందండి..! -
"మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలతో సమానంగా ఎన్ఎఫ్టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్)కు భారీ ఆదరణ లభిస్తోంది. సినీ తారల నుంచి మొదలుకొని అగ్ర కంపెనీల వరకు ప్రత్యేకంగా ఎన్ఎఫ్టీ కలెక్షన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్ నెట్ వర్క్ దిగ్గజం వొడాఫోన్ ఎన్ఎఫ్టీ తీసుకొని వచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటి సారిగా 1992 డిసెంబరు 3న పంపిన "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వొడాఫోన్ వేలానికి ఉంచింది. పారిస్ ఆక్షన్ హౌస్‌లో 'నాన్ ఫంజిబుల్ టోకెన్స్'గా ఈ వారం ప్రారంభంలో ప్రపంచంలోని మొట్టమొదటి టెక్స్ట్ సందేశాన్ని 121,000 డాలర్ల(సుమారు రూ.90 లక్షలు)కు వొడాఫోన్ విక్రయించింది. 30 ఏళ్ల క్రితం(డిసెంబర్ 3, 1992న) వొడాఫోన్ కంపెనీలో ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్‌పై పనిచేసిన ఇంజినీర్ నీల్ పాప్‌వర్త్ తన మొదటి టెస్టింగ్ ఎస్ఎంఎస్ 'మెర్రీ క్రిస్మస్' సందేశాన్ని రిచార్డ్ జార్విస్(బిజినెస్‌మ్యాన్)కు పంపించారు. అతను తన 2 కిలోల ఆర్బిటెల్ పరికరంలో ఈ సందేశాన్ని అందుకున్నాడు. ఈ ఆర్బిటెల్ పరికరం డెస్క్ ఫోన్ తరహాలోనే ఉంటుంది. ఈ "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ- యుఎన్‌హెచ్‌సిఆర్‌కు యూఎన్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజికి విరాళంగా అందిస్తారు. ఈ వేలం తర్వాత ప్రపంచంలోని మొదటి ఎస్ఎంఎస్కు సంబంధించి ఎటువంటి ఎన్ఎఫ్టీని లేదా కాయిన్‌ను ఇష్యూ చేయబోమని వొడాఫోన్ ప్రకటించింది. (చదవండి: భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం! నాసా హెచ్చరిక) -
5జీ సేవలతో నెట్వర్క్.. భద్రతకు సవాళ్లు ?
న్యూఢిల్లీ: 5జీ సర్వీసులకు సంబంధించి నెట్వర్క్ భద్రత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతమున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సెన్సార్లు ఏవీ కూడా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2021 సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. ఈ నేపథ్యంలో 5జీని అందుబాటులోకి తేవడంలో సైబర్ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం, ఆపరేటర్లు అంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సింగ్ పేర్కొన్నారు. 5జీ సేవలను విజయవంతంగా అందుబాటులోకి తేవాలంటే స్పెక్ట్రం ధర సముచితంగా అవసరమన్నారు. చదవండి: జనవరిలో 5జీ ‘టెస్ట్‌బెడ్’ -
ఎయిర్టెల్.. ఏంటీ ఈ నిర్వాకం! ట్రాయ్‌కి ఫిర్యాదుల వెల్లువ
మొబైల్ ఆపరేటర్ సర్వీసుల్లో లోపాలకు సంబంధించి ఎయిర్టెల్ నెట్‌వర్క్‌పై అత్యధిక ఫిర్యాదులు అందినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. మంత్రి దేవుసింహ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాదికి సంబంధించి నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లపై దేశవ్యాప్తంగా ట్రాయ్‌కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఎయిర్‌టెల్‌పై 16,111 ఫిర్యాదులు వచ్చాయి. దీని తర్వాత స్థానంలో వోడాఫోన్ ఐడియాపై 14,487, రిలయన్స్ జియోపై 7,341 ఫిర్యాదులు ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్పై 2,913 కంప్లైంట్స్, ఎంఎన్‌టీఎల్‌పై 732 మంది ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. సాధారణంగా ట్రాయ్ స్వీకరించే ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఆయా నెట్‌వర్క్‌లకు ఫార్వార్డ్ చేస్తుందని మంత్రి తెలిపారు. అయితే ఫిర్యాదుకు సరైన స్పందన రాని ఎడల వినియోగదారులు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. -
వోడాఫోన్ వర్సెస్ జియో.. ఆ సర్వీసులపై ట్రాయ్ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే (పోర్టింగ్) యూజర్లకు టారిఫ్ వోచరు, ప్లాన్లతో సంబంధం లేకుండా ఎస్ఎంఎస్ సదుపాయాన్ని తక్షణం కల్పించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ యూజర్లు అందరికీ దీన్ని వర్తింపచేయాలని సూచించింది. పోర్టింగ్ కోసం నిర్దిష్ట కోడ్‌ను (యూపీసీ) పొందడానికి 1900కు ఎస్ఎంఎస్ పంపే వెసులుబాటు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్లు 1900కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ఫోన్‌కు వచ్చే కోడ్‌ను కొత్త ఆపరేటరుకు తెలియజేయడం ద్వారా నెట్వర్క్ మారవచ్చు. అయితే, ప్రస్తుతం కొన్ని టెల్కోలు పలు ప్లాన్లలో ఎస్ఎంఎస్ ప్యాకేజీలను అందించడం లేదు. దీంతో వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్ల ప్రీపెయిడ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఎస్ఎంఎస్ ప్యాకేజీ లేదన్న కారణంతో .. 1900 నంబరుకు పోర్టింగ్ రిక్వెస్ట్ పంపనివ్వకుండా మోకాలడ్డుతున్నాయి. ఎస్ఎంఎస్లు కావాలంటే మరింత అధిక టారిఫ్ ప్లాన్‌నో లేదా ప్రత్యేకంగా ప్యాకేజీనో ఎంచుకోవాల్సి వస్తోంది. టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్న కొత్త విధానంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విధానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కొత్త ప్లాన్లపై రిలయన్స్ జియో సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. వీఐఎల్ ఇటీవల 18–25% మేర టారిఫ్‌లు పెంచింది. కొత్త టారిఫ్‌ల ప్రకారం 28 రోజుల వేలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్ ప్లాన్ రేటును ఎస్ఎంఎస్ సర్వీసు లేకుండా రూ. 99కి పెంచేసింది. రూ. 179కి మిం చిన ప్లాన్లలోనే ఎస్ఎంఎస్ సర్వీసు అందిస్తోంది. చదవండి: ట్రాయ్ నిద్రపోతోందా? హీటెక్కిన బాయ్‌కాట్ ట్రెండ్ -
వేగం పెంచిన వోడాఫోన్.. 5జీ వేగం ఎంతంటే?
న్యూఢిల్లీ: 5జీ ట్రయల్స్‌లో భాగంగా వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌పై వేగం 9.85 జీబీపీఎస్ నమోదైందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా తెలిపింది. 80 గిగాహెట్జ్ స్పెక్ట్రంలో ఈ–బ్యాండ్ మైక్రోవేవ్‌ను వినియోగించి ఈ ఘనతను సాధించినట్టు వెల్లడించింది. ఫైబర్ కేబుల్స్ వేయలేని ప్రాంతాల్లో ఈ–బ్యాండ్ ద్వారా.. స్మాల్సెల్స్, మాక్రోసెల్స్ను అనుసంధానించడం ద్వారా ఫైబర్ స్థాయి వేగంతో 5జీ సేవలను అందించేందుకు వొడాఫోన్ ఐడియా ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కంపెనీ తెలిపింది. -
టెలికం కంపెనీలకు కేంద్రం భారీ ఊరట!
న్యూఢిల్లీ: దాదాపు రూ. 40,000 కోట్ల వసూళ్ల వివాదాలకు సంబంధించి టెలికం కంపెనీలపై దాఖలు చేసిన లీగల్ కేసులను ఉపసంహరించుకోవాలని టెలికం శాఖ (డాట్) యోచిస్తోంది. ఇందులో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై కేసు విషయంలో ప్రస్తుత అప్పీలును కొనసాగించాలా లేదా అన్న దానిపై తగు నిర్ణయం తీసుకునేందుకు అవకాశమివ్వాలంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెల్కోలు సంక్షోభంలో కూరుకుపోతే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తమకు విజ్ఞప్తి పంపిందని అఫిడవిట్లో డాట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పీళ్లపై ముందుకెళ్లే విషయాన్ని పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని వివరించింది. కేసు విచారణ సదర్భంగా ఇదే విషయాన్ని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవలసిందని సూచిస్తూ, కేసు విచారణను నవంబర్ 17కు ధర్మాసనం వాయిదా వేసింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వివిధ స్థాయుల్లో అప్పీళ్లపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని అఫిడవిట్లో పేర్కొంది. సముచిత నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి మూడు వారాల వ్యవధినివ్వాలని, కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం వివిధ టెలికం ఆపరేటర్ల నుంచి ఈ కేసుల ద్వారా ఖజానాకు సుమారు రూ. 40,000 కోట్లు రావాల్సి ఉంది. టెలికం రంగాన్ని ఆదుకునే దిశగా బకాయిలు, పెనాల్టీలు చెల్లించడానికి సమయమిస్తూ సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో టెల్కోలపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించే యోచన చేయడమనేది గత సమస్యలను సరిచేసే ప్రయత్నంలో భాగంగా చూడవచ్చని న్యాయసేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ సమీర్ చుగ్ అభిప్రాయపడ్డారు. -
వీఐలో వాటా అప్పగించేందుకు రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) లిమిటెడ్‌లో తమకున్న వాటాను ప్రభుత్వం లేదా ఏ ఇతర సంస్థకైనా అప్పగించేందుకు సంసిద్ధమంటూ కేఎం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. కంపెనీ కొనసాగింపునకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మేలు చేయగలదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ జూన్ 7న కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబాకు బిర్లా లేఖ రాశారు. వీఐఎల్‌లో బిర్లాకు 27 శాతం వాటా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం వీఐఎల్‌కున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు(లయబిలిటీ) రూ. 58,254 కోట్లుకాగా.. వీటిలో రూ. 7,854 కోట్లకుపైగా చెల్లించింది. సుప్రీం నో: ఏజీఆర్ మదింపులో దిద్దుబాట్లకోసం భారతీ ఎయిర్‌టెల్‌సహా వీఐఎల్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. కాగా.. ఏజీఆర్ బకాయిలపై స్పష్టత లోపించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడులకు ముందుకురావడంలేదని లేఖలో బిర్లా పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ చెల్లింపులపై అవసరమైనంత మారటోరియం విధింపు, ప్రధానంగా సర్వీసు వ్యయాలకు మించిన ఫ్లోర్ ధరల విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భారీ రుణ భారం: రూ. 25,000 కోట్లు సమీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో బోర్డు వీఐఎల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీ నిధుల సమీకరణ చేపట్టలేకపోవడం గమనార్హం! లీజ్ లయబిలిటీలను మినహాయిస్తే కంపెనీకి స్థూలంగా రూ. 1,80,310 కోట్ల మేర రుణభారముంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 96,270 కోట్లుకాగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు రూ. 23,080 కోట్లుగా నమోదయ్యాయి. -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు...!
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్‌లో భాగంగా అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్‌టైంను అందించింది. దాంతోపాటుగా డబుల్ మొబైల్ డేటాను చేసింది. తాజాగా ఎయిర్టెల్ బాటలో వోడాఫోన్-ఐడియా కూడా టారిఫ్‌లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను విరమించుకుంది. ఈ ప్లాన్‌కు బదులుగా కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్ ప్రకారం.. టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు రెవెన్యూను జనరేట్ చేసుకున్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) మెరుగుపడాలంటే..కచ్చితంగా ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌ల పెంపు అనివార్యమని తెలిపింది. కాగా జియో నుంచి టారిఫ్‌ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్ పేర్కొంది. -
రూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్‌కు ఎయిర్టెల్-వొడాఫోన్
న్యూఢిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల లోపాలపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు తెలియజేసింది.ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల లెక్కల్లో తప్పులు దొర్లాయని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని తెలిపింది. దాదాపు రూ.93,520 కోట్లు చెల్లించడానికి 2020 సెప్టెంబర్‌లో టెలికం సేవల కంపెనీలకు సుప్రీంకోర్టు పది సంవత్సరాల గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే. వాదనలు ఇలా.. టెలికం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎల్ఎన్ రావులతో కూడిన ధర్మాససం సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావించింది. ఏజీఆర్ సంబంధిత బకాయిలను తిరిగి అంచనా వేయజాలమని పేర్కొంది. అయితే అర్థమెటికల్ లోపాలను సరిదిద్దే అవకాశం ఉంటుందని, ఎంట్రీస్ డ్యూప్లికేషన్ జరిగినట్లు లెక్కల్లో స్పష్టమయినట్లు కంపెనీల న్యాయవాదులు ఈ సందర్భంగా విన్నవించారు. ‘‘అర్థమెటికల్ ఎంట్రీస్ విషయంలో టెలికమ్యూనికేషన్ల శాఖ (టెలికం) మేము తప్పు పట్టడం లేదు’’ అని వొడాఫోన్ ఐడియా తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఎంట్రీలను టెలికం శాఖ ముందు పెట్టి, తిరిగి పరిశీలించుకోదలచామని అన్నారు. ఇందుకు అనుమతించాలని కోరారు. ఎయిర్టెల్ తరఫు సీనియర్ న్యాయవాది ఏఎం సంఘ్వీ, టాటా టెలీ సర్వీసెస్ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దత్తార్‌లు కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ అభిప్రాయమేమిటని అప్పట్లో టెలికం శాఖ తరఫున వాదలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం ప్రశ్నించింది. అయితే దీనిపై తనకు తాజా ఇన్స్ట్రక్షన్స్ ఏవీ లేవని, టెలికం శాఖ అభిప్రాయం తెలుసుకోడానికి రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. దీనితో ఈ అంశంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తులు ఎస్ఏ నజీర్, ఎంఆర్ షాలు కూడా కలిగి ఉన్న ధర్మాసనం సూచించింది. 2031 మార్చిలోపు దశలవారీగా.. టెలికం శాఖ డిమాండ్ చేసిన ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీలోపు చెల్లించాలని టెలికం కంపెనీలకు గత ఏడాది సెప్టెంబర్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన మొత్తాలను 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది. ఆయా అంశాలపై ఇదే తుది నిర్ణయమని కూడా సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. నిజానికి ఏజీఆర్ సమస్యపై తన తీర్పును 2019 అక్టోబర్‌లో సుప్రీం తీర్పు నిచ్చింది. అయితే బకాయిలను వాయిదాల వారీగా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గత ఏడాది మార్చిలో టెలికం శాఖ గత ఏడాది సుప్రీంను ఆశ్రయించింది. దీనికి అత్యున్నత న్యాయస్థానం అనుమతులు ఇస్తూ, 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది. ్ఞ్ఞ్ఞ్ఞసుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాసహా టెలికం ఆపరేటర్లు ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీ నాటికి తనకు చెల్లించాయి. -
వొడాఫోన్ ఐడియా బంపరాఫర్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో 2020 ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కువ శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీలు యూజర్లకు తక్కువ ధరకే ఇంటర్ నెట్ ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విఐ(వోడాఫోన్ ఐడియా) కూడా ప్రీపెయిడ్ చందాదారుల కోసం వార్షిక రూ.1,499 ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఈ అదనపు డేటా అనేది ఎంపిక చేసిన సర్కిల్లలోని వినియోగదారులకు లభిస్తుంది అని విఐ పేర్కొంది. (చదవండి: రూ.500 లోపు బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఇవే!) ఈ డేటా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి వోడాఫోన్ ఐడియా యూజర్లు విఐ యొక్క అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ని సందర్శించాలని పేర్కొంది. అలాగే ఎంపిక చేసిన వినియోగ దారులకు ఈ ఆఫర్ గురించి విఐ టెక్స్ట్ సందేశాలను కూడా పంపుతున్నట్లు పేర్కొంది. వోడాఫోన్ ఐడియా రూ.1,499 వార్షిక ప్రణాళిక కింద సాధారణంగా 24జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 50జీబీ డేటా కలుపుకొని మొత్తం 75జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్, టీవీ షోలు, సినిమాలు, లైవ్ టీవీ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది. -
వొడాఫోన్ ఐడియా 'వై-ఫై కాలింగ్' సేవలు ప్రారంభం
వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వై-ఫై కాలింగ్' లేదా 'వోవీ-ఫై' సేవను నేడు ప్రారంభించింది. ప్రస్తుతం వీ 'వై-ఫై కాలింగ్' కాలింగ్ సేవలు మహారాష్ట్ర & గోవా, కోలకతా వంటి సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ ఇండియా దశలవారీగా ఇతర సర్కిల్‌లలో ఈ సేవను ప్రారంభించనున్నట్లు తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ వంటి సంస్థలు ఏడాది క్రితమే వై-ఫై కాలింగ్ సేవలను ప్రారంభించాయి. టెలికాం టాక్ నివేదిక ప్రకారం, వై వై-ఫై కాలింగ్ ప్రారంభించినట్లు కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీం ట్విట్టర్లో ధృవీకరించింది. ఎయిర్టెల్ ప్రారంభించిన VoWi-Fi కాలింగ్ సేవల మాదిరిగానే ఈ సేవలు ఉండనున్నాయి. వోడాఫోన్ ఇండియా గత కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సేవలను పరీక్షించింది. వాస్తవానికి, 2019 ప్రారంభంలో వీ వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను ఇతర టెల్కోల కంటే ముందుగానే ప్రారంభించనున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే, వోడాఫోన్- ఐడియా యొక్క నెట్వర్క్ ఇంటిగ్రేషన్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది.(చదవండి: వివో సబ్ బ్రాండ్ కొత్త 5జీ మొబైల్) -
కొత్త ప్లాన్ ని ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియాగా రీబ్రాండ్ చేయబడిన తర్వాత 1197 ప్రీపెయిడ్ ప్లాన్ లభ్యతను విస్తరించింది. ఈ ప్లాన్ గతంలో హోమ్ క్రెడిట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ బండిల్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. 2019లో వోడాఫోన్ ఐడియా... హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థతో పాట్నర్‌షిప్ ఒప్పందం చేసుకుంది. దీంట్లో భాగంగా కస్టమర్లు రూ.15వేల లోపు ఏదైనా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఆ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇప్పుడు తాజాగా భారత్‌లోని అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబందించిన సమాచారాన్ని వోడాఫోన్ ఐడియా వెబ్సైట్లో ఉంచింది. అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.(చదవండి: ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్) వోడాఫోన్ ఐడియా 1197 ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా రోజుకి 1.5జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. దీని కాలపరిమితి వచ్చేసి 180 రోజులు, అలాగే రోజుకి ఉచిత 100 ఎస్సెమ్మెస్ లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వోడాఫోన్ ఐడియా మూవీస్ & టీవీని కస్టమర్లు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఆ వారంలో వాడకుండా మిగిలి ఉన్న డేటాను తిరిగి వారం చివరి రోజులో వాడుకోవచ్చు. రూ.1197 ప్రీపెయిడ్ ప్లాన్ ని అందరికి అందుబాటులోకి తీసుకోని రాకముందు, టెల్కో రూ.599కు 1.5 జీబీ రోజువారీ డేటాను 84 రోజులు, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వరుసగా 365 రోజుల వాలిడిటీతో అందించింది. రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకి 2జీబీ డేటాతో పాటు ఒక సంవత్సరం వరకు ఉచితంగా ZEE5 ప్లాట్‌ఫామ్ మెంబర్షిప్ లభిస్తుంది. -
వొడాఫోన్ ఐడియాకు భారీ నిధులు!
ముంబై: దేశీ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో భారీ పెట్టుబడులకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓక్ట్రీ క్యాపిటల్ అధ్యక్షతన ఏర్పడిన కన్సార్షియం 2-2.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వీలున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. తద్వారా వొడాఫోన్ ఐడియాలో కొంత వాటాను సొంతం చేసుకునే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వొడాఫోన్ ఐడియా 3.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 25,000 కోట్లు)ను సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. షేర్ల విక్రయం, రుణ సమీకరణ ద్వారా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు వేసినట్లు తెలియజేసింది. దీంతో ఓక్ట్రీ క్యాపిటల్ పెట్టుబడుల వార్తలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు టెలికం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్) పోటీ తీవ్రం.. కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ భారీస్థాయిలో కస్టమర్లను పొందుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు కంపెనీలూ వొడాఫోన్ ఐడియా కస్టమర్లను సైతం ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దేశీ మొబైల్ టెలికం రంగంలో పెరిగిన తీవ్ర పోటీ, నిధుల ఆవశ్యకత నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పెట్టుబడుల సమీకరణ సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా తిరిగి మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా లాభదాయకతను సైతం పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో డిసెంబర్ చివరికల్లా 20 శాతంవరకూ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు వేసినట్లు వివరించాయి. -
కొత్త ఏడాదిలో ఫోన్ బిల్లుల మోతే!
న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా(వి), ఎయిర్టెల్ వంటి టెల్కో సంస్థలు టారిఫ్‌లు పెంచాలని చూస్తున్నందున రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఫోన్ బిల్లు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. వోడాఫోన్ ఐడియా ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో చార్జీలను 15-20 శాతం పెంచాలని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో కంపెనీలు నష్టాల నుండి బయటపడానికి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. వొడాఫోన్ ఐడియా ఇటీవల కొద్ది రోజులుగా రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ సంస్థలకు వినియోగదారులను కోల్పోతున్నట్లు నివేదికలో తెలియ జేసింది. కొంత మేరకు ఎయిర్టెల్ సంస్థ రిలయన్స్ జియోను అనుసరిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ఎయిర్టెల్ కూడా రేట్లను సవరించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ నిపుణలు తెలుపుతున్నారు. "టెలికం రెగ్యులేటర్ ఫ్లోర్ ధరలను ప్రకటించడానికి ముందే టెల్కో కంపెనీలు టారిఫ్‌లను పెంచే అవకాశం ఉంది" అని ఒక వ్యాపార దినపత్రిక పేర్కొంది. వోడాఫోన్ ఐడియా డిసెంబరు నాటికి రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. టెల్కో సంస్థలు 20 శాతం చార్జీల పెంపుపై ప్రజలలో అంతర్గత చర్చ జరుగుతుండగా, ఒకే సారి ఇంత మొత్తంలో పెంపు అమలు చేయడం భారమవుతుందని ప్రజల అభిప్రాయం. 2016లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రవేశించిన తరువాత దేశంలోని మూడు ప్రైవేట్ టెల్కోలు గతంలో 2019 డిసెంబరులో రేట్లు పెంచాయి. -
తగ్గిన నెట్ స్పీడ్; జియోనే నంబర్‌వన్
రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ అక్టోబర్‌లో 1.5 ఎంబీపీఎస్ పడిపోయింది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. అక్టోబర్ లో జియో డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 17.8 ఎంబీపీఎస్‌గా ఉంది. రెండవ స్థానంలో కొనసాగుతున్న ఐడియా కంటే జియో స్పీడ్ వచ్చేసి 95% శాతం ఎక్కువ. అక్టోబర్ లో ఐడియా డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 9.1 ఎంబీపీఎస్‌గా ఉంది. అప్ లోడ్ స్పీడ్ విషయంలో కూడా జియో ఇంకా వెనుక బడే ఉంది. గత ఏడాది కలిసిపోయిన వొడాఫోన్, ఐడియాలను ట్రాయ్ ఇంకా ప్రత్యేక టెల్కోలుగానే పరిగణిస్తోంది. సెప్టెంబర్‌లో 19.1 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్లోడ్ స్పీడ్, అక్టోబర్‌లో 17.8 ఎంబీపీఎస్‌కు పడిపోయింది. ఇప్పటికీ ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో జియోనే నంబర్ వన్. ఇక ఐడియా విషయానికి వస్తే.. జియో తర్వాత రెండో స్థానంలో 9.1 ఎంబీపీఎస్‌తో ఉంది. సెప్టెంబర్‌లో ఐడియా డౌన్ లోడ్ స్పీడ్ 8.6 ఎంబీపీఎస్‌గా ఉండగా, 0.5 ఎంబీపీఎస్ మెరుగు పరుచుకుంది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం మూడో స్థానంలో వొడాఫోన్ ఉంది. వొడాఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ 8.8 ఎంబీపీఎస్‌గా ఉంది. సెప్టెంబర్‌లో వొడాఫోన్ 7.9 ఎంబీపీఎస్‌గా ఉండేది. అయితే ఇది కూడా 0.9 ఎంబీపీఎస్ వరకు పెరిగింది. ఇక 7.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో ఎయిర్ టెల్ నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ టెల్ డౌన్లోడ్ స్పీడ్ రెండు నెలల నుంచి అలాగే ఉంది. అందులో ఎటువంటి మార్పూ లేదు. -
వొడాఫోన్‌కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ 20,000 కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విజయం సాధించామని టెలికాం దిగ్గజం వొడాఫోన్ శుక్రవారం ప్రకటించింది. బకాయిలు రూ 12,000 కోట్లతో పాటు, రూ 7900 కోట్ల పెనాల్టీల చెల్లింపుపై అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఉపశమనం లభించిందని పేర్కొంది. వాయుతరంగాల వాడకం, లైసెన్స్ ఫీజులకు సంబంధించి తలెత్తిన వివాదంపై వొడాఫోన్ 2016లో సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఆశ్రయించింది. చదవండి : వొడాఫోన్ కొత్త ‘ఐడియా’ వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం మోపిన పన్ను భారాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్ధమని ట్రిబ్యునల్ రూలింగ్ ఇచ్చిందని వొడాఫోన్ పేర్కొంది. ఇక నష్టాలతో సతమతమవుతున్న టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన రూలింగ్ ఊరట కల్పించింది. ప్రభుత్వ బకాయిల చెల్లింపును పదేళ్లలోగా పూర్తిచేయాలని సర్వోన్నత న్యాయస్ధానం టెలికాం కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. -
వొడాఫోన్ ఐడియాకు వెరిజాన్, అమెజాన్ దన్ను!
మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియాలో విదేశీ దిగ్గజాలు వెరిజాన్, అమెజాన్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలుకి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. సంబంధిత కథనం ప్రకారం ఏజీఆర్ బకాయిల కేసుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో చర్చలు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, యూఎస్ వైర్లెస్ సేవల దిగ్గజం వెరిజాన్ కమ్యూనికేషన్స్ 400 కోట్ల డాలర్లు(సుమారు రూ.29,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పదేళ్లలోగా ఏజీఆర్ బకాయిలను చెల్లించమంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరిగి వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు చర్చలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ. 50,000 కోట్లు బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్య సంస్థ వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్ బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. సుప్రీం ఆదేశాలమేరకు ఇప్పటికే కంపెనీ రూ. 7,850 కోట్లను చెల్లించిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. షేరు జోరు అమెజాన్, వెరిజాన్ ఇన్వెస్ట్మెంట్ యోచనలో ఉన్న అంచనాలతో ఇటీవల వొడాఫోన్ ఐడియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో మూడు రోజులుగా ఈ షేరు దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 10.70 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 11.30 వరకూ ఎగసింది. -
అదానీ గ్రీన్- వొడాఫోన్ ఐడియా జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్‌తోపాటు.. మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ గ్లోబల్ సోలార్ విద్యుదుత్పత్తిలో అదానీ గ్రూప్.. ప్రపంచ నంబర్‌వన్‌గా ఆవిర్భవించినట్లు మెర్కామ్ క్యాపిటల్ తాజాగా పేర్కొంది. నిర్వహణ, నిర్మాణంలో ఉన్న యూనిట్లతోపాటు.. ఇంతవరకూ దక్కించుకున్న ప్రాజెక్టుల రీత్యా అదానీ గ్రూప్ టాప్ ర్యాంకులో నిలుస్తున్నట్లు వివరించింది. యూఎస్‌లో 2019లో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యంకంటే అదానీ గ్రూప్ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో అధికమని మెర్కామ్ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు.. పూర్తిస్థాయిలో సమీకృత సౌర విద్యుదుత్పత్తి కంపెనీగా అదానీ గ్రూప్ నిలుస్తున్నట్లు అభిప్రాయపడింది. జీవిత కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా 1.4 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలదని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి జూన్‌లో 8 గిగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అదానీ గ్రీన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2.5 గిగావాట్ విద్యుత్ సామర్థ్యాన్ని గ్రూప్ కలిగి ఉన్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 544 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు తాజాగా మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇందుకు ఈ నెల 4న(శుక్రవారం) బోర్డు సమావేశంకానున్నట్లు తెలియజేసింది. పబ్లిక్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ కేటాయింపు, ప్రయివేట్ ప్లేస్మెంట్ తదితర మార్గాలలో నిధుల సమీకరణపై బోర్డు చర్చించనున్నట్లు వెల్లడించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికిప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 9.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 10.15 వరకూ ఎగసింది. -
బాకీలపై మరో మాట లేదు..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ఆధారంగా టెల్కోలు కట్టాల్సిన బకాయిలకు సంబంధించి టెలికం శాఖ (డాట్) లెక్కలపై మరో మాట మాట్లాడటానికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వీటిని మరోసారి మదింపు చేయాలన్న టెల్కోల అభ్యర్థనను పట్టించుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. ఏజీఆర్ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. ఏజీఆర్ ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయిల కింద టెలికం సంస్థలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు చెల్లించాల్సి రానున్న సంగతి తెలిసిందే. స్వీయ మదింపు ప్రకారం కొంత కట్టిన టెల్కోలు.. తమ బాకీలు డాట్ చెబుతున్నంత స్థాయిలో లేవని, పైగా ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున బకాయిలను కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినివ్వాలని సుప్రీం కోర్టును కోరుతున్నాయి. దీనిపై సోమవారం విచారణ సందర్భంగా అటు ప్రభుత్వం, ఇటు టెలికం సంస్థల వాదనలను సుప్రీం కోర్టు విన్నది. బాకీల పునఃమదింపు అంశాన్ని టెల్కోలు ప్రస్తావించగా.. ‘రీ–అసెస్మెంట్ విషయంలో మరొక్క క్షణం కూడా వాదనలు వినే ప్రసక్తే లేదు. ఏజీఆర్ నిర్వచనం ఖరారు చేశాం. దాని ఆధారంగా డాట్ బాకీల నోటీసులు కూడా పంపింది. దీన్ని మళ్లీ తెరిచే ప్రశ్నే లేదు‘ అని స్పష్టం చేసింది. ఇక, దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయంటున్న కంపెనీల వాదనల్లో వాస్తవాలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. -
లాభాల మోత మోగిస్తున్న టెలికాం షేర్లు
టెలికాం రంగ షేర్లు సోమవారం లాభాల మోత మోగిస్తున్నాయి. ఈ రంగానికి చెందిన వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎంటీఎన్ఎల్, టాటా సర్వీసెస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 13శాతం వరకు లాభపడ్డాయి. అత్యధికంగా వోడాఫోన్ ఐడియా షేరు 13శాతం ర్యాలీ చేసింది. ఏజీఆర్ బకాయిల కింద టెలికాం విభాగానికి శుక్రవారం మరో రూ.1000 కోట్లు చెల్లించడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు నేటి మధ్యాహ్నం 2గంటలకు సుప్రీం కోర్టులో ఏజీఆర్ అంశంపై విచారణ జరగనుంది. ఏజీఆర్ బకాయిలు చెల్లింపునకు టెలికాం సంస్థలు 10ఏళ్లలో గడువు కోరిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆస్తకి నెలకొంది. ఏజీఆర్ కేసుపై జూలై 18న సుప్రీం కోర్టు మాట్లాడుతూ ... వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌తో సహా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తప్పనిసరిగా "సహేతుకమైన చెల్లింపు ప్రణాళిక"ను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అలాగే బోన్‌ఫైడ్ కొరకు కొంత మొత్తంలో చెల్లింపు చేయాలని అలాగే గత పదేళ్లకు సంబంధించిన ఖాతా బుక్స్లను ఫైల్ చేయాల్సిందిగా టెలికాం కంపెనీలను ఆదేశించింది. రూ.1000 కోట్లు చెల్లించిన వోడాఫోన్: సవరించిన స్థూల ఆదాయం బకాయి కింద మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తాన్ని టెలికాం విభాగానికి జమ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత చెల్లింపుతో ఇప్పటి వరకు ఏజీఆర్ బకాయి కింద మొత్తం రూ.7854 కోట్లు చెల్లించినట్లు కంపెనీ తెలిపింది. ఇది వరకు ఏజీఆర్ బకాయి కింద 3విడుతల్లో మొత్తం రూ.6584 కోట్ల చెల్లించినటన్లు వోడాఫోన్ పేర్కోంది. ఏజీఆర్ బకాయిల అంశంపై గతనెల జరిగిన విచారణ సందర్భంగా తదుపరి విచారణ నాటికి కొంతమొత్తం చెల్లించాలని సుప్రీం కోర్టు టెలికాం కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా జమ చేసింది. ఏజీఆర్ బకాయి కింద రూ.58 వేల కోట్లు వొడాపోన్ ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. -
జియో ఎఫెక్ట్: నష్టాల్లో టెలికాం రంగ షేర్లు
వచ్చే ఏడాది కల్లా భారత్‌లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటనతో గురువారం ఉదయం సెషన్లో టెలికాం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రంగానికి చెందిన భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు 2నుంచి 17శాతం నష్టాన్ని చవిచూశాయి. కొన్ని నెలల క్రితం వోడాఫోన్లో టెక్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెడుతుందని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్ జియోలో 7.7 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం గూగుల్ రూ. 33,373 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అలాగే స్పెక్ట్రం వేలం వేసిన తర్వాత రిలయన్స్ మేడ్ ఇన్ ఇండియా 5 జి సొల్యూషన్స్‌ను ట్రయల్ కోసం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వోడాఫోన్, ఎయిర్టెల్ షేర్లపై ఒత్తిడిని పెంచాయి. బీఎస్ఈలో టెలికాం రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్అండ్పీ బీఎస్ఈ టెలికాం ఇండెక్స్ 2శాతం మేర నష్టాన్ని చవిచూసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ ఇండెక్స్ 30శాతం లాభపడటం పడింది. ఇదే సమయంలో సెనెక్స్ సూచీ 8శాతం నష్టాన్ని చవిచూడటం గమనార్హం. వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ షేరు మాత్రం 1శాతం లాభంతో కదులుతోంది. -
అత్యధిక నష్టాలొచ్చిన భారత కంపెనీగా..
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో రూ.73,878 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి నష్టాలు ఇప్పటివరకూ ఏ భారత కంపెనీకి రాలేదు. ఏజీఆర్ (సవరించిన స్థూల రాబడి) సంబంధిత బకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19)లో నికర నష్టాలు రూ.14,604 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.37,093 కోట్ల నుంచి రూ.44,958 కోట్లకు పెరిగింది. (హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!) ∙గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ నష్టాలు మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,882 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత క్యూ4లో రూ.11,644 కోట్లకు ఎగిశాయి. గత క్యూ3లో నష్టాలు రూ.6,439 కోట్లుగా ఉన్నాయి. ∙గత క్యూ4లో ఆదాయం రూ.11,754 కోట్లు. సీక్వెన్షియల్‌గా కార్యకలాపాల ఆదాయం 6 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది డిసెంబర్ నుంచి టారిఫ్‌లు పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. ∙గత క్యూ3లో రూ.109గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి(ఏఆర్పీయూ) గత క్యూ4లో రూ.121కు పెరిగింది. ఇదే కాలంలో వినియోగదారుల సంఖ్య 30.4 కోట్ల నుంచి 29.1 కోట్లకు తగ్గింది. ∙ఐడియా సెల్యులర్‌లో వొడాఫోన్ ఇండియా 2018, ఆగస్టులో విలీనమైంది. అందుకని అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో గత ఆర్థిక సంవత్సరం ఫలితాలను పోల్చడానికి లేదు. ∙కంపెనీ రూ.51,400 కోట్ల మేర ఏజీఆర్ బకాయిలు చెల్లించాలి. మొత్తం రూ.58,254 కోట్ల బకాయిల్లో రూ.6,854 కోట్లు చెల్లింపులు జరిపింది. -
ఈ 3 షేర్ల దూకుడుకు కారణమేంటట?
ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో పరుగు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 34,543కు చేరగా.. నిఫ్టీ 64 పాయింట్లు పుంజుకుని 10,206 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న వార్తల కారణంగా టైటన్ కంపెనీ, యస్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టైటన్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ప్రస్తుతం టైటన్ కంపెనీ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 3.5 శాతం పెరిగి రూ. 1025 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,050 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. జ్యువెలరీ, ఐవేర్, వాచీలు తదితర లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల ఈ కంపెనీ అమ్మకాలు ఇటీవల లాక్‌డవున్ నేపథ్యంలో నీరసించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పసిడి ధరలు పుంజుకోవడంతో మార్క్‌టు మార్కెట్ క్యాష్‌ఫ్లో పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్టోర్లను తిరిగి తెరుస్తున్న కారణంగా అమ్మకాలు గాడిన పడగలవన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. యస్ బ్యాంక్ యస్ బ్యాంకుకు చెందిన రూ. 18,000 కోట్ల బాండ్లకు BBB రేటింగ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు క్రిసిల్ తాజాగా పేర్కొంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ దన్ను కారణంగా యస్ బ్యాంక్ జారీ టైర్-2, ఇన్ఫ్రా బాండ్లకు స్టేబుల్ రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు తొలుత 10 శాతం జంప్‌చేసి రూ. 32ను తాకింది. ఇది 10 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 30.4 వద్ద ట్రేడవుతోంది. వొడాఫోన్ ఐడియా వరుసగా 10వ సెషన్లోనూ మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా కౌంటర్ జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 20 శాతం దూసుకెళ్లి రూ. 12.6ను తాకింది. ప్రస్తుతం 11.5 శాతం ఎగసి రూ. 11.7 వద్ద ట్రేడవుతోంది. గత 10 రోజుల్లోనూ ఈ కౌంటర్ 129 శాతం ర్యాలీ చేయడం విశేషం! గత 26న ఈ షేరు రూ. 5.5 వద్ద ట్రేడైన సంగతి తెలిసిందే. కాగా.. టెక్ దిగ్గజం గూగుల్ వొడాఫొన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి గతేడాది జులైలో చేపట్టిన రైట్స్ ఇష్యూ ధర రూ. 12.5ను తాజాగా అధిగమించినట్లు తెలియజేశారు. ఈ అంశాన్ని కంపెనీ తోసిపుచ్చినప్పటికీ.. ఇటీవల దేశీయంగా మొబైల్ టారిఫ్‌ల పెంపు.. వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం వంటి అంశాలు మొబైల్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు చెబుతున్నారు. -
ప్రస్తుతానికి వొడాఫోన్ ఐడియా షేరును కొనవద్దు
ప్రస్తుత పరిస్థితుల్లో వోడాఫోన్ ఐడియా షేరును కొనవద్దని ఎంఎస్ఎల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా సలహానిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా నగదు ప్రవాహ ఒత్తిళ్లను ఎదుర్కోంటుందని, కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీవ్ర రుణాభారాన్ని కలిగి ఉందన్నారు. త్రైమాసిక నగదు ప్రవాహం సజావుగా కొనసాగాలంటే ఏఆర్పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) ఛార్జీలను కనీసం 40-50శాతం పెంచాల్సి ఉంటుందని ఖేమ్కా అన్నారు. ఇదే పరిస్థితుల్లో ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ కేవలం 15-20శాతం ఏఆర్పీయూ పెంచినా వారికి వ్యాపారాభివృద్ధికి మేలు చేసే అంశమవుతుందని ఖేమ్కా చెప్పుకొచ్చారు. ఇటీవల టెలికాం రంగం నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నట్లు ఖేమ్కా తెలిపారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో వరుసగా వాటాలు విక్రయించడంతో పాటు మరికొంత వాటాను అమ్మేందుకు సిద్ధంగా ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను టెలికాం రంగం వైపు దృష్టి మళ్లించేలా చేశాయన్నారు. ఇక భారతీ ఎయిర్టెల్ విషయానికొస్తే.., ఇటీవల ఏఆర్పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)గణీయంగా మెరుగపడటాన్ని ఖేమా గుర్తు చేశారు. నిరాధరమైన వార్తల ఆధారంగా మాత్రమే వోడాఫోన్ షేరు ఇటీవల మూమెంట్‌ను కనబరుస్తుందని, ఈ సమయంలో వోడాఫోన్‌కు దూరంగా ఉండటం మంచిదని ఆయన సలహానిస్తున్నారు. అయితే ఇదే రంగంలో భారతీ ఎయిర్టెల్ షేరు కొనుగోలు చేయడం మంచిదని ఖేమా చెప్పుకొచ్చారు. వొడాఐడియాలో దాదాపు 5 శాతం వాటా కొనేందుకు గూగుల్ సిద్ధంగా ఉందనే వార్తలు వెలుగులోకి రావడంతో శుక్రవారం ఒకదశలో షేరు దాదాపు 35శాతం లాభపడి రూ.7.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే తమ కంపెనీలో గూగుల్ పెట్టుబడులు పెడుతున్న ప్రతిపాదన తమ పరిశీలనలోకి రాలేదనే వొడాఫోన్ ఐడియా తెలిపడంతో షేరు మార్కెట్ ముగిసే సరికి 12.71శాతం లాభంతో రూ.6.56 వద్ద స్థిరపడింది. -
లాక్‌డౌన్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న రంగమిదే..!
కోవిడ్ సంబంధిత అంతరాయాతో విశ్లేషకులు పలు కంపెనీ షేర్ల వృద్ధి అంచనాలను, టార్గెట్ ధరలను తగ్గిస్తున్నారు. దీంతో ఇటీవల వారాల్లో అనేక షేర్లు రీ-రేటింగ్‌ను చూస్తున్నాయి. కానీ ఇంత సంక్షోభంలో ఒక రంగానికి చెందిన కంపెనీలు దుమ్ముదులుపుతున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రంగంపై మక్కువ చూపిస్తున్నారు. అదే టెలికాం రంగం.... ఇటీవల కాలం వరకు ఈ రంగం నానా ఇబ్బందులతో సతమతమైతూ వచ్చింది. కానీ ఒక్కమారుగా ఈ రంగం బంగారుబాతుగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో డబ్బులు డబుల్ కావడానికి టెలికాం రంగం ఉత్తమైన ఎంపికగా కొందరు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ సమయంలో డేటా, వాయిస్ వినియోగం పెరగడం, గతేడాది చివరి నెలలో టారీఫ్‌ల పెంపుతో పాటు భవిష్యత్తులో కంపెనీలు టారీఫ్‌లు పెంచవచ్చనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థలు టెలికాం రంగ షేర్లకు బుల్లిష్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. టెలికాం కంపెనీలు రానున్న పదేళ్ల వరకు వార్షిక ప్రాతిపాదికన 14శాతం చక్రీయ వార్షిక వృద్ది నమోదు చేయగలవని యాంబిట్ క్యాపిటల్ ఛైర్మన్ వివేకానంద్ అభిప్రాయపడ్డారు. ఈయన వోడాఫోన్ ఐడియా షేరుపై బాగా బుల్లిష్‌గా ఉన్నారు. త్వరలో పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచడంతో పాటు ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ప్రీమియం వినియోగదారులు అధికంగా ఉండటం వోడాఫోన్ ఐడియాకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్ కేటాయింపుతో పాటు, ఏడాది కాలానికి టార్గెట్ ధరను రూ.19గా నిర్ణయించారు. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ట్రేడింగ్‌ను నుంచి ఏకంగా 248శాతం అధికంగా ఉంది. ఇదే షేరు మార్చి కనిష్టం నుంచి ఏకంగా 73శాతం పెరిగింది. టెలికాం రంగంలో ఆదాయాల విజిబిలిటి మెరుగుపడుతున్నందున టెలికాం షేర్లు రానున్న రోజుల్లో చెప్పుకోదగిన ర్యాలీ చేసే అవకాశం ఉందని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ సిఐఓ సైలేష్ రాజ్ భన్ అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్టెల్ షేరుపై అధిక బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మోర్గాన్ స్టాన్లీతో సహా మొత్తం 7 కంపెనీలు అవుట్పర్ఫామ్ రేటింగ్, 16 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినట్లు రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కంపెనీ నిరుత్సాహకరమైన త్రైమాసికపు ఫలితాలను ప్రకటించినప్పటికీ.., మోర్గాన్ స్టాన్లీ సేరు ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.525 నుంచి రూ.725కు పెంచింది. భారతీ ఎయిర్టెల్ షేరు ఈ క్యాలెండర్ అన్ని బ్లూచిప్ కంపెనీల్లో కెల్లా అత్యధిక ర్యాలీని చేసింది. వార్షిక ప్రాతిపదికన 31శాతం లాభపడింది. -
లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట
సాక్షి, ముంబై: దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. ముఖ్యంగా ఆన్లైన్లో రీచార్జ్ చేసుకోలేని తమ వినియోగదారులను దృష్టిలో వుంచుకుని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇకపై తమ దగ్గర ఉన్న ఏటీఎంలో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. టెలికాం దిగ్గజం జియో బాటలో నడిచిన ఎయిర్టెల్, వొడాఫోన్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతోపాటు ఎయిర్టెల్ వినియోగదారులు ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిర్టెల్ ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్టెల్ వినియోగారులు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల ఏటీఎంల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బిఐ, యాక్సిస్, సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల ఏటీఎంలలో మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇరు సంస్థలు ఈ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. వినియోగదారులు ఈ బ్యాంకుల ఏటీఎంలలో దేన్నైనా సందర్శించి వారి రీఛార్జిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ వినియోగదారులు బిగ్ బజార్స్ , అపోలో ఫార్మసీలకు కూడా వెళ్లి వారి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏటీఎం రీచార్జ్ ఎలా చేసుకోవాలంటే.. ► కార్డును ఏటీఎంలలో ఇన్సెర్ట్ చేయాలి. ► ఏటీఎం మెషీన్ తెరపై కనిపించే మొబైల్ కంపెనీని ఎంచుకోవాలి. ► రీఛార్జ్ చేయదలిచిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ► రీఛార్జ్ చేసుకునే మొత్తాన్ని నమోదు చేయాలి. తరువాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత ఎంటర్ చేస్తే రీఛార్జ్ పూర్తయిందని నిర్ధారిస్తూ సందేశం వస్తుంది. రీచార్జ్ చేసుకున్న అమౌంట్ మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అవుతుంది. అలాగే మీ నెట్వర్క్ ఆపరేటర్ నుండి కూడా మెసేజ్ వస్తుంది. ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోలేని వ్యక్తులకు మాత్రమే ఏటీఎం రీఛార్జ్ సాధ్యమవుతుంది. దీంతోపాటు వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఎస్ఎంఎస్ రీఛార్జ్ సౌకర్యం కూడా అందుబాటులో వుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు మాత్రమే ఎస్ఎంఎస్ రీఛార్జ్ ద్వారా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ రీచార్జ్ ఎలా అంటే మీ నంబర్ నుండి ఐడియా/వొడాఫోన్ నంబరు టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, రీచార్జ్ సొమ్ము టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, ఐసీఐసీఐ, లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతా చివరి ఆరు అంకెలను నమోదు చేసి 9717000002 లేదా 5676782కు ఎస్ఎంఎస్ పంపితే రీచార్జ్ పూర్తవుతుంది. కాగా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందుల నేపథ్యంలో జియో కూడా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బిఐ, యాక్సిస్ , సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల ఏటీఎంలద్వారా మొబైల్ రీచార్జ్ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే వినియోగదారుల వోడాఫోన్, ఎయిర్టెల్ తమ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ల వాలిడిటీని ఏప్రిల్ 17వరకు పెంచాయి. తక్కువ ఆదాయ వినియోగదారుల ఖాతాలను రూ.10తో జమ చేశాయి. మరోవైపు రిలయన్స్ జియో కూడా ఏప్రిల్ 17 వరకు 100 కాల్స్ , 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
ఏజీఆర్ ‘పరిష్కారం’పై వొడా–ఐడియా కసరత్తు..
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల కారణంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) .. ఈ సమస్య నుంచి గట్టెక్కడంపై కసరత్తు చేస్తోంది. కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా .. మంగళవారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన చర్చల్లో వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ కూడా పాల్గొన్నారు. అయితే, చర్చల సారాంశాన్ని వెల్లడించేందుకు బిర్లా నిరాకరించారు. ‘ఇప్పుడే ఏం చెప్పలేము‘ అంటూ భేటీ అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. వీఐఎల్ సంస్థ ఏజీఆర్ బాకీలు కట్టగలదా, దివాలా ప్రకటించే అవకాశం ఉందా వంటి ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వడానికి నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ డిమాండ్ చేస్తోంది. వీఐఎల్ సుమారు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. బాకీల చెల్లింపుల్లో ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగతా టెల్కోలతో పాటు వీఐఎల్ సోమవారం రూ. 2,500 కట్టింది. మరో వారం రోజుల్లోగా ఇంకో రూ. 1,000 కోట్లు కడతామని పేర్కొంది. మరోవైపు, బాకీలు కట్టని టెల్కోల బ్యాంకు గ్యారంటీలను స్వాధీనం చేసుకోవాలని టెలికం శాఖ భావిస్తోంది. అదే జరిగితే వీఐఎల్ వంటివి మూతబడే ప్రమాదముంది. బాకీలపై వెసులుబాటు లభించకపోతే మూసివేత తప్పదంటూ బిర్లా గతంలోనే వ్యాఖ్యానించడం గమనార్హం. -
మళ్లీ పేలనున్న సెల్ బాంబ్!
న్యూఢిల్లీ: టెలికం సేవల మార్కెట్లోకి రిలయన్స్ జియో రాకతో ఎక్కువగా మురిసిపోయింది సగటు వినియోగదారుడేనని అనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితులతో ఇప్పుడు అదే వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి...! కేంద్రానికి భారీ బకాయిలు కట్టాల్సి ఉన్న టెలికం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు చార్జీలు పెంచడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మినహా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఒకవైపు 4జీ నెట్వర్క్ విస్తరణపై భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి.. మరోవైపు జియోకు వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి.. ఇంకోవైపు కేంద్రానికి భారీ బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితి.. అందుకే గత డిసెంబర్లో ఏకంగా 42 శాతం వరకు చార్జీలను పెంచేసిన సంస్థలు.. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఏడాది కాలంలో మరింత పెంపునకు సిద్ధం అవుతున్నాయి. జియో రాక పూర్వం ఒక జీబీ డేటా వినియోగానికి రూ.200కుపైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మోస్తరు కాల్స్ చేసుకునే వారు కూడా నెలకు రూ.200 వరకు వెచ్చించే వారు. కానీ, 2016లో జియో అడుగుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఉచితంగా ఆరంభించిన జియో భారీగా వినియోగదారులను సొంతం చేసుకుంది. డేటా, కాల్స్‌ను పరిమితి లేకుండా ఉచితంగా అందించి వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో దెబ్బకు రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా డొకొమో, టెలినార్ ఇలా అందరూ దుకాణాలను మూతేసుకోవాల్సి వచ్చింది. మూడేళ్లలోనే జియో చందాదారుల సంఖ్యా పరంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. జియో విధ్వంసాన్ని తట్టుకోలేక ప్రధాన టెలికం ప్లేయర్లు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ విలీనమైన వొడాఫోన్ ఐడియాగా అవతరించాయి. చివరకు మూడు ప్రైవేటు సంస్థలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం మార్కెట్లో మిగిలాయి. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో గత 20 ఏళ్లకు సంబంధించి స్పెక్ట్రమ్, ఇతర బకాయిల రూపంలో టెల్కోలు ఇప్పుడు కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్టెల్ రూ.35వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు వాటి ముందున్న మార్గం చార్జీల పెంపే. అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వచ్చేలా ఉన్నాయి. లేదంటే జేబు నుంచి మరింత ఖర్చు చేయక తప్పదు. రానున్న ఏడాది కాలంలో సగటు వినియోగదారు నుంచి వచ్చే నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) రెట్టింపు కావచ్చని టెలికం కంపెనీలు అంచనాలు వేసుకుంటున్నాయి. లాభాల్లోకి రావాలంటే పెంచాల్సిందే.. ‘‘2020 చివరికి ఏఆర్పీయూ నెలకు కనీసం రూ.200 స్థాయికి, 2021 నాటికి కనీసం రూ.300కు చేరాల్సి ఉందన్న సంకేతాన్ని ఇచ్చాం. టారిఫ్‌ల పెంపు వినియోగాన్ని తగ్గించొచ్చేమో కానీ, సంఖ్యపై ప్రభావం చూపించదు’’ అని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. 2019 మార్చి నాటికి ఏఆర్పీయూ రూ.113 స్థాయిలో ఉంది. దీనిపై కంపెనీలకు 18 శాతం నష్టాలు వచ్చాయి. ఏఆర్పీయూ 77 శాతం పెరిగి రూ.200కు చేరుకుంటే అప్పుడు కంపెనీలు లాభాల్లోకి ప్రవేశిస్తాయి. ఆదాయంలో లాభాలు 10 శాతానికి చేరుకుంటాయని కంపెనీల అంచనా. ఇక ఏఆర్పీయూ రూ.300కు చేరుకుంటే కంపెనీల ఆదాయంలో పన్ను అనంతరం లాభాలు 30–40 శాతానికి విస్తరిస్తాయి. అయితే టెలికం నెట్‌వర్క్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నందున వాస్తవ లాభాలు తక్కువగానే ఉంటాయన్నది విశ్లేషణ. వచ్చే పలు త్రైమాసికాల్లో ఏఆర్పీయూ రూ.200కు, ఆ తర్వాత కొంత కాలానికి రూ.300కు చేరుకుంటుందని భారతీ ఎయిర్టెల్ విశ్లేషకులకు ఇప్పటికే తెలియజేయడం గమనార్హం. ముఖ్యంగా ఏజీఆర్ బకాయిల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసే పరిస్థితులు తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. కానీ, మార్కెట్లోకి లేటుగా వచ్చిన జియోకు ఈ ఏజీఆర్ భారం ఏమీ లేకపోవడంతో.. టారిఫ్‌ల పెంపు రూపంలో ఆ సంస్థకు లాభాల వరద పారనుంది. ఐడియా మూసేస్తే.. వొడా–ఐడియా ఒక్కో త్రైమాసికంలో రూ.6వేల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొంటోంది. గత చార్జీల పెంపు సంస్థకు కలసి రాలేదు. పైగా కేంద్రానికి రూ.53 వేల కోట్ల వరకు కట్టాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఉపశమనం రాకపోతే సంస్థను మూసేయక తప్పదని కుమారమంగళం బిర్లా బహిరంగంగానే సంకేతమిచ్చారు. ఒకవేళ వొడా–ఐడియా దుకాణం బంద్ అయితే, ఈ సంస్థ చందాదారుల్లో (సుమారు 30 కోట్లు) కనీసం సగం మందిని అయినా సొంతం చేసుకోవడం ద్వారా 50 కోట్ల మార్క్‌ను అధిగమించాలని, 64.6 కోట్ల చందాదారుల లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రణాళికలతో జియో సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వొడా–ఐడియా నిష్క్రమణ చందాదారుల పరంగా అటు ఎయిర్టెల్ కూడా కలసి రానుంది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవల్లో లేదు కనుక ఆ సంస్థకు వెళ్లే చందాదారులు తక్కువగానే ఉంటారని అంచనా. -
బాకీలు చెల్లిస్తున్న టెల్కోలు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం సంస్థలు చెల్లింపులు ప్రారంభించాయి. సోమవారం భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ కొంత మొత్తాన్ని కట్టాయి. టెలికం శాఖకు (డాట్) ఎయిర్టెల్ రూ. 10,000 కోట్లు, టాటా గ్రూప్ రూ.2,197 కోట్లు చెల్లించాయి. ‘భారతి ఎయిర్టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్‌ల తరఫున రూ.10,000 కోట్లు చెల్లించాం. మిగతా బాకీలపై స్వీయ మదింపు చేపట్టాం. సుప్రీం కోర్టులో తదుపరి విచారణ తేదీలోగా దీన్ని కట్టేస్తాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ.9,500 కోట్లు భారతి ఎయిర్‌టెల్‌కి సంబంధించినవి కాగా రూ.500 కోట్లు భారతి హెక్సాకామ్కు చెందినవి. మరోవైపు, టాటా టెలీ, టాటా టెలీ (మహారాష్ట్ర) తరఫున మొత్తం బాకీల కింద రూ.2,197 కోట్లు కట్టేశామని, వీటికి సంబంధించిన లెక్కల వివరాలను కూడా డాట్‌కు అందజేశామని టాటా టెలీసర్వీసెస్ తెలిపింది. సోమవారం రూ.2,500 కోట్లు కట్టిన వొడాఫోన్ ఐడియా.. శుక్రవారం నాటికి మరో రూ.1,000 కోట్లు కడతామంటూ సుప్రీం కోర్టుకు విన్నవించింది. అప్పటిదాకా డాట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా సూచనలివ్వాలని కోరింది. అయితే, సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చింది. బ్యాంక్ గ్యారంటీల స్వాధీనం సహా బాకీల వసూలుకు అన్ని చర్యలూ తీసుకునేందుకు డాట్‌కు వెసులుబాటునిచ్చింది. డాట్ గణాంకాలను బట్టి సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం టెల్కోల నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద సుమారు రూ.1.47 లక్షల కోట్లు వసూలు కావాలి. ఎయిర్టెల్ సుమారు రూ. 35,586 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ సుమారు రూ.13,800 కోట్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరి 23లోగా వీటిని కట్టేయాలంటూ గతేడాది ఆదేశించినా.. అమలు కాకపోవడంపై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీలు, డాట్ కదిలాయి. దీనిపై మార్చి 17న సుప్రీం కోర్టు తదుపరి విచారణ జరపనుంది. బ్యాంక్ గ్యారంటీలపై డాట్ దృష్టి.. బాకీలను పూర్తిగా వసూలు చేసుకునే క్రమంలో.. టెల్కోలిచ్చిన బ్యాంక్ గ్యారంటీలను స్వాధీనం చేసుకునే అవకాశాలను డాట్ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై డాట్ అధికారులు మంగళవారం సమావేశమై, నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి. ఒకవేళ బ్యాంక్ గ్యారంటీలను నిజంగానే స్వాధీనం చేసుకుంటే... నిధులు సమీకరించుకునేందుకు నానా తంటాలు పడుతున్న వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు మూతబడక తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రెండు త్రైమాసికాల లైసెన్సు ఫీజులు, ఇతర బకాయిలకు సరిపడే స్థాయిలో ఈ బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు సంబంధించి ఇది సుమారు రూ.5,000 కోట్ల మేర ఉంటుంది. డాట్ లెక్కలను టెల్కోలు ప్రశ్నించాయి. తమ సొంత మదింపు ప్రకారమే కడతామంటూ సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ మొత్తం వివాద ప్రభావం బ్యాంకులపై ఎలా ఉండవచ్చన్న అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ఇంటర్వూ్య సందర్భంగా తెలిపారు. ఆ ఉత్తర్వులు.. నాన్–టెల్కోలకు కాదేమో: ధర్మేంద్ర ప్రధాన్ నాన్ టెలికామ్ ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కంపెనీలు ఏజీఆర్ బాకీలు కట్టాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు.. టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించకపోవచ్చని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. సమాచార లోపం వల్లే చమురు కంపెనీలకు కూడా డాట్ నోటీసులిచ్చి ఉంటుందని, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నాక తమ అభిప్రాయం తెలియజేశామని చెప్పారు. నోటీసులు అందుకున్న కంపెనీలకు టెలికం కార్యకలాపాలు ప్రధాన వ్యాపారం కాదన్నారు. స్పెక్ట్రం వాడుకున్నందుకు గాను గెయిల్, ఆయిల్ ఇండియా, పవర్‌గ్రిడ్ వంటి టెలికంయేతర కంపెనీలు కూడా రూ.2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్ నోటీసులివ్వటం తెలిసిందే. ద్రవ్య లోటు తగ్గుతుంది: ఆర్థికవేత్తల అంచనా టెలికం సంస్థలు రూ.1.20 లక్షల కోట్ల బాకీలు కట్టిన పక్షంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో.. సవరించిన గణాంకాల కన్నా ద్రవ్య లోటు తగ్గగలదని ఆర్థికవేత్తలు తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఇది 3.5 శాతానికి పరిమితం కాగలదని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. సవరించిన గణాంకాల ప్రకారం ఇది 3.8 శాతం స్థాయిలో ఉండొచ్చని గతంలో అంచనా వేశారు. ‘టెల్కోలు బాకీలు కట్టేందుకు గడువైన మార్చి 16 తర్వాత ద్రవ్య లోటు పరిస్థితి గణనీయంగా మారిపోతుంది. ఏజీఆర్ బాకీలు కనీసం రూ.1.20 కోట్లు వసూలైనా.. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు.. జీడీపీలో 3.5 శాతానికి దిగి రావొచ్చు‘ అని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు మళ్లీ కాలుష్యకారక పాత ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ అందుబాటు ధరల్లో అందించడం ద్వారా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. -
ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఐడియా!
ముంబై: భారీ రుణభారంతో కుదేలైన వొడాఫోన్ ఐడియా కంపెనీ ఆస్తుల విక్రయానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆప్టిక్ ఫైబర్ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్తోనూ, నవీ ముంబైలో ఉన్న డేటా సెంటర్‌ను అమ్మేయడానికి ఎడెల్వీజ్ గ్రూప్‌తోనూ ఐడియా చర్చలు జరుపుతోందని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... వొడాఫోన్ ఐడియా కంపెనీ తన 1,56,000 కిమీ. ఆప్టిక్ ఫైబర్ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ వ్యాపారం విలువ 150–200 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. ఇక నవీ ముంబైలోని డేటా సెంటర్‌ను ఎడెల్వీజ్ సంస్థకు చెందిన ఎడెల్వీజ్ ఈల్డ్ ప్లస్ ఫండ్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డేటా సెంటర్ విలువ 6–10 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చు. సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్)కు సంబంధించి వొడాఫోన్ ఐడియా రూ.53,000 కోట్ల బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్ట్ ఈ ఏడాది అక్టోబర్24న తీర్పునిచి్చంది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా ఈ బకాయిలను కొంతైనా తీర్చాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అయితే టెలికం రంగానికి రూ.7 లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఆప్టిక్ ఫైబర్ ఆస్తుల విక్రయానికి బ్యాంక్‌లు అభ్యతరం చెప్పే అవకాశాలున్నాయి. -
ప్రభుత్వం సాయం చేయాలి..లేదంటే మూతే!!
న్యూఢిల్లీ: కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్యలేమీ తీసుకోకపోతే కంపెనీని మూసివేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్– ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. సంస్థను మూసేయాల్సి ఉంటుంది‘ అని శుక్రవారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అయితే, ఎకానమీని గాడిలో పెట్టే దిశగా.. సంక్షోభంలో ఉన్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టెలికం అనేది చాలా కీలక రంగమని ప్రభుత్వం గుర్తించింది. మొత్తం డిజిటల్ ఇండియా కార్యక్రమమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ప్రభుత్వం నుంచి మరింత తోడ్పాటు అవసరం‘ అని ఆయన చెప్పారు. ఏ రకమైన ఊరట చర్యలు కోరుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ప్రధానమైన సమస్య .. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదమే. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ప్రభుత్వమే టెల్కోలకు వ్యతిరేకంగా ఈ కేసు వేసింది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు‘ అని బిర్లా పేర్కొన్నారు. ఏజీఆర్ లెక్కింపు వివాదంలో ఇటీవల కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయీలు కట్టాల్సి రానుంది. దీంతో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడం వల్ల వొడాఫోన్ ఐడియా సెపె్టంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ.50,921 కోట్ల మేర రికార్డు స్థాయిలో నష్టాలు ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి.. ఎకానమీకి ఊతమిచ్చేందుకు కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించటం మాత్రమే సరిపోదని, ఆర్థికంగా తోడ్పాటునిచ్చేలా పటిష్టమైన ఉద్దీపన ప్యాకేజీలాంటిది అవసరమని బిర్లా చెప్పారు. ఆ రూపంలో వచ్చే నిధులతో కొన్ని కార్పొరేట్లు రుణభారం తగ్గించుకోగలవని, మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించుకోగలవని ఆయన వివరించారు. ఎకానమీని గట్టెక్కించడానికి ఆదాయ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలపై స్పందిస్తూ.. ‘ఇది కేవలం వినియోగ డిమాండ్ పెంచడానికే పరిమితమైన సమస్య కాదు. ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ప్రజలు మరింతగా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీన్నుంచి బైటపడాలంటే.. ఉద్దీపన చర్యలు ప్రకటించడం ఒక్కటే మార్గం. జీఎస్టీని 15 శాతానికి తగ్గించారనుకోండి.. అదే పెద్ద ఉద్దీపన చర్య కాగలదు‘ అని బిర్లా చెప్పారు. మరోవైపు ఇన్ఫ్రాపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం కూడా ఎకానమీపై బాగా సానుకూల ప్రభావం చూపగలదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 6.1 శాతం నుంచి 5 శాతానికి కుదించిన నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
షాకింగ్ : భారీగా పెరగనున్న మొబైల్ చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : చౌక మొబైల్ చార్జీలకు కాలం చెల్లింది. ఈనెల 3 నుంచి కాల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్లతో పోలిస్తే తాజా ప్లాన్లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు. ప్రీపెయిడ్ సేవలు, ప్రోడక్టులపై నూతన టారిఫ్‌లు, ప్లాన్లను ప్రకటించామని, డిసెంబర్ 3 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతామని భారత టెలికాం ఆపరేటర్లు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెలికాం టారిఫ్‌ల సవరణపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపను ప్రకటించింది. మరోవైపు దేశంలో డిజిటల్ మళ్లింపు, డేటా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపని రీతిలో రానున్న వారాల్లో టారిఫ్‌లను పెంచుతామని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఎయిర్టెల్ సైతం టారిఫ్‌ల పెంపునకు రంగం సిద్ధం చేసింది. -
ఎజిఆర్ ఛార్జీలతో ఖంగుతిన్న టెలికాం సంస్థలు
-
వొడాఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పుతో వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ సీఈవో నిక్‌రీడ్ వ్యాఖ్యానించారు. వొడాఫోన్– ఐడియా జాయింట్ వెంచర్ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా రీడ్ ఈ విషయాలు చెప్పారు. ‘చాన్నాళ్లుగా భారత్ సవాళ్లమయంగా ఉంటోంది. అనుకూలంగా లేని నిబంధనలు, భారీ పన్నులు.. వీటికి తోడు సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల తీర్పు .. ఇవన్నీ కలిసి సంస్థకి ఆర్థికంగా పెనుభారం అవుతున్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం చార్జీల కింద భారత్‌లో సుమారు రూ.40 వేల కోట్ల దాకా బకాయిలు వొడాఫోన్–ఐడియా కట్టాల్సి రావొచ్చని అంచనా. దీంతో పాటు ఏప్రిల్– సెపె్టంబర్ మధ్యలో వొడాఫోన్ భారత విభాగం నిర్వహణ నష్టాలు 692 మిలియన్ యూరోలకు ఎగిశాయి. తాజా పరిణామాలతో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ వెల్లడించింది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో వొడాఫోన్ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. స్పెక్ట్రం వేలంలో పాల్గొనేదెవరు: సీవోఏఐ 5జీ సేవలకు సంబంధించి కావాలనుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని.. కాకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాత టెల్కోలు ఇందులో పాల్గొనకపోవచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ వ్యాఖ్యానించింది. -
ఆ కంపెనీలు బకాయిలు చెల్లించాల్సిందే..
కోల్కత్తా: ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు మినహాయింపులు ఇవ్వొద్దని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రిలయన్స్ జియో రెండో లేఖ రాసింది. వడ్డీ చెల్లింపులు, పెనాల్టీలను తగ్గించాలన్న వొడాఫోన్ ఐడియా అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయాన్ని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో గుర్తు చేసింది. కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం కంపెనీలకు మినహాయింపులు ఇచ్చే అవకాశమే లేదని జియో స్పష్టం చేసింది. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే సుప్రీం తీర్పును ఉల్లంఘించినట్లేనని జియో తెలిపింది. మరోవైపు ఐడియా వొడాఫోన్లు ఆర్థికంగా బలంగా ఉన్నాయని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఆ కంపెనీలకు ఉందని జియో తెలిపింది. కాగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పెనాల్టీలు, వడ్డీ చెల్లింపులు, లైసెన్స్ రుసుములు పరంగా 81,000కోట్లు చెల్లించాలని టెలికాం వర్గాలు తెలిపాయి. -
కేంద్రం వద్దకు వొడాఫోన్–ఐడియా
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రతికూల తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించాలని టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా నిర్ణయించుకుంది. వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికం శాఖను (డాట్) కోరాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టెల్కోలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం ఫీజులు కట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 21,000 కోట్లు కట్టాల్సి రానుంది. -
వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై: టెలికాం సంస్థ వొడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.69 ల ఒక కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 28 రోజల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో 150 నిమిషాల వాయిస్ కాల్స్, 250 ఎంబీ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. అలాగే పలు సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. తన ఆల్ రౌండర్ ప్రీ పెయిడ్ ప్లాన్లలో ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తన పోర్ట్ఫోలియోలోఇప్పటికే లాంచ్ చేసిన రూ .45 , 35, 65, 95, రూ .145 ప్లాన్లకు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. -
జియో: ఎగబాకిన వోడాఫోన్, ఎయిర్టెల్ షేర్లు
ముంబై : జియో షాకింగ్ నిర్ణయంతో ఎయిర్టెల్, వోడాఫోన్ పంట పండింది. వోడాఫోన్, ఐడియా ఏకంగా 18శాతం లాభదాయక షేర్లతో ఎగబాకింది. మరోవైపు ఎయిర్టెల్ 4.8 లాభదాయక షేర్లతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఇతర నెట్‌వర్క్‌ల పై ఉచిత కాల్స్ సదుపాయాన్ని అందిస్తున్న జియో సంస్థ తాజాగా వేరే నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జియో మాత్రం కాల్ టెర్మినేషన్ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగిస్తామని పేర్కొంది. అయితే తమ సంస్థ ప్రారంభించినప్పటి నుండి ప్రత్యర్థి ఆపరేటర్లకు వినియోగదారుల రుసుము 13,500 కోట్లు చెల్లించినట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో బిజినెస్ అనలిస్ట్ క్రిస్ లేన్ స్పందిస్తూ జియో లాభదాయక వృద్దిని ఆశిస్తున్నట్లు తెలిపాడు. -
జియో దూకుడు: మళ్లీ టాప్‌లో
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్జియో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. 4జీ డౌన్లోడ్ స్పీడ్ చార్టులో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే అప్లోడ్ స్పీడ్‌లో వోడాఫోన్ అగ్రభాగాన నిలిచింది. ఆగస్టు మాసానికి సంబంధించిన గణాంకాలను టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ తాజాగా విడుదల చేసింది. ఆగస్టు నెలలో 21.3 ఎంబీపీఎస్ సగటు డౌన్లోడ్ వేగంతో టాప్ లోఉంది జియో. జూలైలో 21.0 ఎంబీపీఎస్‌తో పోలిస్తే మరికొంచెం మెరుగుపడింది. మొత్తం 12 నెలల్లో అత్యధిక సగటు డౌన్లోడ్ వేగంతో రిలయన్స్ జియో 2018లో అత్యంత వేగవంతమైన 4 జీ ఆపరేటర్‌గా నిలిచింది. కాగా ఈ ఏడాది మళ్ళీ మొత్తం 8 నెలల్లో జియో అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రచురించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదు. జూలైలో 8.8 ఎంబీపీఎస్ నుండి ఆగస్టులో 8.2 ఎంబీపీఎస్ పడిపోయింది. వోడాఫోన్, ఐడియా సెల్యులార్ తమ వ్యాపారాలను విలీనం అనంతరం వోడాఫోన్ ఐడియాగా పనిచేస్తున్నప్పటికీ, ట్రాయ్ వారి నెట్వర్క్ పనితీరును విడి, విడిగానే ప్రచురించింది. వోడాఫోన్ నెట్‌వర్క్‌లో సగటు 4జి డౌన్లోడ్ వేగం ఆగస్టులో 7.7 ఎంబీపీఎస్ వద్ద ఉండగా, ఐడియా జూలైలో సగటు డౌన్లోడ్ వేగం 6.6 ఎంబీపీఎస్ నుండి 6.1 ఎంబీపీఎస్‌కు తగ్గింది. వోడాఫోన్ ఆగస్టులో 4జీ అప్లోడ్ వేగం సగటు 5.5 ఎంబీపీఎస్ సాధించగా, జూలై నెలలో 5.8 ఎంబీపీఎస్నుంచి క్షీణించింది. ఐడియా, ఎయిర్టెల్ నెట్వర్క్ ఆగస్టులో సగటున 4 జి అప్లోడ్ వేగంలో వరుసగా 5.1, 3.1 ఎంబీపీఎస్ వద్ద స్వల్ప క్షీణతను నమోదు చేయగా, జియో 4.4 ఎంబీపీఎస్ సగటు అప్లోడ్ మెరుగుపడటం విశేషం. -
ఎయిర్టెల్, జియో.. ఏది స్పీడ్?
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగమైన మొబైల్ నెట్వర్క్ సేవలందిస్తున్న కంపెనీగా ‘భారతీ ఎయిర్టెల్’ నిలిచిందని స్పీడ్‌టెస్ట్ డేటా సేవలందించే సంస్థ ‘ఊక్లా’ ప్రకటించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు సేకరించిన సమాచారం ప్రకారం ఎయిర్టెల్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించింది. ఢిల్లీ పరిధిలో అత్యంత వేగమైన 4జీ మొబైల్ నెట్‌వర్క్‌గా వొడాఫోన్ నిలిచింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోవడంతో డేటా వేగం పెరిగినట్టు వెల్లడించింది. గతనెల్లో రిలయన్స్ జియో నెట్వర్క్ చాలా నెమ్మదిగా ఉందని పేర్కొంది. అయితే, ఊక్లా నివేదిక ట్రాయ్ తాజాగా ప్రకటించిన సమాచారానికి విరుద్ధంగా ఉండడం విశేషం. బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రథమ స్థానంలో ఉండగా.. వేగం విషయంలో పోటీ కంపెనీలకు రెట్టింపు వేగంతో ఉందని ట్రాయ్ విశ్లేషణ కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది మే నెల నేంచి ఎయిర్టెల్, జియో డౌన్లోడ్ స్పీడ్ తగ్గిందని ‘ఊక్లా’ తెలిపింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోయిన తర్వాత ఈ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల డౌన్లోడ్ స్పీడ్ పుంజుకుందని గణాంకాలతో వివరించింది. (చదవండి: ఇండియా, రిలయన్స్ రైజింగ్.. ఎవ్వరూ ఆపలేరు!) -
ట్రూకాలర్‌తో జాగ్రత్త..
ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ఎంతో ఫేమస్. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్ ప్రత్యేకత. అయితే, ట్రూకాలర్ యాప్‌తో యూజర్ ఖాతా వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశముందని తాజాగా తేలింది. ఈ మేరకు యాప్‌లోని ప్రధాన లోపాన్ని సెక్యూరిటీ పరిశోధకుడు ఎహరాజ్ అహ్మద్ కనుగొన్నారు. రద్దైన, పనిచేయని ఫోన్ నెంబర్ల ఆధారంగా కూడా ట్రూకాలర్‌లోని ఖాతాదారుల వివరాలు పసిగట్టవచ్చునని ఆయన గుర్తించారు. ఒకవేళ ట్రూకాలర్ ఖాతాను దుర్వినియోగపరుస్తే ట్రూకాలర్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ నెంబర్ ‘ట్రూఎస్డీకే’ ద్వారా సైన్ చేసి తెలుసుకోవచ్చు. ప్రసిద్ది చెందిన షాప్‌క్లూస్, ఓయో, గ్రోఫర్స్ మింత్ర లాంటి ఆప్స్ ఈ సూత్రాన్నే పాటిస్తున్నాయి. అయితే, ట్రూకాలర్ నంబర్ వెరిఫికేషన్ సిస్టమ్‌లోకి సైబర్ అటాకర్లు లాగిన్ కావడానికి ఈ లోపం ఉపకరిస్తుందని, ఒకసారి ఎవరైనా అటాకర్ నెంబర్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా ట్రూకాలర్ ఖాతాదారుడి అకౌంట్లోకి లాగిన్ అయితే.. అతని వివరాలు, డాటా అటాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని అహ్మద్ తెలిపారు. దీనిని ఒక వీడియో ద్వారా ఆయన సవివరంగా వివరించారు. ఇందులో ట్రూకాలర్ చాట్ నుంచి పనిచెయ్యని మొబైల్ నెంబర్‌కు మెసెజ్ పంపించారు . అది ఎయిర్టెల్ కస్టమర్ కేర్ సెంటర్దని తేలింది. ఈ మేరకు ట్రూకాలర్ ఖాతాల దుర్వినియోగంపై ఎయిర్టెల్, వోడాఫోన్ సంస్థలు స్పందిస్తూ అహ్మద్ ప్రయత్నం చాలా గొప్పదని, ఆయన కనిపెట్టిన లోపాలను గ్రహించామని తెలిపారు. అతనితో కలిసి పనిచేస్తామని సంస్థలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని పేర్కొన్నాయి. -
వొడాఫోన్ ఐడియా నష్టాలు 4,874 కోట్లు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో రూ.4,874 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.4,882 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంటే రూ.8 కోట్ల నష్టాలను తగ్గించుకుంది. వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ రెండూ 2018 ఆగస్ట్ 31 నుంచి విలీనమై వొడాఫోన్ ఐడియాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రితం ఏడాది జూన్ త్రైమాసికం ఫలితాలతో ఈ ఏడాది జూన్ త్రైమాసికం ఫలితాలను పోల్చి చూడడం సరికాదు. జూన్ క్వార్టర్లో ఆదాయం మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.11,775 కోట్ల నుంచి రూ.11,270 కోట్లకు తగ్గింది. కొంత మంది కస్టమర్లను కోల్పోవడం, ఉన్న కస్టమర్లలో కొంత మంది తక్కువ విలువ కలిగిన ప్లాన్లకు మారిపోవడం, సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం తగ్గడం (ఏఆర్పీయూ) ప్రభావం చూపించాయి. ‘‘మేము చెప్పిన విధానాన్నే ఆచరణలో అమలు చేస్తున్నాం. దీని తాలూకు ఫలితాలు ఇంకా కనిపించలేదు. మా నెట్వర్క్ అనుసంధానత, కస్టమర్ల డేటా వినియోగ అనుభవం చాలా ప్రాంతాల్లో మెరుగుపడింది’’ అని వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4జీ కవరేజీ విస్తరిస్తామని, డేటా సామర్థ్యాలను కూడా పెంచుకుంటామని చెప్పారు. జూన్ త్రైమాసికంలో రూ.2,840 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టామని కంపెనీ తెలిపింది. కంపెనీ యూజర్ల సంఖ్య 33.4 కోట్ల నుంచి 32 కోట్లకు తగ్గడం గమనార్హం. -
పేమెంట్ బ్యాంకులు... ప్చ్!
ప్రజలందరికీ మరింతగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పేమెంట్స్ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. లా¿¶ సాటైన వ్యాపార విధానం లేకపోవడంతో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నాళ్లకే కొన్ని మూతబడగా, అసలు మొదలుపెట్టకుండానే మరికొన్ని వైదొలుగుతున్నాయి. వొడాఫోన్ ఎం–పెసా ఈ నెల తొలినాళ్లలోనే కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ (ఏబీఐపీబీ) ఈ ఏడాది అక్టోబర్ నుంచి కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది. వ్యాపార పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల వ్యాపార విధానం లాభదాయకత దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 2018 ఫిబ్రవరిలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఏబీఐపీబీలో దాదాపు 20 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. సుమారు 200 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఏబీఐపీబీ మూసివేతతో వీరిని గ్రూప్‌లోని ఇతర సంస్థలకు బదిలీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విత్‌డ్రా చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు ఇందులో 51 శాతం, వొడాఫోన్ ఐడియాకు 49 శాతం వాటాలు ఉన్నాయి. 2017–18లో ఏబీఐపీబీ రూ. 24 కోట్ల నష్టం నమోదు చేసింది. 11 బ్యాంకులకు లైసెన్సులు.. 2015లో 11 సంస్థలకు ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులు ఇచ్చింది. అయితే, టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీతో పాటు కన్సార్షియంగా ఏర్పడిన దిలీప్ సంఘ్వీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు పేమెంట్స్ బ్యాంక్ ప్రతిపాదనలను పక్కన పెట్టాయి. సూత్రప్రాయంగా పొందిన లైసెన్సులను తిరిగిచ్చేశాయి. ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులు పూర్తి స్థాయి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటితో పోలిస్తే ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు పరిమిత స్థాయిలో ఉన్నాయి. 2018 మే ఆఖరు నాటికి దేశీయంగా పేమెంట్స్ బ్యాంకుల్లో రూ. 540 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అత్యధికంగా రూ. 307 కోట్లు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో రూ. 194 కోట్లు, ఫినోలో రూ. 37 కోట్లు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో రూ. 1.39 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. కఠినతరమైన నిబంధనలతో కష్టాలు.. ఇటు డిపాజిట్ల సమీకరణపరంగానూ అటు రుణాల వితరణలోనూ కష్టతరమైన నిబంధనలు పాటించాల్సి వస్తుండటమే పేమెంట్స్ బ్యాంకులు విఫలమవుతుండటానికి కారణాలుగా ఉంటున్నాయి. పేమెంట్ బ్యాంకులు ఒక్కో ఖాతాదారు నుంచి రూ. 1 లక్షకు మించి డిపాజిట్లు సేకరించడానికి లేదు. రుణాలివ్వడానికి లేదు. కానీ సేకరించిన నిధుల్లో 75 శాతాన్ని ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రుణాలపరమైన రిస్కులు పెద్దగా లేకపోయినప్పటికీ 15 శాతం మేర మూలధనం నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి వస్తోంది. ఇక ప్రతీ వివరాన్నీ నియంత్రణ సంస్థకు తెలియజేయాలన్న మరో నిబంధన కూడా సమస్యగా ఉంటోంది. పేమెంట్ బ్యాంకులు వైవిధ్యమైన సేవలు అందించేందుకు ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నాయి. అయితే, వివరాల వెల్లడి నిబంధనల వల్ల మొత్తం వ్యాపార ప్రణాళికను బైటపెట్టినట్లవుతుందని, ఫలితంగా పోటీ సంస్థలకు తమ వ్యాపార రహస్యాలను చేజేతులా అందించినట్లవుతుందని అవి ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అవి పూర్తి స్థాయి బ్యాంకులకు ఎప్పటికీ నిజమైన పోటీదారుగా నిలిచే పరిస్థితులు లేవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఖాతాదారుల వివరాల ్ర«ధువీకరణ కోసం ఆధార్ ఆధారిత ప్రక్రియను పేమెంట్స్ బ్యాంకులకు కూడా అందుబాటులోకి తెస్తే .. కేవైసీ నిబంధన పాటింపు వ్యయాలు తగ్గుతాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ సాధనాలను విక్రయించేందుకు థర్డ్ పార్టీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా పేమెంట్స్ బ్యాంకులకు వెసులుబాటు కల్పించాలని తెలిపింది. ఇలాంటి విధానాలతో పేమెంట్స్ బ్యాంకులు విజయవంతం కాగలవని పేర్కొంది. అనిశ్చితిలో బ్యాంకుల భవిష్యత్..: ఎస్బీఐ నివేదిక పేమెంట్స్ బ్యాంకుల భవిష్యత్ అనిశ్చితిలో ఉందని, అవి సమర్ధంగా పనిచేయాలంటే నియంత్రణ సంస్థ తోడ్పాటు తప్పనిసరని ఎస్బీఐ ఒక నివేదికలో వెల్లడించింది. ‘పేమెంట్ బ్యాంక్‌ల భవిష్యత్ అనిశ్చితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, నియంత్రణ సంస్థ, ప్రభుత్వ తోడ్పాటుతో వీటి వ్యాపారం క్రమంగా విస్తరించి, వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో పేమెంట్స్ బ్యాంక్ విధాన ం విఫలమైనట్లుగానే కనిపిస్తోందని వివరించింది. 11 సంస్థలు లైసెన్సులు పొందినప్పటికీ నాలుగు సంస్థలు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించడం అవి కూడా మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొనడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. -
ఎయిర్టెల్, వొడా, ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నెట్వర్క్ కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చనందుకు గాను భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు భారీ పెనాల్టీ భారం పడింది. టెలికం శాఖ అత్యున్నత నిర్ణయాల విభాగం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) పెనాల్టీ విధించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే, టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల నేపథ్యంలో రూ.3,050 కోట్ల జరిమానాను అమలు చేసే ముందు దీన్ని సవరించే విషయంలో ట్రాయ్ సూచనలను తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. టెలికం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియోకు ఇంటర్కనెక్షన్ పాయింట్లను ఇచ్చేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై రూ.3,050 కోట్ల పెనాల్టీని విధించాలని 2016 అక్టోబర్‌లో ట్రాయ్ సిఫారసు చేసింది. ఇందులో ఎయిర్టెల్, వొడాఫోన్లకు రూ.1,050 కోట్ల చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా అమలు చేయాల్సి ఉంది. వొడాఫోన్, ఐడియాలు విలీనమై ఒకే సంస్థగా ఏర్పడడంతో ఇప్పుడు ఉమ్మడి జరిమానాను వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సి ఉంటుంది. పోటీ సంస్థలు సరిపడా ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చకపోవడంతో తమ నెట్‌వర్క్‌కు సంబంధించి 75 శాతం కాల్స్ ఫెయిల్ అవుతున్నాయంటూ జియో చేసిన ఫిర్యాదు ఆధారంగా ట్రాయ్ నాడు చర్యలకు ఆదేశించింది. అయితే, నాణ్యమైన సేవలను తన కస్టమర్లకు అందించనందుకు రిలయన్స్ జియోపై కూడా పెనాల్టీ విధించాల్సి ఉంటుందని, నాణ్యమైన సేవలందించే ప్రాథమిక బాధ్యతను ఇతరులపై మోపవచ్చా? అంటూ డీసీసీలో భాగమైన ఓ శాఖా కార్యదర్శి ప్రశ్నించగా... దీన్ని డీసీసీ సభ్యులు కొట్టిపారేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
జియో, ఎయిర్‌టెల్‌కు కౌంటర్ : వొడాఫోన్ సూపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశం తరువాత నుంచి జోరందుకున్న టారిఫ్‌ల వార్ కొనసాగుతోంది. తాజాగా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, జియోకు షాకిచ్చేలా వొడాఫోన్ అద్భుత ఆఫర్ ప్రకటించింది. తాజాగా, వొడాఫోన్ తన యూజర్లకోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీబ్యాంక్ భాగస్వామ్యంతో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇది వోడాఫోన్ ఎగ్జిస్టింగ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ లాంటి ప్రయోజనాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ప్యాకేజీలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత ఫోన్ కాల్స్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది. ఇది కేవలం వొడాఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ వెబ్సైట్ ద్వారా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఇప్పటికే వోడాఫోన్ యూజర్ అయి ఉండాలి. (ఫస్ట్ టైమ్ వోడాఫోన్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు) . సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన నెల రోజుల్లోనే క్రెడిట్ కార్దు ద్వారా ఒకేసారి లేదా దఫ దఫాలుగా రూ.4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. వోడాఫోన్ లేదా ఐడియా వెబ్సైట్ ద్వారాగానీ, ఎక్కడైనా ఖర్చు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ మొత్తం ఖర్చు చేసిన అనంతరం ఆటోమేటిక్‌గా వొడాఫోన్ ఆఫర్‌కు యూజర్ అర్హుడవుతారు. ఇందుకు సంబంధించిన బెనిఫిట్స్ 45 రోజుల్లో వొడాఫోన్‌కు క్రెడిట్ అవుతాయి. ఆ తర్వాత నుంచి రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపించుకునే సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆఫర్ వాలిడిటీ సంవత్సరం (365) రోజులు. అయితే ఈ ఆఫర్ కొన్ని సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది ఈ కొత్త ప్రీపెయిడ్ ఆఫర్ పరిమిత సర్కిళ్లకు మాత్రమే అంటే..ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు, వడోదర, చండీగఢ్, సికింద్రాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే నగరాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్‌ను విస్తరిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వోడాఫోన్ వెబ్సైట్ ప్రకారం ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు ఉంది. మరిన్ని వివరాలు వొడాఫోన్ వెబ్సైట్లో కాగా ఎయిర్టెల్ తరహాలోనే వొడాఫోన్ కూడా 1699 రూపాయల వార్షిక ప్లాన్‌ను ఇప్పటికే లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజుకు 100ఎస్ఎంఎస్లు, 1 జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇష్యూ ధర రూ.12.50
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా కంపెనీ రైట్స్ ఇష్యూ ధరను నిర్ణయించింది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదిత రైట్స్ ఇష్యూలో ఒక్కో ఈక్విటీ షేర్ (రూ.10 ముఖ విలువ) ధరను రూ.12.50కు జారీ చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. బుధవారం వొడాఫోన్ ఐడియా ముగింపు ధర(రూ.33)కు ఇది దాదాపు 62 శాతం తక్కువ. రికార్డ్ డేట్ వచ్చే నెల 2 రైట్స్ ఇష్యూకు రికార్డ్ డేట్‌గా వచ్చే నెల 2ను నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 2వ తేదీలోపు ఎవరి దగ్గరైతే వొడాఫోన్ ఐడియా షేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ రైట్స్ ఇష్యూలో షేర్లు పొందడానికి అర్హత ఉంటుంది. ప్రతి 38 ఈక్విటీ షేర్లకు కొత్తగా 87 రైట్స్ షేర్లను జారీ చేస్తారు. రైట్స్ ఇష్యూ ఏప్రిల్ 10న మొదలై 24న ముగుస్తుంది. ఈ రైట్స్ ఇష్యూలో ప్రమోటర్ సంస్థలు–వొడాఫోన్ గ్రూప్ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.7,250 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. రైట్స్ ఇష్యూలో భాగంగా ఈ కంపెనీ 2,000 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. రైట్స్ ఇష్యూ వల్ల సమకూరే నిధులతో ఆర్థికంగా మరింతగా పుంజుకొని రిలయన్స్ జియోకు వొడాఫోన్ ఐడియా గట్టిపోటీనివ్వగలదని నిపుణుల అంచనా. ఐడియా రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉంది. ఈ రుణ భారం తగ్గించుకోవడానికి రైట్స్ ఇష్యూ నిధులను వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. నష్టాల్లోంచి.. లాభాల్లోకి ఐడియా షేరు... రైట్స్ ఇష్యూ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా తీవ్రమైన ఒడిదడుకులకు గురైంది. రైట్స్ ఇష్యూ ధర వార్త వెలువడగానే ఈ షేర్ 8 శాతం పతనమై రూ.29.60ను తాకింది. ఆ తర్వాత కోలుకుని ఇంట్రాడే గరిష్ట స్థాయి, రూ.33.50ను తాకింది. చివరకు 3 శాతం లాభంతో రూ.33 వద్ద ముగిసింది. -
మళ్లీ జియోనే టాప్
సాక్షి, ముంబై : రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్‌లో తన ఆధిక్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జనవరి మాసంతో పోలిస్తే మరింత పుంజుకుని ఫిబ్రవరిలో 20.9 ఎంబీపీఎస్‌గా నమోదైంది. మరో టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ 9.4 ఎంబీపీఎస్ రెండవస్థానంలో నిలిచింది. 6.8 ఎంబీపీఎస్‌తో వోడాఫోన్ మూడవ స్థానాన్ని సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఫిబ్రవరిలో సగటున సెకన్ కి 20.9 మెగాబిట్ స్పీడ్ తో రిలయన్స్ జియో అన్నిటి కంటే వేగమైన 4జి నెట్ వర్క్ గా నిలిచింది. జనవరిలో పోలిస్తే భారతీ ఎయిర్టెల్ స్పీడ్ 9.5 వద్ద, వొడాఫోన్ స్పీడ్ 6.7ఎంబీపీఎస్ గా నమోదయ్యాయి. మరోవైపు ఐడియా డౌన్ లోడ్ స్పీడ్ స్వల్పంగా పుంజుకుంది. ఫిబ్రవరిలో ఐడియా నెట్ వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడ్ 5.7 ఎంబీపీఎస్‌గా ఉంది. జనవరిలో ఇది 5.5 ఎంబీపీఎస్ గా ఉంది. అయితే వోడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు మెగా మెర్జర్ అనంతరం వోడాఫోన్ ఐడియాగా అవతరించిన సంగతి తెలిసిందే. కానీ ట్రాయ్ ఈ రెండు నెట్ వర్క్ ల ప్రదర్శన గణాంకాలను వేర్వేరుగా విడుదల చేసింది. సగటు అప్లోడ్ స్పీడ్ విషయంలో వోడాఫోన్ మిగతా నెట్ వర్క్‌ల కంటే ముందుంది. ఫిబ్రవరిలో వోడాఫోన్ అప్ లోడ్ స్పీడ్ 6ఎంబీపీఎస్ గా ఉంది. గత నెలలో ఇది 5.4 ఎంబీపీఎస్ మాత్రమే ఐడియా, ఎయిర్టెల్ సగటు 4జి అప్ లోడ్ స్పీడ్ లు తగ్గి వరుసగా 5.6 ఎంబీపీఎస్, 3.7 ఎంబీపీఎస్ గా ఉన్నాయి. జియో సగటు అప్ లోడ్ స్పీడ్ కొంత మెరుగై 4.5ఎంబీపీఎస్ కి చేరింది. -
వోడాఫోన్ కొత్త ప్లాన్ : కొత్త కస్టమర్లకే
సాక్షి, ముంబై: వోడాఫోన్ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.351 ల ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఫస్ట్ రీచార్జ్ ప్లాన్‌గా తీసుకొచ్చిన ఈ ప్లాన్ వోడాఫోన్ కొత్త సిమ్ వాడే కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ఎస్ఎంఎస్ కూడా సదుపాయాన్ని అందిస్తున్నట్టు వోడాఫోన్ తెలిపింది. -
వొడాఫోన్ ఐడియా నష్టం 5,005 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్– ఐడియాకు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,006 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటం, నెట్వర్క్ ఇంటిగ్రేషన్ వ్యయాలు కూడా ఎక్కువగా ఉండటం, మొబైల్ టవర్ వ్యాపారం నుంచి నిష్క్రమించిన వ్యయాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ రెండు కంపెనీలకు కలసి రూ.1,285 కోట్ల నష్టాలొచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ఐడియా, వొడాఫోన్ల విలీనం పూర్తయినందువల్ల ఫలితాలను పోల్చడానికి లేదు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాలు మరింతగా పెరిగాయి. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లు... ఈ క్యూ3లో మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లకు పెరిగిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఈ క్యూ2లో సాధించిన మొత్తం ఆదాయం రూ.7,879 కోట్లతో పోల్చితే 52 శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ బాలేశ్ శర్మ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.6,552 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లుగా ఉన్నాయని, మొబైల్ టవర్ల వ్యాపారం నుంచి బైటకు వచ్చామని, దీనికి గాను వెండర్లకు రూ.725 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉందని తెలిపారు. ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ వాటా విలువ రూ.4,960 కోట్లుగా ఉండొచ్చ న్నారు. అలాగే 1.58 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నామని, ఈ విక్రయాల ద్వారా సమకూరిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. రూ.89కు ఏఆర్పీయూ.. ఈ క్యూ3లో ఎబిటా రూ.1,137 కోట్లుగా నమోదైందని, ఈ క్యూ2లో 6 శాతంగా ఉన్న మార్జిన్ ఈ క్యూ3లో 9.7 శాతానికి పెరిగిందని బాలేశ్ శర్మ పేర్కొన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 1.5 శాతం పెరిగి రూ.89కు చేరిందని తెలిపారు. ఒక్కో వినియోగదారుడు వినియోగించే డేటా 5.6 జీబీనుంచి 6.2 జీబీకి పెరిగిందన్నారు. 75 కోట్ల మందికి 4జీ సర్వీసులందేలా 11,123 సైట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ క్యూ3లో కొత్తగా 95 లక్షల 4జీ యూజర్లు జతయ్యారని, దీంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 7.53 కోట్లకు చేరిందని వివరించారు. 4జీ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టామని బాలేశ్ శర్మ చెప్పారు. అలాగే 4జీ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనేది లక్ష్య మన్నారు. మూలధన సమీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రణాళికకనుగుణంగా సమీకరించిన నిధులతో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తాజా ఏడాది కనిష్టానికి షేరు.. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.29.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.28.80ను తాకింది. -
జియో తగ్గింది..అందులో వొడాఫోన్ టాప్!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అన్లిమిటెడ్ డేటాతో వినోదాన్ని అందిస్తున్న టెలికాం సంచలనం రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా తగ్గిందని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. గతేడాది నవంబరులో 20.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో సరికొత్త రికార్డును నమోదు చేసిన జియో.. డిసెంబరులో మాత్రం ఈ స్పీడును 8 శాతానికి తగ్గించి(18.7 ఎంబీపీఎస్) యూజర్లను నిరాశపరిచింది. కాగా జియో దాటికి తట్టుకోలేక చతికిల పడిన ఎయిర్టెల్, వొడాఫోన్- ఐడియా మాత్రం ఓ మోస్తరుగా స్పీడును పెంచాయి. నవంబరులో 9.7 ఎంబీపీఎస్‌గా ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడు డిసెంబరులో 9.8 ఎంబీపీఎస్‌కు చేరింది. ఇక జియో నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ఒకే గొడుగు కిందకి వచ్చినప్పటికీ వొడాఫోన్- ఐడియాల డౌన్లోడ్ స్పీడు మాత్రం మెరుగుపడలేదు. అయితే ఈ రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించిన గణాంకాలను ట్రాయ్ విడివిడిగానే ప్రకటించింది. నవంబరులో 6.8 ఎంబీపీఎస్‌గా ఉన్న వొడాఫోన్ స్పీడు.. డిసెంబరులో 6.3 ఎంబీపీఎస్.. అదేవిధంగా ఐడియా డౌన్లోడ్ స్పీడు నవంబరులో 5.6 ఎంబీపీఎస్ కాగా డిసెంబరులో 5.3 ఎంబీపీఎస్‌కు తగ్గింది. అయితే డౌన్లోడ్ స్పీడు తగ్గినప్పటికీ ఏడాది కాలంగా ఈ కేటగిరీలో జియో తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. డేటా షేరింగ్, బ్రౌజింగ్, వీడియోల వీక్షణ తదితర అంశాల్లో కీలకమైన నెట్వర్క్ స్పీడు యూజర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీడు కాస్త తగ్గినప్పటికీ ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియోనే తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక అప్లోడింగ్ విషయానికొస్తే... నవంబరులో 4.5 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో స్పీడు డిసెంబరులో 4.3కి తగ్గగా.. వొడాఫోన్ మాత్రం 4.9 నుంచి 5.1ఎంబీపీఎస్‌కి స్పీడును పెంచిందని ట్రాయ్ పేర్కొంది. మైస్పీడ్ యాప్ రూపొందించిన డేటా స్పీడ్ వివరాల ఆధారంగా ట్రాయ్ ఈ గణాంకాలను వెల్లడించింది. -
వోడాఫోన్ బంపర్ ఆఫర్
టెలికాంసంస్థ వొడాఫోన్ తన ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, జియోలకు దీటుగా ఆఫర్లతో ముందుకొచ్చింది. వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌లను మై వొడాఫోన్ యాప్ ద్వారా రీచార్జి చేసుకున్న వారికి నిర్దేశిత వోచర్లు వస్తాయి. అంటే రీచార్జ్ చేసుకున్న ప్లాన్ఆధారంగా ఈ వోచర్లు లభిస్తాయి. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.399, రూ.458, రూ.509 ప్యాక్‌లను రీచార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.399 రీచార్జికు 8 వోచర్లు, రూ.458కు 9, రూ.509 రీచార్జికి 10 వోచర్లను వోడాఫోన్ అందిస్తోంది. వీటిద్వారా తదుపరి రీచార్జ్ సమయంలో 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. -
వోడాఫోన్ దూకుడు : మరో ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై: టెలికాం సంస్థ వోడాఫోన్ రీచార్జ్ ప్లాన్‌లో పరిచయడం చేయడంలో దూకుడుగా ఉంది. ప్రత్యర్థులకు సవాల్‌గా అందుబాటు ధరలో మరో రీచార్జ్ ప్లాన్‌ను లాచ్ చేసింది. ముఖ్యంగా ఎక్కువ రోజుల వాలిడిటీతో రూ.200వందల లోపు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.189ల ప్రీపెయిడ్ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. రూ. 189ల ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, 2జీ డేటా ప్రయోజనాలను వోడాఫోన్ అందిస్తోంది. అయితే ఎస్ఎంఎస్ల ఆఫర్ లేదు. అలాగే కాల్స్ వినియోగంలో కూడా పరిమితులు విధించింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం రోజువారీ 250 నిమిషాలు, వారానికి 1,000 నిమిషాలు వాడుకునేలా నిబంధన విధించింది. అంటే వాయిస్ కాలింగ్‌లో ఈ పరిమితి దాటితే సెకనుకు పైసా చొప్పున చార్జ్ చేయనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. జియో, ఎయిర్టెల్, ఐడియా అందిస్తున్న ఈ తరహా ప్లాన్లు అన్నీ రూ.200కు పైనే వసూలు చేస్తున్నాయి. జియో 198 రూపాయల ప్లాన్‌లో 56జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. రోజుకు 100ఎంఎస్ఎస్లు ఆఫర్ చేస్తోంది. అయితే ప్లాన్ వాలిడిటీ మాత్రం రూ.28రోజులు. ఇటీవల రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అన్లిమిటెడ్ కాల్స్, 4జీబీ 4జీ/3జీ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందులో కూడా ఎస్ఎంఎస్ ఆఫర్ లేదు. ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. మరోవైపు జియో అందిస్తున్న 84 రోజుల వాలిడిటీ ఉన్న రూ.399 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ వినియోగించుకోవచ్చు. -
విలీనం పూర్తి : 2500 మంది ఉద్యోగులకు ఎసరు
న్యూఢిల్లీ : ఐడియా-వొడాఫోన్ కంపెనీల విలీనం పూర్తయింది. ఈ రెండు సంస్థలు కలిసి దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఐడియా-వొడాఫోన్లు తమ హెడ్‌కౌంట్‌ను(ఉద్యోగుల సంఖ్యను) 15వేలకు కుదించాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల్లో 17,500 నుంచి 18వేల మంది ఉద్యోగులున్నారు. అంటే వీరిలో 2500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసేయాలని ఐడియా-వొడాఫోన్లు నిర్ణయించాయి. విలీనం సందర్భంగా 10 బిలియన్ డాలర్ల పొదుపు ప్రణాళికను అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులపై వేటు పడుతోంది. కొంతమంది ఉద్యోగులను పేరెంట్ కంపెనీలు వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి తీసుకుని, మిగతా కొంతమందిపై వేటు వేయాలని ఈ విలీన సంస్థ ప్లాన్ చేసింది. అంతేకాక ఉద్యోగులకు ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను కూడా ప్రస్తుతం పక్కన పెట్టింది. అయితే ఉద్యోగుల వేటుకు సంబంధించిన వార్తలు మార్కెట్లో చక్కర్లు కొడుతుండటంతో, ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని వొడాఫోన్ ఇండియాకొట్టిపారేసింది. ‘కొంతవరకు హేతుబద్దీకరణ ఉంటుంది. అది సర్వసాధారణం. కంపెనీ వచ్చే కొన్ని నెలల్లో ఉద్యోగుల సంఖ్యను 2000 నుంచి 2500 మందిని తగ్గించుకోవాలనుకుంటుంది’ అని ఈ విషయం తెలిసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే ఉద్యోగుల సంక్షేమాన్ని కంపెనీ పట్టించుకుంటుందని, సెవరెన్స్ ప్యాకేజీలను అందిస్తుందని, పేరెంట్ గ్రూప్ ఆదిత్యా బిర్లా గ్రూప్‌లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే టెలికాం కంపెనీల్లో ఉద్యోగుల కోత ఇదేమీ కొత్త కాదు. రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, టెలికాం రంగం అస్తవ్యస్తమైంది. ఇక అప్పటి నుంచి టెలికాం కంపెనీలు పోటీని తట్టుకోలేక, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేటు వేయడం ప్రారంభించాయి. వొడాఫోన్ ఇండియా కూడా వాలంటరీ అట్రిక్షన్‌ను ఆఫర్చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగుల సంఖ్య తగ్గించేస్తుంది. అయితే వొడాఫోన్ ఇండియా ఉద్యోగులను, ఐడియా సెల్యులార్ ఉద్యోగులను విలీన సంస్థ సమానంగా చూస్తోంది. ఉద్యోగులందరిన్నీ ఎంతో గౌరవంగా చూస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా హెచ్ఆర్ హెడ్ చెప్పారు. -
మెగా టెల్కో ఆవిర్భావం..
న్యూఢిల్లీ: దేశీయంగా నంబర్‌వన్ టెల్కో ఆవిర్భావం దిశగా.. టెల్కో దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ భారత విభాగం విలీనం పూర్తయ్యింది. ఇకపై వొడాఫోన్ ఐడియాగా వ్యవహరించే ఈ సంస్థకు 40.8 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. సుమారు 23.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు) విలువ చేసే ఈ డీల్‌తో వొడాఫోన్ ఐడియా నంబర్‌వన్ టెల్కోగా ఆవిర్భవించగా.. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న భారతి ఎయిర్టెల్ రెండో స్థానానికి పరిమితమవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ (ఐడియా సెల్యులార్ ప్రమోటర్) అధిపతి కుమార మంగళం బిర్లా కొత్త సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనికి 12 మంది డైరెక్టర్ల బోర్డు ఉంటుందని ఇరు సంస్థలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఐడియా సెల్యులార్ ఎండీగా హిమాంశు కపానియా తప్పుకున్నారని, అయితే విలీన సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొన్నాయి. వొడాఫోన్ ఐడియాకు బాలేశ్ శర్మ సీఈవోగా ఉంటారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని నియమించే అధికారాలు వొడాఫోన్‌కు ఉంటాయి. తాజా డీల్‌తో మూడు ప్రైవేట్ టెల్కోలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ (బీఎస్ఎన్ఎల్) మాత్రమే మార్కెట్లో మిగిలినట్లవుతుంది. రూ. 14,000 కోట్లు ఆదా.. వ్యయాలు తగ్గించుకునేందుకు, ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియోను మరింత గట్టిగా ఎదుర్కొనేందుకు ఐడియా, వొడాఫోన్లకు ఈ విలీన డీల్ తోడ్పడనుంది. ఈ ఒప్పందంతో సుమారు రూ. 14,000 కోట్ల మేర వ్యయాలు ఆదా కాగలవని అంచనా వేస్తున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. డీల్ ప్రకారం వొడాఫోన్ ఇండియా సంస్థాగత విలువను రూ. 82,800 కోట్లుగాను, ఐడియా విలువను రూ. 72,200 కోట్లుగాను పరిగణించారు. కొత్త సంస్థలో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటాలు ఉంటాయి. విలీన సంస్థ వొడాఫోన్ ఐడియాకు దేశవ్యాప్తంగా 32.2 శాతం మార్కెట్ వాటా, 9 సర్కిళ్లలో నంబర్ వన్ స్థానం లభిస్తుంది. ఐడియా రూ. 6,750 కోట్లు, వొడాఫోన్ రూ. 8,600 కోట్లు ఈక్విటీని సమకూర్చనున్నాయి. అటు రెండు కంపెనీల స్టాండెలోన్ టవర్ల వ్యాపార విక్రయంతో మరో రూ. 7,850 కోట్లు లభించనున్నాయి. ఇందులో టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ. 3,900 కోట్లు పోగా నికరంగా రూ. 19,300 కోట్ల మేర నగదు నిల్వలతో కంపెనీ పటిష్ట స్థానంలో ఉంటుంది. సంయుక్త ప్రకటన ప్రకారం కావాలనుకుంటే ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కూడా విక్రయించవచ్చు. విలీన సంస్థకు రూ. 1,09,200 కోట్ల నికర రుణం ఉంటుంది. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు ఈ డీల్ భారీ ఊరటనివ్వనుంది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి వొడాఫోన్ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. అప్పట్లో హచిసన్ ఎస్సార్ నుంచి భారత టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్ 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, దీనికి సంబంధించి 2.5 బిలియన్ డాలర్ల పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ అయిదేళ్ల తర్వాత నోటీసులు ఇచ్చింది. ఈ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ జరుగుతోంది. మరోవైపు తీవ్రమైన పోటీ కారణంగా కంపెనీ ఏకంగా 6.6 బిలియన్ డాలర్ల మేర నష్టాలు రైటాఫ్ చేయాల్సి వచ్చింది. టెలికంలో కన్సాలిడేషన్.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఏకంగా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారీగా ఆరంగేట్రం చేసినప్పట్నుంచీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరుగుతోంది. నార్వే సంస్థ టెలినార్‌కి చెందిన భారత విభాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా భారతి ఎయిర్టెల్ ఈ స్థిరీకరణకు తెరతీసింది. ఆ తర్వాత టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర మొబైల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. ‘భారత్‌లో అగ్ర స్థాయి టెలికం సంస్థ నేడు ఆవిర్భవించింది. ఇది నిజంగానే చారిత్రక ఘట్టం. ఇది కేవలం ఒక వ్యాపార దిగ్గజ ఆవిర్భావం మాత్రమే కాదు. నవభారత నిర్మాణానికి, యువత ఆకాంక్షల సాధనకు తోడ్పడాలన్నది మా లక్ష్యం’ – కుమార మంగళం బిర్లా మైలురాయి డీల్: టెలికం శాఖ ఐడియా, వొడాఫోన్ ఇండియాల విలీనం దేశీయంగా అతి పెద్ద కార్పొరేట్ మైలురాయిగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ‘ఆరోగ్యకరమైన పోటీతత్వ’ ధోరణులకు ఇది దోహదపడగలదని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వ్యాఖ్యానించారు. ‘టెలికం మార్కెట్ స్థిరత్వ దిశగా సాగుతోంది. ఆ క్రమంలో ఈ అతి పెద్ద కార్పొరేట్ విలీన ఒప్పందం ఒక మైలురాయిలాంటిది’ అని అరుణ తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలు లేవన్నారు. -
వోడాఫోన్ కొత్త ప్లాన్: సరికొత్త ట్విస్ట్
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం 597 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్, 10జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్లు అందిస్తోంది. జియో, ఎయిర్టెల్ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్‌లో దుర్వినియోగం నివారించడానికంటూ కొన్ని పరిమితులు విధించడం విశేషం. ముఖ్యంగా వాయిస్ కాలింగ్‌లో పరిమితి పెట్టింది. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలకు మాత్రమే కాల్స్ పరిమితం. అంతేకాదు మొత్త వాలిడిటీ పీరియడ్‌లో 100 యూనిక్ నెంబర్లకు మాత్రమే కాల్ చేసుకునే అవకాశం ఉంది. అంతేనా..ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. ఈ ప్లాన్ వాలిడిటీస్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం 112 రోజులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకయితే 168 రోజులుగా నిర్ణయించింది. -
జియోకి షాక్ : వోడాఫోన్ న్యూ రూ. 99 ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ప్రత్యర్థులనుంచి ఎదురవుతున్నసవాళ్లను ఎదుర్కొనేందుకు మరో టెలికాం సంస్థ వొడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. రిలయన్స్ జియో 98, ఎయిర్టెల్ 99రూపాయల రీచార్జ్ ప్లాన తరహాలో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.99కే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే ఎయిర్టెల్, జియో తరహాలో డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ను ఈ ప్లాన్‌లో అందించడం లేదు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులు. కస్టమర్లు రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ ఈ ప్లాన్ స్పెషాలిటీగా చెప్పాలి. వొడాఫోన్ వెబ్సైట్, యాప్‌లో ఈ ప్లాన్‌ను రీ ఛార్జి చేసుకునే ఆఫర్ కల్పించింది. మరోవైపు 99 రూపాయలకు ఎయిర్టెల్ 1 జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులు మాత్రమే. ఇక జియో రూ. 98 ప్లాన్‌లో 1 జీబీ డేటా, రోజుకు 300ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.