
రిలయన్స్ జియో దెబ్బకు, టెల్కోలు రోజుకో కొత్త ప్లాన్‌తో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ సర్కిల్‌లోని ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. 199 రూపాయలతో ఈ ప్లాన్‌ను వొడాఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ కింద ఉచిత కాల్స్‌ను, 1జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనుంది. అయితే రోజుకు గరిష్టంగా 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలను మాత్రమే ఉచిత కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఈ పరిమితి మించితే నిమిషానికి 30 పైసలను చెల్లించాల్సి వస్తుంది.
నియమ, నిబంధనల ప్రకారం ఏడు రోజుల వ్యవధిలో 300పైగా యూనిక్ నెంబర్లకు కాల్స్ చేసుకోవడానికి వీలులేదు. 300 నెంబర్ల మార్కు దాటినా నిమిషానికి 30 పైసలు చెల్లించాల్సిందే. ఇతర టెలికాం ఆపరేటర్ల మాదిరిగా వొడాఫోన్ కూడా కొత్త కొత్త ఆఫర్లతో రిలయన్స్ జియోకు షాకిస్తోంది. అంతేకాక రూ.349 ప్లాన్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్ చేసిన ప్లాన్ కింద అంతకముందు రోజుకు 1జీబీ డేటా వాడుకునే సౌకర్యాన్ని ప్రస్తుతం 1.5జీబీ డేటాకు పెంచింది. ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌లు కూడా రూ.350 ప్లాన్ కింద రోజువారీ డేటాగా 1.5జీబీని అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment