![Vodafone Idea New Plan Recharge Rs 151 Get Disney+ Hotstar Subscription - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/25/vodafone-idea-1.jpg.webp?itok=tjqfacSt)
టెలికాం రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అదిరిపోయే ఆఫర్లతో పాటు ట్రెండ్‌ని కూడా ఫాలో అవుతూ ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా ప్రజలు ఓటీటీలకు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేటగిరి కస్టమర్లను దృష్టిలో వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఓటీటీ( OTT) ప్రయోజనాలతో వస్తుంది.
ఓటీటీ ప్రియుల కోసం ప్రత్యేక ప్లాన్..
ఓటీటీ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌లోని బెనిఫిట్స్‌పై ఓ లుక్కేద్దాం.. వీఐ కొత్త రూ.151 ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్‌ని ప్రకటించింది.
ఈ చవకైన రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఇందులో ప్రధానంగా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు మొత్తం 8GB డేటాను కూడా పొందుతారు. అయితే ఈ రీచార్జ్ ప్లాన్‌పై కాలింగ్, ఉచితంగా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అధిక డేటాతో హాట్ స్టార్, డిస్నీ సబ్‌స్క్రిప్షన్ కోరుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పువచ్చు.
చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment