నష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా పోటీని తట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏడాది కాలపరిమితితో కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను (Vi SuperHero) ప్రవేశపెట్టింది. కస్టమర్లు అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు.
దీనికితోడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితం. ఈ ప్రీ–పెయిడ్ ప్లాన్స్ ధర ర.3,599 నుంచి ర.3,799 వరకు ఉంది. ప్రస్తుతానికి ఇవి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానాకు పరిమితం.
వీఐ సూపర్‌హీరో ప్లాన్ల ప్రయోజనాలు
⇒ అపరిమిత డేటా: ప్రతి రోజు హాఫ్-డే (అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు) అపరిమిత డేటా.
⇒ రోజువారీ డేటా కోటా: మిగిలిన గంటలలో ( మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 వరకు) 2 GB హై-స్పీడ్ డేటా.
⇒ వారాంతపు డేటా రోల్‌ఓవర్: వినియోగదారులు ఉపయోగించని వారాంతపు డేటాను ఫార్వార్డ్ చేయవచ్చు. వారాంతంలో దాన్ని ⇒ ఉపయోగించుకోవచ్చు.
⇒ ఓటీటీ (OTT) ప్రయోజనాలు: రూ.3,699 ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అదే రూ.3,799 ప్లాన్‌లో యితే ఒక సంవత్సరం అమేజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.
ఓవైపు వొడాఫోన్ ఐడియా తన 4G నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉండగా పోటీ సంస్థలు జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే తమ కస్టమర్‌ల కోసం అపరిమిత 5G డేటా ప్లాన్‌లను రూపొందించాయి. ఈ కొత్త "సూపర్‌హీరో" ప్లాన్‌లతో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) దాని సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవడానికి, కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.
అదే సమయంలో వోడాఫోన్ ఐడియా 19.77 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. గడిచిన సెప్టెంబర్ నెలలో 15.5 లక్షల మంది యూజర్లను చేజార్చుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం.. వోడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 18.30% వద్ద ఉంది. రిలయన్స్ జియో 39.9% వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. భారతి ఎయిర్‌టెల్ 33.5% వాటాతో రెండవ స్థానంలో ఉంది.
ఇక కంపెనీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో విక్రయిస్తున్న వార్షిక ప్లాన్స్‌లో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అపరిమిత డేటా అందుకోవచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు.
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ ఆఫర్
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కూడా ప్రత్యేక వార్షిన్ ప్లాన్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.
బీఎస్‌ఎన్‌ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.
ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్.
Comments
Please login to add a commentAdd a comment