Unlimited data
-
వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వీఐ మ్యాక్స్ ప్లాన్లలో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: టెలికం సేవల సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) కొత్తగా మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో రెండు కొత్త ఫీచర్లను జోడించింది. డేటా షేరింగ్, నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా వీటిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ పరిమితికి మించి 10 జీబీ నుంచి 25 జీబీ వరకు డేటాను అదనంగా పొందవచ్చు. దీన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక రాత్రి 12 గం. నుంచి ఉదయం 6 గం. వరకు ఉండే నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా ఫీచర్‌ని మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం మీద రూ. 601 మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్‌లో 2 కనెక్షన్లతో 120 జీబీ డేటా పొందవచ్చు. అంతకు పైబడిన ప్లాన్లలో 325 జీబీ వరకు పొందవచ్చు. -
ఐఫోన్ యూజర్లకు జియో బంపర్ ఆఫర్, ఇలా అప్డేట్ చేసుకోండి!
సాక్షి,ముంబై: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐ ఫోన్ 12, ఆ తకరువాతి మోడల్స్ స్మార్ట్ఫోన్లలో అపరిమిత 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఫోన్ యూజర్లకు వెల్కం ఆపర్ ప్రకటించింది ఈ మేరకు జియో ఒక ప్రకటన విడుదల చసింది. 5జీ సేవలను పొందేందుకు యూజర్లు తమ ఫోన్లను లేటెస్ట్ సాఫ్ట్వేర్ iOS 16.2 కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని జియో తెలిపింది. ఐఫోన్12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్12 ప్రో, ఐఫోన్12 ప్రో మ్యాక్స్, ఐఫోన్13, ఐఫోన్13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ 3(2022) తదితర ఫోన్లు ఉన్నాయని జియో ప్రకటించింది. 5జీకి ఎలా అప్డేట్ అవ్వాలి? ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలోని iOS 16.2 , లేదా తరువాతి వెర్షన్‌కు అప్డేట్ చేసుకొని, 'సెట్టింగ్‌లు' లో 5జీని ఆన్ చేసి, తరువాత 5జీ స్టాండలోన్ను ఆన్ చేయాలని జియో పేర్కొంది. -
యూజర్లకు గుడ్‌న్యూస్ : జియోకు కౌంటర్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ రిలయన్స్ జియోకు కౌంటర్ ఇస్తోంది. రిలయన్స్ జియో తన గిగాఫైబర్ బ్యాండ్ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో, భారతీ ఎయిర్టెల్ తన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను వాడుకోవచ్చని ఎయిర్టెల్ పేర్కొంది. దీని కోసం ఫేర్ యూసేజ్ పాలసీ డేటా పరిమితిని ఎయిర్టెల్ తొలగించేస్తున్నట్టు పేర్కొంది. 20కి పైగా కీలక మార్కెట్లలో ఎంపిక చేసిన నెలవారీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లపై ఉన్న ఫేస్ యూసేజ్ పాలసీ డేటా పరిమితిని తొలగిస్తున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు అపరిమిత డేటా లభించనుంది. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే అపరిమిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేసేది. దీన్ని ఇతర మేజర్ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. దీంతో తనకున్న 2.4 మిలియన్ యాక్టివ్ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లను కాపాడుకోవాలని ఎయిర్టెల్ చూస్తోంది. గత నెలలో 300ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఉన్న హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఆరు నెలలు, ఏడాది పాటు 15 శాతం, 20 శాతం డిస్కౌంట్లను ఎయిర్టెల్ ఆఫర్‌చేసింది. ఎయిర్టెల్ అపరిమిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లను, కరెక్ట్‌గా జియో గిగాఫైబర్ సర్వీసులు మార్కెట్లోకి వచ్చే సమయంలో ఆఫర్ చేస్తోంది. కాగ, ఆగస్టు 15 నుంచే రిలయన్స్ జియో తన అప్‌కమింగ్ గిగాఫైబర్ బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. కేవలం రూ.500కే హై-స్పీడ్, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ప్రొగ్రామింగ్ ఆధారితంగా అందిస్తోంది. అపరిమిత ప్యాక్లుగా మారబోతున్న ఎయిర్టెల్ డేటా ప్లాన్లు... ముంబైలో 699 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు అహ్మదాబాద్, గాంధీనగర్, జమ్నాగర్‌లో 499 రూపాయలు, 599 రూపాయలు, 1,099 రూపాయల ప్లాన్లు చంఢీఘర్, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, జైపూర్, ఇండోర్, కోల్‌కత్తాల్లో 1,999 ప్లాన్ ఆగ్రా, అంబాలా, కర్నల్‌ల్లో 499 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు ‘ఎయిర్టెల్ మొత్తం హోమ్ బ్రాండ్ నెట్వర్క్ ప్రస్తుతం వి-ఫైబర్ ఆఫర్ చేస్తుంది. దీని కింద 300 ఎంబీపీఎస్ స్పీడులో డేటా లభ్యవుతుంది. ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే, 1 జీబీపీఎస్ స్పీడుకు అప్‌గ్రేడ్ చేస్తాం’ అని ఎయిర్టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం 89 ప్రాంతాల్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను కనీసం 100 కీ నగరాలకు విస్తరించేందుకు ఆర్థిక సంవత్సరం 2019 కోసం రూ.24వేల కోట్లను పక్కన తీసి పెట్టినట్టు మరో సీనియర్ ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 2021 వరకు మరో 10 మిలియన్ పైగా గృహాలకు తమ నెట్‌వర్క్‌ను కనెక్ట్ చేయాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
జియోకు కౌంటర్: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. ముఖ్యంగా జియో ప్యాక్‌కు దీటుగా తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఓ సరికొత్త ప్లాన్‌నులాంచ్ చేసింది. 24 గంటల వాలిడిటితో రూ.21లకు గంటకు అన్లిమిటెడ్ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు వోడాఫోన్ ఒక "సూపర్ అవర్" రీఛార్జ్ ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో కస్టమర్ కేవలం 16 రూపాయలు రీఛార్జ్‌పై అపరిమిత డేటాను పొందవచ్చు. కాగా రిలయన్స్ జియో 19 రూపాయలకే ఒక రోజు వ్యాలిడిటీతో 150 ఎంజీ 4జీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు .అంతేకాదు 20 లోకల్ ఎస్ఎంఎస్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ : ప్రత్యేకత అదే!
టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీకర వాతావరణంలో, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ మరో సరికొత్త ప్లాన్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అపరిమిత డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను 84 రోజుల పాటు ఉచితంగా అందించేందుకు రూ.1,099 ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కేవలం తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ''స్పీడు పరిమితి లేకుండా అపరిమిత డేటా'' అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. రూ.1,099 ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిన వివరాలు.. వాయిస్ కాల్స్ : ఈ రూ.1,099 ప్రీపెయిడ్ డేటా రీఛార్జ్ ఓచర్ కింద అపరిమిత కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. హోమ్ సర్కిల్‌కు, నేషనల్ రోమింగ్‌కు ఈ కాల్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. రూ.1,099 ప్రీపెయిడ్ డేటా ఓచర్లో 84 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా అందించనుంది. అంటే వాలిడిటీ పిరియడ్ అయిపోయేంత వరకు రోజుకు 100 ఎస్ఎంఎస్లను సబ్స్క్రైబర్లు పంపించుకోవచ్చు. 84 రోజుల తర్వాత డేటా వాడకంపై యూజర్లకు 10 కేబీ డేటాకు 3 పైసల ఛార్జీ విధించనుంది. రూ.1,099 రీఛార్జ్ ప్యాక్‌లో పీఆర్బీటీ(పర్సనలైజడ్ రింగ్ బ్యాక్ టోన్ ఫెసిలిటీ) అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసే ఈ స్పెషల్ సర్వీసు ద్వారా డిఫాల్ట్ రింగ్‌నే కాకుండా యూజర్లు సరికొత్త ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. -
ఆరు రూపాయలకే అపరిమిత డేటా
ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో వొడాఫోన్ ఇటీవల ఆఫర్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఇండియా మళ్లీ సరికొత్త ఆఫర్ ను లాంచ్ చేసింది. ఆ ఆఫర్ తో గంటకు తక్కువ ధర ఆరు రూపాయలతో అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. సూపర్ నైట్ పేరుతో ఈ ఆఫర్ ను వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు లాంచ్ చేసింది. దీనిలో భాగంగా 29 రూపాయలతో అపరిమిత 3జీ/4జీ డేటా వాడకాన్ని, డౌన్ లోడ్స్ ను ఐదు గంటల పాటు వినియోగించుకోవచ్చు. రోజుల్లో ఏ సమయంలోనైనా ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ కేవలం రాత్రి 1 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నేడు వొడాఫోన్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. '' వొడాఫోన్ సూపర్ నైట్ రిపీట్ గా కొనుగోలు చేస్తూ.. కస్టమర్లు అపరిమితంతో ప్రతి రాత్రి సూపర్ రాత్రిగా అనుభూతి పొందండి. గంటకు కేవలం ఆరు రూపాయలతో డేటాను ఎంజాయ్ చేయండి'' అని వొడాఫోన్ పేర్కొంది. ఈ వినూత్న ప్రొడక్ట్ ను లాంచ్ చేసిన తర్వాత మాట్లాడిన వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా.. సూపర్ అంబ్రిలా కింద తమ కస్టమర్లకు వొడాఫోన్ నైట్ తీసుకురావడం తాము చాలా సంతోషిస్తున్నామని, అన్ని ఇతర సూపర్ ప్రొడక్ట్ లాగానే, ఇంటర్నెట్ వాడకానికి ఉన్న ధర అడ్డంకులను ఇది తొలగిస్తుందని పేర్కొన్నారు. నేటి యువత జీవనంలో మొబైల్ ఫోన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ సూపర్ నైట్ ప్యాక్స్ తో నామమాత్ర ధరలతో ఐదు గంటల పాటు ఎంత కావాలంటే అంత డేటా డౌనో లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సూపర్ నైట్ పై అందించే అపరిమిత డేటాతో వొడాఫోన్ ప్లే నుంచి విభిన్నమైన కంటెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా పేర్కొంది. డిజిటల్ చానల్స్, రిటైల్ టచ్ పాయింట్ల నుంచి ఈ సూపర్ నైట్ ప్యాక్ లను కస్టమర్లు కొనుగోలు చేసుకోవచ్చు లేదా *444*4# డయల్ చేసి కూడా కస్టమర్లు ఈ ప్యాక్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. వొడాఫోన్ సూపర్ నెట్ తో కనెక్ట్ అయిన వెంటనే ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. జియో కూడా రూ.19 ప్యాక్ ను ఆఫర్ చేస్తోంది. దీనికి గట్టి పోటీగా వొడాఫోన్ ఈ ఆఫర్ ను లాంచ్ చేసింది. -
టెలినార్ అన్లిమిటెడ్ డేటా @ 73
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా వార్‌లో టెలినార్ సైతం సవాల్ విసురుతోంది. కొత్త కస్టమర్ల కోసం 30 రోజుల కాలపరిమితితో రూ.73ల ఫస్ట్ రీచార్జ్‌తో అన్లిమిటెడ్ 4జీ/2జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఎస్టీడీ కాల్స్ సైతం నిముషానికి 25 పైసలకే 90 రోజులపాటు చేసుకోవచ్చు. లైఫ్‌టైం వాలిడిటీతో రూ.25 టాక్‌టైం అందుకోవచ్చు. మరో 28 రోజులపాటు అన్లిమిటెడ్ డేటా ఆఫర్ పొందాలంటే కస్టమర్లు రెండో నెలలో రూ.47 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాల కోసం ఎఫ్ఆర్ రూ.73 రీచార్జ్ చేసిన 120 రోజుల్లోనే రూ.47 రీచార్జ్ చేయాలి. 120 రోజుల తర్వాత చేసే రూ.47 రీచార్జ్‌తో 28 రోజుల కాలపరిమితితో 400 ఎంబీ 4జీ డేటా ఇస్తారు. -
ఆ ఫోన్ల ధరలు ఢమాల్..!
లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల ధరలు పడిపోయాయి. లైఫ్ బ్రాండెడ్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్టు రిలయెన్స్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం నుంచి ఈ కొత్త ధరలు అమలు చేయాలని డీలర్లకు రిలయెన్స్ కంపెనీ తెలిపింది. లైఫ్ స్మార్ట్ ఫోన్ల కొత్త ధరలు... లైఫ్ వాటర్ 2.. కొత్త ధర రూ.9,499 (రూ.4వేల తగ్గింపు) లైఫ్ విండ్ 6.... కొత్త ధర రూ.5,999 (రూ.500 తగ్గింపు) లైఫ్ ఫ్లేమ్ 2.... కొత్త ధర రూ. 3,499 (రూ. 1,300 తగ్గింపు) లైఫ్ ఫ్లేమ్ 4, ఫ్లే 5, ఫ్లే 6 హ్యాండ్ సెట్లపై కూడా రూ.1,000 ధర తగ్గించింది. దీంతో ఈ మూడు ఫోన్లు రూ.2,999కే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు అన్ని లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు రిలయెన్స్ జియో నెట్ వర్క్ పై మూడు నెలల పాటు ఫ్రీ అన్ లిమిటెడ్ 4జీ డేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్ చేయనున్నట్టు రిలయెన్స్ ప్రకటించింది. దీంతో రూ.2,999కే మూడు నెలల వాయిస్ కాలింగ్, అన్ లిమిడెట్ 4జీ డేటాను వినియోగదారులు పొందబోతున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే రిలయెన్స్ జియో 4జీ సర్వీసులు అధికారికంగా ఇంకా ఆవిష్కరించలేదు. కేవలం ఉద్యోగుల రిఫరల్ ప్రోగ్రామ్ కింద ఈ సర్వీసులను వినియోగదారులకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. రిలయెన్స్ సీడీఎమ్ఏ కస్టమర్లు రిలయెన్స్ జియో సిమ్ లపై అప్ గ్రేడ్ అయ్యేలా కంపెనీ ఆఫర్ చేస్తోంది. లైఫ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ జియో సిమ్ లను కంపెనీ అందుబాటులో ఉంచుతోంది.