బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్ (ఫైల్ ఫోటో)
టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీకర వాతావరణంలో, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ మరో సరికొత్త ప్లాన్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అపరిమిత డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను 84 రోజుల పాటు ఉచితంగా అందించేందుకు రూ.1,099 ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కేవలం తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ''స్పీడు పరిమితి లేకుండా అపరిమిత డేటా'' అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.
రూ.1,099 ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిన వివరాలు..
- వాయిస్ కాల్స్ : ఈ రూ.1,099 ప్రీపెయిడ్ డేటా రీఛార్జ్ ఓచర్ కింద అపరిమిత కాల్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ చేస్తోంది. హోమ్ సర్కిల్‌కు, నేషనల్ రోమింగ్‌కు ఈ కాల్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
- రూ.1,099 ప్రీపెయిడ్ డేటా ఓచర్‌లో 84 రోజుల పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా అందించనుంది. అంటే వాలిడిటీ పిరియడ్ అయిపోయేంత వరకు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సబ్‌స్క్రైబర్లు పంపించుకోవచ్చు.
- 84 రోజుల తర్వాత డేటా వాడకంపై యూజర్లకు 10 కేబీ డేటాకు 3 పైసల ఛార్జీ విధించనుంది.
- రూ.1,099 రీఛార్జ్ ప్యాక్‌లో పీఆర్‌బీటీ(పర్సనలైజడ్ రింగ్ బ్యాక్ టోన్ ఫెసిలిటీ) అందుబాటులో ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ చేసే ఈ స్పెషల్ సర్వీసు ద్వారా డిఫాల్ట్ రింగ్‌నే కాకుండా యూజర్లు సరికొత్త ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు.
- ఈ ప్లాన్ రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment