బీఎస్‌ఎన్‌ఎల్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్‌ | BSNL Republic Day offer Rs 269 prepaid plan with 2.6GB data | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్‌

Published Fri, Jan 25 2019 7:00 PM | Last Updated on Fri, Jan 25 2019 8:53 PM

BSNL Republic Day offer Rs 269 prepaid plan with 2.6GB data - Sakshi


సాక్షి, ముంబై:   గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం సరికొత్త కాంబో ఎస్టీవీని ప్రకటించింది. ఎస్టీవీ-269 పేరుతో  ఒక ప్యాక్‌ను లాంచ్‌  చేసింది.  ఈ ప్యాక్‌లో ఏ నెట్‌వర్క్‌కు అయినా 2600 నిమిషాల టాక్‌టైం, 260 మెసేజ్‌లు, 2.6 జీబీ డేటా వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ప్లాన్‌ వాలిడిటీ 26 రోజులు.

దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. 70వ రిపబ్లిక్‌ డే సందర్భంగా వినియోగదారులకు  శుభాకాంక్షలు అందిస్తూ  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర‍్మన్‌, ఎండీ అనుపమ శ్రీవాస్తవ మీడియా ప్రకటన జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement