రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ డేటా టారిఫ్‌లకు గట్టి పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు''హోలీ ధమాకా'' పేరుతో 399 రూపాయల ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద పోస్టుపెయిడ్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, 30 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లందరూ ఈ కొత్త ప్లాన్‌ను 2018 మార్చి 1 నుంచి వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న 30జీబీ డేటాలో రోజువారీ పరిమితులను విధించలేదు. కొత్త, పాత కస్టమర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.
హోమ్ సర్కిల్ వెలుపలు చేసుకునే రోమింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ కింద ఉచితం. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం కేరళ సర్కిల్‌లో మాత్రమే 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. మిగతా సర్కిళ్లన్నింటిలో 3జీ ఇంటర్నెటే. ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్, నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో 10 టెలికాం సర్కిళ్లలో 4జీ వాయిస్‌ఓవర్ ఎల్‌టీఈ సర్వీసులను ఆవిష్కరించబోతుంది. కాగ, ప్రత్యర్థ కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు కూడా రూ.399 ప్లాన్‌ను తన కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే అవి ఈ ప్లాన్ కింద కేవలం 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. జియో కూడా 30జీబీ డేటాను రూ.409కు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment