holi offer
-
ఫోటో పెట్టు.. ఓలా స్కూటర్ పట్టు: భవిష్ అగర్వాల్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ ఓలా ఇటీవల హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ తీసుకువచ్చింది. కంపెనీ ఈ స్కూటర్లను కేవలం 5 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ స్కూటర్ కావాలనుకునే వారు కేవలం హోలీ సెలబ్రేషన్స్ ఫోటో పెట్టి సొంతం చేసుకోవచ్చు. హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ కేవలం ఎస్1 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఎస్1 వేరియంట్‌కి ఉన్న డిమాండ్ కారణంగా దీనిని విడుదల చేయడం జరిగిందని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ స్కూటర్ వివిధ రంగుల కలయికతో చూడటానికి కొత్తగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: చిన్నప్పుడే ఆ ఉద్యోగంపై మనసుపడిన ఇషా అంబానీ) ఓలా ఎస్1 హోలీ ఎడిషన్ ఖాకీ, గెరువా, నియో మింట్, మార్ష్‌మల్లో, కోరల్ గ్లామ్ వంటి కలర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. 2 kWh వెర్షన్ 90 కిమీ/గం వేగంతో 90 కిలోమీటర్ల పరిధిని, 3 kWh వెర్షన్ 141 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఓలా ఎస్1 2 కిలోవాట్ వెర్షన్ ధర రూ. 90,000 కాగా 3 kWh వెర్షన్ ధర రూ. 1.08 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది, ఎటువంటి మార్పులు లేదు. డబ్బు చెల్లించకుండా కేవలం ఫోటో పెట్టి 5 యూనిట్లను మాత్రమే పొందవచ్చు, అంటే ఐదు మంది కస్టమర్లు మాత్రమే స్కూటర్లను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. Due to popular demand, we will build 5 of these as a special Holi edition! Comment with pic/video of how you celebrated holi with your S1 and best 5 will get one! pic.twitter.com/y2VEoMPUWT — Bhavish Aggarwal (@bhash) March 9, 2023 -
తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!
హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పండుగ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! పాత ద్విచక్రవాహనాల ఎక్స్చేంజ్పై భారీగా.. ప్రస్తుతం ఓలా ఎస్1 వేరియంట్‌పై రూ.2వేలు, ఎస్1 ప్రో వేరియంట్‌పై రూ.4 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇక పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా రూ.6,999 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఓలా కమ్యూనిటీ సభ్యులకు ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ఎక్సెంటెడ్ వారంటీస్పై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లన్నీ మార్చి 8 నుంచి 12 వరకే. ఓలా హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్ల పండుగ ఆనందం మరింత పెరుగుతుందని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సూల్ ఖండేల్‌వాలా పేర్కొన్నారు. ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఓలా కేర్ సర్వీసుల్లో ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్ అని రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీర్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు లభిస్తాయి. ఇక ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. యాన్వల్ కాంప్రెహెన్సిల్ డయాగ్నస్టిక్, ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కాగా డీ2సీ(డైరెక్ట్ టు కస్టమర్) సేవలను విస్తరించే పనిలో ఉన్న ఓలా మార్చి 2023 నాటికి అన్ని ప్రధాన నగరాల్లో 500 కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను తెరుస్తోంది. -
హోలీ ఆఫర్ : ఐఫోన్‌పై రూ. 13వేల తగ్గింపు
సాక్షి, ముంబై: హోలీ సందర్భంగా ఆపిల్ ఐఫోన్లు తగ్గింపు ధరలో లభించనున్నాయి. పరిమిత కాల ఆఫర్ కింద ఐఫోన్ 11పై 13వేల రూపాయలు తగ్గి, ఇపుడు 41,900 రూపాయలకే లభించనుంది. ఆపిల్ ప్రీమియం రీ సెల్లర్ ఇమేజిన్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో ఐఫోన్ 11 ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 13వేల రూపాయల హోలీ ఆఫర్లో రూ. 5,000 క్యాష్ బ్యాక్‌తోపాటు, ఇతర యాక్ససరీస్‌పై రూ. 8వేలను తగ్గింపును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు,ఎక్స్ఛేంజ్ బోనస్ కింద అదనంగా రూ. 3 వేల తగ్గింపు లభించనుంది. అలాగే ఐఫోన్ 12 మినీ ఐఫోన్ 12 లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఆఫర్ ఎంతకాలం ఉంటుందో స్పష్టత లేదు. అయితే హెచ్డీఎఫ్సి క్యాష్‌బ్యాక్ మార్చి 27 వరకు మాత్రమేఅందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. 2019, సెప్టెంబర్ లో లాంచ్ అయిన ఐఫోన్ 11 ధరరూ. రూ. 54,900 గా ఉంది. దేశీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలోఇదొకటి. మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఓమ్డియా 2020 లోఅత్యధికంగా రవాణా చేయబడిన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11 అని ఇటీవల పేర్కొంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64జీబీ, 128 , 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో బ్లాక్, గ్రీన్, (ప్రొడక్ట్) రెడ్, పర్పుల్, ఎల్లో వైట్ అనే ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. 🔴🟢 HOLI OFFERS @IMAGINE 🟣🟠 iPhone 11 now starting at an effective price of ₹41,900* 1️⃣₹5,000* HDFC Cashback 2️⃣Accessories upto ₹8,000* 🛒 https://t.co/Up2M46rc09 🏢https://t.co/cXaVTZ7X7I 📞 82874-82874#Apple #Imagine #iPhone11 #HDFC #DualSim #iPhone #Holi #Offers pic.twitter.com/c8y7hYbM30 — Imagine Apple Premium Reseller (@ImagineApplePR) March 22, 2021 -
బీఎస్ఎన్ఎల్ 'హోలీ ధమాకా' : 30జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ డేటా టారిఫ్‌లకు గట్టి పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు''హోలీ ధమాకా'' పేరుతో 399 రూపాయల ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద పోస్టుపెయిడ్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, 30 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరూ ఈ కొత్త ప్లాన్‌ను 2018 మార్చి 1 నుంచి వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 30జీబీ డేటాలో రోజువారీ పరిమితులను విధించలేదు. కొత్త, పాత కస్టమర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది. హోమ్ సర్కిల్ వెలుపలు చేసుకునే రోమింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ కింద ఉచితం. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం కేరళ సర్కిల్లో మాత్రమే 4జీ ఇంటర్నెట్ను అందిస్తోంది. మిగతా సర్కిళ్లన్నింటిలో 3జీ ఇంటర్నెటే. ఇటీవలే బీఎస్ఎన్ఎల్, నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో 10 టెలికాం సర్కిళ్లలో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ సర్వీసులను ఆవిష్కరించబోతుంది. కాగ, ప్రత్యర్థ కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్లు కూడా రూ.399 ప్లాన్‌ను తన కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే అవి ఈ ప్లాన్ కింద కేవలం 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. జియో కూడా 30జీబీ డేటాను రూ.409కు అందిస్తోంది. -
ఎయిర్‌సెల్ హోలీ ఆఫర్!
10 పైసలతో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోలీ పండుగను మరింత రంగుల మయం చేసేందుకు ఎయిర్‌సెల్ ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. హోలీ రోజున 10 పైసల చెల్లింపుతోనే ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు ఎంతసేపైనా (అన్లిమిటెడ్)గా మాట్లాడుకోవచ్చు. అలాగే రోమింగ్, ఎస్టీడీ కాల్స్కైతే నిమిషానికి 10పైసలు చెల్లిస్తే చాలు. అయితే ఆఫర్ ఏపీ, తెలంగాణ ఎయిర్‌సెల్ కస్టమర్లకు మాత్రమే. -
స్పైస్‌జెట్ హోలీ ఆఫర్
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానయాన సంస్థ కలర్ ద స్కైస్ పేరుతో తాజాగా మరో డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ రూట్లలో కనిష్టంగా రూ.1,699కు, అంతర్జాతీయ రూట్లలో రూ.3,799కు (అన్ని చార్జీలు కలుపుకొని) విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ చార్జీలకు లక్ష సీట్లను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవ్లి పేర్కొన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన బుకింగ్స్ గురువారం (రేపు-ఈ నెల 26) వరకూ ఉంటాయని, వచ్చే నెల 1 నుంచి ఏప్రిల్ 20 వరకూ చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. ప్రయాణికులు హోలీ పండుగ పర్యాటక ప్రణాళికలకు ఈ ఆఫర్ మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ ఆఫర్లో భాగంగా హైదరాబాద్-విజయవాడ, బెంగళూరు-హైదరాబాద్, ఢిల్లీ-డెహ్రాడూన్, గౌహతి-కోల్‌కతా, అహ్మదాబాద్-ముంబై రూట్లలో విమాన టికెట్లను రూ.1,699కే అందిస్తున్నామని వివరించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం పాత ప్రమోటర్ అజయ్ సింగ్ చేతికి వచ్చిన ఒక్కరోజు తర్వాత తాజా ఆఫర్ రావడం విశేషం. స్పైస్‌జెట్ నుంచి ఈ ఏడాది ఇది ఐదో ఆఫర్. మళ్లీ ప్రమోటర్‌గా అజయ్‌సింగ్ స్పైస్‌జెట్‌లో కళానిధి మారన్, కాల్ ఎయిర్‌వేస్‌లకు ఉన్న మొత్తం 56.4 శాతం వాటా(35,04,28,758 ఈక్విటీ షేర్లు), పాత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ అయింది. ఈ వాటా బదిలీతో ఇప్పుడు స్పైస్‌జెట్ యాజమాన్యం అజయ్‌సింగ్‌కు దక్కింది. కాగా, స్పైస్‌జెట్ రూ.100 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత)బకాయిలను చెల్లించినట్లు సమాచారం. ఎయిర్కోస్టా కూడా...హైదరాబాద్-విజయవాడ టికెట్ రూ. 999 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన కంపెనీ అయిన ఎయిర్కోస్టా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఒకవైపు టికెట్ ధరను రూ.999గా నిర్ణయించింది. రూ.999కే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖపట్నానికి, రూ.1,999తో హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కు, బెంగళూరు నుంచి విశాఖపట్నానికి, అలాగే రూ.1,499తో హైదరాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నం నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, విశాఖపట్నానికి వెళ్లొచ్చు. ఈనెల 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎకానమీ టికెంట్ బుకింగ్స్ పైనే అది కూడా పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి. మార్చి 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణ తేదీలుగా నిర్ణయించింది.