హోలీ ఆఫర్‌ : ఐఫోన్‌పై  రూ. 13వేల తగ్గింపు  | Holi Offer : iPhone 11 Available at price cut | Sakshi
Sakshi News home page

హోలీ ఆఫర్‌ : ఐఫోన్‌పై  రూ. 13వేల తగ్గింపు 

Published Wed, Mar 24 2021 2:57 PM | Last Updated on Wed, Mar 24 2021 5:27 PM

Holi Offer : iPhone 11 Available at price cut - Sakshi

సాక్షి, ముంబై:  హోలీ  సందర్భంగా  ఆపిల్‌ ఐఫోన్లు తగ్గింపు ధరలో  లభించనున్నాయి. పరిమిత కాల ఆఫర్ కింద ఐఫోన్ 11పై 13వేల రూపాయలు తగ్గి,  ఇపుడు 41,900 రూపాయలకే  లభించనుంది.  ఆపిల్‌ ప్రీమియం రీ సెల్లర్‌ ఇమేజిన్‌లో ఆన్‌లైన్,  ఆఫ్‌లైన్ రెండింటిలో ఐఫోన్ 11 ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 13వేల రూపాయల హోలీ ఆఫర్‌లో రూ. 5,000 క్యాష్‌ బ్యాక్‌తోపాటు, ఇతర యాక్ససరీస్‌పై  రూ. 8వేలను తగ్గింపును ఆఫర్‌  చేస్తోంది.  దీంతోపాటు,ఎక్స్ఛేంజ్ బోనస్‌ కింద అదనంగా రూ. 3 వేల తగ్గింపు లభించనుంది. అలాగే ఐఫోన్ 12 మినీ  ఐఫోన్ 12 లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఆఫర్ ఎంతకాలం  ఉంటుందో స్పష్టత లేదు. అయితే హెచ్‌డీఎఫ్‌సి క్యాష్‌బ్యాక్ మార్చి 27 వరకు మాత్రమేఅందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. 

2019, సెప్టెంబర్ లో లాంచ్‌ అయిన  ఐఫోన్ 11  ధరరూ. రూ. 54,900 గా ఉంది.  దేశీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలోఇదొకటి. మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఓమ్డియా  2020 లోఅత్యధికంగా రవాణా చేయబడిన స్మార్ట్‌ఫోన్  ఐఫోన్ 11 అని ఇటీవల పేర్కొంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ, 128 , 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్లో బ్లాక్, గ్రీన్, (ప్రొడక్ట్) రెడ్, పర్పుల్, ఎల్లో వైట్ అనే ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement