unlimited calls
-
జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అదిరింది
సాక్షి, ముంబై: దేశీయ నెంబరు వన్ టెలికాం సంస్థ రిలయన్స్జియో తన వినియోగదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను సోమవారం ప్రకటించింది. రూ. 2020ల ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లు అందిస్తోంది. దీంతో పాటు మరో ఆఫర్ కూడా ఉంది. 2020 ఆఫర్ ప్లాన్ కొనుగోలు చేసిన చందారులకు జియో ఫోన్ ఉచితం అంతేకాదు. 12 నెలల సర్వీసులు కూడా ఉచితం. ఈ జియో ఫోన్లో రోజుకు 0.5 జీబీ డేటాను అన్‌లిమిటెడ్‌కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలను అందివ్వనుంది. రేపటి (డిసెంబరు 24) నుంచి ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందనీ ఈ ప్లాన్‌వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎయిర్టెల్ కొత్త ప్రిపెయిడ్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సరికొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రిలయన్స్ జియో భారతదేశంలో టాప్ టెలికాం ఆపరేటర్‌గా దూసుకుపోతున్నతరుణంలో జియోను నిలువరించే ప్లాన్లలో భాగంగా ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే డేటా టారిఫ్ప్లాన్లనుంచి తన ఫోకస్‌ను హలో ట్యూన్స్ సెగ్మెంట్ వైపు మళ్లించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉచిత డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఉచిత హలో ట్యూన్లను కూడా అందిస్తుంది. ఇటీవల ప్రకటించిన రూ.219 ప్లాన్ తరహాలోనే మరో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం రూ. 129 రీఛార్జ్ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్లిమిటెడ్కాలింగ్ , రోజుకు 1జీబీ 4 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. దీనికి అదనంగా ఎయిర్టెల్ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
బీఎస్ఎన్ఎల్ 'హోలీ ధమాకా' : 30జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ డేటా టారిఫ్‌లకు గట్టి పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు''హోలీ ధమాకా'' పేరుతో 399 రూపాయల ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద పోస్టుపెయిడ్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, 30 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరూ ఈ కొత్త ప్లాన్‌ను 2018 మార్చి 1 నుంచి వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 30జీబీ డేటాలో రోజువారీ పరిమితులను విధించలేదు. కొత్త, పాత కస్టమర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది. హోమ్ సర్కిల్ వెలుపలు చేసుకునే రోమింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ కింద ఉచితం. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం కేరళ సర్కిల్లో మాత్రమే 4జీ ఇంటర్నెట్ను అందిస్తోంది. మిగతా సర్కిళ్లన్నింటిలో 3జీ ఇంటర్నెటే. ఇటీవలే బీఎస్ఎన్ఎల్, నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో 10 టెలికాం సర్కిళ్లలో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ సర్వీసులను ఆవిష్కరించబోతుంది. కాగ, ప్రత్యర్థ కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్లు కూడా రూ.399 ప్లాన్‌ను తన కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే అవి ఈ ప్లాన్ కింద కేవలం 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. జియో కూడా 30జీబీ డేటాను రూ.409కు అందిస్తోంది. -
రూ.9కే అపరిమిత కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లు
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, రిలయన్స్ జియోకు పోటీగా మరో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే ఎంట్రీ-లెవల్ 9 రూపాయల రీఛార్జ్ ప్యాక్. ఈ కొత్త స్కీమ్ కింద అపరిమిత వాయిస్ కాల్స్‌ను, డేటాను, ఎస్ఎంఎస్లను వినియోగదారులకు అందించనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. ఎయిర్టెల్ రూ.9 ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే వాలిడిటీలో ఉండనుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు అదనంగా రోజులో 100 ఎస్ఎంఎస్లను, 100 ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. రిలయన్స్ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్టెల్ ఈ రూ.9 రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. జియో ఆఫర్ చేస్తున్న రూ.19 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, 20 ఎస్ఎంఎస్లు, 150ఎంబీ డేటాను మాత్రమే వినియోగదారులు పొందుతున్నారు. ధర పరంగా, ఆఫర్ల పరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్‌టెలే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. ఎయిర్టెల్ రూ.23 ప్లాన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 200 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్లను రెండు రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. కంపెనీ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ ద్వారా కస్టమర్లు ఈ రూ.9 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోంబో ఆఫర్ సెక్షన్ కింద ఈ రీఛార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంది. నెల రోజుల పాటు ఇలాంటి ప్రయోజనాలు పొందాలనుకునే వారికి కూడా ఎయిర్టెల్ రూ.98 ప్యాక్‌ను ఇటీవల లాంచ్ చేసింది. దీని కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్‌పై ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను కస్టమర్లకు ఎయిర్టెల్ 28 రోజుల పాటు అందిస్తోంది. -
వొడాఫోన్ ఆ ప్లాన్‌పై 30జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వొడాఫోన్ ఇండియా కూడా తన ప్లాన్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్ల కొత్త రెడ్ ప్లాన్‌ను వొడాఫోన్ అప్డేట్ చేసింది. ఈ కొత్త వొడాఫోన్ ప్లాన్ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్, 100 ఎస్ఎంఎస్లు కస్టమర్లకు లభించనున్నాయి. వొడాఫోన్ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్ లభించనుంది. నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్‌జటర్ సబ్‌స్క్రిప్షన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. ఇతర ప్లాన్స్ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్ రెడ్‌ప్లాన్ అపరిమిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి. తొలుత వొడాఫోన్ రెడ్ సబ్స్క్రైబర్లు రూ.399 ప్లాన్‌ను పొందడానికి తమ మొబైల్ హ్యాండ్సెట్ల నుంచి 199కి కాల్ చేయాల్సి ఉండేది. అయితే అధికారిక వొడాఫోన్ సైట్ మాత్రం ఈ కొత్త ప్లాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంది. ప్రస్తుత ప్లాన్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, జమ్ము అండ్ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ సర్కిళ్లలో అందుబాటులో లేదు. గతేడాది నవంబర్‌లో వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్లకు ఈ రూ.399ల రెడ్ బేసిక్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అప్పుడు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, 10జీబీ డేటాను ఆఫర్ చేసేంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించలేదు. అనంతరం ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసి డేటా పరిమితిని 20జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ డేటాను మరో 10జీబీ పెంచి, 30జీబీ చేసింది. జియో తన రూ.309 పోస్టు పెయిడ్ప్లాన్పై 30జీబీ డేటాను, ఎయిర్టెల్ తన రూ.399 మైఇన్ఫినిటీ పోస్టుపెయిడ్ ప్లాన్‌పై 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. -
వాటికి పోటీగా ఐడియా కొత్త ప్లాన్
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తరువాత మరో టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను. ప్రకటించింది. ఎయిర్టెల్, జియో రీచార్జ్ ప్లాన్ తరహాలోనే ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను వెల్లడించింది.రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ 3జీ డేటా అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులు. ఐడియా వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే రోజుకు 250 నిమిషాలు , వారానికి వెయ్యి నిమిషాల టాక్ టైం వరకే ఈ ఉచిత ఆఫర్ పరిమితం. ఈ పరిమితి దాటిన తరువాత సెకనుకు 1 పైసా వసూలు చేస్తుంది. అయితే ఉచిత ఎస్ఎంఎస్లు, రోమింగ్స్ కాల్స్ లాంటి ప్రయోజనాలు లేవీ లేవు. అలాగేరూ. 93 ప్రీ పెయిడ్ ప్లాన్ ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా ఎయిర్టెల్ రూ.93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా 10 రోజుల పాటు 3జీ / 4జీ డేటా 1జీబీ అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. జియో కూడా రూ.98ల ప్రీపెయిడ్ రీఛార్జి ప్రణాళికలో 14 రోజుల వ్యవధిలో 2.1జీబీ 4జీ డేటాను 140 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా అందిస్తుంది. -
అచ్చం వొడాఫోన్ లాంటిదే : ఎయిర్టెల్ కొత్త ఆఫర్
డేటా సబ్స్క్రైబర్లు విపరీతంగా పెరిగిపోవడం, రిలయన్స్ జియో, వొడాఫోన్ల నుంచి గట్టి పోటీతో టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అచ్చం వొడాఫోన్ మాదిరే రూ.199కు కొత్త ప్రీపెయిడ్ టారిఫ్‌ను లాంచ్ చేసింది. 28 రోజుల వాలిడిటీతో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త రూ.199 ప్యాక్, వొడాఫోన్ ప్రకటించిన కొత్త టారిఫ్ అనంతరం ఎయిర్టెల్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రూ.199 ప్యాక్ కింద ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, రోమింగ్‌పై అపరిమిత ఇన్కమింగ్ కాల్స్, అపరమిత లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్, రోజుకు 1జీబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్రయోజనాలన్నీ పాత, కొత్త ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లందరికీ వర్తిస్తాయి. అయితే ఈ ప్యాక్ ఎంపికచేసిన సర్కిళ్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కర్నాటక సర్కిళ్లకు ఈ కొత్త టారిఫ్ ప్లాన్ లభ్యమవుతుంది. అయితే సబ్స్క్రైబర్లందరికీ మై ఎయిర్టెల్ యాప్‌లో ఈ ప్యాక్ యాక్టివేట్ అవాల్సి ఉంది. ప్రస్తుతం దీన్ని ఎయిర్టెల్ సైట్ నుంచి పొందాల్సి ఉంటుంది. ఈ వారం ప్రారంభంలోనే వొడాఫోన్ రూ.199కు కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్ కింద వొడాఫోన్ రోజుకు 1జీబీ డేటా, అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్‌ను ఆఫర్చేస్తోంది. అయితే రోజు వారీ కాల్స్‌పై వొడాఫోన్ పరిమితి విధించింది. వొడాఫోన్ లాంచ్ చేసిన ఈ రూ.199 ప్యాక్ కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ సర్కిల్ వారికి మాత్రమే. అదనంగా ఎయిర్టెల్ రూ.157 ప్యాక్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ ప్యాక్ కింద 27 రోజుల పాటు 3జీబీ 3జీ, 4జీ డేటాను ఆఫర్ చేస్తోంది. -
జియోకి కౌంటర్:ఎయిర్టెల్ సూపర్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా జియో తాజా ఆఫర్కుపోటీగా సరికొత్త రీచార్జ్‌ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఈ కొత్త పథకాలను ప్రారంభించింది.. రూ.399 రీచార్జ్‌పై అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించేలా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇదిరిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన రూ.399 ఆఫర్‌ను పోలి వుండడం గమనార్హం. అలాగే రూ.149 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్టెల్ టు ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, రూ. 399రీఛార్జ్ ప్యాక్ అందరి వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ రీఛార్జ్ ప్యాక్ లభ్యతపై కస్టమర్ కేర్‌ను సంప్రదించి ,ఆఫర్ లభ్యతపై చెక్ చేసుకోవాలి. అంతేకాదు ఎయిర్టెల్ పే మెంట్ బ్యాంకులో ఖాతాను తెరిచిన కస్టమర్లకు రూ.349 రీచార్జ్‌పై 10శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా జీయో రీచార్జ్ప్యాక్లను అందుబాటులోకి తెస్తే జియోకి కౌంటర్‌గా ఎయిర్ టెల్ మరిన్ని ఇతర ప్రణాళికలను ప్రారంభించింది. రూ. 8 ప్లాన్: నిమిషానికి 30 పైసలతో స్థానిక + ఎస్టీడీ కాల్స్ 56 రోజులు వాలిడిటీ, రూ. 40 ప్లాన్: అన్లిమిటెడ్ వాలిడిటీతో రూ. 35 టాక్ టైం. రూ. 60 ప్లాన్: అన్ లిమిటెడ్ వాలిడిటీతో రూ.58 టాక్ టైం. రూ. 5 ప్లాన్: 4జీబీ 3జీ / 4జీ డేటా, వాలిడిటీ 7 రోజులు 4జీ సిమ్ చెల్లుబాటు అయ్యే లా వన్ టైం రీచార్జ్ రూ. 199 ప్లాన్: అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, 1Gజీబీ 2జీ / 3జీ/ 4జీ డేటా, 28 రోజుల వాలిడిటీ మరోవైపు మరికొద్ది రోజుల్లో జియో 4జీ ఫోన్లు కస్టమర్ల చేతికి రానున్నాయి. ఇప్పటికే లక్షలమంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నారు. దీంతో ఎయిర్టెల్ సైతం రూ.2500కు ఫీచర్ ఫోన్ తీసుకొచ్చేందుకు యోచిస్తున్న సంగతి తెలిసిందే. -
జియో ఎపెక్ట్: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
న్యూఢిల్లీ: వినియోగదారులకు టెలికాం సంస్థల ఆఫర్ల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవల్లోఉచిత ఆఫర్లతో జియో దూసుకురావడంతో దేశీయ దిగ్గజ టెలికాం ఆపరేటర్లు తమ తారిఫ్ లను తరచూ సమక్షీంచుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసుల సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ఖాతాదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్‌లో రూ. 339 రీచార్జ్‌పై రోజుకు 3జీ 2జీబీ డాటా ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని 28 రోజుల కాలపరిమితిలో పొందవచ్చని తెలిపింది. దీంతోపాటు ఇతర నెట్ వర్క్‌లలో రోజుకు 25 నిమిషాల టాక్ టైం ఉచితం. ఈ ఆఫర్ 90 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుందని సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ విలువైన కస్టమర్లకోసం సరసమౌన ధరల్లో సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని బీఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ తెలిపారు. అలాగే ప్రతీ రోజు 25 నిమిషాల చొప్పున ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత కాలింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నామన్నారు. ఈ పరిధి దాటిన తరువాత నిమిషానికి 25 పైసలు చార్జ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా రిలయన్స్ జియో ఇస్తున్న ఉచిత కాల్స్ పథకానికి, అలాగే ఏప్రిల్ 1నుంచి ప్రారంభించనున్న రూ.303 ప్రైమ్ మెంబర్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది. అనంతరం ఇతర మేజర్ కంపెనీలు ఎయిర్ టెల్, వొడాఫోన్ జియోధీటుగా మరిన్ని ఆఫర్లను ప్రకటించింన సంగతి తెలిసిందే. -
ఎయిర్టెల్ ఆఫర్స్ ఫ్రీ కాదా..?!
హైదరాబాద్: జియో పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడటానికి పలు టెలికాం కంపెనీలు ఉచిత ఆఫర్లతో ముందుకువచ్చాయి. ఎయిర్టెల్ కూడా తన వినియోగదారులకు వినూత్న ఆఫర్లను ప్రకటించింది. అందులో రూ.349 కే ఉచిత కాల్స్, రోజుకు1జీబీ డేటా, 28 రోజులపాటు అంటూ ప్రకటించింది. ఈ ఆఫర్‌కు సంబంధించి ఒక ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త ఖాతాదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లు ప్రకటించినా కాల్ చార్జీల బాదుడు మాత్రం తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇది పూర్తిగా ఉచితం కాదని పరిమితులకు లోబడి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్తున్నారని ఎయిర్టెల్ ఖాతాదారుల ఫిర్యాదు. ముఖ్యంగా అపరిమిత ఉచిత కాల్స్ అంటూ లేవు. రోజుకు 500 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు మించి ఉచితంగా మాట్లాడకునే అవకాశం లేదు... నాలుగు వారాలకు 4800 నిమిషాలు మాత్రమే... రోజుకు 5గంటలు(300 నిమిషాలు) మించి మాట్లాడటానికి వీలులేదు. ఒక వేళ 5గంటలు మించి మాట్లాడితే నిమిషానికి 30పైసలు చార్జీలు తప్పదని కస్టమర్ కేర్ నుంచి సమాధానం వస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అలాగే వారానికి 1200 నిమిషాలు మించి మాట్లాడినా నిమిషానికి 30 పైసలు అదనపు చార్జీలు వసూలు చేస్తారట. నెలకు 28 జీబీలో రోజుకు 1జీబీ చొప్పున వాడుకోవాల్సిఉంటుంది. ఇందులోకూడా రాత్రి 12 నుంచి ఉదయం 6గంటల వరకూ 500ఎంబీ, ఉదయం 6గంటలనుంచి రాత్రి 12 గంటల వరకూ 500ఎంబీ వాడుకోవాలి. ఈవిషయాలన్నీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తేనే చెప్పడం విశేషం. కాగా టారిఫ్ ప్లాన్లపై ఖాతాదారులు చేస్తున్న ఆరోపణలపై ఎయిర్టెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
వోడాఫోన్ పోటా పోటీ ఆఫర్
ముంబై: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో దేశీయ ఆపరేట్లర్లు తమ ఖాతాదారులను నిలుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. దాదాపు అన్ని టెలికాం సేవల సంస్థలు వరుస ఆఫర్లతో వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆపరేటర్ వోడాఫోన్ తన ఖాతాదారులు రిలయన్స్ జియోకు తరలిపోకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కొత్త టారిఫ్ లను శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రకటించిన టారిఫ్ పథకాలను ధీటుగా సరికొత్త ప్లాన్ ప్రకటించింది. నెలకు రూ.346 రీచార్జ్‌పై 28జీబీ 4 జీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్ఎమ్మెస్ లు లాంటి ప్రయోజనాను అందించనుంది. ఈ ఆఫర్ మార్చి 15 వరకూ మాత్రమే చెల్లుబాటవుతుందని వోడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. జియో ప్రైమ్ మెంబర్షిప్ కోసం వినియోగదారులు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కానీ వోడాఫోన్ కస్టమర్లు ఇలాంటి ఫీజు లేకుండానే ఆ మంత్లీ ప్లాన్ ని ఎంజాయ్ చేయొచ్చన్నమాట. మరోవైపు జియో ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రాంలో ప్రకటించిన డ్యాటా ప్రయోజనాలకు అదనపు డ్యాటాను ఆఫర్ చేస్తూ జియో శుక్రవారం బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం రూ.303లతో రీచార్జ్ చేసుకునే ప్రైమ్ యూజర్లకు ఇదివరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటాను కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 56 జీబీ డేటాతోపాటు10 జీబీ డేటాను అదనంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. -
టెలినార్ అపరిమిత కాల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ అన్ లిమిటెడ్ వాయిస్, ఇంటర్నెట్ ప్లాన్స్‌ను 28 రోజుల కాల పరిమితితో ప్రకటించింది. రూ.249 వోచర్‌తో అపరిమితంగా లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 1 జీబీ 4జీ, అన్లిమిటెడ్ 2జీ డేటా పొందవచ్చు. రూ.74 వోచర్‌తో టెలినార్ నుంచి టెలినార్‌కు దేశవ్యాప్తంగా అపరిమితంగా కాల్స్ చేయొచ్చు. దీనితోపాటు 1 జీబీ 4జీ/2జీ డేటా కూడా ఉచితమని కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ ఈ సందర్భంగా తెలిపారు. టాటా డొకొమో సైతం..: మరో టెలికం కంపెనీ టాటా డొకొమో మూడు ప్లాన్స్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.246 ప్యాక్‌తో దేశవ్యాప్తంగా అన్ని కాల్స్ ఉచితం. 2 జీబీ డేటా దీనికి అదనం. కాల పరిమితి 28 రోజులు. 14 రోజుల వాలిడిటీ గల రూ.148 ప్యాక్‌తో అన్ని కాల్స్ ఫ్రీ. అలాగే 1 జీబీ డేటా ఉచితం. రూ.103 ప్లాన్‌తో దేశవ్యాప్తంగా డొకొమో నుంచి డొకొమో కు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 500 ఎంబీ డేటా ఉచితం. 28 రోజుల కాల పరిమితి ఉంది. -
రూ.149లకే అపరిమిత వాయిస్ కాలింగ్: ఆర్‌కామ్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ (ఆర్‌కామ్) తాజాగా కస్టమర్ల కోసం అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. యూజర్లు ఈ ప్లాన్‌ను పొందాలంటే రూ.149లతో రీచార్జ్ చేసుకోవాలి. తాజా ప్లాన్‌లో 2జీ/3జీ/4జీ యూజర్లు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అరుునా అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దేశంలోని అధిక సంఖ్యాక 2జీ యూజర్లను తమ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను ఆవిష్కరించామని వివరించింది. ఈ అన్లిమిటెడ్ ప్లాన్‌లో యూజర్లు అదనంగా 300 ఎంబీ డేటాను పొందొచ్చని పేర్కొంది. జియో కూడా ఉచిత కాల్స్‌ను అందిస్తోంది కదా అంటే ఆ సౌలభ్యం కేవలం వీఓఎల్టీఈ సపోర్ట్ 4జీ హ్యాండ్‌సెట్స్‌కు మాత్రమే అందుబాటులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి. -
బీఎస్ఎన్ఎల్ సండే ఆఫర్ అదుర్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఆగస్టు 21 నుంచి ఆదివారాలు దేశంలో ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ కు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయాన్నికల్పిస్తోంది. ఏ నెట్ వెర్క్ మొబైల్ కు కానీ, ల్యాండ్ లైన్ కు కానీ అన్ని ఆదివారాల్లో అపరిమిత ఉచిత కాలింగ్ ఆఫర్ కల్పిస్తున్నట్టు టెలికాం శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ట్వీట్ లో నేడు (శనివారం)ట్విట్ చేశారు. మేకిన్‌ఇండియా, డిజిటల్ ఇండియా బలోపేతం చేయడానికి జాతీయ స్ధాయిలో బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించినట్టు ట్విట్ చేశారు. అధికారిక సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలను ఆగస్టు 15న వెల్లడిచేయనున్నారు. ప్రస్తుతం రూ. 120 అద్దెతో గ 7 గంటలకు 9 గంటల మధ్య దేశంలో ఏ నెట్వర్క్ కు అయినా ఉచిత కాలింగ్ ఆఫర్ చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ 14.35 మిలియన్ వినియోగదారులతో 57 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే నైట్ అన్ లిమిటెడ్ కాలింగ్ ను ఆఫర్ చేసిన సంస్థ మరిన్ని ఆఫర్లతో మరింత చేరువ కావాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఎయిర్టెల్ నెలకు రూ 100 అదనపు నెలసరి రుసుముతో రోజంతా ల్యాండ్‌లైన్ నుండి ఉచిత అపరిమిత కాలింగ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. Unlimited free Calling from BSNL Landline to any Network's Mobile & Landline on All Sundays on Pan India Basis w.e.f. 15th August 2016 — Manoj Sinha (@manojsinhabjp) August 13, 2016 -
ఎయిర్‌సెల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్
న్యూఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలికాం ఆపరేటర్ ఎయిర్‌సెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. "ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్" పేరుతో అపరిమిత లోకల్ కాల్స్‌ను, డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడానికి కస్టమర్లు 123 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఎక్స్‌క్లూజివ్ డీల్ కేవలం ఒక్క రోజు మాత్రమే(ఆగస్టు 15) అందుబాటులో ఉండనుంది. 123 రూపాయల రీచార్జ్‌తో కస్టమర్లు అపరిమిత డౌన్లోడింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ హెచ్డీ కంటెంట్, గేమింగ్, అన్లిమిటెడ్ టాకింగ్ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని ఎయిర్‌సెల్ తెలిపింది. "ఆజాదీ ఆఫర్"తో వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించనున్నట్టు ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరల భారాన్ని తగ్గిస్తూ.. అపరిమితమైన సదుపాయాలను వినియోగదారుల ముందు ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్పెషల్ ప్రొడక్ట్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మొబైల్ బిల్లుల నుంచి కస్టమర్లకు పూర్తి స్వాతంత్య్రాన్ని కల్పిస్తుందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఎయిర్‌సెల్ కస్టమర్ల ముందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇటీవలే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కూడా తన కస్టమర్లకు ఆగస్టు 15న అన్ని మొబైల్స్‌కు, ల్యాండ్ లైన్‌కు అపరిమిత ఉచిత కాల్స్‌ను అందించనున్నట్టు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. .