ఎయిర్సెల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ | Aircel Offers Unlimited Calls, Data On Independence Day | Sakshi
Sakshi News home page

ఎయిర్సెల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్

Published Sat, Aug 13 2016 8:40 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

ఎయిర్సెల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ - Sakshi

ఎయిర్సెల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్

న్యూఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలికాం ఆపరేటర్ ఎయిర్సెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. "ఎయిర్సెల్ కా ఆజాదీ ఆఫర్" పేరుతో అపరిమిత లోకల్ కాల్స్ను, డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ను వినియోగించుకోవడానికి కస్టమర్లు 123 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఎక్స్క్లూజివ్ డీల్ కేవలం ఒక్క రోజు మాత్రమే(ఆగస్టు 15) అందుబాటులో ఉండనుంది. 123 రూపాయల రీచార్జ్తో కస్టమర్లు అపరిమిత డౌన్లోడింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ హెచ్డీ కంటెంట్, గేమింగ్, అన్లిమిటెడ్ టాకింగ్ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని ఎయిర్సెల్ తెలిపింది.


"ఆజాదీ ఆఫర్"తో వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించనున్నట్టు ఎయిర్సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరల భారాన్ని తగ్గిస్తూ.. అపరిమితమైన సదుపాయాలను వినియోగదారుల ముందు ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్పెషల్ ప్రొడక్ట్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మొబైల్ బిల్లుల నుంచి కస్టమర్లకు పూర్తి స్వాతంత్య్రాన్ని కల్పిస్తుందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఎయిర్సెల్ కస్టమర్ల ముందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇటీవలే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కూడా తన కస్టమర్లకు ఆగస్టు 15న అన్ని మొబైల్స్కు, ల్యాండ్ లైన్కు అపరిమిత ఉచిత కాల్స్ను అందించనున్నట్టు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement