Independence Day Offers
-
ఆగస్టు నెలలో పుట్టారా? అయితే ఫోన్ ఫ్రీ!
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ టచ్ మొబైల్స్ ‘ఫ్రీ ఫోన్’ ఆఫర్ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి మొబైల్ ఉచితంగా ఇస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున టచ్ స్టోర్‌ను సందర్శించి తమ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 15 ఒక్క రోజుకే పరిమితం. అలాగే బ్రాండెడ్ ఫోన్లపై 50%, యాక్ససరీస్‌లపై 77% వరకు తగ్గింపు అందిస్తుంది. ఒప్పో అన్ని మోడళ్లపై 15% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రారంభ ధర రూ.6,999తో 32 అంగుళాల ఎల్ఈడీ టీవీని అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రిడిట్ కార్డులపై 10% తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో అధునాతన మోడల్స్ పొందే అవకాశం ఉంది. -
బంఫర్ ఆఫర్: 15 వరకు ఏ మెట్రోస్టేషన్‌కైనా రూ.30
బెంగళూరు: దేశంలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఆజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా నమ్మ మెట్రో రైలు కార్పోరేషన్ రాయితీలను ప్రకటించింది. లాల్‌బాగ్‌లో జరుగుతున్న ఫ్లవర్‌షో ప్రదర్శనకు 13 నుంచి 15 వరకు సందర్శకుల సౌకర్యార్థం బెంగళూరు మెట్రో రైలు మండలి రాయితీ టికెట్ వ్యవస్థ కల్పించింది. శనివారం నుంచి సోమవారం వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు లాల్బాగ్ మెట్రో స్టేషన్ నుంచి నగరంలో ఏ మెట్రోస్టేషన్‌కు ప్రయాణించాలంటే టికెట్ ధర రూ.30 నిర్ణయించింది. దీనికోసం పేపర్ టికెట్ పరిచయం చేసింది. ఈ మూడురోజుల పాటు లాల్బాగ్ నుంచి ఏ మెట్రోస్టేషన్‌కైనా ప్రయాణించవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మెట్రోస్టేషన్లలో పేపర్టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. లాల్బాగ్ మెట్రోస్టేషన్లో పేపర్ టికెట్ రాత్రి 8 గంటలకు అందుబాటులో ఉంటాయని మెట్రోమండలి తెలిపింది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
బ్రాండ్ ఫ్యాక్టరీ.. 2 కొంటే 3 ఉచితం
హైదరాబాద్: ఫ్యూచర్‌గ్రూప్ స్టోర్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఆఫర్‌ను ప్రకటించింది. బ్రాండ్ ఫ్యాక్టరీలో ‘‘2 కొంటే 3 ఉచితం’’ ఆఫర్‌ను ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్ట్ 16వరకు కొనసాగే ఈ ఆఫర్లో భాగంగా 200కు పైగా విదేశీ, దేశీయ బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని అసిస్టెడ్ షాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈవో సురేష్ నద్వానీ తెలిపారు. ఇందుకు కస్టమర్లు 7506313001కి మిస్‌కాల్ ఇచ్చి అపాయింట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నద్వానీ పేర్కొనారు. -
పంద్రాగస్ట్ ఆఫర్ : రూ.1947కే వివో స్మార్ట్ఫోన్లు
వివో నెక్స్.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి వివో ఇటీవల లాంచ్ చేసిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటు అభిమానుల నుంచి, అటు విమర్శకుల నుంచి మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా వివో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలో భాగంగా వివో భలే ఆఫర్‌ను ప్రకటించింది. 72 గంటల పాటు అద్భుతమైన ఆఫర్లతో.. వివో ఫ్రీడం కార్నివల్ ఆన్లైన్ సేల్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. వివో ప్రకటించిన ఈ సేల్‌లో.. ఇప్పటికే మంచి రివ్యూను సంపాదించుకున్న వివో నెక్స్ స్మార్ట్‌ఫోన్ కేవలం 1947 రూపాయలకే అందుబాటులోకి వస్తోంది. అసలు వివో నెక్స్ ధర 44,990 రూపాయలు. వివో నెక్స్‌తో పాటు వివో వీ9 కూడా 1947 రూపాయలకే విక్రయానికి రానుంది. దీని ధర 22,990 రూపాయలు. ఈ రెండు స్మార్ట్ఫోన్లను ఫ్లాష్ సేల్కు తెచ్చి, పరిమితి సంఖ్యలో వీటిని వివో ఆఫర్ చేయబోతుంది. భారత్‌కు సాతంత్య్రం వచ్చిన ఏడాదిని, వివో నెక్స్, వివో వీ9 ధరలుగా నిర్ణయించడం విశేషం. మూడు రోజుల వివో ఫ్రీడం కార్నివల్ ఆన్లైన్ సేల్ నేటి అర్థరాత్రి(ఆగస్టు 6) నుంచి ప్రారంభమై, ఆగస్టు 9తో ముగుస్తుంది. ఈ సేల్ కేవలం కంపెనీ ఆన్లైన్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వివో నిర్వహించే ఫ్రీడం కార్నివల్లో వివో నెక్స్, వివో వీ9 స్మార్ట్ఫోన్ల ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. స్టాక్ అయిపోయేంత వరకు ఈ స్మార్ట్ఫోన్లను రూ.1947కే విక్రయించనుంది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్, 12 నెలల జీరో కాస్ట్ ఈఎంఐ, 1200 రూపాయల విలువైన ఉచిత బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్స్‌ను కేవలం 72 రూపాయలకే అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో విక్రయిస్తోంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో, యాక్ససరీస్ ధరలను కూడా 72 రూపాయలుగానే నిర్ణయించింది. వివో నెక్స్ ఫీచర్లు... 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. వివో వీ9 ఫీచర్లు... ఐఫోన్ ఎక్స్ మాదిరి డిస్ప్లే నాచ్, 6.3 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత సాఫ్ట్వేర్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో రియర్ కెమెరా, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ. -
ఎయిర్‌సెల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్
న్యూఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలికాం ఆపరేటర్ ఎయిర్‌సెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. "ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్" పేరుతో అపరిమిత లోకల్ కాల్స్‌ను, డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడానికి కస్టమర్లు 123 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఎక్స్‌క్లూజివ్ డీల్ కేవలం ఒక్క రోజు మాత్రమే(ఆగస్టు 15) అందుబాటులో ఉండనుంది. 123 రూపాయల రీచార్జ్‌తో కస్టమర్లు అపరిమిత డౌన్లోడింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ హెచ్డీ కంటెంట్, గేమింగ్, అన్లిమిటెడ్ టాకింగ్ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని ఎయిర్‌సెల్ తెలిపింది. "ఆజాదీ ఆఫర్"తో వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించనున్నట్టు ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరల భారాన్ని తగ్గిస్తూ.. అపరిమితమైన సదుపాయాలను వినియోగదారుల ముందు ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్పెషల్ ప్రొడక్ట్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మొబైల్ బిల్లుల నుంచి కస్టమర్లకు పూర్తి స్వాతంత్య్రాన్ని కల్పిస్తుందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఎయిర్‌సెల్ కస్టమర్ల ముందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇటీవలే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కూడా తన కస్టమర్లకు ఆగస్టు 15న అన్ని మొబైల్స్‌కు, ల్యాండ్ లైన్‌కు అపరిమిత ఉచిత కాల్స్‌ను అందించనున్నట్టు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. .