వివో నెక్స్ స్మార్ట్‌ఫోన్
వివో నెక్స్.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి వివో ఇటీవల లాంచ్ చేసిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటు అభిమానుల నుంచి, అటు విమర్శకుల నుంచి మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా వివో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలో భాగంగా వివో భలే ఆఫర్‌ను ప్రకటించింది. 72 గంటల పాటు అద్భుతమైన ఆఫర్లతో.. వివో ఫ్రీడం కార్నివల్ ఆన్‌లైన్ సేల్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. వివో ప్రకటించిన ఈ సేల్‌లో.. ఇప్పటికే మంచి రివ్యూను సంపాదించుకున్న వివో నెక్స్ స్మార్ట్‌ఫోన్ కేవలం 1947 రూపాయలకే అందుబాటులోకి వస్తోంది. అసలు వివో నెక్స్ ధర 44,990 రూపాయలు. వివో నెక్స్‌తో పాటు వివో వీ9 కూడా 1947 రూపాయలకే విక్రయానికి రానుంది. దీని ధర 22,990 రూపాయలు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఫ్లాష్ సేల్‌కు తెచ్చి, పరిమితి సంఖ్యలో వీటిని వివో ఆఫర్ చేయబోతుంది.
భారత్‌కు సాతంత్య్రం వచ్చిన ఏడాదిని, వివో నెక్స్, వివో వీ9 ధరలుగా నిర్ణయించడం విశేషం. మూడు రోజుల వివో ఫ్రీడం కార్నివల్ ఆన్‌లైన్ సేల్ నేటి అర్థరాత్రి(ఆగస్టు 6) నుంచి ప్రారంభమై, ఆగస్టు 9తో ముగుస్తుంది. ఈ సేల్ కేవలం కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వివో నిర్వహించే ఫ్రీడం కార్నివల్‌లో వివో నెక్స్, వివో వీ9 స్మార్ట్‌ఫోన్ల ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. స్టాక్ అయిపోయేంత వరకు ఈ స్మార్ట్‌ఫోన్లను రూ.1947కే విక్రయించనుంది.
ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్, 12 నెలల జీరో కాస్ట్ ఈఎంఐ, 1200 రూపాయల విలువైన ఉచిత బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. యూఎస్‌బీ ఛార్జింగ్ కేబుల్స్‌ను కేవలం 72 రూపాయలకే అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో విక్రయిస్తోంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో, యాక్ససరీస్ ధరలను కూడా 72 రూపాయలుగానే నిర్ణయించింది.
వివో నెక్స్ ఫీచర్లు...
6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
వివో వీ9 ఫీచర్లు...
ఐఫోన్ ఎక్స్ మాదిరి డిస్‌ప్లే నాచ్, 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత సాఫ్ట్‌వేర్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో రియర్ కెమెరా, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Please login to add a commentAdd a comment