
మొబైల్స్ తయారీ సంస్థ వివో తాజాగా భారత్‌లో ఎక్స్200 సిరీస్ విడుదల చేసింది. వీటిలో వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ఉన్నాయి. భారత్‌లో తొలిసారిగా 200 మెగాపిక్సెల్ జైస్ అపోక్రోమాటిక్ టెలిఫోటో కెమెరా, 6,000 ఎంఏహెచ్ సెమీ–సాలిడ్ సేŠట్‌ట్ బ్యాటరీని వివో ఎక్స్200 ప్రో మోడల్‌కు పొందుపరిచారు.

6.78 అంగుళాల ఆమర్ గ్లాస్ డిస్‌ప్లేతో తయారైంది. 50 ఎంపీ జైస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సైతం జోడించారు. ఎక్స్200 మోడల్ 6.67 అంగుళాల షాట్ ఆల్ఫా గ్లాస్ డిస్‌ప్లేతో రూపుదిద్దుకుంది. 50 ఎంపీ వీసీఎస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ జైస్ టెలిఫోటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది.

ఫన్‌టచ్ ఓఎస్ 15, జెమినై అసిస్టెంట్, ఏఐ ట్రాన్‌స్క్రిప్ట్ అసిస్ట్, వివో ఏఐ లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ వంటి హంగులు ఉన్నాయి. ఎక్స్200 ప్రారంభ ధర రూ.65,999 కాగా, ఎక్స్200 ప్రో ధర రూ.94,999 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment