new mobile
-
వివో ఎక్స్200 సిరీస్.. ఇలాంటి కెమెరా తొలిసారి
మొబైల్స్ తయారీ సంస్థ వివో తాజాగా భారత్‌లో ఎక్స్200 సిరీస్ విడుదల చేసింది. వీటిలో వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ఉన్నాయి. భారత్‌లో తొలిసారిగా 200 మెగాపిక్సెల్ జైస్ అపోక్రోమాటిక్ టెలిఫోటో కెమెరా, 6,000 ఎంఏహెచ్ సెమీ–సాలిడ్ సేŠట్ట్ బ్యాటరీని వివో ఎక్స్200 ప్రో మోడల్‌కు పొందుపరిచారు.6.78 అంగుళాల ఆమర్ గ్లాస్ డిస్ప్లేతో తయారైంది. 50 ఎంపీ జైస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సైతం జోడించారు. ఎక్స్200 మోడల్ 6.67 అంగుళాల షాట్ ఆల్ఫా గ్లాస్ డిస్ప్లేతో రూపుదిద్దుకుంది. 50 ఎంపీ వీసీఎస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ జైస్ టెలిఫోటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది.ఫన్‌టచ్ ఓఎస్ 15, జెమినై అసిస్టెంట్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, వివో ఏఐ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ వంటి హంగులు ఉన్నాయి. ఎక్స్200 ప్రారంభ ధర రూ.65,999 కాగా, ఎక్స్200 ప్రో ధర రూ.94,999 ఉంది. -
నథింగ్ ఫోన్ గురించి తెలుసా..
నథింగ్.. అంటే ఏమీలేదు అనుకోకండి. అదో ప్రతిష్టాత్మక బ్రాండ్ మొబైల్ పేరు. కంపెనీ లాంచ్ చేసినవి రెండు ఫోన్లైనా కావాల్సినంత ప్రచారం లభించింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌పై స్థాపించిన బ్రాండ్ ఇది. ట్రాన్సపరెంట్ లుక్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1, 2 ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. ధరే కాస్త అధికంగా ఉండడంతో చాలామంది ఆసక్తి చూపలేదు. దీంతో మిడ్ రేంజ్లో తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ పేరిట ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.25,999గా ఉంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా పేర్కొంది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద తొలిరోజు కొనుగోలు చేసేవారికి రూ.19,999కే ఈ ఫోన్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ.2వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.2వేలు చొప్పున తగ్గింపు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్ప్లే పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. నథింగ్ బడ్స్, నెక్ బ్యాండ్ నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఈ సందర్భంగా రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. సీఎంఎఫ్ బడ్స్, నెక్‌బ్యాండ్ ప్రోను తీసుకొచ్చింది. ఈ రెండూ మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో లభిస్తాయి. బడ్స్ ధరను రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. 42db నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల పాటు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసు 35.5 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? నెక్‌బ్యాండ్ ప్రో ధర రూ.1999గా నిర్ణయించింది. హైబ్రిడ్ ఏఎన్సీ టెక్నాలజీ, 50db నాయిస్ క్యాన్సిలేషన్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఐపీ55 వాటర్, స్వెట్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 37 గంటల పాటు పనిచేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 18 గంటల పాటు వీటిని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. -
సెప్టెంబరులో రానున్న 5G బెస్ట్ ఫోన్లు ఏవంటే?
iQoo Z7 Pro 5g భారత మార్కెట్లో ఐక్యూ జెడ్ 7 ప్రో (ఆగస్టు 31న లాంచ్ అయింది. Z7 లైనప్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది కంపెనీ. బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలోరెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ.23,999, రూ.24,999గా నిర్ణయించింది. (30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్) బ్యాంక్ ఆఫర్ అయితే బ్యాంక్ ఆఫర్ కింద రెండువేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. దీని ప్రకారం వీటి ధరలు వరుసగా రూ. 21,999, రూ. 22,999గా ఉంటాయి. అమెజాన్, ఐక్యూ అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 5, మధ్యాహ్నం 12 నుంచి సేల్ షురూ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ CE 3తో పోలిస్తే తక్కువ ధరలో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. The #iQOOZ7Pro 5G is finally here! 🤩 Get this ultimate, power-packed device at an incredible price of just ₹21,999* at the upcoming sale on @amazonIN & https://t.co/ZK4Krrdztq on Sept 5. 💙📱 Know more: https://t.co/tfsaIl9h3Y#AmazonSpecials #FullyLoaded #iQOOZ7Pro5G pic.twitter.com/BgOHLnjnuC — iQOO India (@IqooInd) August 31, 2023 ఐక్యూ జెడ్7 ప్రో ఫీచర్లు : 6.78 అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 7200 సాక్ ప్రాసెసర్, 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ , 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరాఉంటాయి. చైనా టెక్నో పోవా ఫోన్లు చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ రెగ్యులర్ స్మార్ట్ఫోన్లకు కాస్త భిన్నంగా ఉండే విధంగా సరికొత్త స్మార్ట్ఫోన్లు పోవా 5, పోవా 5 ప్రో 5జీలను మార్కెట్లోకి విడుదల చేసింది. Tecno Pova 5: పోవా 5 ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ 120Hz డిస్ప్లేతో వచ్చింది. మీడియాటెక్ హీలియో G99 6nm చిప్సెట్, 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 Tecno Pova 5 Pro 5G 120 Hz రిఫ్రెష్ రేట్‌తో , 6.78-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే (FHD+) 50-megapixel + VGA రియర్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజీ ప్రత్యేకత. Tecno Pova 5 Pro నానో-సిమ్ , నానో-సిమ్ కార్డ్ స్లాట్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ (GSM ప్లస్ GSM) మొబైల్. ఇది డార్క్ ఇల్యూషన్ , సిల్వర్ ఫాంటసీ రంగులలో అందుబాటులో ఉంది. Tecno Pova 5 Pro 5జి ప్రారంభ ధర రూ. 14,999. సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న టాప్ స్మార్ట్ఫోన్లు వీటితోపాటు ఈ సెప్టెంబరులో ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, 15 ప్లస్, ఐఫోన్ 15ప్రొ, ఐఫోన్ 15ప్రొ మ్యాక్స్ తదితర ఫోన్లు లాంచ్ కానున్నాయి.ఇంకా హానర్ 90 మొబైల్ తయారీ దారు హానర్ రెండేళ్ల తరువాత భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. 6.4-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED డిస్ప్లే,50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఈ (Samsung Galaxy S23 FE) లాంచ్ కానుంది. అలాగే Moto G54 5G స్మార్ట్‌ఫోన్ ఈనెలలోనే రానుంది. 6.5-అంగుళాల పూర్తి-HD+ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లుంటాయని అంచనా. It’s official! Apple will launch the iPhone 15 at the next #AppleEvent on September 12th at 10 a.m. PDT 🚨 Are you excited? pic.twitter.com/6mBEW7Z0Tm — Apple Hub (@theapplehub) August 29, 2023 Samsung Galaxy S23 FE Might Launch in September 2023 Specs: -6.4'' FHD+ 120Hz Dynamic AMOLED display -Snapdragon 8 Gen 2 or Exynos 2200 SoC -50MP Main +8MP UW +12MP Telephoto camera & 10MP selfie -4500mAh battery with 25W charging -One UI 5.1, Android 13#Samsung #GalaxyS23FE pic.twitter.com/Y3N1tH2ky8 — Smartprix (@Smartprix) August 24, 2023 moto G54 5G is launching on September 6, 2023 in India. - 6.55" FHD+ 120Hz IPS LCD - MediaTek Dimensity 7020 - 50MP OIS + 8MP camera - 16MP front - Stereo speakers, Dolby Atmos - 6000mAh battery, 33W charge - Android 13 - 3.5mm, Side FS - 192g, 8.89mm#Motorola #moto #motoG54 pic.twitter.com/TlfViCJcL4 — Oneily Gadget (@OneilyGadget) August 31, 2023 -
హైదరాబాద్ : శామ్సంగ్ కొత్త మొబైల్ లాంచ్ చేసిన నటి అషురెడ్డి (ఫొటోలు)
-
గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో , ఫీచర్లు చూస్తే!
Infinix gt 10 pro: ఇన్ఫినిక్స్ ఇండియా తాజాగా జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్ గేమింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ధరలో దీన్ని లాంచ్ చేసింది. సుపీరియర్ ప్రాసెసింగ్ పవర్, కూల్ టెక్నాలజీ,10-బిట్ FHD+AMOLED డిస్ప్లేను దీన్ని తీసుకు రావడం విశేషం. రియర్ కెమెరా ద్వారా 4K వీడియో రికార్డింగ్, సెల్ఫీ కెమెరా 2K వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు AI ఫిల్మ్ మోడ్‌ను కూడా జోడించింది. ఇండియాలోదీని లాంచింగ్ ప్రైస్ రూ. 19,999గా ఉంది. అయితే బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా, ప్రస్తుతం రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటు,తొలి 5,000 మంది కస్టమర్లు ప్రో గేమింగ్ కిట్‌ను కూడా అందుకునోఛాన్స్ ఉంది. సైబర్ మెకా డిజైన్, రంగు మార్చే వెనుక ప్యానెల్, 6.67 ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. 108 ఎంపీ అల్ట్రా క్లియర్ ట్రిపుల్ కెమెరా, ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 5జీ సిమ్ దీనిలో ఉన్నట్లు సంస్థ సీఈవో అనీష్ కపూర్ తెలిపారు. ఇది సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుందని పేర్కొన్నారు. జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 1300ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునేసదుపాయం 5000mAh బ్యాటరీ -
తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అతితక్కువ ధరకే ఇన్ఫినిక్స్ హాట్ 30 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ తోపాటు, భారీ బ్యాటరీ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే లభ్యం కానుంది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ హాట్ 30 ఫోను సేల్ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్ 30 సేల్ షురూ అవుతుందని సంస్థ వెల్లడించింది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499 గా నిర్ణయించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు, రూ. నెలకు 2,250 చొప్పున నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 స్పెసిఫికేషన్లు 6.78 ఇంచెస్ ఫుడ్ హెచ్డీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్ 50 + 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
iQoo Z7s 5G: దేశీయ మార్కెట్లో 'ఐకూ జెడ్7ఎస్ 5జీ' (iQoo Z7s 5G) స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. రెండు వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్ ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు.. ఐకూ జెడ్7ఎస్ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 18,999 & రూ. 19,999. ఇవి రెండూ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్.. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లో లభించే ఈ మొబైల్ 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో 2.5 GHz, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!) కెమరా ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అవి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కావున ఇది కేవలం 24 నిముషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది ఐపీ54 రేటింగ్ కలిగి ఉండటం వల్ల నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ పొందుతుంది. -
Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో ఆధునిక స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇలాంటి వాటినే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాగా ఇప్పుడు నోకియా కంపెనీ ఒక లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్ విడుదలకానుంది. బార్సిలోనాలో జరిగిన ఏండబ్ల్యుసి 2023 ఈవెంట్లో 'నోకియా సీ99' అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వంటివి ఒక్కొక్కటిగా లీక్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ మార్కెట్లో ఎప్పుడు అధికారికంగా విడుదలవుతుందనే విషయం వెల్లడి కాలేదు. నోకియా సీ99 ధరలు కూడా కంపెనీ వెల్లడించలేదు, కానీ దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ డిస్ప్లే, లేటెస్ట్ హై ఎండ్ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) కొత్త నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్‌లోని స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ గరిష్టంగా 16GB RAMతో జత చేయవచ్చు. ఈ సరికొత్త మొబైల్ గురించి తెలియాల్సిన వివరాలు చాలానే ఉన్నాయి. కాగా ఇది దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనేది త్వరలో తెలుస్తుంది. -
Google Pixel 7a: విడుదలకు ముందే లీకైన వివరాలు
ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వాడకానికి అలవాటుపడ్డ జనం కోసం గూగుల్ మిడ్ రేంజ్లో 'పిక్సెల్ 7ఏ' విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ ఏడాది మేలో జరిగే గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్లో కంపెనీ దీనిని లాంచ్ చేయనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ కంటే కూడా 7ఏ చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ప్రాసెసర్ నుంచి కెమెరాల వరకు చాలా విభాగాల్లో పిక్సెల్ 7ఏ అప్‌గ్రేడ్ పొందినట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ 6.1 ఫుల్ హెచ్డీ+ 90హెర్ట్జ్ OLED డిస్ప్లే పొందుతుంది. అంతే కాకుండా గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంటుంది. త్వరలో విడుదలకానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ వెనుక 64 మెగాపిక్సెల్ సోనీ IMX787 ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయని సమాచారం. అయితే కంపెనీ ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ఇది వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఛార్జింగ్ కెపాసిటీ గురించి తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?) గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ ధరల గురించి కూడా కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గత సంవత్సరం విడుదలైన 6ఏ ధర రూ. 30,000 కంటే తక్కువ. కావున కొత్త ఏ7 దీని కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన మొబైల్ లాంచ్.. ధర కూడా తక్కువే!
ఆధునిక ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలవుతోంది. ఇందులో భాగంగానే మోటోరోలా కంపెనీ జీ సిరీస్‌లో మరో బడ్జెట్ 5జీ ఫోన్ విడుదల చేసింది. ఈ కొత్త మొబైల్ కేవలం ఒకే వేరియంట్లో రూ. 18,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కొత్త మోటో జీ73 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగి ల్యుసెంట్ వైట్, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మార్చి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలని అందుబాటులో ఉంటుంది. కార్డు ఆఫర్ ద్వార కొనుగోలు చేసేవారు రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా వినియోగించుకోవచ్చు. మోటో జీ73 5జీ మొబైల్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎల్సీడీ డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అంతే కాకుండా ఇందులో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్‌కు ఆండ్రాయిడ్ 14 అప్డేట్ వస్తుందని మోటోరోలా తెలిపింది. (ఇదీ చదవండి: బెంజ్ కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే?) లేటెస్ట్ మోటో జీ73 5జీ మొబైల్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మాక్రో కెమెరా పొందుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో పొందవచ్చు. -
Xiaomi 13 Pro: దేశీయ మార్కెట్లో విడుదలైంది, కానీ..
దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'షావోమీ' (Xiaomi) 13 ప్రో 5జీ మొబైల్ ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో విడుదలైంది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ఇప్పుడు భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించే ఈ మొబైల్ ఫ్లాగ్షిప్ కెమెరాలతో కూడా లభిస్తుంది. షావోమీ కొత్త మొబైల్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,820mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ వైర్డ్ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్కు, 50 వాట్స్ వైర్లెస్ టర్బో ఫాస్ట్ చార్జింగ్, 10 వాట్ల వైర్లెస్ రివర్స్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. షావోమీ 13 ప్రో మొబైల్లో డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా పొందింది. కెమెరాలు కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించవచ్చు. (ఇదీ చదవండి: తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!) షావోమీ 13 ప్రో మొబైల్ లో పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 5జీ ప్రాసెసర్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ఆడియో, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6.73 ఇంచెస్ 2K+ రెజల్యూషన్ LTPO 3.0 అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఏకంగా 1,900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. షావోమీ తన కొత్త 13 ప్రో మొబైల్ విడుదల చేసింది. అయితే ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ ఈ మొబైల్ ధరలను ఫిబ్రవరి 28న వెల్లడించనుంది. ఇది మొబైల్ సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఈ మొబైల్ ధర 4,999 యువాన్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 61,000. -
రివర్స్ బ్యాటరీ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్న రెడ్మీ కొత్త ఫోన్..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్మీ సిరీస్‌లో భాగంగా మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. రెడ్మీ 9 కు తదనంతర ఫోన్‌గా రెడ్మీ 10 ను షావోమీ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. కాగా విడుదలకు ముందే రెడ్మీ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫీకేషన్లు ఎమ్ఐ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. కాగా ఈఫోన్ రివర్స్ బ్యాటరీ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ నెల చివర్లో షావోమీ రెడ్మీ 10 భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్మీ 10 మూడు స్టోరేజ్ వేరియంట్లతో రానుంది. 4జీబీ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లతో రానుంది. రెడ్మీ 10 కార్బన్ గ్రే, పెబ్బల్ వైట్, సీ బ్లూ కలర్స్‌లో ఉండనుంది. రెడ్మీ 10 ఫోన్ ధరలను షావోమీ ప్రకటించలేదు. స్మార్ట్‌ఫోన్ నిపుణుల ప్రకారం..రెడ్మీ 10 ప్రారంభ ధర రూ.8,999 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెడ్మీ 10 ఫీచర్లు డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 MIUI 12.5 6.5-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డాట్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ 50 ఎమ్పీ రియర్ కెమెరా 8 ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18w ఫాస్ట్ ఛార్జింగ్ -
అతి తక్కువ ధరకే షావోమీ నుంచి 5జీ ఫోన్...!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మొబైళ్ల తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి రెడ్మీ నోట్ 10టీ 5జీను మంగళవారం రోజున లాంచ్ చేసింది. షావోమి నుంచి రెడ్మీ బ్రాండ్‌తో భారత్‌లో రిలీజైన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్. రెడ్మీ నోట్ 10 సిరీస్ నుంచి వచ్చిన ఐదో ఫోన్ రెడ్మీ నోట్ 10టీ 5జీ. రెండు రకాల స్టోరేజ్ వేరియంట్‌తో ఫోన్లను లాంచ్ చేశారు. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ వేరియంట్లతో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ నోట్ 10టీ 5జీ (4 జీబీ + 64 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను జూలై 26 నుంచి అమెజాన్ , ఎమ్ఐ.కామ్, ఎమ్ఐ హోమ్ స్టోర్స్ నుంచి పొందవచ్చును. మొబైల్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. రెడ్ మీ 10టీ 5జీ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12 మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 18వాట్స్ ఫాస్ట్ చార్జర్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
నోకియా 2.3 వచ్చేసింది
న్యూఢిల్లీ: ఫిన్లాండ్కు చెందిన నోకియా బ్రాండ్ హ్యండ్‌సెట్స్ విక్రయ సంస్థ హెచ్ఎమ్డీ గ్లోబల్... బుధవారం భారత మార్కెట్లో నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల్లోనే తొలుత ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన సంస్థ.. తాజాగా భారత మార్కెట్లోకి ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్ 6.2 అంగుళాల డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ. 8,199గా కంపెనీ ప్రకటించింది. నూతన మోడల్‌కు ఏడాది రీప్లేస్మెంట్ గ్యారెంటీ ఉంది. -
కొత్త ఫోన్.. ఓ ప్రాణాన్ని తీసింది
ఖార్గోన్ : మొబైల్ ఫోన్ మోజు.. ఓ ప్రాణాన్ని హరించింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఈ సమయంలో ఖరీదైన ఫోన్ ఎందుకని మందలించిన భార్యను దారుణంగా కొట్టి చంపాడో భర్త. ఈ ఘటన మధ్యప్రదేవ్‌లోని ఖార్గోన్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖార్గోని జిల్లాలోని డోమ్వాడ గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలతో ఓ అద్దె ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. ఇలాంటి సమయంలో భోలారాం ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బుతో కొత్త ఫోన్ కొంటానని భార్యతో చెప్పాడు. ఇంట్లో పరిస్థితి బాగా లేదని, ఇప్పుడు ఫోన్ వద్దని భర్తతో నందు వాదించింది. అయినప్పటికీ భోలారాం వినకుండా ఫోన్ కొనేందుకు షోరూమ్‌కు వెళ్లాడు. దీంతో కలత చెందిన నందు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. సాయంత్రం కొత్త ఫోన్‌తో ఇంటికి తిరిగివచ్చిన భోలారాం..ఇంట్లో భార్య కనిపించకపోయేసరికి అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ గొడవ పడి భార్య, పిల్లలను తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఫోన్ కొనాల్సిన అవసరమేంటని భర్తను మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన భోలారాం.. నందు తలను గోడకేసి బలంగా గుద్దాడు. దీంతో నందుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భోలారాం గట్టిగా ఏడుస్తూ ముగ్గురు పిల్లలను ఇంట్లోనే వదిలి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
ఫేస్ స్లిమ్మింగ్ ఫీచర్‌తో ఒప్పో ఏ9
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ9 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. ఒప్పో ఏ9 ధరను రూ. 15,490 గా నిర్ణయించింది. జులై 20 నుంచి భారత మార్కెట్లలో కొనుగోలుకు లభ్యం కానుంది. ఒప్పో ఏ 9 ఫీచర్లు 6.35 ఫుల్హెచ్డీ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో పి 70 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 16ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4020 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగదారులకు సరసమైన ధరలో అసాధారణమైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఒప్పో ఇండియా సీఈవో చార్లెస్ వాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సెల్ఫీ కెమెరాలో 130 ఫోర్‌హెడ్ పాయింట్స్‌ను గుర్తించడంతోపాటు, ఫేస్ స్లిమ్మింగ్ పీచర్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిజోడించినట్టు చెప్పారు. -
అద్భుత ఫీచర్లతో హానర్ వీ 20 లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: హువావే బ్రాండ్ కింద హానర్ తన సరికొత్త మొబైల్ హానర్ వ్యూ 20ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే ఐఏ ఆధారిత 48 మెగా పిక్సెల్ భారీ కెమెరాతో వస్తున్న స్మార్ట్‌ఫోన్ అంటూ ఊరిస్తున్న హానర్ వీ 20ఎట్టకేలకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ల ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్లో హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. పంచ్ హోల్ డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతోపాటు, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ డివైస్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, ఫాంటమ్ బ్లూ, ఫాంటర్ రెడ్ రంగుల్లో, రెండు వేరియొంట్లలో విడుదలైన హానర్ వీ 20 ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా రేపలినుంచి (30 జనవరి) లభ్యం. హానర్ వీ20 ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ పై 1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ కిరిన్ 980ప్రాసెసర్ 6జీబీ/8జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48ఎంపీ రియర్ కెమెరా మెగాపిక్సెల్ 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో చార్జర్ ధరలు 6జీబీ+128జీబీ- రూ.37,999 8జీబీ+256జీబీ- రూ.45,999 -
ఇన్ఫినిటీ డిస్ప్లేతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అద్భుత ఫీచర్లతో మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్కడి మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఎ 9 ప్రొ (2019) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఇన్ఫినిటీ ‘O’ డిస్ప్లే’ ( పంచ్ హోల్ డిస్ప్లే) ఆవిష్కరించిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.37,890 గా నిర్ణయించింది. ఫిబ్రవరి 28వ తేదీనుంచి దక్షిణ కొరియా మార్కెట్లో విక్రయానికి లభ్యం కానుంది. మరోవైపు ఇండియాలో లాంచింగ్‌పై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. శాంసంగ్ గెలాక్సీ ఎ9 ప్రొ (2019) ఫీచర్లు 6.4 ఇంచెస్ డిస్ప్లే 340 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 24+10+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
3డీ స్టీరియో కెమెరాతో ఒప్పో ఆర్17ప్రో
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ ఒప్పో డిసెంబర్ 4న మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఒప్పో ఆర్17 ప్రో పేరుతో ఈ డివైస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. వాటర్ డ్రాప్ నాచ్ కలిగిన భారీ డిస్ప్లే, మూడు రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ తెలిపింది. గ్రీన్, ఫాగ్ గ్రేడియంట్ కలర్ వేరియెంట్ల లభ్యం కానుంది. ఇక ధర విషయానికి వస్తే సుమారు రూ. 43వేలకు లభించే అవకాశం ఉందని అంచనా. మార్కెట్లో వినియోగదారులకు డిశంబరు 4వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే డిశంబరు 1 నుంచే ప్రీ బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. ఒప్పో ఆర్17 ప్రో ఫీచర్లు 6.4 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లే 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12+20+ TOF 3డీ స్టీరియో మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 3డీ స్టీరియో కెమెరా -
రియల్ మి 2 వచ్చేసింది..
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ ఒప్పోకు చెందిన రియల్ మి 2 భారత మార్కెట్లో మంగళవారం లాంచ్ అయింది. రియల్ మి 1 డివైస్ భారీ విక్రయాలను నమోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్ మి2ను రెండు వేరియంట్లలో కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. అందరూ ఊహించినట్టుగానే బడ్జెట్ ధరలోనే దీన్ని విడుదల చేసింది. బేసిక్ మోడల్‌ను రూ. 8,990 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.10,990గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది. రియల్ మి 2 ఫీచర్లు 6.20 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే 19:9 యాస్పెక్ట్ రేషియో 1.8 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ 13+2ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4230ఎంఎహెచ్ బ్యాటరీ -
జియోనీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : చైనీస్ మొబైల్ దిగ్గజం జియోనీ శుక్రవారం మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఎస్10 లైట్ పేరుతో బంగారు, నలుపు రంగుల్లో మొబైళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,999. ఈ మొబైల్ శనివారం నుంచి అందుబాటులో ఉంటుంది. ఎస్10 లైట్ సెల్ఫీ కెమెరాతో గ్రూప్ సెల్ఫీ, బొకె సెల్ఫీలు తీసుకోవచ్చు. వాట్సాప్ క్లోన్ ఫీచర్లో మూడు అకౌంట్లు వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఓఎస్‌తో పని చేసే ఈ మొబైల్‌తో అత్యద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చునని జియోనీ ఇండియా గ్లోబల్ సేల్స్ డైరెక్టర్ డేవిడ్ చాంగ్ తెలిపారు. ఫోన్ ప్రత్యేకతలు 5.2 అంగుళాల డిస్ప్లే 16 ఎంపీ ఫ్లాష్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ ఆటో ఫోకస్ కెమెరా 3100 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎంఎస్ఎం8920 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ (256 జీబీ దాకా పెంచుకునే సామర్థ్యం) ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఓఎస్(జియోనీ అమిగో 4.0 ఓస్) ఫోన్ బరువు 155 గ్రాములు -
సెల్కాన్ డైమండ్ ప్రో వచ్చేసింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ తాజాగా డైమండ్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. గొరిల్లా గ్లాస్, మెటాలిక్ ఫినిషింగ్ ఈ మోడల్‌కు ఉన్న ప్రత్యేకలు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కన్నడ యువ హీరో యశ్ చేతుల మీదుగా కంపెనీ ఈ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 4.5 అంగుళాల స్క్రీన్, ఫుల్ ల్యామినేషన్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీని పొందుపరిచారు. 3జీ, ఫ్లాష్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,650 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర ఫీచర్లు. ధర రూ.5,777. అన్ని మొబైల్ రిటైల్ దుకాణాల్లో లభిస్తుంది. భారత్‌లో ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా నిలవడంలో ఎంతో ప్రగతిని సాధించామని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో కంపెనీ వాటా మరింత వృద్ధికి డైమండ్ ప్రో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో సెల్కాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా యష్ వ్యవహరిస్తారు.