ఒప్పో ఆర్17 ప్రో
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ ఒప్పో డిసెంబర్ 4న మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఒప్పో ఆర్17 ప్రో పేరుతో ఈ డివైస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. వాటర్ డ్రాప్ నాచ్ కలిగిన భారీ డిస్‌ప్లే, మూడు రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ తెలిపింది. గ్రీన్, ఫాగ్ గ్రేడియంట్ కలర్ వేరియెంట్ల లభ్యం కానుంది. ఇక ధర విషయానికి వస్తే సుమారు రూ. 43వేలకు లభించే అవకాశం ఉందని అంచనా. మార్కెట్‌లో వినియోగదారులకు డిశంబరు 4వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే డిశంబరు 1 నుంచే ప్రీ బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.
ఒప్పో ఆర్17 ప్రో ఫీచర్లు
6.4 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే
1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 సాక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
12+20+ TOF 3డీ స్టీరియో మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా
25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 3డీ స్టీరియో కెమెరా
Comments
Please login to add a commentAdd a comment