smartphone sales
-
నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేసింది.. ధర ఎంతంటే?
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయి. నథింగ్ ఫోన్1 ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని వస్తే.. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, వైట్ వేరియంట్లో నథింగ్ ఫోన్ 2ఏ మార్చి 5న ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఆసక్తికరమైన టేకింగ్‌కు పేరుగాంచిన నథింగ్ గతంలో ఒరిజినల్ నథింగ్ ఫోన్ (2022), నథింగ్ ఫోన్ 2 (2023)లను ప్రారంభించింది. రూ.23,999 నుండి ప్రారంభమయ్యే ఈ ఫోన్లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, వెనుకవైపు డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. -
20 శాతం తగ్గిన మొబైల్స్ ఉత్పత్తి
కోల్‌కత: మొబైల్స్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌లో ఉత్పత్తి 20 శాతం వరకు క్షీణించింది. గడిచిన ఆరు నెలలుగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గుతుండడం ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్లో 30 శాతం, 2023 జనవరి–మార్చిలో 18 శాతం స్మార్ట్‌ఫోన్స్ సరఫరా తగ్గింది. విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చిలో పడిపోయాయని భారత్‌లో అతిపెద్ద మొబైల్స్ రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణత.. కేవలం భారత్‌లో మాత్రమేగాక ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో మొబైల్ ఫోన్ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని కార్బన్‌తోపాటు ఇతర కంపెనీలకు హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేస్తున్న జైనా గ్రూప్ ఎండీ ప్రదీప్ జైన్ తెలిపారు. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీలు ఉత్పత్తిని సవరించాయని అన్నారు. ఈ ఒత్తిడి కొన్నాళ్లు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ప్రీమియం సెగ్మెంట్ ఇప్పటికీ స్థితిస్థాపకంగా ఉంది. ప్రారంభ, మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో మొబైల్స్ సంస్థలు తయారీని 15–20% కుదించాయని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వివరించారు. పది వారాల నిల్వలు.. ప్రస్తుతం చాలా బ్రాండ్స్ వద్ద 10 వారాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని పాఠక్ వెల్లడించారు. ఉత్పత్తి విషయంలో కంపెనీలు జూన్ వరకు ఇదే స్థితిని కొనసాగిస్తాయని అన్నారు. రెండవ అర్ద భాగంగా చాలా కంపెనీలు స్వల్పంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరించారు. ఉత్పత్తి తగ్గించడం ఈ ఏడాది ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–జూలై, నవంబర్–డిసెంబర్లో సైతం కంపెనీలు తయారీని కుదించాయి. ఇది కేవలం 5–10 శాతం క్షీణతకే పరిమితం అయిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మొబైల్స్ డిమాండ్ ఉత్సాహంగా లేదు. కానీ చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ బి లాల్ తెలిపారు. కొన్ని సంస్థలు హ్యాండ్‌సెట్స్‌ను ఎగుమతి చేస్తున్నాయని గుర్తుచేశారు. -
ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్!..మరీ ఇంత డిస్కౌంటా?
హోలీ సందర్భంగా కొనసాగుతున్న బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఐఫోన్ 13,ఐఫోన్ 14 ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో దాదాపు 1000 కి పైగా బ్రాండ్స్‌కి చెందిన దాదాపు లక్షకుపైగా ప్రోడక్ట్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటితో పాటు పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లైన ఐఫోన్ 13,ఐఫోన్ 14 మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫర్లో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.61,999 ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఫోన్‌పై ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉంటే ఆ ధర కాస్త రూ.23,000 వరకు తగ్గుతుంది. అదే సమయంలో ఐఫోన్ 14 ధర రూ.71,999 ఉండగా..సేల్‌లో రూ.67,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక స్మార్ట్ఫోన్లు కాకుండా గృహోపకరణాలు, వంటగదిలో వినియోగించే వస్తువులు,హోమ్ అప్లయెన్సెస్ పై 70శాతం, రిఫ్రిజిరేటర్లపై 60శాతం డిస్కౌంట్స్, ల్యాప్‌ట్యాప్స్‌పై 45శాతం డిస్కౌంట్ పొందవచ్చు. -
స్మార్ట్ఫోన్ల పండగ వచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ పండుగల సీజన్లో 5.17 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. వీటి విలువ రూ.1.44 లక్షల కోట్లు ఉంటుందని టెక్నాలజీ మార్కెట్ రిసర్చ్ కంపెనీ టెక్ఆర్క్ వెల్లడించింది. 2022లో స్మార్ట్‌ఫోన్ విక్రయాల ద్వారా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో ఇది 43 శాతానికి సమానం. యూనిట్ల పరంగా చూస్తే అమ్ముడయ్యే మొత్తం పరిమాణంలో వీటి వాటా 31.9 శాతం. 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 58.7 శాతం యూనిట్లు రూ.6–12 వేల ధరల శ్రేణి మోడళ్లు ఉంటాయి. ఈ విభాగంలో ఆదాయం అత్యధికంగా రూ.12–25 వేల శ్రేణిలో నమోదు కానుంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్, ఈ–కామర్స్ స్టోర్లు అత్యధికంగా 65–68 శాతం చేజిక్కించుకోనునున్నాయి. ఏడు కంపెనీలదే.. ఇక 5జీ స్మార్ట్ఫోన్లు 30.2 శాతం వాటాతో 1.56 కోట్ల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళతాయని టెక్ఆర్క్ అంచనా. సీజన్లో కంపెనీలు అందుకునే ఆదాయంలో వీటి వాటా ఏకంగా 66.7 శాతం ఉండనుంది. 5జీ విషయంలో పరిమాణం పరంగా రూ.25–50 వేల ధరల శ్రేణి మోడళ్ల వాటా 37.8 శాతం, విలువ పరంగా రూ.50 వేలు ఆపైన ధర కలిగిన మోడళ్ల వాటా 66.9 శాతం ఉండే చాన్స్ ఉంది. అమ్ముడయ్యే మొత్తం స్మార్ట్ఫోన్లలో యాపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్మీ, షావొమీ కలిపి 90 శాతం పరిమాణం కైవసం చేసుకుంటాయి. మేకిన్ ఇండియా ఫోన్లు.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో మేకిన్ ఇండియా ఫోన్లు 4.4 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ తెలిపింది. ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఈ స్థాయి వృద్ధికి కారణం. స్మార్ట్‌వాచ్, ట్రూ వైర్లెస్ స్టీరియో, నెక్‌బ్యాండ్, ట్యాబ్లెట్ పీసీ వంటి ఉత్పత్తుల తయారీ సైతం అధికం అయింది. మేకిన్ ఇండియా స్మార్ట్ఫోన్లలో 24 శాతం వాటాతో ఒప్పో అగ్రస్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. థర్డ్ పార్టీలు సైతం.. స్మార్ట్‌ఫోన్ విభాగంలో కంపెనీలు సొంతంగా తయారు చేసినవి 66 శాతం కాగా, మిగిలినది థర్డ్ పార్టీ కంపెనీలు రూపొందించినవి. స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ఎఫ్ఐహెచ్, డిక్సన్, డీబీజీ కంపెనీలు థర్డ్ పార్టీ విభాగంలో ముందు వరుసలో ఉన్నాయి. 75 శాతం స్మార్ట్‌వాచ్‌లను ఆప్టీమస్ ఉత్పత్తి చేయడం విశేషం. ట్యాబ్లెట్ పీసీల్లో వింగ్‌టెక్, శామ్సంగ్, డిక్సన్‌లు టాప్–3లో ఉన్నాయి. టీవీల విభాగంలో డిక్సన్, రేడియంట్, శామ్సంగ్, ఎల్జీ కంపెనీల వాటా 50 శాతం. -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త. జులై 23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ►అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లైన 5జీ ఐక్యూఓఓ జెడ్6, 5జీ ఐక్యూఓఓ నియో6, ఐక్యూఓఓ జెడ్6 ప్రోలపై రూ.10వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ ధర రూ.14,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై అదనంగా కూపన్ బెన్ఫిట్స్, ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు పలు స్మార్ట్ ఫోన్ మోడళ్లపై ఎక్ఛేంజ్ ఆఫర్లను దక్కించుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీ స్టోరేజ్ ఫోన్‌ను 19శాతం డిస్కౌంట్‌తో రూ.16,999కే పొందవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ప్రో లెజియన్ స్కై 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ పై 14శాతం డిస్కౌంట్‌తో ధర రూ.23999కే కొనుగోలు చేయోచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌పై రూ.3వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ►అదే విధంగా ఐక్యూఓఓ నియో6..6జీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌పై 14శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5వేల డిస్కౌంట్‌తో రూ.29,900కే పొందవచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్‌పై రూ.3000 డిస్కౌంట్, రూ.11,950 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఐక్యూఓఓతో పాటు ఇంకా ఐక్యూఓఓతో పాటు అదనంగా రెడ్మీ 9సిరీస్, రెడ్మీ నోట్ 10 సిరీస్‌లోని రెడ్మీ నోట్ 10టీ, నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్ 10ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ గెలాక్సీ ఎం52లపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. -
అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. ధర ఎంతంటే!
ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో శాంసంగ్, షావోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999గా ఉంది. వన్ ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ నథింగ్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ ఫోన్ వన్ ప్లస్‌కు చెందిన 'వన్ ప్లస్ నార్డ్ 2టీ' కంటే నథింగ్ ఫోన్ (1) ఫోన్ బాగుంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) ఫోన్ 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ సదుపాయం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 12జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ (ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్),50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్ సెన్సార్(ఈఐఎస్)16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్ ప్లస్ నార్డ్2 టీ వర్సెస్ నథింగ్ ఫోన్ (1) ధరలు మనదేశంలో నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ నార్డ్2 మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ..128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 32,999, 8జీబీ ర్యామ్..256జీబీ ఫోన్ ధర రూ. 35,999, 12జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,999గా ఉంది. ఇక వన్ ప్లస్ నార్డ్2 టీలో కేవలం రెండు వేరియంట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 8జీబీ ర్యామ్ 128జీబీ (రూ. 28,999), 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఈ వేరియంట్ స్టోరేజ్ ఫోన్ ధర (రూ. 33,999).గా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వివాదంలో స్మార్ట్ ఫోన్ సంస్థ,'డియర్ నథింగ్'..చూసుకుందాం పదా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ను ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి నథింగ్ ఫోన్(1) మంగళవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. అయితే ఈ ఫోన్ తయారీ సంస్థపైన దక్షణాదికి చెందిన స్మార్ట్ ఫోన్ లవర్స్, టెక్నాలజీ కంటెంట్ క్రియేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్(1) విడుదలైన కొన్ని గంటల్లోనే ఆఫోన్ విడుదల, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయనే అంశాలతో సంబంధం లేకుండా డియర్ నథింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదే సమయంలో కార్ల్ పీ'ని విమర్శిస్తూ హ్యాష్ ట్యాగ్స్‌తో ట్వీట్ చేస్తున్నారు. డియర్ నథింగ్: అసలు ఏం జరిగింది? ప్రముఖ తెలుగు టెక్ యూట్యూబ్ క్రియేటర్ విడుదలైన ఫోన్(1) గురించి ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ఫోన్ రివ్వ్యూ ఇవ్వాలని ఆ ఫోన్ కంపెనీ పేరుతో ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో హాయ్ **** దిస్ డివైజ్ ఈజ్ నాట్ ఫర్ సౌత్ ఇండియన్ పీపుల్ అని ఓ పేపర్లో రాసి ఉంటుంది. అంతే మనదేశానికి చెందిన ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు నథింగ్ ఫోన్ (1) రివ్యూ యూనిట్లు ఇవ్వలేదని విమర్శిస్తూ ఆ వీడియోను తయారు చేశాడు. రివ్వ్యూ యూనిట్లు ఇవ్వాలనేది కంపెనీ బాధ్యత అని గుర్తు చేస్తూ వీడియోను ముగిస్తాడు. అలా నథింగ్ ఫోన్(1)ను విమర్శిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్లు సైతం ఆ ఫోన్‌పై వీడియోలు చేశారు. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సౌత్‌కు చెందిన నథింగ్ ఫోన్(1) కొనుగోలు దారులు సైతం.. #డియర్ నథింగ్..పదా చూసుకుందాం, #బాయ్కాట్నథింగ్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా, ఈ నథింగ్ ఫోన్ సంస్థ ప్రమోషన్ కోసం క్రియేటర్లకు ఇలా లెటర్ అలా పంపిందా? లేదంటే నార్త్ కంటెంట్ క్రియేటర్లకు రివ్వ్యూ యూనిట్లు పంపి.. తమకు పంపలేదనే కోపంతో దక్షిణాదికి చెందిన టెక్నాలజీ కంటెంట్ క్రియేటర్లు ఇలా వీడియోలు చేశారా అనే అంశం తెలియాల్సి ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Worst case started for u guys #DearNothing pic.twitter.com/9mz106Dw93 — Dilipkumar789 (@ndileepkumar789) July 13, 2022 #DearNothing Telugu,Tamil,kanada, Malayalam these four language people can buy nothing phone but not now.... pic.twitter.com/yGi2GHdawd — m. arunkumar (@arunmallela5) July 13, 2022 #DearNothing #DearNothing dhesa bhasalandhu telugu lessa.......Learn to treat everyone equally...India is not only Hindi country..... pic.twitter.com/SSbBGyMb8D — MR UNIQUE. .. . SHIVA (@ShivaRouthu13) July 13, 2022 Thank You Darlings 😍 #DearNothing - Trending No.1 in India 🇮🇳. pic.twitter.com/4QBhle2Hu1 — Prasadtechintelugu (@iamprasadtech) July 12, 2022 #DearNothing Nothing is just North pan masala phone...🥴 pic.twitter.com/oEBrvYxf2J — Mehabub (@Mehabub94557493) July 13, 2022 -
విదేశీ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు బిగ్ షాక్, తగ్గిన మొబైల్ దిగుమతులు!
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ద్వారా మొబైల్స్ తయారీకి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఫలితమిస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2021–22లో మొబైల్ ఫోన్ల దిగుమతులు 33 శాతం తగ్గాయి. అదే సమయంలో స్థానిక ఉత్పత్తి 26 శాతం పెరిగింది. ఈ వివరాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 2016 నుంచి 2021 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ వార్షికంగా 33 శాతం మేర వృద్ధిని చూపించగా..2021–22లో ఇది 24–26 శాతమే ఉన్నట్టు వివరించింది. చిప్‌లకు కొరత ఏర్పడినప్పటికీ మూడు అంతర్జాతీయ తయారీ కంపెనీలు పీఎల్ఐ పథకం కింద లక్ష్యానికి అనుగుణంగా ఫోన్లను ఉత్పత్తి చేసినట్టు తెలిపింది. దానివల్లే మెరుగైన వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగుతుందని.. 2022– 2024 మధ్య ఏటా 22–26 శాతం మేర స్థానిక మొబైల్ ఫోన్ల తయారీ నమోదు కావచ్చని అంచనా వేసింది. విలువ పరంగా రూ.4–4.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. విడిభాగాల దిగుమతి దేశీ తయారీ విస్తరించడంతో మొబైల్ ఫోన్లు/విడిభాగాల కోసం చైనా మార్కెట్‌పై ఆధారపడడం 2020–21లో 64 శాతంగా ఉంటే, అది గత ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి తగ్గినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. మధ్య కాలానికి ఇది ఇంకా తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. దేశీయంగా ఫోన్ల తయారీ పెరగడం వల్ల విడిభాగాల దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో 27 శాతం పెరిగాయని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో దిగువన అంతర్జాతీయ మార్కెట్‌కు ఫోన్ల సరఫరాలో భారత్ ఒక శాతంలోపే వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్ నివేదిక వివరించింది. ఈ మార్కెట్‌ను 70 శాతం వాటాతో చైనా శాసిస్తుంటే, వియత్నాం 16 శాతం వాటా కలిగి ఉంది. జపాన్ డిమాండ్‌లో భారత్ ఎగుమతులు 1 శాతం, జర్మనీ దిగుమతుల్లో 3 శాతం, యూఏఈ దిగుమతుల్లో 9 శాతం మేర ఉండడం గమనార్హం. అమెరికా (20శాతం), హాంగ్‌కాంగ్ (15 శాతం), జపాన్ (6), జర్మనీ, యూఏఈ టాప్–5 ఫోన్ల దిగుమతి మార్కెట్లుగా ఉన్నాయి. ఈ డిమాండ్‌లో సింహ భాగాన్ని చైనా, వియత్నాం తీరుస్తున్నాయి. భారత్ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు 56 శాతం పెరిగాయి. 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.–1.2 లక్షల కోట్లకు ఎగుమతులు చేరుకోవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. మన దేశం నుంచి ఎక్కువగా రూ.10వేల లోపు విలువైన ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. -
అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ విడుదల, ధర మరీ ఇంత తక్కువా!
ఈ పెళ్లిళ్ల సీజన్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీరు కొనాలనుకుంటున్న ఫోన్లో అదిరిపోయే ఫీచర్లతో మీ బడ్జెట్లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను రేపు (జూన్2న) విడుదల చేయనుంది. మోటో ఈ32ఎస్ ఫీచర్లు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నా, లేదంటే విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్ఫోన్లు సేమ్ డిజైన్లే ఉంటాయి. కానీ ఈ మోటో ఈ32ఎస్ మాత్రం పంచ్ హోల్ డిస్ప్లే, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాను డిజైన్ చేసింది. స్లేట్ గ్రే, మిస్టీ సిల్వర్ కలర్స్‌లో లభ్యం కానుంది. ఐపీ52 రేటింగ్ అంటే కింద పడినా, వాటర్‌లో పడినా తిరిగి వినియోగించుకోవచ్చు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, కింది భాగంలో ఒకే స్పీకర్, బయోమెట్రిక్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే మోటో ఈఎస్32ఎస్ 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్ప్లే, ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే లేనప్పటికీ స్క్రీన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ పనితీరు, సామర్ధ్యం బాగుండేందుకు మీడియా టెక్ హీలియా జీ 37 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను అందిస్తుంది. 3జీబీ ర్యామ్ ప్లస్ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టోరేజ్ ఉండే రెండు కాన్ఫిగరేషన్లను అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా, వెనుక కెమెరా సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మోటో ఈ32ఎస్ ధర మోటరోలా సంస్థ మోటో ఈ32ఎస్ పేరుతో రూ.10వేల బడ్జెట్ ఫోన్‌ను జూన్2న విడుదలకు సిద్ధమైంది. ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాత్రం అదే ఫోన్ 3జీబీ ర్యామ్ ప్లస్ 32జీబీ స్టోరేజ్ ఫోన్ ను రూ.9,222గా ఉందని తెలిపింది. ఇక 4జీబీ ప్లస్ 64జీబీ ర్యామ్ ఫోన్ ధర ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. -
గుడ్‌న్యూస్: అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్ 13పై బంపరాఫర్లు!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్13పై బంపరాఫర్ ప్రకటించింది. అమెజాన్ అందిస్తున్న స్టన్నింగ్ డీల్‌లో కొనుగోలు దారులు భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లో తక్కువ ధరకే ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్(అంచనా మాత్రమే)లో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్(డబ్ల్యూ డబ్ల్యూ డీసీ) నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఐఫోన్14ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఐఫోన్ 13లపై డిస్కౌంట్లు ప్రకటించింది. రూ.28,550 డిస్కౌంట్‌తో 128జీబీ ర్యామ్‌తో ఐఫోన్ 13ను కేవలం రూ.51,350కే అందిస్తుంది. అమెజాన్‌లో ఐఫోన్ 13ధర తగ్గింపు ఒరిజనల్‌గా 128జీబీ యాపిల్ ఐఫోన్ 13ఫోన్ ధర రూ.79,900 ఉండగా ఈ ఫోన్ అమెజాన్ రూ.51,350కే అందిస్తుంది. ముందుగా ఈ ఫోన్ కొనుగోలు దారులు రూ.10వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఆ ఫోన్ ధర రూ.69,990కి తగ్గుతుంది. దీంతో ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.18,550 తగ్గగా.. ఆఫోన్ అసలు ధర కంటే రూ.28,550 తగ్గి రూ.51,350కే వస్తుంది. ఐఫోన్ 13 ఫీచర్లు యాపిల్ ఐఫోన్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల రెటీనా డిస్ప్లే,ఏ15 బయోనిక్ చిప్ సెట్, యాపిల్‌కు చెందిన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ), డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ విత్ 12ఎంపీ ప్రైమరీ లెన్స్, ఫ్రంట్ సైడ్ 12 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, రెటీనా ఫ్లాష్‌తో 12ఎంపీ సెల్ఫీ కెమెరా,128జీబీ స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. చదవండి👉 భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయ్, రూ.10వేల కోట్లకు యాపిల్ ఎగుమతులు! -
ఎగబడి మరీ కొంటున్నారు, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో మొబైల్ షిప్మెంట్ 11శాతం పడిపోయాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ పరిణామాలు, కరోనా కేసులు పెరిగిపోతుండడం, రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా మొబైల్ షిప్ మెంట్ పడిపోయిందంటూ ప్రముఖ రీసెర్చ్ సంస్థ కెనాలసిస్ తెలిపింది. షిప్మెంట్ పడిపోయిన సంస్థల్లో శాంసంగ్ తొలిస్థానంలో ఉండగా యాపిల్,షావోమీ వరుస స్థానాల్లో ఉన్నట్లు కెనాలసిస్ తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ ఫోన్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ సిరీస్, ఒప్పో సంస్థకు చెందిన వన్ ప్లస్, వివో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగినట్లు గుర్తు చేసింది. ఈ సందర్భంగా కెనాలసిస్ అనలిస్ట్ సన్యాం చౌరాసియా (Sanyam Chaurasia) మాట్లాడుతూ.. యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 13 మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. మిడ్ రేంజ్ ఫోన్లలో ఇటీవల మార్చిలో విడుదలైన ఐఫోన్ ఎస్ఈ సైతం యూజర్లను ఆకట్టుకుందని చెప్పారు. ఇక చిప్ సెట్లను అప్‌గ్రేడ్ చేసి బ్యాటరీ పర్మామెన్స్ తో పాటు 5జీ స్మార్ట్ ఫోన్లు సైతం యూజర్లను ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు. చదవండి: సూపర్ ఫీచర్స్‌తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..? -
అదిరిపోయే ఫీచర్లతో..షావోమీ నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి 5జీ షావోమీ12 ప్రో'ని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఏప్రిల్12న భారత్‌లో విడుదల చేసేందుకు షావోమీ సిద్ధమైంది. అయితే ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్22, మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఐక్యూ 9ప్రో,వన్ ప్లస్ 10ప్రో' స్మార్ట్ఫోన్లకు పోటీగా షావోమీ 12ప్రో ఫోన్ నిలుస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5జీ షావోమీ12 ప్రో' స్పెసిఫికేషన్లు.. షావోమి షావోమీ12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎల్టీపీఓ టెక్నాలజీతో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే రెజెల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాసెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10ప్లస్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి వచ్చింది. 4,600ఎంఏహెచ్ బ్యాటరీ 120డబ్ల్యూ షావోమి హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 1500నిట్ పీక్ బ్రైట్నెస్ సదుపాయం ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్, 50డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. షావోమీ12 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్, చిప్‌లోని సిస్టమ్ దానితో పాటు ఇంటిగ్రేటెడ్ Adreno 730 జీపీయూ, 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఐఎంఎక్స్ 707ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 115° ఫీల్డ్ వ్యూతో 50ఎంపీ శాంసంగ్ జేఎన్1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లు ఉన్నాయి. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. చదవండి: స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు! -
అమెజాన్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడైన ఫోన్లు ఇవే! ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయంటే?
వరల్డ్ వైడ్‌గా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గతేడాది ఫ్లాగ్షిప్, మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లు ఎన్ని అమ్ముడయ్యాయి? మెట్రోలతో పోలిస్తే టైర్-2 నగరాలు, పట్టణాల నుండి డిమాండ్ ఎలా ఉంది? మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి యూజర్ల అభిరుచి ఎలా ఉందనే ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. గతేడాది అమెజాన్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో దాదాపు 30శాతం వృద్ధిని కనబరిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు కేవలం టైర్-1 నగరాల ద్వారా మాత్రమే కాకుండా టైర్-2, టైప్-3 నగరాల్లో ఎక్కువ అమ్ముడైనట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ నిశాంత్ సర్దానా తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ గేమింగ్, ఓటీటీ కంటెంట్ వినియోగంతో స్మార్ట్ఫోన్ల అవసరం ఎక్కువైందని, దీంతో కొనుగోలు దారుల సంఖ్య పెరిగినట్లు చెప్పారు. అందుకే ప్రాసెసర్, మెమరీ స్పేస్, బ్యాటరీ లైఫ్ టైమ్, స్మూత్ అమోలెడ్ డిస్ప్లే స్మార్ట్ఫోన్ల విషయంలో కొనుగోలు దారులు రాజీపడడం లేదన్నారు. దీనికి తోడు భవిష్యత్‌లో 5జీ స్మార్ట్ ఫోన్లు ఎప్పుడు విడుదల కానున్నాయనే అంశంలో యూజర్లకు అవగాహన పెరిగిందని, తద్వారా యూజర్లు తమకు ఎలాంటి స్మార్ట్ ఫోన్లు నప్పుతాయో ముందే తెలుసుకోవడాన్ని గమనించినట్లు నిశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమెజాన్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ వివరాల్ని వెల్లడించారు. ఆ వివారలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అమెజాన్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే అమెజాన్ ఇండియాలో జరిగిన సేల్స్ ఆధారంగా టైర్-2 నగరాలు, చిన్న పట్టణాల నుండి డిమాండ్ పెరిగినట్లు స్పష్టం చేశారు. అమెజాన్ విక్రయిస్తున్న నాలుగు స్మార్ట్ ఫోన్లలో మూడు స్మార్ట్ఫోన్లు టైర్-2 నగరాలు, పట్టణాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి అమెజాన్‌లో అమ్ముతున్న సగం కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్లు టైర్-2 లేదా చిన్న నగరాల నుండి వచ్చినవే”అని నిశాంత్ సర్ధానా పేర్కొన్నారు. ►అమెజాన్ రూ.20వేల స్మార్ట్‌ఫోన్ విభాగంలో బలమైన వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. ►రెడ్ మీ నోట్ సిరీస్,వన్ ప్లస్,శాంసంగ్ ఎం సిరీస్, ఐక్యూ, టెక్నాస్మార్ట్ ఫోన్ కొనుగోలులో కస్టమర్లు పెరుగుతున్నారు. ►అమ్ముడయ్యే నాలుగు ఫోన్లలో మూడింటిని టైర్-2 నగరాలు, పట్టణాల నుండి కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. ► వన్ ప్లస్ రూ.25వేల స్మార్ట్‌ఫోన్ విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా వన్ ప్లస్ నార్డ్ సీఈ ఉందని అమెజాన్ తెలిపింది. అంతేకాదు రూ.20వేల నుంచి రూ.30 వేలు..రూ.30వేల నుంచి రూ.40వేలు, రూ.40వేల నుంచి రూ.50వేల ధర మధ్య ఉన్న ఫోన్ల డిమాండ్ వరుసగా 52శాతం, 61శాతం వృద్ధిని చూశాయని అన్నారు. ఇక ఎక్కువగా అమ్ముడైన బ్రాండ్లలో రెడ్మీ నోట్ సిరీస్, వన్ ప్లస్,శాంసంగ్ ఎం సిరీస్ ఫోన్లు ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: సేల్స్ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్లు అమ్ముడయ్యాయి! -
బడ్జెట్ ధరలో రెడ్ మీ స్మార్ట్‌ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 ఎంపీ మెయిన్ కెమెరాను అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మీ 10 ఫీచర్లు రెడ్ మీ10 స్మార్ట్ ఫోన్ 6.71 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 20.6:9 యాస్పెట్ రేషియోతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వీడియోస్‌ను హైయ్యస్ట్ రెజెల్యూషన్‌తో వీడియోలు చూసేందుకు వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికెషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డిస్ ప్లే డిజైన్ చేసింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 6జీబీ ర్యామ్ 128జీబీ యూఎఫ్ఎస్ 2.2స్టోరేజ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ఫోన్ వెనుక భాగంగాలో 2ఎంపీ డెప్త్ సెన్సార్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. దీంతో పాటు మీరు ఎవరికైనా అర్జెంట్ కాల్ చేయాల్సి వస్తే ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీసి ఫోన్‌ను చూసి అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకమైన రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో మీరు ఫోన్ చూడకుండా జస్ట్ మీ చేతి వేళ్లను ఫోన్‌కు టచ్ చేస్తే చాలు. ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఐపీ సర్టిఫికేషన్ ను అందిస్తుంది. రెడ్ మీ 10 ధర రెడ్ మీ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.10,999 ఉండగా.. 6జీబీ/128జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.12,999 గా ఉంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌పై ఈఎంఐ ఆప్షన్‌తో పాటు రూ.1000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయగా... మార్చి 24 మధ్యాహ్నం 12గంటల నుంచి ఎంఐ.కామ్,ఫ్లిప్ కార్ట్, ఎంఐ స్టోర్‌తో ఆన్లైన్లో కొనుగోలు చేయోచ్చు. కాగా, ఈ ఫోన్ కరేబియన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. చదవండి: ప్రీ బుకింగ్స్ బీభత్సం!! 12గంటల్లో 70వేల ఫోన్ల బుకింగ్స్! -
అదిరిపోయే ఫీచర్లతో, దేశీయ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ రూ.15వేల లోపు బడ్జెట్ ధరతో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది శాంసంగ్ మనదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ03, గెలాక్సీ ఏ03ఎస్ సిరీస్‌లో 3వ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీని ఏ 03ని తాజాగా దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ధర శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ని రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ చేసింది. 3జీబీ ప్లస్ 32జీబీ స్టోరేష్ ఆప్షన్ ధర రూ.10499 ఉండగా 4జీబీ ప్లస్ 4జీబీ ప్లస్ 64జీబీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. ఇక ఈ ఫోన్ నలుపు, నీలం, ఎరుపు వేరింయంట్ కలర్స్‌లో లభ్యం అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ స్పెసిఫికేషన్లు • శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ టీఎఫ్టీ డిస్ప్లే • 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ • యూఎన్ఐ ఎస్ఓసీ టీ606 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. • గరిష్టంగా 4జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ • 1టెరాబైట్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు • మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. • వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. • 48ఎంపీ మెయిన్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. • ఇందులో 2MP డెప్త్ సెన్సార్ తో పాటు సెల్ఫీల కోసం, ఫోన్లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. • ఆండ్రాయిడ్ 11కి సపోర్ట్ చేస్తుంది. -
2.83 లక్షల కోట్ల వ్యయం..16.90 కోట్ల ఫోన్ల కొనుగోలు
న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ (కంపెనీల నుంచి మార్కెట్‌కు సరఫరా/ఎగుమతులు) 2021లో 11 శాతం పెరిగి 169 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. వార్షికంగా చూసుకుంటే ఇది 27 శాతం వృద్ధిగా పేర్కొంది. 2021 డిసెంబర్ త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం షిప్మెంట్ తగ్గినా కానీ, పూర్తి ఏడాదికి 11 శాతం వృద్ధి చెందినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వివరించింది. డిసెంబర్ త్రైమాసికంలో సరఫరా సమస్యలు తయారీపై ప్రభావం చూపించినట్టు తెలిపింది. ‘‘భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2021లో మంచి వినియోగ డిమాండ్‌ను చూసింది. సరఫరా సమస్యలు, సెకండ్ వేవ్ తీవ్రత, అంతర్జాతీయంగా విడిభాగాల కొరత, ధరల పెంపు ఉన్నా కానీ, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మెరుగైన పనితీరు నమోదైంది’’ అని కౌంటర్ పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ తెలిపారు. 2021 షిప్మెంట్ గణాంకాలు - మధ్య, అధిక ధరల విభాగంలో ప్రమోషన్లు, డిస్కౌంట్లతో ధరలు అందుబాటులో ఉన్నందున రీప్లేస్మెంట్ (పాత ఫోన్ తీసేసి కొత్తది కొనుగోలు చేయడం) డిమాండ్ జోరందుకుంది. - దీనికితోడు రుణాలకు సంబంధించి మంచి ఆప్షన్లు ఉండడం 11 శాతం వృద్ధికి మద్దతుగా నిలిచింది. - 2021 చివరి రెండు నెలల్లో డిమాండ్ సరఫరాను మించింది. - 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలో వార్షికంగా స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 8 శాతం క్షీణించాయి. 2022 మొదటి మూడు నెలల్లో సరఫరా మెరుగుపడొచ్చు. - దేశీయంగా షావోమీ 24 శాతం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం ఫోన్ల (రూ.30వేలకు పైన) విభాగంలో వార్షికంగా 2021లో 258 శాతం వృద్ధి నమోదు చేసింది. - శామ్సంగ్ 18 శాతం షిప్‌మెంట్‌తో రెండో స్థానంలో ఉంది. రూ.20,000–45,000 ధరల విభాగంలో 28 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. - వివో 15 శాతం, రియల్మీ 14 శాతం, ఒప్పో 10 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. - రియల్మీ వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న బ్రాండ్‌గా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. - వన్‌ప్లస్ భారత్ మార్కెట్లోనే అత్యధిక షిప్‌మెంట్‌ను 2021లో నమోదు చేసింది. ప్రీమియం ఫోన్ల విభాగంలో 19 శాతంతో రెండో స్థానంలో ఉండగా, అందుబాటు ధరల్లోని ప్రీమియం విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. - 2021లో యాపిల్ సైతం వార్షికంగా 108 శాతం వృద్ధిని చూపించింది. ప్రీమియం విభాగంలో 44 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. - 5జీ ఫోన్ల షిప్మెంట్ 2021లో 555 శాతం పెరిగింది. వివో 19 శాతంతో మార్కెట్ లీడర్‌గా ఉంది. - ఫ్యూచర్ ఫోన్ల విభాగలో 86 మిలియన్ యూనిట్ల సరఫరా నమోదైంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా ఉంది. - ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) భారత మొబైల్ తయారీకి ఎంతో మద్దతునిచ్చి నట్టు, యాపిల్, శామ్సంగ్ కంపెనీలు భారత్‌లో తయారీని పెంచేందుకు దోహదపడినట్టు కౌంటర్‌పాయింట్ తెలిపింది. చదవండి:మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికాం సంస్థలకు షాక్! -
గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆటోమొబైల్, సర్వీస్ సెక్టార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రేరిత బాధల నుంచి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ సురక్షితంగా తప్పించుకుంది. 2021లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు రెండు లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జరిపినట్లు తెలుస్తోంది. చిప్స్ కొరత ఉన్నప్పటీకి..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. చిప్స్ కొరత ఉన్పప్పటీకి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2021లో దాదాపు రూ. 2,83,666 కోట్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే 27 శాతం అధికంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయి. 2021లో భారతీయులు ప్రతి గంటకు 19,406 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. మొత్తంగా 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యధిక షిప్మెంట్. ఇదిలా ఉండగా కాంపోనెంట్ కొరత కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు మందగించడం విశేషం. టాప్ బ్రాండ్ అదే..! భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 2021గాను షావోమీ బ్రాండ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. అయినప్పటికీ, కాంపోనెంట్స్ సరఫరాలో పరిమితుల కారణంగా కంపెనీ నాల్గవ త్రైమాసికంలో ఎగుమతులలో మందగమనాన్ని ఎదుర్కొంది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రూ. 20,000 నుంచి రూ. 45,000 సెగ్మెంట్లోని 5G స్మార్ట్ఫోన్ల ద్వారా మార్కెట్లో 18 శాతం వాటాను పొందింది. శామ్సంగ్కు ఇది శుభవార్త అయినప్పటికీ, ఇది కూడా సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. శాంసంగ్ ఫోల్డబుల్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లలో 2021గాను 388 శాతం వృద్ధిని శాంసంగ్ సాధించింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. వివో 2021లో 19 శాతం వాటాతో టాప్ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిగా...ఒప్పో 6 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక యాపిల్ 2021గాను 108 శాతం వృద్దిని నమోదుచేసింది. చదవండి: చిప్ షార్టేజ్ సంక్షోభం.. అయినా 583.5 బిలియన్ డాలర్ల షాకింగ్ బిజినెస్‌తో హిస్టరీ! -
సెకండ్ హ్యాండ్ అంటే చీప్‌గా చూడకండి.. కళ్లు బైర్లు కమ్మే వ్యాపారమక్కడ
ఇండియాలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతుందని మార్కెట రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి. ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపిన వివరాల ప్రకారం 2021లో ఇండియాలో మొత్తం 2.50 కోట్ల మొబైల్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముడయ్యాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సగటున ఒక్కో ఫోన ధర రూ.6,900లుగా ఉంటోంది. దీనికి సంబంధించి 2.3 బిలియన్ డాలర్ల లావాదేవీలు (ఇండియన్ కరెన్సీలో రూ.1.72 లక్షల కోట్లు) జరిగాయి. కరోనాకి ముందు ఇండియాలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్‌కి ఇంత డిమాండ్ లేదు. ఐసీఈఏ లెక్కల ప్రకారం 2019 నుంచి 2021 వరకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 14 శాతం వృద్ధి నమోదు అయ్యింది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2025 నాటికి సెకండ హ్యాండ్ ఫోన్ మార్కెట్ 5.10 కోట్ల ఫోన్ల అమ్మకాలతో 4.6 బిలియన్ డాలర్ల (రూ.3.44 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. గత ఐదేళ్లుగా ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. ఐదుకు పైగా కంపెనీలు పోటీ పడుతున్నాయి. క్రమం తప్పకుండా సరికొత్త ఫీచర్లతో మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఫలితంగా సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ పెరిగింది. 2020 వరకు 6 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్లో ఉంటే 2021లోనే 9 కోట్ల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో 2.50 కోట్ల ఫోన్లు చేతులు మారాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి 90 శాతం ఫోన్లు యాజ్ ఇట్ ఈజ్‌గా ఒకరి నుంచి ఒకరికి మారిపోతున్నాయి. కేవలం 5 శాతం ఫోన్లు మాత్రమే కొంచెం రిపేర్, రిఫర్బీష్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. నెలకు రూ.30 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో జరుగుతున్న లావాదేవీల్లో వీరి వాట ఏకంగా 78 శాతంగా నమోదు అయ్యింది. -
బీభత్సం, స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సెమి కండక్టర్ల కొరతే అయినా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ ప్రకారం..ఈ పండుగ సీజన్లో దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 7.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,858 కోట్లు) చేరువలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ రిటైల్ సగటు అమ్మకపు ధర 14 శాతం వృద్ధితో 230 డాలర్ల (దాదాపు రూ. 17,200)కు చేరింది. మిడ్,ప్రీమియం విభాగాలలోని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని తాజాగా విడుదలైన కౌంటర్ పాయింట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్‌పాయింట్ సీనియర్ విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ మాట్లాడుతూ..దసరా,దీపావళి ఫెస్టివల్ సీజన్లో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉందని, అందుకే భారత్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం ఉండడంతో $200 కంటే (ఇండియన్ కరెన్సీలో రూ.14,974.98) ఎక్కువ ధర ఉన్న ఫోన్ అమ్మకాలు పెరగడానికి కారణమైందన్నారు. ఈ సేల్స్ ఇలాగే కొనసాగితే పండుగ సీజన్లో దాదాపు 7.6 బిలియన్ డాలర్ల విలువైన, లేదంటే అంతకంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు అమ్మకాలు జరుగుతాయనే అంచనా వేశారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. 2021 పండుగ సీజన్లో మార్కెట్ విలువలో 1శాతం పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ..యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం సంవత్సరానికి 14 శాతం పెరిగిందని చెప్పారు. ఇక ఈ పండగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉందన్నారు. చాలా మంది వినియోగదారులు చేసిన సేవింగ్స్‌లో వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ ధోరణి పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుపడిందని అన్నారు. చదవండి: అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్ -
బీభత్సం: తొలి వారంలోనే రూ.32వేల కోట్లు..!
దసరా ఫెస్టివల్ సీజన్ ఈ కామర్స్ కంపెనీలకు వరంగా మారింది. ప్రముఖ కన్సెల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు ఫెస్టివల్ సేల్స్ ప్రారంభించిన మొదటి వారంలోనే వేలకోట్లలో అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. అమెజాన్ అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా దసరా ఫెస్టివల్ సీజన్ లో ఈ రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్‌సీర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు ప్రకటించడంతో భారీ కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది. మొదటి వారంలోనే 4.6 బిలియన్ డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు) కోట్లు అమ్మకాలు జరిగాయని, ప్రతి గంటకు రూ. 68 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు జరిగినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. ఇది వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ ముందంజ ఈ సంవత్సరం అమెజాన్ కంటే ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ఎక్కువ జరిపినట్లు తేలింది. పండుగ సేల్స్‌లో ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉండగా..అమెజాన్ వాటా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక కరోనా కారణంగా గతేడాది కొనుగోళ్లు తగ్గినా.. ఈ ఏడాది మాత్రం పెరిగాయి. దీంతో టైర్ -2, టైర్ -3 నగరాల నుండి పెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరగా..వారిలో టైర్ -2 కస్టమర్లలో 61 శాతం మంది కొత్త కస్టమర్లేనని తెలిపింది. ఇక గతేడాది ప్రతి కస్టమర్ కొనుగోలుకు సగటు స్థూల వస్తువుల విలువ రూ.4980 ఉండగా ఈ ఏడాదిలో రూ .5034 కి పెరిగినట్లు రెడ్‌సీర్ కన్సల్టింగ్ అసోసియేట్ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. చదవండి: 'బిగ్ దివాళీ సేల్',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
ఇండియన్ మార్కెట్లో మూడు బడ్జెట్ ఫోన్లు, ప్రారంభం కానున్న అమ్మకాలు
స్టార్ట్ఫోన తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్ 11 పేరుతో ఈ రోజు కొత్త మోడల్ని మార్కెట్లో రిలీజ్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ మొదలవుతుంది. మూడు కలర్లలో లభించే ఈ ఫోను ధర రూ. 10,999గా ఉంది. బడ్జెట్ ధరలో 50000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ ఉపయోగించారు. -
షాక్..పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు..కారణం ఇదే!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే విడుదలైన మోడళ్ల ధర 7–10 శాతం అధికం కానుంది. సెమికండక్టర్ చిప్స్‌తోసహా ఇతర విడిభాగాల కొరత తీవ్రం కావడమే ఇందుకు కారణమని కంపెనీలు అంటున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పని విధానం, ఆన్లైన్ క్లాసులు.. వెరసి సెమికండక్టర్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడి కొరతకు దారితీసింది. దీని ప్రభావం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపై కొన్ని త్రైమాసికాలు ఉంటుందని కౌంటర్ పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు. ‘నూతన మోడళ్ల రాక ఆలస్యం కావడం లేదా కొన్ని మోడళ్లే మార్కెట్లోకి వస్తాయి. అయినప్పటికీ ఈ పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుంది. 4జీ చిప్‌సెట్స్‌పైనే ప్రభావం ఉంది. డిసెంబర్ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది’ అని వివరించారు. 5జీ చిప్సెట్ల సరఫరా కాస్త మెరుగ్గా ఉంది. మాస్ మార్కెట్ 5జీ చిప్సెట్స్ సరఫరా తక్కువగా ఉంటుంది. ‘కొరత కారణంగా పెరుగుతున్న చిప్ ధరలు స్మార్ట్‌ఫోన్ తయారీదారుల విడిభాగాల బిల్లును గణనీయంగా ప్రభావితం చేశాయి. ఇది ఇప్పుడు వినియోగదారులపై, నూతన మోడళ్ల విడుదలపైనా ఉంటుంది’ అని గార్ట్నర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ కనిష్క చౌహాన్ అన్నారు. కొన్ని బ్రాండ్ల చేతుల్లోకి.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రొడక్ట్స్ విభాగంలో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ మార్కెట్ కొన్ని బ్రాండ్లకే పరిమితమైంది. ఇవి పెద్ద కంపెనీలే కాదు, నిధులు, విడిభాగాల సరఫరా విషయంలోనూ అగ్రస్థానంలో ఉంటాయని ఇండియన్ సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
మార్కెట్‌పై మైక్రోమ్యాక్స్ ఫోకస్.. మరో కొత్త ఫోన్ రిలీజ్‌కి రెడీ
దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పుంజుకోవాలని ప్రయత్నిస్తోన్న మైక్రోమ్యాక్స్ మరో మోడల్ ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంఆ చైనా ఫోన్లకు దీటుగా తక్కువ బడ్జెట్లో ఓ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. మైక్రోమ్యాక్స్ నోట్ సిరీస్‌లో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మైక్రోమ్యాక్స్ సంస్థ 2020 నవంబరులో నోట్ 1 పేరుతో స్మార్ట్‌పోన్‌ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ మోడల్‌కి కొనసాగింపుగా నోట్ 1 ప్రో మొబైల్‌ని మార్కెట్లోకి తేనున్నట్టు సమాచారం. మీడియాటెక్ హెలియె G 90 చిప్‌సెట్‌ను ఈ ఫోన్లో ఉపయోగించారు. నోట్ 1 ఫోన్ ఆండ్రాయిడ్ 10 పై పని చేస్తుండగా నోట్ 1 ప్రో మొబైల్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై పని చేయనుంది. అంతేకాకుండా 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్‌సీ పోర్టుతో కొత్త ఫోన్ ఉండబోతుంది. ధర ఎంత ? మైక్రోమ్యాక్స్ నోట్ 1 ప్రో ధర రూ 15,000లు దగ్గరగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబరు చివరి వారంలో ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తెస్తారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పట్టుకోసం ప్రయత్నాలు ఇండియన్ మార్కెట్లో నోకియా, శామ్సంగ్ హవా కొనసాగుతున్న కాలంలో వాటి తర్వాత స్థానం మైక్రోమ్యాక్స్‌దే అన్నట్టుగా ఉండేంది. ముఖ్యంగా కాన్వాస్ పేరుతో తక్కువ ధరకే స్మార్టు ఫోన్లను అందించి మార్కెట్‌ను కైవసం చేసుకుంది. అయితే మైక్రోమ్యాక్స్ తరహాలోనే చైనా కంపెనీలైన వివో, ఒప్పో, షావోమీ, రియల్‌మీలు ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టాయి. వీటితో పోటీ తట్టుకోలేక మైక్రోమ్యాక్స్ వెనుకబడిపోయింది. మరోసారి ఇండియన్ మార్కెట్‌పై పట్టు పెంచుకునేందుకు ఆ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
ఐఫోన్ 13 రిలీజ్‌కి రెడీ.. ఎన్ని వెర్షన్లలో తెలుసా ?
Apple iPhone 13 : యాపిల్ గాడ్జెట్ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐఫోన్ 13 విడుదలకు తేదీ ఖరారయ్యింది. సెప్టెంబరు 14న కాలిఫోర్నియా వేదికగా ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ అభిమానులు వీక్షించేలా ఈ వేడుకని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. చక్కర్లు కొడుతున్న రూమర్స్ ఐఫోన్ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్ కార్డ్ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. ఎమర్జెన్సీ మెసేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదాన్ని యాపిల్ సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. నాలుగు వెర్షన్లలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రతీ మోడల్‌కి సంబంధించి లైట్, ప్రో, మినీ, మ్యాక్స్, ప్లస్ లాంటి వెర్షన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. మొదట ఒక వెర్షన్ విడుదలైన తర్వాత దానికి పైనా కింద అన్నట్టుగా మిగిలిన వెర్షన్లు విడుదల అవుతున్నాయి. ప్రాథమికంగా ఫోన్ ఒకే రకంగా ఉన్నా ఫీచర్లలో కొన్ని తేడాల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే ఈ మార్కెట్ స్ట్రాటజీకి భిన్నంగా వెళ్లాలని యాపిల్ నిర్ణయించినట్టు సమాచారం. అందువల్లే ఒకేసారి ఐఫోన్ 13కి సంబంధించి నాలుగు వెర్షన్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. ఆ నాలుగు ఇవే యాపిల్ సంస్థ నుంచి వస్తోన్న ఐఫోన్ 13కి సంబంధించి ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్ వెర్షన్లుగా మార్కెట్లోకి రాబోతున్నట్టు మొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకే మోడల్‌కి సంబంధించి వరుసగా వెర్షన్స్ వస్తుండటంతో కొనుగోలుదారుల సైతం వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. కాబట్టి ఒకేసారి అన్ని వెర్షన్లు రిలీజ్ చేయడం వల్ల ఎవరికి నచ్చింది వారు సెలక్ట్ చేసుకుంటారనే వ్యూహంతో యాపిల్ ఉంది. ధర ఎంతంటే ? మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. వెర్షన్ అమెరికా (ఇండియా) ఐఫోన్ 13 799 డాలర్లు (రూ. 58,600) ఐఫోన్ 13 మినీ 699 డాలర్లు (రూ. 51,314) ఐఫోన్ 13 ప్రో 999 డాలర్లు (రూ.73,300) ఐఫోన్ 13ప్రోమ్యాక్స్ 1,099 డాలర్లు (రూ 80,679) చదవండి: Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే? -
మార్కెట్లో విడుదల కానున్న బడ్జెట్ ఫోన్
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే (సెప్టెంబర్) నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్ ఫోన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 7, ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ బడ్జెట్ ఫోన్లతో రూరల్ ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఆన్ లైన్లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 11 ఫీచర్లు రెండు మెమరీల వేరియంట్ తో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 11 ధర రూ.9,999గా ఉండగా నుంది. మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేయలేదు. -
అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వై33ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. ధర రూ.17,990 ఉంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్సెల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫన్‌టచ్ ఓఎస్ 11.1, బిల్ట్ ఇన్ బ్లూలైట్ ఫిల్టర్, 8 జీబీ ర్యామ్, 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సూపర్ నైట్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. చదవండి : ఈ టెక్నాలజీని ఒకేసారి ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
రియల్మీ నుంచి వాషింగ్ మెషిన్.. వచ్చేది ఎప్పుడంటే?
స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లయెన్స్ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్లైఫ్ బ్రాండ్ హోం అప్లయెన్స్ విభాగంలో ఎల్జీ, శామ్సంగ్ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్మీ టెక్లైఫ్ అనే బ్రాండ్‌తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి రానుంది. దీపావళి స్మార్ట్‌ఫోన్ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్ టెక్నిక్‌ని హోం అప్లయెన్స్ విభాగంలో కూడా రియల్మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ ధరకే ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషిన్ రియల్ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల మాటగా వినిపిస్తోంది. దీపావళి పండక్కి రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ విస్తరణ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయం సాధించిన వెంటనే ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకంలోకి రియల్మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్‌బుక్ పేరిట ల్యాప్‌ల్యాప్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్లో ఉన్నాయి. చదవండి: భారత్‌లోకి రియల్మీ బుక్ -
ఆ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా.. 40కోట్లు దాటిన యూజర్లు
హైదరాబాద్: అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల షిప్‌మెంట్‌పై కేనలిస్ డేటా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం వరల్డ్ వైడ్ గా స్మార్ట్ఫోన్ల వినియోగం 12శాతం పెరిగాయి. వాటిలో శాంసంగ్ 19శాతం స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తొలిస్థానాన్ని దక్కించుకుంది. షియోమి17శాతంతో రెండో స్థానంలో ఉండగా.. 14శాతంతో యాపిల్ సైతం మూడో స్థానంలో నిలిచింది. వివో,ఒప్పో స్మార్ట్ఫోన్లు ఐదోస్థానంలో నిలిచింది. తొలి క్వార్టర్లో 10 శాతం మార్కెట్ వాటాతో ఐదో స్థానంలో ఉంది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 27 శాతం అధికంగా స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసినట్టు కేనలిస్ డేటా తెలియజేస్తోంది. గతేడాది కూడా వివో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. 50కు పైగా దేశాల్లో వివోకు విక్రయ నెట్వర్క్ ఉండగా.. 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారని కేనలిస్ డేటాలో పేర్కొంది. చదవండి: 'పెగసెస్' మీ స్మార్ట్‌ఫోన్ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?! -
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్ కూడా
భారత్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీపై హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కన్నేశాయి.మార్కెట్ లో పోటీని తట్టుకునేలా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో హాంకాంగ్‌కు చెందిన 'టెక్నో' సంస్థ భారత్ లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.టెక్నో కేమన్ 17, టెక్నో కేమన్ 17 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన ఈ ఫోన్ జులై 26 నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు టెక్నో ప్రతినిథులు తెలిపారు. టెక్నో కేమన్ 17 ఫీచర్స్ 6.8 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో జీ805 ఎస్ఓసీ ప్రాసెసర్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ తో పాటు 256 ఎక్స్‌టెండెబుల్ మెమొరీని అందిచనుంది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సౌలభ్యంతో అందుబాటులోకి రానుండగా దీని ప్రారంభ ధర రూ. 12,999గా ఉంది టెక్నో కేమన్ 17 ప్రో 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో G95 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుండగా, 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 48 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 16,999 ఉండగా..రూ. 1,999 డిస్కౌంట్ లభిస్తుంది. -
రూపాయికే గూగుల్ నెస్ట్ మినీ!
ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూపాయికే గూగుల్ నెస్ట్ మినీని పొందేలా ఆఫర్ ఇచ్చింది. వాస్తవానికి గూగుల్ నెస్ట్ మినీ ధర రూ.2999 ఉండగా .. ఫ్లిప్ కార్ట్ రూపాయికే అందిస్తుంది. అయితే ఈ రూపాయి ఆఫర్ దక్కించుకునేవారికి కొన్ని షరతులు విధించింది. ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్ అమ్మకాలపై దృష్టిసారించింది. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ .31,999 ఉండగా.. ఎవరైతే ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తారో.. వాళ్లు అదనంగా రూపాయి చెల్లిస్తే గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్ ను సొంతం చేసుకోవచ్చు. మినీతో పాటు, ఫ్లిప్‌కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ను ఉపయోగిస్తే పిక్సెల్ 4ఏ పై 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పథకం కింద కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ .15,300 చెల్లించి గూగుల్ పిక్సెల్ 4ఏని పొందవచ్చు. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల స్పెసిఫికేషన్లు గూగుల్ పిక్సెల్ 4ఎ 5.81-అంగుళాల ఫుల్ హెచ్డీ, పంచ్ హోల్ ఓఎల్ఇడి డిస్ప్లే 9.5: 9 యాస్పెట్ రేషియోను కలిగి ఉంది. మిడ్ రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730 జి చిప్సెట్తో పాటు 6 జీబీ వేరియంట్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ స్కైర్ షేప్ కెమెరా, 12.2 మెగాపిక్సెల్, డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటెక్షన్, కెమెరా వెనుక ఎఫ్ / 1.7 ఎపర్చరు, ఓఐఎస్ 77 డిగ్రీల వీక్షణతో ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎఫ్ / 2.0 ఎపర్చరు, 84-డిగ్రీల ఫైల్డ్ వ్యూను వీక్షణ క్షేత్రం ఉంది. కాగా, భారత్‌లో పిక్సెల్ 4ఏ ను 6 జీబీ వేరియంట్ ను రూ. 31,999 రూపాయలకు విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ధర కూడా రూ .25,999 అమ్మకాలు చేపట్టింది గూగుల్. అయితే ఇప్పుడు తిరిగి రూ.31,999కే అమ్ముతుంది. దీనిపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రూ .2999 విలువైన స్పీకర్ ను రూపాయికే అందిస్తుంది. -
Samsung Galaxy M32: ధర రూ.20వేల లోపే, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి?!
సాక్షి,వెబ్‌డెస్క్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ దిగ్గజం శాంసంగ్ త్వరలో లాంచ్ చేసే కొత్త ఫోన్ గెలాక్సీ ఎం32 స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెలలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు లీకైన గెలాక్సీ ఎం 32కి ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గెలాక్సీ ఎం 32 ధర ప్రముఖ మీడియా ఐఏఎన్ ఎస్ నివేదిక ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎం 32 జూన్ నాలుగో వారంలో ఇండియాలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రారంభం ధర రూ.15వేల నుంచి రూ.20వేల మధ్యలో ఉండనుంది. గెలాక్సీ ఎం 32 ఏఏ కలర్స్ లో ఉండబోతుంది గెలాక్సీ ఎం 32 ఫోన్ ఇమేజెస్ ఇప్పటికే శాంసంగ్ అధికారిక వెబ్సైట్ లో బ్యాక్ ప్యానెల్,స్వైర్ షేప్ కెమోరా మాడ్యుల్, ఇన్ఫినిటీ-యు కటౌట్‌తో డిజైన్లను పోస్ట్ చేసి ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్ తో మార్కెట్ లో విడుదల కానుంది. గెలాక్సీ ఎం 32 ఫీచర్స్ గెలాక్సీ ఎం 32 లో ఇన్ఫినిటీ-యు డిజైన్ తో 6.4-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్ పనిచేస్తుంది. 4GB RAM + 64GB మరియు 6GB RAM + 128GB ఇంట్రర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. గెలాక్సీ ఎం 32 కెమెరా గెలాక్సీ ఎం 32 క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ తో వస్తుంది. చదవండి: Amazon Mobile Saving Days : ఈ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్స్ గెలాక్సీ ఎం 32 బ్యాటరీ గెలాక్సీ ఎం 32 కూడా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ యుఐ లేయర్‌తో ఆండ్రాయిడ్ 11 పైన రన్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 1 టీబీ వరకు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. -
జోరుమీదున్న స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 2021 జనవరి-మార్చిలో జోరుగా సాగాయి. వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 3.8 కోట్ల యూనిట్లు అమ్ముడ య్యాయి. 2020 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. నూతన మోడళ్లు, ప్రమోషన్స్, ఈఎంఐ పథకాలు, గతేడాది నుంచి కొనసాగుతున్న డిమాండ్‌తో మార్చి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను నడిపించాయి. స్మార్ట్‌ఫోన్స్, ఫీచర్ ఫోన్లతో కలిపి పరిశ్రమ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 19 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఫీచర్ ఫోన్ల విపణి 14 శాతం అధికమైంది. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం జనవరి-మార్చిలో కస్టమర్ల సెంటిమెంటును బలపరిచిందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో.. మార్చి త్రైమాసికంలో జరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతం వాటా చైనా బ్రాండ్లదే. షావొమీ,శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా అయిదు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ 207 శాతం, వన్‌ప్లస్ 300 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిమాండ్‌ను పెంచేందుకు అన్ని బ్రాండ్లు కొత్త మోడళ్లు, ప్రమోషన్స్, ఫైనాన్షియల్ స్కీమ్స్‌పై దృష్టిసారించాయి. అయితే మహమ్మారి సెకండ్ వేవ్‌తో సెంటిమెంటు తగ్గే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ చెబుతోంది. కోవిడ్-19, లాక్డౌన్స్ ప్రభావం రానున్న త్రైమాసికాలపై ఉంటుందని గుర్తు చేసింది. గతేడాది సరఫరా సమస్యలు తలెత్తిన దృష్ట్యా ముందస్తుగా నిల్వలను పెంచుకున్నామని బిగ్-సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. చదవండి: గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా? -
పుంజుకున్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కారణంగా సెంటిమెంట్ పడిపోవడం, లాక్‌డౌన్‌తో తిరోగమనం చవిచూసిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు తిరిగి గాడినపడ్డాయి. గతేడాదితో పోలిస్తే సెప్టెంబరులో ఆఫ్‌లైన్‌లో 10 శాతం వృద్ధి నమోదైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధర వ్యత్యాసం లేకపోవడంతో ఆన్లైన్ కస్టమర్లు కొంత ఆఫ్‌లైన్‌కు మళ్లడం.. మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్లు గంటల వ్యవధిలోనే ఫోన్లను డెలివరీ చేస్తుండడమే ఈ వృద్ధికి కారణమని అవి అంటున్నాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా 51 శాతం తగ్గి 1.8 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. జూలై నుంచి సేల్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పాఠశాలలు ఆన్లైన్ తరగతులకు మళ్లడం కూడా స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో కదలికకు కారణమైంది. పెరిగిన సగటు ధర.. ఈ ఏడాది మార్చి దాకా స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రూ.13–14 వేల మధ్య నమోదైంది. కోవిడ్ ప్రభావంతో ఏప్రిల్–ఆగస్టులో ఇది రూ.10–11 వేలకు దిగొచ్చింది. సెప్టెంబరులో పుంజుకుని రూ.13 వేలకు చేరిందని బిగ్–సి మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ‘గతంతో పోలిస్తే స్మార్ట్ఫోన్ల టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఎక్స్‌పీరియెన్స్ విషయంలో వినూత్న ఫీచర్లతో కొత్త మోడళ్లు వచ్చి చేరుతున్నాయి. అయితే ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. కస్టమర్లకు డబ్బుకు తగ్గ విలువ చేకూరుతోంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా వినియోగదార్లకే ప్రయోజనం’ అని అన్నారు. కోవిడ్ దెబ్బకు జీరో డౌన్‌పేమెంట్ పథకాలను నిలిపివేసిన కంపెనీలు ఈ విధానాన్ని ఇటీవల తిరిగి మొదలుపెట్టాయి. అలాగే రూ.10 వేలలోపు ధరగల మోడళ్లకు డిమాండ్ అధికం కావడంతో అమ్మకాలు పెరిగాయని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. మార్జిన్లు తగ్గించిన కంపెనీలు.. భారత్‌లో 2011–12 కాలంలో 165 బ్రాండ్లు స్మార్ట్ఫోన్ల రంగంలో పోటీపడ్డాయి. ప్రస్తుతం శామ్సంగ్, వివో, ఓపో, షావొమీ, రియల్మీ మధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ బ్రాండ్ల సగటు విక్రయ ధర రూ.13–15 వేల మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీమియం సెగ్మెంట్‌ను యాపిల్, వన్ ప్లస్ కైవసం చేసుకున్నాయి. ఇక స్మార్ట్ఫోన్ల విక్రయాలపై విక్రేతలకు ఇచ్చే లాభాలను (మార్జిన్) ఇటీవల కంపెనీలు 5 శాతం దాకా తగ్గించాయి. మరోవైపు డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై కేంద్రం 10 శాతం దిగుమతి సుంకం విధించింది. సుంకాల ప్రభావంతో స్మార్ట్ఫోన్ల ధరలు 3 శాతం దాకా అధికమయ్యే ఛాన్స్ ఉందని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు వెల్లడించారు. మొబైల్స్‌పై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి చేర్చడం వల్ల గ్రే మార్కెట్ పెరుగుతోందన్నారు. హాట్‌కేక్‌లా ఫోల్డ్–2.. ఆసక్తికర విషయం ఏమంటే శామ్సంగ్ రూ.1,49,999 ధరలో ఇటీవల ప్రవేశపెట్టిన సూపర్ ప్రీమియం మోడల్ ఫోల్డ్–2 హాట్‌కేక్‌లా అమ్ముడైంది. విడుదలైన 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 10,000 యూనిట్లకుపైగా కస్టమర్ల చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం. ఇందులో 500 యూనిట్ల దాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముడయ్యాయి. కాగా, 2జీ నుంచి 4జీకి కస్టమర్లు ఇటీవల వేగంగా మారారని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. యాక్సెసరీస్‌కు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదని చెప్పారు. -
స్మార్ట్‌ఫోన్ విక్రయాల రికార్డు, టాప్ బ్రాండ్ ఇదే
సాక్షి, ముంబై : దసరా, దీపావళి పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. అన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త లాంచ్‌లు, డిస్కౌంట్లు, పండుగ ప్రత్యేక ఆఫర్లతో ఈ వృద్ధి నమోదైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రమోషన్లు ఈ పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచడంతో కీలకంగా నిలిచిందని కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు అన్షిక జైన్ చెప్పారు. ఒకవైపు దేశీయంగా ఆటో, రియల్టీ సహా పలురంగాల్లో మందగమనం కొనసాగుతోంటే..స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్ 2019 త్రైమాసికంలో రెండంకెల (10 శాతం) వృద్దితో అత్యధికంగా 49 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఫలితంగా ఈ విభాగంలో మందగమనం ఆందోళనలను అధిగమించిందని ఇటీవల వెల్లడించిన ఒక నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఈ విక్రయాల్లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో వివిధ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కౌంటర్ పాయింట్ వెల్లడించిన వివరాల ప్రకారం షావోమి మార్కెట్ వాటా 26 శాతంటాప్‌లో నిలిచింది. 20 శాతం వాటాతో శాంసంగ్ , 17 శాతంతో వివో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా రియల్ మీ 16 శాతం, ఒప్పో వాటా 8 శాతంగా సాధించాయి. అయితే ఇటావల ధరలను తగ్గించిన నేపథ్యంలో ఆపిల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఐఫోన్ 11 తో పాటు ఎక్స్ఆర్ మోడల్లో ధరల తగ్గింపు కారణంగా ఆపిల్ టాప్ 10 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలోకి ప్రవేశించింది. అయితే నెంబర్ వన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా వన్ ప్లస్ నిలిచింది. మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ అమ్మకాలు రెండింతలు పెరిగాయి. క్షీణించిన ఫీచర్ ఫోన్ మార్కెట్ స్మార్ట్ ఫోన్ల కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు అంతంతమాత్రమే. మూడో త్రైమాసికంలో దాదాపు 37 శాతం తగ్గిపోయాయి. ఫీచర్ ఫోన్ విభాగంలో శాంసంగ్ మార్కెట్ వాటా 22 శాతం, ఐ టెల్ వాటా 16 శాతం, లావా వాటా 16 శాతం, నోకియా 12 శాతం, కార్బన్ 7 శాతంగా నమోదైంది. అయితే ఇటెల్, లావా కార్బన్ కంపెనీలు సానుకూల వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. వాస్తవానికి, 2019 మూడవ త్రైమాసికంలో ఇటెల్ రెండవ ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. -
ఫ్లిప్‌కార్ట్ సేల్; స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లను పండుగను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్ ఎండ్ మొబైల్స్‌ఫెస్ట్ పేరుతో అయిదు రోజుల పాటు ఆగస్టు 26 నుంచి 31 వరకు స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో వివిధ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రెడ్మి వై2, రెడ్ మి 6, రిలయన్ మి 2 ప్రొ పై డిస్కౌంట్లను ఆఫర్లను అందిస్తోంది. రెడ్మి 6పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రెడ్మి 6 స్మార్ట్‌ఫోన్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.6,999కే అందుబాటులో ఉంచింది. దీని అసలు ధర రూ. 10,499. రియల్‌మి 2 ప్రొ ధర రూ. 8,999 అసలు ధర రూ.13,990. దీంతోపాటు సాధారణ ఎక్స్చేంజ్తో పోలిస్తే అదనంగా వెయ్యిరూపాయలను ఫ్లిప్‌కార్ట్ అందివ్వనుంది. ఇంకా హానర్, వివో, శాంసంగ్, ఆసుస్ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై కూడా తక్కువ ధరలను ప్రకటించింది. -
రెడ్మి నోట్ 7 ప్రొ రంజాన్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ : రంజాన్ పర్వదినం సందర్భంగా షావోమి స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. రెడ్మి నోట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈద్ స్పెషల్‌గా ప్రత్యేకంగా విక్రయిస్తోంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలనుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ మొదలవుతుంది. 48 మెగాపిక్సల్ భారీ కెమెరా, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటివి ప్రధాన ఫీచర్లు. ముందు ప్రకటించిన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు సేల్ మొదలు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమయిందని షావోమి ఇండియా సీఈఓ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. రెడ్మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 48+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ : ధర రూ. 13,999 6 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ : ధర రూ. 16,999 Mi fans, here's your Eidi. #RedmiNote7Pro on special sale. Get the amazing #48MPCameraBeast at 4PM from @Flipkart. pic.twitter.com/LSiihtSKxh — Redmi India (@RedmiIndia) June 5, 2019 -
నోకియా 4.2@రూ.10,990
న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్ ఫోన్ల విక్రయ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. భారత మార్కెట్లో ‘నోకియా 4.2’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లు కలిగిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,990 కాగా.. 13 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 439 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లుగా తెలిపింది. -
శామ్సంగ్ గెలాక్సీ ఎస్10 శ్రేణిపై ఆఫర్లు
హైదరాబాద్: గెలాక్సీ ఎస్10 శ్రేణి ఫోన్లపై శామ్సంగ్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్ అప్‌గ్రేడ్ ఆఫర్ కింద... కస్టమర్లు గెలాక్సీ ఎస్10ఈ మోడల్‌ను ప్రస్తుత తమ ఫోన్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంతకుముందు రూ.2,000 తగ్గింపు లభించగా, అదిప్పుడు రూ.4,000 అయింది. గెలాక్సీ ఎస్10 (128జీబీ) వేరియంట్‌పై ప్రస్తుత ఎక్సేంజ్ బోనస్ 3,000 సైతం రూ.6,000 అయింది. గెలాక్సీ ఎస్10ఈ ఫీచర్లు 5.8 అంగుళాల ఫుల్ హెచ్‌సీ స్క్రీన్ ఆండ్రాయిడ్ 9.0 పై 6/8 జీబీ ర్యామ్, 128/256స్టోరేజ్ 16 ఎంపీ డ్యుయల్ ఫిక్సెల్ కెమెరా 10 ఎంపీ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా 3100 ఎంఏహెచ్ బ్యాటరీ -
హానర్ కొత్త ఫోన్.. ‘వ్యూ20’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ దిగ్గజం హువావే.. ‘హానర్’ బ్రాండ్‌లో ‘వ్యూ20’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. హైఎండ్ పోర్టిఫోలియోలో భాగంగా 6జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత మెమోరీ సామర్థ్యం కలిగిన ఈ హ్యండ్‌సెట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.37,999గా నిర్ణయించింది. ఈ సందర్భంగా హువావే వైస్ ప్రెసిడెంట్ అలెన్ వాంగ్ మాట్లాడుతూ.. భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరాల మేరకు ఈ మొబైల్‌ను విడుదలచేశామని, వినియోగదారుల అంచనాలను అందుకోగలదన్నారు. -
3డీ స్టీరియో కెమెరాతో ఒప్పో ఆర్17ప్రో
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ ఒప్పో డిసెంబర్ 4న మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఒప్పో ఆర్17 ప్రో పేరుతో ఈ డివైస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. వాటర్ డ్రాప్ నాచ్ కలిగిన భారీ డిస్ప్లే, మూడు రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ తెలిపింది. గ్రీన్, ఫాగ్ గ్రేడియంట్ కలర్ వేరియెంట్ల లభ్యం కానుంది. ఇక ధర విషయానికి వస్తే సుమారు రూ. 43వేలకు లభించే అవకాశం ఉందని అంచనా. మార్కెట్లో వినియోగదారులకు డిశంబరు 4వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే డిశంబరు 1 నుంచే ప్రీ బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. ఒప్పో ఆర్17 ప్రో ఫీచర్లు 6.4 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లే 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12+20+ TOF 3డీ స్టీరియో మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 3డీ స్టీరియో కెమెరా -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భారత్‌ది రెండో స్థానం
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భారత్ వేగం పెంచింది. మూడవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అమెరికాను మూడవ స్థానానికి నెట్టింది. చైనా తర్వాత 2వ స్థానానికి చేరింది. రీసెర్చ్ సంస్థ– క్యానలిస్ గణాంకాలను పరిశీలిస్తే– సమీక్షా కాలంలో చైనా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 10.06 కోట్లు. భారత్ విషయంలో ఈ సంఖ్య 4.04 కోట్లుగా ఉంది. అమెరికా అమ్మకాలు నాలుగు కోట్లు. అయితే ఈ మూడు మార్కెట్ల అమ్మకాల్లో పెద్దగా వృద్ధి నమోదుకాకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. క్షీణతే ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ గణాంకాలు పెరక్కపోగా క్షీణించాయి. 7.2 శాతం క్షీణతతో 34.89 కోట్లకు పడ్డాయి. మొత్తం 10 ప్రధాన మార్కెట్లను చూస్తే... ఏడు మార్కెట్లలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. వీటిలో ఇండోనేషియా, రష్యా, జర్మనీలు మాత్రమే వృద్ధిని నమోదుచేసుకున్నాయి. చైనాలో అమ్మకాలు 15.2% పడిపోతే, భారత్‌లో 1.1%, అమెరికాలో 0.4% స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గాయి. శామ్సంగ్ టాప్..: మార్కెట్ వాటాలో శాం సంగ్ 20.4%తో టాప్‌లో నిలిచింది. తర్వాత హువావే(14.9%), యాపిల్ (13.4%), షావోమీ(9.6%), ఒపో(8.9%) ఉన్నాయి. -
రిలయన్స్ డిజిటల్‌తో జతకట్టిన వన్‌ప్లస్
సాక్షి,న్యూఢిల్లీ: భారదేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై కన్నేసిన చైనా మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోని దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థతో ఒక కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా వన్ ప్లస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలకు ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఇక మీదట రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో వన్‌ప్లస్ ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. అంతేకాదు దేశంలోని పలు నగరాల్లో రిలయన్స్ డిజిటల్ స్టోర్ల ద్వారా వన్‌ప్లస్ తాజా స్మార్ట్‌ఫోన్ 6టీ ఆవిష్కరణ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. దేశంలోనే నెంబర్‌వన్, అతి వేగంగా విస్తరిస్తున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ రిలయన్స్ డిజిటల్‌తో వన్‌ప్లస్ ఒప్పందాన్ని చేసుకుందని రిలయన్స్ డిజిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తాజా భాగస్వామ్యంతో మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ ప్రకటించారు. భారతీయ నగరాల్లోని తమ మొబైల్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోఉండేలా మరిన్ని రిటైల్ టచ్ పాయింట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. వన్ ప్లస్ సంస్థతో భాగస్వామ్యం పట్ల రిలయన్స్ డిజిటల్ సంస్థ సీఈవో బ్రయాన్ బేడ్ సంతోష వ్యక్తం చేశారు. తమ స్టోర్లలో వినియోగదారులకోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తామని తద్వారా లైవ్ డెమో తోపాటు, కస్టమర్లు తమ సందేహాలను తమ సిబ్బంది ద్వారా పత్యక్షంగా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. న్యూయార్క్‌లో అక్టోబరు 29 వ తేదీ వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభానికి ముందు ఈ భాగస్వామ్య ప్రకటన రావడం విశేషం. అలాగే అక్టోబర్ 30 న న్యూఢిల్లీలో లాంచ్ చేయనుంది. ఇప్పటివరకు టాటా గ్రూపునకు చెందిన క్రోమా ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే లభ్యమయ్యే వన్‌ప్లస్‌స్మార్ట్‌ఫోన్లు ఇపుడు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ 6టీ ఫీచర్లు : 6.4 అంగుళాల డిస్ప్లే , 8జీబీ ర్యామ్, 256 జీబీస్టోరేజ్ 3700ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
ఐఫోన్ కు ఎదురేలేదు!
న్యూయార్క్: ఎంత పోటీ ఉన్నా ఆపిల్ ఐఫోన్ కు తిరుగులేదని మరోసారి రుజువైంది. మార్కెట్ లోకి ఎన్ని స్మార్ట్ ఫోన్లు వస్తున్నా ఐఫోన్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా గణింకాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచింది. 2016 ద్వితీయ త్రైమాసికంలో అత్యధికంగా 1.42 కోట్ల(14.2 మిలియన్లు) ఐఫోన్ 6ఎస్ అమ్ముడైనట్టు మార్కెట్ అధ్యయన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇది 4 శాతమని తెలిపింది. 2 శాతం వాటాతో ఐఫోన్ 6 రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 85 లక్షల ఐఫోన్ 6 అమ్ముడయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మూడో స్థానం(83 లక్షలు) దక్కించుకుంది. గతేడాదితో పోల్చుకుంటే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. నిరుడు ద్వితీయ త్రైమాసికంలో 33 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 34 కోట్లు సేల్ అయ్యాయి. -
ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఢమాల్
న్యూఢిల్లీ : ఒకప్పుడు ఆన్లైన్ లో స్మార్ట్ ఫోన్ల కొనుగోలకు ఎగబడిన వినియోగదారులు 2016 ప్రథమార్థంలో మాత్రం ఆ ఊపును తగ్గించారు. ఆన్లైన్లో స్మార్ట్‌పోన్ కొనుగోలపై ఆసక్తి తగ్గించారు. దీంతో ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఢమాల్ మనిపించాయి. మార్చిలో ఈ-కామర్స్ సంస్థల ఆఫర్ చేసే డిస్కౌంట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినతరమైన నిబంధనలే ఈ అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారకంగా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. 2016 జూన్ తో ముగిసిన ఆరు నెలల కాలంలో ఆన్ లైన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 32 శాతానికి కుప్పకూలినట్టు తెలిపింది. ఆన్‌లైన్‌తో పోలిస్తే ఆఫ్‌లైన్ అమ్మకాలు బాగున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ నవ్కేందర్ సింగ్ తెలిపారు. అయితే ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ లపై మాత్రం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో స్ట్రాంగ్‌గానే ఉన్నాయని కౌంటర్ పాయింట్ తెలిపింది. కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారకంగా నిలిచే డిస్కౌంట్ల ఆఫర్లకు ప్రభుత్వం కళ్లెంవేయడంతో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు క్షీణించాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్ లైన్లో వస్తువుల కొనుగోలుకు సౌకర్యవంతం, ప్రత్యేకధర, డిస్కౌంట్ లే ప్రధాన కారకాలుగా నిలుస్తాయని లీఎకో స్మార్ట్ ఫోన్ల బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ జైన్ చెప్పారు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో భారీ డిస్కౌంట్లకు చెక్ పడిందన్నారు. వినియోగదారుల ప్రవర్తనకు అనుగుణంగా ఆఫ్‌లైన్, ఆన్లైన్లో నిర్ణయించే స్మార్ట్‌ఫోన్ ధరల్లో మార్పులు ఉంటుందని చైనీస్ స్మార్ట్‌ఫోన్ షియోమి ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. ఇండియాలో షియోమి మొదట ఆన్లైన్ బ్రాండుగా అరంగేట్రం చేసింది. తర్వాత ఆఫ్‌లైన్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం ఫోన్ల అమ్మకాల్లో ఆన్లైన్ అమ్మకాలు 33 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా కొత్త మొబైళ్ల ఆవిష్కరణలు కూడా మూడేళ్ల కాలంలో మొదటిసారి నీరసించాయి. 2016 సగం ఏడాది కాలంలో ఈ ఆవిష్కరణలు 29 శాతం క్షీణించాయి. ముందటి రెండేళ్లలో కొత్త ఫోన్ల లాంచింగ్ యేటికేటికీ 32 శాతం పెరుగుదల నమోదైంది. -
7% తగ్గిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 7 శాతం క్షీణించి 1.95 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. సుంకాల విధానంలో మార్పులు, చైనా నుంచి సరఫరాలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణమని సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) వెల్లడించింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ1లో భారత్‌లో మొత్తం మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ (ఫీచర్ ఫోన్లు సహా) 15 శాతం క్షీణించి 5.3 కోట్ల యూనిట్లకు తగ్గింది. చాలా మటుకు కొత్త హ్యాండ్సెట్స్ 2014 క్యూ4లోనే వచ్చేయడంతో 2015 క్యూ1లో మొబైల్స్ మోడల్స్‌పై ఆసక్తి తగ్గిందని సీఎంఆర్ లీడ్ అనలిస్ట్ టెలికమ్ రీసెర్చ్ ఫైసల్ కవూసా తెలిపారు. మరోవైపు కొరియా హ్యాండ్సెట్ దిగ్గజం శాంసంగ్..స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన వాటాను 23.7 శాతం నుంచి 27.9 శాతానికి పెంచుకుంది. ఎంట్రీ లెవల్ నుంచి హై ఎండ్ దాకా మూడు సెగ్మెంట్లలో కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టడం శాంసంగ్‌కు లాభించినట్లు కవూసా వివరించారు. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో 17.8 శాతం నుంచి 16.2 శాతానికి మార్కెట్ వాటా తగ్గడంతో మైక్రోమ్యాక్స్ రెండో స్థానంలో నిల్చింది. 9.2 శాతం మార్కెట్ వాటాతో ఇంటెక్స్ మూడో స్థానంలో ఉంది. సీజన్ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలు పూర్తిగా ఆన్లైన్ అమ్మకాలపై ఆధారపడకుండా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని సీఎంఆర్ టెలికం అనలిస్ట్ కర్ణ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. -
చౌక స్మార్ట్ఫోన్లకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. భారీ సంఖ్యలో భారతీయులు ఫీచర్ల ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుండడమే దీనికి కారణమని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం ఈ ఏడాది భారత్‌లో 8 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లు అమ్ము డవుతాయి. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని విశేషాలు..., పలు కంపెనీలు చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లనందిస్తున్నాయి. దీంతో ఫీచర్ ఫోన్లకు, స్మార్ట్ఫోన్లకు మధ్య ధర వ్యత్యాసాలు తగ్గుతుండటంతో పలువురు స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రానున్న ఐదేళ్లలో 40 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయి. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఈ కాలానికి ఈ విక్రయాలు 186 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. చైనాలో ఈ వృద్ధి 31 శాతంగానే ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి మొత్తం మొబైల్ ఫోన్ల విక్రయాలు 1 శాతం పెరగ్గా, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 10 శాతం క్షీణించాయి. గత ఏడాది చివరి మూడు నెలల కాలం అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మొబైల్ ఫోన్ల విక్రయాలు 18 శాతం తగ్గాయి. స్మార్ట్ఫోన్ల విక్రయాలు మాత్రం 61.4 లక్షల నుంచి 17 శాతం వృద్ధితో 1.75 కోట్లకు పెరిగాయి. వినియోగదారులు స్మార్ట్ఫోన్లకు ప్రాధాన్యత ఇస్తుండడం, ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండడం తదితర కారణాల వల్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతున్నాయి. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విస్తరణ 10 శాతంలోపే ఉంది. తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు లభ్యమవుతుండడం, అమ్మకాల పెంపుపై పెద్ద పెద్ద కంపెనీలు దృష్టి సారించడం వంటి కారణాల వల్ల స్మార్ట్ఫోన్ల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 200 డాలర్లలోపు స్మార్ట్ఫోన్ల విక్రయాలు 78 శాతంగా ఉన్నాయి. ఇక స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్దే హవా. అందుబాటు ధరల్లో విండోస్ ఓఎస్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తుండటంతో విండోస్ ఓఎస్ వాటా కూడా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో శామ్సంగ్ 35 శాతం మార్కెట్ వాటా సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(15%), కార్బన్(10%), లావా(6%), నోకియా (4శాతం)లు ఉన్నాయి.