ప్రముఖ స‍్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి 5జీ షావోమీ12 ప్రో'ని అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఏప్రిల్12న భారత్‌లో విడుదల చేసేందుకు షావోమీ సిద్ధమైంది. అయితే ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్22, మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఐక్యూ 9ప్రో,వన్ ప్లస్ 10ప్రో' స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా షావోమీ 12ప్రో ఫోన్ నిలుస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
5జీ షావోమీ12 ప్రో' స్పెసిఫికేషన్‌లు..
షావోమి షావోమీ12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎల‍్టీపీఓ టెక్నాలజీతో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్‌ప్లే రెజెల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాసెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10ప్లస్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి వచ్చింది. 4,600ఎంఏహెచ్ బ్యాటరీ 120డబ్ల్యూ షావోమి హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 1500నిట్ పీక్ బ్రైట్‌నెస్ సదుపాయం ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
షావోమీ12 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్, చిప్‌లోని సిస్టమ్ దానితో పాటు ఇంటిగ్రేటెడ్ Adreno 730 జీపీయూ, 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజీని అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఐఎంఎక్స్ 707ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 115° ఫీల్డ్ వ్యూతో 50ఎంపీ శాంసంగ్ జేఎన్1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లు ఉన్నాయి. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.
చదవండి: స్మార్ట్ ఫోన్‌లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు!
Comments
Please login to add a commentAdd a comment