Smartphone China
-
అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు షావోమీ రెడీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలిసారిగా సినిమాటిక్ విజన్ (సివి) ‘CI’ (of Cinematic) and ‘VI’ (of Vision) సిరీస్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. కానీ ఫోన్ గురించి ఎలాంటి వివరాల్ని వెల్లడించ లేదు. ఈ తరహా సివి ఫోన్ల గురించి గతంలో పుకార్లు వచ్చాయి. షావోమీ సివి 4 ప్రోని..షావోమీ 14 సివిగా భారత్ మార్కెట్‌కు పరిచయం చేయనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న షావోమీ 14 సిరీస్‌కి అప్డేటెడ్ వెర్షన్ రానుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు షావోమీ 14, షావోమీ 14 ఆల్ట్రా ఉన్నాయి. సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ #CinematicVision - Coming Soon! pic.twitter.com/Exnu9If9Da— Xiaomi India (@XiaomiIndia) May 21, 2024 సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ అనే ఊహాగానాలు నిజమైతే స్మార్ట్‌ఫోన్ 1.5కే రిజల్యూషన్‌తో 6.55 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ (Hertz) రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్ప్లే. 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూ ఎం డిమ్మింగ్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో రానుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్అంతేకాదు ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్ సెట్ ఉండగా 12జీబీ ఎల్ పీపీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఫోన్ వెనుక కెమెరాలో 12-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ13బీ10 అల్ట్రా వైడ్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుండగా.. ఆఫోన్ షావోమీ ఐపర్ ఓఎస్‌లో రన్ అవుతుందని తెలుస్తోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్, హై రెసెల్యూషన్ ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటితో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయని సమాచారం. -
రెడ్మీ నోట్ 13 సిరీస్ వచ్చేది అప్పుడే.. ధర ఎంతంటే?
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్ మీ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పటి వరకు విడుదలైన అన్నీ ఫోన్లు టెక్ ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ఈ తుణంలో షావోమీ రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. షావోమీ రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్లను సెప్టెంబర్‌లోనే చైనాలో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ మోడళ్లు 6.67 అంగుళాలు 1.5కే ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్‌లో మీడియా టెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీ, రెడ్మీ నోట్ 13 ప్రో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 2 ఎస్‌ఓఎస్‌తో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారత్‌లో జనవరి 4, 2024న విడుదల చేయనున్నట్లు షావోమీ ఇండియా అధికారికంగా ట్వీట్ చేసింది. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ ధరలు ఎంతంటే? రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ ప్రారంభ ధర (చైనా కరెన్సీ యువాన్‌లో ) రూ.13,900, రెడ్మీ నోట్ 13 ప్రో ప్రారంభ ధర రూ.17,400, రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ.22,800 ఉండగా భారత్‌లో సైతం ఇవే ధరల్లో అందుబాటులో ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక యూరప్‌లో రెడ్మీ నోట్ 13 ప్రో మోడల్ ధర రూ.40,700, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ రూ.45,000గా ఉంది. రెడ్మీ నోట్ 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో ఈ ఫోన్ రాబోతోంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంది. ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్3 ఎస్ఓఎసీపై నడుస్తుంది. అయితే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మీడియాటెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీతో పనిచేస్తుంది. వెనిలా రెడ్మి నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీని కలిగి ఉంది. -
భారత్‌లో ఫోల్డబుల్ ఫోన్ల హవా!
న్యూఢిల్లీ: భారత స్మార్ట్ఫోన్ల విపణిలో ఇప్పుడు ఫ్లిప్ మోడళ్ల హవా నడుస్తోంది. ఫ్లిప్ విభాగంలో గట్టి పట్టు కోసం చైనా కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. శామ్సంగ్కు ధీటుగా పోటీ ఇవ్వడానికి ఈ కంపెనీలు వినూత్నంగా ఫ్లిప్ ఫోన్లను తయారు చేసి కస్టమర్లను ఊరిస్తున్నాయి. చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలాతోపాటు టెక్నో, ఒప్పో వీటిలో ఉన్నాయి. పరిశ్రమలో తొలిసారిగా మోటరోలా రూ.50,000 లోపు ధరలో ఫ్లిప్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ నెలాఖరులోగా వన్‌ప్లస్ నుంచి ప్రిమియం ఫ్లిప్ ఫోన్ వస్తోంది. 2023 జూలైలో ఫ్లిప్ మోడల్ విడుదల చేసిన తర్వాత రెండు నెలల్లోనే శామ్సంగ్ సుమారు 50–60 వేల యూనిట్లు విక్రయించినట్టు అంచనా అని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ తెలిపింది. మోటరోలా, టెక్నో బ్రాండ్స్ నెలకు చెరి 18–20 వేల యూనిట్లను అమ్ముతున్నాయని వివరించింది. ఈ కంపెనీలను టెక్నో, ఒప్పో అనుసరించాయి. సర్క్యులర్ కవర్ డిస్ప్లే, మధ్య స్థాయి ఫీచర్లతో టెక్నో ఫ్లిప్ ఫోన్‌ను రూ.50 వేల ధరలో ప్రవేశపెట్టింది. మెరుగైన కెమెరా, బ్యాటరీకితోడు సాధారణ స్మార్ట్‌ఫోన్ మాదిరి డిస్ప్లేతో ఫ్లిప్ మోడల్‌ను ఒప్పో తీసుకొచ్చింది. -
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోకు ఎదురు దెబ్బ.. భారీ షాకిచ్చిన భారత్!
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోకు ఎదురు దెబ్బ తగిలింది. దేశీయంగా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లను విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగా కేంద్ర అధికారులు వారం రోజుల పాటు శ్రమించి సుమారు 27వేల ఫోన్ల రవాణాను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వివో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ భారత్‌లో స్మార్ట్ ఫోన్లను తయారు చేసి స్థానికంగా విక్రయిస్తుంది. అయితే తాజాగా వివో తయారు చేసిన ఆ స్మార్ట్ఫోన్లను, వాటి విలువను తక్కువగా చూపెట్టి దేశ సరిహద్దులు దాటిస్తున్నారంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి సమాచారం అందింది. సమాచారం అందుకు ఇంటెలిజెన్స్ పోలీసులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్లను సరఫరా చేస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆఫోన్ల విలువ దాదాపు 15 మిలియన్లని తేలింది. ఈ సందర్భంగా వివోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2న ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు లేఖ రాశారంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కేంద్ర సంస్థలు తమ మెరుగైన పనితీరుతో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తాయని అన్నారు. రూ.62,476కోట్లు చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మనీ ల్యాండరింగ్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈఏడాది జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతో పాటు ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలకు చెందిన 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అదే సమయంలో వివో మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది. పన్నుల ఎగవేతపై కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. వివో ఫోన్లను ఇతర దేశాలకు తరలించడం సంచలనంగా మారింది. -
మీ యాపిల్ ఐఫోన్ 14 కంటే..మా చైనా ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ
ఒక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని ఎక్కువ గంటలు వినియోగించుకునే అంశంలో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థలు బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ డిసెంబర్ 1న ‘షోవోమీ 13’ను లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే ఫోన్ గురించి వివరించేందుకు ఆ సంస్థ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా షావోమీ సీఈవో, ఫౌండర్ లీ జూన్..మరో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌కు బహిరంగంగా సవాల్ చేశారు. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ కంటే తాము విడుదల చేయనున్న షోవోమీ 13 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మా ఫోనే గొప్ప చైనాకు చెందిన సోషల్ మీడియా నెట్ వర్క్ సంస్థ వీబో (ట్విటర్ తరహా) ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో షోవోమీ ఫౌండర్ లీ జూన్ యాపిల్ ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ కంటే షావోమీ 13 బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉందని తెలిపారు. అంతేకాదు అందుకు సంబంధించి షోవోమీ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో షోవోమీ13ను మిగిలిన ఫోన్లతో పోల్చారు. ఆ ఫోన్ల కంటే ఈ ఫోన్ పనితీరు బాగుంటుందని ధీమాగా చెబుతున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, గతంలో విడుదలైన షోవీమీ 12ఎస్, షోవోమీ 12ఎస్ ఆల్ట్రా, షావోమీ 12ఎస్ ప్రో, హువావే పీ 50 ప్రో, శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రా కంటే షావోమీ 13 ఫోన్‌ను సింగిల్ ఛార్జ్‌తో బ్యాటరీని ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చని షావోమీ వివరించింది. డీఓయూ టెస్ట్‌లో తేలింది డీఓయూ టెస్ట్ అనే ప్రతి రోజు మనం వినియోగించే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత సేపు ఉంటుందో సూచిస్తుంది. స్కోర్ సైతం అందిస్తుంది. లాంచ్ కానున్న షావోమీ -13 ఫ్లాగ్షిప్ బ్యాటరీ లైఫ్ టెస్ట్‌లో 1.37 స్కోర్ చేయగా ఐఫోన్ 14, 14 ప్రో మ్యాక్స్‌లు 1.28 స్కోర్ నమోదు చేశాయి. ఇక షోవీమీ ఫోన్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్‌ను అందిస్తుండగా.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 4 మాత్రం 4,323ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో షిప్పింగ్ చేస్తోంది. షావోమీతో పాటు షావోమీ డిసెంబర్ 1న లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈవెంట్లో ఫ్లాగ్షిప్ షావోమీ13 సిరీస్‌తో పాటు షోవోమీ వాచ్ ఎస్2, షావోమీ బడ్స్ 4, ఎంఐయూ 14 లను లాంచ్ చేయాలని భావిస్తోంది. అయితే, షోవీమీ మాత్రం భారత్, ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టం చేయలేదు. చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత! -
రెడ్మీ, షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్!
మీరు రెడ్మీ, షావీమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారా? కానీ, ఆ ఫోన్ బ్యాటరీలు డెడ్ అయ్యాయ్యా? ఛార్జింగ్ సరిగ్గా ఎక్కడం లేదా? లేదంటే ఛార్జింగ్ ఎక్కినా నిలవడం లేదా? అయితే మీకో శుభవార్త. షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. యూజర్లు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సమస్యల్ని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు మందగించిన ఫోన్ల బ్యాటరీను మార్చి వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను అమర్చుతున్నట్లు ప్రకటించింది. షావోమీ తన యూజర్లకు రూ.499కే పాత ఫోన్ల బ్యాటరీల స్థానంలో కొత్త బ్యాటరీలను అందిస్తున్నట్లు ట్విట్ చేసింది. మీ షావోమీ, రెడ్ మీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినట్లు అనిపించినా, లేదంటే ఛార్జింగ్ ఎక్కకపోయినా మీ సర్వీస్ సెంటర్‌ని ఆశ్రయిస్తే తక్కువ ధరకే కంపెనీ బ్యాటరీలను అందిస్తామని ట్వీట్లో పేర్కొంది. బ్యాటరీ ఎప్పుడు రిప్లెస్ చేయాలి షావోమీ, రెడ్మీ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ ఛార్జింగ్ లైఫ్ టైమ్ ఉదాహరణకు 10 గంటల ఉంటుంది. కానీ ప్రతిరోజు పలు మార్లు ఛార్జింగ్ తగ్గిపోతుంటే బ్యాటరీ మార్చుకోవాలి. లేదంటే ఫోన్ ఛార్జింగ్ 100శాతం ఉండి నిమిషాల వ్యవధిలో 80-90కి పడిపోతే అప్పుడు మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 జూన్‌లో విడుదల కానున్న 9 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
అదిరిపోయే ఫీచర్లతో..షావోమీ నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి 5జీ షావోమీ12 ప్రో'ని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఏప్రిల్12న భారత్‌లో విడుదల చేసేందుకు షావోమీ సిద్ధమైంది. అయితే ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్22, మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఐక్యూ 9ప్రో,వన్ ప్లస్ 10ప్రో' స్మార్ట్ఫోన్లకు పోటీగా షావోమీ 12ప్రో ఫోన్ నిలుస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5జీ షావోమీ12 ప్రో' స్పెసిఫికేషన్లు.. షావోమి షావోమీ12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎల్టీపీఓ టెక్నాలజీతో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే రెజెల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాసెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10ప్లస్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి వచ్చింది. 4,600ఎంఏహెచ్ బ్యాటరీ 120డబ్ల్యూ షావోమి హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 1500నిట్ పీక్ బ్రైట్నెస్ సదుపాయం ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్, 50డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. షావోమీ12 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్, చిప్‌లోని సిస్టమ్ దానితో పాటు ఇంటిగ్రేటెడ్ Adreno 730 జీపీయూ, 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఐఎంఎక్స్ 707ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 115° ఫీల్డ్ వ్యూతో 50ఎంపీ శాంసంగ్ జేఎన్1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లు ఉన్నాయి. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. చదవండి: స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు! -
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా నిలిచిన భారత్..!
ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ రావడమే ఆలస్యం.. వెంటనే కొనేందుకు యూజర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇండియా మొబైల్ మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ రాకతో చౌకైన ధరకే అందుబాటులోకి వచ్చేశాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉండటంతో యూజర్లు ఎగబడి కొనేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ మార్కెట్‌ను విస్తరించాయి. ఇండియాలో కూడా చైనా కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ కావడంతో స్మార్ట్ వినియోగదారుల్లో మరింత ఆసక్తిని పెంచింది. సరికొత్త ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. న్యూస్ జూ రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది. చైనా స్మార్ట్ ఫోన్ల పుణ్యమ అని అమెరికాను స్టేట్స్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఇండియా వెనక్కి నెట్టేసింది. చైనా తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో గ్లోబల్ లీడర్'గా నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలవగా, తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది. Building New India with Telecom and Digital revolution. Expanding the spread of smartphones to India's rural landscape and bridging the digital gap between urban and rural, Telecom connectivity is rapidly placing India on the global map of leading market for smartphones. pic.twitter.com/3mx0gpc21H — Devusinh Chauhan (@devusinh) March 24, 2022 మనదేశంలో 493 మిలియన్ల్ మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ సంఖ్య అమెరికా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 2రేట్లు ఎక్కువ, బ్రెజిల్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 4 రేట్లు, రష్యా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 5 రేట్లు, జపాన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 6 రేట్లు ఎక్కువ. (చదవండి: 2020-21లో పసిడికి తగ్గిన డిమాండ్..!) -
బడ్జెట్ ధరలో రెడ్ మీ స్మార్ట్‌ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 ఎంపీ మెయిన్ కెమెరాను అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మీ 10 ఫీచర్లు రెడ్ మీ10 స్మార్ట్ ఫోన్ 6.71 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 20.6:9 యాస్పెట్ రేషియోతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వీడియోస్‌ను హైయ్యస్ట్ రెజెల్యూషన్‌తో వీడియోలు చూసేందుకు వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికెషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డిస్ ప్లే డిజైన్ చేసింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 6జీబీ ర్యామ్ 128జీబీ యూఎఫ్ఎస్ 2.2స్టోరేజ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ఫోన్ వెనుక భాగంగాలో 2ఎంపీ డెప్త్ సెన్సార్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. దీంతో పాటు మీరు ఎవరికైనా అర్జెంట్ కాల్ చేయాల్సి వస్తే ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీసి ఫోన్‌ను చూసి అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకమైన రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో మీరు ఫోన్ చూడకుండా జస్ట్ మీ చేతి వేళ్లను ఫోన్‌కు టచ్ చేస్తే చాలు. ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఐపీ సర్టిఫికేషన్ ను అందిస్తుంది. రెడ్ మీ 10 ధర రెడ్ మీ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.10,999 ఉండగా.. 6జీబీ/128జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.12,999 గా ఉంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌పై ఈఎంఐ ఆప్షన్‌తో పాటు రూ.1000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయగా... మార్చి 24 మధ్యాహ్నం 12గంటల నుంచి ఎంఐ.కామ్,ఫ్లిప్ కార్ట్, ఎంఐ స్టోర్‌తో ఆన్లైన్లో కొనుగోలు చేయోచ్చు. కాగా, ఈ ఫోన్ కరేబియన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. చదవండి: ప్రీ బుకింగ్స్ బీభత్సం!! 12గంటల్లో 70వేల ఫోన్ల బుకింగ్స్! -
చైనా మొబైల్ కంపెనీలకు యాపిల్ షాక్!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా మొబైల్ బ్రాండ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. వర్థమాన దేశాల్లో చైనా మొబైల్ ఫోన్లు హహా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా దేశంలోనే ఏకంగా అక్కడి కంపెనీలకే షాకిచ్చింది యాపిల్. నంబర్ వన్ బ్రాండ్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికతో చైనా మొబైల్ బ్రాండ్స్ గూబగుయ్యిమంది. 2021 నాలుగో క్వార్టర్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో చైనాలో లీడిండ్ మొబైల్ ఫోన్ బ్రాండ్లుగా ఉన్న హువావే, జెడ్‌టీఈ, షావోమి కంపెనీలను వెనక్కి నెట్టి యాపిల్ బ్రాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. స్ట్రాటజీ చైనాలో ఎక్కువగా అమ్ముడవుతూ వస్తోన్న మోడల్ యాపిల్ 6. ఈ మోడల్ లాంచ్ ఐనప్పటి నుంచి చైనీయులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే మార్కెట్ లీడర్ అయ్యే స్థాయిలో అమ్మకాలు ఉండటం లేదు. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న చైనాలో పట్టు సాధించేందుకు యాపిల్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేసింది. 2021 సెప్టెంబరులో విడుదలైన ఐఫోన్ 13 మోడల్ బేసిక్ ధర తక్కువగా ఉండేట్టుగా జాగ్రత్త పడింది. అంతే అటు ఐఫోన్ 6,. ఇటు ఐఫోన్ 13 అమ్మకాల్లో దుమ్మురేపాయి. ఫలితంగా చైనా బ్రాండ్లను వెనక్కి నెట్టి 23 శాతం మార్కెట్ వాటాతో నంబర్‌గా యాపిల్ నిలిచింది. తగ్గుతున్న మార్కెట్ తాజాగా వెలువుడుతున్న గణాంకాలు చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో స్థఙరంగా క్షీణత నమోదు అవుతున్నట్టుగా తెలుపుతున్నాయి. కొత్తగా వస్తున్న మొబైల్ ఫోన్లకు పాత మొబైల్ ఫోన్లకు ఫీచర్ల పరంగా పెద్దగా తేడా ఉండటం లేదు. దీంతో ఫోన్లు మార్చేందుకు అక్కడి ప్రజలు ఇష్టపడం లేదు. తాజా నివేదిక ప్రకారం గతేడాదితో పోల్చితే చైనాలో మొబైల్ ఫోన్ అమ్మకాలు 9 శాతం పడిపోగా క్వార్ట్ర్ 4లో 2 శాతం తగ్గాయి. గత నాలుగేళ్లుగా ఇదే తరహా ట్రెండ్ అక్కడ నమోదు అవుతూ వస్తోంది. చదవండి: చైనా సర్క్యూట్ బ్రేకర్ పాలసీ.. కుక్కకాటుకి చెప్పు దెబ్బగా అమెరికా రిప్లై -
రూ.15వేలకంటే తక్కువ ధరతో..అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ స్మార్ట్ ఫోన్!
Realme 9 Pro to launch in India Soon: కొత్త ఏడాది ప్రారంభంతో టెక్ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో, తక్కువ బడ్జెట్‌తో 5జీ స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ' త్వరలో రియల్మీ 9 ప్రో, రియల్మీ 9 ప్రో ప్లస్ పేరుతో 5జీ స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే ఈ రెండు ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలు వెలుగులోకి రానప్పటికీ.. లీకైన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్‌లీక్స్ రిపోర్ట్ ప్రకారం.. రియల్ మీ 9ప్రో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదల కానుంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే హోల్ పంచ్ డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో 6.59 అంగుళాల డిస్ప్లే, 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్‌తో రెండు స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్లు ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. మరోవైపు రియల్9 ప్రో ప్లస్ ఇలాంటి ఫీచర్లే ఉండగా..ఇందులో 65డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుందని నివేదికల్లో తేలింది. బడ్జెట్ ధరలో కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది. జనవరి 22న అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64బీజీ స్టోరేజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.13,999గా ఉండనుంది. -
ఇండియన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో!
స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే గడిచిన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ 9ఐ'ని మార్కెట్‌కి పరిచయం చేయనుంది. జనవరి 18న రియల్ మీ' ఇండియాలో నిర్వహిస్తున్న ఈవెంట్లో రియల్ మీ 9ఐ ఫోన్ తో పాటు స్పెసిఫికేషన్ల గురించి ప్రకటన చేయనుంది. ఈ వారం వియాత్నంలో జరిగిన ఈవెంట్లో రియల్ మీ సంస్థ 'రియల్ మీ 9ఐ' విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధరతో పాటు ఫీచర్లు లీకయ్యాయి. అయితే ఇప్పుడు మనం లీకైన ఆ ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు దాని ధరెంతో తెలుసుకుందాం. రియల్ మీ 9ఐ స్పెసిఫికేషన్స్ రియల్ మీ 9ఐ 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఎల్సీడీ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ పంచ్హోల్తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ,పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్, పిక్సెల్ డెన్సిటీ 401పీపీఐ, పంచ్ హోల్‌తో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680, మోడెస్ట్ 4జీ ప్రాసెసర్. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంట్నల్ స్టోరేజ్‌తో పాటు గరిష్టంగా 1టీబీ మైక్రో ఎస్ కార్డ్‌తో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. మెమరీ కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్‌ను అందిస్తుంది. రియల్ మీ 9ఐ ఫోన్ వెనుక 50 మెగా ఫిక్సెల్తో మూడు కెమెరాలు, 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 గాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ పోర్ట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లు ఉన్నాయి. భారతదేశంలో రియల్ 9ఐ ఫోన్ ధర వియాత్నంలో రియల్ 9ఐ ఫోన్ ధర రూ.20,500 ఉండగా, భారత్‌లో ఈ వేరియంట్ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫోన్ ధర భారత్‌లో ఎంతుందో తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: డీఎస్ఎల్ఆర్ కెమెరా కాస్ట్ ఎంతైనా..ఫోన్లోని ఈ ఫీచర్ ముందు దిగదుడుపే! -
OnePlus 10 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన వన్‌ప్లస్ సూపర్ స్మార్ట్‌ఫోన్..!
యాపిల్, శామ్ సంగ్ మొబైల్స్ తర్వాత అంత క్రేజ్ వన్‌ప్లస్ మొబైల్స్‌కి ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్మడు పోతాయి. అయితే, తాజాగా వన్‌ప్లస్ మరో కొత్త మొబైల్‌ని చైనా మార్కెట్లో మొదట విడుదల చేసింది. ఈ వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా వచ్చిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ వస్తుంది. ఈ మొబైల్ 120హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లేతో రానున్నట్లు కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ 10 ప్రో 80డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో వస్తుంది. కొత్త వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ మొబైల్ కూడా హైపర్ బూస్ట్ టెక్నాలజీతో రానున్నట్లు తెలిపింది. వన్‌ప్లస్ 10 ప్రో ధర: వన్ ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను సిఎన్‌వై 4,699 (సుమారు రూ. 54,500)కు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 4,999(సుమారు రూ. 58,000)కు లభిస్తే, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 5,299 (సుమారు రూ. 61,500)కు లభిస్తుంది. ఇది చైనాలో జనవరి 13 నుంచి సేల్ కోసం అందుబాటులోకి రాలేదు. అయితే, ఈ వన్‌ప్లస్ 10 ప్రోను ప్రపంచ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొని వస్తారు అనే విషయం పేర్కొనలేదు. వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్: 6.7 అంగుళాల క్యూహెచ్ డి+ (1,440ఎక్స్3,216 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ గల కలర్ ఓఎస్ 12.1 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ 12 జీబీ ఎల్పిడిడిఆర్ 5 ర్యామ్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615 ఫ్రంట్ కెమెరా 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ సపోర్ట్ 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ (చదవండి: హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే..?) -
స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్..కొత్త ఏడాది ప్రారంభంలోనే లాంచింగ్..అదిరిపోయే డిజైన్లతో!
న్యూ ఇయర్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేయనున్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో న్యూఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను సరికొత్త హంగులతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. తాగాజా స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ 'వన్ ప్లస్ 10ప్రో' పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవ్వగా..ఆఫోన్కు సంబంధించి ఫీచర్లు లీకయ్యాయి. అంతేకాదు కొత్త ఏడాదిలో ఎప్పుడు మార్కెట్‌కి పరిచయం చేస్తున్నారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు వన్ ప్లస్ ప్రతినిధులు. OnePlus 10 Pro from all angles launching on January 11, 2022 in China.#OnePlus #Oppo pic.twitter.com/FFFWq97ZQ9 — Abhishek Yadav (@yabhishekhd) December 30, 2021 అఫీషియల్‌గా చైనా సోషల్ మీడియా 'వైబో' కథనం ప్రకారం.. వన్‌ప్లస్ అఫీషియల్‌గా జనవరి 11,2022న చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తొలుత అక్కడ విడుదల చేసిన తరువాత వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనుంది. 'వన్ ప్లస్ 10ప్రో' స్పెసిఫికేషన్లు చైనాలో విడుదలైన వన్ ప్లస్ 10ప్రో వీడియో ప్రకారం.. స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్ 50ఎంపీ మెయిర్ రేర్ కెమెరా 6.7 కర్వుడ్ ఎల్టీపీఓ 2.0 అమోలెడ్ డిస్ప్లే 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ బ్యాటరీ కెపాసిటీ 5,000ఎంఏహెచ్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ చదవండి: కొత్త ఏడాదిలో ‘స్మార్ట్’గా ఫోన్ల అమ్మకాలు -
మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేశాడు.. రూ.18 లక్షలు కొట్టేశాడు!
Chinese Man To Unlock His Girl Friend Phone: స్మార్ట్ ఫోన్లు రావడంతో ఫోన్‌ని కొట్టేసినా లాక్ ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు. పైగా చాలా మంది తమ ఫోన్‌కి లాక్‌గా ముఖాన్ని గానీ లేదా ఫింగర్ ప్రింట్‌ని గాని ఉపయోగిస్తున్నారు. దీంతో దొంగలు కూడా టెక్నాలజీకి అనుగుణంగా కొత్త తరహాలోనే దొంగతనలు చేస్తున్నారు. అచ్చం అలానే చైనాలో ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని మోసం చేశాడు. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) అసలు విషయంలోకెళ్లితే...చైనాలో నానింగ్కు చెందిన 28 ఏళ్ల హువాంగ్ తన మాజీ ప్రియురాలు డాంగ్ నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్‌ని అన్‌లాక్ చేసి మరీ రూ.18 లక్షలు డబ్బులు కొట్టేశాడు. పైగా డాంగ్ ఫోన్‌ని యాక్సెస్ చేసేందుకు నిదురుపోతున్న ఆమెకు తarయకుండా ఆమె కనురెప్పలు ఎత్తి మరి ఫోన్లాక్ ఓపెన్ చేశాడు.. ఆ తర్వాత ఆమె ఫింగర్ ఫ్రింట్ల సాయంతో ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ. 18 లక్షలు వరకు కొట్టేశాడు. ఆపై ఆమె ఫోన్‌కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా కొన్ని నెలలు తర్వాత హువాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే హువాండ్ ఈ నేరాన్ని డాంగ్ భోజనం చేసి మందులు వేసుకుని నిద్రపోతున్నప్పుడు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత కోర్టు అతనికి రూ. 2లక్షలు జరిమానా తోపాటు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. (చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర) -
అదిరే ఫీచర్లతో 5జీ ఫోన్, చేతులు కలిపిన జియో - షావోమీ
Xiaomi partnership with Jio for 5G phone: ఇండియన్ మార్కెట్లో సత్తా చాటుతున్న చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుదలైన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో షావోమీ సంస్థ 22 శాతం షిప్‌మెంట్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఆ స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. నవంబర్ 30న షావోమీ రెడ్ మీ నోట్ 11 సిరీస్‌ను రీబ్రాండ్ చేస్తూ..భారత్‌లో రెడ్ మీ నోట్ 11 టీ 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫోన్ విడుదల నేపథ్యంలో..ఆ ఫోన్ పనితీరును గుర్తించేందుకు షావోమీ..,జియోతో చేతులు కలిపింది. రెడ్ మీ నోట్ 11టీ 5తో పాటు భవిష్యత్‌లో విడుదల కానున్న రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ల పనితీరు, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా' అనే విషయాల్ని గుర్తించేందుకు రిలయన్స్ జియో ఆధ్వర్యంలో 5జీ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వివిధ సెన్సార్ల ద్వారా ట్రయల్స్ నిర్వహించి 5జీ యూజర్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే అంశాన్ని గుర్తిస్తారు. రెడ్మీ నోట్ 11టీ ఫీచర్లు రెడ్ మీ నోట్ 11తరహాలో రెడ్ మీ నోట్ 11టీ మీడియా టెక్ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్ మీ 8ఎస్ కాన్ఫిగరేషన్ల లాగే 6జీబీ ర్యామ్ 128జీబీ, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్ ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్లపై షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్మీ నోట్ 11 రీ బాండ్రే ఈ రెడ్మీ నోట్ 11టీ స్మార్ట్ ఫోన్ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్డిస్ప్లే, స్పీడ్ ఛార్జింగ్, ర్యామ్ బూస్టర్ వంటి ఫీచర్లు ఉన్న నెక్ట్స్ జెనరేషన్ రేసర్ ఫోన్ అని తెలిపింది. చదవండి: షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది -
ప్రపంచంలోనే ఇదే తొలి స్మార్ట్ ఫోన్.. 18 జీబీ ర్యామ్.. వన్ టెరాబైట్ స్టోరేజీ
Axon 30. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్ 18జీబీ ర్యామ్ 1టెరాబైట్ ఇంటర్నల్ స్టోరేజ్ విడుదల కానుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ జెడ్‌టీఈ సంస్థ జెడ్‌టీఈ ఆక్సాన్ 30 సిరీస్ ఫోన్ లను నవంబర్ 25న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ విడుదల కోసం వినియోగదారులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఈ ఫోన్ ఐ అండ్ ఫీచర్లతో విడుదల కావడమే. జెడ్‌టీఈ ఆక్సాన్ 30 సిరీస్ ఫీచర్లు చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వైబో(Weibo) కథనం ప్రకారం..ప్రపంచంలోనే తొలిసారి జెడ్‌టీఈ సంస్థ 18జీబీ ర్యామ్, 1టెరా బైట్ ఇంటర్నల్ స్టోరేజ్ తో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ ఫోన్‌ను 2జీబీ నుంచి 18జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీంతో పాటు టాప్ నాచ్ కాన్ఫిగరేషన్ ఫీచర్ల ఉన్నాయని వైబో తన పోస్ట్‌లో పేర్కొంది. ఆక్సాన్ 30 అల్ట్రా స్పేస్ ఎడిషన్ తక్కువ పరిమాణంతో (quantity) అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఫోన్ ధర ఇంకా వెల్లడించలేదు, లాంచ్ సమయంలో మాత్రమే తెలుస్తుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే,1080 x 2400 హెచ్డీ పిక్సెల్స్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888,ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎస్ఎస్ 3.1 స్టోరేజ్, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు,వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ స్నాపర్‌ను ప్యాక్, 66డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 4,600ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 120-డిగ్రీల ఎఫ్ఓవీతో 64 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ వంటి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. ధర ఎంత అనేది జెడ్‌టీఈ సంస్థ స్పష్టం చేయలేదు. -
మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు సూపర్, ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ క్యూ3టీ'ని మార్కెట్‌కి పరిచయం చేసింది. త్వరలో ఇండియాలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రియల్ మీ క్యూ3టీ ఫీచర్లు మార్కెట్లో విడుదలైన రియల్ మీ క్యూ3టీ సిరీస్ ఫోన్లు హ్యాండ్సెట్ నెబ్యులా, నైట్ స్కై బ్లూ కలర్స్‌తో అందుబాటులోకి రానుంది. 6.6 అంగుళాల పొడవు, పూర్తి హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ,(1,080x2,412 పిక్సెల్‌లు) 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. ఆండ్రాయి11 వెర్షన్ కు సపోర్ట్ చేస్తున్న ఈఫోన్లోతాజా క్యూ3 సిరీస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు, వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను అందిస్తుంది. 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలైంది. రియల్ మీ క్యూ3టీ ధర 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ధర చైనాలో సీఎన్‌వై2,099 (భారత కరెన్సీలో దాదాపూ రూ. 24,300)గా నిర్ణయించబడింది. నైట్ బ్లూ,నైట్ స్కై బ్లూ కలర్స్‌తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో విడుదల చేయాలని రియల్ మీ ప్రతినిధులు భావిస్తున్నారు. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..! -
యువకుడి జీన్స్ ఫ్యాంట్లో స్మార్ట్ ఫోన్.. టపాసుల్లా పేలింది..!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'వన్‌ప్లస్' కు చెందిన ఛార్జర్లు, ఫోన్లు టపాసుల్లా పేలుతున్నాయి. ఇప్పటికే పలువురు వన్ ప్లస్‌కు చెందిన తమ ఫోన్లు బ్లాస్ట్ అయ్యాయని, తగిన న్యాయం చేయాలని కోరుతూ కోర్ట్ మెట్లెక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరో వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుడి జీన్స్ ఫ్యాంట్ జేబులో ఉన్న వన్ ప్లస్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Hi Suhit. Please connect with us over DM so we can look into your claim. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) November 3, 2021 నవంబర్ 3న ట్విట్టర్ యూజర్ సుహిత్ శర్మ(suhit sharama) అనే యూజర్ వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ నార్డ్ 2 బ్లాస్ట్ అయ్యిందంటూ తీవ్రంగా గాయపడ్డ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేశారు. అంతేకాదు @OnePlus_IN మీ నుండి ఇది ఎప్పుడూ ఊహించలేదు. #OnePlusNord2Blast మీ ఫోన్ ఏం చేసిందో చూడండి అంటూ జీన్స్ ఫ్యాంట్లో ఫోన్ పేలిన ఇమేజెస్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈఘటనలో వన్ ప్లస్ యాజమాన్యం తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయండి. త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. సుహిత్ శర్మ ట్వీట్లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంత మంది యూజర్లు ఇప్పుడే తాము వన్ ప్లస్‌కు చెందిన ఫోన్లను బుక్ చేసుకున్నాం. వాటిని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తామని రీట్వీట్లు పెడుతున్నారు. Just order today now going to cancel Shame @OnePlus_IN pic.twitter.com/JDvdVVuAdK — KJ (@KJ_P00) November 8, 2021 అయితే ఆ ట్వీట్లపై ఇండియా వన్ ప్లస్ యాజమాన్యం స్పందించింది. ఇలాంటి సమస్య ఎదుర్కొన్నందుకు క్షమించండి. బాధితుడికి అండగా ఉంటాం.డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. పరిశీలించి, తగిన సాయం చేస్తాం' అంటూ ట్వీట్ చేసింది. Hi Akshay! We are sorry you had such an issue. We strive to provide the best experience for you, please initiate a direct message so that we can check and assist you further. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) November 8, 2021 చదవండి: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్ -
ఈ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా, అదిరిపోయే ఫీచర్లతో
దసరా,దివాళీ సేల్స్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేసిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో...తాజాగా మరో సిరీస్ ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వరుస సిరీస్ విడుదలతో దూకుడు మీదున్న వివో సంస్థ ఇప్పటుడు'వీ23ఈ' పేరుతో మరో సిరీస్‌ను విడుదల చేయనుంది. త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానున్న సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. వివో వీ23ఈ ఫీచర్లు వివో వీ23ఈ సిరీస్ ఫోన్ ఫీచర్లపై టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్లో మీడియా టెక్ హీలియా జీ96 చిప్ సెట్, 4,050ఎంఏహెచ్ బ్యాటరీ, రెక్టాంగిల్ కెమెరా మాడ్యుల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్-సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 వెర్షన్ బేస్డ్ ఫన్ టచ్ 12తో రన్ అవుతుంది. 6.44-అంగుళాల, 2,400x1,080 పిక్సెట్స్, ఆమోలెడ్ డిస్ప్లే, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం వివో 64 మెగాపిక్సె మెయిన్ సెన్సార్లతో ట్రిపుల్ రేర్ కెమెరా, కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ 3వ స్నాపర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. టిప్‌స్టర్ ప్రకారం..వివో వీ23ఈ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,050mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. హ్యాండ్సెట్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆన్‌బోర్డ్ సెన్సార్లు గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, టెలస్కోప్ ఫీచర్లతో పాటు కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సదుపాయంతో అందుబాటులో రానున్నట్లు లీకైన రిపోర్ట్లలో తెలుస్తోంది. చదవండి: దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు -
అదరగొట్టే స్మార్ట్ ఫోన్.. ఆకట్టుకునే ఫీచర్లు
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో వరుసగా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరల్లో ఆఫోన్లు లభ్యం కావడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తాజాగా వివో 'వై71టీ' సిరీస్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ముందుగా ఈఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులో ఉండగా..త్వరలో భారత్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వివోవై71టీ స్పెసిఫికేషన్స్ వివోవై71టీ 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.44అంగుళాల (1,080*2, 2,400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ప్లే, 20.9 యాస్పెట్ రేషియో అండ్ 90.1పర్సెంట్ స్క్రీన్ టూ బాడీ రేషియో,ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810ఎస్ఓఎస్, జీ57జీపీయూ, ఎల్డీఆర్ఆర్4 ర్యామ్‌తో 8జీబీని అందిస్తుంది. వర్చువల్ వర్క్‌తో పాటు మల్టీటాస్క్ వర్క్ కోసం 4జీబీని అదనంగా వినియోగించుకోవచ్చు. ఇక ఫోటోస్, వీడియోస్ కోసం డ్యూయల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్/1.79లెన్స్‌తో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,ఎఫ్/2.2 ఆల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 16మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ముందు భాగంలో ఎఫ్/2.0లెన్స్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. వివో వై71టీ యూఎఫ్ఎస్ 2.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో 256వరకు జీబీ, కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ వివోఎల్టీఈ,వైఫై, బ్లూటూత్ బీ 5.1, జీపీఎస్/ఏ-జీవీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యాంబీనెట్ లైట్, గ్రైస్కోప్, మ్యాగ్నెటోమీటర్,ప్రోక్సిమిటీ సెన్సార్ తో పాటు డిస్ప్లేలో ఫింగర్ ఫ్రింట్ సెన్సార్లు ఉన్నాయి. వివో వై 71టీ ధర వివో వై 71టీ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.21,000 ఉంది. 8జీబీ ప్లస్ 256జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.23,400 ఉండనుంది. మిరేజ్, మిడ్ నైట్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభం కాగా మిగిలిన దేశాల్లో ఆఫోన్ ధర ఎంత ఉంటాయనేది వివో ప్రకటన చేయాల్సి ఉంది. చదవండి: Xiaomi: షావోమి దూకుడు, ఫాస్ట్ డేటా షేరింగ్ కోసం.. -
మార్కెట్లో అదిరిపోయే ఫీచర్స్‌తో బడ్జెట్ ఫోన్..ఓ లుక్కేయండి!
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో 'వై3ఎస్' పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ మిగిలిన బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వివో వై3ఎస్ ఫీచర్లు, ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.10వేలు, అంతకాన్న ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్ల లో వివో వై3ఎస్ నిలిచింది. రూ.9,490 ఉన్న ఈ ఫోన్లో 6.51 అంగుళాల హెచ్డీ 1600*720 పిక్సెల్స్‌తో ఎల్సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 గ్రో ఎడిషన్ + ఫన్‌టచ్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే, సెల్ఫీ కెమెరాకు వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ కూడా ఉంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉన్న ఈ ఫోన్ 19 గంటల పాటు ఆన్లైన్ హెచ్డీ మూవీ చూడొచ్చని, 8 గంటలు గేమ్స్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది. వీటితో పాటు ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ 2.0 పోర్ట్, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్ స్టారీ బ్లూ, మింట్ గ్రీన్, పెరల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉందని వివో ప్రతినిధులు తెలిపారు. ఒక్కవేరియంట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 2జీబీ ర్యామ్ అండ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, పేటీఎం, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే.. -
హానర్ కొత్త ఫోన్ ‘30ఎస్’
బీజింగ్: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ సంస్థ తన 30 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 30ఎస్ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యధునిక ఫీచర్లు పొందుపరిచారు. కిరిన్ 820 ప్రాసెసర్ 5జీ చిప్సెట్ కలిగిన మొదటి హానర్ ఫోన్ ఇదే. 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ+ఐపీఎస్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్లో నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్పీ కెమెరా ఒకటే ఉంది. 8జీబీ, 128 జీబీ, 8జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ను చైనాలో ప్రీఆర్డర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7న నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. నలుపు, ఆకుపచ్చ, తెలుగు రంగుల్లో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్ హువాయ్ మొబైల్ సర్వీసెస్(హెచ్ఎంఎస్)పై ఆధారపడుతుంది. ఇందులో గూగుల్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ప్లేస్టోర్ యాప్ ఉండదు. 30 ఎస్ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డి, ఫుల్‌వ్యూ డిస్ప్లే కిరిన్ 820 చిప్సెట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 64+8+8+8 ఎంపీ కెమెరాలు 16 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 25,500 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000 -
రుణాల విభాగంలోకి రియల్మీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాలోని షెన్జెన్ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్మీ... డిజిటల్ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రూ.లక్ష వరకు రుణాన్ని 5 నిమిషాల్లో మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ఎంఐ క్రెడిట్ పేరిట డిజిటల్ లెండింగ్లోకి ప్రవేశించడం తెలిసిందే. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 14.3 శాతం వాటా.. గతేడాది మేలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రియల్మీ ప్రవేశించింది. ప్రస్తుతం మన దేశంతో పాటూ చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి 20 దేశాల్లో ఉంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మీకి 14.3 శాతం మార్కెట్ వాటా ఉంది. -
లెనవూ వాయిస్ టాబ్లెట్ ఏ8-50...
ఎనిమిది అంగుళాల స్క్రీన్ సైజుతో చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లెనవూ తాజాగా ఓ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఓ మోస్తరు ఫీచర్లతో మాత్రమే వస్తున్న ఈ సరికొత్త టాబ్లెట్ ధర మాత్రం రూ.17,999గా నిర్ణయించారు. సాధారణంగా టాబ్లెట్ స్క్రీన్ సైజు ఏడు, 9 అంగుళాలు ఉంటే ఇది ఈ రెండింటికీ మధ్యస్థంగా 8 అంగుళాలు ఉంది. ప్రాసెసర్ వేగం కూడా 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్. ర్యామ్ ఒక జీబీ ఉండగా ప్రధాన మెమరీ 16 జీబీ వరకూ ఉంది. మైక్రోఎస్డీకార్డు ద్వారా మరో 32 జీబీల మెమరీని యాడ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ కాబట్టి... రీఛార్జిల మధ్య ఎక్కువ సమయం ఉంటుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ త్వరలోనే ఉచితంగా కిట్‌క్యాట్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేస్తామని కంపెనీ చెబుతోంది. లెనవూ ఏ8-50లో 5 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.