
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాలోని షెన్‌జెన్ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ... డిజిటల్ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రూ.లక్ష వరకు రుణాన్ని 5 నిమిషాల్లో మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ఎంఐ క్రెడిట్ పేరిట డిజిటల్ లెండింగ్‌లోకి ప్రవేశించడం తెలిసిందే.
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 14.3 శాతం వాటా..
గతేడాది మేలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రియల్‌మీ ప్రవేశించింది. ప్రస్తుతం మన దేశంతో పాటూ చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి 20 దేశాల్లో ఉంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మీకి 14.3 శాతం మార్కెట్ వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment