loan services sector
-
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్ వన్!
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చర్చి జరిగింది. సభలోని ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మార్చి 31,2022 నాటికి మనదేశంలో సుమారు 50 మంది బ్యాంకులకు రూ.92,570 కోట్లు బాకీ పడినట్లు తెలిపారు. వారిలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కంపెనీ నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం రూ.7,848 కోట్లని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన రిపోర్ట్ ఆధారంగా కరాద్ బ్యాంకు రుణాలు ఎవరు? ఎంతంత? రుణ ఎగవేతకు పాల్పడ్డారో స్పష్టం చేశారు.రుణ ఎగవేత దారుల్లో ఛోక్సీ తర్వాత ఎరా ఇన్ఫ్రా (రూ.5879 కోట్లు),రేగో ఆగ్రో (రూ.4803), కాస్ట్ స్టీల్ అండ్ పవర్ (రూ.4,596 కోట్లు), ఎబిజి షిప్‌యార్డ్ (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ (రూ.2,893కోట్లు),విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ (రూ.2,931కోట్లు), రోటోమాక్ గ్లోబల్ (రూ.2,893 కోట్లు), కోస్టల్ ప్రాజెక్ట్ రూ.2,311కోట్లు, జూమ్ డెవలపర్లు (రూ.2,147 కోట్లు) జాబితాలో ఉన్నట్లు తెలిపారు. తగ్గిన ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు లేదా నాన్ ఫర్మామెన్స్ అసెట్స్ (NPA)రూ.8.9లక్షల కోట్లుకు చేరాయి. అయితే మొండి బకాయిల్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేయడంతో అవికాస్త రూ.3లక్షల కోట్లు తగ్గాయి. రైట్ - ఆఫ్‌లో ఎస్బీఐ అగ్రస్థానం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొండి బకాయిల్ని రైట్ ఆఫ్ చేయడంలో రూ.2లక్షల కోట్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.67,214 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఉన్నాయి.ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50,514 కోట్లు,హెచ్డీఎఫ్సీ రూ.34,517కోట్లు ఉన్నాయని కరాద్ పార్లమెంట్లో రుణాల ఎగవేతపై మాట్లాడారు. ఈ సందర్భంగా రుణ ఎగవేత దారులపై చర్యలు తీసుకునేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మెహుల్ చోక్సీపై మూడు కొత్త ఎఫ్ఐఆర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మెహుల్ చోక్సీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత వారం మూడు కొత్త ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని మూడు సభ్య బ్యాంకుల కన్సార్టియంకు చోక్సీ మరియు ఇతరులు ₹ 375.71 కోట్ల తప్పుడు నష్టం కలిగించారని ఈ తాజా ఎఫ్ఐఆర్లో మూడవది ఆరోపించింది . వీల్ చైర్లో కోర్టుకు కాగా,పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గతేడాది కరేబియన్ దేశం డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని పిటిషన్‌ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. చివరిగా ::::: రైట్ - ఆఫ్ అంటే ఏమిటి? ప్రతి ఏడాది ఆర్ధిక సంవత్సరం(మార్చి ముగిసే) నాటికి అన్నీ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లను బహిరంగంగా ప్రకటిస్తాయి. అంటే బ్యాంకుకు ఎంత లాభం వచ్చింది. నష్టం ఎంత వచ్చింది. మొండి బకాయిలు ఎంత ఉన్నాయని చెబుతాయి. అయితే ఆ సమయంలో బ్యాలెన్స్ షీట్లో మొండి బకాయిలు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు సురేష్ అనే వ్యక్తి ఎక్స్ అనే బ్యాంకు నుంచి రూ.10వేల కోట్లు రుణం తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించకుండా ఎగవేతకు (మొండి బకాయిలు) పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఎక్స్ బ్యాంక్ యాజమాన్యం తనకు వచ్చిన లాభాల్ని మొడి బకాయిల స్థానంలో చూపిస్తారు. అంటే సురేష్ ఎగొట్టిన రూ.10వేల కోట్లు మనకు కనిపించవు. దీన్నే రైట్ - ఆఫ్ అని పిలుస్తారు. మొండి బకాయిలు అంటే ఏమిటి? బ్యాంకులు అనేక విధాలుగా లోన్లు ఇస్తూ ఉంటాయి.పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవి ఎగొట్టి కొందరు, బకాయిలు తీర్చే స్థోమత లేక కొందరు.ఇలా చాలామంది బ్యాంకులకు మోత మోగిస్తున్నారు.వీటినే మొండి బకాయిలు,నిరర్థక ఆస్తులు అంటారు.ఆర్ధిక పరిభాషలో వీటిని ఏన్పీఏ(non-performing assets)అని పిలుస్తారు. -
రూ.2.85 లక్షల కోట్లకు మైక్రో ఫైనాన్స్ రుణాలు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) రుణ పరిమాణం జూన్ త్రైమాసికం ముగిసే నాటికి రూ.2.85 లక్షల కోట్లని సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదిక ఒకటి తెలిపింది. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఈ మొత్తాలు స్వల్పంగా 0.2 శాతం తగ్గినట్లు ఈ క్రెడిట్ సమాచార సేవల సంస్థ వివరించింది. అయితే రుణ నాణ్యత పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► వార్షికంగా పోల్చితే (గత ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చితే) సూక్ష్మ రుణ పుస్తక విలువ 18 శాతం పెరిగింది. అప్పట్లో కోవిడ్–19 సెకండ్‌వేవ్ ఈ విభాగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ► జూన్ త్రైమాసికంలో రుణ పంపిణీ రూ.49,788 కోట్లు. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఇది 39.2% తక్కువ. అయితే గత ఏడాది ఇదే కా లంతో పోల్చితే మాత్రం 88.9 శాతం అధికం. ► జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి 90 రోజులకు పైగా ఉన్న రుణ బకాయిల విలువ మార్చి త్రైమాసికంతో పోల్చితే 0.5 శాతం తగ్గి 2.2 శాతంగా ఉంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ రేటు భారీగా 1.1 శాతం తగ్గింది. ► ఒక్కో ప్రత్యేక రుణగ్రహీత సగటు బ్యాలెన్స్ మార్చి త్రైమాసికంతో పోల్చితే 1.1 శాతం తగ్గి రూ. 46,400కి చేరింది. కాగా, ఒక్కో ఖాతా సగటు బ్యాలెన్స్ 2.1 శాతం క్షీణించింది. ► సూక్ష రుణ సంస్థల రుణాలు జూన్ త్రైమాసికంలో పట్టణాల్లో 0.8 శాతం క్షీణిస్తే, గ్రామీణ మార్కెట్లలో ఈ తగ్గుదల 0.2 శాతంగా ఉంది. ► దేశ వ్యాప్తంగా చూస్తే, జూన్ 2022 త్రైమాసిక మొత్తం రుణాల్లో తొలి 10 టాప్ మార్కెట్లు 84 శాతం వాటా కలిగి ఉన్నాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ అత్యధిక వృద్ధి గణాంకాలను నమోదు చేశాయి. ► పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాలు ఎంఎఫ్ఐ రుణాల విషయంలో చివరి వరుసలో ఉన్నాయి. ► ఇక సూక్ష్మ రుణాల విషయంలో బ్యాంకులు 35.6 శాతం పోర్ట్‌ఫోలియో వాటాతో (జూన్ త్రైమాసికంలో) మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి త్రైమాసికంతో పోల్చితే పోర్ట్‌ఫోలియోలో 5.6 శాతం క్షీణత నమోదయ్యింది. -
Illegal Loan Apps: దారుణానికి అడ్డుకట్ట!
అప్పులిస్తున్నామంటూ అమానవీయంగా ప్రవర్తిస్తున్న చట్టవిరుద్ధమైన డిజిటల్ యాప్‌లకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుందా? ఆర్థిక మంత్రి సారథ్యంలో గత వారం జరిగిన సమావేశం ఆ మేరకు ఆశలు రేపుతోంది. దేశంలో సాధారణ బ్యాంకింగ్ మార్గాలకు వెలుపల చట్టవిరుద్ధంగా నడుస్తున్న డిజిటల్ రుణ వేదికలపై మరిన్ని చర్యలకు కేంద్రం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నడుం బిగించాయి. చట్టబద్ధంగా రుణాలిచ్చే సవ్యమైన యాప్‌లతో జాబితాను సిద్ధం చేసే బాధ్యతను ఆర్బీఐకి అప్పగించారు. ఇక ఆ ‘శ్వేతజాబితా’లోని యాప్‌లే డౌన్లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ – ఐటీ శాఖ జాగ్రత్తలు తీసుకోనుంది. అందుకోసం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్ లాంటి వాటికీ, ఆర్బీఐకీ మధ్య సమన్వయం చేయనుంది. అలాగే, పేమెంట్ యాగ్రిగేటర్లు నిర్ణీత కాలవ్యవధి లోపల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. రిజిస్టర్ కాని వాటిని ఆ తర్వాత అనుమతించరాదనేది తాజా నిర్ణయం. వేల కుటుంబాలు కూలిపోవడానికి కారణమైన లోన్ యాప్‌లపై వేటుకు ఇవి తొలి అడుగులుగా భావించవచ్చు. దేశంలోని వేగవంతమైన డిజిటలీకరణ, మారుమూలలకు సైతం వ్యాపించిన మొబైల్ సర్వీసు లకు విపరిణామం ఈ లోన్ యాప్‌ల తంటా. అవసరంలో ఉన్న అల్పాదాయ, మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకొని అప్పులు, సూక్ష్మ రుణాలు ఇచ్చే అక్రమ యాప్‌ల దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల సాంకేతిక నిరక్షరాస్యత వాటికి వాటంగా మారింది. అత్యధిక వడ్డీ రేట్లు, పైకి కనిపించని రుసుములు, బాకీ వసూళ్ళ పేరిట బ్లాక్‌మెయిలింగ్‌లకు ఇవి పేరుమోశాయి. అడ్డూ అదుపూ లేని ఈ డిజిటల్ రుణ యాప్‌లలో అత్యధికం చైనావే. ఇవి తక్షణ రుణాలు ఇస్తామంటూ లక్షలాది వినియోగ దార్లను వలలో వేసుకుంటున్నాయి. అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కస్టమర్లు తీసుకున్న రుణా లపై వడ్డీలకు వడ్డీలు వేస్తూ, వాటి వసూలుకై రాక్షసరూపం దాలుస్తున్నాయి. ఈ డిజిటల్ యాప్‌ల రుణ వసూలు ఏజెంట్ల ముందు అలనాటి నక్షత్రకులు సైతం దిగదిడుపే. అప్పు తీసుకొనేందుకు సదరు యాప్‌లకు ఫోన్లోని నంబర్లు, ఫోటోలను అందుబాటులోకి తేవడం కొంపముంచుతోంది. వెంటాడి, వేధించే వారి మాటలు, చేష్టలు, అసభ్య మెసేజ్‌లు, మహిళల మార్ఫింగ్ ఫోటోలతో చివరకు పరువు పోయిందనే వేదనతో దేశవ్యాప్తంగా వందల మంది ప్రాణాలు తీసుకున్నారు. డిజిటల్ రుణ యాప్‌లపై 2020 జనవరి నుంచి గత ఏడాది మార్చి వరకు రెండున్నర వేలకు పైగా ఫిర్యాదులు ఆర్బీఐకి అందాయి. దరిమిలా పరిశీలనలో రిజిస్టర్ కాని లోన్ యాప్‌లు దాదాపు 600కు పైగానే గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంపై రేగిన రచ్చతో గూగుల్ సైతం చర్యలు చేపట్టక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి తమ ప్లే స్టోర్‌లో 2 వేలకు పైగా వ్యక్తిగత రుణాల యాప్‌లను తొలగించినట్టు గత నెలలో ఆ సంస్థ ప్రకటించింది. అంటే, వ్యక్తిగత రుణ విభాగంలోని మొత్తం యాప్‌లలో దాదాపు సగానికి పైచిలుకు గూగుల్ తొలగించిందన్న మాట. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యాప్ ఆధారిత తక్షణ రుణాల్లో అవకతవకలు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికీ వచ్చాయి. అందుకే ఇటీవల బెంగళూరులోని రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ తదితర ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేల కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. లోన్‌యాప్‌లతో పైకి కనిపించని ప్రమాదాలెన్నో! వీటి కార్యకలాపాలతో అక్రమ నగదు తర లింపు, పన్నుల ఎగవేతకు వీలుంది. వ్యక్తిగత డేటా చౌర్యం, డొల్ల కంపెనీలు, కార్యకలాపాలు ఆపే సిన బ్యాకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీల) దుర్వినియోగం విచ్చలవిడిగా సాగే ముప్పుంది. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. నిజానికి, నియంత్రణ లేని ఈ యాప్‌ల బారి నుంచి సామాన్య ప్రజలను కాపాడాలంటే, వాటిని నిషేధిస్తూ కేంద్రం ఓ చట్టం తేవాలని ఆర్బీఐ ఇటీవల సిఫార్సు చేసింది. చట్టపరమైన అనుమతులున్న, ఆర్బీఐ నియంత్రణలోని సంస్థలే అప్పులివ్వాలని నెల రోజుల క్రితం ఆగస్ట్ 10న నియంత్రణ చట్రాన్ని నిర్దేశించింది. అలాగే, డిజిటల్ రుణాలను నేరుగా రుణగ్రహీతల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలనీ, మూడోవ్యక్తి ద్వారా కానే కాదనీ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో చట్టవిరుద్ధమైన రుణ తిమింగలాలను యాప్ స్టోర్లలో అనుమతించనంత మాత్రాన అంతా మారిపోతుందనుకోలేం. యాప్‌లను పక్కదోవన లోడ్ చేసేలా లొసుగులున్నాయి. యాప్ స్టోర్లతో పని లేకుండా నేరుగా లింక్ పంపి, దాన్ని నొక్కితే సరిపోయే వీలుంది. అందుకే, కస్ట మర్లు, బ్యాంక్ ఉద్యోగులు, చట్టాన్ని పరిరక్షించే విభాగాల దాకా అందరికీ సైబర్ వ్యవహారాలపై చైతన్యం కలిగించడం ముఖ్యం. చట్టవిరుద్ధంగా చెలరేగిపోతున్న యాప్‌లకు ముకుతాడు వేసేలా సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థలు తగు చర్యలు చేపట్టాలి. ఆర్థిక మోసాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పరిష్కార కేంద్రం పెట్టడం లాంటివీ యోచించాలి. ఫిన్‌టెక్ సంస్థలు సైతం తమ వ్యాపార నమూనాలను సమీక్షించుకొని, పారదర్శక విధానం వైపు సాగాలి. కట్టాల్సివచ్చే రుసుములు వగైరా ముందే స్పష్టం చేయాలి. దాని వల్ల తెలుసుకొని మరీ కస్ట మర్లు నిర్ణయం తీసుకోగలుగుతారు. అదే సమయంలో పారదర్శకత వదిలేసి, ‘శ్వేత జాబితా’ పేరిట సంక్లిష్ట ప్రమాణాలను పెట్టి, న్యాయబద్ధమైన లోన్‌యాప్‌లను ఆర్బీఐ తొలగించకూడదు. సరైన పద్ధతులు అనుసరిస్తూనే, అనుమతించినా, నిరాకరించినా కారణాలూ పేర్కొనడం ముఖ్యం. అప్పుడే నిఖార్సయిన యాప్‌లకు చిక్కులు లేకుండా, దారుణ యాప్‌ల కథ కంచికి చేరుతుంది. -
అక్రమ రుణ యాప్‌లకు చెక్!
న్యూఢిల్లీ: డిజిటల్ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చట్టబద్ధంగా అనుమతులు పొందిన యాప్‌ల లిస్టును రిజర్వ్ బ్యాంక్ తయారు చేయనుండగా, అవి మాత్రమే యాప్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండేలా ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) జాగ్రత్తలు తీసుకోనుంది. వివిధ శాఖలు, ఆర్బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. వీటి ప్రకారం మనీ లాండరింగ్ కోసం ఉపయోగించేందుకు అద్దెపై తీసుకుని ఉండొచ్చని భావిస్తున్న ఖాతాలను ఆర్బీఐ పర్యవేక్షించనుంది. అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) దుర్వినియోగం కాకుండా నిద్రాణంగా ఉంటున్న సంస్థల లైసెన్సులను సమీక్షించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే నిర్దిష్ట కాలవ్యవధిలో పేమెంట్ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చూడటం, నమోదు చేసుకోని అగ్రిగేటర్లను కార్యకలాపాలు నిర్వహించనివ్వకపోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఇక ఇలాంటి యాప్‌లు విస్తరించకుండా డొల్ల కంపెనీలను గుర్తించి, వాటిని డీ–రిజిస్టర్ చేసే బాధ్యత కార్పొరేట్ వ్యవహారాల శాఖ తీసుకుంటుంది. అలాగే కస్టమర్లు, బ్యాంకు ఉద్యోగులు, చట్టాలు అమలు చేసే ఏజెన్సీలు, ఇతర వర్గాల్లోనూ సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ, ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ విభాగాల కార్యదర్శులు, ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రుణాల యాప్‌లు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలు, డేటా ఉల్లంఘన తదితర అంశాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. -
వేధించే లోన్ యాప్స్ ఔట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఆగడాలపై దేశవ్యాప్తంగా వేడివేడి చర్చ జరుగుతున్న వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఘాటుగా స్పందించింది. వినియోగదార్ల భద్రతా విధానాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తిగత రుణ యాప్‌లను ఆన్‌డ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. కస్టమర్లు, ప్రభుత్వ సంస్థలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వందలాది యాప్స్‌ను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఆన్‌డ్రాయిడ్ సెక్యూరిటీ, పైవసీ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ సుజాన్నే ఫ్రే ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు. కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడమేగాక, వసూలు చేసేందుకు యాప్స్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఎన్ని యాప్స్‌ను తొలగించారో గూగుల్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. గత 10 రోజుల్లో సుమారు 120 యాప్స్‌ను తీసివేసినట్టు సమాచారం. ఇలా ప్లే స్టోర్ నుంచి గుడ్‌బై చెప్పిన యాప్స్ సంఖ్య డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. నోటీసు లేకుండానే..: స్థానిక చట్టాలు, ఆర్బీఐ నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని నిరూపించాలని ఇతర గుర్తించిన యాప్ డెవలపర్లను గూగుల్ ఆదేశించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి పొందిన లైసెన్సు పత్రాలను తమ ముందు అయిదు రోజుల్లో ఉంచాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్‌కు లోబడే డెవలపర్లు పనిచేయాల్సి ఉంటుందని సంస్థ గుర్తు చేసింది. విఫలమైన యాప్స్‌ను ముందస్తు నోటీసు లేకుండానే తొలగిస్తామని హెచ్చరించింది. ఆన్లైన్ రుణ వేధింపుల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. డిజిటల్ రుణాల క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడానికి, నియంత్రణ చర్యలను సూచించడానికి ఒక బృందాన్ని నియమించినట్టు ఆర్బీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఫిన్‌టెక్ యాప్స్‌పై కన్నేసి ఉంచాలన్న ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో గూగుల్ తాజా చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక వివరాలు ఉండాల్సిందే..: వ్యక్తిగత రుణాలను అందిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్.. రుణాలను తిరిగి చెల్లించాల్సిన కనీస, గరిష్ట కాల పరిమితి, గరిష్ట వార్షిక వడ్డీ శాతం, మొత్తం లోన్‌కు అయ్యే ఖర్చు వంటి కీలక వివరాలను ముందస్తుగా వెల్లడించాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. తద్వారా నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుందని, మోసానికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. రుణం జారీ చేసిన తేదీ నుండి 60 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజుల్లో తిరిగి చెల్లించాల్సిన వ్యక్తిగత రుణ యాప్స్‌ను మాత్రమే గూగుల్ అనుమతిస్తుంది. డెవలపర్లు ప్రస్తుత సేవలను అమలు చేయడానికి అవసరమైన అనుమతులను మాత్రమే యూజర్ల నుంచి అభ్యర్థించాలి. వారు బహిర్గతం చేయని, అమలు చేయని, అనుమతించని ప్రయోజనాల కోసం వినియోగదారు లేదా వారి మొబైల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించరాదని హెచ్చరించింది. అనుమతి తీసుకోవాలి.. డెవలపర్లు వినియోగదారు అంగీకరించిన ప్రయోజనాల కోసం మాత్రమే డేటాను ఉపయోగించాలి. తరువాత వారు ఇతర ప్రయోజనాల కోసం డేటాను ఉపయోగించాలనుకుంటే, వారు అదనపు ఉపయోగాలకు వినియోగదారు అనుమతి పొందాలని గూగుల్ స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సహకరిస్తామని సంస్థ తెలిపింది. ‘గూగుల్ ఉత్పత్తుల ద్వారా సురక్షిత, భద్రమైన అనుభవాన్ని కస్టమర్లకు అందించడం మా ప్రాధాన్యం. మా గ్లోబల్ ప్రొడక్ట్ పాలసీలు ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి, అమలు చేయబడ్డాయి. వినియోగదార్ల భద్రతను పెంచడానికి మా పద్ధతులను మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము’ అని వివరించింది. -
రుణాల విభాగంలోకి రియల్మీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాలోని షెన్జెన్ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్మీ... డిజిటల్ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రూ.లక్ష వరకు రుణాన్ని 5 నిమిషాల్లో మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ఎంఐ క్రెడిట్ పేరిట డిజిటల్ లెండింగ్లోకి ప్రవేశించడం తెలిసిందే. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 14.3 శాతం వాటా.. గతేడాది మేలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రియల్మీ ప్రవేశించింది. ప్రస్తుతం మన దేశంతో పాటూ చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి 20 దేశాల్లో ఉంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మీకి 14.3 శాతం మార్కెట్ వాటా ఉంది. -
100 రోజుల్లో రూ.100 కోట్లు...
ఆక్సీలోన్స్ రుణ లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ సేవల రంగంలో ఉన్న ఆక్సీలోన్స్ 100 రోజుల్లో రూ.100 కోట్ల మేర రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా చేసుకుంది. మార్చి 1 నుంచి ఈ మొత్తాన్ని అందిస్తామని కంపెనీ ఫౌండర్ రాధాకృష్ణ తాటవర్తి శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రుణాల జారీకై రూ.130 కోట్లు సమీకరిస్తామన్నారు. రూ.250 కోట్లమేర రుణాల కోసం 270 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. రుణాలిచ్చేందుకు 80 మందికిపైగా ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఆన్లైన్ వేదికగా రుణదాతలు, కస్టమర్లను అనుసంధానించడమే ఆక్సీలోన్స్ పని. స్టార్టప్, ఎస్ఎంఈ, పర్సనల్, బిజినెస్ లోన్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.