100 రోజుల్లో రూ.100 కోట్లు... | Oxy Loans loan target 100crore in 100days | Sakshi
Sakshi News home page

100 రోజుల్లో రూ.100 కోట్లు...

Published Sat, Feb 25 2017 2:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

100 రోజుల్లో రూ.100 కోట్లు...

100 రోజుల్లో రూ.100 కోట్లు...

ఆక్సీలోన్స్‌ రుణ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణ సేవల రంగంలో ఉన్న ఆక్సీలోన్స్‌ 100 రోజుల్లో రూ.100 కోట్ల మేర రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా చేసుకుంది. మార్చి 1 నుంచి ఈ మొత్తాన్ని అందిస్తామని కంపెనీ ఫౌండర్‌ రాధాకృష్ణ తాటవర్తి శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రుణాల జారీకై రూ.130 కోట్లు సమీకరిస్తామన్నారు. రూ.250 కోట్లమేర రుణాల కోసం 270 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. రుణాలిచ్చేందుకు 80 మందికిపైగా ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఆన్‌లైన్‌ వేదికగా రుణదాతలు, కస్టమర్లను అనుసంధానించడమే ఆక్సీలోన్స్‌ పని. స్టార్టప్, ఎస్‌ఎంఈ, పర్సనల్, బిజినెస్‌ లోన్స్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement