loan target
-
ఇన్స్టంట్ లోన్ ముఠా గుట్టు రట్టు... నిర్వహించేది చైనావాళ్లే!
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ లోన్ దోపిడి మాయను బట్టబయలు చేశారు ఢిల్లీ పోలీసులు. సుమారు రెండు నెలలపాటు సాగిన ఈ గ్యాంగ్ అపరేషన్ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ నెట్వర్క్ విస్తరించి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....లక్నోలోని కాల్ సెంటర్లలో ఉన్న ఈ ముఠా తొలుత చిన్నమొత్తాల్లో రుణం అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆ తర్వాత యూజర్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి యాప్‌కు అనుమతులు మంజూరు చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఖాతాలో రుణం జమ అవుతుంది. అంతేకాదు ఫేక్ ఐడీలపై సేకరించిన వివిధ నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం మొదలు పెడతాయి. ఒకవేళ పట్టించుకోకపోతే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది. దీంతో బాధితులు భయంతో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతోంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ ముఠా హవాల ద్వారా లేదా క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి చైనాకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రతి ఖాతాకు కోటి రూపాయాల పైనే డబ్బులు జమ అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 500 కోట్ల ఇన్స్టంట్ లోన్ దోపిడి రాకెట్‌తో ప్రమేయం ఉన్న సుమారు 22 మందిని అరెస్టు చేశారు. అంతేకాదు ఈ దందా కోసం ఆ ముఠా దాదాపు వంద లోన్‌యాప్‌లను ఉపయోగించనట్లు వెల్లడించారు. నిందుతుల నుంచి 51 మొబైల్ ఫోన్లు, 25 హార్డ్ డిస్క్‌లు, తొమ్మిది ల్యాప్‌టాప్‌లు, 19 డెబిట్ కార్డ్‌లు/క్రెడిట్ కార్డ్‌లు, మూడు కార్లు, సుమారు రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయులు సూచనల మేరకే ఈ రాకెట్‌ని తాము నిర్వహిస్తున్నామని నిందితులు చెప్పనట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసుల చైనాకు చెందిన కొంతమంది దుండగులను గుర్తించామని, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. -
ట్రేడింగ్ పేరుతో హాంఫట్
హిమాయత్‌నగర్: నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరి నుంచి లక్షల రూపాయిలు దండుకోగా..పర్సనల్ లోను పేరుతో మరో వ్యక్తి నుంచి లక్షలు కాజేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు గురువారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినర్‌కు చెందిన రోషన్‌అలీకి మూడేళ్ల క్రితం టాటాక్యాపిటల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మీ ఫోన్‌నంబర్‌పై రూ.3లక్షలు పర్సనల్ లోన్ మంజూరు అయ్యిందన్నాడు. వివిధ కారణాలతో మొదట రూ.1లక్ష తీసుకున్నాడు. లోను అమౌంట్ పెరిగిందని ఆశ పెట్టి మూడేళల్లో పలు దఫాలుగా రూ.17లక్షలు కాజేశాడు. బోయినపల్లికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఓ హోటల్లో మేనేజర్‌గా చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్ రఘురాంని హాంగ్‌కాంగ్‌లో ఉండే వ్యక్తికి వాట్సప్ ద్వారా పరిచయం చేశాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకున్నారు. తాము ఒక కంపెనీలో ట్రేడింగ్ చేస్తున్నామని నువ్వు కూడా పెట్టాలని కోరారు. అతగాడి మాటలకు నమ్మిన రఘురాం ఎఫ్‌టీఎక్స్ అనే ట్రేడింగ్‌లో పలు దఫాలుగా రూ.40లక్షలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో ఆశ పెట్టి అతగాడి నుంచి రూ.7లక్షల 70వేలు దోచుకున్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్.. ఆ తర్వాత..) -
ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం డౌన్
ముంబై: నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రుణ పంపిణీ తగ్గడం, పోర్ట్‌ఫోలియో విలువలు క్షీణించడం ప్రభావం చూపినట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే గతేడాది(2020–21) ద్వితీయార్థంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్సీ)ల రుణ మంజూరీ పుంజుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంటే గత క్యూ3(అక్టోబర్–డిసెంబర్), క్యూ4(జనవరి–మార్చి)లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన ఈ క్యూ1లో 55 శాతం తిరోగమించినట్లు తెలియజేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే మారటోరియంలు లేని పరిస్థితుల్లో ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం నీరసించినట్లు నివేదిక వివరించింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం మాత్రం దాదాపు యథాతథంగా నమోదైనట్లు పేర్కొంది. పెంటప్ డిమాండ్ .. పెంటప్ డిమాండ్ కారణంగా ఈ జులైలో రుణ విడుదల ఒక్కసారిగా ఊపందుకున్నట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ స్పీడ్ కొనసాగేదీ లేనిదీ స్థూల ఆర్థిక సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎన్బీఎఫ్సీ రంగంలో రికవరీని తాత్కాలికంగా దెబ్బతీసినట్లు ఇక్రా వైస్‌ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ రంగ హెడ్ మనుశ్రీ సగ్గర్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలో రుణ మంజూరీ వార్షిక ప్రాతిపదికన 6–8 శాతం పుంజుకోగలదని అంచనా వేశారు. ఇక ఏయూఎం అయితే 8–10 శాతం స్థాయిలో బలపడవచ్చని అభిప్రాయపడ్డారు. గతే డాది లోబేస్ కారణంగా పలు కీలక రంగాల నుంచి డిమాండ్ మెరుగుపడనున్నట్లు తెలియజేశారు. ఆస్తుల నాణ్యతపై.. స్థానిక లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల(రుణాల) నాణ్యత భారీగా బలహీనపడినట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే వసూళ్లు ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది నికర రికవరీలు, రద్దులతో కూడిన ఓవర్డ్యూస్లో 0.5–1 శాతం పెరుగుదల నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇవి ఇకపై లాక్డౌన్లు ఉండబోవన్న అంచనాలుకాగా.. రుణ నాణ్యతపై ఒత్తిళ్లు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత అనిశి్చతుల నేపథ్యంలో రైటాఫ్‌లు అధికంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
100 రోజుల్లో రూ.100 కోట్లు...
ఆక్సీలోన్స్ రుణ లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ సేవల రంగంలో ఉన్న ఆక్సీలోన్స్ 100 రోజుల్లో రూ.100 కోట్ల మేర రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా చేసుకుంది. మార్చి 1 నుంచి ఈ మొత్తాన్ని అందిస్తామని కంపెనీ ఫౌండర్ రాధాకృష్ణ తాటవర్తి శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రుణాల జారీకై రూ.130 కోట్లు సమీకరిస్తామన్నారు. రూ.250 కోట్లమేర రుణాల కోసం 270 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. రుణాలిచ్చేందుకు 80 మందికిపైగా ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఆన్లైన్ వేదికగా రుణదాతలు, కస్టమర్లను అనుసంధానించడమే ఆక్సీలోన్స్ పని. స్టార్టప్, ఎస్ఎంఈ, పర్సనల్, బిజినెస్ లోన్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
రబీ రుణ లక్ష్యం.. రూ.782.55 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత రబీ సీజన్లో రూ.782.55 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డీఎం) ఎల్.జయశంకర్ వెల్లడించారు. ఈ నెల చివరి వారం నుంచి రుణాల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. కాగా.. సెప్టెంబర్ 30తో ముగిసిన 2016 ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని వంద శాతం సాధించినట్లు తెలిపారు. 5.95 లక్షల మంది రైతులకు రూ.4,434 కోట్ల పంట రుణాలు, 82 వేల మందికి రూ.550 కోట్ల బంగారు రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ టర్మ్ రుణాల పంపిణీ కొనసాగుతోందన్నారు.