స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా మొబైల్ బ్రాండ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. వర్థమాన దేశాల్లో చైనా మొబైల్ ఫోన్లు హహా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా దేశంలోనే ఏకంగా అక్కడి కంపెనీలకే షాకిచ్చింది యాపిల్.
నంబర్ వన్ బ్రాండ్
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికతో చైనా మొబైల్ బ్రాండ్స్ గూబగుయ్యిమంది. 2021 నాలుగో క్వార్టర్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో చైనాలో లీడిండ్ మొబైల్ ఫోన్ బ్రాండ్లుగా ఉన్న హువావే, జెడ్‌టీఈ, షావోమి కంపెనీలను వెనక్కి నెట్టి యాపిల్ బ్రాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది.
స్ట్రాటజీ
చైనాలో ఎక్కువగా అమ్ముడవుతూ వస్తోన్న మోడల్ యాపిల్ 6. ఈ మోడల్ లాంచ్ ఐనప్పటి నుంచి చైనీయులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే మార్కెట్ లీడర్ అయ్యే స్థాయిలో అమ్మకాలు ఉండటం లేదు. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న చైనాలో పట్టు సాధించేందుకు యాపిల్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేసింది. 2021 సెప్టెంబరులో విడుదలైన ఐఫోన్ 13 మోడల్ బేసిక్ ధర తక్కువగా ఉండేట్టుగా జాగ్రత్త పడింది. అంతే అటు ఐఫోన్ 6,. ఇటు ఐఫోన్ 13 అమ్మకాల్లో దుమ్మురేపాయి. ఫలితంగా చైనా బ్రాండ్లను వెనక్కి నెట్టి 23 శాతం మార్కెట్ వాటాతో నంబర్‌గా యాపిల్ నిలిచింది.
తగ్గుతున్న మార్కెట్
తాజాగా వెలువుడుతున్న గణాంకాలు చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో స్థఙరంగా క్షీణత నమోదు అవుతున్నట్టుగా తెలుపుతున్నాయి. కొత్తగా వస్తున్న మొబైల్ ఫోన్లకు పాత మొబైల్ ఫోన్లకు ఫీచర్ల పరంగా పెద్దగా తేడా ఉండటం లేదు. దీంతో ఫోన్లు మార్చేందుకు అక్కడి ప్రజలు ఇష్టపడం లేదు. తాజా నివేదిక ప్రకారం గతేడాదితో పోల్చితే చైనాలో మొబైల్ ఫోన్ అమ్మకాలు 9 శాతం పడిపోగా క్వార్ట్‌ర్ 4లో 2 శాతం తగ్గాయి. గత నాలుగేళ్లుగా ఇదే తరహా ట్రెండ్ అక్కడ నమోదు అవుతూ వస్తోంది.
చదవండి: చైనా సర్క్యూట్ బ్రేకర్ పాలసీ.. కుక్కకాటుకి చెప్పు దెబ్బగా అమెరికా రిప్లై
Comments
Please login to add a commentAdd a comment