ఒక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని ఎక్కువ గంటలు వినియోగించుకునే అంశంలో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థలు బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ డిసెంబర్ 1న ‘షోవోమీ 13’ను లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే ఫోన్ గురించి వివరించేందుకు ఆ సంస్థ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా షావోమీ సీఈవో, ఫౌండర్ లీ జూన్..మరో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌కు బహిరంగంగా సవాల్ చేశారు. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ కంటే తాము విడుదల చేయనున్న షోవోమీ 13 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
మా ఫోనే గొప్ప
చైనాకు చెందిన సోషల్ మీడియా నెట్ వర్క్ సంస్థ వీబో (ట్విటర్ తరహా) ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో షోవోమీ ఫౌండర్ లీ జూన్ యాపిల్ ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ కంటే షావోమీ 13 బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉందని తెలిపారు. అంతేకాదు అందుకు సంబంధించి షోవోమీ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో షోవోమీ13ను మిగిలిన ఫోన్‌లతో పోల్చారు. ఆ ఫోన్‌ల కంటే ఈ ఫోన్ పనితీరు బాగుంటుందని ధీమాగా చెబుతున్నారు.
ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, గతంలో విడుదలైన షోవీమీ 12ఎస్, షోవోమీ 12ఎస్ ఆల్ట్రా, షావోమీ 12ఎస్ ప్రో, హువావే పీ 50 ప్రో, శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రా కంటే షావోమీ 13 ఫోన్‌ను సింగిల్ ఛార్జ్‌తో బ్యాటరీని ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చని షావోమీ వివరించింది.
డీఓయూ టెస్ట్‌లో తేలింది
డీఓయూ టెస్ట్ అనే ప్రతి రోజు మనం వినియోగించే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత సేపు ఉంటుందో సూచిస్తుంది. స్కోర్ సైతం అందిస్తుంది. లాంచ్ కానున్న షావోమీ -13 ఫ్లాగ్‌షిప్ బ్యాటరీ లైఫ్ టెస్ట్‌లో 1.37 స్కోర్ చేయగా ఐఫోన్ 14, 14 ప్రో మ్యాక్స్‌లు 1.28 స్కోర్ నమోదు చేశాయి. ఇక షోవీమీ ఫోన్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్‌ను అందిస్తుండగా.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 4 మాత్రం 4,323ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో షిప్పింగ్ చేస్తోంది.
షావోమీతో పాటు
షావోమీ డిసెంబర్ 1న లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈవెంట్‌లో ఫ్లాగ్‌షిప్ షావోమీ13 సిరీస్‌తో పాటు షోవోమీ వాచ్ ఎస్2, షావోమీ బడ్స్ 4, ఎంఐయూ 14 లను లాంచ్ చేయాలని భావిస్తోంది. అయితే, షోవీమీ మాత్రం భారత్, ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టం చేయలేదు.
చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత!
Comments
Please login to add a commentAdd a comment