Smartphone released
-
ఐకూ జెడ్ 5జీ విడుదల
న్యూఢిల్లీ: ఐకూ జెడ్ 7 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది రెండు వేరియంట్లుగా విడుదలైంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999. ఆరంభ డిస్కౌంట్ పోను రూ.17,499కు లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.19,999. డిస్కౌంట్ పోను రూ.18,499కు సొంతం చేసుకోవచ్చు. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, ఐకూ వెబ్సైట్లలో లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ 7.8 ఎఎం మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్స్ ఓఐఎస్ అల్ట్రా స్టెబుల్ కెమెరా, అమోలెడ్ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ఆకర్షణలు. 44 వాట్ ఫ్లాష్ చార్జర్ సదుపాయం ఉంది. -
మీ యాపిల్ ఐఫోన్ 14 కంటే..మా చైనా ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ
ఒక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని ఎక్కువ గంటలు వినియోగించుకునే అంశంలో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థలు బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ డిసెంబర్ 1న ‘షోవోమీ 13’ను లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే ఫోన్ గురించి వివరించేందుకు ఆ సంస్థ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా షావోమీ సీఈవో, ఫౌండర్ లీ జూన్..మరో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌కు బహిరంగంగా సవాల్ చేశారు. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ కంటే తాము విడుదల చేయనున్న షోవోమీ 13 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మా ఫోనే గొప్ప చైనాకు చెందిన సోషల్ మీడియా నెట్ వర్క్ సంస్థ వీబో (ట్విటర్ తరహా) ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో షోవోమీ ఫౌండర్ లీ జూన్ యాపిల్ ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ కంటే షావోమీ 13 బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉందని తెలిపారు. అంతేకాదు అందుకు సంబంధించి షోవోమీ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో షోవోమీ13ను మిగిలిన ఫోన్లతో పోల్చారు. ఆ ఫోన్ల కంటే ఈ ఫోన్ పనితీరు బాగుంటుందని ధీమాగా చెబుతున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, గతంలో విడుదలైన షోవీమీ 12ఎస్, షోవోమీ 12ఎస్ ఆల్ట్రా, షావోమీ 12ఎస్ ప్రో, హువావే పీ 50 ప్రో, శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రా కంటే షావోమీ 13 ఫోన్‌ను సింగిల్ ఛార్జ్‌తో బ్యాటరీని ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చని షావోమీ వివరించింది. డీఓయూ టెస్ట్‌లో తేలింది డీఓయూ టెస్ట్ అనే ప్రతి రోజు మనం వినియోగించే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత సేపు ఉంటుందో సూచిస్తుంది. స్కోర్ సైతం అందిస్తుంది. లాంచ్ కానున్న షావోమీ -13 ఫ్లాగ్షిప్ బ్యాటరీ లైఫ్ టెస్ట్‌లో 1.37 స్కోర్ చేయగా ఐఫోన్ 14, 14 ప్రో మ్యాక్స్‌లు 1.28 స్కోర్ నమోదు చేశాయి. ఇక షోవీమీ ఫోన్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్‌ను అందిస్తుండగా.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 4 మాత్రం 4,323ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో షిప్పింగ్ చేస్తోంది. షావోమీతో పాటు షావోమీ డిసెంబర్ 1న లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈవెంట్లో ఫ్లాగ్షిప్ షావోమీ13 సిరీస్‌తో పాటు షోవోమీ వాచ్ ఎస్2, షావోమీ బడ్స్ 4, ఎంఐయూ 14 లను లాంచ్ చేయాలని భావిస్తోంది. అయితే, షోవీమీ మాత్రం భారత్, ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టం చేయలేదు. చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత! -
ఈ ఫోన్‌తో సినిమాటోగ్రఫీ రేంజ్లో వీడియో తీయొచ్చు..!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కంపెనీ సోనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సోనీ ఎక్స్‌పీరియా సిరీస్‌లో భాగంగా సోనీ ఎక్స్‌పీరియా ప్రో-1 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో సినిమాటోగ్రఫీ మోడ్‌లో వీడియోలను షూట్ చేయవచ్చును.ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో 1-అంగుళాల ఎక్స్మోర్ ఆర్ఎస్ సీఎమ్ఒఎస్ సెన్సార్‌ను సోనీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కు కుడి వైపున షట్టర్ బటన్‌ను కూడా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో జీస్ టెస్సార్ కాలిబ్రేటెడ్ ఆప్టిక్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అదనంగా వ్లాగ్ మానిటర్‌ను కూడా లాంచ్ చేసింది. సోనీ ఎక్స్‌పీరియా ప్రో-1 12జీబీ ర్యామ్‌తో రానుంది. 30వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్లాగ్ మానిటర్ ధర రూ. 15 వేలు. డిసెంబర్ నుంచి నుంచి సోనీ రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. సోనీ ఎక్స్‌పీరియా ఫీచర్స్..! ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ 6.50 అంగుళాల 4కే హెచ్డీఆర్ ఒఎల్‌ఈడీ డిస్ప్లే క్వాలకమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 12ఎమ్పీ+12 ఎమ్పీ+12 ఎమ్పీ ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 12జీబీ+512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ 5జీ, 4జీ సపోర్ట్ యూఎస్బీటైప్-సీ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 4,500ఎమ్ఎహెచ్ బ్యాటరీ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: యాపిల్‌కు భారీ షాకిచ్చిన విద్యార్థులు..! -
అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వై33ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. ధర రూ.17,990 ఉంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్సెల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫన్‌టచ్ ఓఎస్ 11.1, బిల్ట్ ఇన్ బ్లూలైట్ ఫిల్టర్, 8 జీబీ ర్యామ్, 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సూపర్ నైట్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. చదవండి : ఈ టెక్నాలజీని ఒకేసారి ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
శాంసంగ్ నుంచి ‘ఎస్6 ఎడ్జ్ ప్లస్’
ధర రూ. 57,900 న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ ‘గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.57,900. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.7 అంగుళాల తెర, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ మెమరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రంగుల్లో లభ్యం కానున్న ఈ స్మార్ట్ఫోన్లు ఆగస్ట్ 28 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలతో తమ మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వర్సి ధీమా వ్యక్తంచేశారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి 12-15 శాతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.