ఈ ఫోన్‌తో సినిమాటోగ‍్రఫీ రేంజ్‌లో వీడియో తీయొచ్చు..! | Sony Xperia Pro I With 1 Inch Exmor Rs Cmos Sensor Launched | Sakshi
Sakshi News home page

Sony: ఈ ఫోన్‌తో సినిమాటోగ‍్రఫీ రేంజ్‌లో వీడియో తీయొచ్చు..!

Published Thu, Oct 28 2021 9:10 PM | Last Updated on Fri, Oct 29 2021 12:26 PM

Sony Xperia Pro I With 1 Inch Exmor Rs Cmos Sensor Launched - Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ కంపెనీ సోనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సోనీ ఎక్స్‌పీరియా సిరీస్‌లో భాగంగా సోనీ ఎక్స్‌పీరియా ప్రో-1 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో సినిమాటోగ్రఫీ మోడ్‌లో వీడియోలను షూట్‌ చేయవచ్చును.ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో 1-అంగుళాల ఎక్స్‌మోర్‌ ఆర్‌ఎస్‌ సీఎమ్‌ఒఎస్‌ సెన్సార్‌ను సోనీ ఏర్పాటు​ చేసింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కు కుడి వైపున షట్టర్ బటన్‌ను కూడా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలో జీస్ టెస్సార్ కాలిబ్రేటెడ్ ఆప్టిక్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అదనంగా వ్లాగ్‌ మానిటర్‌ను కూడా లాంచ్‌ చేసింది. 

సోనీ ఎక్స్‌పీరియా ప్రో-1  12జీబీ ర్యామ్‌తో రానుంది. 30వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఫుల్‌ అవుతుంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్లాగ్‌ మానిటర్‌ ధర రూ. 15 వేలు.  డిసెంబర్‌ నుంచి నుంచి సోనీ రిటైల్‌ స్టోర్లలో  కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

సోనీ ఎక్స్‌పీరియా ఫీచర్స్‌..!

  • ఆండ్రాయిడ్‌ 11 సపోర్ట్‌
  • 6.50 అంగుళాల 4కే హెచ్‌డీఆర్‌ ఒఎల్‌ఈడీ డిస్‌ప్లే
  • క్వాలకమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌
  • 12ఎమ్‌పీ+12 ఎమ్‌పీ+12 ఎమ్‌పీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
  • 8ఎమ్‌పీ ఫ్రంట్‌ కెమెరా
  • 12జీబీ+512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • డాల్బీ అట్మోస్‌ సౌండ్‌ సిస్టమ్‌
  • 5జీ, 4జీ సపోర్ట్‌
  • యూఎస్‌బీటైప్‌-సీ
  • ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌
  • 4,500ఎమ్‌ఎహెచ్‌ బ్యాటరీ
  • 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

చదవండి: యాపిల్‌కు భారీ షాకిచ్చిన విద్యార్థులు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement