సాక్షి, న్యూఢిల్లీ: సోనీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 పేరుతో ఎక్స్‌పీరియా ప్రీమియం సిరీస్‌ను విస్తరించింది. 3డీ క్రియేటర్‌తో లాంచ్ చేసిన తొలిమొబైల్‌గా ఇది నిలిచింది. దీని వలన వినియోగదారులు 3డీ స్కాన్లను నేరుగా సృష్టించవచ్చు, 3డీ ప్రింటర్లతో నేరుగా వీటిని ప్రింట్ చేయవచ్చు. అంతేకాదు ఇండస్ట్రీలో 19 ఎంపీ తొలి మోషన్ ఐ కెమెరా (విత్ హైబ్రీడ్ ఎఎఫ్)తో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను రూ.44,990 గా సోనీ ప్రకటించింది. ఐపి 68 సర్టిఫికేషన్‌తో వాటర్, అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. నీలం, నలుపు, సిల్వర్, గులాబీ రంగు ఆప్షన్స్‌లో సోనీ అధికార రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ హెచ్‌డీఆర్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 పొట్రెక్షన్
19 ఎంపీ మోషన్ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్
256దాకా విస్తరించుకునే సదుపాయం
2700 ఎంఏహెచ్ బ్యాటరీ