వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్డీ కార్డు లాంచ్
వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్డీ కార్డు లాంచ్
Published Tue, Mar 28 2017 5:39 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్డీ కార్డు లాంచ్ అయింది. సోని ఇండియా ఎస్ఎఫ్-జీ సిరీస్ లో దీన్ని లాంచ్ చేసింది. ప్రొఫిషినల్ ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్ల కోసం స్పెషల్ గా దీన్ని డిజైన్ చేశారు. మూడు వేరియంట్లలో ఈ కార్డును లాంచ్ చేశారు. ఎస్ఎఫ్-జీ32/టీ1(32కెపాసిటీ) ధర రూ. 6700 కాగ, 64జీబీ కెపాసిటీ ఎస్ఎఫ్-జీ64/టీ1 ఐఎన్ కార్డు ధర రూ.11,000. 128జీబీ కెపాసిటీ కార్డు ధర రూ.19,9000. ఈ కార్డులన్ని ఐదేళ్ల వారెంటీతో ఏప్రిల్ 3 నుంచి వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి.
ఈ ఎస్డీ కార్డు రైటింగ్ స్పీడు సెకనుకు 299 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. అదేవిధంగా రీడింగ్ స్పీడు కూడా సెకనుకు 300ఎంబీపీఎస్ వరకు ఉంది. డిజిటల్ ఇమేజింగ్ డివైజ్లన్నింటికీ తమ ఎస్ఎఫ్-జీ సిరీస్ కార్డులు సపోర్టు చేస్తాయని సోని తెలిపింది. డీఎస్ఎల్ఆర్తో 4వేల వీడియోలను ఇది రికార్డు చేస్తోంది. ఈ కొత్త ఎస్డీ కార్డుతో పాటు ఎస్డీ మెమరీ కార్డు రీడర్ ను కూడా కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటితో డేటాను చాలా వేగంగా.. పర్సనల్ కంప్యూటర్లోకి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.
Advertisement
Advertisement