చారిత్రాత్మక స్వాతంత్య్రపోరాట నేపధ్యంలో తీసిన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' సోనీలివ్ వేదికగా ఓటీటీ వీక్షకుల ఆదరణ చూరగొంటోంది. దర్శకుడు నిక్కిల్ అద్వానీ విజన్ ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ సిరీస్‌ను చూడాల్సిందిగా సిఫారసు చేయడం విశేషం.
ఆయన ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారిలా... ’ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్’ చూడటం మొదలుపెట్టాను. ఇది బాపు – పండిట్ నెహ్రూ – మన ఫ్రీడమ్‌కు సంబంధించిన ఒక హిందూత్వ వెర్షన్ అని నేను అనుకున్నాను. కానీ నేను పొరపడ్డాను. ఇది ముందస్తు అంచనాలు ఉండవద్దనే పాఠం నాకు నేర్పింది. దీని గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది. అయతే తప్పక దీన్ని చూడాల్సిందిగా నేను సిఫార్సు చేస్తున్నాను’’ తుషార్ గాంధీ మాత్రమే కాకుండా ఆలోచింపజేసే చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు సుధీర్ మిశ్రా కూడా ఈ సిరీస్‌కు సంబంధించి దర్శకుని కృషిని ఎంతగానో ప్రశంసించారు.
లారీ కాలిన్స్, డొమినిక్ లాపియర్ రాసిన పుస్తకం ఆధారంగా ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ రూపొందింది. ఇందులో సిధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, మలిష్కా మెండోన్సా, రాజేష్ కుమార్, కేసీ శంకర్, ల్యూక్ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా, అలిస్టెయిర్ ఫిన్లే, ఆండ్రూ కల్లమ్, రిచర్డ్ టెవర్సన్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో నెక్ట్స్‌తో కలిసి ఎమ్మే ఎంటర్‌టైన్ మెంట్ (మోనిషా అద్వానీ – మధు భోజ్వానీ) దీన్ని నిర్మించింది. ఈ సిరీస్‌కు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment