freedom
-
మాయాబజార్లో మన స్వతంత్రం
స్వాతంత్య్రానికి పూర్వం మొత్తం భారత దేశంలో కేవలం రెండు, రెండున్నర శాతం ప్రజలకు మాత్రమే ఓటు హక్కు ఉందంటే బానిస పాలన లక్షణం తేలిపోతుంది.కొందరు జమీందారులు, సంస్థానాధీశులు, భూస్వాములు, విపరీత సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇది అర్థం చేసుకుంటే మన స్వాతంత్య్రం గొప్పతనం అర్థమవుతుంది. వయోజనుడైన ప్రతి వ్యక్తికీ ఓటు హక్కు ఇచ్చారు. ఇది సామాన్యమైన హక్కు కాదు. ప్రాణాలకు ప్రాణమైన హక్కు. మనకు స్వరాజ్యం ఉంది కానీ సురాజ్యం లేదనే విమర్శలు ఉన్నాయి. అందరికీ సమానంగా ఓటు హక్కు మాత్రం ఉంది. బలహీనులకు ఓటు ఇవ్వకూడదు అన్నా, మహిళలకు ఇవ్వలే మన్నా, చదువుకున్నవారికే ఇస్తామన్నా సమానత ఉండదు. నిశ్శబ్ద విప్లవం1950 నాటికి ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకున్న అనేకా నేక దేశాల్లో సమాన ఓటు హక్కు లేదు. మన దేశంలో ఓటింగ్ హక్కు పైన ఒకటే పరిమితి ఉండేది. అదే 21 సంవత్సరాల వయసు. ఆ తరువాత 18 ఏళ్లుంటే చాలు కచ్చితంగా ఓటు హక్కు ఇవ్వాల్సిందే! ఓటు అమ్ముకుంటున్నారో కొంటున్నారో, ఓటు వేస్తున్నారో లేదో అవసరం లేదు. కానీ హక్కు మాత్రం ఉంది. మనం వాడుకుంటున్నందువల్లనే ఇవ్వాళ రక్తపాతం లేకుండానే అధికారం మారిపోతూ ఉన్నది. ఇది నిశ్శబ్ద విప్లవం. ఓ అర్ధరాత్రి ఫలితాలు తెలిసినపుడు అధికారం మార్పిడి జరుగుతున్నది. ఎంత గొప్ప విషయం! మనదేశంలో ఎందరికి ఓటు హక్కు ఉందో తెలుసా? 99.1 కోట్ల మందికి ఓటు అనే అధికారం ఉంది. వీరిలో 18 నుంచి 29 వయ సున్న 21.7 కోట్ల యువశక్తి కాస్త మెదడు వాడుకుంటే చాలు ప్రభు త్వం మారిపోతుంది. అదీ ఈ ఓటు మాయ. ‘ఓటింగ్ వంటిది మరోటి లేదు. కచ్చితంగా నేను ఓటేస్తాను’ అనే నినాదంతో ఈ జనవరి 25న ఎన్నికల కమిషన్ 75వ వార్షిక ఉత్సవం జరుగుతున్నది. 2011 నుంచి ఇదే తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం ఏర్పడిన తరువాత 1952లో తొలి ఎన్నికలసంగ్రామం జరిగింది. అదొక గొప్ప పండుగ అని పెద్దలు అనేవారు. కొన్ని దశాబ్దాల కింద మనిషి పోలింగ్ బూత్‌కు రాకపోతే ఆ వ్యక్తి చని పోయినాడనుకునేది. ఇంత కష్టపడి ఓటేయడం ఎందుకు అని ఎవ రైనా అంటే, ఓటు వేయడం నేను బతికి ఉన్నాను అనడానికి నిద ర్శనం అనేవారు. అధికారులు, ఉద్యోగులు, నాలుగోస్థాయి ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఓటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా కష్టమైన పని. వాళ్లంతా కొన్ని నెలలపాటు కష్టపడితే, ఆడుతూ పాడుతూ ఓటు వేసుకోవచ్చు.పారదర్శకత ఎంత?ఇదివరకు ఒక్కరే కమిషనర్‌గా టి.ఎన్.శేషన్ ఎన్నికలు అద్భుతంగా నిర్వహించారు. ఆ తరువాత ముగ్గురు కమిషనర్లు వచ్చారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్‌ను నియ మిస్తారు. వారిలో సీనియర్ కమిషనర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నియమిస్తారు. ఈ అధికారం భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 నుండి సంక్రమించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ప్రత్వేక అధికారాలు లేవు. ఆ ముగ్గురిలో మెజారిటీ అభిప్రాయం ద్వారా నిర్ణయం సాగుతుంది. ఈ మధ్య 2023లో సవరణ చట్టం చేశారు. ఎంపిక కమిటీలో ప్రధానితో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపికైన మరొక మంత్రి ఉంటారు. అభిశంసన ప్రక్రియ ద్వారా సీఈసీని పదవి నుండి తొలగించవచ్చు. కానీ ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ముగ్గురిలో ఇద్దరి మెజారిటీ ఉంటే కొన్ని నిర్ణయాలు తీసు కోవచ్చు. కానీ ఒకరి నిరసన ఉంటే అది తీవ్రమైన అంశంగా పరిగ ణించాలి. ప్రధాని నాయకత్వంలో రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురూ నీతిగా ఉంటూ, ప్రభుత్వ ఒత్తిళ్లను ప్రతిఘటించడం అవసరం. ముగ్గురూ ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు. ఆ మధ్య అరుణ్ గోయల్‌తో మిగిలిన ఇద్దరికి అభిప్రాయ భేదం రావడం వల్ల రాజీనామా చేశారు. 2027 డిసెంబర్ దాకా కమిషనర్‌గా ఆయనకు గడువు ఉన్నప్పటికీ, 2024 మార్చ్ 9న రాజీనామా చేయడం వల్ల అనుమానాలు వచ్చాయి కూడా! ప్రవర్తనా నియమావళిలో ఏ మాత్రం గందరగోళం ఉన్నా అను మానాలు పెరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలలో, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో తీవ్రమైన అనుమానాలు వచ్చాయి. ఇప్పటికీ అనేక వివాదాలు వస్తున్నాయి. అలాగే మతాన్ని ఎన్నికలలో విరివిగా దుర్వినియోగం చేస్తుంటే, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినట్లు కాదు. విప రీతమైన డబ్బు వెదజల్లడం, ఓటర్లను బెదిరించడం, కండబలం వాడటం, ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేయడం వల్ల ఎన్నికలు పారదర్శ కంగా సాగవు. ప్రభుత్వాలే అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం తగ్గిపోతుంది. చీకటి నిధులుఓటర్లకు అభ్యర్థులను గురించి తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తరువాత ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థీ తన నేరాల చిట్టాలు, స్థిరచరాస్తులు పట్టాల వివరాలతో ఇచ్చిన ప్రమాణ పత్రాలు అట్లా పడి ఉన్నాయి. ఓటర్లకూ పట్టదు, రాజకీయ పార్టీలకూ పట్టదు. 43 శాతం ప్రజాప్రతినిధుల మీద ఉన్న తీవ్రనేరాలను త్వరగా విచారణ జరపకపోతే దేశ రాజ్యాంగ సంవి ధాన సుపరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుంది.నిజానికి ఈసారి ఎన్నికల బాండ్లు చాలా అనుమానాలకు దారి తీశాయి. కోట్లకు కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా ‘సంపాదించారు’. వీటిని మనం విరాళాలు అంటున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టడానికి ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 జనవరి 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయం కోరుతూ లేఖ రాశారు.జనవరి 30న రాసిన జవాబులో ఈ పద్ధతి అక్రమాలకు దారి తీసే అవకాశం ఉందనీ, పారదర్శకంగా ఉండవలసిన ఎన్నికల విరా ళాలను గోప్యంగా మారుస్తుందనీ, దీనివల్ల బలవంతపు విరాళాలు వసూలు చేసే అవకాశం ఉందనీ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. అయినా పార్లమెంటులో ఎటువంటి చర్చా జరగకుండానే, ఎలక్టోరల్ బాండ్స్ దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించాయి. అందుకు తగినట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా సవరించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోయి 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ పథకం మొదలైంది.ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకించిన ఎన్నికల సంఘం 2019 మార్చ్ 25న అఫిడవిట్ దాఖలు చేసింది. విరాళాలకు సంబంధించిన వివరాలను పంచుకోవడం నుండి రాజకీయ పార్టీలను మినహాయించడం విదేశీ నిధుల సమాచారాన్ని చీకటిలో ఉంచుతుందని చెప్పింది. ‘భారతదేశంలోని రాజకీయ పార్టీల విదేశీ నిధులను తనిఖీ చేయ లేము, ఇది భారతీయ విధానాలను విదేశీ కంపెనీలు ప్రభావితం చేయడానికి కారణం అవుతుంది’ అని పేర్కొంది. అయితే, 2019 ఏప్రిల్ 12 నుండి ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తం మీద గడచిన ఐదేళ్లలో దాదాపు 1,300 కార్పొరేట్ సంస్థలు దాదాపు 20 రాజకీయ పార్టీలకు రు 12,156 కోట్ల విరాళాలు అందజేశాయి. అందులో అత్యధిక భాగం రు. 6,060 కోట్లు బీజేపీకే దక్కాయి. చివరికి 2024 ఫిబ్రవరి 15న కేంద్రం కళాత్మకంగా నిర్మించిన ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని కోర్టు ఏకగ్రీవంగా కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో పొందు పరిచిన ఓటర్ల సమాచార హక్కును ఈ పథకం ఉల్లంఘించిందనిబెంచ్ పేర్కొంది. ఎన్నికలు మాయాబజార్‌గా నిర్వహిస్తే రాజ్యాంగం ఉన్నట్టా, లేనట్టా? » 75 ఏళ్ల కిందట, గణతంత్రానికి ఒక్కరోజు ముందు,అంటే 1950 జనవరి 25న మన భారత ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ఎన్నికలు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, భారత రాజ్యాంగం లేదు, ఇంతెందుకు మన స్వాత్రంత్యానికి కూడా అర్థం పర్థం ఉండదు.» ఇంగ్లీషు, హిందీ, తెలుగు వంటి అన్ని భాషల్లో అందరికీ బాగా తెలిసిన మాట... ఓటు!» ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ప్రభుత్వ ఒత్తిళ్లు ప్రతిఘటించడం అవసరం. ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు.- వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్- మాడభూషి శ్రీధర్ -
మీకు ఆర్థిక స్వేచ్ఛ ఉందా..?
సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బు సంపాదించడమే ఆర్థిక స్వేచ్ఛ అని చాలామంది భావిస్తుంటారు. కొందరు అప్పులు లేకుండా ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా పరిగణిస్తారు. ఇంకొందరు లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా భావిస్తారు. మంచి ఇల్లును సొంతం చేసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళితే ఖర్చుల గురించి ఆలోచించకుండా ఉండే డబ్బు.. ఇందంతా ఒకింత ఆర్థిక స్వేచ్ఛేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యక్తుల వ్యక్తిగత ఆదాయం, వయసు, జీవన శైలి, కోరికలు, అలవాట్లు ఇలా విభిన్న అంశాలపై ఆర్థిక స్వేచ్ఛ ఆధారపడుతుందని చెబుతున్నారు. మీరు ఆర్థికంగా ఏమేరకు స్వేచ్ఛగా ఉన్నారో నిత్యం బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు.వీటిపై ఓ కన్నేయండి..ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేకుండా ఖర్చులు అధికమవుతుంటే మీరు ఆర్థిక స్వేచ్ఛకు దూరమవుతున్నారనే సంకేతాలు వస్తున్నట్లు గ్రహించాలి. నెలవారీ బడ్జెట్‌ను మించి చిన్న అత్యవసరం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఉందంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. దీనివల్ల మీరు అనుకుంటున్న ఆర్థిక స్వేచ్ఛ కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి సంకేతాలు వస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి తిరిగి ఆర్థిక పరిస్థితిని గాడినపడేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.అప్పులతో జాగ్రత్తప్రతి చిన్న కొనుగోలుకు అప్పు చేస్తుంటే మాత్రం పరిస్థితి దిగజారి పోతుందని గ్రహించాలి. అప్పులు ఉండకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాల్సి వచ్చినా చాలా తక్కువగానే ఉండాలి. ప్రస్తుతకాలంలో ఈఎంఐ లేకుండా ఏదీ కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్ని ఈఎంఐలు కలిపి ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. బయట అప్పులు తీసుకొస్తే మాత్రం వెంటనే వాటిని తీర్చేయాలి. ఎందుకంటే అప్పు చెల్లింపులు జాప్యం చేస్తున్న కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది.అత్యవసర నిధి ఉందా..?ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు, అప్పుల వాయిదాలు, ఈఎంఐలు.. వంటి వాటిని భరించడం కష్టం. కాబట్టి ముందుగానే దాదాపు ఆరు నెలలకు సరిపడా ఖర్చులను అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిన్న మొత్తంతోనైనా ప్రారంభించి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం సాగాలి.ఇదీ చదవండి: సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?కుటుంబానికి ఆర్థిక భరోసాప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. మీ కుటుంబం మీపైనే ఆధారపడి ఉంటే మీ తదనంతరం వారికి ఆర్థిక భారం మోపకుండా మంచి టర్మ్పాలసీను ఎంచుకోవాలి. మీరులేని లోటును ఎవరూ మీ కుటుంబానికి తీర్చలేరు. కనీసం కొంతవరకు ఆర్థిక వెసులుబాటు కల్పించి రోడ్డునపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే జీవితబీమా తప్పనిసరి. -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్'కు మహాత్మా గాంధీ మునిమనవడు ప్రశంసలు
చారిత్రాత్మక స్వాతంత్య్రపోరాట నేపధ్యంలో తీసిన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సోనీలివ్ వేదికగా ఓటీటీ వీక్షకుల ఆదరణ చూరగొంటోంది. దర్శకుడు నిక్కిల్ అద్వానీ విజన్ ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ సిరీస్‌ను చూడాల్సిందిగా సిఫారసు చేయడం విశేషం. ఆయన ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారిలా... ’ఫ్రీడం ఎట్ మిడ్నైట్’ చూడటం మొదలుపెట్టాను. ఇది బాపు – పండిట్ నెహ్రూ – మన ఫ్రీడమ్‌కు సంబంధించిన ఒక హిందూత్వ వెర్షన్ అని నేను అనుకున్నాను. కానీ నేను పొరపడ్డాను. ఇది ముందస్తు అంచనాలు ఉండవద్దనే పాఠం నాకు నేర్పింది. దీని గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది. అయతే తప్పక దీన్ని చూడాల్సిందిగా నేను సిఫార్సు చేస్తున్నాను’’ తుషార్ గాంధీ మాత్రమే కాకుండా ఆలోచింపజేసే చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు సుధీర్ మిశ్రా కూడా ఈ సిరీస్‌కు సంబంధించి దర్శకుని కృషిని ఎంతగానో ప్రశంసించారు. లారీ కాలిన్స్, డొమినిక్ లాపియర్ రాసిన పుస్తకం ఆధారంగా ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ రూపొందింది. ఇందులో సిధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, మలిష్కా మెండోన్సా, రాజేష్ కుమార్, కేసీ శంకర్, ల్యూక్ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా, అలిస్టెయిర్ ఫిన్లే, ఆండ్రూ కల్లమ్, రిచర్డ్ టెవర్సన్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో నెక్ట్స్తో కలిసి ఎమ్మే ఎంటర్టైన్ మెంట్ (మోనిషా అద్వానీ – మధు భోజ్వానీ) దీన్ని నిర్మించింది. ఈ సిరీస్‌కు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. -
మీరే ఆదర్శం.. మీ మద్దతే ముఖ్యం!
టీనేజ్ అనేది టీనేజర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా సవాలే! వాళ్ల ఎదుగుదలను చూసి సంతోషం, గర్వం ఒకవైపు... వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలి, దారి తప్పకుండా ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలు మరోవైపు. ఓపెన్నెస్– పరిమితుల మధ్య, అధికారం– సహానుభూతి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు తప్పవు. అందుకే ఈ వయసులో తల్లిదండ్రుల మద్దతు వారి అభివృద్ధినెలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. కమ్యూనికేషన్ డైనమిక్స్ఢ స్వతంత్రం కోసం తపిస్తారు. అదే సమయంలో వాళ్ల తల్లిదండ్రులు తమ అదుపు తప్పకూడదని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పేరెంట్స్ చెప్పే మాటలను టీనేజర్లు పట్టించుకోరు. అది తమను తిరస్కరించినట్లుగా భావిస్తారు. ఇదే ఘర్షణలకు కారణమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు జడ్జిమెంట్ లేకుండా వినడం అవసరం. అప్పుడే తల్లిదండ్రులు తమను అర్థం చేసుకున్నారని ఫీలవుతారు. వివాదాలు సహజం..కౌమారంలో తమదైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛ, స్వతంత్రాలను ప్రదర్శించడం అవసరమని టీనేజర్లు భావిస్తారు. ఈ క్రమంలో హెయిర్ స్టయిల్ నుంచి డ్రెస్సింగ్ స్టయిల్ వరకు, సిద్ధాంతాల నుంచి లైఫ్ స్టయిల్ వరకు, స్నేహాల నుంచి నైటవుట్ల వరకు తరాల మధ్య అంతరాలు ఉంటాయి. మరోవైపు పిల్లలు చేయిదాటిపోతున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. వారి ప్రవర్తనను కట్టడి చేయాలని ప్రయత్నిస్తుంటారు. కఠిన నియమాలు అమలు చేయాలని చూస్తుంటారు. ఈ విషయంలో టీనేజర్లు, పేరెంట్స్ మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇది సహజం. ఇందులో ఆందోళన పడాల్సిన పనిలేదు. భావజాల ఘర్షణలు..కౌమారంలో భావజాలం పరిపూర్ణంగా అభివృద్ధి చెందదు. టీనేజర్లు తీవ్రమైన భావజాలానికి సులువుగా ఆకర్షితులవుతారు. తమ భావాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సరైన పద్ధతులు ఇంకా వారికి తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు కోపం లేదా అసహనాన్ని ప్రదర్శించడం వల్ల వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పిల్లలు అసహనం చూపినప్పుడు తల్లిదండ్రులు కూడా అసహనం చూపకుండా శాంతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. టీనేజర్లతో కలిసి కూర్చుని, చర్చించి హద్దులను నిర్ణయించాలి. అది వారిలో బాధ్యతను పెంచుతుంది. మీ మద్దతే వారి ఆత్మవిశ్వాసం... తల్లిదండ్రుల మద్దతు టీనేజర్లలో ఆత్మవిశ్వాసం, సహనాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వయస్సులో పీర్ ప్రెషర్, అకడమిక్ ప్రెషర్ లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు వారి భావాలను, ఆలోచనలను అంగీకరిస్తూ మద్దతు ఇవ్వడం ద్వారా టీనేజర్లు భద్రత, నమ్మకం పొందుతారు, తద్వారా వారు ఈ సవాళ్లను అధిగమించడానికి తగిన ధైర్యాన్ని తెచ్చుకుంటారు. పరిశోధనల ప్రకారం తల్లిదండ్రుల మద్దతు గట్టిగా ఉన్న కౌమారులు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.మీరే ఆదర్శం... టీనేజర్లు తమ తల్లిదండ్రులను అనుకరించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రులు గౌరవమర్యాదలు, జాగ్రత్త, సానుకూల దృక్పథం, నైతికత, పట్టుదలను ప్రదర్శించడం ద్వారా వారికి శక్తిమంతమైన ఉదాహరణలుగా నిలుస్తారు. టీనేజర్లు ఆ విలువలను చూసి, వాటిని తామూ అమలు చేస్తూ సవాళ్లను ఎదుర్కొనే విధానంలో పాజిటివ్‌గా ఉంటారు.బంధం బలపడాలంటే... ⇒ కలిసి భోంచేయడం, షికారుకు వెళ్లడం, సినిమాలు చూడటం వంటి మామూలు పనులు చేయండి. ఇది ఒత్తిడిలేని పరస్పర బంధానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ⇒ఎప్పుడూ చదువు, కెరీర్ గురించే మాట్లాడకుండా, అప్పుడప్పుడూ వారి ప్రపంచంపై ఆసక్తి చూపండి. వారికి నచ్చిన సినిమాలు, మ్యూజిక్ బ్యాండ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం ద్వారా తరాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించవచ్చు. ⇒ఎప్పుడూ వారి గదిలోకి దూరిపోకుండా, వారి స్పేస్, ప్రైవసీని గౌరవించండి. అది వారు అటానమీని అభివృద్ధి చేసుకోవడానికి అవసరం. ⇒ఏదైనా గొడవ వచ్చినప్పుడు కోపంతో తిట్టకుండా, తప్పు పట్టకుండా... ‘నీ ప్రవర్తనకు నేను బాధపడుతున్నాను’ లాంటి ‘ఐ స్టేట్మెంట్స్ వాడండి. అది డిఫెన్సివ్ నెస్‌ను తగ్గిస్తుంది. ⇒వారు చేసిన పొరపాట్లను పక్కకు నెట్టేసి, వారి విలువను, ప్రేమను గుర్తుచేసేలా మాట్లాడండి. దాంతో మీరు వారిని అంగీకరించారనే భద్రతను పొందుతారు. -
USA Presidential Elections 2024: స్వేచ్ఛకే అమెరికన్ల ఓటు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నమ్ముకున్న విద్వేషాన్ని, విభజనవాదాన్ని అమెరికన్లు ఓడించడం ఖాయమని కమలా హారిస్ ధీమా వెలిబుచ్చారు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిరక్షణకే ఓటేయాలని దేశమంతా పట్టుదలగా ఉంది. నెలల తరబడి దేశవ్యాప్తంగా జరిపిన ప్రచారం భాగంగా నాకిది కొట్టొచ్చినట్టు కన్పించింది’’ అని చెప్పారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లోని డెట్రాయిట్లో ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘ఈసారి రెడ్ (రిపబ్లికన్లకు ఓటేసేవి) స్టేట్స్, బ్లూ (డెమొక్రాట్లకు ఓటేసేవి) స్టేట్స్ అంటూ విడిగా లేవు. అన్ని రాష్ట్రాలూ కలిసి చరిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నాయి. మార్పు కోసం అమెరికా యువత ఈసారి భారీ సంఖ్యలో కదం తొక్కుతున్నారు. దేశ మౌలిక విలువల పరిరక్షణకు ముందుకొస్తున్నారు’’ అని స్పష్టం చేశారు. -
స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎంతో విలువైనవి: సీజేఐ
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్య్రం విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జస్టిస్ చంద్రచూడ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత చరిత్రను పరికిస్తే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంత విలువైనవో అవగతమవుతుందని పేర్కొన్నారు. ఇవి సులువుగా లభిస్తాయని అనుకోవద్దని సూచించారు. దేశంలో సాటి పౌరుల పట్ల మన బాధ్యతలను స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం దోహదపడుతుందని అన్నారు. మన దేశంలో న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేశారని, వృత్తిని తృణప్రాయంగా వదిలేసి దేశ సేవ కోసం అంకితమయ్యారని కొనియాడారు. పౌరులుగా దేశం పట్ల, సాటి మనుషుల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను అందరూ చక్కగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. -
బాట మార్చుకున్న మానవతావాది
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక శాంతి యుత పరివర్తన రావాల్సింది పోయి, ఎక్కడికక్కడ ఉద్యమాలు తలెత్తాయి. కేంద్రం, రాష్ట్రాల నుండి బ్రిటిష్ పాలకులు వైదొలిగారు. కానీ గ్రామీణ వ్యవస్థలు మారలేదు. భూమిపై ఉన్న హక్కులు రద్దు కాలేదు. దాంతో భూస్వాముల వర్గం అన్ని రంగా ల్లోనూ ఎదుగుతూ వచ్చింది. అంబేడ్కర్ భూమిని జాతీయం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా సోషలిజాన్ని బహుళ పార్టీ వ్యవస్థలో సాధించడం ఎలాగో రోడ్ మ్యాప్ వేశారు. కానీ అది జరగలేదు. పర్యవ సానంగా ప్రజలు భూమి కోసం ఉద్యమ బాట పట్టారు. ప్రభు త్వాలు సమస్యను పరిష్కరించే బదులు బల ప్రయోగంతో అణిచి వేయాలని చూశాయి.రాజ్యాంగం మహోన్నత లక్ష్యా లతో రాయబడింది గానీ ప్రజలకు దాన్ని అందించలేదు, వివరించలేదు, చదివించలేదు. ఏదో రష్యాలో, చైనాలో గొప్పగా వుందట అని చెపితే జనం నమ్మారు. మార్క్సిజం సిద్ధాంతాలు చెప్తే బాగుందనుకున్నారు. ఆదర్శ సమాజం అనే భావన ఆకర్షించింది. ఆ బాటలో సాగిన గద్దర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంటరాని కులంలో పుట్టి, ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదివి, బ్యాంకులో ఉద్యోగం చేసి, తాను నమ్మిన కళ కోసం, సాంస్కృతిక విప్లవం కోసం ఉద్యోగాన్ని వదిలి,దిగంతాలకు ఎదిగిన మహా కళాకారుడయ్యాడు. అరుదైన గాయకుడిగా, ప్రజా కవిగా విప్లవోద్యమానికి ఊపిరులు ఊదాడు. ప్రజా వాగ్గేయ కారుడిగా విశ్వ వ్యాప్తం అవుతూ వచ్చాడు. గద్దర్ ఆట, పాట, కాలి అందెల సవ్వడి జనాన్ని ఉర్రూతలూగించి వేలాదిమంది యువకులను ఉద్యమాల బాట పట్టించింది. భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవో ద్యమానికి ఊపిరులు ఊదిన గద్దర్ ఫలితాలు రాక, విస్తరణ కోల్పోయిన ఉద్యమ దశను కళ్లారా చూశాడు. ఆశలు అడియాసలై, ఆత్మావలోకం చేసుకొని ఉద్యమకారులు అజ్ఞా తంలో ఉండి సాధించేది శూన్యం అని గుర్తెరిగి ప్రజాస్వామ్యం వైపు పరివర్తన చెందాడు.అనుభవం నేర్పిన పాఠాలతో ఉద్యమాల బాట సాధించేది ఏమీలేదనీ, ప్రజాస్వామ్య బాటనే భేష్ అనీ భారత రాజ్యాంగాన్ని ఆలస్యంగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అప్పటికి జరగరాని నష్టం జరిగిపోయింది. వేలాది మంది యువకులు నేలకొరిగారు. నడిచిన దారి తప్పు అని చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకొక బాధ. ఈ రెండింటి మధ్య గద్దర్ చాలాకాలం నలిగి పోయాడు. ఈలోపు మలి తెలంగాణ ఉద్యమం రాజు కోవడంతో ఉవ్వెత్తున లేచాడు. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. 6 తూటాలు దిగాయి. అయినా తెలంగాణ కోసమే బతికినట్టయింది. ఆ మధ్య ఒక విలేఖరి ఇలా ప్రశ్నించాడు: ‘‘మీరు భారత రాజ్యాంగం, దాని మౌలిక లక్ష్యాలు చదవకుండా, రాజ్యాంగ ఆచరణతో సమాజంలో, జీవితాల్లో వచ్చిన మార్పులు పరిశీ లించకుండా మార్క్సిజం, మావో యిజం కరెక్టు అని ఎలా అనుకున్నారు? సాయుధ విప్లవంలో ఎందుకు చేరారు?’’ ‘‘రాజ్యాంగంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని మాకె వరూ చెప్పలేదు. సోషలిజం సాయుధ పోరాటంతోనే వస్తుందనుకున్నాం. భారత రాజ్యాంగం చదవకుండా విప్లవం చేయాలనుకోవడం తప్పే. సోషలిస్టు రష్యాలో, పీపుల్స్ చైనాలో ప్రజల హక్కులు, ప్రభుత్వ నిర్వహణ, న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా విప్లవం చేయాలనుకోవడం పొరపాటే. అందుకే ఇపుడు భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం’’ అని చెప్పాను. గద్దర్ ఆశయం ప్రజాస్వామ్య సోషలిజం సాధన.బౌద్ధం, అంబేడ్కరిజం, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన అంతిమ లక్ష్యం. అంటరానితనం, అసమానతలు, దోపిడీ, మనిషి పై మనిషి ఆధిపత్యం చేసే సంస్కృతి పోవడం గద్దర్‌తో పాటు మన లక్ష్యం కూడా కావాలి. అదే గద్దర్‌కు నిజమైన నివాళి.బి.ఎస్. రాములు వ్యాసకర్త తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్(నేడు గద్దర్ తొలి వర్ధంతి) -
మంకీ ట్రాప్ గురించి విన్నారా..?
మంకీ ట్రాప్ ఏంటీ అనుకోకండి. ఎందుకుంటే తెలియకుండానే మన అందరం ఈ ట్రాప్‌లో పడిపోతున్నాం. చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. నిజానికి మన పెద్దవాళ్లు కొన్నింటిని వదిలేసేందుకు ఇష్టపడితేనే హాయిగా ఉండగలం అని చెబుతుంటారు. కానీ మనం వదలం. పట్టుకుని కూర్చొంటాం. జరగాల్సిన నష్టం జరిగేటప్పటికే మనం ఉండం. ఇలా ఈ భూమ్మీద ఎందరో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటీ ట్రాప్..? అంతలా మనం ఆ ట్రాప్‌లో ఎలా పడతామంటే..రెండు రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్త పరిశీలిస్తే..భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి సంచిలో అక్షరాల మొత్తం 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం". ఇక్కడ... విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.మంకీ ట్రాప్ అంటే..దీన్నే "మంకీ ట్రాప్" అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఒక తెగ వారు ఉపయోగిస్తారు. వాళ్లు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతే..? అయితే ఇటువంటి మంకీ ట్రాప్‌లో మనం ఉన్నట్లే.. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచిపెట్టుకొని ..ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక.. తనువు చాలించిన వారు చాలా మందే సమాజంలో ఉన్నారు. డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టి పడేస్తుందా?? అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్‌లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్ లో ఉన్నామనే విషయం గ్రహించకపోవడం విశేషం. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేం? ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు. అందుకే చిన్న మోతాదులో కానీ, పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్‌లో ఏమైనా ఉన్నామేమో? చెక్ చేసుకోవాలి.అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. ఉదాహారణకు..మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...నో చెప్పలేని మోహమాటలు...తిరిగి అడగలేని అప్పులు...దండిచలేని ప్రేమలు...ఊపిరి సలపనివ్వని పనులు...ఒత్తిడి పెంచే కోరికలు....ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...పేరు కోసం తీసే పరుగులు....అన్నీ మంకీ ట్రాప్ లే!!అందుకే కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం...... మరింత మనశ్శాంతిగా...ప్రశాంతముగా" ఉండేందుకు ప్రయత్నించండి అని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. (చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
CNG-Powered Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ (ఫొటోలు)
-
వ్యక్తిగత స్వేచ్ఛే... సుప్రీమ్!
భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని తేల్చి చెప్పాయి. పీఎమ్ఎల్ఏ, ఉపా వంటి చట్టాల అమలులో వ్యక్తమవుతున్న ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం కీలకమైన రాజ్యాంగ భద్రత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యాన్నీ, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కునూ ఎత్తిపట్టింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు... మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎమ్ఎల్ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ– ఉపా) వంటి కఠినమైన చట్టాల అమలు సందర్భంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని గట్టిగా నొక్కి వక్కాణించాయి. ఆర్థిక నేరాలను, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన ఈ చట్టాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. చట్టాన్ని అమలు చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య ప్రమాణాలను సమతుల్యం చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను తెలియజేసేలా, మే నెలలో వారంలోపు వ్యవధిలో ఈ తీర్పులు వెలువడ్డాయి. న్యాయబద్ధత, నిర్బంధంలోకి తీసుకునే అధికారాలను ఉపయోగించడంపై వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి.పీఎమ్ఎల్ఏ కింద దాఖలు చేసిన చార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత మే 16న వెలువరించిన కీలకమైన తీర్పులో, వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఉన్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం కుదించింది. న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత, ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను ఈడీ అరెస్టు చేయలేదని న్యాయమూర్తులు ఏఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్ ప్రకటించారు. విచారణ సమయంలో అరెస్టు చేయని నిందితులకు వారెంటుకు బదులుగా ప్రత్యేక కోర్టులు సమన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం ఏకపక్ష నిర్బంధాలను నిరోధిస్తుంది. కోర్టుకు హాజరయ్యే వారిని మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం కఠినమైన బెయిల్ ప్రక్రియలోకి నెట్టకుండా హామీనిస్తుంది. నిందితుడి బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అవకాశం ఇవ్వాలని సెక్షన్ 45 నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, నిందితుడు నిర్దోషి అనీ, బెయిల్‌పై ఉన్నప్పుడు ఎలాంటి నేరం చేసే అవకాశం లేదనీ విశ్వసించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని ట్రయల్ కోర్టుకు నమ్మకం కలిగించడం అవసరం. ఈ పరిస్థితులు సాధారణంగా మనీ లాండరింగ్ కేసులో నిందితుడు బెయిల్ పొందడాన్ని సవాలుగా మారుస్తాయి. సమన్లు పంపిన తర్వాత హాజరయ్యే నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినట్లయితే, అది సంబంధిత ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరాన్ని గుర్తించిన తర్వాత ఈడీ చేసే అరెస్ట్ అధికారాలను పరిమితం చేయడం ద్వారా, కోర్టు సమన్లను పాటించిన నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, అయోమయం కలిగించే, కఠినమైన పీఎంఎల్ఏ బెయిల్ ప్రక్రియలో జరిగే దుర్వినియోగాలను పరిష్కరించడం ఈ తీర్పు లక్ష్యం.అదేవిధంగా, ఈడీ అరెస్టులు చేసే ముందు నేరాలను అంచనా వేయవలసిన అవసరాన్ని మే 17న సుప్రీంకోర్టు చేసిన న్యాయపరమైన ఉత్తర్వు నొక్కి చెప్పింది. పీఎమ్ఎల్ఏ కింద నమోదయ్యే నేరాలు ‘పరాన్నజీవి‘ స్వభావంతో కూడి ఉన్నాయనీ, ముందస్తు నేరాల ఉనికి అవసరమనీ ఆ తీర్పు నొక్కి చెప్పింది. ముందస్తు నేరం లేకుండా, పీఎంఎల్ఏ ఆరోపణలు స్వతంత్రంగా నిలబడలేవని న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్ నొక్కి చెప్పారు. ముందస్తు నేరంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిందితుల పేర్లు లేకపోయినా, ఒక కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలను విచారించే ముందుగా ఈడీ ఆ కేసులో అంతర్లీనంగా ఉండే ముందస్తు నేరాలను క్షుణ్ణంగా నిర్ధారించాలని పేర్కొంది. ఆర్థిక నేర పరిశోధనల్లో బలమైన చట్టపరమైన ఆధారం అవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.ఈ దృక్పథం ఆర్థిక నేర పరిశోధనలలో బలమైన చట్టపరమైన పునాది అవసరాన్ని బలపరిచింది, పవన దిబ్బూర్ కేసులో సుప్రీంకోర్టు 2023 నవంబర్‌లో ఇచ్చిన తీర్పు హేతుబద్ధతను ఇది ముందుకు తీసుకువెళ్లింది. 2023లో కోర్టు నిర్ణయం ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర, మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించినంత మాత్రమే అది నేరం కాకూడదు. ఆ కుట్ర పీఎమ్ఎల్ఏ కింద తప్పనిసరిగా షెడ్యూల్ చేసిన నేరంగా నమోదు చేసిన నేరానికి సంబంధించినదై ఉండాలి. మే 15న సుప్రీంకోర్టు తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యతను, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కును ఎత్తిపట్టింది. ఢిల్లీ పోలీసుల విధానపరమైన లోపాలను న్యాయమూర్తులు బీఆర్ గవయీ, సందీప్ మెహతా విమర్శించారు. ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని చెబుతున్న రాజ్యాంగ ఆదేశాన్ని నొక్కిచెప్పారు.భారతదేశ స్థిరత్వం, సమగ్రతకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో చైనా సంస్థల ద్వారా విదేశీ నిధులను స్వీకరించిన ఆరోపణలపై 2023 అక్టోబర్‌లో పుర్కాయస్థను అరెస్టు చేసిన తరువాత ఉపా కింద పోలీసు కస్టడీకి పంపిన తీరుపై సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా విమర్శించింది. ఆయన అరెస్టు, రిమాండ్‌ను ‘రహస్యంగా‘ నిర్వహించారని కోర్టు పేర్కొంది. ‘ఇది చట్టబద్ధమైన ప్రక్రియను తప్పించుకునే కఠోరమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు; నిందితుడిని అరెస్టు చేసిన కారణాలను తెలియజేయకుండా పోలీసు కస్టడీకి పరిమితం చేశారు. న్యాయవాదుల సేవలను పొందే అవకాశాన్ని నిందితుడికి హరించారు. బెయిల్ కోరడం అనేది నిందితుడి ఎంపిక’ అని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనీ లాండరింగ్ చట్టం, ఉపా చట్టం రెండింటిలోనూ అరెస్టుకు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియజేయాలని కోరడమైనదనీ, ఈ అవసరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)లో వేళ్లూనుకుని ఉందనీ కోర్టు పేర్కొంది. ఇది తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే అంశంపై ప్రజల హక్కును పరిరక్షిస్తుంది. పంకజ్ బన్సాల్ కేసులో 2023 అక్టోబరు 3 నాటి తీర్పులో ఉపా కేసులకు వర్తించదంటూ ఢిల్లీ పోలీసుల వాదనకు ప్రతిస్పందనగా న్యాయస్థానం ఈవిధంగా ప్రకటించింది. దీని ప్రకారం నిందితులను అరెస్టు చేసేటప్పుడు ఈడీ పత్రబద్ధమైన ఆధారాలను అందించాలి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం అనేది కీలకమైన రాజ్యాంగ భద్రత అనీ, పారదర్శకతను, న్యాయాన్ని నిర్ధారించడానికి ఏకరీతిగా దీనిని వర్తింపజేయాలని న్యాయస్థానం నొక్కి చెప్పింది. చట్టాలను అమలు చేసే సంస్థలకు విస్తృతమైన అధికారాలను కల్పించే విధానాలలోని పారదర్శకత, న్యాయమైన ఆవశ్యకతను ఈ తీర్పు పునరుద్ఘాటించింది.వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడానికి, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు తగిన ప్రక్రియకు, న్యాయానికి కట్టుబడి ఉండేలా చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పులు సమష్టిగా సూచిస్తాయి. ఈ నిర్ణయాలు చట్ట నియమాన్ని పటిష్ఠం చేస్తాయి. ఈడీ వంటి ఏజెన్సీలు వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవిస్తూ చట్టపరమైన సరిహద్దుల్లో పని చేసేలా చూస్తాయి. ఈ విధానం ప్రజల హక్కులను పరిరక్షిస్తుంది. ఉగ్రవాదం, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో కీలకమైన విధులను అందించే చట్టాల అమలు సంస్థల విశ్వసనీయతను, జవాబుదారీతనాన్ని ఏకకాలంలో ఇది పెంచుతుంది.ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అక్కడ సామాజిక కట్టుబాట్లపై సాధించిన విజయానికి గుర్తుగా హోలీ!
మన భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ పలు పండుగలను జరుపుకోనివ్వకుండా నిషేధాలు ఉండేవి. వారు నలుగురుతో కలిసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. కనీసం చూడటానికి కూడా ఉండేది కాదు. చెప్పాలంటే నాలుగు గోడల మధ్యనే బంధించేసేవారు. వారికి కావాల్సినవి తీసుకొచ్చి వారి గది బయటపెడితే తీసుకోవాలి అంతే. ఎవ్వరికీ కనిపించను కూడా కనిపంచకూడదు. అంత దారుణమైన గడ్డు పరిస్థితుల్లో జీవించేవారు నాటి వితంతువులు. ఇప్పుడిప్పుడే కొంచె వారిని మంచిగానే చూస్తున్నా..కొన్ని విషయాల్లో వారి పట్ల అమానుషంగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఇలాంటి హోలీ పర్వదినం రోజున బయటకు అస్సలు రాకూడదు, రంగులు జల్లుకోకూడదట. వారికోసం ఓ ఎన్జీవో ముందుకోచ్చి సుప్రీం కోర్టులో పోరాడి మరీ వారు కూడా సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. ఈ కథ ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోlr వింతతు స్త్రీలను మాత్రం రంగుల హోలీలో పాల్గొనిచ్చేవారు కాదు. అస్సలు వారు సెలబ్రేట్ చేసుకోకూడదని నిషేధం విధించారు అక్కడి పెద్దలు. తెల్లటి చీరతో ఉండేవారికి సంతోషానికి ప్రతీకలైన రంగులను ముట్టకూదని కట్టుదిట్టమైన ఆంక్షాలు ఉండేవి. పితృస్వామ్య నిబంధనలు గట్టిగా రాజ్యమేలుతున్న ఆ బృందావన్‌లో వారి స్థితి అత్యంత కడు దయనీయంగా ఉండేది. వారి జీవితాలలో వెలుగు నింపేందుకు ఎన్జీవ్ సులభ్ ఇంటర్నేషన్ల అనే స్వచ్ఛంద సంస్థ మార్పుకు నాంది పలికింది. ఆ ఎన్జీవో మహిళా సాధికారత, సామాజిక సమ్మేళనం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది. ఆ స్వచ్ఛంద సంస్థ ఇలాంటి నిబంధనలను తొలగించి వారుకూడా అందరిలా పండుగలను చేసుకునేలా చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించి మరీ వారికి సామాజిక కట్టుబాట్ల నుంచి విముక్తి కలిగించింది. అయినప్పటికీ ఆ వితంతువులు పండుగ చేసుకోవడం చాలా సవాలుగా ఉండేది. సరిగ్గా 2012 నుంచి వారంతా కూడా ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచే ప్రతి ఏటా ఈ హోలీ రోజున వారంతా కృష్ణుని సమక్షంలో ఆడి పాడి వేడుకగా చేసుకుంటున్నారు. అంతేగాదు ఈ ఒక్క పండుగే గాక దీపావళి వంటి ఇతర అన్ని పండుగలు చేసుకునేలా స్వేచ్ఛను పొందారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పండుగలకు దూరమై ఉన్న ఆ వితంతువులను ధైర్యంగా అడుగు వేసి, తాము సాటి మనుషులమే ఇది తమ హక్కు అని వారికి గుర్తు చేసింది ఆ స్వచ్ఛంద సంస్థ. ఆ వితంతువులు ఈ హోలీని స్త్రీ ద్వేషం, పితృస్వామ్య నిబంధనలపై విజయం సాధించి, పొందిన స్వేచ్ఛకు గుర్తుగా సంతోషభరితంగా చేసుకుంటారు ఆ వితంతువులు. చెప్పాలంటే ఇది అసలైన హోలీ వేడుక అని చెప్పొచ్చు కథ! (చదవండి: రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?) -
ట్రంప్ ప్రపంచానికే ముప్పు
వాషింగ్టన్: తన కంటే ముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా దుమ్మెత్తి పోశారు. ఏ అధ్యక్షుడైనా అమెరికా ప్రజలను రక్షించడాన్ని కనీస బాధ్యతగా భావిస్తాడని, ఈ విషయంలో ఆ మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని, అతడిని క్షమించలేమని అన్నారు. బైడెన్ గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటపాటు మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పేరును 13 సార్లు పరోక్షంగా ప్రస్తావించారు. పలు అంశాల్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లాడని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘నాటో’ దేశాలను ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్‌కు సూచించాడని ఆరోపించారు. పుతిన్ చర్యలను అడ్డుకోకపోతే ప్రపంచ దేశాలకు నష్టం తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు మరణించడం చూసి తాను తీవ్రంగా చలించిపోయానని బైడెన్ చెప్పారు. గంజాయి తీసుకుంటే నేరం కాదు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ నెగ్గడానికి యువ ఓటర్ల మనసులు గెలుచుకొనే పనికి శ్రీకారం చుట్టారు. గంజాయి తీసుకుంటే, గంజాయి కలిగి ఉంటే నేరంగా పరిగణించవద్దని తేలి్చచెప్పారు. గంజాయి విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించానని చెప్పారు. సాధారణంగా స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్‌లో తమ విదేశాంగ విధానంతోపాటు దేశీయంగా కీలక అంశాలను అమెరికా అధినేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ, గంజాయి గురించి మాట్లాడిన మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం బైడెన్ కావడం విశేషం. -
స్వేచ్ఛ ఎంత వరకు సాధ్యం?
స్వ + ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకరోవటం అనే అ΄పోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కు΄పోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసము΄పార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు ΄÷రల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభి్రయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయం లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. – డా. ఎన్. అనంత లక్ష్మి -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఫ్రీడమ్ విస్తరణకు ప్రణాళికలు - కేరళ, తమిళనాడులో ప్రవేశించడానికి సన్నద్ధం..
BRAND SUTRA: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ 'ఫ్రీడమ్'.. 2024లో బ్రాండ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశిస్తుందని, ఆ తరువాత మహారాష్ట్రలో అరంగేట్రం చేయనున్నట్లు సేల్స్ అండ్ మార్కెటింగ్, జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా SVP పి చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. కంపెనీ అతి పెద్ద నగరాల్లో ప్రవేశించిన తరువాత మరిన్ని ఫ్రీమియం ఆఫర్ల కోసం ప్లాన్ చేస్తున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఈయన 2009లో బ్రాండ్ పేరు రూపొందించడానికి ముందు, చాలా కాలం ఎడిబుల్ ఆయిల్స్ విభాగంలో ఉన్నారు. ఆ తరువాత సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ 'ప్రదీప్ చౌదరి' బృందం సహకారంతో బ్రాండ్ వేగంగా స్థిరపడింది. 2010లో బ్రాండ్ దాని స్వంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. దక్షిణ భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల రెడ్డి బృందం ఇతర ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరువాత ఒరిస్సా, కర్ణాటకలో బ్రాండ్ ప్రారంభమైంది. ఆ తరువాత చత్తీస్‌గఢ్‌లో కూడా ప్రారంభమైంది. 2024లో తమిళనాడు, కేరళలో ప్రారంభించనున్నట్లు చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. బ్రాండ్ ప్రారంభమై దాదాపు 13 సంవత్సరాలు కావొస్తోంది. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు, రానున్న రోజుల్లో మరింత వృద్ధి పొందటానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఇది కేవలం మార్కెటింగ్ మాత్రమే కాదు, సరఫరా అవసరాలను నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా. ప్రారంభంలో కొంత మందకొడిగా ఉన్నప్పటికీ 2014 - 15 నాటికి దేశంలోని వివిధ రాష్ట్రలో నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలిచింది. ఆ తరువాత 2022 నాటికి జాతీయ స్థాయిలో కూడా పొందగలిగినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత మార్కెట్‌కు అవసరమైన 2.2 మిలియన్ టన్నులలో దాదాపు 95 శాతం దిగుమతి ఉంది. ఇందులో 22 నుంచి 23 శాతం ఫ్రీడమ్ ఉండటం గర్వించదగ్గ విషయం. -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
స్వాతంత్య్రానంతరం కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు
కశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ 10 లీటర్ల రిలీజ్
-
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఇంత కంటే గొప్పగా చెప్పలేరేమో!
ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా తన రోజూవారీ పనుల్లో తలమునకలవుతున్నా సరే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సందర్భాను సారం ఆసక్తికరమైన పోస్ట్‌లను అప్డేట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటారు. తాజాగా, భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఓ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇక ఆ వీడియోలో సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మంగా భావించే మూడు గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న భారత్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ జనగణమన అధినాయక జయహే అంటూ జాతీయ గీతాన్ని తన మ్యూజిక్ బృందంతో అలపించారు. ఇంగ్లాండ్‌లో అబ్బే రోడ్ స్టూడియోస్ అనే రికార్డింగ్ స్టూడియోలో నివాళులర్పించిన రిక్కీ కేజ్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..ఇలా ఇంతకన్నా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేరేమో అని ట్వీట్లో పేర్కొన్నారు. The World is indeed round. Things come full circle. 76 years after wresting our freedom from the British, an Indian CONDUCTS their finest orchestra in a tribute to our Independence. 🇮🇳🇮🇳🇮🇳 No better to wish you all a very Happy Independence Day pic.twitter.com/LQSBQNnuOY — anand mahindra (@anandmahindra) August 15, 2023 -
‘స్వేచ్ఛ’యను రెండక్షరములు...
‘స్వేచ్ఛ’ అంటే కేవలం రెండక్షరాలు కాదు, దిగంతాలను కొలిచే పక్షికి రెండు రెక్కలు;భూమండలాన్ని చుట్టే మనిషికి రెండు పాదాలు; స్వేచ్ఛ అంటే ఒక నిర్నిబంధమైన మాట; ఒక స్వతంత్రమైన చేత. హద్దులేని ఆకాశమూ, అంతులేని భూమండలమూ స్వేచ్ఛాసంచారానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లు. ప్రకృతి నిఘంటువులో మొదటి మాటా, చివరి మాటా స్వేచ్ఛే! ఎగిరే పక్షిని ఏ వేటగాడి బాణమో పడగొట్టినప్పుడూ, నడిచే మనిషి కాళ్ళకు ఏ నిరంకుశపు సంకెళ్ళో పడినప్పుడూ, ఏ నిషేధాల కత్తుల బోనులోనో మాట బందీ అయినప్పుడూ అది అక్షరాలా ప్రకృతి మీద జులుము, ప్రకృతి ఏర్పాటు మీద దాడి. స్వేచ్ఛ రెక్క విరిచిన రోజు వచ్చి వెడుతూ, దాని విలువను మరోసారి గుచ్చి చెప్పింది. చెరబడ్డప్పుడు తప్ప సాధారణ పరిస్థితుల్లో పూర్తిగా గుర్తించలేని విలువ స్వేచ్ఛ. అడవుల పాలైన ధర్మరాజుకు ఆ విలువ తెలుసు. మనిషికి ఆనందమిచ్చేది ఏదని యక్షుడు అడిగినప్పుడు ప్రవాసంలో కాకుండా స్వవాసంలో ఉండడమేనంటాడు. పరాయి పాలనలో వ్యధార్త జీవితాలు గడిపిన నిన్నమొన్నటి మన స్వాతంత్య్ర సమరయోధులకు, ఇతర బుద్ధిజీవులకే కాదు; సామాన్య జనానికి సైతం స్వేచ్ఛ విలువ తెలుసు. ‘స్వేచ్ఛ మన ఊపిరి’ అంటాడు మహాత్మాగాంధీ. ఊపిరి నిలుపుకోవడానికి ఎంత మూల్యమైనా చెల్లించవలసిందే. ‘ఎక్కడ మనసు నిర్భయమవుతుందో, ఎక్కడ తలెత్తుకుని ఉండగలమో, ఎక్కడ జ్ఞానం శృంఖలాబద్ధం కాదో, ఎక్కడ సంకుచితపు గోడలతో ప్రపంచం ముక్కముక్కలు కాదో, ఎక్కడ మాట సత్యపు లోతుల్లోంచి జాలువారుతుందో, ఎక్కడ శ్రమించే చేతులు పరిపూర్ణత వైపు బారలు చాచగలవో, ఎక్కడ హేతుత్వమనే స్వచ్ఛ స్రవంతి దారి తప్పకుండా ఉంటుందో...’ అలాంటి స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం విశ్వకవి టాగోర్ పరితపిస్తాడు. మానసిక స్వేచ్ఛనే నిజమైన స్వేచ్ఛగా బాబా సాహెబ్ అంబేడ్కర్ అభివర్ణిస్తాడు. సంకెళ్లలో లేకపోయినా స్వేచ్ఛాయుత చింతన లేనివాడు బానిసే తప్ప స్వతంత్రజీవి కాడనీ, జీవన్మృతుడనీ అంటాడు. ‘మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ ప్రతిచోటా సంకెళ్ళలో చిక్కుకున్నా’డన్న రూసో నిర్వచనం ఎంతైనా నిజం. స్వేచ్ఛా, మనిషీ కలిసే పుట్టారు. ఆధిపత్యాలు, అంకుశాలు, అణచివేతలు తర్వాత వచ్చాయి. దేశాల హద్దులూ, వీసాల నిర్బంధాలూ లేని కాలంలో మనిషి స్వేచ్ఛగా భూమండలమంతా కలయదిరిగాడు. అందుకే ప్రపంచంలోని ప్రతి తావూ అతని చిరునామా అయింది. సంస్కృతీ, నాగరికతలను సంతరించుకున్న తర్వాతా; భాషాభేదాలూ, ప్రాంతాల తేడాలూ, జాతీయతా వాదాలూ పొటమరించిన తర్వాతా అతని స్వేచ్ఛాగమనానికి అడ్డుగోడలు లేచాయి. అదొక విచిత్ర వైరుద్ధ్యం. వేల సంవత్సరాల క్రితం జరిగిన జన్యుపరివర్తన కారణంగా గొంతుముడి వీడి మనిషి మాట్లాడగలిగిన దశకు చేరాడంటారు. అప్పుడు తన ఆనందోద్వేగాలను ఎంత స్వేచ్ఛగా గొంతెత్తి ప్రకటించుకుని ఉంటాడో! క్రమంగా తన మాటను రకరకాల నిషేధాలూ, నిర్బంధాల కత్తివేటూ భయపెట్టినప్పుడు స్వేచ్ఛనుడిగి మూగవోయిన దుఃఖచరిత్ర అతనిది. పురాణకాలం నుంచి నవీనకాలం వరకూ ఏ ఘట్టంలోనూ స్వేచ్ఛారాహిత్యంతో రాజీపడని ధిక్కారచరిత్రా అతనికుంది. తన సహజస్వేచ్ఛపై అత్యాచారం శ్రుతిమించిన ప్రతిసారీ అగ్గిరవ్వ అయ్యాడు. చండశాసనం ఉన్నచోట దాని అతిక్రమణా ఉండితీరుతుందనడానికి రామాయణమే సాక్ష్యం. హనుమంతుడు సీతను చూసొచ్చిన తర్వాత సంబరం పట్టలేకపోయిన వానర సమూహం కిష్కింధలోని మధువనంలోకి జొరబడి అక్కడి తేనెతో విందు చేసుకుని, మత్తిల్లి వనాన్ని ధ్వంసం చేస్తారు. ఆ క్షణంలో వారిలో పురివిప్పిన స్వేచ్ఛాసహజాతం చండశాసనుడైన తమ ఏలిక సుగ్రీవుడు దండిస్తాడన్న భయాన్ని కూడా జయించింది. పీడనకూ, పెత్తనానికీ గురవుతున్నాసరే తమ సహజసిద్ధమైన స్వేచ్ఛాదాహాన్ని తీర్చుకునేందుకు మనిషి అవకాశాలు వెతుక్కుంటూనే ఉంటాడు. ఆ మేరకు పెత్తందార్లకూ, పీడితులకూ మధ్య రాజీ ఏర్పాట్లు కూడా ఉండేవి. ఈ సందర్భంలో ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత రాంభట్ల కృష్ణమూర్తి తన ‘సొంతకథ’లో ‘వాలకం’ అనే ప్రదర్శన రూపాన్ని ప్రస్తావిస్తారు. గౌరమ్మ సంబరాలప్పుడు కొంతమంది గ్రామస్తులు ఊళ్ళోని మోతుబరుల వేషంకట్టి వారి నడకను, నడవడిని అనుకరిస్తూ పాటల రూపంలో వారిపై ఆక్షేపణను చాటుకోవడమే ‘వాలకం’. ఒక్కోసారి ఆగ్రహించి మోతుబరులు దేహశుద్ధి చేయడం గురించీ ఆయన రాస్తారు. ఈ శతాబ్ది ప్రారంభంలో ఇలాంటి ప్రదర్శన అమెరికాలోనూ ఉండేదనీ, దానిని వాడెవిల్ అంటారనీ, చార్లీ చాప్లిన్ ఇందులో ప్రసిద్ధుడనీ ఆయన అంటారు. పురాతన సుమేరు సమాజంలో జనం ఎలాంటి నిర్బంధాలూ, నిబంధనలూ లేని స్వేచ్ఛను అనుభవించడానికి ఏటా వారం రోజులు కేటాయించేవారు. అలాగని స్వేచ్ఛ అంటే ఎలాంటి అదుపాజ్ఞలూ లేని ఇచ్ఛావిహారం కాదు. సమష్టి శ్రేయస్సు కోసం స్వీయ నియంత్రణలో ఉంచుకోవలసిన బాధ్యత కూడా! పాలకులు, పాలితుల వ్యవహరణలో ఎక్కడ తూకం తప్పినా దెబ్బతగిలేది స్వేచ్ఛకే! నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు చెల్లించే మూల్యం. -
మన ప్రజాస్వామ్యం కాగితపు పులా?
ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలో ఉందని ‘వి–డెమ్’ నివేదిక చెబుతోంది. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. కానీ భారత్ లాంటి దేశంలో ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకు పోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. మానవ హక్కులూ, ప్రజాస్వామ్య భావాలూ, సమానత్వ అంశాలూ మేళవింపుగా ఉన్న ఆధునిక రాజ్యాంగం కలిగిన దేశం కూడా. అయితే ఇటీవల ప్రజాస్వామ్య దేశం తన ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి నియంతృత్వ పోకడలకు దగ్గరవుతున్నట్టు, ‘వి–డెమ్’ తన పరిశోధనలో తేల్చింది. ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలోకి వెళ్ళింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ, ఆదిమ తెగలు, ఇతర వర్గాలకు సంబంధించిన స్వేచ్ఛల్లో మనం ఇతర దేశాలకన్నా వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనగానే ఒక ఐదారు అంశాలు ప్రస్తావనకు వస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛతో పాటు పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్వీడన్ విశ్వవిద్యాలయాల ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తోన్న వి–డెమ్ (విభిన్న ప్రజాస్వామ్యాలు) సర్వే కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలనే పేర్కొంటుంది. అయితే భారత్ సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో ఈ పరిశీలన మాత్రమే సరిపోదు. ఇక్కడ ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. మూల కారణం ప్రస్తుతం మన దేశంలో మోదీ పాలన నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదనే విషయం ఎక్కువగా చర్చకు వస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. రాజ్యాంగ విలువలకు స్థానం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించి అణచివేతను కొనసాగించారు. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వానికీ, మోదీ నియంతృత్వానికీ గుణాత్మకమైన తేడా ఉన్నదన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. ఇందిరాగాంధీ తన పాలనను కాపాడుకోవడానికి తాత్కాలికంగా నిర్బంధాన్ని అమలు జరిపారు. తదనంతరం తన తప్పు తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. మోదీ పాలన ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, ప్రజలను విభజించి, రాజ్యాంగం ప్రకటించిన ‘మేమంతా భారతీయులం’ అనే భావనకు చరమగీతం పాడుతున్నది. రెండువేల సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న కుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటున్నది. అయితే మోదీకి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఆ ధైర్యం కలగడానికి, అంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి పునాది ఇక్కడి కుల వ్యవస్థలో ఉంది. దానితో పాటు రోజురోజుకీ గుత్తాధిపత్యం వైపు వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రమాదాన్ని రాజ్యాంగ ముసాయిదాను సమర్థించిన 1949 నవంబర్ 25 రోజున బాబాసాహెబ్ అంబేడ్కర్ బహిరంగంగా దేశం ముందుంచారు. ‘‘ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ ద్వారా మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా ఆ తేడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో ఆ వ్యత్యాసాలను తొలగించుకోకపోతే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’’ అంటూ ఆనాడు చేసిన హెచ్చరిక ఈరోజు మరింత సత్యంగా కనపడుతున్నది. సోదరభావం కీలకం ఇతర దేశాల ప్రజాస్వామ్య భావనకూ, భారత దేశంలోని ప్రజాస్వామ్య అవగాహనకూ తేడా ఉన్న విషయాన్ని కూడా అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. 1936లో రాసిన కుల నిర్మూలనలోనే ఆయన తన ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. ప్రజాస్వామ్యం అనగానే అది ఎన్నికలు, పాలన, ప్రభుత్వాల విధానాలు అని అనుకోవడం పొరపాటనీ, అది ప్రజల మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తుందనీ కూడా అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి మూడు ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కీలకమని చెపుతూ, ఇందులో అత్యంత ముఖ్యమైనది సోదరత్వం అంటారు. ఇది భారత దేశంలో కొరవడిన అంశమని తేల్చారు. గత డెబ్భై అయిదు సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ అంబేడ్కర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. కులవ్యవస్థను నిర్మూలించే ఎటువంటి ప్రయత్నాన్ని గానీ, ప్రణాళికను గానీ కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో ఏనాడూ చేయలేదు. కేవలం ఆర్థిక తోడ్పాట్ల వంటివి మాత్రమే ఈ దేశంలో దళితులు, ఆదివాసుల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురాలేవనీ, కులవ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించగలిగే పక్కా ప్రణాళిక అవసరమనీ గుర్తించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. అదే ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. భారత దేశంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే బలవంతులు. ప్రజల్లో తరతరాలుగా నాటుకొని పోయిన కుల వ్యత్యాసాలు, కుల అసమానతలు ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. గత పదేళ్ళలో ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజే పీ ప్రభుత్వం మనగలుగుతుందంటే కులాలలోని విభేదాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే. దానితో పాటు, హిందూ మతంలోని పలు అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. గ్రామాల్లో ఏ కులాలైతే ఆధిపత్యంలో ఉన్నాయో వాటిని తమ బలంగా మార్చుకోవడం, అత్యధిక జనాభా కలిగిన కులాలను సమీకరించడం చూస్తే బీజేపీ ఎత్తుగడ ఏమిటో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అదే సమయంలో గత వందల ఏళ్ళుగా ముస్లింలు, హిందువుల మ«ధ్య ఉన్న వైషమ్యాలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా బలంగా వాడుకుంటున్నది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట నిజమే కానీ, దాని బలమేమీ తగ్గలేదు. కులాల పట్ల ప్రజల్లో ఉన్న భావాలను రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో ప్రభుత్వాల విధానాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో స్పష్టంగా కనపడుతున్నది. ఇటీవల దళితుల్లో పెరిగిన చైతన్యం అత్యాచారాల విషయంలో కేసులు నమోదు కావడానికి ఉపయోగపడింది. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య కులాలకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది బీజేపీ. తమ పార్టీ పునాదిగా ఉన్న ఆధిపత్య కులాలను మరింత సంతృప్తి పరిచేందుకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల పేరుతో అసలు రాజ్యాంగాన్నే అపహాస్యం చేసింది. చివరగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన వంటి విధానాలు ఏవి అమలు జరగాలన్నా కుల వ్యవస్థ ప్రధానమైన అవరోధం. దీనికి ప్రభుత్వాల బాధ్యత కన్నా, ప్రజల్లో కుల భావనలను తొలగించడం ముఖ్యం. ప్రజల్లో కుల అసమానతల పట్ల సానుకూలత ఉన్నంత వరకూ, గ్రామాల్లో ఇంకా ఈ కులవ్యవస్థ కొనసాగుతున్నంత వరకూ ప్రజాస్వామ్యమనే భావనకు ఆస్కారమే లేదు. తాత్కాలికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. అంబేడ్కర్ చెప్పినట్టు, ప్రజాస్వామ్యం, అంటే సమానత్వంతో కూడిన సామాజిక జీవన గమనం కోసం... ప్రభుత్వాల నిర్బంధాలు, నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే... ప్రజల్లో ఉన్న కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
మంచి మాట: జీవన స్పృహ
స్పృహ అనేది ప్రాణం ఉన్న ప్రతిమనిషికీ ఉండాల్సిన వాటిల్లో అతిముఖ్యమైంది. స్పృహ ఉండాలన్న స్పృహ కూడా లేనివాళ్లు ఉన్నారు. మనిషి ఏ పరిస్థితిలోనూ ఏ రకమైన మత్తుకూ లోనుకాకూడదు. ఏ రకమైన మత్తుకూ మనిషి చిల్తై పోకూడదు. కొన్ని సందర్భాల్లో మనిషిని నిస్పృహ ఆవరిస్తూ ఉంటుంది. దానికి కొనసాగింపుగా నిస్తేజం పట్టి పీడిస్తూ మనిషిని అదిమేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోంచి మనిషి తెప్పరిల్లి తేరుకోగలగాలి. అందుకు స్పృహ అనేది తప్పకుండా ఉండాలి. స్పృహతో నిస్తేజాన్ని నిశ్వాసిస్తూ ఉత్తేజాన్ని ఉచ్ఛ్వాసిస్తూ ఉండాలి; సత్తేజంతో ఉండాలి. మనిషిలో లేదా మనిషికి తప్పకుండా ఉండాల్సింది స్పృహ. స్పృహ అన్నది లేకుండా పోతే మనిషి తన నుంచి తాను తప్పిపోతాడు; మనిషి తనకు తాను కాకుండా పోతాడు. ఒక మనిషి తన జీవనోపాధిని కోల్పోవచ్చు, తన ఆస్తుల్ని కోల్పోవచ్చు, తనవి అన్నవాటిని అన్నిటిని ఒక మనిషి కోల్పోవచ్చు కానీ స్పృహను మాత్రం కోల్పోకూడదు. దేన్ని అయినా వదులుకోవచ్చు కానీ స్పృహను వదులుకోకూడదు. మనిషికి ఏదైనా లేకుండా పోవచ్చు కానీ స్పృహ లేకుండా పోకూడదు. తనకు తాను ఉన్నంత వరకూ, తనలో రక్తం పారుతున్నంత వరకూ మనిషికి స్పృహ ఉండాలి. మనిషి రక్తంలో స్పృహ పారుతూ ఉండాలి. మనిషిలో రక్తంలా స్పృహ ప్రవహిస్తూ ఉండాలి. తనలో స్పృహ ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితంలోకి ప్రయాణం చేస్తూ ఉండగలడు. స్పృహ మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. స్పృహ వల్ల మనిషికి బయటా, లోపలా చలనం కలుగుతుంది. ఆ చలనం గతికి, ప్రగతికి కారణం అవుతుంది. స్పృహ లేనప్పుడు మనిషికి ఏదీ అందదు, మనిషివల్ల ఏదీ జరగదు. స్పృహలేకపోతే మనిషికి గతి, ప్రగతి ఉండవు. ‘జీవితం నిన్ను బలపరిచేందుకు సిద్ధంగా ఉంది; అందుకు ముందు నువ్వు జీవితానికి తలుపు తెరిచి ఉంచాలి‘ అని జర్మన్ తాత్త్వికుడు ఎక్‌హార్ట్ టోల్ తెలియజె΄్పారు. స్పృహ ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితానికి తలుపు తెరిచి ఉంచగలం. లేదా మనకు ఉన్న స్పృహ మాత్రమే జీవితానికి తలుపు తెరిచి ఉంచగలదు. మత్తు జీవితాన్ని మూసేస్తుంది. మన మత్తును మనం వదిలించుకోవాలి. మనల్ని మన జీవితం బలపరచాలంటే మనకు స్పృహ కావాలి. ఎక్‌హార్ట్ టోల్ స్పృహ విషయంలో ఇంకా ఇలా స్పష్టతను ఇచ్చారు, ‘మనకు కలిగే ఆలోచనను స్పృహ అని అనుకోవడం తప్పు. ఆలోచన, స్పృహ పర్యాయపదాలు కావు. ఆలోచన అనేది స్పృహలోని ఒక చిన్న క్రియారూపం మాత్రమే. స్పృహ లేకుండా ఆలోచన ఉనికిలో ఉండదు; కానీ స్పృహకు ఆలోచన అవసరం ఉండదు’. మనం స్పృహ తోనే జీవనం చెయ్యాలి. మనకు ముందు కొందరికైనా సామాజిక స్పృహ ఉండి ఉండబట్టే ఇవాళ సమాజం ఉంది. సంగీతం, సాహిత్యం, ఇతర కళలపై స్పృహ ఉన్న కొందరివల్ల అవి చలామణిలో ఉన్నాయి. విద్య, వృత్తులు, పరిశోధనలు వంటివాటిపై మనకు పూర్వం ఉన్నవాళ్లకు స్పృహ ఉండబట్టే మనం మనుగడ చెయ్యగలుగుతున్నాం. స్పృహలేని మనిషి ఊపిరితో ఉన్న రాయి . మనం స్పృహతో మనుగడ చేద్దాం. రాళ్లల్లా కాదు మనుషులమై బతుకుదాం. – శ్రీకాంత్ జయంతి -
ఓడంటే ఓడా కాదు.. లక్ష మంది ఒకేసారి ప్రయాణించేలా..
ఓడంటే అలాంటిలాంటి ఓడ కాదు. ఇది తేలియాడే నగరం. అతి భారీ నౌకల కంటే పరిమాణంలో ఐదురెట్లు పెద్దదైన ఈ ఓడ పేరు ‘ఫ్రీడమ్ షిప్’. దీని పొడవే ఒక మైలు ఉంటుంది. ప్రస్తుతం ఇది తయారీ దశలో ఉంది. దీని తయారీ పూర్తయితే, ప్రపంచంలోని అతిపెద్ద ఓడలు కూడా దీనిముందు మరుగుజ్జుల్లాగానే కనిపిస్తాయి. ఈ ఓడను తయారు చేయాలని ముప్పయ్యేళ్ల కిందటే ఫ్లోరిడాకు చెందిన ఇంజినీరు నార్మన్ నిక్సన్ సంకల్పించాడు. అతడు 2012లో మరణించాడు. దీని తయారీ మొదలయ్యాక చాలా కంపెనీల చేతులు మారాక, 2020లో ప్రస్తుత యాజమాన్య సంస్థ ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ చేతికి చేరింది. సింగపూర్, ఇండోనేసియాలలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ సీఈవో రోజర్ గూష్ చెబుతున్నారు. అయితే, దీని డిజైన్‌కు రూపకల్పన చేసింది తామేనని భారత్‌కు చెందిన కనేతారా మెరైన్ సంస్థ చెబుతోంది. ఈ ఓడ తయారీ పూర్తయితే, ఇందులో ఏకంగా లక్షమంది ఒకేసారి ప్రయాణించే వీలు ఉంటుంది. ఇందులో నలభైవేల మంది శాశ్వత నివాసులు, ముప్పయివేల మంది వచ్చిపోయే జనాలు, పదివేల మంది హోటల్ అతిథులు, ఇరవైవేల మంది సిబ్బంది ఉంటారని చెబుతున్నారు. నిర్మాణం పూర్తయ్యాక ఈ ఓడ నిరంతరాయంగా సముద్రంలో ప్రపంచయాత్ర సాగిస్తూనే ఉంటుందని, సరుకులు నింపుకోవడానికి మాత్రమే అనుకూలమైన రేవుల్లో నిలుస్తుందని కూడా చెబుతున్నారు. చదవండి: Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం -
రష్యా దాడిని తట్టుకుని నిలబడతాం, గెలుస్తాం: జెలెన్ స్కీ
రష్యా దాడిని తట్టుకుని నిలబడటమే గాక కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ధీమాగా అన్నారు. ఈ మేరకు జెలెన్ స్కీ సోమవారం జరిగిన వార్షిక "ది డే ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్" సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు, ఆన్లైన్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, మిలటరీకోసం వంట చేస్తున్న గ్రామస్తులు, యూనిఫాంలు కుడుతున్న టైలర్లు, ప్రమాదం ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులు తదితరులందర్నీ ఈ యుద్ధ సమయంలో తమ వంతుగా సాయం అందించినందుకు ప్రశంసించారు తరచుగా క్షిపణి దాడులు, విస్తృత విధ్వంసం ఉన్నప్పటికీ వాటన్నింటని తట్టుకుని ఉక్రెనియన్లు తమ వంతుగా సేవలందించారని కొనియాడారు. తాము డబ్బు, పెట్రోల్, వేడి నీరు, వెలుతురు తదితరాలు లేకుండా కూడా ఉండగలం గానీ స్వేచ్ఛ లేకుండా మాత్రం ఉండలేం అని జెలెన్స్కీ అన్నారు. గతేడాది ఇదే రోజున తాను చక్కగా సూటు వేసుకుని, టై కట్టుకుని ఈ డే రోజున ప్రసంగించాను. ఈ ఏడాది యుద్ధ సమయంలో మిలటరీ దుస్తులతో ప్రసంగిస్తున్నాను అన్నారు. అప్పటికి ఇప్పటికీ మన ఉక్రెయిన్ నేల చాలా మారిందని, ప్రస్తుతం ల్యాండ్ మైన్లు, క్రేటర్స్, యూంటీ ట్యాంకుల వంటివి కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్ని మార్పులు వచ్చినా.. తమ అంతరాళ్లలో ఉన్న లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు, ఎప్పటికీ మారదని దానికోసం ఎన్ని కష్టాలనైనా తట్టుకుని పోరాడుతాం అని దృఢంగా చెప్పారు. ఈ డే ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ అనేది 2013/2014 నాటి యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనలను సూచిస్తుంది. దీన్ని మైదాన్ విప్లవం ఆఫ్ డిగ్నిటీగా కూడా పిలుస్తారు. (చదవండి: ఇరాన్లో ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్.. కారణమెంటో తెలుసా?) -
ఉక్రెయిన్‌కి సాయం అందిస్తాం: రిషి సునాక్
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి సునాక్ బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో రష్యా చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో ఉక్రెయిన్‌కి బ్రిటన్ అన్ని విధాలుగా మద్ధతు ఇస్తుందని సునాక్ హామీ ఇచ్చారు. జెలెన్ స్కీ కీవ్‌ని సందర్శించినందుకు సునాక్‌కి ధన్యావాదాలు తెలిపారు. అంతేగాదు బ్రిటన్‌కి స్వాతంత్య్రం కోసం పోరాడటం అంటే ఏమిటో తెలుసునని సునాక్ అన్నారు. అలాగే ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న పరాక్రమ యోధులకు సాయం అందిస్తామని వాగ్ధానం చేశారు. పైగా ఉక్రెయిన్ ప్రజలకు కావాల్సిన ఆహారం, ఔషధాలు, అందుబాటులో ఉండేలా బ్రిటన్ మానవతా సహాయాన్ని అందిచడం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ ట్విట్టర్లో..."ఇరు దేశాలకు స్వాతంత్యం కోసం నిలబడటం తెలుసు. బ్రిటన్ లాంటి స్నేహితులు పక్కన ఉంటే విజయం సాధించడం తధ్యం" అని ధీమగా చెప్పారు. ఇదిలా ఉండగా..సునాక్ ఆగస్టులో ఉక్రెయిన్‌కి స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో రష్యా దూకుడుకి ఎదురు నిలబడి అజేయమైన ధైర్యసాహాసాలో పోరాడుతున్నందుకు ఉక్రెయిన్‌ని ప్రశంసలతో ముంచెత్తారు సునాక్. నిరంకుశత్వానికి పరాకాష్టగా పోరాటం సాగిస్తున్న వారెవ్వరూ విజయం సాధించలేరంటూ ఒక చక్కటి సందేశాన్ని పంపారు సునాక్. Britain knows what it means to fight for freedom. We are with you all the way @ZelenskyyUa 🇺🇦🇬🇧 Британія знає, що означає боротися за свободу. Ми з вами до кінця @ZelenskyyUa 🇺🇦🇬🇧 pic.twitter.com/HsL8s4Ibqa — Rishi Sunak (@RishiSunak) November 19, 2022 (చదవండి: వందేళ్ల వయసులోనూ విరామమెరుగని వృద్ధ డాక్టర్) -
గ్యాస్‌లో పెట్టుబడులకు ధర విషయంలో స్వేచ్ఛ కీలకం
న్యూఢిల్లీ: సముద్రాల్లో వందల కొద్దీ మీటర్ల లోతున ఉండే సహజ వాయువు నిక్షేపాలను కనుగొని, వెలికి తీయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వీపీ సంజయ్ రాయ్ తెలిపారు. ఈ రంగంలోకి పెట్టుబడులు రావాలంటే ధర, మార్కెటింగ్పరమైన స్వేచ్ఛ కల్పించడం కీలకమని పేర్కొన్నారు. చమురు, గ్యాస్ ఆపరేటర్ల సమాఖ్య ఏవోజీవో ఈ విషయాన్నే గ్యాస్ ధరను సమీక్షిస్తున్న ప్రభుత్వ నియమిత కిరీట్ పారిఖ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ కాల్లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు వివరించారు. అటు వినియోగ సంస్థలు మాత్రం గ్యాస్ ధరపై ఎంతో కొంత పరిమితి ఉండాలని కోరుకుంటున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారిఖ్ కమిటీ రాబోయే కొన్ని వారాల్లో నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రైమరీ ఎనర్జీ బాస్కెట్లో 6.7 శాతంగా ఉన్న దేశీ గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని కమిటీకి ఏవోజీవో తెలిపింది. విద్యుత్తు, ఎరువులు మొదలైన వాటి ఉత్పత్తిలో సహజ వాయువును వినియోగిస్తారు. -
వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్
తైపీ: బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడేదే లేదని, వెనక్కి తగ్గమని తెగేసీ చెప్పింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవటం ఇరుపక్షాల భాద్యత అని నొక్కిచెప్పింది. యుద్ధం ఒక్కటే ఆప్షన్ కాదని తేల్చి చెప్పింది. తైవాన్‌లో సుమారు 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అలాగే తాము బీజింగ్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పింది. వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. రాజీకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో బలవంతంగా అధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రలను విడిచిపెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు పిలుపినిచ్చింది తైవాన్. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని, తైవాన్‌ని స్వతంత్ర దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. పైగా శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు. (చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన) -
ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?
భారత స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం. బ్రిటిష్ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు? వలస వాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు దాదాపు నూట యాభై ఏళ్ళు సాగించిన మహోజ్జ్వల పోరాటాల ధారలో ఒక మజిలీ 1947 ఆగస్ట్ 15. ఆ విస్తృత పోరాట సంప్రదాయం ఏ ఒక్క పార్టీదో, ఏ ఒక్క ప్రజా సమూహానిదో, ఏ ఒక్క నినాదానిదో, ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క ఆశయానిదో కాదు. అది ఈ దేశ ప్రజలందరూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కావాలనే విశాల ఆశయానిది! పద్ధెనిమిదో శతాబ్ది చివరి నుంచే ఆదివాసులు ప్రారంభించిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలూ; రైతుబిడ్డలైన సైనికులూ, రైతాంగమూ, సంస్థానాధీశులూ, రెండు ప్రధాన మతాలకూ చెందిన ప్రజలందరూ ఐక్యంగా పాల్గొన్న ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటమూ; ఆ తర్వాత ముప్ఫై సంవత్సరాలకు ప్రారంభమైన మధ్యతరగతి జాతీయోద్యమమూ, ఇరవయ్యో శతాబ్ది తొలి అర్ధభాగంలో సాగిన ఎన్నో విప్లవోద్యమాలూ, భిన్నమైన రాజ కీయ ఉద్యమాలూ, ఆ ఉద్యమాలలో పాల్గొన్న అన్ని ప్రజాసమూ హాలూ, అన్ని ప్రాంతాలూ... జాతీయోద్యమంలో భాగమే. ► అది ప్రధా నంగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. చాలాచోట్ల అది స్థానిక భూస్వామ్య దోపిడీ, పీడనలను కూడా వ్యతిరేకించిన ఉద్యమం. భారత సమాజం అనుభవిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం అది. ► బ్రిటిష్ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఈ ఏడున్నర దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధి గణాంకాలు చూపి, ‘‘స్వతంత్ర భారత ప్రగతి’’ గురించి చెప్పడానికి అవకాశం ఉంది. భారత ఉపఖండంలోని ఇరుగు పొరుగు దేశాలలో ప్రజా స్వామ్యం అనుభవించిన అవాంతరాలను చూపి, భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదనే అవకాశమూ ఉంది. వలసానంతర భారత సమాజ గమనాన్ని అర్థం చేసుకోవ డానికీ, విశ్లేషించడానికీ ఎన్నో సూచికలూ ప్రాతిపదికలూ ఉన్నప్పటికీ, ప్రగతి, ప్రజాస్వామ్యం అనే రెండు సూచికలే కీలకమైనవి. ► బ్రిటిష్ వలస పాలన తొలగిపోవాలని భారత ప్రజలు కోరు కోవడానికీ, ఉద్యమించడానికీ మూల కారణం వలసవాదం భారత సంపదలను దోచుకుపోతున్నదనే అవగాహన. విస్పష్టమైన గణాం కాల ఆధారంగా దాదాభాయి నౌరోజీ 19వ శతాబ్ది చివరి రోజుల్లో ప్రతిపాదించిన ‘వనరుల తరలింపు’ సిద్ధాంతాన్ని దాదాపుగా జాతీయోద్యమంలోని అన్ని పాయలూ అంగీకరించాయి. భారత సమాజ వనరులతో స్థానికంగా సంపద పోగుపడడానికీ, తద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధి జరగడానికీ వలస పాలన అవకాశం ఇవ్వడం లేదని జాతీయోద్యమ నాయకులందరూ భావించారు. వలస పాలన భారత సమాజ అభివృద్ధిని అడ్డుకుంటున్నదనీ, అందువల్ల దాన్ని తొలగించి స్వరాజ్యం సాధించినప్పుడే స్వతంత్ర, భారత ప్రజా ప్రభుత్వం భారత వనరులను స్థానికాభివృద్ధికి వినియోగించగలుగు తుందనీ జాతీయోద్యమం భావించింది. ► 75 ఏళ్ళ క్రితం వలస పాలకులు వెళ్లిపోయారు. భారత ప్రజల మైన మనం మన స్వతంత్ర రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ప్రణాళికా బద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని రచించుకున్నాం. కుంటుతూనో, నడుస్తూనో, పరుగులతోనో పన్నెండు ప్రణాళికలు అమలయ్యాయి. ప్రణాళిక అంటేనే సోషలిజం చిహ్నమేమో అని భయంతో గంగ వెర్రులెత్తే రాజకీయపక్షం అధికారం సాధించి, ప్రణాళికా సంఘాన్నీ, ప్రణాళికలనూ రద్దు చేసి పారేసి ఏడేళ్ళు గడిచాయి. ప్రణాళిక లేకుం డానే భారతదేశాన్ని పరివర్తన చెందిస్తానని కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. అనేక గ్రంథాలు కాగలిగిన ఈ సుదీర్ఘ చరిత్రలో భారత సమాజం సాధించిన ఆర్థిక, సామాజిక అభివృద్ధి ఎంత? ► జాతీయాదాయం 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 140 లక్షల కోట్ల రూపాయలకు, ఆహార ధాన్యాల ఉత్పత్తి 5 కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు, ఎగుమతులు ఒక బిలియన్ డాలర్ల నుంచి 38 బిలియన్ డాలర్లకు, రోడ్డు మార్గాలు 4 లక్షల కి.మీ. నుంచి 64 లక్షల కిలోమీటర్లకు పెరిగాయని... అటువంటి గణాంకాలతో మనం సాధించిన ప్రగతి గురించి చెప్పుకోవచ్చు. కానీ నాణానికి ఈ బొమ్మతో పాటే బొరుసు ఉంది. ఇక్కడ ఎన్నో రెట్లు పెరిగినట్టు కనబడుతున్న అంకెల పొట్ట విప్పి చూస్తే ఆ పెరుగుదలలోని ఒడుదొడుకులు బయట పడతాయి. ఉదాహరణకు జాతీయాదాయం లెక్కలో ఒక వంద మందిని మినహాయిస్తే, హఠాత్తుగా మన జాతీయాదాయం సగానికి పడిపోతుంది. ఆ వందమంది ఆదాయం 55 కోట్ల మంది ఆదాయం కన్నా ఎక్కువ. ► అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఆరు రెట్లు పెరుగు దల, జనాభా పెరుగుదల నాలుగు రెట్ల కన్న తక్కువే ఉన్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో ఆకలిచావులు, అర్ధాకలి కొనసాగుతూనే ఉన్నాయి. ఎగుమతుల్లో 38 రెట్ల పెరుగుదల కనబడుతున్నప్పటికీ, దిగుమ తులు ఇదే కాలంలో ఒక బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పెరిగి, విదేశీ వాణిజ్య లోటు విపరీతంగా హెచ్చింది. ఎగుమతి దిగుమతుల వ్యత్యాసం 2 కోట్ల రూపాయల నుంచి 20 వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ 75 ఏళ్ళలో ఆర్థిక, సామాజిక అసమానతలు, అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలు గణనీయంగా మారలేదు. ఏ ఒక్క అభివృద్ధి గణాంకం తీసుకున్నా, ఆ వెలుగు వెనుక పెనుచీకటి కనబడుతూనే ఉన్నది. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు? ► అంత మాత్రమే కాదు, ఆ నాడు ఒక్క బ్రిటన్‌కు వలసగా ఉన్న భారతదేశం ఇవాళ, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాల తర్వాత అనేక పెట్టుబడిదారీ దేశాలకు ముడిసరుకులు అందించే వనరుగా, వాళ్ల సరుకులు అమ్ముకునే మార్కెట్‌గా మారిపోయింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులకూ, దిగుమతుల కోసం ఆధారపడిన అన్ని దేశాల అవమా నకర ఆదేశాలకూ తలొగ్గి, సార్వభౌమాధికారాన్నే పలుచబరచుకునే స్థితి వచ్చింది. ఆధునికత, విద్య, రవాణా, సమాచార సంబంధాలు, పారిశ్రామికాభివృద్ధి వంటి రంగాలలో అంకెల్లో మాత్రమే చూస్తే బ్రిటిష్ వలస పాలన కూడ ఇటువంటి ప్రగతి సాధించినట్టే కనబడు తుంది. కానీ, సుపరిపాలన ఉన్నా సరే, స్వపరిపాలనకు ప్రత్యా మ్నాయం కాదు అని జాతీయోద్యమం కోరుకుంది. ► ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలనీ, పరాయి పాలన పీడన తొలగిపోవాలనీ కోరుకుంది. సంపద తరలింపు గురించి మాట్లాడిన నౌరోజీయే ‘‘బ్రిటిషేతర పాలన’’ అన్నాడు. అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రా తృత్వం వంటి నినాదాల పుట్టుకకు కారణమైన పెట్టుబడిదారీ విధానం వలస వాదంగా, సామ్రాజ్యవాదంగా మారి, ఆ నినాదాల స్ఫూర్తిని వదిలేసి, తమ వలస ప్రజలకు స్వేచ్ఛ లేని స్థితి కల్పించిందని అర్థం. ఆర్థికాభివృద్ధి కన్నా ముఖ్యం స్వాతంత్య్రం అని సాగిన జాతీయోద్యమం 1947 ఆగస్ట్ 15న ఆ స్వాతంత్య్రాన్ని సాధించానని భావించింది. ► కానీ, ఆ తరువాతి ఇన్నేళ్ళ చరిత్రను అవలోకిస్తే, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే విశాల భావనను ఐదు సంవత్సరాలకు ఒకసారి మొక్కుబడిగా జరిగే ఎన్నికలకు కుదించారు. ఆ ఎన్నికలు అక్రమాలకు నిలయాలయ్యాయి. ఒకసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే ఐదేళ్ళలో ఏమైనా చేసే అధికారం చేజిక్కుతున్నది. ప్రభుత్వాధికారం వ్యక్తిగత సంపదలు పెంచుకునే సాధనంగా మారిపోయింది. ఉదాత్తంగా రాసుకున్న రాజ్యాంగ ఆదేశాల అమలు కన్నా ఉల్లంఘన ఎక్కువ జరుగుతున్నది. ప్రజా భాగస్వామ్యంతో నడవవలసిన పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌన సాక్షులుగా మిగిలి పోయారు. బహుళత్వానికి నిలయమైన దేశంలో నెలకొనవలసిన, బలపడవలసిన పరస్పర సహాయ సహకార సంఘీభావాల స్థానంలో కుల, మత, ప్రాంత, భాషా విద్వేషాల రాజకీయాలు చెలరేగి సమాజ అస్తిత్వమూ, భవిష్యత్తూ ప్రమాదకర స్థితికి చేరాయి. వలస పాలకులు తయారు చేసిన న్యాయవ్యవస్థ, భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి స్వల్పమైన మార్పులతో కొనసాగుతున్నాయి. ► వలస పాలకులు సృష్టించిన రాజద్రోహ నేరం ఇప్పటికీ అట్లాగే ఉంది. జాతీయోద్యమం తీవ్రంగా వ్యతిరేకించిన రౌలట్ చట్టాన్ని మించిన దుర్మార్గమైన ప్రజావ్యతిరేక చట్టాలు లెక్కలేనన్ని స్వతంత్ర భారత పాలనలో అమలులోకి వచ్చాయి. ‘దేశమనియెడు దొడ్డ వృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయి/ నరుల చమటను తడిసి మూలం/ ధనం పంటలు పండవలెనోయి’ అని గురజాడ అప్పారావు ‘దేశభక్తి’ గీతంలో రాసి నప్పుడు మొదటి రెండు పంక్తులు ప్రజాస్వామ్యానికీ, బహుళత్వ సామరస్యానికీ , చివరి రెండు పంక్తులు సంపద అభివృద్ధికీ, సమాన పంపిణీకీ సూచనలు. ఈ 75 ఏళ్లలో భారతదేశం అనే దొడ్డ వృక్షం ఎన్నో పూలు పూసింది, ఫలాలూ ఇచ్చింది, నరుల చెమటతో ధనం పంటలూ పండించింది. కానీ ఆ ప్రగతి ఫలాలు దక్కిందెవరికి? ఆ ధనం నింపిన బొక్కసాలెవరివి అనే ప్రశ్నలు ఇంకా భారత సమాజం ముందు నిలిచే ఉన్నాయి. ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు -
'నేను జైలు పాలైన జర్నలిస్ట్ కూతురుని'...అంటూ చిన్నారి ప్రసంగం! వైరల్
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల చిన్నారి తన పాఠశాలలో ఇచ్చిన ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పాఠశాల్లో ప్రసంగించింది. ఆమె తన ప్రసంగాన్ని ‘నేను పౌర హక్కులు హరించడం కారణంగా కటకటాల పాలైన జర్నలిస్ట్ కుమార్తెని’ అని ప్రారంభించి అందర్నీ విస్మయపర్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో పౌరులు హక్కులు, మతం, హింసకు తావిచ్చే రాజకీయాలు గురించి ప్రసంగించి ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి తన ప్రసంగంలో... ‘ప్రతి భారతీయుడికి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలి వంటివి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇవన్ని మహాత్మ గాంధీ, నెహ్రు, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే సాధ్యమైంది. నాటి సమరయోధులను స్మరిస్తూ.. పౌరుల సాధారణ స్వేచ్ఛ హక్కులను హరించొద్దు ఇదే నా అభ్యర్థన. నా మాతృభూమిని చూసి గర్విస్తున్నాను, దీన్ని లొంగదీసుకోవాలని చూడకూడదు. మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుగులేని ఆనందం, అధికారం కలిగిన ఒక భారతీయురాలిగా "భారత మాతకి జై" అని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ప్రసంగం ముగించింది. ఆ చిన్నారి తండ్రి మలయాళ వార్త ఛానెల్ అజీముఖం రిపోర్టర్ సిద్దిక్ కప్పన్. అక్టోబర్ 2020లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత మహిళ గురించి రిపోర్టింగ్‌ని నివేదించడానికి వెళ్తుండగా అతడి తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రతలకు విఘాతం కలిగించాడనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను అకారణంగా జైలు పాలుచేశారని, తాను నిర్దొషినని సిద్ధిక్ పేర్కొన్నాడు. అతడి బెయిల్ దరఖాస్తును సైతం అలహాబాద్ లక్నో హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. (చదవండి: జాతీయ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దుతిస్తోంది: కేఎస్ ఈశ్వరప్ప) -
స్వేచ్ఛ.. ఆనంద హేతువు
స్వేచ్ఛ ఒక పోరాటం, ఆనంద స్థితి. సత్యావగాహన, ఆస్వాదనీయం. ఒక అభిలషణీయమైన, హర్షదాయకమైన మార్పు. మనిషి మనీషిగా రూపొందగల మార్గం. స్వేచ్ఛ ఒక బాధ్యత, ఐక్యత, గౌరవభావన. ఒక వృద్ధుడు రోడ్డు మీద నడుస్తూ తన చేతిలోని వాకింగ్ స్టిక్‌ని గిరగిరా తిప్పుతూ నడవసాగాడు. ఏదో కూనిరాగం తీస్తూ చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. తనొక్కడే రోడ్డుమీద ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆలా తిరిగే కర్ర దెబ్బ నుండి చాలా మంది తప్పించుకుంటూ, పెద్దవాడు కనుక ఏమనలేక తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. చివరకు ఒక విద్యార్థి ధైర్యంగా ఆ తిరుగుతున్న కర్రను చేత్తో పట్టుకుని ఆపి ఆయన తన స్వేచ్ఛనుకుంటూ చేస్తున్న ఆ పని వల్ల మిగిలినవారు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించాడు. అంతేకాదు, ఆ స్వేచ్ఛ లోని విశృంఖలతను ఆయన దృష్టికి తెచ్చి, ఆలోచింప చేసాడు. అంతేకాదు మనకూ దాన్ని స్ఫురింపచేసాడు. నవ్వు తెచ్చే సంఘటనగా ఉన్నా దీని వెనక ఎంత గొప్ప భావన ఉందో చూడండి. స్వేచ్ఛను నిర్వచించి దానికున్న పరిధులు ఉంటాయన్న ప్రాథమికమైన ముఖ్య విషయాన్ని ఆ రచయిత చిన్న ఉదాహరణ ద్వారా ఎంత సులభంగా వివరించాడో చూడండి. మనం స్వేచ్ఛను అనుభవించే పద్ధతి ఇతరుల స్వేచ్ఛను హరించకూడదన్న విషయాన్ని ఎంత బాగా చెప్పాడో చూసారు కదా! మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని గడపటమే వ్యక్తిగత స్వేచ్ఛ. ఆహార, ఆహార్యాలలో, మనదైన భావనలో, సిద్ధాంతాలతో, విశ్వాసాలతో మన చిత్తానికి తోచినట్టు జీవితాన్ని సాగించటంలో పూర్తి స్వాతంత్య్రం, అలాగే, మన విశ్వాసానికి అనుగుణంగా ఒక దైవాన్ని లేదా అనేక దైవాలను ఆరాధించటంతో పాటు ఆ దైవప్రదేశాల సందర్శన మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనకు నచ్చిన దైవాన్ని లేదా అందరి దైవాలను పూజించే హక్కు మన ప్రతి ఒక్కరికీ ఉంది. మన వ్యక్తిగతమైన ఈ స్వేచ్ఛకు అడ్డు చెప్పటం గాని అవరోధం కలిగించటం కాని, దీనిని తప్పు పట్టే అధికారం కాని ఇతరులకు లేదు. అలాగే మనకూ ఇతరుల స్వేచ్ఛలోకి చొరబడే హక్కు లేదని గ్రహించి అందుకు అనుగుణంగా వర్తించాలి. మన స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తూ ఇతరులకు ఉన్న ఆ స్వతంత్రతను గౌరవించటం మన సంస్కారాన్ని, విజ్ఞతను చాటుతుంది. మన భావప్రకటనా శక్తి కూడ మన స్వేచ్ఛను తెలియచేప్పేదే. విద్య, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలలోనే కాక ఇతర రంగాలలోనూ వచ్చే మార్పులకు మనం స్పందించి, దాన్ని వ్యక్తపరచటమూ మన స్వేచ్ఛను తెలియపరుస్తుంది. మన అభిప్రాయాలను స్పష్టంగా, సూటిగా తెలియపరచటంతో పాటు ఉచితమైన, ఆమోదయోగ్యమైన, మర్యాదకరమైన భాషను వాడాలి. సిద్ధాంతాలమీద, భావనల మీద మన ఉద్దేశాన్ని ఎంత నిర్కర్షగా మనం చెప్పదలచుకుంటే అంతగా చెప్పచ్చు. ఇక్కడ సమతౌల్యం, సంయమనం అవసరం. ఈ భావప్రకటనా స్వేచ్ఛ చక్కని ఆలోచనల, భావనల మార్పిడికి / బదిలీకి సహాయపడి మనలను వ్యవస్థను మెరుగు పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. విద్యలో స్వేచ్ఛ అత్యంతావశ్యకం. గురువులు చక్కని వాతావరణాన్ని సృష్టించాలి. ఆ ఉత్సాహభరితమైన, ఉల్లాసభరితమైన స్థితి విద్యార్థులను నిర్భయులను చేసి వారి సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచి నివృత్తి చేసుకునేటట్టు చేస్తుంది. ఇరువురి మధ్య విద్యాసంబంధమైన చనువుతో పాటు ఒక ఆత్మీయతను ఏర్పరుస్తుంది. గురుశిష్యులను దగ్గరకు చేరుస్తుంది. వారి బంధాన్ని దృఢం చేస్తుంది. గురువులు చెప్పే విద్యను వెంటనే అంగీకరించక పరీక్షించే గుణాన్నిస్తుంది. శోధించే తత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛా వాతావరణం ఉభయులకూ ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు, ఇద్దరినీ అప్రమత్తులను చేస్తుంది. స్వేచ్ఛ ద్విముఖి. సక్రమంగా వినియోగించుకున్నప్పుడు అనంత ప్రయోజనకారి. ఇది మనకు నిర్భయాన్నిస్తుంది. ధైర్య, స్థైర్యాలనిస్తుంది. స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇది మన ఊహాప్రపంచపు పరిధులను విస్తరింప చేస్తుంది. మన మేధను పదను పరుస్తుంది. మన సృజనకు నిత్య నూతనత్వాన్ని ఇస్తూ వికసింప చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఏ నిర్బంధానికి, సంకుచితత్వానికి, స్వార్థానికి లొంగక ప్రజలు నిర్భయంగా, ఆనందంగా సంచరించే స్వర్గధామమని అన్నారు విశ్వకవి రవీంద్రులు. స్వేచ్ఛ సహజంగా వీచే వాయువు లాంటిది. కాని అనేక కారణాలవల్ల ఆ స్వేచ్ఛావాయువును పీల్చు కోలేకపోతున్నాం. ముఖ్యంగా పిల్లలు. వీరి స్వేచ్ఛకు తల్లిదండ్రులు, గురువులు, సమాజం, దేశపరిపాలనా రీతి కారణం. కొన్ని యుద్ధ ఉన్మాద దేశాలలోని భయానక వాతావరణం కూడ పిల్లల స్వేచ్ఛను హరించి వేస్తుంది. ఆహారం కాదు ఆహ్లాదం, ఆనందం లేనిచోట స్వేచ్ఛ లేనట్టే. అందుకే ‘స్వేచ్ఛ కోరే మనసు ఉంటే పొందలేనిది ఏముంది’ ‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. కాని ప్రతి చోట బందీనే’ అంటారు రూసో. ఎలా..? ఏమిటీ సంకెలలు? బంధాలు,అనుబంధాల పై మితిమీరిన మమేకత, ప్రేమ, మమకారం, ఆకర్షణ. నేను, నాది , ఆస్తి పాస్తులు , చరాచరాస్తులు, చావు పుట్టుకల సహజత్వాన్ని అంగీకరించని తత్వం అనే అనేకానేక శృంఖలాలు. వీటినుండి బయటపడే నిజమైన స్వేచ్ఛ అసలైన స్వేచ్ఛ. స్వాతంత్య్రం. అద్భుతమైన ఈ దశకు మనస్సు చేరుకునేందుకే ఆధ్యాత్మిక సాధన, ఆ సాధనాపరుల తపన, లక్ష్యం. మనస్సు ఈ అరిషడ్వార్గాలనుండి విముక్తి పొందటమే ఎంతో ఉన్నతమైన స్వేచ్ఛ. అపుడంతా, అన్నిటా ఆనందమే. స్వేచ్ఛ పరమావధి బహ్మానందమే. మనస్సు ఒక స్వేచ్ఛా విహంగం. ఈ మాయామోహిత జగత్ప్రవాహంలో దాని రెక్కలు తడిసి ముద్దవుతుంటాయి. పక్షి తన పదునైన ముక్కుతో చిక్కుతీసుకుంటూ రెక్కలార్చుకుంటుంది. అలాగే మనిషి తన మనోవిహంగపు రెక్కలను భవబంధాల సంకెళ్ల నుంచి విడుదల చేసే యత్నానికే స్వేచ్ఛ అనే మరో పేరు. అపుడు మనోవిహంగపు సంచరించగల ఆవరణం అనంతం. బలమైన దేశాలు బలహీనమైన దేశాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ప్రజలను బానిసత్వవు ఊబిలోకి తోసేసేసిన వైనాలెన్నెన్నో. స్వేచ్ఛ అనే ప్రాణవాయువు అందక వారు ఎలా జీవచ్ఛవాలుగా మారారో చరిత్ర చెపుతుంది. అందుకే శ్రీ శ్రీ.. ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం.. అన్నాడు. స్వేచ్ఛ ప్రాణుల ఊపిరి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
సైన్స్ ఫిక్షన్ ఫ్రీడమ్ యాక్షన్
సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్.జి.వెల్స్ ‘ది ఇన్ విజిబుల్ మ్యాన్’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్.జి. వెల్స్ లో లేనిది, సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం! తెలుగు సైన్స్ ఫిక్షన్‌కు కూడా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి కారణమయ్యిందా? ఇలాంటి ప్రశ్న ఎదురైతే, ఆశ్చర్యపడేవారు ఎందరో ఉన్నారు! కానీ నిజం, ఈ చరిత్ర తెలుసుకుంటే! సైన్స్ మూలసూత్రాలను ఆకళింపు చేసుకుని, ఆ పునాదులపై కల్పనలను పేనుకుని సాహిత్య సృజన చేస్తే అదే ‘సైన్స్ ఫిక్షను’ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1926ను సైన్స్ ఫిక్షను అనే ప్రక్రియను నిర్వచించి, దానికి ప్రాధాన్యత ఇచ్చిన సంవత్సరంగా పరిగణిస్తారు. ఆ తర్వాతి సంవత్సరంలోనే తెలుగు సైన్స్ ఫిక్షను కథ వెలుగు చూడటం మనకు గర్వకారణం. ‘పరమాణువులో మేజువాణి’ అప్పటికి స్వాతంత్య్ర జ్వాలలు వ్యాపించడం మొదలై పుష్కరమైంది. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడం, జలియన్ వాలాబాగ్ దురంతం, విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలతో మన దేశం అట్టుడికిపోతోంది. అలాంటి 1927, 1928 సంవత్సరాలలో రూపం పోసుకున్న సైన్స్ ఫిక్షను సందర్భం.. ఖచ్చితంగా ఆ నేపథ్యాన్ని తిరస్కరించే అవకాశమే లేదు! తెలుగు తొలి సైన్స్ ఫిక్షన్ కథ ‘పరమాణువులో మేజువాణి’ హైదరాబాదుకు చెందిన సిరిగూరి జయరావు 1927 డిసెంబరు ‘సుజాత’ పత్రికలో రాశారు. రెండో కథ ‘అదృశ్యవ్యక్తి’ని ఒద్దిరాజు సీతారామచంద్రరావు అదే పత్రికలో 1928 అక్టోబరు సంచికలో రాశారు. కేవలం పదినెలల వ్యవధిలో ఈ రెండు కథలు హైదరాబాదు నుంచి వెలుగు చూడటం గర్వకారణం. మొదటి కథను రాసిన కథకుడి నేపథ్యం ఉద్యమ పోరాటం కాగా, రెండో కథ ఉద్యమ పోరాటంతో ముగుస్తుంది. గాంధీజీ ప్రస్తావన ‘‘... భోగము వాండ్రకు వృత్తి మాన్పించి, మేజువాణీలను మారు మూలలకు ద్రోసివైచి యప్పుడే పాతిక సంవత్సరములు దాటినవి. అక్కడక్కడ నలుసులు మిగిలినా మహాత్ముని మొన్న మొన్నటి చీవాట్ల ముందర నదృశ్యములాయెనని చెప్పవచ్చును..’’ అని తొలి పేరాలోనే గాంధీజీ ప్రస్తావన ‘పరమాణువులో మేజువాని’ కథలో కనబడుతుంది. అలాగే రచయితకుండే సంఘసంస్కరణ దృష్టి కూడా ద్యోతకమవుతుంది. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లినట్టు, ఇక్కడ కథకుడు పరమాణువులోనికి వెళ్లిరావడం వస్తువు. అయితే,ఈ కథకుడి జీవితం మరింత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం! హైదరాబాదులో బి.ఎస్సీ చదివిన సిరిగూరి జయరావు పరిశోధన చేయాలని సర్ సి.వి.రామన్ వద్ద కలకత్తాలో చేరారు. అక్కడ ఉండగానే 1927లో ఐ.సి.ఎస్ (ఇప్పటి ఐ.ఏ.ఎస్.) పరీక్ష ఉత్తీర్ణుౖలై మధ్యప్రదేశ్ ప్రాంతంలో కలెక్టరుగా చేరారు. సంఘసంస్కరణ, స్వాతంత్య్రోద్యమం ప్రాముఖ్యత తెలిసిన జయరావు తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని తలంచారు. అలాంటి నేపథ్యంతో అప్పటికే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎన్.హెచ్.వి. కామత్‌ను కలిసి, చర్చించి నిర్ణయం తీసుకోవాలని జయరావు తలంచారు. కామత్‌ను కలవాలని కారులో ప్రయాణం చేస్తూ ప్రమాదంలో 33 సంవత్సరాల వయస్సున్న జయరావు కన్ను మూయడం కడు విషాదం! జయరావు జీవిత విశేషాలు ఎంతో స్ఫూర్తిని రగుల్చుతాయి. అదృశ్య వ్యక్తి తెలంగాణ గ్రామసీమల్లో సైన్స్ పరికరాలు తొలుత పరిచయం చేసిన వారు ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు రాఘవ రంగారావు, సీతారామచంద్రరావు సోదరులు ఉర్దూ, పార్శీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలను అదనంగా నేర్చుకుని సంగీతం, చరిత్ర, విజ్ఞానం, వైద్యం వంటి విషయాలను అధ్యయనం చేశారు. పిండిమర, టార్చిలైటు, ఇంకుపెన్ను, నీరు తోడే యంత్రం వంటి ఎన్నో వాటిని ఈ ప్రాంతానికి పరిచయం చేసింది వీరే. తమ్ముడు సీతారామచంద్రరావు రాచకొండ, కోహినూరు, ఇనుగుర్తి వంటి చరిత్ర విషయాల గురించి అధ్యయనం చేశారు. ఎన్నో రచనలతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ ‘నౌకా భంగం’ నవలను కూడా అనువదించారు. సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్.జి.వెల్స్ ‘ది ఇన్ విజిబుల్ మ్యాన్’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్.జి. వెల్స్ లో లేనిది, సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం! ప్రయోగశాలలో దృశ్యం, అదృశ్యం అనే దృగ్విషయంపై పరిశోధించే యువ శాస్త్రవేత్త నళినీకాంతుని కథ ఇది. ప్రయోగంలో జరిగిన పొరపాటు వల్ల కథానాయకుడు అదృశ్యమౌతాడు. ‘నా యిచ్ఛ కొలది వచ్చితిని’ ఈ కథ చివరలో బ్రిటిషు సార్జెంటు కథానాయకుడితో ఇలా అంటారు, ‘‘... నీ నిర్మాణం, నీ బలము తుచ్ఛమైపోయినవి. ఏలయన నిన్ను మేము పట్టుకొంటిమి. మమ్ము పట్టుకొనువాడెవరు కాన్పించడే!’’. దీనికి జవాబుగా ‘‘అబద్ధం. సర్వదా అబద్ధము. నేను నా యిచ్ఛ కొలది వచ్చితిని’’ అని అంటాడు కథానాయకుడు నళినీకాంతుడు. అంతేకాదు ఈ వాక్యము ముగిసేలోపు సార్జెంటు ముఖం పై బలమైన దెబ్బ తగులుతుంది. పడిపోయిన సార్జెంటు లేచి పిస్తోలు తీసి రెండుసార్లు కాల్చగా కేవలం గోడకు దెబ్బ తగిలిందని కథ ముగుస్తుంది. తెలుగు సైన్స్ ఫిక్షన్ కథలు అధ్యయనం చేస్తున్నప్పుడు తొలుతే ఈ స్ఫూర్తికరమైన విషయాలు తారసపడిన ఎంతో ఉత్సాహం కల్పిస్తాయి! – డా. నాగసూరి వేణుగోపాల్ ప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత (చదవండి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్‌లోని పహార్తలి యూరోపియన్ క్లబ్... ప్రీతిలతా వడ్డేదార్) -
మళ్లీ రాయకూడని డైరీ
ఉదయం ఎనిమిదిన్నర తర్వాత మీరు టాయిలెట్లో ఫ్లష్ చేయకూడదు. తల్లితో ముద్దుగా పోట్లాడకూడదు. నడిచి వెళ్లి తండ్రి ఒళ్లో కూర్చోకూడదు. చిన్న బొమ్మకారు ఉంటే దానిని నేల మీద జూయ్ జూయ్మని వదలకూడదు. మాట పలక్కూడదు. శ్వాస బలంగా తీయకూడదు. మీరు బతికే ఉంటారు. కానీ మీరు బతికి ఉన్నట్టుగా తెలియకూడదు. గాలి, వెలుతురు రాని చిన్న గదుల్లో దాక్కుని ఉంటారు. కిటికీలో నుంచి తొంగి చూసే స్వేచ్ఛను కోల్పోయి ఉంటారు. బయట ఏమి జరుగుతున్నదో మీకు తెలియనే తెలియదు. రాత్రిళ్లు ఉండి ఉండి బాంబులు దద్దరిల్లుతాయి. సైరన్లు వికృతంగా మోగుతాయి. మర ఫిరంగులు విరేచనాలు చేసుకుంటాయి. ఎవరో ఎప్పటికీ కనిపించని కొందరు మనుషులు బాధగా కేకలు వేస్తారు. మీరు అనుక్షణం భయంలో ఉంటారు. తలుపును ఎవరైనా తడితే ఉలిక్కి పడతారు. చావు దాపునే గుసగుసలాడుతూ ఉంటుంది. ఇలాంటి నిర్బంధంలో మీరు ఎన్ని గంటలు ఉండగలరు? ఎన్ని నిమిషాలు ఉండగలరు? ఎన్ని సెకన్లు జీవనకాంక్షతో బతకగలరు? కాని ఒక పద్నాలుగేళ్ల బాలిక ఎన్నాళ్లు అలా ఉందో తెలుసా? 761 రోజులు. మనుషుల మీద ఎంత విశ్వాసం ఉంచుకుందో తెలుసా? 714 పేజీలు. ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’గా జగద్విఖ్యాతమైన ‘ఆనా ఫ్రాంక్ డైరీ’ హిట్లర్ నరమేధకాలంలో రెండేళ్ల పాటు లిఖించబడి నేటికీ ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తూనే ఉంది. కన్నీరు కార్చేలా చేస్తూనే ఉంది. మానవత్వం కోసం ప్రాధేయపడుతూనే ఉంది. ‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు... ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది ఆనా ఫ్రాంక్ తన డైరీలో. జూన్ 12, 1942న ఆనా ఫ్రాంక్ 13వ జన్మదినాన ఆమె తండ్రి ఎర్ర రంగు చెక్స్ ఉన్న డైరీని బహూకరిస్తాడు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ ఆ యూదు కుటుంబంలో ఆనా కుదురులేని పిల్ల. ఆకాశాన్ని గాలిపటంగా ఎగరేద్దామనుకనే గడుగ్గాయి. గెంతులేసే గొర్రెపిల్ల కనిపించినా, కొమ్మలూపే చెట్టు కనిపించినా, హాయిగా నవ్వే మనిషి కనిపించినా పులకించిపోయే అమలిన శిశువు. కానీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు నాజీ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులకు నరకలోక ద్వారాలు తెరిచింది. ఆనా ఫ్రాంక్ అక్క 16 ఏళ్ల మార్గోట్కు జర్మనీలోని నాజీ క్యాంప్‌లో రిపోర్ట్ చేయమని జూలై 5, 1942న తాఖీదు ఇవ్వబడినది. అంటే ఏమిటో ఆ యూదు కుటుంబానికి తెలుసు. ఆ రాత్రే తండ్రి ఆనా ఫ్రాంక్ను పిలిచి ‘మనం ఇల్లు విడుస్తున్నాం. నీ స్కూల్ బ్యాగ్‌లో పట్టేన్ని వస్తువులే పెట్టుకో’ అంటాడు. ఆ మరుసటి తెల్లవారుజామున చినుకులు పడుతూ ఉండగా కట్టుబట్టలతో తల్లిదండ్రులు, అక్క, డైరీని దాచుకున్న స్కూల్ బ్యాగ్‌తో ఆనా బెదురు అడుగులు వేస్తూ అదే ఆమ్స్టర్డామ్లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరుతారు. ఆ భవంతిలో బుక్ర్యాక్లా కనిపించే తలుపు వెనుక రెండు రహస్య గదులు ఉంటాయి. మళ్లీ నాజీ పోలీసులకు పట్టుబడే– ఆగస్టు 4, 1944 వరకూ అంటే రెండేళ్ల 35 రోజులు వాటిలో ఉండిపోతారు. ఆ మొత్తం రోజులకు ఆ బాలిక ఆనా ఫ్రాంక్‌కు తోడుగా నిలిచింది ఆ డైరీ. ఆమె గుర్తుగా ప్రపంచానికి మిగిలింది ఆ డైరీ. ‘ఇంత చేస్తున్నా, ఇంత చూస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది ఆనా తన డైరీలో. అవును. మనిషి మంచివాడే. కానీ ప్రమాదకరమైన ప్రభావాలకు బానిస. మూక మనస్తత్వానికి సాధనం. పాలనాపరమైన సమర్ధింపు ఉందని భావిస్తే చెలరేగే క్రూరమృగం. హిట్లర్, అతని విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను జాతిహననం చేసి ఆ మాటే నిరూపించారు. కోటిన్నర మంది యూదులు తమ కుదుళ్లు, కుటుంబాలు, విశ్వాసాలు, ఆశలు – సమస్తం కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలారు. ఆ సమయంలోనే ఏనాటికైనా స్వేచ్ఛను పొందుతామేమోనని పిచ్చెక్కకుండా, ఆత్మహత్య చేసుకోకుండా, లొంగిపోకుండా బతికిన ఆనా ఫ్రాంక్ కుటుంబం చివరకు పోలీసుల కంట పడనే పడింది. పాపం బంగారు తల్లి ఆనా, తన కలలూ ఆకాంక్షలూ మనుషులను చూసి పొందిన అచ్చెరువులూ అరెస్టు వేళ పోలీసులు నేలన పారేసిన డైరీలో నిక్షిప్తం చేసి నవంబర్ 1, 1944న కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించబడింది. మొదట తల్లి మరణించగా, తర్వాత సోదరి మరణించగా, బురదమయమైన తినడానికి తిండి లేని, చలి నుంచి రక్షించడానికి గుడ్డపేలిక లేని కాన్సన్ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి–మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది. ఆ క్షణాన ఆమె తన మనసులో ఏమి రాసుకున్నదో తెలియదు. ఆ రాయని డైరీ చదివితే మనిషి జన్మ ఎత్తినందుకు మనం ఎంత సిగ్గుపడతామో ఏమో! 1947లో ఆనా ఫ్రాంక్ డైరీ మొదటిసారిగా డచ్ భాషలో ప్రచురితమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచమంతా ఆ మనోహరమైన బాలికను తలుచుకుంటూ ఉంది. ఇన్నేళ్లలో 70 భాషల్లో అనువాదమయ్యి లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఆ డైరీ సారమంతా ఒక్కటే – మానవత్వం! ఈ కాలం మళ్లీ రాకూడదు. ఇలాంటిది ఏ నేలనా సంభవించకూడదు. ఇలాంటి బతుకు భయం ఎప్పటికీ కలగకూడదు. మాటిమాటికీ వీధుల్లోకి తొంగి చూసి మనుషులకు స్నేహంగా చేయి ఊపాలనుకునే ఏ చిన్నారీ ఇలాంటి డైరీ రాయకూడదు. ఎప్పటికీ ఇలాంటి డైరీ వద్దే వద్దు! -
టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ!
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్‌కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి. పిల్లలు రెండు రకాలు ‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్‌లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్‌లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్. మౌనం వీడరు ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఠంచన్‌గా లాప్టాప్తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు. పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్టాప్లో వెబ్‌సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్‌లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్‌కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది. ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా. ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్‌లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే. టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు. మొండి నిద్రపోతారు! కొత్త కాలేజ్‌లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు. ఎనిమిదిన్నరకు కాలేజ్‌కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్‌కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి – వాకా మంజులారెడ్డి -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా!
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది. మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం. -
రాజ్యాంగ దినోత్సవం.. ఇది ఇంటిటి ‘రాజ్యాంగం’
కుటుంబంలో హక్కులు ఉంటాయి... బాధ్యతలు ఉంటాయి. తప్పు ఉంటుంది... క్షమాపణా ఉంటుంది. పైకి చెప్పే నియమాలు ఉంటాయి. ఎవరూ చెప్పని నిబంధనలు ఉంటాయి. దేశానికి రాజ్యాంగం ఉన్నట్టే ప్రతి ఇంటికీ రాజ్యాంగం ఉండాలి. పరస్పర గౌరవం, అవగాహన నుంచి సభ్యుల అవసరం, క్షేమాన్ని బట్టి ఈ రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకుంటూ వెళ్లాలి. ఇంటి రాజ్యాంగం ఎలా ఉండాలి? దేశంలో పౌరులంతా సమానమే అని మన రాజ్యాంగం చెబుతుంది. ఇంట్లో సభ్యులు కూడా సమానమే అని కుటుంబం అర్థం చేసుకోవాలి. పిల్లలకు అర్థం చేయించాలి. అయితే అది ఎలాంటి సమానం? నాన్న ఆఫీసుకు వెళ్లడమూ అమ్మ ఇంట్లోనే ఉండి ఇల్లు చూసుకోవాల్సి రావడమూ సమానమే. నాన్న డబ్బు తేవడమూ అమ్మ ఇంటి అవసరాల రీత్యా ఖర్చు పెట్టడమూ సమానమే. నాన్నకు అమ్మ గౌరవం ఇవ్వడమూ అమ్మ మాటకు నాన్న విలువ ఇవ్వడమూ సమానం. నాన్నకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు అమ్మకు తక్కువ కోపం రావడం సమానం అవుతుంది. అమ్మకు చాలా విసుగ్గా ఉన్నప్పుడు నాన్నకు అమితమైన ఓర్పు రావడం సమానం అవుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం నాన్న నిర్ణయం తీసుకున్నప్పుడు అమ్మకు అది నచ్చకపోతే, పిల్లలకు అది నచ్చకపోతే నాన్నతో వాదించడం సమానం అవుతుంది. అమ్మ ఏదైనా ఆలోచన చేస్తే అహానికి పోకుండా నాన్న అంగీకరించడమూ సమానం అవుతుంది. అమ్మ మూతి ముడిచినప్పుడు నాన్న నవ్వుతూ ఆ కోపాన్ని ఎగరగొట్టడం సమానం. నాన్న గొంతు పెద్దదైనప్పుడు అమ్మ మంద్రస్వరంతో దానిని నిలువరించడం సమానం అవుతుంది. అమ్మా నాన్నా సమానమే. అయితే ఏ కొలతల ప్రకారం సమానమో పిల్లలకు అర్థం చేయించడం, భార్యాభర్తలు అర్థం చేసుకోవడం ఇంటి రాజ్యాంగంలో రాసుకోవాల్సిన తొలి నియమం. స్వేచ్ఛ ఎంత ఉండాలి? కుటుంబంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలి. అయితే ఎంత ఉండాలి? అబ్బాయి మోటరు సైకిల్ అడిగితే కొనివ్వొచ్చుగాని రోడ్లు అలవాటయ్యేంత వరకూ ఒంటరిగా నడిపే స్వేచ్ఛ ఇవ్వకూడదు. నాన్న వెనుక కూచోవాలి. కొడుకుకైనా కూతురికైనా ఫలానా చదువు చదువుతాను అనే ఎంపికలో స్వేచ్ఛ ఇవ్వాలిగాని ఆ చదువును సక్రమంగా పూర్తి చేసే వరకూ కాలం వృధా చేసే స్వేచ్ఛ ఇవ్వకూడదు. అమ్మాయికి స్నేహితుల్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి కాని ఆ స్నేహితులందరితో అమ్మకూ నాన్నకూ పరిచయం ఉన్నప్పుడే ఆ స్వేచ్ఛను పరిగణించాలి. ఫోన్లు వాడే, ఫేస్బుక్లో ఉండే, వాట్సప్ చాట్ చేసే స్వేచ్ఛ ఇవ్వాలిగాని ఆ స్వేచ్ఛకు ఒక బాధ్యత ఉంటుందని బాధ్యతకు పరిమితి ఉంటుందని తెలియచేయాలి. పిల్లలు పర్సనల్ రూములు అడుగుతారు. కాని తలుపు మూసుకునే స్వేచ్ఛకూ గడియ వేసుకునే స్వేచ్ఛకూ మధ్య ఉన్న అంతరాన్ని సున్నితంగా హెచ్చరించాలి. బాధ్యత కలిగినదే స్వేచ్ఛ అని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి. సర్దుబాటు ఎలా ఉండాలి? అమ్మ ఇంటి పనిలో అలసి పోతే కొడుకు ఆ పనిని సర్దుబాటు చేసేలా ఉండాలి. వంట వీలుగాకపోతే నాన్న స్విగ్గీకి ఆర్డరు చేసే సర్దుబాటు చేయగలగాలి. నాన్నకు పొదుపు తెలియకపోతే అమ్మ చిట్టీ కట్టాలి. అమ్మ దుబారా చేస్తుంటే నాన్న అప్పులున్నాయని చెప్పి పాలసీ కడుతుండాలి. పిల్లలు బ్రాండెడ్ బట్టలు అడిగితే ఫ్యాక్టరీ ఔట్లెట్లో బోలెడంత వెరైటీ ఉంటుందని పట్టుకుపోవాలి. నిస్సాన్ అడిగితే నానోకు కూడా నాలుగు చక్రాలే ఉంటాయని చెప్పగలగాలి. పాకెట్ మనీ పెంచమంటే అబ్దుల్ కలాం పేపర్‌బాయ్‌గా చేశాడని చెప్పి స్వీయ సంపాదన నేర్పించాలి. గోల్డ్ లేకపోయినా ఒన్ గ్రామ్ గోల్డయినా అమ్మకు బాగుంటుందని చెప్పాలి. చిన్న చిన్న సంతోషాలు కావాలంటే చిన్నపాటి సర్దుబాటు చేయాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి. నిరసన ఎప్పుడు చూపాలి? పని మనిషిది ఫలానా కులమని నానమ్మ పనిలో వద్దంటుంది. అప్పుడు నిరసన చూపాలి. మనవడి స్నేహితుణ్ణి చూసిన తాతయ్య అతడు ఫలానా మతం కదా స్నేహం వద్దు అన్నప్పుడు నిరసన చూపాలి. అమ్మాయి ఫలానా ప్రాంతం వారంటే ద్వేషం అన్నప్పుడు నిరసనతో సరిచేయాలి. ఇల్లు ఫలానా వారికి అద్దెకు ఇవ్వం అని మన ఇంట్లోని వాటాకు నియమం పెడితే నిరసన చూపించాలి. మన కుటుంబం మనకు ఎంత ముఖ్యమో ఇంకో కుటుంబం కూడా వారికి అంతే ముఖ్యం. అన్ని కుటుంబాలు దేశానికి ముఖ్యమని అవగాహన కల్పించుకోవాలి. సమాజానికి ఏమి ఇవ్వాలి? కుటుంబం సమాజంలో ఒక భాగం. కుటుంబం ముందు కుదురుకుంటే సమాజం కూడా కుదురుకుంటుంది. మన కుటుంబం కుదురుకున్నాక, మన కుటుంబం సమాజంతో కలిసి జీవిస్తున్నాక సమాజానికి ఏమి ఇవ్వాలో ఆలోచించడం కూడా కుటుంబ బాధ్యతే. అనాథలకు, అభాగ్యులకు వీలైతే సాయం చేయాలి. రైతులో, కార్మికులో కష్టాలలో ఉన్నప్పుడు వారికి సంఘీభావం చూపగలగాలి. ద్వేషం, విభజన కోసం కొందరు ప్రయత్నిస్తున్నప్పుడు సామరస్యం కోసం ఏదో ఒక పని చేయాలి. పాలన వ్యవస్థ తప్పులు చేస్తున్నప్పుడు అవి ఎత్తి చూపించగలగాలి. పాలనలో తప్పు సమాజానికి ప్రమాదం. సమాజంలో తప్పు కుటుంబానికి ప్రమాదం. కుటుంబం అంటే మన కుటుంబం మాత్రమే కాదని సమాజం ఆ తర్వాత దేశం కూడా మన కుటుంబమే అనుకుంటే మన కుటుంబ సభ్యుల పట్ల ఎంత ప్రేమ, బాధ్యతగా ఉంటామో దేశ పౌరులందరి పట్లా అంతే ప్రేమగా బాధ్యతగా ఉంటాము. అలాంటి ప్రేమ, బాధ్యతలలోకి ప్రతి కుటుంబం మేలుకోవాలి. వెలుగు చూడాలి. అందుకు తప్పక పట్టు విడుపుల నియమావళి రాసుకోవాలి. -
ఇంకెన్నాళ్లు డిసైడ్ చేస్తారు..స్త్రీని స్వేచ్ఛగా ఎదగనివ్వండి
గతంలో సినిమాల్లో ‘ఆధునిక మహిళ’ అనగానే కబ్బుల్లో ఉంటారని చూపించేవారు. వాళ్లు మోడర్న్ దుస్తులు ధరిస్తారు... స్మోక్ చేస్తారు.. కాపురాలు పట్టించుకోరు.. ఇప్పుడు కర్నాటకకు చెందిన ఒక మినిస్టరు ‘వారు పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అన్నాడు. మహిళ ఆధునికం కావడం అంటే అభివృద్ధిలో, ఉత్పత్తిలో, ఉపాధిలో భాగం కావడం. వారిని ‘స్టీరియోటైప్’ చేయడం ఎన్నాళ్లు? వారిని చూసి భయపడటం ఎందుకు? ఆధునిక పురుషుడికి లేని విమర్శ మహిళకు ఎందుకు? మొదట ఆధునిక పురుషుడు ఏం చేస్తాడో చూద్దాం. అతడు రాజకీయవేత్త అవుతాడు. వ్యాపారవేత్త అవుతాడు. సిఇఓ, సినిమా స్టార్ అవుతాడు. సూట్ వేసుకుంటాడు. విరామంలో గోల్ఫ్ ఆడతాడు. చిన్న షార్ట్స్ వేసుకుని సముద్రంలో ఈత కొడతాడు. సరదాగా ఫ్రెండ్స్‌తో డ్రింక్ చేస్తాడు. బిజినెస్ ట్రిప్‌లకు వెళతాడు. సంపాదిస్తాడు. ఖర్చు పెడతాడు. వీటన్నింటికి సమాజం నుంచి ఆమోదం ఉంది. ఎందుకు? అతడు మగాడు. స్త్రీలు? వారూ చదువుతారు. సిఇఓలు అవుతారు. వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తారు. స్పోర్ట్స్ ఆడతారు. మెడల్స్ తెస్తారు. కారు డ్రైవ్ చేస్తారు. ఆఫీస్ పనుల మీద టూర్లు వెళతారు. కాని వీటికి విమర్శ వస్తుంది. ‘సంసారాన్ని వదిలేసి అలా ఎలా తిరుగుతుంది’. పశువు మెడలో తాడు కట్టేసి ఆ తాడును ఎంత దూరం వదిలినా ఆ పశువు తిరిగి తిరిగి మళ్లీ గుంజ దగ్గరకు చేరాలి అన్నట్టుగా భారతీయ సమాజం స్త్రీ ఎంత దూరం వెళ్లినా, ఎంత ఉన్నతి సాధించినా తిరిగి ‘సంసారం’, ‘మాతృత్వం’ వంటి ప్రాథమిక బాధ్యతల వద్దకే తిరిగి రావాలని భావిస్తుంది. స్త్రీని సంసారం నుంచి ‘ఆధునికత’ విముక్తం చేస్తుందనే భయం ఉంది– అందుకు ఏ రకమైన అధ్యయనం, ఆధారం లేకపోయినా. స్త్రీలు ఇల్లు కదలడం, చదువుకోవడం, మొదట స్టెనోలుగానో, టైపిస్ట్లుగానో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం, తమ కోసం మహిళా సంఘాలు పెట్టుకోవడం మొదలెట్టినప్పటి నుంచి వారిని ‘కేరికేచర్లుగా’ చూపిస్తూ, హేళన చేయదగ్గ స్త్రీలుగా చూపిస్తూ సమాజం వారిని అదుపు చేయాలని చూసింది. చూస్తోంది. పాత సినిమాల్లో ఆధునిక స్త్రీ అంటే విగ్గులు పెట్టేసి, చేతికి హ్యాండ్‌బ్యాగు వేలాడదీసి, క్లబ్బులో పేకముక్కలు చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు పబ్బుల్లో చూపిస్తున్నారు. ఇవాళ బాగా చదువుకున్న ప్రతి స్త్రీ, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రతి స్త్రీ ఆధునిక స్త్రీనే. ఆ చదువుకున్న స్త్రీ గృహిణిగా ఉంటున్నా ఆధునిక స్త్రీనే. అయితే ఛాందస వాదుల నిందలు, విమర్శలు ఏమంటే ‘వీరు కుటుంబాన్ని (భర్తను, పిల్లలను) నిర్లక్ష్యం చేస్తారు’ అని. అలా అని చెప్పి వీరి మీద ఒక ఒత్తిడి తెస్తారు. నిజానికి పురుషుడు ఎంత ఎదిగినా ఎలా కుటుంబంలోకి వస్తున్నాడో స్త్రీలు కూడా ఎంత ఎదిగినా కుటుంబంలోకి వస్తారు. వారికి తల్లిగా, భార్యగా ఇంటిని ఎలా నిర్వహించుకోవాలో తెలుసు. కాని పురుషుడికి ఉండే వెసులుబాటు వారికి ఉండదు. తన కెరీర్ కోసం పురుషుడు ముందు వెళ్లాలంటే స్త్రీ కుటుంబ నిర్వహణ కోసం తనను తాను కుదించుకోవాలి లేదా త్యాగం చేయాలి. ‘ఆధునిక మహిళ’ ఇక్కడ ప్రశ్నను లేవదీస్తుందని, నీకున్న హక్కు నాకు ఎందుకు లేదు అంటుందని, తద్వారా ‘పిల్లల్ని కంటూ ఇంటి దగ్గర పడుండే’ స్త్రీ పాత్ర నుంచి ఆమె విముక్తమవుతుందని సమాజానికి భయం. అందుకే సినిమాల్లో, అడ్వర్టైజ్మెంట్లలో, చవకబారు సాహిత్యంలో, కార్టూన్లలో అలాంటి స్త్రీలను హేళన చేయడం కనిపిస్తూ ఉంటుంది. ‘స్టెనోలందరూ బాస్ ఒళ్లో కూచుని ఉంటారు’ అని ఇప్పటికీ కార్టూన్లు గీస్తూ స్త్రీలను అవమానించే కార్టూనిస్టులు ఉద్యోగాల్లో తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్న స్త్రీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఊహించలేరు. ఇక టీవీ పెట్టగానే వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ‘ఉప్పు గురించి’, ‘మసాలా దినుసుల గురించి’, ‘టీ గురించి’, ‘అత్తయ్యకు నచ్చిన హెయిర్ ఆయిల్ గురించి’ మాట్లాడే గృహిణులను చూపి చూపి నీ ఆర్థిక స్తోమత, చదువు ఎంతున్నా నువ్వు ఎంగేజ్ కావాల్సింది ఈ పనుల్లోనే అని కండిషన్ చేస్తూ వస్తుంటాయి. రాజకీయాల్లో ఉండే స్త్రీలను, టీవీ డిబేట్లలో మాట్లాడే స్త్రీలను, ఉద్యమాల్లో ఉండే స్త్రీలను, మేధావులుగా ఉండే స్త్రీలను, ఆత్మవిశ్వాసంతో ఉండే స్త్రీలను, ఫ్యాషన్– గ్లామర్ రంగాల్లో ఉండే స్త్రీలను, ఎన్.జి.ఓ రంగాల్లో ఉండే స్త్రీలను సమాజానికి ఉండే ‘సగటు పురుష స్వభావం’ అంగీరించే పరిస్థితులు నేటికీ కనిపించకపోవడానికి కారణం అలాంటి స్త్రీలు తెల్లారితే గిన్నెలు కడుక్కుంటూ కనిపించరేమోనన్న భయం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. తాజాగా కర్నాటక ఆరోగ్యశాఖా మంత్రి సుధకార్ ‘ఆధునిక స్త్రీ సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతోంది, ఆమె పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అని వ్యాఖ్యానించాడు. నిజానికి స్త్రీకి తన శరీరం మీద హక్కు తనకే ఇంకా దక్కలేదు. పిల్లల్ని కనడం కనకపోవడం గురించి ఆమెకు వైవాహిక వ్యవస్థలో పూర్తిగా స్వేచ్ఛ లేదు. ఆమె ఏం చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో కుటుంబమే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆమె వివక్ష అనుభవిస్తూనే ఎదగాల్సి వస్తోంది. ఇన్ని జరుగుతున్నా ఆమె కుటుంబ చట్రానికి ఆవల వెళుతుందేమోనన్న భయంతో బ్లేమ్ కొనసాగుతూనే ఉంది. ఆధునిక స్త్రీ సమాజ హితం, కుటుంబ హితం కోరుతూనే ఉంది. అయితే దానికి సంబంధించిన రూల్స్ ఆమె మార్చదలుచుకుంటే వాటి మీద కదా చర్చ జరగాలి. అందాక నిందలు, విమర్శలు మానాలని అందరికీ చెబుదాం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. -
శరత్కాల వెన్నెల
‘విత్ ఫ్రీడమ్, బుక్స్ అండ్ ది మూన్ హూ కుడ్ నాట్ బి హ్యాపీ’ అన్నాడు ఆస్కార్ వైల్డ్. కోరుకున్న స్వేచ్ఛ, చదువుకోదగ్గ పుస్తకాలు, వెన్నెల కురిపించే జాబిల్లి... ఆనందానికి మరేం కావాలి. అందుకే ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అని మన కవి సినారె రసాస్వాదన చేశాడు. మానవజాతి సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టుకుంది. గౌరవించింది. పూజించింది. అష్షో బుష్షో అనీ అంది. చంద్రుడు? వారికి నేస్తం. బెడ్‌లైటు. మామ. ఊసులు చెప్పుకునే చెలికాడు. తక్కిన రుతువులు ఎవరివైనా కావచ్చు. శరత్కాలం చంద్రుడిది. ఈ కాలంలో చంద్రుడు చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకున్నట్టు ఉంటాడు. ఇది శరత్కాలం. ‘పిండారబోసినట్టుంది వెన్నెల’ అని పుస్తకాల్లో కనిపిస్తుంది. ‘కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి వెన్నెల కురుస్తోంది’ అని రచయితలు రాస్తే వయసులో ఉన్న యువతీ యువకుల రొమాంటిక్ భావాలతో మైమరుస్తారు. ఏ అడ్డంకీ లేని నిర్మల ఆకాశంలో, పలుచటి గాలులు వీచే రాత్రి సమయాన, దాపున చుక్కల సింగారంతో, శరత్కాలంలో పూర్ణచంద్రుడు ఉదయిస్తే, దానిని చూడలేకపోతే మన దగ్గర మణులుంటే ఏంటి... మాణిక్యాలుంటే ఏంటి... ఫోన్‌పేలో ఎంత ఉంటే ఏంటి... సాహిత్యంలో వసంత రుతువుది ఏకఛత్రాధిపత్యమే. కాని శరదృతువు తక్కువ తిన్లేదు. ఆ మాటకొస్తే వేదకాలం గుర్తించింది మూడు రుతువులనే. గ్రీష్మం, వసంతం, శరత్తు. ‘సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి’ అనే అర్థం వచ్చే శ్లోకం ఋగ్వేదంలో ఉంది. ప్రకృతి వర్ణనలో పరాక్రమశాలి అయిన కాళిదాసు శరత్కాలపు వెన్నెలను ఏల వదులుతాడు. ‘ఈ వెన్నెల ఎలా ఉందంటే గడ్డ కట్టిన చిక్కటి తెల్లటి పెరుగులా ఉంది’ అని వెన్నెల రుచి చూపించాడు. వెన్నెలలో రెల్లుగడ్డికి గ్లామర్ తీసుకు వచ్చింది కూడా ఆ మహాకవే. శరత్కాలంలో రెల్లుగడ్డి వెన్నెలను తాగి మత్తుగా ఊగుతున్నట్టు ఉందని రాశాడాయన. ‘వెన్నెల కాస్తుంటే కొందరు కిటికీలు మూసుకుంటారు’ అని గుడిపాటి వెంకటాచలం విసుక్కున్నాడు కాని తిలక్ వెన్నెల కాసిందంటే చాలు కవిత్వం రాశాడు. ‘దవుదవ్వుల పడుచు పిల్లలు పకపక నవ్వినట్టుంది వెన్నెల... దాపరికం లేని నాతి వలపులాగుంది వెన్నెల’ అని రాశాడు. అంతేనా? ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. తన పుస్తకాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’ అన్నాడు. ఇక్కడ అమృతం వెన్నెలామృతమే. అయినా సరే ‘ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది’ అని రాసిన నండూరి సుబ్బారావూ మొనగాడే. ఎంకిని ఆచ్ఛాదన లేని చంద్రుని కింద నాయుడు బావ చూశాడో లేదో కాని తెలుగు పాఠకులు కన్నులు ఇంతింత చేసుకుని చూశారు. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పున్నమి వాల్మీకి మహర్షి జన్మదినం. రామాయణం ఈ భరతభూమి మీద అనాదిగా ఆధ్యాత్మిక వెన్నెలను కురిపిస్తూ ఉంది. రాముడు రామచంద్రుడు. చంద్రుణ్ణి నేలకు దించమని కోరి గోరుముద్దలు తిన్నవాడు. సీతమ్మ మోము చంద్రబింబం కంటే ఏం తక్కువ. మహా భారతాన్ని తెలుగు అనువాదం చేస్తున్న నన్నయ్య ‘అరణ్య పర్వం’లో శరత్కాలాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాసి అక్కడితో రచన చాలించాడు. 200 ఏళ్ల తర్వాత ఎఱాప్రగడ కొనసాగింపుగా శరత్కాల వర్ణన చేసే మరో పద్యం రాసి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. తెలుగు మహాభారతం ఆ విధంగా ఒక శరత్కాలానికి మరో శరత్కాలానికి మధ్య సుదీర్ఘ విరామం తీసుకుంది. రుతువులు ఏం చేస్తాయి? ఏవో సంకేతాలు ఇస్తాయి. ఆ ప్రకారం నడుచుకోమని మనుషులకు చెబుతాయి. శరత్కాలం స్త్రీ, పురుషుల సన్నిహిత కాలం అని శృంగార శాస్త్రాలు చెబుతాయి. భర్తృహరి ‘శృంగార శతకం’ ఆ సమయంలో ఆలుమగలు ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ‘శరత్కాలంలో ఆలుమగలు ఏకాంతంగా మేడ మీదకు చేరాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేయాలి. చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది... ఆ సమయంలో ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించాలి’ అని చెప్పింది. చలం కూడా ‘ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు వెన్నెల రాత్రుళ్లలో సముద్రపు ఒడ్డున భూమే శయ్యగా కలిసేది ఎప్పుడో’ అని రాశాడు. రుతువు అంటే స్పందన. వెన్నెల అంటే స్పందన. స్పందనాగుణం కోల్పోవడమే ఇప్పుడు మనిషిని బాధిస్తున్న సంగతి. విషాదం ఏమంటే తాను స్పందనాలేమితో బాధ పడుతున్న సంగతి కూడా మనిషికి తెలియదు. పూవు పూస్తే, హరివిల్లు విరిస్తే, చినుకు చూరు నుంచి చిటుకూ పుటుకూ మంటే, గాలికి ఒక తీవ ఝల్లుమని కదిలితే ఆగి చూసి ఆస్వాదించి స్పందించే సమయం మనిషికి ఎక్కడిది? అది ఉంది. కాని లేదు అని పరుగు పెట్టడమే మనిషి నేడు చేస్తున్నది. ఈ స్పందన కరువైన కొద్దీ జీవితంలో ఆస్వాదన కరువవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య శుష్కమైన కోరిక మిగిలి రససిద్ధి అడుగంటుతుంది. నేడు భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య నిజమైన రసస్పందన కరువవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫేక్– కపట మోహ ప్రదర్శనే మిగులుతున్నది. సంవత్సరానికి ఒకసారి శరత్ రుతువు వస్తుంది. సోముడు తేజోవంతమై అందాక పేరుకు పోయిన భావాల నిరాసక్తతను వదలగొడతాడు. వెన్నెల గుమ్మరిస్తాడు. గుండెలకు లాలిత్యం ఇస్తాడు. హాయి పడాల్సిన కాలం ఇది. పున్నములను చూడాల్సిన కాలం. దాంపత్య అనుబంధాన్ని వెలిగించుకోవాల్సిన కాలం. వెలగడం మీ వంతు. -
మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె
రోజు మీరు ఉపయోగించే వంటనూనె మీ ఆరోగ్యానికి మంచిదేనా? మీ గుండెకు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా ? ఆరోగ్యాన్ని కాపాడుతూ గుండెకు మేలు చేయడంలో రైస్‌బ్రాన్ వంట నూనెలు ముందున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొలెస్ట్రాల్ సమతుల్యత సాధించడంలో రైస్‌బ్రాన్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు అమెరికా హర్ట్ అసోసియేషన్లు ఇప్పటికే సూచించాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది చుడటానికి చక్కని రంగులో కనిపించే రైస్‌బ్రాన్ ఆయిల్ వంటకు ఎంతో బాగుంటుంది. ఇందులో నాచురల్ యాంటీఆక్సిడెంట్ అయిన ఒరిజనోల్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. దేశీయంగా తయారయ్యే రైస్‌బ్రాన్ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వాడకం మాత్రం తక్కువగానే ఉంది. బియ్యపు పొట్టు నుంచి రైస్‌బ్రాన్ ఆయిల్ అంటే బియ్యంలోని పోషక పదార్థాల నుంచి నూనెను సేకరిస్తారనే అపోహ ఉంది. కానీ వాస్తవంలో అది నిజం కాదు. బియ్యం గింజ చుట్టూ ఉండే పొట్టు నుంచి ఆయిల్‌ని సేకరిస్తారు. ఈ బ్రౌన్ కలర్ పొట్టు వల్లనే బ్రౌన్ రైస్‌కు అనేక పోషక గుణాలు కలిగాయి. సాధారణ పాలిష్డ్ రైసుతో పోల్చితే బ్రౌన్ రైస్ ఎంతో మేలనే విషయం మనందరికీ తెలిసిందే. బియ్యపు పొట్టుకి ఉన్న ఔషధ గుణాలన్ని కలిసిన ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్‌ని మార్కెట్లో అందుబాటులో ఉంది. మ్యాజిక్ చేసే ఒరిజనోల్ గోధుమ రంగులో ఉండే బియ్యపు పొట్టు, ఒరిజనోల్ అనే సూక్ష్మమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఒరిజనోల్ అవసరమని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ఫ్రీడమ్ రిఫైన్డ్ రైస్‌బ్రాన్ ఆయిల్లో 10,000 ప్లస్ పీపీఎం ఆఫ్ ఓరిజనోల్ ఉంటుంది. ఇది సహాజమైన యాంటాక్సిడెంట్‌గా పని చేస్తూ శరీరంలోని కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్ల సమాహారం రైస్‌బ్రాన్ ఆయిల్లో మోనో ఆన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ముఫా), ఒమెగా-6 పాలి అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (పుఫా)లు ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో ఫ్యాట్ ప్రొఫైల్, టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్ వంటి యాంటియాక్సిడెంట్లన్లు బ్యాలెన్స్ చేస్తోంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో తోడ్పడుతాయి. అంతేకాదు రైస్‌బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఏ, డీలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైన అన్ని సుగుణాలతో ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్ మార్కెట్లో అందుబాటులో ఉంది, డీప్ ఫ్రైకి అనుకూలం భారతీయ వంటలకు అనువుగా దాదాపు 232 సెల్సియస్ డిగ్రీల దగ్గర కూడా రైస్‌బ్రాన్ అయిల్ వంటకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర డీప్ ఫ్రై సాధ్యమవుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు వేపుళ్లు తింటూ జిహ్యా చాపల్యాన్ని సంతృప్తి పరుస్తూనే ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు రైస్‌బ్రాన్ ఆయిల్ అనువుగా ఉంటుంది. అంతేకాదు వండినప్పుడు ఆహార పదార్థాలు రైస్‌బ్రాన్ ఆయిల్‌ను తక్కువగా శోచించుకుంటాయి. రైస్‌బ్రాన్ ఆయిల్‌కి ఉన్న మరో మంచి లక్షణం ఇది. కాస్మోటిక్స్ తయారీలో రైస్‌బ్రాన్ ఆయిల్‌కి ఇన్ని సుగుణాలు ఉండటం వల్లే సౌందర్య ఉత్పత్తుల తయారీలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ని విరివిగా ఉపయోగిస్తుంటారు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సన్‌స్క్రీన్ లోషన్, డే క్రీముల్లో రైస్‌బ్రాన్ నుంచి తీసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం రైస్‌బ్రాన్ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉండటంతో ఎంతో మంది భారతీయులు ఇతర కుకింగ్ ఆయిల్స్‌కి బదులుగా రైస్‌బ్రాన్ ఆయిల్‌ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పినట్టు రైస్‌బ్రాన్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే ఆస్పత్రుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది, వైద్య ఖర్చులు తప్పుతాయి. అన్నింటికీ మించి రోగాల బారిన పడకుండా ఉంటాం.(అడ్వర్టోరియల్) -
మనం అమరవీరుల ఆశయాలను సాధించామా?
భరతమాత స్వేచ్ఛ కోసం పోరాటం చేసి ఎందరో మహానుభావులు ప్రాణాలు విడిచారు. వారు కోరుకున్నదల్లా సంకెళ్లతో బంధింపబడని భావితరాన్ని.. అందుకే ఆరాటపడ్డారు.. పోరాటం చేశారు.. ప్రాణాలు విడిచారు. అమర వీరుల వందల ఏళ్ల పోరాటంతో బానిస సంకెళ్లు తెంచుకున్న భారతావనిలో నేటి తరం వారికి ఎలాంటి గౌరవం ఇస్తోంది.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఎలాంటి అర్థం చెబుతోంది?.. అమర వీరుల ఆశయసాధనకు కృషి చేస్తోందా?.. -
అన్నింటా తానైన మగువకు ఉందా స్వేచ్ఛ !
-
ఫ్రీ నస్రీన్.. ఫ్రీ లోజైన్ విడుదల ఉద్యమం
నస్రీన్, లోజైన్.. ఈ ఇద్దరూ అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు. ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇంకొకరు జైలు వంటి నిర్బంధంలో బయట ఉన్నారు. జైల్లో ఉన్న నస్రీన్‌కు కరోనా వచ్చిందని తాజా సమాచారం! జైలు బయట ఉన్న లోజైన్.. డేగ కళ్ల నిఘాల మధ్య తన అనుదిన జీవితాన్ని గడుపుతున్నారు. ఇద్దరూ రెండు దేశాల వాళ్లు. వీళ్ల కోసం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గళమెత్తింది. ‘ఫ్రీ సస్రీన్.. ఫ్రీ లోజైన్’ అని ఉద్యమించింది. హక్కుల కోసం పోరాడుతున్న మహిళ హక్కుల కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెట్ బయట, నెట్ లోపల ‘ఫ్రీడమ్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్’ అంటూ నిరసనలు, ప్రదర్శనలు మొదలయ్యాయి. నస్రీన్ సొటుడే (57) లాయర్. మానవ హక్కుల కార్యకర్త. స్త్రీ హక్కుల ఉద్యమకారిణి. ఆమె రచనలు, ప్రసంగాలు, సమావేశాలు.. దేశంలో రాజకీయ అస్థిరతకు కారణం అవొచ్చంటూ ఇరాన్ ప్రభుత్వం 2018 జూన్‌లో ఆమెను అరెస్ట్ చేసింది. 38 ఏళ్ల జైలు శిక్ష విధించి, 148 కొరడా దెబ్బలు కొట్టించింది! టెహ్రాన్ సమీపంలో ఆమెను ఉంచిన కర్చక్ జైలు అత్యంత దారుణమైనది, అపరిశుభ్రమైనది. పైగా నస్రీన్ ఇప్పుడు కరోనా బారిన కూడా పడ్డారు. ఆమెను తక్షణం విడిపించి వైద్య చికిత్సకు తరలించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కోరుతోంది. లోజైన్ అల్హత్లౌల్ (31) ప్రజా న్యాయవాది. మహిళా హక్కుల కార్యకర్త. ప్రజల తరఫున ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సౌదీ అరేబియా పాలకులకు నచ్చలేదు. అమెను తక్షణం నిలువరిం^è కపోతే దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదం అని తలచారు. 2018 మే లో అమెను అరెస్ట్ చేశారు. వెయ్యి రోజులు జైలు శిక్షను అనుభవించాక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. అలాగని స్వేచ్చగా ఉండేందుకు లేదు. మూడేళ్ల ‘గమనింపు’ కాలం విధించారు. ఈ మూడేళ్లూ ఆమె ప్రభుత్వ సమ్మతి లేకుండా అడుగు తీసి అడుగు వేయడానికి లేదు. నోరు తెరిచి మాట్లాడటానికి లేదు. ఏ విధమైన రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. పాల్గొంటే మళ్లీ జైలు శిక్ష. వెయ్యి రోజుల శిక్షాకాలంలో అనేక విధాలైన హింసలకు గురయ్యారు లోజైన్. ‘ఆమ్నెస్టీ’ ఈమె కోసం కూడా పోరాడుతోంది. లోజైన్ పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయమని డిమాండ్ చేస్తోంది. నస్రీన్, లోజైన్ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలలో ఇంకా ఎంతో మంది మహిళా హక్కుల కార్యకర్తలు జైళ్లలోనూ, జైలు వంటి నిర్బంధాలలోనూ దుర్భమైన జీవితాలను గడుపుతున్నారు. వారందరి కోసం ఇప్పుడు ఆమ్నెస్టీ తో పాటు, ‘పెన్’ (పొయెట్స్, ఎడిటర్స్, నావెలిస్ట్స్) అమెరికా, ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్, ప్రసిద్ధ అమెరికన్ మ్యాగజీన్ ‘మిస్’, సెంటర్ ఫర్ ఉమెన్స్ గ్లోబల్ లీడర్షిప్ ఉద్యమించాయి. -
స్వాతంత్ర్యం అంటే యుద్ధమే: చైనా
బీజింగ్: తైవాన్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా తయారైంది. గత కొంతకాలంగా తైవాన్‌పై బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్న చైనా తాజాగా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ అంశంలో విదేశీ జోక్యం పెచ్చుమీరుతోందంటూ పరోక్షంగా అమెరికాపై మండిపడుతోంది. తాజాగా చైనా రక్షణ శాఖ చేసిన ప్రకటన ఈ వివాదాన్ని మరింత పెంచేలా ఉంది. తైవాన్‌కు స్వాతంత్ర్యం అంటే యుద్ధం తప్పదని హెచ్చరించింది. చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వు కియాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ‘‘తైవాన్ జలసంధిలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన సైనిక కార్యకలాపాలు జాతీయ సార్వభౌమత్వాన్ని భద్రతను కాపాడటానికి చేపట్టిన చర్యలు. ఇక తైవాన్‌లో కొందరు మాత్రమే స్వాతంత్ర్యం కావాలంటున్నారు. నిప్పుతో చెలగాటం ఆడితే ఆ అగ్నికే ఆహుతి అయిపోతారంటూ’’ హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) ఇటీవలే చైనా యుద్ధ విమానాలు తన గగనతలంలోకి వచ్చాయని తైవాన్ ఆరోపించగా.. అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాయి. ఈ పరిణామాలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించినట్టు డ్రాగన్ భావిస్తోంది. మరోవైపు తైవాన్ అధ్యక్షుడు తై ఇంగ్ వెన్ తమది ఇప్పటికే స్వతంత్ర దేశమని.. తమ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పేర్కొంటుండడం కూడా డ్రాగన్‌కు కంటగింపుగా మారింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోన్న సంగతి తెలిసిందే. -
కరోనా ఉంటే ఫ్రీడమ్ పాస్‌లు ఇస్తారట!
లండన్ : ప్రాణాంతక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ పూర్తయ్యాక ‘ఫ్రీడమ్ పాస్’ ఇస్తామని చెప్పింది. ఈ పాస్‌లు మూడు నెలల పాటు చెల్లుతాయని, ఈ పాస్లతోని బ్రిటిష్ పౌరులు తమ ఇష్టానుసారం ఏమైనా చేసుకోవచ్చని కరోనా వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సర్ జాన్ బెల్ తెలిపారు. కరోనా పరీక్షల్లో లేదని తేలిన వారికి వెంటనే స్వేచ్ఛను ప్రసాదిస్తామని, వారు తమ ఇష్టానుసారం ఎక్కడైనా తిరగొచ్చు, తమ ఇష్టమైనది చేయవచ్చని జాన్ బెల్ చెప్పారు. అయితే నెగెటివ్ వచ్చిన వారు కూడా అనుమానాలు వచ్చినప్పుడల్లా తరచుగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రాకపోయినట్లయితే ‘లివర్‌పూల్’లో లాగా నిర్బంధంగా పరీక్షలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చదవండి: ‘ఫైజర్’ వ్యాక్సిన్ భారత్‌కు వస్తుందా!? -
బార్సిలోనా భగ్గుమంటోంది..
బార్సిలోనా భగ్గుమంటోంది. కటాలోనియా వేర్పాటు వాదులకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన శుక్రవారం కాస్త ప్రజ్వరిల్లింది. ముసుగులు ధరించిన యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోడ్లపైన అగ్గిని రాజేసి అగ్ని కీలలను సష్టించారు. చెత్తా చెదారాన్ని మండే వస్తువులను పోగేసి తగులబెట్టారు. కొన్ని చోట్ల స్పానిష్ పోలీసులతో వీధి పోరాటాలకు కూడా దిగారు. కటాలోనియా స్వాతంత్య్రాన్ని కోరుతూ నినాదాలు చేశారు. కటాలోనియాలో గత ఐదు రోజులుగా దాదాపు 50 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇలా ఆందోళన నిర్వహిస్తున్నారు. 2017లో స్వతంత్య్ర రిఫరెండమ్‌ను ప్రకటించినందుకు తొమ్మిది మంది కటాలోనియా వేర్పాటు వాదులకు స్పానిష్ సుప్రీం కోర్టు గత సోమవారం జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆ రోజు నుంచి ఆందోళనలకు దిగారు. గతంలో జమ్మూ కశ్మీర్‌కు ఉన్నట్లుగానే కొంత స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం కటాలోనియా. స్పానిష్ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 75 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారు సుదీర్ఘకాలంగా స్వానిష్ నుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు. -
కట్టుబాట్లు
కుర్తీ మోకాళ్ల కింది దాకా ఉండాలి.. మోచేతుల దాకా స్లీవ్స్ ఉండాలి..చున్నీ వేసుకోవాలి..జీన్స్ మీదకి టీ షర్ట్ కూడదు..చున్నీ ఏది?ఆడవాళ్ల వస్త్రధారణ మీద ఎందుకంత పట్టు?ఏం వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి?అనే ఆంక్షలు వాళ్ల మీదే ఎందుకు?సంస్కృతీసంప్రదాయ పరిరక్షణ భారం వాళ్ల నెత్తి మీదే ఎందుకు?ఏ అవమానం ఎదురైనా.. ప్రమాదంజరిగినా వాళ్ల దుస్తులకే ఎందుకు శిక్ష?కట్టూబొట్టూ తీరు నుంచి లైంగికేచ్ఛదాకా స్త్రీల స్వేచ్ఛ, హక్కుల కోసంపోరాడుతున్న కొంతమంది కళాకారుల గురించి... అవతలి వ్యక్తి క్రమశిక్షణారాహిత్యాన్ని, అహంకారాన్ని, మానసిక చపలత్వాన్ని అమ్మాయిలు తాము వేసుకునే బట్టలతోనే అడ్డుకోవాలి.. వీలైతే ఆ డ్రెస్కోడ్తోనే వాళ్లను సంస్కరించాలి.. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా?’’అంటారు కొందరు సామాజిక విశ్లేషకులు. ‘ఆడపిల్లలకు డ్రెస్ కోడ్ పెట్టినట్టు.. మగవాళ్లకు ప్రవర్తనా నియమావళి ఎందుకు ఉండదు?’ అని ప్రశ్నిస్తోంది ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని. ‘‘అమ్మాయిల కట్టు, బొట్టు, మాట, నడక.. అన్నిటి మీద రిస్ట్రిక్షన్సే.. వాటిని కాదని నచ్చినట్టు ఉంటే క్యారెక్టర్ లేదని.. ఫలానా అని.. లేబుల్స్ వేస్తారు’’ ఇంకో అమ్మాయి అసహనం.కరెక్ట్ పాయింట్ దగ్గరే అసహనం వెలిబుచ్చిందీ అమ్మాయి.. లేబ్లింగ్! ‘‘ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు టాపిక్‌ను? డ్రెస్ కోడ్‌కి లేబ్లింగ్‌కు లింక్ ఏంటి? మంచి బట్టలు వేసుకుని రండి అనడం కూడా తప్పేనా’’ అని విరుచుకు పడొద్దు. ‘‘మంచి అమ్మాయి’కి పురాణాలు, కావ్యాలు, కథలు, సినిమాలు ఇప్పుడైతే సీరియల్స్ ఇచ్చే నిర్వచనం.. నిండుగా బట్టలు వేసుకొని, వంచిన తల ఎత్తకుండా, నవ్వును పెదవులు దాటనివ్వకుండా, దుఃఖాన్ని మాత్రం పొంగి పొర్లిస్తూ, ఆత్మవిశ్వాసం అనే పదం తెలియకుండా, వెన్ను మీద పరాధీనతను మోస్తూ జీవితాంతం వంగి ఉండడం! దీనికి భిన్నంగా ఏ ఆడపిల్ల కనిపించినా ‘లేబుల్’ వేయడమే! ఆడవాళ్లు తమ చట్రంలోనే ఉండాలంటే ‘లేబుల్’ బూచీ చూపించాల్సిందే. దానికి డ్రెస్ కోడ్ మంచి ఊతం. తమ శరీరం, తమ అభిరుచి అనే స్వేచ్ఛను హరించాల్సిందే! వీటికి పైన చెప్పిన ‘కళ’లన్నీ వంత పాడినవే! చట్రాన్ని మరింత బిగించినవే. అసలు ఆ లేబుల్‌కు రూపమిచ్చినవే అవి. ఆ కళలతోనే ఆ సంప్రదాయాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది కళాకారిణులు. ఈ సందర్భంగా వాళ్ల పరిచయం.. హాటీ కాదు స్మార్ట్ ‘‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్, చోళీ కే పీచే క్యా హై’’ అంటూ ఆడవాళ్లను వస్తువులుగా, సెక్స్ సింబల్స్‌గా చేసి పాటలు రాయడం.. స్టెప్పులు వేయించి.. కాసులు కురిపించుకోవడం భారతీయ సినిమా అలవోక వ్యవహారం. ఇలాంటి వాటికి తన ర్యాప్‌తో ఝలక్ ఇచ్చింది లిల్లీ సింగ్. ఆడవాళ్ల శరీరాకృతిని కాదు ఆమె ఆత్మవిశ్వాసాన్ని వర్ణించమని.. ఆబ్జెక్ట్‌లా కాదు మనిషిలా చూడమని.. కట్టూబొట్టూ తీరుతో జడ్జ్ చేయొద్దని.. లేబుల్ వేయొద్దని.. మగవాళ్ల నిగ్రహలేమికి ఆడవాళ్ల కట్టూబొట్టూ తీరుని కారణంగా చూపొద్దని.. రంగు, కొలతలతో బేరీజు వేయొద్దని.. ఎలా ఉన్నా ఆమె ఇష్టాన్ని అభిరుచిని, వ్యక్తిత్వాన్ని గౌరవించమని చాలా ఘాటుగా జవాబిచ్చింది. లిల్లీ సింగ్. ‘సూపర్ ఉమన్’ అనే పేరున్న యూట్యూబర్ ఆమె. కెనడాలో పుట్టి పెరిగిన భారతీయురాలు. తన రచనలు, షోలతో ఫోర్బ్స్ ప్రతిభావంతుల జాబితాలో పేరు సంపాదించుకుంది. బై సెక్సువల్నని తన సెక్సువాలిటీని బాహటంగా ప్రకటించుకున్న ధీశాలి. ఎన్బీసీ (నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ) నైట్ షోకి హోస్ట్‌గా ఎంపిక చేసింది ఆమెను. ఎన్బీసీ నైట్ షోను నిర్వహించబోతున్న తొలి మహిళ లిల్లీ సింగ్. ఇందాక చెప్పుకున్న తాజా ర్యాప్ ‘‘కాల్ మీ స్మార్ట్ బిఫోర్ యు కాల్ మీ హాటీ’’ అనే వీడియోతో వార్తా విశేషంగా మారింది. స్టీరియోటైప్ భావాలు, భావనలు, అభిప్రాయాలను బ్రేక్ చేస్తోంది. బ్రేక్ ది సైలెన్స్ అంటోంది ఝీల్ గొరాడియా. పాతికేళ్ల ఈ ఆర్టిస్ట్.. స్త్రీల పట్ల వివక్షను, జరుగుతున్న అన్యాయాన్ని తన పెయింటింగ్స్ ద్వారా ఎత్తి చూపుతోంది. ముంబైలోని వీధులనే కాన్వాస్‌గా చేసుకొని నిరసన రంగులను అద్దుతూ ‘‘బ్రేక్ ది సైలెన్స్’ అనే పేరుతో క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. సామాన్య జనాలకు తేలిగ్గా అర్థమయ్యేందుకు బాలీవుడ్ చిత్రీకరిస్తున్న స్త్రీ పాత్రలనే తన కళకు థీమ్‌గా మలచుకుంటోంది. ‘‘మహిళలు తమ హక్కుల గురించి మాట్లాడకుండా వాళ్ల నోరు నొక్కేస్తుంది సమాజం. ‘‘అందుకే నా క్యాంపెయిన్ పేరు ‘బ్రేక్ ది సైలెన్స్’ అని పెట్టా. సోషల్ జస్టిస్కోసం గళమెత్తాల్సిందే’’ అంటుందీ ముంబై వాసి. రైట్ టు ప్లెజర్ ‘‘స్త్రీ శరీరం గుడి కాదు. పవిత్రం, అపవిత్రాలకు చోటు లేదు. లైంగికేచ్ఛను బయటకు చెప్పుకునే హక్కు వాళ్లకూ ఉంది. సంతోషం, ఆనందం వాళ్లకూ కావాలి. అవి వాళ్లకు చెందనీయకుండా ‘‘బరితెగింపు’ అనే లేబుల్‌తో భయపెడుతోందీ సమాజం’’ అంటుంది ప్రియా మాలిక్. డెహ్రాడూన్‌లో పుట్టి పెరిగిన ప్రియా ఆస్ట్రేలియాలో ఉంటారు. టీచర్, స్లామ్ పొయెట్, స్టాండప్ కమెడియన్ కూడా. 2014లో ఆస్ట్రేలియా ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొని ఫైనల్ వరకూ ఉన్నారు. అలాగే మన దగ్గర ‘‘బిగ్‌బాస్ సీజన్ 9’లోనూ పాల్గొన్నారు. ‘‘రైట్ టు ప్లెజర్’’ పేరుతో ఆమె చదివిన కవిత సంచలనం సృష్టించింది. అంతేకాదు ‘‘మై బాడీ ఈజ్ నాట్ ఎ టెంపుల్’’ అనే హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్నీ నిర్వహిస్తున్నారు.కట్టూ, బొట్టూ తీరు చెప్పి గడపకే కట్టిపడేయాలనే తలపులను, చేతలను ఎప్పటికప్పుడు అచేతనం చేస్తూ సమానత్వం కోసం పోరాడాలనే చేతన కలగచేస్తున్న ఇలాంటి కళాకారులు ఇంకెందరో! -
విమర్శిస్తే రాజద్రోహమా?!
తమ భావాలు, రాజకీయాలూ, సిద్ధాంతాలూ మాత్రమే సరైనవనీ, ఇతరుల అభిప్రాయాలన్నీ తప్పేనన్న భావన సమాజాన్ని ఎంతటి తిరోగమనంలోకి నెడుతుందో అర్థం చేసుకోలేకపోతే ఏ ప్రభుత్వమూ ఎంతో కాలం మనుగడ సాగించలేదు. ప్రభుత్వాల మీద ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటే, అది ప్రజల కన్నా ప్రభుత్వాలకే ఎక్కువ ప్రయోజనకరం. ఎవరైనా ప్రభుత్వాన్ని, అధికార వ్యవస్థలను విమర్శిస్తే అది రాజద్రోహమని భావిస్తే అది అధికారంలో ఉన్న వారికే చేటు అవుతుంది. వ్యవస్థలపై విమర్శలను అణచివేతతో ఎదుర్కోవాలని భావిస్తే, ప్రజాస్వామ్య పాలనకు బదులు అది పోలీస్ రాజ్యంగా మారిపోగలదు. ఎప్పుడైనా నిరసనను, కోపాన్ని అణచివేస్తే, పెరిగి పెరిగి అది ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. అప్పుడు మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఏ చిన్న అవకాశం కూడా మిగలని రోజొకటొస్తుంది. ‘‘అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, సైనిక బలగాలపై చేసే విమర్శలను రాజద్రోహ నేరంగా పరిగణించకూడదు. అది దేశ ద్రోహం కూడా కాదు. ఒకవేళ ఈ వ్యవస్థలపై విమర్శలను అణచి వేతతో ఎదుర్కోవాలని భావిస్తే, ప్రజాస్వామ్య పాలనకు బదులు అది పోలీస్ రాజ్యంగా మారిపోగలదు’’ అని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ దీపక్‌గుప్తా అన్న మాటలు ఈ రోజు దేశంలోని ప్రజా స్వామ్య వ్యతిరేకుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన న్యాయవాదుల సదస్సులో ఆయన మాట్లా డుతూ ‘‘పాత ఆలోచనలలో ఉన్న లోపాలను వ్యతిరేకించడం వల్లనే నూతన అభిప్రాయాలకు పురుడుపోసిన వాళ్లమవుతాం. పాత విధా నాలను కొనసాగించినట్లయితే, నూతన వ్యవస్థలకు అంకురార్పణ జరగనే జరగదు’’ అంటూ ప్రజాస్వామ్య మూలాలను తడిమిచూసే కీలకమైన తాత్విక చర్చకు తెరతీశారు. గత కొన్నేళ్ళుగా, భిన్నాభిప్రాయాలను, భిన్నమైన ఆలోచనలను జాతి ద్రోహంగా, దేశ ద్రోహంగా పరిగణించి, అణచివేత పద్ధతులను అనుసరించడం తీవ్రతరమైంది. అలా ఆలోచించిన వాళ్ళకు ఈ దేశంలో నివసించే హక్కే లేదనే దురాభిప్రాయం సమాజంలోని ఒక వర్గంవారు బలంగా ముందుకుతెస్తున్నారు. ఇటీవల కర్ణాటకకు చెందిన శశికాంత్ సెంథిల్ అనే ఐఏఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ స్వేచ్ఛగా ఇక్కడ అమలు జరగడంలేదని, ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ కష్టతరంగా మారిందనీ, రాజీపడుతోన్న పరిస్థితిలో ఉన్నదనీ అందువల్ల తాను ఈ హోదాలో కొనసాగడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. అదే కారణంతో తన పదవిని తృణప్రాయంగా భావిస్తూ, ఒకే ఒక్క కలంపోటుతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇది శశికాంత్ సెంథిల్ వ్యక్తిగత అభిప్రాయం. ఎవరికైనా నచ్చకపోతే, దాని మీద చర్చచేయవచ్చు. తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా ప్రకటించు కోవచ్చు. ఇందులో తప్పేమీలేదు. కానీ కేరళకు చెందిన బీజేపీ నాయ కుడు ఒకరు, దీని మీద స్పందిస్తూ, శశికాంత్ సెంథిల్‌కి ఎవరెవరితో సంబంధాలున్నాయో విచారణ జరిపించాలనీ, ఇటువంటి వ్యక్తి పాకిస్తాన్‌కు వెళ్ళి పోవాలని ప్రకటించడం శాంతాన్ని ప్రబోధించిన బుద్ధుడు నడయాడిన నేలలో ముంచుకొస్తోన్న అశాంతికీ, అసహ నానికి నిదర్శనం. ఎవరైనా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తే అది దేశద్రోహంగా ప్రకటించడమంటే పూర్తిగా ఒక నియంతృత్వ ధోరణిని ప్రదర్శించడమే తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా భిన్నమైన రాజకీయాభిప్రాయాలను కలిగి ఉన్నందుకు, ప్రభుత్వ విధానా లను తప్పు పట్టినందుకు, ఎంతో మంది రచయితలపై, విద్యార్థి నాయకు లపై, మే«ధావులపై రాజద్రోహం కేసులు నమోదు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. రకరకాల కారణాలను చూపి, ప్రభుత్వాలు తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తు న్నాయి. ఇవన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ప్రాథ మిక హక్కులను సంపూర్ణంగా ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదు. రాజద్రోహం పేరుతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఉపయోగిస్తున్న చట్టాలు బ్రిటిష్ కాలం నాటివి. బ్రిటిష్ పాలకులు తమ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలూ, తిరుగుబాట్లూ చేయ కుండా నిరోధించడానికి రాజద్రోహం అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాలు హింసను ప్రేరేపించే వారి పైన ప్రయోగిస్తామని చెప్పినప్పటికీ, ఈ నిర్బంధ చట్టాలు ఎంతో మంది రచయితలపైనా, రాజకీయ కార్యకర్తలపైనా ప్రయోగించారు. దేశ స్వాతంత్య్ర పోరా టాన్ని శాంతియుతంగా, సత్యాగ్రహాల ద్వారా నిర్వహిస్తానని ప్రక టించిన మహత్మాగాంధీపైనే ఈ రాజద్రోహ నేరం మోపి జైలుకి పంపారు. ఆ సందర్భంగా మహాత్మాగాంధీ మాట్లాడుతూ ‘‘ఎవరి కైనా ఒక వ్యక్తి పట్ల, వ్యవస్థ పట్ల అసమ్మతి ఉంటే, ఆ వ్యక్తి తన నిర సనను తెలియజేయడానికి సంపూర్ణ అవకాశముండాలి అన్నారు. కానీ బ్రిటిష్ పాలకులకు కావాల్సింది ప్రజాస్వామ్యం కాదు, వ్యక్తి గత స్వేచ్ఛ అంతకన్నా కాదు. వారి పాలనను రక్షించు కోవడానికి మాత్రమే ఆ చట్టాలను విచ్చలవిడిగా వినియోగించారు. ఎంతో మంది స్వాతంత్య్ర పోరాట వీరులను ఇదే చట్టంకింద జైళ్ళల్లో నిర్బం ధించారు. వీరి కోసమే అండమాన్‌లాంటి చోట్ల ప్రత్యేక జైళ్ళనే నిర్మిం చారు. అయితే వీటికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు వెల్లువెత్తాయి. గాం«ధీ నాయకత్వంలో శాసనోల్లంఘన, సత్యాగ్రహం లాంటి నిరస నలు అందులో భాగమే. భగత్‌సింగ్ లాంటి విప్లవ వీరులు బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని ప్రతిఘటించడానికే ప్రాణత్యాగం చేశారు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకచోట చేరి స్వాతంత్య్రంతో కూడిన ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలని తీర్మానించాయి. ఇప్పుడు మనం రాజ్యాంగంలో పొందు పరుచుకున్న ప్రాథమిక హక్కులలో ఎక్కువభాగం ఆ రోజు రూపొం దించినవే. మన రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 19 సారాంశం నెహ్రూ కమిటీ నివేదికలో చేర్చారు. నెహ్రూ కమిటీ నివేదికలో నాలుగవభా గంలో నాలుగవ సెక్షన్లో భావప్రకటనా స్వేచ్ఛ సమావేశం హక్కు, సంఘం నిర్మాణం చేసుకునే హక్కులను స్పష్టంగా పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు భారత ప్రజల స్వేచ్ఛను, జీవించే హక్కును హరి స్తుంటే, దానిని ప్రతిఘటించడానికి, నిరోధించడానికి నూతన రాజ్యాంగం ఇటువంటి హక్కులను ప్రతిపాదించింది. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాం గంలో ఇటువంటి హక్కులన్నింటినీ మరింత శక్తిమంతంగా మార్చారు. భారత రాజ్యాంగం పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వం గురించి ఒక నూతన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు. ఈ రోజు మనం రాజ్యాంగంలో చేర్చుకున్న ఆర్టికల్ 19పైన ఎంతో మంది రాజ్యాంగసభ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల రక్షణ కోసం ప్రాథమిక హక్కులను చేర్చారు. ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కును ఆర్టికల్ 25 ద్వారా ఏ మతమైనా అనుసరించడానికి, ప్రచారం చేయడానికి పౌరులకు హక్కు ఉంటుం దని పేర్కొన్నారు. ఇది కూడా స్వాతంత్య్ర పోరాట కాలంలో వచ్చిన అనుభవాల సారమే. అటువంటి చరిత్ర కలిగిన ప్రజాస్వామ్య చట్టాలు ఈ రోజు ప్రమాదంలో పడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి సమాజం ముందుకు సాగాలన్నా, ప్రగతిని సాధించాలన్నా ప్రశ్నించే స్వభావం, విభేదించే స్వాతంత్య్రం ఉండాలి. సోక్రటీస్ లాంటి వాళ్ళు ప్రశ్నించడం నేర్వకపోయి వుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పడేవా? చర్చల ద్వారానే ప్రజలు శాంతిగా ఉంటారని భావించి అందుకోసం గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి పెట్టకపోతే భారత దేశం అరాచకంలో అంతమై ఉండేది కాదా? అలాగే అరిస్టాటిల్, ప్లేటో, జీసస్, మహమ్మాల్, గురునానక్, కార్ల్ మార్క్స్, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ లాంటి వారు లేకపోతే సమాజ గమనం ఏ తీరాలకు చేరేదో ఊహించలేం. చైనా విప్లవ నాయకులు మావోసేటుంగ్ చెప్పి నట్టు వంద భావాలు ఘర్షణపడనీయండి, వందపూలు వికసించనీ యండి అనే భావన ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాస్వామ్యానికి మూల సూత్రం కావాలి. తమ భావాలు, రాజకీయాలూ, సిద్ధాంతాలూ మాత్రమే సరైనవనీ, ఇతరుల అభిప్రాయాలన్నీ తప్పేనన్న భావన సమాజాన్ని ఎంతటి తిరోగమనంలోకి నెడుతుందో అర్థం చేసుకో లేకపోతే ఏ మతం, ఏ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించడం సాధ్యం కాదు. ప్రభుత్వాల మీద ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటే, అది ప్రజల కన్నా ప్రభుత్వాలకే ఎక్కువ ప్రయో జనకరం. కనీసం ఎప్పటికప్పుడు తమ తప్పును తెలుసుకొని కొన్నిం టినైనా సరిదిద్దుకొని ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చివరకు రాచరిక పాలనలో సైతం ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేం దుకు రాజులు మారువేషాల్లో తిరిగే వారని చదివాం. అది నిజమైనా, అబద్ధమైనా దాని స్ఫూర్తిని మాత్రం విస్మరించకూడదు. అంతే తప్ప ఎవరైనా ప్రభుత్వాన్ని, అధికార వ్యవస్థలను విమర్శిస్తే అది రాజ ద్రోహమని భావిస్తే అది అధికారంలో ఉన్న వారికే చేటు అవుతుంది. ఎప్పుడైనా నిరసనను, కోపాన్ని అణచివేస్తే, పెరిగి పెరిగి అది ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. అప్పుడు మనల్ని మనం పరిరక్షించు కోవడానికి ఏ చిన్న అవకాశం కూడా మిగలని రోజొకటొస్తుంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఏదైనా ఫేస్ చేస్తారు
స్వేచ్ఛకు వేరే భాష ఉంటుంది.. భాష్యం ఉండదు! ఒక గ్రామర్ ఉంటుంది... అందరితో సంధికలుపుకొనే వ్యాకరణం ఉంటుంది!! స్వేచ్ఛ అక్షరంలా చాలా పదునైంది సమాజంలోని చెడును చీల్చి చెండాడుతుంది ఫేస్బుక్లో కొందరు అదే చేస్తున్నారు.. ఫేస్ చేస్తున్నారు.. ఏదైనా ఫేస్ చేస్తున్నారు!! శీలం ఫ్రేమ్‌లో ఆడవాళ్లను చూస్తూ నోరుపారేసుకునే మగవాళ్లకు అదే తీరుగా కవిత్వంతో, కార్టూన్లతో కౌంటర్ ఇస్తారు.. రాజకీయ తాజా పరిణామాల మీద అద్భుతంగా విశ్లేషిస్తారు... ఆర్థిక వ్యవస్థ గురించి కామన్ మ్యాన్‌కు అర్థమయ్యేలా కామెంట్ పెడ్తారు.. కశ్మీరుకు స్వాతంత్య్రం ఎందుకు కావాలో చెప్తారు.. అర్జున్ రెడ్డి గొప్ప ప్రేమికుడు ఎందుకు కాదో వివరిస్తారు.. మోషే బ్రష్‌లో పొరపాటుగా దొర్లిన జెండర్ ఇన్సెన్సిటివిటీని ఇట్టే పసిగట్టేస్తారు.. దేశ రక్షణ వలయాన్ని.. టెర్రరిస్ట్‌ల చొరబాటును నిష్కర్షగా నిలదీస్తారు.. పలుభాషల సాహిత్య ప్రయోగాలకు తెలుగు అనువాదాన్ని పరిచయవేదికగా మలుస్తారు.. దేవుడి చుట్టూ అల్లుకున్న నమ్మకాల పరిధికి సైన్స్ లాజిక్ లోతును చూపిస్తారు.. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా స్త్రీ ఎదగాల్సిన సామాజిక అవసరాన్ని గుర్తిస్తారు.. పవర్ పాలిటిక్స్‌ను ఎదుర్కోవడానికి చదువును మించిన ఆయుధం లేదని సూచిస్తారు... ఎక్కడ? ఫేస్బుక్లో! ఎవరు? బాధ్యతగల పౌరులు... సమాజం పట్ల కన్సర్న్ ఉన్న మనుషులు.. రచయిత్రులు. ఓహ్.. ఇంత ఉపోద్ఘాతం స్త్రీ వాదం గురించేనా అని పెదవి విరువవద్దు. మహిళలు ఏం చెప్పినా స్త్రీవాదాన్ని ప్రమోట్ చేసుకోవడానికే అనే ప్రిజుడీస్ను వదిలిపెడితే అర్థమవుతుంది.. అన్ని రంగాల మీద వాళ్లకున్న అవగాహన, ఆలోచనలు, అభిప్రాయాలు. వాళ్ల రచనలు స్త్రీల ప్రతిభనే కాదు స్త్రీల ఆత్మగౌరవాన్నీ చాటుతున్నాయి. ఈ ఫ్రెండ్స్ లిస్ట్‌తో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నిజంగా ఒక పుస్తకమే. రాజకీయ, ఆర్థిక, సామాజిక , సాంస్కృతిక చరిత్రకు ఆధారాలుగా శిలాశాసనాలు, తాళపత్రాలు, గ్రంథాలే నిలిచాయి. ఇప్పటి నుంచి ఫేస్‌బుక్‌లోని ఈ టైమ్‌లైన్స్ కూడా ఆర్కైవ్స్‌లో భద్రం కావాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం గురించి భవిష్య త్తరాలు తెలుసుకోవడం కోసం. ట్రోలింగ్స్‌కి వెరవకుండా.. ట్రోలర్స్ బయోగ్రఫీని వాల్స్ మీద పోస్ట్ చేస్తూ ఒకరకంగా అక్షరపోరాటం చేస్తున్న ఆ రచయిత్రుల ఇంట్రడక్షనే ఈ కథనం. సందర్భం ఏంటీ అని వెంటనే రెండు కనుబొమలు కలుసుకోవచ్చు. మంచి పరిచయానికి ప్రత్యేకమైన సందర్భం ఉండాల్సిన అవసరం లేదేమో! సుజాత సూరేపల్లి శాతవాహన యూనివర్సిటీలో సోషియాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆమె.. రాజకీయ, సాంఘిక అంశాలకు ఎన్సైక్లోపీడియా. ఎంతటి సీరియస్ విషయాన్నైనా రెండు వాక్యాల్లో కుదించి అందరికీ అర్థమయ్యేలా సూటిగా రాయడం ఆమె ప్రత్యేకత. బయటే కాదు ఫేస్బుక్లో కూడా ఉద్యమాలతోనే ఉనికి చాటుకుంటూ వస్తున్నారు. కుల, మత, పురుషాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించడమే కాదు ఫేస్బుక్లో కలాన్నీ సంధిస్తున్నారు. మహిళల గురించి నోరుపారేసుకుంటున్న వాళ్లకు భయం రుచి చూపించారు. ‘‘ఆడవాళ్ల రాతలు నగలు, చీరలు, వంటలు, వెన్నెల రాత్రుల మీదే అనుకుంటారు. ఫస్ట్ నుంచీ నా ఫేస్బుక్ పేజీ పొలిటికల్, సోషల్ మూవ్మెంట్గానే ఉంది. వీటితోనే నేను ప్రజలకు కనెక్ట్ అయ్యాను.. ప్రజలు నాకు కనెక్ట్ అయ్యారు. ఎఫ్బీ వల్ల నాకూ చాలామంది యాక్టివిస్ట్‌లతో పరిచయం అయింది. అయితే రోహిత్ వేముల ఆత్మహత్య, ప్రణయ్ (అమృత భర్త) హత్య తర్వాత కులానికి సంబంధించి చాలామంది ఇన్నర్సెల్స్నూ బయటపెట్టింది ఫేస్బుక్. యాక్చువల్ ఫేసెస్‌కు అద్దంలా ఉంది ఫేస్బుక్’’ అంటారు సుజాత. పద్మావతి బోడపాటి దూరదర్శన్ యాదగిరి– నల్గొండ రిలే స్టేషన్లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పద్మావతి. వైవిధ్యమైన అంశాలను స్పృశిస్తారు,అనువదిస్తారు. ఫేస్బుక్ పాఠకుల కోసం ప్రస్తుతం ఫ్రెంచ్ రచయిత సిమోన్ ది బువా రచించిన ‘ది సెకండ్ సెక్స్’ను తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘‘డాక్టర్ యడవల్లి రమణ గారి ప్రోత్సాహంతోనే ఎఫ్బీలో రాయడం మొదలుపెట్టా. నిజం చెప్పాలంటే నా రచనాశక్తిని అంచనా వేసుకోవడానికే ఎఫ్బీలో రాయడం స్టార్ట్ చేశా. ప్లాన్డ్గా డిసిప్లిన్డ్గా రాసే అలవాటు లేదు. ఇలా రాయాలి.. అలా రాయాలి అనీ అనుకోను. ఏ రోజు ఏమనిపిస్తే అది రాసేస్తాను. ఫేస్బుక్లో మనం పోస్ట్ చేసిన వెంటనే వచ్చిన రెస్పాన్స్ చాలా ఉత్సాహాన్నిస్తుంది. అలాగే ఎఫ్బీలో విభిన్నమైన విషయాల మీద రాసే రచనలను చదవొచ్చు. జ్ఞానాన్ని మించిన ఆయుధం లేదు. అందుకే ముందు మనం జ్ఞానవంతులం కావాలి. జ్ఞానంతో ఎంపవరవుతాం’’ అంటారు పద్మావతి. ఉషా తురగ రేవెల్లి... వ్యంగ్యం ఆమె అస్త్రం. ఇడ్లీ, కాఫీ, నీడ, ట్రాఫిక్, పాట, భాష, కోతి, కోడి, కంప్యూటర్, కారు, తల్లి, పిల్ల, బామ్మ, తాత, ప్రేమ, కోపం, అలక, ఒంటరితనం, జీవితం, లోకం.. ఇలా ఏవీ.. ఎవరూ ఆమె రైటప్కి అనర్హం కాదు.. అనర్హులు కారు. ప్రస్తుతం వ్యంగ్యరచనలు చేసే అతికొద్దిమందిలో ఉషా తురగ రేవెల్లి ఒకరు. ప్రస్తుతం ప్రసారభారతిలో పనిచేస్తున్నారు ఆమె. అంతకుముందు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్క్రానికల్లో పనిచేశారు. ఇప్పుడు కూడా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తూంటారు. ‘‘ఎఫ్బీ ఒక ఊరటగా, కౌన్సెలర్‌గా, సంఘీభావంగా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్లేని చోట ఒక సపోర్ట్సిస్టమ్గా పనిచేస్తోంది. చర్చలకు ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉంటోంది మంచిదే. ఆ చర్చలన్నీ కార్యరూపం దాల్చాలి. మోర్ కన్‌స్ట్రక్టివ్‌గా సాగాలి.. సాగేందుకు అవకాశం ఉంది. సోషల్ఛేంజ్కు ఫేస్బుక్ మంచి ఉపకరణంగా మారితే బాగుంటుంది’’ అంటారు ఉషా తురగ రేవెల్లి. సౌమ్య ఆలమూరు నిజానికి ఆమె ఎకానమిస్ట్. కాని ప్రస్తుతం బీబీసీ (ఢిల్లీ)లో ఈఎల్టీ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. రాయడమంటే ఆమెకు ఇష్టం. అందుకే ఫేస్బుక్ వాల్నే పుటగా మలచుకున్నారు. ఢిల్లీ మెట్రో కథలు రాసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కామన్ థింగ్ నుంచి కంట్రీ పాలసీస్ దాకా అన్నిటి మీదా స్పందిస్తారు. సహేతుకంగా విమర్శిస్తారు. ‘‘ఫేస్బుక్లో రాయడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇదిలాగే రాయాలి, ఫలానా పద్ధతిలోనే చెప్పాలి అనే ఫ్రేమ్ ఉండదు. నచ్చినవి నచ్చినట్టు రాసేయొచ్చు. ఘాటుగానూ చెప్పొచ్చు. అభిప్రాయాలకైనా , కథలకైనా ఇమిడియెట్ రీచ్ ఉంటుంది. ఒక అంశానికి సంబంధించి డిఫరెంట్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్ తెలుస్తాయి. అన్నిటికీ మించి రచయితకు పాఠకుడికి కనెక్టివిటీ ఉంటుంది. పాఠకుడి అభిప్రాయమూ వెంటనే తెలుస్తుంది. వాల్ మీద్ కాకుండా ఇన్‌బాక్స్‌లో తమ అభిప్రాయాలను తెలిపే సైలెంట్ రీడర్స్ కూడా ఉంటారు. ఎఫ్బీ వల్ల టేమ్ వేస్ట్ అంటుంటారు కాని నేను చాలా నేర్చుకున్నాను. క్రిస్ప్‌గా, షార్ట్‌గా రాయడం తెలిసింది. అన్నిటికన్నా ముఖ్యంగా యువన్ నోహా హారారి తన ‘21 లెసన్స్ ఫర్ ట్వంటి ఫస్ట్ సెంచురీ’ అనే పుస్తకంలో చెప్పినట్టు అడాప్ట్ చేసుకోవడం వస్తుంది. ఏ చర్చ అయినా, రచన అయినా చదువైనా అడాప్ట్ చేసుకోవడాన్నే నేర్పాలి’’ అంటారు సౌమ్య. స్వాతి వడ్లమూడి ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా కార్టూనిస్ట్ కూడా. ఆమె అక్షరానికి భయం ఉండదు. ఆమె కుంచెకు వెరుపు ఉండదు. ఆమె భావానికి మొహమాటం ఉండదు. రాత అయినా.. కార్టూన్ అయినా ప్రజల పక్షమే. ఇంకా చెప్పాలంటే బాధితుల పక్షం! రాజకీయాలు, జెండర్, సాహిత్యం ఏదైనా సరే నిర్మొహమాటమే ఆమె వైఖరి. ‘‘మనకున్న పొలిటికల్ అభిప్రాయాలను న్యూస్పేపర్లలో నిష్కర్షగా చెప్పే వీలు ఉండదు. వితవుట్ రెస్ట్రిక్షన్స్, ఎడిటింగ్ మన అభిప్రాయాలను చెప్పే ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్కే. చిన్న చిన్న విషయాల నుంచి సీరియస్ ఇష్యూస్ దాకా అన్నిటి మీద అనిపించింది అనిపించినట్టుగా రాస్తున్నాను. కార్టూన్స్ వేస్తున్నాను. అయితే అభిప్రాయాలు, ఆలోచనల విషయంలో ఇచ్చిపుచ్చుకునే తీరుతో వ్యవహరించాలి. ముందస్తు భ్రమలు, భ్రాంతుల్లేకుండా విశాల దృక్పథంతో ఉండాలి. అవతలి వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ పట్లా గౌరవం ఉండాలి. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో కన్నా సోషల్ మీడియాతోనే చాలా నేర్చుకున్నాను’’ అంటారు స్వాతి వడ్లమూడి. రమా సుందరి గుంటూరులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్‌లో ఈసీఈ విభాగాధిపతిగా పనిచేస్తున్న రమాసుందరి మాతృక మాస పత్రికనూ నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో రైటర్‌గా ఆమెది ప్రత్యేక స్థానం. కుల, మత, లింగ, రాజకీయ, ఆర్థిక, సామాజికాంశాలతోపాటు సినిమాల మీదా రాస్తారు. ఇంగ్లీష్ వెబ్జర్నల్స్ వ్యాసాలనూ తెలుగులో అనువదిస్తారు. ‘‘సమకాలీన ఆలోచనల ప్రతిబింబం ఫేస్బుక్. నా సీరియస్ రాతలు ఫేస్బుక్ నుంచే ప్రారంభమయ్యాయి. నా అన్‌లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. అనేకమంది కవులు, రచయితలు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్లు, హక్కుల కార్యకర్తలు, సమాజం కోసం ఆలోచించేవారు ఇక్కడే పరిచయమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే అపరిమితమైన లోకాన్ని నాకు ఫేస్బుక్ పరిచయం చేసింది. నా పూర్వవిద్యార్థులను చాలామందిని ఫేస్బుక్ నాకు సన్నిహితంగా ఉంచుతోంది. నేను రాస్తున్న చాలా విషయాలు వాళ్ల జీవిత నిర్మాణానికి ఉపయోగపడ్తున్నాయని వాళ్లు చెబుతుంటే సంతోషంగా ఉంటుంది. ఫేస్‌బుక్‌ను నేనొక సామాజిక పత్రికలాగే ఉపయోగిస్తాను’’ అని చెబుతారు రమా సుందరి. ఇంకా ఉన్నారు... చైతన్య పింగళి, అపర్ణాతోట, మెర్సీమార్గరెట్, సాయి పద్మ, రాధా మండువ, మానస యెండ్లూరి.. ఇలా చెబుతూపోతే ఇక్కడ స్థలం సరిపడని జాబితా ఆ రచయిత్రులది. వీళ్లంతా ఫేస్బుక్లో తమ రచనలతో కొత్త దృక్పథాలకు పదును పెడ్తున్నారు. చేతన కలిగించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ట్రోలింగ్ ఎదురైనా.. బెదిరింపులు వచ్చినా.. వణుకు అంటూ ఎరుగని ఆ రాతలు ప్రవాహమై సాగుతూనే ఉన్నాయి.. ముతక భావాలను, జిడ్డు ఆలోచనలను కడిగేస్తూ! – సరస్వతి రమ -
నాకూ రెక్కలున్నాయ్ నాన్నా
పిల్లలు పుట్టడమే రెక్కలతో పుడతారుకానీ తలిదండ్రులు అబ్బాయిలకి రెక్కలుంచి అమ్మాయిలకు కత్తిరిస్తుంటారు ఆడపిల్లల పట్ల ఎక్కువ రక్షణ ఉంచాలనుకోవడం మంచిదే కానీ...కంచె కూడా మొక్కను మింగేసేంత ఉంటే ఎలా? స్వేచ్ఛలోనే జ్ఞానం ఉంది. చైతన్యం ఉంది. వివేచన ఉంది. వికాసం ఉంది. నాన్నలూ... మాట వినండి. ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు. ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్ కారు. ఆటంబాంబు పడితే ఎలా ఉండేదో కాని ఆ ఇంటి మీద ఆడపిల్లైతే పడింది.సిద్దిపేటలో అతనో ఉద్యోగి. ఆమె ఆ ఉద్యోగి భార్య. పెళ్లయిన మూణ్ణెల్లకు భార్య గర్భం దాల్చింది. అతని కుటుంబంలో చాలామందికి తొలి కాన్పు మగపిల్లాడే పుట్టాడు. కనుక తనకు కూడా మగపిల్లాడేపుడతాడని అతడు అన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ మగపిల్లాడి కోసం ఎదురు చూస్తుంటే ఆడపిల్ల పుట్టింది.ఆడపిల్లా! ఆడపిల్లే!అతను హతాశుడయ్యాడు. ఆమె నిరాశ పడింది. భవిష్యత్తు చిత్రపటం వారి కళ్ల ముందు గిర్రునో రయ్యినో తిరిగింది.ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. రెక్కల కింద కాపాడుకోవాలి. కట్నం కోసం డబ్బు కూడబెట్టాలి.ఆ తర్వాత మంచి కుర్రాణ్ణి చూసి పెళ్లి చేయాలి. అప్పటికే ఎంత ఖర్చవుతుందో ఏమో. ఏమేమి అవసరమవుతాయో ఏమో.ఇంకొకరిని కందాం అనుకున్నారు మగపిల్లాడు పుడితే.ఆడపిల్ల పుట్టింది కనుక ఆగిపోయారు.ఆడపిల్లకు మాటలొచ్చాయి. తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడింది. స్కూల్లో పక్క బెంచి వాళ్లతోనే మాట్లాడింది. ఆ తర్వాత మాట్లాడటానికి వీల్లేదు. ఆ తల్లిదండ్రులు ఎక్కడికీ పంపరు.బాబోయ్... ఆడపిల్ల.ఏమైనా జరిగితే.ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు.ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్ కారు. పోనీలే వాళ్లనే ఫ్రెండ్స్‌ను చేసుకుందామనుకుంటే హైస్కూల్ చదువు మంచిగా ఉండాలని హైదరాబాద్‌కు తీసుకొచ్చి బావమరిది ఇంట్లో పెట్టారు. వాళ్లు బాగ చూసుకున్నారు నిజమే. కాని వాళ్ల పిల్లలు అదో టైప్. మేచ్ కాలేదు. ఆ పిల్లకు సిద్దిపేటకు వచ్చేయాలనుండేది. కనీసం తల్లిదండ్రులతో ఉండాలనిపించేది. తల్లిదండ్రులు అది వినలేదు. అర్థం చేసుకోలేదు. ఇంటర్ చదువు ఇంకా ముఖ్యమైనదని తీసుకెళ్లి రెసిడెన్షియల్ కాలేజీలో పడేశారు. ఆ కాలేజొక బందెలదొడ్డి. తోటి విద్యార్థులకు బ్రష్ చేసుకోవడానికే టైమ్ ఉండేది కాదు... ఇక స్నేహం ఏం చేస్తారు?డిగ్రీ వచ్చేసరికి తల్లిదండ్రులే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెకండ్ ఇయర్‌కు వచ్చింది.ఒకరోజు తండ్రికి కాలేజ్ నుంచి మెసేజ్ చేసింది.‘నాన్నా.. పెళ్లి చేసుకుంటున్నా’ అని.తండ్రి అదిరిపడ్డాడు. తల్లి ఏడుపు అందుకుంది.కుర్రాడు ఎవడు అని వాకబు చేశారు. పిజ్జా డెలివరీ బాయ్ అట.సరే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకుందాం అనుకున్నారు. కాని మనిషిని చూస్తే నిరాశ కలిగేలాఉన్నాడు.ఎక్కడ తప్పు జరిగింది?బాగా పెంచామనుకున్నామే.కన్న కూతురు ఇంత ద్రోహం చేస్తుందా?తల్లి డిప్రెషన్. తండ్రికి నిస్పృహ. అమ్మాయి మీద పెళ్లి వద్దని ఒత్తిడి. ముందైతే వాయిదా వేయించి ఆలోచిద్దామని చెప్పి ముగ్గురూ కౌన్సెలింగ్‌కు వచ్చారు.‘చూడండి డాక్టర్. నా కూతురు చక్కని పిల్ల. బాగా పెంచాం. పోయి పోయి వాణ్ణి ప్రేమించానని చెబుతోంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది.ఏంటిది?’ అన్నాడు తండ్రి.సైకియాట్రిస్ట్ మొత్తం విన్నాడు.‘తప్పు మీదేనండీ’ అన్నాడు తండ్రితో.‘ఎలా?’‘ఆడపిల్ల ఆడపిల్ల అంటూ ఆ అమ్మాయిని ఏ గాలీ వెలుతురూ లేకుండా పెంచారు.స్నేహితులను ఇవ్వలేదు. పోనీ సొంత తమ్ముణ్ణో చెల్లెలినో ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఒంటరితనంతో బాధ పడింది. ఎక్కడైనా ఎవరైనా తనను పట్టించుకుంటే బాగుండు అని అనుకుంది. కాని అలాంటివీలే లేనట్టు మీరు పెంచారు. కాలేజీకొచ్చాక మీరు ఫోన్కొనిచ్చారు. కాలేజీ బుక్పోయి ఫేస్బుక్ వచ్చింది. మీ అమ్మాయి ఫేస్‌బుక్‌కు అడిక్ట్ అయ్యింది. అక్కడ ఎవరెవరో ముక్కుముహం తెలియనివారు మీ అమ్మాయి డిస్ప్లే పిక్చర్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపడం మొదలెట్టారు. చాటింగ్ మొదలెట్టారు. బుట్టలో వేసుకోవడానికి ‘చిన్నా కన్నా... భోం చేశావా... ఎండలో తిరక్కు... ప్రభాస్ సినిమా ఫస్ట్ మార్నింగ్ షోకు రక్తం అమ్మయినా నీ కోసం రెండు టికెట్స్ తెస్తా’... ఇలాంటి మెసేజ్‌లు చూసే సరికి తనకు ప్రాముఖ్యం ఉన్నట్టు, తనను గుర్తించే మనుషులు కూడా ఉన్నట్టు మీ అమ్మాయి అనుకుంది. సంతోషపడింది. అవతలి మనిషి ఎవరనేది కూడా చూడకుండా కేవలం అతడి మాటలు, స్నేహం అని అనుకుంటున్న స్నేహం, ప్రేమ అని అనుకుంటున్న ప్రేమకు కేరీ అయిపోయింది. అది ఆమెకు ఇష్టమైన కొత్తలోకం. అందుకని మిమ్మల్ని కూడా వద్దనుకుని అతణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్. తల్లిదండ్రులు తల దించుకున్నారు.‘చూడండి. ఆడపిల్ల అంటే భౌతికంగా ఒక నిర్మాణం. కాని అది అథమ నిర్మాణం కాదు. అణిచి పెట్టాల్సిన నిర్మాణం కాదు. మగవాడితో సమానమైన నిర్మాణం. ఆమెకు కూడా అన్ని రకాల చైతన్యం, జ్ఞానం, ఎక్స్పోజర్ ఉండాలి. తీగ కదా అని ఎక్కువ కంగారుతో చుట్టూ కర్రలు పాతితే అది ఎదగదు. చచ్చిపోతుంది. మీ అమ్మాయి విషయంలో జరిగింది అదే. దారిలో మోగే ఐస్బండి గంటైనా తన కోసం మోగితే చాలనుకునే స్థితికి వచ్చింది’ అన్నాడు మళ్లీ.ఆ అమ్మాయి వైపు చూశాడు.‘చూడమ్మా... నీది ప్రేమ కాదు... పెళ్లి చేసుకునేంత బంధం, పరిణితి మీ ఇద్దరి మధ్యా లేదు. ఇది కొద్దిపాటి ఆకర్షణ. ఈ వయసులో మనసుకు ఊపు తెచ్చే ఒక మాదకద్రవ్యం. దానిని చూసుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకు. నీకిప్పుడు కావలిసింది బాయ్‌ఫ్రెండ్ కాదు. ఒక స్నేహబృందం. అందులో అబ్బాయిలూ అమ్మాయిలూ కూడా ఉండొచ్చు. నీ అభిరుచి ఏమిటో తెలుసుకొని, నీకు ఏదైనా కళా సాంస్కృతిక రంగాల్లో ఇష్టం ఉంటే అందులో మనసు పెట్టు. నీకు ఇష్టమైన స్నేహబృందం దొరుకుతుంది.బ్లూ క్రాస్, రెడ్‌క్రాస్ వంటి సంస్థల్లో పని చేయాలనుకుంటే అదీ చేయవచ్చు. లేదంటే నువ్వే ఒక ఆర్ఫన్ ఏజ్‌లో పార్ట్‌టైమ్ వాలంటీర్‌గా పని చేయి. లోకం తెలుస్తుంది. నీకు నువ్వు తెలుస్తావు. నీ లోటు తీర్చే స్నేహాలు ఏర్పడతాయి. వయసు కూడా కొంచెం పెరగనీ. ఆ తర్వాత కూడా నువ్వు ప్రేమించదగ్గ వ్యక్తులు కనిపిస్తారు. అప్పుడు నీకు నిజంగానే ప్రేమించాలనిపిస్తే ప్రేమించు. నీ తల్లిదండ్రులను నేను ఒప్పించిపెళ్లి చేస్తా. సరేనా?’ఆ అమ్మాయి ఏమనుకుందో తల ఊపింది.సైకియాట్రిస్ట్ నిట్టూర్చాడు.అప్పటికి రాత్రి ఏడైంది.‘ఆకలేస్తోంది. ఏమైనా తెప్పించుకుందామా’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘పిజ్జా మాత్రం వద్దు సార్’... ఫీజు డబ్బులు బయటకు తీస్తూ కొంచెం భయంగా నవ్వాడు అమ్మాయి తండ్రి.అందరూ కూడా హాయిగానే నవ్వుకున్నారు ఆ తర్వాత. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్...
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ హద్దుమీరి భారత గగనతలంలోకి యుద్ధ విమానాలతో చొచ్చుకురావడంతో త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి చర్యల కోసం పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో బుధవారం వరుస సమావేశాలతో ప్రధాని బిజీబిజీగా గడిపిన క్రమంలో భద్రతా దళాలు పూర్తిస్వేచ్ఛతో చర్యలు చేపట్టాలని సూచించారు. బాలకోట్ స్థావరంపై ఐఏఎఫ్ దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. మిగ్-21 ఫైటర్ జెట్‌ను పాకిస్తాన్ నేలకూల్చిన విషయాన్ని, భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించడంపై కూడా చర్చించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో పాటు ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆయనను కలుసుకున్న త్రివిద దళాధిపతులు సరిహద్దుల్లో పరిస్థితిని వివరించారు. గడిచిన 24 గంటల్లో త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశమవడం అది రెండవసారి కావడం గమనార్హం. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో పాక్ నుంచి కవ్వింపు చర్యలు మొదలైన సంగతి తెలిసిందే. -
భావ స్వేచ్ఛను కాపాడదాం.
ప్రజాస్వామ్యానికి గీటురాయి అసమ్మతి. భిన్నాభిప్రాయ ప్రకటనకు స్వేచ్ఛ లేకుంటే సామాజిక జీవి తానికి అర్థమే లేదు. కానీ నేడు పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. నచ్చని భావాలు ప్రకటించే మేధావులు, రచయితల మీద దాడులు చేస్తున్నారు. కుట్ర కేసులు మోపి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఆధిపత్యశక్తులకు వైవిధ్యమనే జీవన విలువ అంగీకారం కాదు. భావాలను అదుపు చేయాలనుకుంటారు. రచన అంటేనే అసమ్మతి కాబట్టి సృజనకారులపై దాడులు చేస్తున్నారు. బెది రిస్తున్నారు. రచయితలు తమ రచనలను తామే తృణీకరించుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. పాలకుల భావాలపై అసమ్మతి ప్రకటించే స్వేచ్ఛ ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. దేశవ్యాప్తంగా మేధావులు, రచయితల అరెస్టుల సందర్భంగా మన సుప్రీం కోర్టు ఇదే చెప్పింది. ‘అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ లాంటిది. దాన్ని అనుమతించకుంటే ప్రజాస్వామ్యమనే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుంద’ని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య భావనను బతికించుకుందాం. కులమత లింగ అంతరాలకు అతీతంగా మనిషిని ఉన్నతంగా నిలబెట్టే ఒక సామూహిక స్వరాన్ని వినిపిద్దాం. భావ ప్రకటనా స్వేచ్ఛకై, జీవించే స్వేచ్ఛకై మన గొంతునే ఒక ఉమ్మడి వేదిక చేద్దాం. కలెక్టివ్ వాయిస్ ఆధ్వర్యంలో వివిధ రంగాల మేధావులు, పత్రికా సంపాదకులు, ప్రముఖులు, భాగస్వామ్య సంస్థలతో వినిపిస్తున్న భావ ప్రకటన పరిరక్షణ సామూహిక స్వరంలో గొంతు కలుపుదాం. (భావప్రకటన స్వేచ్ఛ కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సభ) కలెక్టివ్ వాయిస్, హైదరాబాద్ -
దేశోద్ధారకుడు
‘ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు. ‘పరవాలేదు. అమృతాంజనం కూడా మీదే కదా!’ అని చమత్కరించారట రాజాజీ. భారతీయ పత్రికలను బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణలోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి. ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు. కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం. భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రపత్రిక ఆవిర్భవించిన నాటికి గట్టుపల్లి శేషాచార్యులు అనే పండితుడు మద్రాసు నుంచి వెలువరిస్తున్న ‘శశిలేఖ’, ఏపీ పార్థసారథినాయుడు (ఇది కూడా మద్రాసులోనే∙అచ్చయ్యేది) నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రకాశిక’, కొండా వెంకటప్పయ్య తదితరులు మచిలీపట్నం నుంచి ప్రచురిస్తున్న ‘కృష్ణాపత్రిక’ ప్రధానంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం వార్తలు కూడా తెలుగువారికి తెలియాలన్న ఉద్దేశం కూడా పంతులుగారికి ఉండేదట. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు (మే 1, 1867–11 ఏప్రిల్, 1938) కృష్ణా జిల్లాలోని ఎలకుర్రులో పుట్టారు. తండ్రి బుచ్చయ్య, తల్లి శ్యామలాంబ. ప్రాథమిక విద్య స్వగ్రామంలోను, తరువాత మచిలీపట్నంలోను పూర్తయింది. ఆ చదువు చాలునని తండ్రి అభిప్రాయం. కొడుకు చదువులు, ఉద్యోగాల పేరుతో వేరే ఊళ్లో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆ తల్లి మాత్రం కొడుకు పెద్ద చదువులు చదవాలని పట్టుపట్టి మద్రాసు పంపింది. అక్కడే ఆయన క్రిస్టియన్ కాలేజీలో బీఏలో చేరారు. కానీ ఎందుకో మరి, మధ్యలోనే చదువు విడిచిపెట్టేశారు. అక్కడ ఉండగానే రెంటాల సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు ఆయన మేనకోడలు రామాయమ్మను పంతులుగారు వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. ఇందుకు ఆయన తల్లి అంగీకరించలేదు. పెళ్లికి కూడా రాలేదు. 1890 సంవత్సరంలో పెళ్లి జరిగింది. సుబ్బారావుగారు న్యాయవాది మాత్రమే కాదు. వ్యాపారవేత్త. అక్కడే కాబోలు మొదట పంతులుగారిలో వ్యాపారం చేయాలన్న ఆశయం అంకురించింది.అందుకే కాబోలు ఏ ఉద్యోగంలోను చేరలేదు. బొంబాయి వెళతానని చెప్పారు తల్లికి. అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. మళ్లీ తల్లి మాట ధిక్కరించి ఆయన వెళ్లారు. 1892 నుంచి రెండేళ్ల పాటు అక్కడే వ్యాపారం చేశారు. తరువాత ఔషధాల వ్యాపారంలో తర్ఫీదు కోసం కలకత్తా వెళ్లారు. మళ్లీ బొంబాయి చేరుకున్నారు. అక్కడే విలియం అండ్ కో సంస్థలో చేరారు. అది ఐరోపా వారి సంస్థ. ఆ యజమాని అభిమానానికి పంతులుగారు పాత్రులయ్యారు. అదే వరమైంది. ఆ సంస్థ యజమాని స్వదేశం వెళ్లిపోవాలని అనుకున్నాడు. వ్యాపారం మొత్తం పంతులుగారికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వ్యాపారం చేతికి వచ్చాకనే 1899లో పంతులుగారు అమృతాంజనం తయారు చేయడం ఆరంభించారు. 1903 నాటికి ఆ వ్యాపారం ఇతోధికంగా పెరిగిపోయింది. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. అప్పుడే లక్షలలో ధనం వచ్చిపడింది. తన మందుల దుకాణానికి ‘అమృతాంజనం డిపో’ అని పేరు పెట్టారు. బొంబాయి, కలకత్తా – ఈ రెండు నగరాలు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్నాయి. అప్పటికే రాజకీయంగా ఎంతో చైతన్యం పొందాయి. కలకత్తా బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంతోను, మహారాష్ట్ర భారత జాతీయ కాంగ్రెస్ ప్రభావంతోను ఉద్యమ వేడితో ఉండేవి. ఆ రెండు నగరాల మధ్యనే పంతులుగారు చిరకాలం తిరిగారు. అందుకే అక్కడి ప్రభావం ఆయన మీద బాగా పడింది. తాను వ్యాపారంలో బాగా రాణించి స్థిరపడిన కాలంలో మహారాష్ట్ర పత్రికలు ఇస్తున్న చైతన్యంతో జాతీయ భావధారంలో ఊగుతూ ఉండేది. తెలుగువారి కోసం కూడా ఆ స్థాయిలో పత్రిక నిర్వహించాలని పంతులుగారు ఆకాంక్షించారు. అందుకే మొదట ఆంధ్రపత్రిక వారపత్రికను బొంబాయిలో 1908లో ఆరంభించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన సూరత్ కాంగ్రెస్ సభలకు ఆయన హాజరయ్యారు. అది ఆయన ఆలోచనను మరింత వేగవంతం చేసింది. 1910లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికల ప్రచురణను ఆరంభించారు. ఆ సంచికలు ఇప్పటికీ తెలుగు ప్రాంతంలోని కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతాయి. వాటిని చదవడం నిజంగా గొప్ప అనుభవం.అందులో ‘ప్రస్తావన’ పేరుతో ఒక శీర్షిక ఉండేది. అచ్చులో కనీసం నలభై యాభై పేజీలకు తక్కువ కాకుండా ఉండేది. దానిని స్వయంగా పంతులుగారే రాసేవారు. ప్రపంచ యుద్ధకాలంలో కూడా ఈ శీర్షిక దర్శనమిచ్చేది. అయితే కొన్ని పేజీలు తక్కువగా ఉండేవి. న్యూస్ ప్రింట్ కొరత కారణంగా అన్ని పేజీలు ఇవ్వలేకపోతున్నామని ‘గమనిక’లో వాపోయేవారు. ఈ శీర్షిక ప్రపంచం మొత్తం మీద ఒక విహంగ వీక్షణం. వివిధ ప్రపంచ దేశాల విశేషాలు, భారత స్వాతంత్య్రోద్యమం, తెలుగు ప్రాంతం, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ వివరాలు అన్నీ అందులో ఉండేవి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు మొత్తం ఆయన ఇందులో విశ్లేషించేవారు. ఆయన 28 ఏళ్ల పాటు ఆ శీర్షిక నిర్వహించారు. అంటే తుదిశ్వాస విడిచేవరకు. కానీ తెలుగువారు బాగా తక్కువగా ఉన్న బొంబాయిలో ఆయన ఇమడలేకపోయారని అనిపిస్తుంది. వ్యాపారం, కుటుంబం, పత్రిక మద్రాసు తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. సూరత్ సభలకు వెళుతూ గిర్గావ్లో ఉన్న పంతులుగారి ఇంటిని ఆనాడు అవటపల్లి నారాయణరావు గారు ఇంకొందరు సందర్శించారు. ఈ అనుభవాన్ని, పంతులుగారి ఆతిథ్యం గురించి అవటపల్లి ఒక వ్యాసంలో చక్కగా వర్ణించారు.భారత స్వాతంత్య్రోద్యమాన్ని అక్షరాలలో దర్శించే భాగ్యమైనా కలిగించినవారు పంతులుగారే. మారుమూల గ్రామాలకు కూడా ఆంధ్రపత్రిక తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యేది. మద్రాస్ చేరుకున్న తరువాత 1914లో ఆంధ్రపత్రిక దినపత్రికను ఆరంభించారు. మరోపక్క వార పత్రిక కూడా వెలువడేది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఆంధ్రపత్రిక ఒకే సంవత్సరంలో ఆరంభమైనాయి. పత్రికా నిర్వహణ భారమనుకుంటూనే మరోపక్క ఆంధ్రగ్రంథమాల అనే సంస్థను స్థాపించారు. స్వయంగా తమ రచనలు ముద్రించుకోలేని ఎందరో రచయితల పుస్తకాలను అచ్చువేయించే పనిని పంతులుగారే చేపట్టారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, భగవద్గీతా వ్యాఖ్యానం కూడా అచ్చు వేయించారు. ఇందులో భగవద్గీతా వ్యాఖ్యానం ఆయన జైలుకు వెళ్లినప్పుడు స్వయంగా రాసినదే. ఇదంతా ఉచితంగా చేశారాయన.కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు అసంపూర్ణంగా వదిలేసిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రచురణ భారాన్ని కూడా నాగేశ్వరరావుగారే తలకెత్తుకున్నారు. ఇవి కాక, ఆయన చెన్నపట్నంలో తన కార్యాలయం బయటకు వస్తే చాలు కనీసం అయిదారుగురు అక్కడ వేచి ఉండేవారట. ఒకరు కన్నీళ్లతో తన కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమని అడిగేవారట. ఇంకొకరు తాను రాసిన పుస్తకం అచ్చు వేయించుకునే శక్తి లేదని దీనంగా చెప్పేవారట. ఒక విద్యార్థి పరీక్షకో, ఫీజుకో సాయం చేయమనే వారట. మరొకరు మరొక కారణం– అయితే అందరికీ కూడా ఆయన డబ్బు ఇచ్చి పంపేవారు. వారి బాధ తన బాధగా భావించి ఒక ఉద్వేగంతో ఆయన డబ్బు ఇచ్చేవారని ఆయన జీవిత చరిత్ర రాసినవారు పేర్కొనడం విశేషం. ఆయనకు గాంధీజీయే ‘విశ్వదాత’ అన్న బిరుదును ఇచ్చి గౌరవించారు. దేశోద్ధారక ఆయనకు ఉన్న మరొక బిరుదు. పంతులుగారు గాంధీగారి కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. తన సొంతూరులో తల్లి శ్యామలాంబగారి పేరుతో ఒక విద్యాలయాన్ని నెలకొల్పి అందులో హరిజన బాలబాలికలకు అవకాశం కల్పించిన మహనీయుడు. వారి దీనస్థితికి చింతిస్తూ రెండెకరాల భూమి కొని అందులో నలభై ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన. 1932లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘానికి ఆయన అధ్యక్షులు కూడా. హిందీ ప్రచారం, ఖద్దరు ఉద్యమం పంతులుగారి జీవితంలో కనిపించే మరో రెండు కోణాలు. 1923లో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ సభలు జరిగినప్పుడే హిందీ సాహిత్య సమ్మేళనం కూడా జరిగింది. ఆ సభలకు పంతులుగారే ఆహ్వాన సంఘాధ్యక్షులు. విజయవాడలోని నాగేశ్వరరాయ హిందీ భవన్ ఆయన చలవతో ఏర్పడినదే. అలాగే గ్రంథాలయోద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. ఎంత చిన్న గ్రంథాలయమైనా దానికి ఆంధ్రపత్రికను ఉచితంగా పంపేవారాయన. 1919లో మద్రాసులోని గోఖలే హాలులో జరిగిన అఖిల భారత గ్రంథాలయ సభకీ, ఆంధ్ర సారస్వత సభలకు కూడా ఆయనే సారథి. 1924 సంవత్సరంలో ఆయన ‘భారతి’ మాస పత్రికను నెలకొల్పారు. ఇది ఒక అత్యున్నత అభిరుచికి తార్కాణంగా కనిపిస్తుంది. ప్రతి సంచిక ఒక ఆణిముత్యమే. సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి– ప్రతి విశిష్ట అంశాన్ని ‘భారతి’లో పాఠకులు దర్శించేవారు. తెలుగు సాహిత్యానికి ఈ పత్రిక చేసిన సేవ వెలకట్టలేనిది. ఇవన్నీ ఉన్నా స్వాతంత్య్రోద్యమం, ఆం్ర«ధోద్యమం కూడా పంతులుగారి జీవితంలో కీలకంగానే కనిపిస్తాయి. ఆంధ్రరాష్ట్ర అవతరణకు కీలక ఒప్పందం జరిగిన శ్రీబాగ్ మద్రాసులో పంతులుగారి నివాసమే. 1924, 1929, 1930, 1934 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పంతులుగారే.పంతులుగారి కృషిని అంచనా వేయడం అంత సులభం కాదు. ఆయన పత్రికా నిర్వాహకుడు. స్వయంగా పత్రికా రచయిత. కళోద్ధారకుడు. చిన్నప్పుడు స్వయంగా నాటకాలలో నటించిన అభిమానం ఆయనకు జీవితాంతం ఉండిపోయింది. అందుకే నాటక కళకు కూడా ఆయన సేవలు దక్కాయి. వీటితో పాటు జీర్ణదేవాలయోద్ధరణ ఇంకొకటి. కాశీనాథుని నాగేశ్వరరావు వంటివారు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. ఆయన తెలుగువాడు కావడం నిజంగానే గర్వకారణం. ∙డా. గోపరాజు నారాయణరావు -
ఆ మైత్రి ప్రజాస్వామ్యానికి చావుగంటే!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ అధికార పరిధిలో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలపై విచారణకు ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ మిశ్రాకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల రాసిన లేఖ చర్చనీయాంశమైంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్య మైత్రి ప్రజాస్వామ్యానికి చావు గంట అని ఈ నెల 21న రాసిన లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. సీజేఐతో పాటు సుప్రీంలోని 22 మంది జడ్జీలకూ లేఖ కాపీలు పంపారు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణ భట్‌పై కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి విచారణకు ఆదేశించడాన్ని చలమేశ్వర్ ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ జడ్జిని హైకోర్టు జడ్జీగా నియమించడమో లేదా నియామకంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పునఃపరిశీలన కోసం కొలీజియం సిఫార్సుల్ని తిరిగి పంపడమో చేయకుండా న్యాయ శాఖ కర్ణాటక సీజేకి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కొలీజియం సిఫార్సుల్ని పక్కనపెట్టడమే.. సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ జడ్జిపై ఆరోపణల విషయంలో పునఃవిచారణకు ఆదేశించడమంటే గత విచారణ నివేదికను పక్కనపెట్టడమే కాకుండా, కొలీజియం సిఫార్సుల్ని స్తంభింపచేయడమేనని చలమేశ్వర్ అన్నారు. ఈ అంశంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. కొలీజియం సిఫార్సుల్ని పునఃమూల్యాంకనం చేయమని హైకోర్టును ప్రభుత్వం కోరడాన్ని అనుచిత చర్యగా , మొండివైఖరిగా భావించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై లేఖలో ప్రస్తావిస్తూ.. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులమైన మనం.. మన న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం, సమగ్రతలోకి కార్యనిర్వాహక వ్యవస్థ కొద్దికొద్దిగా చొరబడేందుకు చోటిస్తున్నామనే అపవాదును మూటగట్టుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.. ‘తప్పని తేలిన, సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆరోపణలపై మళ్లీ విచారణ జరపమన్న దృష్టాంతాలు నాకు తెలిసినంత వరకూ గతంలో లేవు. సుప్రీం సిఫార్సులు పెండింగ్‌లో ఉండగా అత్యున్నత న్యాయస్థానాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ పట్టించుకోకుండా పనిచేసిన ఉదంతాలు లేవు’ అని అన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జీని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే పునఃపరిశీలనకు కొలీజియం సిఫార్సుల్ని తిప్పి పంపవచ్చని, అలా చేయకుండా వారిదగ్గర అలాగే అట్టే పెట్టుకున్నారన్నారని తప్పుపట్టారు. కొంతకాలానికి సుప్రీంకోర్టు సిఫార్సుల్ని ప్రభుత్వం అంగీకరించడమనేది మినహాయింపుగా మారిపోతుందని, సిఫార్సుల్ని వారి వద్ద అట్టిపెట్టుకోవడం నిబంధనగా పరిణమించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. జడ్జీల బదిలీకి సంబంధించి హైకోర్టులతో న్యాయశాఖ నేరుగా సంప్రదించడాన్ని గతంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని, ఆ అంశమే 1981లో మొదటి జడ్జీల కేసులో తీర్పు వెలువడేందుకు కారణమైందని గుర్తుచేశారు. జడ్జి కృష్ణ భట్‌పై మహిళా న్యాయాధికారి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని 2016లో అప్పటి సుప్రీం సీజేఐ ఠాకూర్ అప్పటి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖర్జీని ఆదేశించారు. విచారణలో భట్‌కు క్లీన్చిట్ దక్కడంతో ఆయనను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర న్యాయ శాఖకు కొలీజియం సిఫార్సు చేసింది. సంప్రదాయానికి కొలీజియం బ్రేక్ హైకోర్టు శాశ్వత జడ్జీలుగా నియామకం కోసం తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడటం ద్వారా సుప్రీంకోర్టు కొలీజియం చరిత్ర సృష్టించింది. కోల్‌కతా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా సంబంధిత హైకోర్టు కొలీజియాలు సిఫార్సు చేసిన 12 మంది లాయర్లు, ట్రయల్ కోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా, అత్యంత సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన కొలీజియం అనధికారికంగా గురువారం ఇంటర్వ్యూలు చేసింది. -
చదువు.. స్వేచ్ఛ
సూర్యాపేటటౌన్ : ‘‘ప్రస్తుతం ఉన్న సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించాలి.. తనకు నచ్చిన రంగంలో స్థిరపడే వరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.. కుటుంబంనుంచి వారి పట్ల వివక్ష లేకుండా ఉండాలి.. అసమానతలు.. వేధింపులు.. అవమానాలు.. ఈ మూడింటిని అధిగమించినప్పు డే మహిళ ధైర్యంగా ముందుకెళ్తుంది’ అంటున్నారు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ. సాక్షి మహిళా క్యాం పెయిన్లో భాగంగా మహిళా సాధికారతపై ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే... తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని లక్ష్యం చేరే వరకు పోరాడాలి. దీనికి కుటుంబం నుంచి ప్రోత్సహం తప్పకుండా ఉండాలి. అమ్మాయిలపై కుటుంబంనుంచి వివక్ష లేకుండా చూడాలి. సమాజంలో అమ్మాయిలకు ఒక తీరు.. అబ్బాయిలకు ఒక తీరు.. కాకుండా సమానంగా హక్కులు కల్పించాలి. మహిళలపై వేధింపులు లేని సమాజాన్ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కొంత మేరకు మహిళలపై వేధింపులు ఆపడానికి కొన్ని చట్టాలు తీసుకొచ్చినా.. అవి నామమాత్రంగా కాకుండా బలంగా అమలు చేయాలి. మహిళలపై వేధింపులు జరిగినప్పుడు మహిళలు బయటకు వచ్చి చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి. అలా కాకుండా మహిళలపై వేధింపులు జరిగినప్పుడు తక్షణమే చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు చేసే దిశగా ప్రభుత్వం చూడాలి. చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడానికి షీటీం, తదితర చట్టాలను తీసుకొచ్చింది. కానీ షీటీం లాంటి చట్టాలపై మహిళలకు చైతన్యం తీసుకురావాలి. చట్టం ప్రకారం ఎంతటి వారినైనా శిక్షించాలి. ముఖ్యంగా మహిళలల్లో తమకు తాము తక్కువ అనే భావన పోవాలి. సమయ సందర్భాలను బట్టి తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి. విద్య ద్వారానే విజ్ఞానం ధైర్యం, లోకజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. కావున మహిళలు విద్యావంతులవ్వాలి. విద్యతోనే అందలం.. మహిళా సాధికారిత కోసం మహిళలు ఉన్నత చదువులు విద్యనభ్యసించాలి. విద్య ముఖ్యమైన సాధనం. ఆడిపిల్లలను వారి తల్లిదండ్రులు బాగా చదివించాలి. ఎలాంటి బేధాలు చూపించకూడదు. విద్య ద్వారానే విద్యావంతులవుతారు. జ్ఞానం సంపాదించినప్పుడే ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారు. ఆడ పిల్లలను చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలి. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయవద్దు. శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాతే వివాహం జరిపించాలి. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. -
అసభ్యకరమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి
స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ దేశంలో మహిళలకు ఎలాంటి గౌరవం లేదని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఓ మహిళగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాని అందులో పేర్కొన్నారు. ‘ప్రియమైన భారతదేశం.. నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి కుమార్తెగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. నేను చేసే పని, వేసుకునే దుస్తులు నా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. అయితే పక్కవాళ్లు వీటిని వేలెత్తి చూపుతున్నారు. నా కుటుంబాన్ని, నన్ను అగౌరవపరిచే హక్కు వారికి ఎక్కడ ఉంది? ప్రతి రోజూ అసభ్యకరమైన ఫోన్ కాల్స్, సోషల్‌మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఓ బాధ్యతగల మహిళగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నాకు నచ్చిన పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నాను. స్వేచ్ఛ అంటే ఇదేనా? కొందరు వ్యక్తులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో నా ఆశల్ని అణచి వేయాలనుకుంటున్నారు. ఇవన్నీ అనుభవిస్తూ బతకాలా? ఈ విషయంలో మనం ఏమీ చేయలేమా?’ అని అనసూయ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. గతంలో అనసూయ 'అసభ్యత, అశ్లీలత గురించి నేను ఏదైనా విషయం చెప్పినా, మాట్లాడినా.. బట్టలు సరిగా వేసుకోవాలంటారు. పోనీ కామెడీని కామెడీగా తీసుకుంటే మంచిదని చెబితే.. అర్జున్ రెడ్డి అంటారు. ఏందివయ్యా.. దిమాగ్ ల అటుది ఇటు.. ఇటుది అటు ఉందా' అంటూ ట్వీట్ చేశారు. పిచ్చి పిచ్చి రాతలు, కామెంట్స్, పోస్టులు చేసేవాళ్లను బ్లాక్ చేస్తానని అనసూయ గతంలో అన్నారు. #HappyRepublicDay 🙏🏻🙏🏻🤷🏻♀️ pic.twitter.com/cMQm4PTzHX — Anasuya Bharadwaj (@anusuyakhasba) 26 January 2018 -
మాకో దేశం కావాలి..!
-
స్వేచ్ఛ, సమానతలకు ప్రతీక
కొత్త కోణం భారత రిపబ్లిక్ దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యతను, రాజకీయ, పాలనా పరమైన విస్తృతిని కలిగి ఉంది. ఆ రోజున అమలులోకి వచ్చిన మన రాజ్యాంగం అత్యంత విశిష్టమైనది. అది ప్రపంచంలోనే అత్యంత వివరమైన రాజ్యాంగం. అది భాష, ప్రాంత, కుల, మత, లింగ వివక్షలను వ్యతిరేకిస్తున్నది. అంతేకాదు భాష, మత, మైనారిటీలకు, తరతరాలుగా వివక్షకు గురవుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు కల్పించడం మన రాజ్యాంగం ప్రత్యేకత. ‘‘మన దేశ వర్తమాన, భవిష్యత్తులను సుందరంగా, అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతలను మనం మన భుజస్కంధాల మీదికి ఎత్తుకున్నాం. చిన్న చిన్న విషయాలపైన దృష్టి పెట్టడం మంచిది కాదు. భారత దేశం ప్రపంచ వేదిక మీద ఒక ప్రధాన భూమికను పోషించే వైపు పయనిస్తున్నది. ప్రపంచంలోని కళ్లన్నీ మన వైపే చూస్తున్నాయి. నూతన భారతదేశ అవతరణకు మనం అడుగు దూరంలోనే ఉన్నాం. గతంలోని సంఘటనలు, వర్తమాన దృశ్యాలు, భవిష్యత్ ఆవిష్కరణలన్నీ మన ఆలోచనలలో ప్రతిబింబించాలి.’’ భారత రాజ్యాంగ సభలో రాజ్యాంగ రచనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపె డుతూ 1940, డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలివి. అప్ప టికింకా మనకు స్వాతంత్య్రం రాలేదు. డిసెంబర్, 9, 1946 నుంచి ప్రారంభ మైన రాజ్యాంగ సభ డిసెంబర్, 26, 1949 వరకు కొనసాగి, భారత రాజ్యాం గాన్ని అందించింది. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది మాత్రం 1950, జనవరి 26న. ఆ రోజునే ఎంచుకోవడం కాకతాళీయం కాదు. అది ఒక చారిత్రక సందర్భానికి, మన స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ఒక మైలురాయికి సంకేతం. జనవరి 26 చరిత్రలో మైలురాయి 1929లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా భారత దేశానికి పరిమిత స్వేచ్ఛ (డొమినియన్ స్టేటస్)ను ఇవ్వడానికి మాత్రమే అంగీకరించింది. దానిని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.1929 డిసెం బర్ 31, 1930 జనవరి 1 తేదీలలో జరిగిన లాహోర్ కాంగ్రెస్ మహాసభ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తదుపరి 1930 జనవరి 2న కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం చేసిన తీర్మానం మేరకు దేశ వ్యాప్తంగా ఉద్యమకారులందరూ జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దినం పాటించి, సంపూర్ణ స్వరాజ్య సాధనకు ప్రతిజ్ఞలు చేశారు. చరఖా చిహ్నం ఉన్న మూడు రంగుల జెండాను ఎగురవేశారు. ఆ చారిత్రక ఘట్టానికి చిహ్నం గానే 1950 జనవరి, 26న భారత ప్రథమ రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే రాజ్యాంగ సభ ఆమోదం పొందిన మన రాజ్యాంగం ఆ రోజు నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి జనవరి 26ను గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. స్వాతంత్య్రం పొందడం అంటే కేవలం బ్రిటిష్ పాలన అంతం కావ డమని మనం సర్దిపెట్టుకోలేదు. దేశ భవిష్యత్తును, ప్రజలందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని ఒక నియమబద్ధమైన విధాన సమూదాయంగా తీర్చిదిద్దాలనే మనం రాజ్యాంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. భావి భారత దేశాన్ని ప్రపంచ దేశాల సరసన సమున్నతంగా నిలిపేందుకు రాజ్యాంగ సభ సభ్యులు ఎంతో సమయాన్ని వెచ్చించారు, అహరహం శ్రమించారు. అసమా నతలు, అంతరాలు లేని భారతావనిని కాంక్షించారు. రాజ్యాంగంలో పొందు పరిచిన ప్రతి అంశంపైన ఎంతో విస్తృతమైన చర్చను జరిపారు. ఎన్నో విష యాలను ఆచి తూచి పరిగణనలోనికి తీసుకున్నారు. ఎంతో శ్రద్ధతో అక్షరీక రించి తుది రూపునిచ్చారు. స్వతంత్రమా? ప్రజాస్వామ్యమా? కేవలం రాజ్యాంగ సభ సభ్యులు మాత్రమే కాకుండా, దేశంలోని పౌరులెవ రికైనా దీని మీద వ్యాఖ్యానించే అధికారం ఉంటుందని నెహ్రూ మొదటే ప్రక టించారు. దానికి అనుగుణంగానే నెహ్రూ ప్రతిపాదించిన కొన్ని విషయాలపై సైతం రాజ్యాంగ రచనా సంఘం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను చేసింది. నెహ్రూ భారత్‌ను ‘స్వతంత్ర సర్వ సత్తాక గణతంత్ర దేశం’గా పేర్కొనగా... రాజ్యాంగ సభ దాన్ని ‘సర్వ సత్తాక ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం’గా ప్రకటించింది. నెహ్రూ పేర్కొన్న స్వతంత్ర, సర్వసత్తాక అనే రెండు పదాలలో స్వతంత్ర పదం అవసరంలేదని, సర్వసత్తాక అనేదే స్వతంత్ర దేశమనే భావనను కూడా బలంగా వ్యక్తం చేస్తుందని రాజ్యాంగ సభ అభిప్రాయపడింది. గణతంత్ర అనే పదం ఉన్నందువల్ల ప్రజాస్వామ్యం అని విడిగా పేర్కోనవసరం లేదని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా ఉన్న అంబేడ్కర్ ప్రజాస్వామ్యమనే భావన పట్ల, ఆ పదానికి ఉన్న విస్తృతమైన అర్థం పట్ల ఎక్కువగా మొగ్గు చూపారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యమనే తాత్వికత భారత సామాజిక పరిస్థితులకు మరింతగా సరిపోతుందని అభి ప్రాయపడ్డారు. నెహ్రూలాంటి తిరుగులేని నాయకుడు కూడా అంబేడ్కర్ లాంటి వాళ్ళు ప్రతిపాదించిన విషయాలను విశాల దృక్పథంతో ఆలోచించి, చాలా సానుకూలంగా స్పందించారు. అందువల్లనే భారత రాజ్యాంగం ఒక బృహత్తర గ్రంథంగా రూపొందింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన ఆ రాజ్యాంగాన్ని ఆనాటి సభ ఆమోదించింది ప్రజాస్వామ్యమే కాదు గణతంత్రం కూడా రాజ్యాంగంలోని అన్ని అంశాలతో పాటు పీఠిక (ప్రియాంబుల్)లో పొందు పర్చిన అంశాలు చాలా ప్రా«ధాన్యతను కలిగి ఉన్నాయి. అంబేడ్కర్ అమెరి కాలో విద్యాభ్యాసాన్ని సాగిస్తున్న కాలం నుంచి ప్రజాస్వామ్యమనే భావనల పైన ఎంతో అధ్యయనం చేశారు. 1936లో కుల నిర్మూలన రచించే నాటికే ప్రజాస్వామ్యంపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఏర్పడింది. భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, గణతంత్రం అనే భావ నలపైన కూడా చాలా లోతైన చర్చలు, అధ్యయనాలు జరిగాయి. పైపైన చూస్తే ఈ రెండు పదాలకు పెద్ద తేడా లేనట్టుగా కనిపిస్తున్నదని, కానీ అవి రెండూ వేర్వేరుగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయని రాజనీతి తత్వవేత్తలు భావి స్తున్నారు. ప్రజాస్వామ్యమంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభు త్వమని, వ్యవస్థ అని అర్థం చెప్పుకుంటాం. ప్రజాస్వామ్యంలో వంశపారం పర్యంగా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పాలన చేస్తారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. సిద్ధాంతపరంగా ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష విధానాలు ఉన్నాయి. అయితే మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం విధానాలు రూపొందుతాయి, పరిపాలన సాగుతుంది. అంటే మైనారిటీగా ఉన్న కొందరి అభిప్రాయాలకు విలువ లేకుండా పోతుంది. అందువల్ల మెజారిటీ వర్గం అధికారాలకు అంతు ఉండదు. అందుకే మెజారిటీ అధికారం మైనారిటీ రాజకీయాల పట్ల, జీవి తాల పట్ల అణచివేసే విధానాలను అవలంబిస్తుంది. ఇది ఇప్పుడు చాలా దేశాల్లో మనం చూస్తున్నాం. రిపబ్లిక్ పరిపాలన దీనికి పూర్తిగా విరుద్ధమైనది కాకపోయినా, కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలను అలాంటి వ్యవస్థలు కలిగి ఉంటాయి. రిపబ్లిక్ దేశాల్లో ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకుంటారు. అయితే ఎన్నికైన ప్రభుత్వా లుగానీ, ప్రజా ప్రతినిధులుగానీ వ్యక్తిగతమైన, పార్టీ పరమైన విధానాలతో మాత్రమే పనిచేసే వీలుండదు. ఒక నిర్దిష్టమైన పద్ధతి ద్వారా రూపొం దించుకున్న రాజ్యాంగం గానీ, చట్టంగానీ ప్రభుత్వాల పని విధానానికి ప్రాతి పదిక అవుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ అంశాల వెలుగులో ప్రభు త్వాలు పనిచేయాలి. ప్రజాప్రతినిధులకు కూడా మార్గదర్శకం రాజ్యాంగమే తప్ప సొంత అభిప్రాయాలు గానీ, ఆలోచనలు గానీ కావు. ఇది భారత రిపబ్లిక్ వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. అందుకే భారత రాజ్యాంగం విశిష్టతను కలిగి ఉన్నది. ప్రపంచంలో అత్యంత వివరమైన రాజ్యాంగం మనదే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే విశిష్ట రాజ్యాంగం అంతే కాకుండా మరొక ప్రత్యేకత కూడా మన భారత దేశపు రాజ్యాంగానికి ఉన్నది. ఈ దేశం వివిధ మతాల సమ్మేళనం మాత్రమే కాదు. ఎన్నో వందల పేర్లతో ఉన్న కులాలతో కూడి ఉండడం కూడా భారత దేశ ప్రత్యేకత. అందు వల్ల భాష, ప్రాంత, కుల, మత, లింగ వివక్షలను భారత రాజ్యాంగం వ్యతి రేకిస్తున్నది. ముఖ్యంగా భాష, మత మైనారిటీలకు ఇక్కడ చాలా రక్షణలు కల్పించారు. అంతేకాకుండా, ముఖ్యంగా హిందూ మతంలో తరతరాలుగా వివక్షకు గురవుతున్న అంటరాని కులాలైన షెడ్యూల్డ్ కులాలు, అడవుల్లో నివసించే షెడ్యూల్డ్ తెగలను సామాజిక రంగంలో మైనారిటీలుగా గుర్తించి.. వారిని సామాజికంగా ప్రధాన స్రవంతిలోనికి తీసుకురావడానికి వీలుగా ప్రత్యేక రక్షణలు కల్పించడం మన రాజ్యాంగం ప్రత్యేకత. రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానంలోని ప్రధానాంశం కూడా అదే. అందుకే రాజ్యాంగంలో మైనారిటీలనే పదానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ విభేదాల వల్ల వివక్షకు గురయ్యే ప్రమాదాన్ని పసిగట్టి, వాటి పరిరక్షణకు కూడా కొన్ని అంశాలను రాజ్యాం గంలో పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, ఆర్టికల్ 38లను అందులో భాగంగానే చూడాలి. ఇటువంటి ముఖ్యమైన అంశాలు రిపబ్లిక్ దేశాల్లో మాత్రమే, అందులోనూ రాజ్యాంగ పరిధిలో పాలన జరిగే దేశాలోన్లే ఎక్కువగా అమలులో ఉన్నాయి. భారత రిపబ్లిక్ దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యతను, రాజ కీయ, పాలనాపరమైన విస్తృతిని కలిగి ఉంది. భారత దేశంతోపాటు, ప్రపం చంలో పలు శతాబ్దాలుగా ఎన్నో రిపబ్లిక్లు ఎన్నో చోట్ల ఉనికిలో ఉన్నాయి. బౌద్ధానికి ముందు మన దేశంలో 16 గణాలతో కూడిన జనపదాలు ఉనికిలో ఉన్నాయి. అయితే వాటికి ఈనాడు మనం రూపొందించుకున్న రిపబ్లిక్కు ఎంతో తేడా ఉన్నది. భారతదేశంలో వేల ఏళ్లుగా సాగిన సామాజిక ఉద్య మాలు, భారత స్వాతంత్య్ర సమరం సమయంలో సాగిన అనేకానేక ఆలో చనల సారమే రాజ్యాంగం. వీటన్నింటినీ అత్యంత లోతుగా పరిశీలించే శక్తి కలిగిన మేధావి, రాజనీతివేత్త బాబా సాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలో ఏర్ప డిన రాజ్యాంగ రచనా సంఘం రూపొందించిన రాజ్యాంగం భారతదేశ భవి ష్యత్ గమనానికి ఒక వాహకంలాగా పనిచేసి, రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రాతిపదికగా ఏర్పడే సమా జాన్ని నిర్మాణం చేస్తుం దని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
ఆర్బీఐ పాత్ర నామమాత్రమేనా?: అమర్త్యసేన్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వతంత్రతపై నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతోందని.. ప్రధాని తీసుకున్న నిర్ణయాలు అమలుచేసేందుకే పరిమితమైందని ఓ ఇంటర్వూ్యలో అన్నారు. నోట్లరద్దు వల్ల నల్లధనాన్ని నిర్మూలించాలనే ప్రక్రియలో ప్రధాని దారుణంగా విఫలమయ్యారన్నారు. ‘నోట్లరద్దు నిర్ణయం ఆర్బీఐది కాదని అర్థమవుతోంది. ఇది కేవలం ప్రధాని ఆలోచనే’ అని విమర్శించారు. దేశంలో దొంగనోట్లు పెద్ద సమస్యే కాదని.. రఘురామ్ రాజన్ ఉన్నంతకాలం ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించిందని అమర్త్యసేన్ తెలిపారు. -
భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానమని హర్పర్ కొల్లిన్స్ డిక్షనరీ బోర్డు స్పెషలిస్ట్ అర్నియా సుల్తానా అన్నారు. రాజమహేంద్రవరం ఆల్‌బ్యాంక్ కాలనీలోని షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏషియాటిక్ స్కూలు సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎక్స్‌క్విజిట్ ఇంగ్లిషు ఈడెన్’ పేరుతో ఇంగ్లిషు వారోత్స ప్రారంభ వేడుకలు బుధవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అర్నియా సుల్తానా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇంగ్లిషు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలు ఆంగ్లంపై పట్టుసాధించేందుకు ఈనెల 25 వరకు వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, రోల్‌ప్లే, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ కవులు, కవయిత్రుల వేషధారణలో అలరించారు. స్కూలు డైరెక్టర్ తంబాబత్తుల శ్రీవిద్య పాల్గొన్నారు. -
సాయుధ పోరాట యోధుడికి సన్మానం
కోదాడ: తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు, నడిగూడెం దొరకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన నడిగూడెం మండలం వాయిల సింగారానికి చెందిన చండూరు రామారావును ఆదివారం సీపీఎం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కుక్కడపు ప్రసాద్ మాట్లాడుతూ మునగాల పరగణాకు చెందిన నడిగూడెం జమిందార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. సర్పంచ్‌గా పనిచేసిన 15 సంవత్సరాల కాలంలో 100 ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత రామారావుదన్నారు. పేదల కోసం నిరంతర ఉద్యమాలు నిర్వహించిన రామారావును స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమపంగు రాధాకృష్ణ, సూర్యనారాయణ, స్వరాజ్యం, కృష్ణ, లక్ష్మయ్య, శ్రీనివాస్, సతీశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ నాయకులకు పిండ ప్రదానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో, స్వతంత్ర భారతావనిని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలకపాత్ర పోషించి అమరులైన దివంగత జాతీయ మహానేతలకు కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానం చేసినట్టు అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం తమ సమాఖ్య ఆధ్వర్యంలో దళితులతో కలిసి సమతా స్నానం ఆచరించిన అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఈ పుష్కరాల్లో తమ సమాఖ్య సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వలంటీర్లుగా ఉంటూ వృద్ధులకు, దివ్యాంగులకు పవిత్ర స్నానం ఆచరించడంలో సహకరిస్తున్నారని తెలిపారు. కృష్ణా పుష్కరాల పవిత్రత– ప్రాముఖ్యత అనే పుస్తకాలను భక్తులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. -
‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’
న్యూఢిల్లీ: స్వేచ్ఛ అనేది ఏ కొందరికో పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇటీవల కొన్ని అరాచక శక్తులు మనలోని కొందరి స్వేచ్ఛను హరించాలని ప్రయత్నించడాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. స్వేచ్ఛ ఏ ఒక్కరి సొత్తూ కాదు.. అది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. భారత్‌లోని ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, గౌరవం పొందే హక్కు ఉన్నాయి’ అని స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు. -
మువ్వన్నెల రెపరెప
-
మహానుభావుల త్యాగఫలం.. స్వాంతంత్య్రం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ గుంటూరు (నెహ్రూనగర్): ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు స్వాతంత్య్రం వచ్చిందని, వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను నేరవేర్చాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మర్రి రాజశేఖర్ జెండా ఎగుర వేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా ఇప్పటికీ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందడం లేదన్నారు. గోవధ పేరుతో, కులాల పేరుతో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటున్నారా అని అనడం సిగ్గుచేటన్నారు. నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో స్వాతంత్య్రం లేకుండా పొయిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈనాడు కులాల, మతాల, రాజకీయాల పేరుతో దాడులు పెరిగిపోతున్నాయన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనతోనే నిజమైన స్వాతంత్య్రం వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కత్తెర క్రిస్టినా, కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ముఖ్యమంత్రి రాక
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5.45 గంటలకు అనంతపురం వస్తారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 8.30 గంటల వరకు అధికార కార్యక్రమాలు ఏమీ లేవు. ఈ సమయంలో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం అవుతారని పార్టీ వర్గాల సమాచారం. అదే విధంగా కొత్తూరు అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాత్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేస్తారు. 15న ఉదయం 8.57 గంటలకు పోలీసు శిక్షణ కళాశాల మైదానం చేరుకుని స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొం టారు. 11 గంటలకు కార్యక్రమం మగిస్తారు. అనంతరం తేనీటి విందులో పాల్గొంటారు. 12 గంటలకు బయలుదేరి వెళతారు. -
కశ్మీర్‌పై మౌనం వీడిన మోదీ!
-
ఆయిల్ ఫ్రీడమ్
అనారోగ్యం నుంచి ఫ్రీడమ్ కావాలి. అజీర్తి నుంచి ఫ్రీడమ్ కావాలి. స్థూలకాయం నుంచి ఫ్రీడమ్ కావాలి. బద్దకం నుంచి ఫ్రీడమ్ కావాలి. ఐ వాంట్ గుడ్ హెల్త్ ! నాకు ఆయిల్ నుంచి ఫ్రీడమ్ కావాలి. ఓహో! వెరీ సింపుల్!! ఓ ఉడుకు ఉడికించండి. ఆరోగ్యాన్ని వడ్డించండి!! వెజ్ క్రంచీ క్రిస్పీ కట్లెట్ కావలసినవి: బంగాళదుంపలు-6 (ఉడికించి చిదమాలి) బీన్స్ - 6 (తరిగి ఉడికించాలి) బీట్రూట్ (మీడియం) - 1 (తురమాలి) పచ్చిబఠాణి-అరకప్పు (ఉడికించి చిదమాలి) జీలకర్ర పొడి - అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం- ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి) కారం - ఒక టీ స్పూన్; ఉప్పు - తగినంత గరం మసాలా- ఒక టీ స్పూన్ జీడిపప్పు-10 (వేయించి పలుకులు చేయాలి) కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లేక్స్ - 2 కప్పులు (పొడి చేయాలి) నిమ్మరసం - ఒక టీ స్పూన్ తయారీ: ఉడికించిన బంగాళదుంపలో బీన్స్, బఠాణి, బీట్రూట్ తురుము, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్రపొడి, అల్లం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పై మిశ్రమాన్ని పెద్ద గోళీ అంత తీసుకుని గుండ్రంగా చేసి కార్న్‌ఫ్లేక్స్ పొడిలో అద్దాలి. కట్లెట్ ఆకారం వచ్చేలా మెల్లగా వత్తాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని చేసుకుని ఒక ప్లేట్లో సర్ది ఒవెన్‌లో 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏడు నిమిషాల సేపు ఉంచాలి. కట్లెట్లను తిరగవేసి మరో ఏడు నిమిషాలు ఉంచాలి. గమనిక: ఒవెన్‌కు బదులు మందపాటి పెనాన్ని వేడి చేసి కట్లెట్లను సర్ది సన్న మంట మీద నూనె వేయకుండా కాల్చుకోవచ్చు. బేబీ కార్న్ పాలక్ కావలసినవి: పాలకూర- ఒక కట్ట బేబీకార్న్- ఆరు; జీలకర్ర- అర టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్లు- అర టీ స్పూన్ ధనియాల పొడి- ఒక టీ స్పూన్ నిమ్మరసం- అర టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్: ఉప్పు - తగినంత, ఎండు మిర్చి- 2, మీగడ- రెండు టేబుల్ స్పూన్లు (కావాలనుకుంటేనే) తయారీ: బేబీ కార్న్‌ను గుండ్రంగా తరిగి పావు టీ స్పూన్ ఉప్పు కలిపి, కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. పాలకూర శుభ్రంగా కడిగి వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. నీటిలో నుంచి తీసి చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేయాలి. నాన్‌స్టిక్ పెనంలో జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి సన్నమంట మీద రెండు నిమిషాల సేపు వేయించాలి. ఇప్పుడు పాలకూర పేస్టు, బేబీకార్న్ ముక్కలు (ఉడికించిన నీటితో సహా), ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. మంట తీసేసిన తరవాత నిమ్మరసం వేసి కలిపి మూతపెట్టాలి. చివరగా మీగడ కలుపుకోవచ్చు. ఖాళీ పెనంలో ఎండుమిర్చి, ఉల్లిపాయ వేయించి గార్నిష్ చేయాలి. గమనిక: బేబీ కార్న్ బదులు పనీర్‌తోనూ చేసుకోవచ్చు. పనీర్‌ని ఉడికించనవసరం లేదు. బ్రౌన్ రైస్ రిసోట్టో కావలసినవి: ముడిబియ్యం (బ్రౌన్ రైస్) - 2 కప్పులు (కడిగి మునిగేలా నీటిని పోసి అరగంట సేపు నానబెట్టి, వడపోయాలి) వెల్లుల్లి రేక - 1 (సన్నగా తరగాలి) తరిగిన ఉల్లిపాయ - 1/3 కప్పు వెజిటబుల్ స్టాక్ - 6 కప్పులు (నీటిలో క్యారట్, ఆనియన్, బఠాణి, క్యాలిఫ్లవర్ అన్నీ కలిపి వందగ్రాములు ఉడికించాలి) కొత్తిమీర- రెండు రెమ్మలు; మిరియాల పొడి- ఒక టీ స్పూన్ చీజ్ - అర కప్పు (సన్నగా తరగాలి) బిర్యానీ ఆకు - ఒకటి; ఉప్పు- తగినంత తయారీ: ఒవెన్‌ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను రోస్ట్ చేయాలి. వెడల్పాటి పాత్ర వంటి పెనంలో బియ్యం వేసి ఒక మోస్తరుగా వేడి చేసిన తర్వాత అందులో బియ్యం నానబెట్టిన నీటిని పోసి, బిర్యానీ ఆకు, చీజ్ తరుగు, ఉల్లి, వెల్లుల్లి పలుకులు, ఉప్పు వేసి ఉడికించాలి. 8-10 నిమిషాలలో తేమ ఆవిరవుతుంది. ఇప్పుడు కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. అడుగు పట్టకుండా తేమ ఆవిరయ్యే వరకు రెండు-మూడు సార్లుగా కలపాలి. బియ్యం ఉడికిన తర్వాత మంట ఆపేసి మిరియాల పొడి చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మెత్తగా కావాలనుకుంటే మరో కప్పు నీటిని వేడి చేసి చివరగా కలుపుకోవచ్చు. క్యారట్ కుకుంబర్ సూప్ కావలసినవి: పెద్ద కీరకాయలు- 2 (చెక్కు తీసి తరగాలి) క్యారట్లు (చిన్నవి)- 2 (చెక్కు తీసి తరగాలి) ఉల్లిపాయ (పెద్దది) - 1 (తరగాలి) నీరు - 7 కప్పులు, ఉప్పు - తగినంత క్రీమ్ - 2 కప్పులు (కావాలనుకుంటేనే వేసుకోవాలి) తయారీ: కూరగాయ ముక్కలలో నీటిని పోసి ఉడికించి మూతపెట్టాలి. 20 నిమిషాల తర్వాత మొత్తాన్ని బ్లెండ్ చేయాలి. ఇందులో ఉప్పు కలిపి సన్నమంట మీద ఉడికించాలి. క్రీమ్ వేసి లేదా అలాగే సర్వ్ చేయాలి. వెజిటబుల్ స్టాక్ ఇది కూరగాయలు ఉడికించిన నీరు. క్యారట్, బీన్స్, బఠాణి, క్యాలిఫ్లవర్ వంటివి కొద్ది కొద్దిగా మిగిలిపోయి ఉన్నప్పుడు వాటికి ఓ ఉల్లిపాయను చేర్చి ఉడికించి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దీనిని సూప్, ఇతర కూరల్లోనూ వాడుకోవచ్చు. ఈ స్టాక్ నాలుగైదు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చెఫ్: అరుణ్ కుమార్ హోటల్: తాజ్ వివంతా, బేగంపేట, హైదరాబాద్ -
స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
∙జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి, సాంప్రదాయాలు, సంస్కృతి ప్రతిభింబించే విధంగా 30 నిమిషాల నిడివిలో నాలుగు పాటలు ఉండేవిధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. బారీ కేడింగ్, తాగునీరు, కుర్చిల ఏర్పాటు విషయంలో వీక్షకులకు, అతిథులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, వైద్యారోగ్య, మిషన్ భగీరథ, మహిళా శిశు సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖలు స్టాళ్ల ఏర్పాటు, శకటాలు ప్రదర్శించాలని అన్నారు. సమావేశంలో డీఆర్వో శోభ, డీపీఆర్వో శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమర యోధుడు కన్నుమూత
– క్వింట్ ఇండియా ఉద్యమంలో పాత్ర – కేథారి గోవిందప్ప మృతికి పలువురి సంతాపం కోసిగి: స్వాతంత్ర సమరయోధుడు కేథారి గోవిందప్ప(95) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కోసిగికి చెందిన కేథారి అనుమంతప్ప, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు కేథారి గోవిందప్ప 1921లో జన్మించారు. అప్పట్లో 8వ తర గతి వరకు చదువుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1942లో క్విటిండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉల్లిగడ్డల ఈరన్న నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నారు. బళ్లారి జిల్లా అల్లిపూర్ జైలులో ఆరు నెలల పాటు శిక్ష అనుభివించారు. ఉద్యమంలో కోసిగి నుంచి కేథారి గోవిందప్ప, మట్టె ఈరన్న, భీమన పల్లి చిన్న లక్ష్మయ్య, ఏసే నారాయణప్ప, శంకర్ పిళై ్లలు కీలక పాత్ర పోషించారు. వీరికి స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వ మెమెంటోలు, జ్ఞాపికలు అందించారు. కేథారి గోవిందప్ప..ఏటా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు దేశ ప్రగతిపై పలు సూచనలు ఇచ్చేవారు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఎమ్మిగనూరులోని అన్యూష్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ బుధశారం మతి చెందాడు. గోవిందప్ప మతికి కోసిగి పూర్వపు విద్యార్థుల సంఘం, ఉపాధ్యాయ సంఘం, ఏపీయూడబ్ల్యూజే నాయకులు సంతాపం ప్రకటించారు. -
చర్చలతో శాంతి సాధ్యం!
-
చర్చలతో శాంతి సాధ్యం!
కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ ≈ పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల స్థానంలో రాళ్లా? ≈ కశ్మీర్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు.. ≈ మానవత్వం, ప్రజాస్వామ్యం, కశ్మీరియత్ స్ఫూర్తితో చర్చలు ≈ కశ్మీర్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి ≈ ‘70 సాల్ ఆజాదీ-యాద్ కరో కుర్బానీ’ ప్రారంభోత్సవంలో మోదీ భాబ్రా: నెల రోజులుగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసా కాండపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఇన్సానియత్(మానవత్వం), జమ్హూ రియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ స్ఫూర్తితో కశ్మీర్లో శాంతి నెలకొల్పేందుకు ప్రజాస్వామ్య మార్గం, చర్చలు ఉన్నాయని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని భాబ్రాలో మాట్లాడుతూ..‘వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్ విధానాన్ని అనుసరించారు. మేం కూడా అదే బాటలో పయనిస్తున్నాం. మానవత్వం, కశ్మీరియత్ దెబ్బతినేందుకు అనుమతించకూడదు. మిగతా భారతీయులకున్నట్లే కశ్మీర్ ప్రజలకు అదే స్వేచ్ఛ ఉంది’ అని చెప్పారు. యువతను పురిగొల్పుతున్నారు ‘అమాయక యువతను చూస్తుంటే బాధగా ఉంది. ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలు, క్రికెట్ బ్యాట్లు పట్టుకోవాల్సిన వారికి రాళ్లు ఇస్తున్నారు. భూలోక స్వర్గమైన కశ్మీర్లో శాంతి, సామరస్యాలు కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. కొందరు దాన్ని జీర్ణించుకోలేక యువతను విధ్వంస మార్గం వైపు పురిగొల్పుతున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం నుంచి కశ్మీరీ సోదర సోదరీమణులకు ఒకటి చెప్పాలనుకుంటున్నా.. మన స్వాతంత్య్ర సమరయోధులు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇచ్చినట్లే కశ్మీర్‌కూ అదే అధికారం ఇచ్చారు. అమాయక యువత రాళ్లు పట్టుకోవడం చూసి బాధగా ఉంది. కొందరి రాజకీయాలు విజయవంతం కావచ్చు. కానీ అమాయక యువత భవిష్యత్తు ఏం కావాలి?’ అని ఉద్వేగంగా మాట్లాడారు. దేశం కోసం ప్రాణమిచ్చే కశ్మీరీలకు కరువు లేదు ‘కొందరి హానికర ఆలోచనల నడుమ అమర్నాథ్ యాత్రకు రక్షణ కల్పించినందుకు కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి అభినందనలు తెలుపుతున్నా. భారత్, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలతో పాటు 125 కోట్ల మంది ప్రజలు మీరు బాగుండాలని కోరుతున్నారు. వారు మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. మీ అభివృద్ధి కోసం భారత్ ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేందుకు మేం సిద్ధం. కశ్మీర్లో దేశం కోసం ప్రాణాలు అర్పించే వారికి కరువు లేదు. జాతి నిర్మాణం కోసం చేతులు కలపండి’ అని మోదీ సూచించారు. మావోయిస్టులు, తీవ్రవాదులు ఆయుధాల్ని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. వారు ఎన్నో కోల్పోయారని, అయితే హింస వారికేమిచ్చిందో సమీక్షించుకోవాలన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ‘70 సాల్ ఆజాదీ-జర యాద్ కరో కుర్బానీ’(70 ఏళ్ల స్వాతంత్య్రం- నాటి త్యాగాలు స్మరించుకుందాం) కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పురా జిల్లా భాబ్రాలో మంగళవారం ప్రధాని ప్రారంభించారు. ఆజాద్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భద్రతా ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి కాన్వాయ్‌ను ఆపి స్థానిక బోహ్రా ప్రజలతో మోదీ కరచాలనం చేశారు. నివేదిక ఇవ్వండి: సుప్రీం శ్రీనగర్‌లో గతనెల 10న షబీర్ అహ్మద్ మిర్(26)ను పోలీసులు చంపారన్న ఆరోపణలపై నివేదిక సమర్పించాలని జమ్మూకశ్మీర్ పోలీసుల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గళమెత్తక తప్పని పరిస్థితి: పాక్ ఇస్లామాబాద్: కశ్మీరీలు అణచివేతకు గురయ్యారని, వారి తరఫున తాను గళమెత్తక తప్పని పరిస్థితి నెలకొందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కశ్మీర్ లోయలో ప్రజల దుస్థితిని ప్రపంచం అర్థం చేసుకునేలా చేయటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తానన్నారు. కశ్మీర్‌కు ఏం కావాలన్నా చేస్తాం.. ‘కశ్మీర్‌ను భూతల స్వర్గంలా కొనసాగేలా పరిరక్షించాలి. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ఒకే మాట వినిపించడాన్ని అభినందిస్తున్నా. అది భారత్ బలం, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కేంద్రంతో కలసి రాష్ట్ర ప్రభుత్వం కశ్మీర్ అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ విషయంలో మా ప్రభుత్వం ఏం కావాలన్నా చేస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, పర్యాటకంపై ఆధారపడ్డవారి, యాపిల్ పెంపకందారుల అభ్యున్నతికి సాయపడతాం. దేశ ప్రజలకు కశ్మీర్ స్వర్గంలాంటిది. ఒక్కసారైనా ప్రతీ భారతీయుడు అక్కడికి వెళ్లాలని కోరుకుంటాడు. కానీ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ.. ఈ గొప్ప సంస్కృతికి చేటు చేస్తున్నారు. కశ్మీర్‌లోని ప్రతీ సామాన్యుడు శాంతిని కోరుకుంటున్నాడు. అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. పంచాయతీల్ని బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
క్విట్ ఇండియాకు 75 ఏళ్లు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మహాత్మాగాంధీ యావద్దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు 1942 ఆగష్టు 8వ తేదీన నాంది పలికిన∙క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు నిండాయి. మంగళవారం ఆ ఉద్యమ పటిమ, స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ మాంటిస్సోరి విద్యార్థులు నగరంలో భారీ త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించారు. 102 మీటర్ల పతకాన్ని నగరంలోని కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు ప్రదర్శించారు. నాడు గాందీజీ దేశానికి స్వాతంత్య్రం కోసం బ్రిటిషు వాళ్లను దేశం నుంచి వెళ్లండి అని డూ అర్ డై నినాదాన్ని ఇచ్చారు. నేడు దేశాభివద్ధికి ప్రతిఘటకంగా మారిన అవినీతి, అక్రమాలు, బాలకార్మిక వ్యవస్థ, గహహింస, ప్రజాస్వామ్య విలువల పతనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలువురు విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో డూ బీ ఫోర్ ఉయ్ డై అను నినాదాలు ఇస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్ వద్ద కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పాఠశాల హెచ్ఎం శశికళ జెండా ఊపి ప్రారంభించారు. -
కశ్మీర్‌పై మౌనం వీడిన మోదీ!
గత నెలరోజులుగా అట్టుడుకుతున్న కశ్మీర్ లోయ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడారు. కశ్మీర్లో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. కొందరు తప్పుదోవ పట్టిన వ్యక్తులు కశ్మీర్ గొప్ప సంస్కృతిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కశ్మీర్ లోయలో గత నెలరోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 56మంది చనిపోగా.. రెండువేలమంది గాయపడ్డ సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కశ్మీర్ అంశంపై స్పందించారు. ఆ రాష్ట్రంలో అశాంతిని దూరంచేసి.. సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి ద్వారా కశ్మీర్‌లోని అన్ని సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. 'కశ్మీర్ శాంతి కోరుతోంది. కశ్మీర్ పౌరుడు పర్యాటకం ద్వారా డబ్బు సంపాదించాలని భావిస్తున్నాడు' అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉన్న స్వేచ్ఛ కశ్మీర్ పౌరుడికి కూడా ఉందని, కశ్మీర్ యువతకు ఉజ్వలమైన భవితను అందించాలని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఆందోళనలు, హింసతో సతమతమవుతున్న కశ్మీర్ విషయమై జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తి సోమవారం కోరిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ మేరకు స్పందించారు. -
స్వేచ్ఛకు పరిమితి!
పరువు నష్టం కేసుల్లో క్రిమినల్ నేర చట్టంకింద చర్యలకు వీలు కల్పిస్తున్న భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 499, సెక్షన్ 500లు...నేర విచారణ ప్రక్రియా స్మృతి(సీఆర్పీసీ)లోని సెక్షన్ 119 రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు భావ ప్రకటనా స్వేచ్ఛను కాంక్షించే వారందరికీ నిరాశ కలిగిస్తుంది. బ్రిటిష్ వలసవాదులు ఈ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకు నేందుకూ...ఇక్కడ సాగుతున్న ప్రజా ఉద్యమాలనూ, తిరుగుబాట్లనూ అణిచేం దుకూ తీసుకొచ్చిన కఠిన నిబంధనల్లో ఈ సెక్షన్లు కూడా భాగం. విచారకరమైన విషయమేమంటే మన దేశం గణతంత్రంగా మారి 70 ఏళ్లు కావస్తున్నా 156 ఏళ్లనాటి ఈ అప్రజాస్వామిక చట్టాలూ, సెక్షన్లు ఇంకా పదిలంగానే ఉన్నాయి. పరువు నష్టాన్ని క్రిమినల్ చర్యగా పరిగణిస్తున్న ఈ సెక్షన్లు వాస్తవాలు వెల్లడించదల్చుకున్న మీడియాకు ఎంత ప్రతిబంధకంగా మారుతున్నాయో... సారాంశంలో పౌరులకు గల తెలుసుకునే హక్కును ఎలా దెబ్బతీస్తున్నాయో ఆ రంగంలో పనిచేస్తున్నవారికి నిత్యానుభవం. అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులు కూడా వీటి బాధితులుగా మారుతున్నారు. దాని పర్యవసానంగానే ఈ కేసు సుప్రీంకోర్టు పరిశీలనకు వెళ్లింది. ఈ సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తొలుత పిటిషన్ దాఖలు చేసినవారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణస్వామి. అనంతరకాలంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కేసులో కక్షిదారులుగా చేరారు. అయితే ఈ ముగ్గురూ పరువునష్టం నిబంధనలు చెల్లబోవని ప్రకటించాలని కోరినా వారు ప్రాతినిధ్యంవహిస్తున్న పార్టీలూ, ప్రభుత్వాలూ మాత్రం అందుకు విరుద్ధమైన వైఖరిని తీసుకోవడం ఒక వైచిత్రి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అవినీతి ఆరోపణలు చేసినందుకు సుబ్రహ్మణ్య స్వామిపై ఆరు పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. ఇవన్నీ జయలలిత వ్యక్తిగతంగా కాక తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన కేసులు. వీటిని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి తొలుత ఈ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ సెక్షన్లు ఉండితీరాలని ఆ ప్రభుత్వం వాదించింది(ప్రస్తుత ఎన్డీఏ సర్కారు వాదనా అదే!). కానీ అధికారం కోల్పోయాక ఇదే ‘పరువునష్టం’ రాహుల్ మెడకు కూడా చుట్టుకుంది. మహాత్ముడి హత్యలో తమ ప్రమేయం ఉన్నదని ఆయన చేసిన ఆరోపణపై ఆరెస్సెస్ పరువునష్టం కేసు దాఖలు చేసింది. పర్యవసానంగా రాహుల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఇక కేజ్రీవాల్‌ది విచిత్రమైన పరిస్థితి. కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీలపై చేసిన అవినీతి ఆరోపణలు ఆయనను బాధితుడిగా మార్చాయి. అందువల్లే ఆయన కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోపక్క తమ ప్రభుత్వానికి లేదా సీఎం కేజ్రీవాల్‌కూ పరువునష్టం కలిగించేవిధంగా మీడియాలో వార్తలు, కథనాలు వస్తే వాటిపై కేసులు పెడతామని బెదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. నిరసనలు వెల్లువెత్తాక దాన్ని ఉపసంహ రించుకున్నారు. వీటన్నిటినీ చూస్తే అప్రజాస్వామిక చట్టాల విషయంలో ఈ నేతలకు చిత్తశుద్ధిగానీ, సూత్రబద్ధమైన వైఖరిగానీ లేవని అర్ధమవుతుంది. పరువు నష్టాన్ని క్రిమినల్ చర్యగా పరిగణిస్తున్న సెక్షన్లు నియంతృత్వమైనవి. ‘నేరం’ రుజువైన పక్షంలో రెండేళ్ల జైలు, జరిమానా విధించడానికి ఇవి వీలు కల్పిస్తున్నాయి. అంతకన్నా దారుణమేమంటే ఆ సెక్షన్లకింద ఏళ్ల తరబడి సాగే విచారణ ప్రక్రియ దానికదే ఓ పెద్ద శిక్ష. నిందితుడు తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని ఫిర్యాదీ నిరూపించడం కాక...తాను చేసిన ఆరోపణ సరైందని నిరూపించుకునే బాధ్యత నిందితుడిదేనని సెక్షన్ 499 చెబుతోంది. అంటే నిజమేమిటో తెలిసినా దాన్ని నిరూపించే సత్తా ఉంటే తప్ప అధికారులపైనో, పాలకులపైనో సామాన్య పౌరులు ఆరోపణలు చేయకూడదన్న మాట. అంతేకాదు...అసలు ఒక వ్యక్తి ఎలాంటి ఆరోపణా చేయకపోయినా, అలా చేసినవారితో చేతులు కలిపాడని ఫిర్యాదు అందినా అలాంటి వ్యక్తిపై క్రిమినల్ చర్య ప్రారంభించవచ్చు. అది నిజంకాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అలా ఇరుక్కున్న వ్యక్తిపైనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో చేసే విమర్శలు నేరపూరితమని చెబుతున్న ఐటీ చట్టం సెక్షన్ 66ఏ చెల్లదని నిరుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు ప్రజాస్వామికవాదులంతా హర్షం వ్యక్తంచేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు బాసటగా నిలుస్తున్నదని ప్రశంసించారు. ప్రస్తుత తీర్పు దాని స్ఫూర్తిని దెబ్బతీసిందనే చెప్పాలి. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు హామీనిస్తోంది. అయితే 19(2) అధికరణ ప్రజా ప్రయోజనాలరీత్యా ఈ స్వేచ్ఛకు ‘సహేతుకమైన’ పరిమితులు విధించే చట్టాలకు అవకాశమిస్తోంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణ, దేశ భద్రత, మిత్ర దేశాలతో సంబంధాలు, ప్రజాభద్రత, నైతికత, పరువునష్టం వంటి అంశాలు ఈ పరిమితుల్లో ఉన్నాయి. ఇందులో ‘పరువు నష్టం’ తప్ప మిగిలినవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి. అదొక్కటీ వ్యక్తుల ప్రయోజనాలకు సంబంధించింది. కనుక దీన్ని ‘సహేతుకమైన పరిమితుల’ జాబితాలో ఉంచరాదని చాలామంది వాదిస్తున్నారు. అయితే భావప్రకటనా స్వేచ్ఛ కోసం ‘పరువు ప్రతిష్టలను కలిగి ఉండే హక్కును సిలువేయలేమని సుప్రీంకోర్టు అంటున్నది. ఆ హక్కు ‘జీవించే హక్కు’లో అంతర్లీనంగా ఉంటుందని చెబుతోంది. అయితే ‘పరువు నష్టం’ పాలకుల చేతుల్లో ఆయుధమై భావప్రకటనాస్వేచ్ఛను హరిస్తుండటాన్ని విస్మరించకూడదు. ఈ విషయంలో మరిన్ని విస్తృతమైన అంశాలు చర్చలోకొచ్చి ఇలాంటి అప్రజాస్వామిక చట్టాలు, నిబంధనలు విరగడ కావాలని ఆశిద్దాం. -
జూ సిబ్బందికి చుక్కలు చూపించిన చాచా
టోక్యో: జపాన్‌లో ఓ చింపాంజీ జూ అధికారులకు చుక్కలు చూపించింది. తనను బంధించి ఉంచిన నెట్‌కు పెద్ద కన్నం చేసి అందులో నుంచి పారిపోయింది. అనంతరం ఒక పెద్ద విద్యుత్ స్తంభాన్ని ఎక్కి కూర్చుని వెర్రికూతలు కూయడం ప్రారంభించింది. తొలుత జూలో నుంచి చింపాంజీ తప్పిపోయినట్లు జూ ఉద్యోగులు ఉన్నతాధికారులకు చెప్పడంతో శరవేగంగా కదిలారు. సెండాయ్ లోని యాగియామా అనే పెద్ద జూపార్క్ ఉంది. అందులో చాచా అనే ఓ చింపాంజీ ఉంది. అది గురువారం సాయంత్రం అధికారుల కళ్లు గప్పి తెలివిగా తప్పించుకుంది. దీంతో ఉలిక్కిపడిన అధికారులు కిందా మీదా పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో చూడగా అది ఒక పెద్ద కరెంటు స్తంభం ఎక్కినట్లు గుర్తించారు. తర్వాత దానిని కిందికి దించేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోగా వారిపై కోపంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. బాణం లాంటిదాంతో దాని వీపుపై గుచ్చగా దాన్ని లాక్కొని కిందపడేసి విద్యుత్ తీగల గుండా తప్పింకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అది జారి కింద అప్పటికే సిద్ధం చేసి ఉంచిన బోనులో పడిపోయింది. ఈ క్రమంలో దానికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, అసలు చాచా తప్పించుకునేందుకు గల కారణాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై చర్చించేందుకు శుక్రవారం ఆ జూను మూసివేశారు. -
కేసు వెనక్కి తీసుకుంటేనే గ్యాస్ రేటుపై స్వేచ్ఛ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మెలిక న్యూఢిల్లీ: కఠిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటుపై కంపెనీలకు స్వేచ్ఛనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు మాత్రం తక్షణ ప్రయోజనం లభించకపోవచ్చు. న్యాయవివాదాల్లో చిక్కుకున్న క్షేత్రాలకు కొత్త ఫార్ములా వర్తించకపోవడమే దీనికి కారణం. చమురు శాఖ అదనపు కార్యదర్శి యూపీ సింగ్ .. క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. గతంలో గ్యాస్ రేటు విషయంలో ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి అంచనాలకు అనుగుణంగా లేనందున వ్యయాలను రికవర్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపైనా ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. ఈ దరిమిలా తాజా ధర ఫార్ములా ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్యాస్ రేటుపై స్వేచ్ఛ ప్రయోజనాలు లభించాలంటే ధర విషయంలో వేసిన పిటీషన్ని వెనక్కి తీసుకుంటే సరిపోతుందని, అన్ని ఆర్బిట్రేషన్లను ఉపసంహరించుకోనక్కర్లేదని చమురు శాఖ వర్గాలు తెలిపాయి. -
మన స్వేచ్ఛకు రక్ష సైన్యమా?
జాతిహితం న్యాయమూర్తి కన్హయ్యకు ఉపన్యాసం లేదా సలహా ఇవ్వడం మంచిదే. కానీ సరిహద్దుల్లోని సైనికులను మధ్యలోకి లాగి, వారే మన స్వేచ్ఛలన్నిటినీ పరిరక్షిస్తున్నారనడం ఏమిటి? మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షిస్తున్నది మన రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తదితర వ్యవస్థలే. ఈ కేసులో న్యాయమూర్తి ఉదారంగానే నిర్ణయం తీసుకున్నారు. కానీ అతనింకా దోషే కాదు. అనుమానితుడైనందుకే ఆత్మావలోకనం చేసుకోవడం ఏమిటి? నిర్దోషిగా రుజువయ్య వరకు దోషే అనే సూత్రీకరణను మన న్యాయవ్యవస్థ ఆమోదించదు. దారితప్పిన పిల్లలకే అయినా లేక దారితప్పి పోలీసు కస్టడీకి, కోర్టులకు, జైళ్లకు చేరిన పిల్లలకే అయినా అంకుల్‌లాగా సలహాలను గుప్పించే తరుణం ఇది (‘‘బచ్చే’’, ‘‘బత్కే హుయే’’ పదాలు పార్లమెంటులో మానవ వనరుల మంత్రి ఉపయోగించినవే). కాబట్టి ఈ అవకాశాన్ని నే ను మాత్రం ఎందుకు వదులుకోవాలి? అలా సలహాలు ఇవ్వగల ఉన్నత స్థానంలో నిలవడానికి నాకున్న అర్హత ఒక్క వయసే అయినా లెక్కచెయ్యను. అందుకు నన్ను పతాక శీర్షికలకెక్కించి అంకుల్ అని పిలిచినా అభ్యంతరం లేదు. కాబట్టి నేను కూడా కన్హయ్య కుమార్‌కు ఉపన్యాసం దంచడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పిన ఆజాదీ విషయాలన్నీ సరేగానీ, ఇంతకూ ఈ ‘‘పుంజీవాది’’ (పెట్టు బడిదారీ విధానం) గోల ఏమిటోయ్ కుర్రాడా? దారితప్పిన పిల్లాడా ఏమిటి నీ సమస్య? మనలో మరింత ఎక్కువ మంది సమానులం అయ్యే అవకాశాన్ని సృష్టించేదీ, జేఎన్‌యూ వంటి డజను ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నెల కొల్పడానికి పన్నులను అందించేది ఆ పెట్టుబడిదారీ విధానమే. సోషలిజం దశాబ్దాల తరబడి మనకు ఏమిచ్చిందని? ఇంతవరకు చెప్పేశాను కాబట్టి, భావజాల సరిహద్దుకు అటైనా లేక ఇటైనా ఈ ఏడాది విద్యార్థిగా నిలిచిన ఆ కుర్రాడి కి సమర్థనగానో లేక వ్యతిరేకంగానో సలహాలిస్తున్న కొందరిలో నేనూ చేరిపోవచ్చు. కానీ నాకు ముగ్గురితో మాత్రమే పేచీ ఉంది, వారితోనే వాదించాల్సి ఉంది. దృష్టి మళ్లింపు ప్రహసనం నా సమస్యలు సుస్పష్టమైనవే. వాటిని ఇక్కడ సంక్షిప్తంగానే పేర్కొంటు న్నాను. భీమ్సేన్ బస్సీ, అత్యంత అధికంగా మాట్లాడే, అత్యధిక ఊహాత్మకత గల పోలీసు గూఢచారి. ఆయనకు ముందు వివిధ భారతిలోని ఇన్స్పెక్టర్ ఈగిల్ మాత్రమే ‘నిర్దోషిగా రుజువయ్యేంత వరకు దోషే’ అనే స్టాలినిస్ట్ న్యాయశాస్త్రంతో నన్ను చచ్చేటంతగా భయపెట్టాడు. నిష్కపటంగా చెబు తున్నా, ఆయన లాకప్‌లో పడేయగా, ఆయన చూస్తుండగానే న్యాయవా దులు చావదన్నిన ‘‘పిలగాళ్ల’’పై నాకు జాలేస్తోంది. తద్వారా బస్సీ వారికి టీ-20 తరహా పునర్విద్యను గరిపినందుకు ఒక పాత్రికేయునిగా నేనాయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన పతాక శీర్షికలకు, ప్రైమ్ టైమ్ చర్చ లకు బోలెడంత అవకాశాన్ని కల్పించారు. నేటి నిరాశాజనకమైన విచ్ఛిన్న రాజకీయాల కాలంలో ఆయన మనకు బోలెడు నవ్వులను అందించారు. అణ్వస్త్రశక్తియైన మరే దేశ రాజధాని పోలీసు అత్యున్నతాధికారైనా ఇలా తలపై 2.50 కోట్ల డాలర్ల వెల ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాది ట్విటర్ హ్యాండిల్‌కు పారడీని నిజమని నమ్మేసి మొత్తం దేశ పోలీసు వ్యవస్థకంతటికీ ఈ ఉగ్రవాద ముప్పు గురించి హెచ్చరికను జారీ చేయగలరా? ఆయనపై నమ్మకం ఉంచిన కేంద్ర హోం మంత్రి దాన్ని నమ్మేసేలా చేయగలరా? ఇక ఆ తదుపరి బస్సీ చేసిందంతా దేశ ప్రధాన భూభాగంలో వాడుకలో ఉన్నట్టు ‘ఆగ్రహించిన పిల్లి స్తంభాన్ని పట్టుకు రక్కేయడమే’. అదెలా ఉంటుందంటే, ఒక్కసారి బాలీవుడ్ సినిమా చూడండి. ఇది నిజ జీవితంలో, హాలీవుడ్ సినిమా ‘వాగ్ ద డాగ్’కు (కుక్కను ఆడించే తోక) తాత (1997 నాటి ఈ వ్యంగ్య చిత్రంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న అమెరికా అధ్యక్షుడిపై నుంచి ఓటర్ల దృష్టిని మరల్చడం కోసం కమ్యూనిస్టు అల్బేనియాపై బూట కపు యుద్ధ నాటకం ఆడతారు). జేఎన్‌యూ, ఆడపిల్లలు అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులతో ఈ ప్రహసనం సాగడం ఆ హాలీవుడ్ సినిమా కన్నా ఇది మరింత ఎక్కువ హాస్యభరితంగా తయారైంది. బస్సీతో తలపడకపోవడానికి నాకున్న కారణాలివి. ఇక అత్యంత బలంవతురాలైన మానవ వనరుల మంత్రితో పోరాటానికి దిగకుండా ఉండ టానికి కారణం చాలా సరళమైనది. ఆమెకు దీటైన అనర్ఘళోపన్యాస శక్తి, పదజాలం లేదా మేధస్సు నాకు లేవు. కాబట్టి ఆమె గెలుపును అంగీకరించి తప్పుకోవడమే నేను చేయగలిగింది. ఈ కేసులో ఇక నాకు మిగిలే సమస్య, ఒక్క మూడవదే. అది, గౌరవ నీయులైన హైకోర్టు న్యాయమూర్తితో ఈ కేసును వాదించడమెలాగ అనేది చిత్తశుద్ధితో, విచక్షణతో కూడిన పాత్రికేయ విమర్శలను స్వీకరించడానికి తగిన విశాల దృష్టి తమకున్నదని న్యాయమూర్తులు ఎప్పుడూ చెబుతుం టారు. వారి ఆ అనుగ్రహమే ఆధారంగా నేనీ కేసును వాదిస్తాను. పైగా గౌరవనీయులైన మా న్యాయవాది, రాజ్యాంగ నిపుణులు ఫాలీ నారీమన్ ఈ ఉదయం (మార్చి 4) నాతో ఎన్డీటీవీ ‘వాక్ ద టాక్’ కార్యక్రమం షూటింగ్ సందర్భంగా కూడా ఇదే విషయాన్ని చెప్పారు: న్యాయమూర్తి ఆ విద్యార్థికి ఉపన్యాసం లేదా సలహా ఇవ్వడం బాగానే ఉంది. కానీ సరిహద్దుల్లోని సైనికులను మధ్యలోకి లాగి, వారే మన స్వేచ్ఛలన్నిటినీ పరిరక్షిస్తున్నారనడం ఏమిటి? సాహసులైన మన సైనికులు గొప్ప బాధ్యత నెరవేరుస్తున్నారు నిజమే. కానీ మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షిస్తున్నది మన రాజ్యాం గం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తదితరమైన మన సంస్థలే. ఈ వాదనను మరింత విస్తరింపజేయ సాహసించడం కంటే ఆయన వెనుక నక్కి ఈ కేసును పోరాడటమే అనువైనది. పౌర స్వేచ్ఛల పరిరక్షణ సైన్యం బాధ్యతా? కన్హయ్యపై శస్త్ర చికిత్స చేసే కత్తిని ప్రయోగించకుండా యాంటీ బయొటిక్ ఇంజెక్షన్ ఇచ్చి ఉదారంగా ఆమె అద్భుత నిర్ణయాన్నే తీసుకున్నారు. స్వేచ్ఛకు అనుకూలంగా మన భారత న్యాయ వ్యవస్థ నెలకొల్పిన అత్యుత్తమ సంప్రదా యం ఇది. దర్యాప్తు ఇంకా శైశవ దశలోనే ఉన్నదనీ, నేరం జరిగింద ని కను గొననే లేదని ఆమె అనడం కూడా న్యాయమే. కన్హయ్య జైల్లో గడిపిన కాలం ఆత్మావలోకనానికి అతనికి అవకాశం కల్పించి ఉంటుందనడమే గందరగోళప రుస్తుంది. అతను అసలు ఏ తప్పూ చేయలేదని, ఇది కూడా సాధారణమైన పోలీసుల దుందుడుకుతనానికి మూర్ఖత్వం కూడా తోడైందని తేలితే ఏమౌ తుంది? అతను నిర్దోషి అనే సాహసం చేయడం లేదని మరోమారు తెలుపు కుంటున్నాను. అలాగే అతనింకా దోషీ కాదు. కేవలం అనుమానితులైనందుకే తీహార్ జైల్లో ఆత్మావలోకనం చేసుకోవడం ఏమిటి? అదేమైనా భారతీయ తరహా రాజకీయ నిర్బంధ గృహమా (గులగ్)? నిస్సంశయంగా కానే కాదు. అనుమానితులైనందుకే ఎవర్నీ జైలుకు పంపేయలేం. లాయర్ల గుంపు ‘‘ప్యాంటు తడుపుకునేలా’’ చావబాదేయజాలదు. ఇంకా దోషులు కాక పోయినా అనుమానితులైన కారణంగానే వారిని రోజుల తరబడి పోలీసు కస్టడీలో ఆత్మావలోకనం చేసుకునేలా చేయలేం. నిర్దోషిగా రుజువయ్యే వరకు దోషే అనే బస్సీ సూత్రీకరణను మన న్యాయవ్యవస్థ ఎంతమాత్రం ఆమోదించదు. తర్వాతిది నారీమన్ ప్రధానంగా లేననెత్తిన అంశం. ట్వీట్లను కూడా న్యాయశాస్త్రం ఇప్పుడు గంభీర చర్చలో భాగంగానే పరిగణిస్తోంది. కోర్టు ఆదేశాలను ఒక్కసారి చదివిన వెంటనే ఈ అంశాన్ని చర్చకు పెడుతు న్నానని నేను ప్రత్యేకించి చెప్పాల్సి ఉంది. రాజ్యాంగబద్ధమైన మన స్వేచ్ఛ లను పరిరక్షిస్తున్నది న్యాయవ్యవస్థ సహా మన సంస్థలా లేక సైన్యమా? అనే ఆసక్తికరమైన చర్చకు కన్హయ్య కేసులోని న్యాయమూర్తి తెరదీశారు. ఒక దశాబ్దిపాటూ మనోజ్‌కుమార్ ‘మిస్టర్ భరత్’ తరఫున మహేంద్ర కుమార్ స్వరం జాతీయవాదాన్ని నిర్వచించింది. సదరు న్యాయమూర్తి, నేనూ కూడా నాటి తరం వారిమేనని గూగుల్ చెప్పడం కూడా నేనీ సాహ సానికి దిగడానికి మరో కారణం. ప్రత్యేకించి ఆమె ‘ఉపకార్’ చూసి ఉండొచ్చు. అందులోని ‘‘మేరె దేశ్ కీ ధర్తీ ’’ అనే దేశభక్తి గేయం నుంచి ఆమె ఉటంకించారు కూడా. ‘‘ఆతీ హై ఆవాజ్ యెహీ మందిర్ మస్జిద్, గురుద్వా రోంసే సంభాల్కె రెహ్నా అప్నే ఘర్ మే చుపే హుయే గద్దారోం సే’’ (ద్రోహి మన సొంత ఇంటిలోనే ఉండవచ్చు జాగ్రత్త అని అన్ని ఆరాధనా స్థలాలు హెచ్చరిస్తున్నాయి) అనే 1960ల నాటి పాట వినిపించి దశాబ్దాలు గడిచి పోయాయి. కాబట్టి పొరుగింటివాడు కూడా ద్రోహే కావచ్చుననే అనుమా నాన్ని రేకెత్తించిన ఆనాటి ఆలోచనా విధానం నుంచి మనం చాలా దూరం వచ్చేశామనేది నా రెండో వాదన. నేడు మనం అపారమైన ఆత్మవిశ్వాసం గల దృఢమైన దేశంగా ఉన్నాం. వైవిధ్యభరితమైన ఆలోచనలు మనకు హాని కలిగించలేవు. అవి మనల్ని బలోపేతులను మాత్రమే చేస్తాయి. మనది పాక్ సైన్యం కంటే భిన్నమైనది పాకిస్తాన్ జాతీయవాదానికి, భావజాలానికి కేంద్రం సైన్యమే. బహుశా మన దేశంలో రాజ్యాంగం కంటే ఎక్కువగా అక్కడ‘‘పాకిస్తాన్ భావజాలం’’ పాఠ్యాంశం అయ్యేంతగా అక్కడి ప్రభుత్వం భావజాలమయమైంది. ఇటీవలి వరకు అక్కడ రాజ్యాంగమే లేదు. బహుశా అందువల్లే సైన్యం పాకిస్తాన్ భావజాలాన్ని పరిరక్షించే అధికార వ్యవస్థలో కేంద్ర స్థానంలో నిలిచింది. సైన్యం పరిరక్షించేది పాకిస్తాన్ భావజాల సరిహద్దులనా? లేక భౌగోళిక సరిహద్దులనా? అని బెనజీర్ భుట్టో 1990లో ప్రశ్నించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలాంటి ప్రశ్న లేవనెత్తే సాహసం అంత వరకు మరెవరూ చేయ లేదు. సైన్యాలు భావజాలాన్ని పరిరక్షించగలిగేవైతే సోవియట్ యూని యన్‌లో కమ్యూనిస్టు భావజాలం ఎందుకు విచ్ఛిన్నమైపోయింది? అని ఆమె ప్రశ్నించారు. క్వెట్టాలోని సాయుధ బలగాల స్టాఫ్ కళాశాలలో బెనజీర్ ఆ ప్రసంగం చేశారు! ప్రజలు ఎన్నుకున్న ప్రధానే అయినా అలాంటి సాహసం చేసి తప్పించుకునే అవకాశం అక్కడ లేదు. పైగా ఆమె సూటిగా తన సైనికాధిపతుల కళ్లలోకి గుచ్చి చూస్తూ, అదీ వారి సంస్థలోనే కటువుగా చెప్పారు. ఆ తర్వాత ఆమె కొన్ని వారాలకు మించి అధికారంలో ఉండలేదు. సైనికుల వ్యవస్థ ఆమెపై విద్రోహం, భారత్‌కు అనుకూలంగా ఉండటం అనే ఆరోపణలు చేసింది. భారత్‌లో అలాంటి చర్చకు ఆస్కారమే లేదు. అద్భుతమైన, సాహసో పేతమైన మన సైన్యం మన సరిహద్దులను, రాజ్యాంగబద్ధంగా ఎన్నికై పద్ధతి ప్రకారం ఏర్పడిన పౌర అధికారాన్ని కాపాడుతోంది. స్వేచ్ఛలు, పౌరుల హక్కుల పరిరక్షణ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పౌర సమాజం బాధ్యత. ఒక సైనికుడు లేదా జనరల్ తనకు అన్యాయం జరిగిందని భావించినా అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన మన న్యాయవ్యవస్థనే ఆశ్రయిస్తారు. ఇది చెప్పాక, న్యాయస్థానాల్లోలాగా నేను కూడా... యువర్ లార్డ్‌షిప్! ఇంతటితో నేను నా వాదనను ముగిస్తున్నాను. twitter@shekargupta శేఖర్ గుప్తా -
అందమైన కుటుంబానికి ఏడు నియమాలు
నియమం 1- ఎవరూ సమానం కాదు: నాన్న ఆఫీసుకు వెళతాడు. అమ్మ ఇంట్లో ఉంటుంది. నాన్న డబ్బు తెస్తాడు. అమ్మ ఖర్చు పెడుతుంది. నాన్నకు అమ్మ గౌరవం ఇస్తుంది. అమ్మకు నాన్న విలువ ఇస్తాడు. ఇద్దరూ వయసులో సమానం కాదు. పనిలో సమానం కాదు. బాధ్యతల్లో సమానం కాదు. పిల్లలకు చనువులో సమానం కాదు. కోపతాపాల్లో ఇష్టాయిష్టాల్లో సమానం కాదు. కాని- కుటుంబం అంతిమంగా సాధించాల్సిన ఫలవంతమైన పురోగతిలో- ఆ బాధ్యతను నెరవేర్చడంలో మాత్రం సమానం. నాన్నకు కోపం వచ్చినప్పుడు అమ్మకు తక్కువ కోపం అంటే నాన్నకు సమాన ం కాని సామాన్య కోపం రావాలి. అమ్మకు చికాకు ఎక్కువైనప్పుడు నాన్నకు అతి తక్కువ చికాకు రావాలి. ఏదైనా కోరిక తీరడానికి అమ్మ తొందర చేస్తుంటే నాన్న అందుకు సమానం కాలేకపోతున్నందుకు కారణం చెప్పగలగాలి. నాన్న ఏ విషయంలోనైనా దూకుడుగా ఉంటే అమ్మ అతి మందగమనంతో దానిని ఎందుకు నిలవరిస్తుందో నాన్నకు చెప్పగలగాలి. అమ్మ మూతి ముడిస్తే నాన్న నవ్వాలి. నాన్న భృకుటి ముడిపడితే అమ్మ మోము అతి ప్రశాంతం కావాలి. కనుక ఇంట్లో అమ్మా నాన్న సమానంగా ఉండకూడదు. ఏ ఇల్లైనా సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటి రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మొదటి రూలు. నియమం 2: స్వేచ్ఛ అంత సులువు కాదు: అబ్బాయి మోటరు సైకిల్ అడుగుతాడు. ఇవ్వాలి. కాని కొంతకాలం పాటు ఒంటరిగా నడిపే స్వేచ్ఛ ఇవ్వకూడదు. నాన్నో అన్నయ్యో వెనుక కూచోవాలి. జాగ్రత్తగా నడిపే అనుభవం వచ్చేవరకూ బంధనాలు వేయాలి. ఫలానా చదువు చదువుతానని అనవచ్చు. చదవనివ్వాలి. కాని చదువును ఫలవంతం చేసుకునే వరకూ పర్యవేక్షణ ఉండాలి. అమ్మాయికి స్నేహితులు అవసరం. కాని ఆ స్నేహితులందరితో పరిచయం అమ్మకూ నాన్నకూ కూడా ఉండాలి. ఫోన్లు అడిగితే ఇవ్వాలి. ఫేస్‌బుక్‌లలో ఉంటానంటే ఉండనివ్వాలి. వాట్సప్‌లు వాడతానంటే వాడనివ్వాలి. కాని ఏది ఎంతవరకు ఎలా ఏ పరిణితితో వాడుతున్నారన్న విషయంలో సూచనప్రాయంగానైనా సలహా ఉండాలి. హక్కును సాధించుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ధిక్కరించగలిగే స్వేచ్ఛను నిరోధించాలి. స్వేచ్ఛకు ఒక బాధ్యత ఉంటుందని బాధ్యతకు ఒక పరిమితి ఉంటుందని తెలియచేయాలి. పిల్లలు పర్సనల్రూములు అడుగుతారు. ఇవ్వగలిగితే ఇవ్వాలి. కాని తలుపు మూసుకునే స్వేచ్ఛకూ గడియ వేసుకునే స్వేచ్ఛకూ మధ్య ఉన్న అంతరాన్ని సున్నితంగా హెచ్చరించాలి. ఇల్లు పిల్లలతో పాటు సంతోషంగా ఉండాలంటే స్వేచ్ఛ అంత సులువుగా దక్కదన్న నియమాన్ని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి. నియమం 3 - ఎక్స్‌ప్లాయిట్ చేయాలి: అమ్మ అలసిపోతోంది. నాన్న- అబ్బాయిని పిలిచి ఫలానా పని నువ్వు భలే చేస్తావురా అనాలి. అమ్మాయిని పిలిచి మనిద్దరం కలిసి వంట చేస్తే ఆ రుచే వేరు అని ఊరించాలి. నాన్నకు పొదుపు తెలియకపోతే వెచ్చాల లెక్క ఎక్కువ చూపించి మిగిలిన మూడు వేలతో చిట్టీ కట్టాలి. అమ్మకు చీరల పిచ్చి ఎక్కువగా ఉంటే అప్పులున్నాయని చెప్పి పాలసీకి పడేస్తూ ఉండాలి. పిల్లలు బ్రాండెడ్ బట్టలు అడిగితే ఫ్యాక్టరీ ఔట్లెట్లో బోలెడంత వెరైటీ ఉంటుందని పట్టుకుపోవాలి. నిస్సాన్ అడిగితే నానోకు కూడా నాలుగు చక్రాలే ఉంటాయని చెప్పగలగాలి. పుస్తకాల్లోనే కూరుకుపోతూ ఉంటే గనక డబ్బులిచ్చి ఫ్రెండ్స్‌తో కెఎఫ్సికి పంపాలి. సినిమాలూ షికార్లు ఎక్కువైతే గనక పిచ్చాపాటికని చెప్పి తెలిసిన మాస్టారితో కబుర్లలోనే కర్తవ్యం బోధించాలి. బంధువుల ఊరు భలే బాగుంటుందని చెప్పి బంధాలను బలపరచాలి. కలాం పేపర్‌బాయ్‌గా చేయడం వల్ల అంతవాడయ్యాడని స్వీయ సంపాదన నేర్పించాలి. ఒన్ గ్రామ్ గోల్డయినా అమ్మకు బాగుంటుందని చెప్పాలి. షటిల్ సూపర్‌గా ఆడతావంటూ నాన్నను క్లబ్బు ముఖం చూడకుండా చేయాలి. చిన్న చిన్న సంతోషాలు కావాలంటే చిన్నపాటి ఎక్స్ప్లాయిటేషన్లు చేయాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మరో రూలు. నియమం 4: అసహనం ఉండాలి: నానమ్మ ఫలానా పని మనిషిని ఫలానా కులమని పనిలో వద్దంటుంది. అప్పుడు అసహనం చూపాలి. తాతయ్య ఫలానా స్నేహితుడు ఫలానా మతమని కనుక స్నేహం వద్దని అంటాడు. అప్పుడు అసహనం చూపాలి. అబ్బాయి ఫలానా మతం వారితో తిరుగుతూ ఫలానా మతం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటాడు. అప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేయాలి. అమ్మాయి ఫలానా ప్రాంతం వారంటే ద్వేషం పెంచుకుంటుంది. అసహనంతో చెలరేగిపోవాలి. కోవెల, మస్జీద్, చర్చ్... ఇవి వేరువేరనే అసహనం ప్రదర్శించే వారి పట్ల అసహనం ప్రదర్శించాలనే సంస్కారం ఇంట్లో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. కనుక మంచి కోసం కొంత అసహనం ఉండాలి. మనుషులను విడదీయాలనే అసహనం పట్ల అసహనం ఉండాలి. కుటుంబం చైతన్యంతో ఉండాలంటే ఇలాంటి అసహనం తప్పనిసరి అని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మరో రూలు. నియమం 5: సంస్కృతిని నిరోధించాలి: మనదంతా వెనుకబాటుదనం... సంస్కృతి అంటే పాశ్చాత్య దేశాలదే అనుకునే సంస్కృతిని నిరోధించాలి. మనదే గొప్ప... అవతలివారిదంతా అథమం అనే సంస్కృతిని కూడా నిరోధించాలి. ఫలానావారి భాష గొప్పది కాదని, ఫలానావారి మాట గొప్పది కాదని, ఫలానావారి యాస గొప్పదికాదని, ఫలానావారి ఆచారం గొప్పది కాదని, ఫలానావారి ఉత్సవం గొప్పది కాదని, ఫలానావారి రీతి గొప్పది కాదని అమ్మో, నాన్నో, అమ్మాయో, అమ్మాయో అంటూ ఉంటే గనక అలాంటి సంస్కృతి ఇంట్లో అడుగు పెట్టకుండా నిరోధించాలి. ఎవరికైనా ఆత్మీయంగా ఆకు పరిచే, ఏ సంస్కృతి ప్రవేశానికైనా వాకిలి తీసే విధంగా ఇల్లు ఉండాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన ముఖ్యమైన రూలు. నియమం 6: మరణాన్ని స్వాగతించాలి: పనివాళ్ల పిల్లలు పనివాళ్లే అనే నియమపు మరణాన్ని స్వాగతించాలి. పేదవాళ్ల వారసులు పేదవాళ్లే అనే పరంపర మరణాన్ని స్వాగతించాలి. రైతుల ఖర్మ రైతుదే అనే నిర్లిప్తత మరణాన్ని స్వాగతించాలి. వ్యవస్థ దుర్గతి వ్యవస్థదే అనే నిరాశ మరణాన్ని స్వాగతించాలి. దేశం ఇలా నాశనం అవ్వాల్సిందే అనే నిస్సహాయత మరణాన్ని స్వాగతించాలి. అమ్మా నాన్నా అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యుల హోదా నుంచి బాధ్యత కలిగిన పౌరుల హోదాకు ఎదిగినప్పుడు ఈ మరణాలన్నింటి కోసం కృషి చేసి జీవానికి జీవితానికి జీవం పోయాలి. అలాంటి చైతన్యం కలిగి ఉండాలని ప్రతి కుటుంబం తన రాజ్యాంగంలో తప్పనిసరిగా రాసుకోవాలి. స్వార్థం మరణించేలా చేసి సంఘ ప్రయోజనం నిలబెట్టేలా చేయగలగాలి. నియమం 7: సమాచారం ఉండరాదు: అమ్మాయి పెళ్లి అమ్మాయితో సంప్రదించకుండా నాన్న ఖరారు చేస్తాడు అనే సమాచారం అమ్మాయికి ఉండరాదు. అబ్బాయి చదువు అబ్బాయికి సంబంధం లేకుండా నాన్న ఫీజు కడతాడు అనే సమాచారం అబ్బాయికి ఉండరాదు. అమ్మా నాన్నలు ఏ నిర్ణయమైనా తీసుకోగలరు అనే సమాచారం పిల్లలకు ఉండరాదు. పిల్లలు ఏ ఉల్లంఘన అయినా చేయగలరు అనే సమాచారం తల్లిదండ్రులకు ఉండరాదు. చెప్పాలంటే అక్కర్లేని సమాచారం ఎవరి దగ్గరా ఉండరాదు. అవసరమైన సమాచారం ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలి. నాలుగు విడివిడి సెల్‌ఫోన్ సంభాషణల సమాచారం ఉండరాదు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ మాట్లాడుకునే సమాచారం ఉండాలి. మాట్లాడుకోవాలనే నియమం... పంచుకోవాలనే నియమం... దాచుకోకూడదనే నియమం ఆఖరు నియమంగా ప్రతి ఇంటి రాజ్యాంగంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఏ కుటుంబమైనా చిర్రుబుర్రులు లేకుండా పదికాలాలపాటు సుఖసంతోషాలతో మనగలుగుతుంది. -
భావ ప్రకటన స్వేచ్చ,జర్నలిజం ప్రమాదంలో పడ్డాయి