'ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు గొప్ప అర్థం ఉంది. టీడీపీ మంత్రులు మాట్లాడేది ఎలాంటి స్వేచ్ఛ గురించి? చంద్రబాబు విచ్చలవిడి అవినీతికి స్వేచ్ఛ కావాలా?' అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో తమ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు గగ్గోలు పెట్టడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు