note for vote case
-
పేపర్ చూడొద్దు.. ‘రీజువెనేషన్’ స్పెల్లింగ్ చెప్తే 50 లక్షలిస్తా..రేవంత్‌కు కేటీఆర్ ఆఫర్
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్‌రెడ్డికి రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను’ అని అన్నారు. తెలంగాణ భవన్లో మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కేటీఆర్ ఏమన్నారంటే..‘ కేసుల భయంతోనే మోదీకి రేవంత్ సాగిలపడ్డారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్‌తో 12లక్షల చెట్లు కొట్టేస్తారు. మా హాయాంలో చేసిన పది వేల ఆర్థిక సాయంపై విచారణ జరుపుకోవచ్చు. మూసీతో పాటు.. ఆరు గ్యారంటీల అమలుపై కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధం. అసెంబ్లీ .. అసెంబ్లీలా నడవటం లేదు.. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వటం లేదు.’‘పేదల కడుపుకొట్టాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. మూసీ శుద్ది చేయటాన్ని వ్యతిరేకం కాదు.. దోచుకోవటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. కోకాపేట, ఓఆర్ఆర్ కుంభకోణాలు ఉంటే విచారణ చేసుకో రేవంత్. మూసీ ప్రాజెక్ట్ తో ఎంత భూమి సాగులోకి వస్తుంది?.రేవంత్ రూ.50 లక్షలతో దొరికి తొమ్మిదేళ్ళు అయినా శిక్ష పడలేదు.పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్‌కు రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను.మాటలు మార్చి దొరికిపోవటం సీఎం రేవంత్ రెడ్డి స్పెషాలిటీ. రెడ్ కార్నర్ నోటీసులున్న పాకిస్తాన్ సంస్థకు మూసీ ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి KTR బంపర్ ఆఫర్రేవంత్ రెడ్డి రీజువెనేశన్ అనే పదం పేపర్ చూడకుండా స్పెల్లింగ్ చెప్తే రూ.50 లక్షల రూపాయలు పట్టే కొత్త బ్యాగ్ కొనిస్తా.. ఎందుకంటే ఢిల్లీకి డబ్బులు మోయాలి కదా - KTR pic.twitter.com/m9GVxsPmoK— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024 -
ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు తీర్పు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్షన్
-
CBN: సుప్రీం కోర్టులో ఓటుకు నోటు పిటిషన్ల విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: ఓటుకు నోటు కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ వేశారు. అలాగే.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్ వేశారు. జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ జరుపుతోంది. పిటిషన్ ఆర్కే తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు. అదే గైర్హాజరు అయితే రూ.2 కోట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు తరఫున రేవంత్ రెడ్డి బేరసారాలు జరిపారు. .. ఈ కేసులో ఏ వన్ రేవంత్ రెడ్డి, ఏ 2 ఉదయసింహ. స్టీఫెన్ సన్ ఇంటికి డబ్బుల తో రేవంత్ రెడ్డి వచ్చారు. "బ్రీఫ్డ్ మీ" కాల్ లో చంద్రబాబు అయిదు కోట్ల ఆశ చూపారు అని వాదించారు. ఈ పిటిషన్లపై చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. -
సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మళ్లీ వాయిదాలు ఇవ్వం.. ఇదే చివరి అవకాశం అని ఓటుకు నోటు కేసు విచారణలో చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేసు ప్రారంభం కాగానే విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కోరడంతో కేసు విచారణ జూలై 24కి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరగా, సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలైంది. చార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ఏసీబీ ప్రస్తావించింది. అయినా చంద్రబాబు పేరు నిందితుడిగా తెలంగాణ ఏసీబీ చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరిపింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఏసీబీ బయటపెట్టింది. "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు: ఎమ్మెల్యే ఆర్కే కేసు విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. కేసు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదంటూ సుప్రీంకోర్టు జూలై 24కు కేసు వాయిదా వేసిందని వివరించారు. ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. -
రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
సాక్షి, ఢిల్లీ: రేపు(గురువారం) సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా గత విచారణలో వాయిదా కోరారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్లో మాట్లాడిన ఆడియో ఏసీబీ బయటపెట్టింది. "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసుపై ఎమ్మెల్యే ఆర్కే.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని పిటిషన్ వేశానని తెలిపారు. దర్యాప్తును సైతం సీబీఐకి అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నానని ఆయన తెలిపారు. 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది. 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను. గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు. రేపు కేసు విచారణ జరగబోతుంది’’ అని తెలిపారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా?. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు. అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి. ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు. ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు’’ అని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు. నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు. నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది. ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు. ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి. ఓటుకి నోటు కు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఐదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది. ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు. రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు’’ అని ఆర్కే పేర్కొన్నారు. -
ఈనెల 4న సుప్రీకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో టీడీపీ మరోసారి దొరికిపోయింది: ఎంపీ గోరంట్ల మాధవ్
-
Gorantla Madhav: చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్
సాక్షి, అనంతపురం: ఫేక్ వీడియోపై తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ సర్క్యూలేట్ చేస్తున్న సర్టిఫికెట్ తాము ఇచ్చింది కాదని ఎక్లిప్స్ సంస్థ ప్రకటించిందని వెల్లడించారు. ఈ మేరకు అనంతపురంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒకసారి ఆలోచించండి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఓటుకు నోటు కేసుపై ఎల్లో మీడియాలో ఏనాడైనా చర్చలు పెట్టారా?. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చారు. చదవండి: (టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు) ఆడపిల్ల కనిపిస్తే ముద్దాయినా పెట్టాలి.. లేదంటే కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా ఎందుకు చర్చకు పెట్టలేదు?. లోకేష్ అశ్లీల చిత్రాలపై చర్చ ఎందుకు పెట్టరు?. ఫేక్ వీడియో తీసుకొచ్చి బీసీ ఎంపీపై కక్ష సాధిస్తారా?. చంద్రబాబు, ఎల్లో మీడియాది కుల దురహంకారం కాదా?’ అంటూ ఎంపీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ 'ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? అని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. పట్టుబడిన రూ.50 లక్షల లంచం తనది కాదని చెప్పగలరా అని నిలదీశారు.చంద్రబాబు మనసూస్పర్తిగా కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్) -
కీలక దశకు చేరుకున్న ఓటుకు కోట్లు కేసు విచారణ
-
ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ఉదయ్‌సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. (చదవండి: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..) -
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. -
జనవరి 29కి ఓటుకు కోట్లు కేసు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్ధాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు నోటు కేసును సర్వోన్నత న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 29కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో తన తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించుకోవాలని గతంలో కోర్టు జెరూసలెం మత్తయ్యకు సూచించగా, కోర్టే న్యాయవాదిని కేటాయించాలని మత్తయ్త కోరారు. కాగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కేసులో కుమ్మక్కయ్యాయని సుప్రీం కోర్టుకు మత్తయ్య నివేదించారు. డీజీపీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తనకు ప్రాణహాని లేదని ఆయన నివేదిక ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మత్తయ్యకు అమికస్ క్యురిగా సిద్ధార్ధ్ ధవేను నియమించిన సుప్రీం కోర్టు మత్తయ్యకు తెలంగాణ డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది. కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని ఉదయ్ సింహ పిటిషన్ దాఖలు చేశారు. కేసును జాప్యం చేసేందుకే పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ ఏసీపీ తరపు న్యాయవాది హరీన్ రావల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయ సింహ తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా, హరీన్‌ల మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఇక ఉదయ్ సింహ ఇంప్లీడ్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోని సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల్లో మత్తయ్య ఒకరు. -
నువ్వు నన్నేం పీకలేవ్!
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కాం గ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐటీ దాడుల నేపథ్యంలో తనపై సీఎం సహా అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వంటి ఉన్నతమైన పదవికి కేసీఆర్ అనర్హుడు, అధముడంటూ తీవ్ర స్థాయిలో ఆరో పణలు చేశారు. ‘ఓటుకు కోట్లు కేసులో నన్నేం పీక లేవ్. ఏం కావాలంటే అది చేసుకో. నాపై చర్యలు తీసుకుంటే నిన్నెవరు ఆపారు. ఈ కేసులో ముందు నన్ను తాకి తర్వాత చంద్రబాబుపై వరకు వెళ్లాలి కదా’ అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసిన సీఎం కుటుంబం కోసమే నాలుగున్నరేళ్లు పాటుపడ్డారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం 3,152 కేసులు నమోదు చేసిందని రేవంత్ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ సర్కారు కేవలం 1,150 కేసులు మాత్రమే రద్దు చేసిందని.. మరి మిగిలిన 2 వేల కేసుల కేసులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఉద్యమం చేశామని, కేసులున్నాయని పదేపదే చెప్పుకుంటున్న కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై ఉన్న కేసులే ఎందుకు రద్దయ్యాయో తెలంగాణ సమాజానికి వివరించాలని రేవంత్ డిమాండ్ చేశారు. మిగిలిన ఉద్యమకారులు, విద్యార్థులపై ఉన్న కేసులు ఎందుకు అలాగే ఉన్నా యో చెప్పాలన్నారు. పొటీ పరీక్షల సెలక్షన్లో తుదిదశకు వచ్చిన ఎందరో అభ్యర్థులు.. ఈ కేసుల కారణంగానే ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నా రు. ఈ దుస్థితికి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులే కారణమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 260 రైల్వే కేసులు నమోదైతే.. కేవలం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావుపై ఉన్న 10 కేసులు మాత్రమే రద్దయ్యాయన్నారు. ఈ కేసుల మాఫీతోనే కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ చేసుకున్న తెరచాటు ఒప్పందం అర్థంచేసుకోవచ్చన్నారు. అప్పుడు ముద్దు.. ఇప్పుడు వద్దా? కల్లు తాగిన కోతి.. తేలుకుడితే ఎలా ఎగురుతుందో కేసీఆర్ అలాగే ప్రవర్తిస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశా రు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా చిత్రీకరించేందుకు పాట్లు పడుతున్నారన్నా రు. తెలంగాణ రాకముందు.. 2009లో చంద్రబాబు ముద్దు అన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు ఆయన్ను వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, కాంగ్రెస్ మధ్య ‘హెలికాప్టర్లు, రూ.500కోట్ల సహా యం’ ఒప్పందం జరిగిందని విమర్శిస్తున్న సీఎం.. 2009 సమయంలో బాబు నుంచి ఎన్ని కోట్లు తెచ్చుకున్నాడో ముందు లెక్కచెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ముఖాముఖిగా ఉన్న పోరులో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నా రు. మరోసారి ఉద్యమం సెంటిమెంట్ రగిల్చి.. ఓట్లు దండుకునేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ‘చంద్రబాబుకు తెలంగాణతో ఏం సంబంధం, కనీ సం ఆయనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు కూడా లేదనే సంగతి నీకు తెల్వదా? నీకు పోటీ కాంగ్రెస్‌తో అన్న సంగతి మరచిపోవద్దు’ అని మండిపడ్డారు. 24గంటల్లో క్షమాపణ చెప్పకపోతే..! ఓటుకు కోట్లు కేసులో తన నివాసంపై ఐటీ సోదాల సందర్భంగా 2 చానళ్లు, ఒక పత్రిక పదే పదే తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని రేవంత్ మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారం చేసిన ఆ చానళ్లు, పత్రిక యాజమాన్యం 24 గంటల్లో ఆధారాలు చూపాలని.. లేదంటే క్షమాపణ అయినా చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ చానళ్లు, పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. యాదాద్రి, భద్రాద్రి అని మార్చిందెవరు? ‘ప్రతి దానికి ఆంధ్ర, ఆంధ్ర అంటున్నా వు. ఆంధ్ర వాళ్ల సలహాలు, సూచనలతో నడుచుకుంటున్నది నువ్వు కాదా? తెలంగాణ యాస లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలాన్ని ఆంధ్రా యాసలో యాదాద్రి, భద్రాద్రి అని మార్చింది నువ్వు కాదా? ఈ నాలుగున్నరేళ్లలో ఏమి చేయలేదని ప్రజలకు చెప్పేందుకు భయపడుతున్నా వ్. సెంటిమెంట్ పేరుతో మరోసారి ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నావ్. ఇదే నీ చేతకాని తనం’ అని రేవంత్ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్‌కు అమరావతి వెళ్లినప్పుడు ఈ విషయం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. -
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దోషి
ఒంగోలు వన్‌టౌన్: కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కారణంగా నోటుకు ఓటు కేసు నీరుగారిందని, ప్రారంభంలో సంచలనమైన ఈ కేసు తర్వాత కాలంలో సమసిపోయి ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వినిపిస్తోందని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రథమ దోషి అయిన చంద్రబాబుకు ఈ పాటికి శిక్షపడేదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. కేసీఆర్ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటోంది నిజమేనన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తూ మార్గం మధ్యలో ఒంగోలులో విశ్రాంతి తీసుకున్నారు. విముక్తి చిరుతల కక్షి (వీసీకే) పార్టీ ఆధ్వర్యంలో నేడు చెన్నైలో జరిగే అవార్డు ప్రధాన కార్యక్రమానికి వెళుతున్న గద్దర్‌కు ఆ పార్టీ పెరియార్ అవార్ట్‌ను నేడు ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. గ్లోబలైజేషన్ వ్యవసాయాన్ని దారుణంగా దెబ్బతీసిందనీ, పెద్ద రైతులు సైతం చెక్కుల బిచ్చగాళ్లుగా మారుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. సాయుధ పోరాటం ఆగిపోలేదనీ, తాత్కాలికంగా ఆత్మరక్షణ íస్థితిలో మాత్రమే ఉందనీ అన్నారు. ప్రత్యేక హోదా న్యాయంగా ఇవ్వాల్సిందే:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర విభజన హామీ అయిన ప్రత్యేక హోదా న్యాయంగా ఇవ్వాలని గద్దర్ అన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కారణంగా గట్టిగా నిలదీయలేని దుస్థితి రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను కలుపుకుని ఉద్యమం చేయడం ద్వారా ప్రత్యేక హోదా సాధిం చాల్సిన చంద్రబాబు, నాలుగేళ్లు గడిచినా ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను 9వ షెడ్యూల్లో పెట్టాలి ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను కేంద్రం రాసిన నోట్ ప్రకార మే తీర్పు ఇచ్చామని సుప్రీం జడ్జిలు బహిరంగంగా మాట్లాడారని అన్నారు. అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందనే కోణంలో పరిశీలించిన న్యాయమూర్తులు, ఈ చట్టం వల్ల కోట్ల మందికి రక్షణగా నిలిచిందనే కోణంలో ఎందుకు పరిశీలించలేదన్నారు. పాలక పెద్దలు ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారా చట్టానికి రక్షణ కల్పించాలన్నారు. మూడో ఫ్రంట్ మనుగడ ఉండదు:ప్రాంతీయ పార్టీలు రాజరికాన్ని అనుభవిస్తున్నాయని గద్దర్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కొడుకుని ముఖ్యమంత్రిని చేయగలడనీ, ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు కూడా కొడుకును ముఖ్యమంత్రిని చేయగలడనీ వారి కాబినెట్లో సామాజికవేత్త, విద్యావేత్త అయిన ఏ మంత్రి ఏ పదవినైనా ఆశించవచ్చు కానీ ముఖ్యమంత్రి పదవి ఆశించడం కష్టం అని అన్నారు. అదే జాతీయ పార్టీలలో ఎవరికైనా అవకాశాలు వస్తాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడే ఏ ఫ్రంటైనా ఎన్నికల తరువాత మనుగడ కొనసాగించలేదన్నారు. యువత మేల్కొనాలి: ప్రజాసంక్షేమం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ప్రభుత్వాలు సంక్షేమాన్ని రాజకీయ ప్రాభవంగా మార్చడంతో దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దేశంలో 18–35 సంవత్సరాల యువత దేశం సమస్యలను వదిలి సెల్‌ఫోన్ మత్తులో జోగాడుతోందనీ వారు దేశాభివృద్ధికి కార్యసాధకులు కావాలన్నారు. విలేకరుల సమావేశంలో గద్దర్ వెంట దళిత సంఘాల నాయకులు నాగేంద్రరావు, విజయసుందర్ ఉన్నారు. -
చంఢీగఢ్ ఫోరెన్సిక్ నివేదికలో చంద్రబాబు వాయిస్
అమరావతి, గన్నవరం: ప్రస్తుతం చంద్రబాబునాయుడు చేస్తున్న ర్యాలీలు, ధర్మపోరాటం పేరుతో ఏసీ దీక్షలు అన్ని కూడా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకేనని వైఎస్సార్ సీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జైలుపాలు కావాల్సి ఉంటుందని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, మహిళలు, ఆడపిల్లల రక్షణ గురించి ఏరోజు పట్టించుకోని ఆయన ఇటీవల ప్రజలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు కొత్త నాటకానికి తెరతీశారని విరుచుకుపడ్డారు. గతేడాది అంతర్జాతీయ మహిళా సదస్సుకు వచ్చిన ఆమెను ఎయిర్‌పోర్టులో పోలీసులు అక్రమంగా నిర్భంధించడంపై గన్నవరంలోని కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు నిమిత్తం బుధవారం ఇక్కడికి వచ్చారు. ఎయిర్‌పోర్టులో, కోర్టు బయట మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏసీబీ మీటింగ్ పెడితే ఇక్కడ చంద్రబాబు ఎలా వణుకుతున్నారో అందరూ గమనిస్తున్నారని చెప్పారు. గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లు మంత్రి సోమిరెడ్డి, కంభంపాటి, వర్ల రామయ్య మాట్లడడం చూస్తుంటేనే ఆ పార్టీకి ఓటుకు నోటు కేసు భయం పట్టుకుందని అర్థమవుతుందన్నారు. ఓటుకు నోటు కేసు అసలు కేసే కాదన్న వాళ్లు ఈ రోజు బీజేపీతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్రపన్నారని చెప్పడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ను తన ఇంటికి పిలిచి 36 రకాల వంటకాలతో విందు ఇచ్చి ఆయనతో లాలూచీ పడిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికలోనే తేలింది తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణలో బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనని చంఢీగఢ్ ఫోరెన్సిక్ నివేదికలో తేల్చిందని చెప్పారు. -
'ఆ స్వరం ఎవరిదో అందరికీ తెలుసు'
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు చాలా సీరియస్ అంశమని సీపీఐ నారాయణ చెప్పారు. సోమవారం న్యూఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆడియో టేపుల్లో వినిపించిన స్వరం ఎవరిదో అందరికీ తెలుసు' అని అన్నారు. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను శిక్షించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. కాగా, మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు కోట్లు కేసును పునర్విచారణ చేయాలని నేడు ఏసీబీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ కేసు నేపథ్యంలో పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు కోట్లు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వాటి ఆధారంగానే ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు. -
ఓటుకు కోట్లు కేసును సీబీఐకి అప్పగించాలి
- హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ డిమాండ్ - కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు వెల్లడి ఏలూరు: తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు డిమాండ్ చేశారు. ఈ రెండు కేసులు వెలుగులోకి వచ్చి ఈనెల 27కు ఏడాది కావస్తుండడంతో కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు ఆయనతోపాటు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫతేబాద్సెంటర్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్ కేసుల్లో సృష్టమైన ఆధారాలున్నట్లు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బహిరంగంగా ప్రకటించాయన్నారు. అయితే, తర్వాత రెండు ప్రభుత్వాలు రాజీ పడి కేసులను నీరుగార్చేస్తున్నాయని, దర్యాప్తు ఆలస్యమయ్యే కొద్దీ కీలక ఆధారాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో దేశంలో రెండు రాష్ట్రాల పాలకులు పరస్పర కేసులు పెట్టుకున్న ఉదంతాలు లేవన్నారు. ఇరు వర్గాలు రాజ్యాంగ బద్ధులై చట్టాలను కాపాడతామని ప్రమాణం చేసిన వారేనని, కానీ ఈ కేసుల్లో వారే నిందితులుగా మారారని చెప్పారు. చట్టాలను అమలు చేసే వారే నిందితులుగా మారితే వారి ఆజమాయిషీలో పనిచేసే ఆయా రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా పనిచేయలేవని పేర్కొన్నారు. ఈ కేసులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీటిని వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. చార్జిషీట్లో పేరున్న చంద్రబాబుపై చర్యలేవీ? గతంలో రెండు రాష్ట్రాల పాలకులు ఒకరిపై మరొకరు పోటీ పడి సుమారు 150 కేసులు పెట్టుకున్నారని, ఇప్పుడు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చార్జీషీటులో ఉందని, తప్పుచేసి దొరికిపోయిన ఆయనపై ఇప్పుటి వరకు ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారని, అంత డబ్బు రేవంత్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో తెలపాలని, చంద్రబాబు ఆడియో టేపులను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్ధారించినప్పటికీ ఆ వివరాలను ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులను వెంటనే సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలని కోరారు. సమావేశంలో సామాజిక కార్యకర్త జి.సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆయన నిజాయితీ నిరూపించుకోవాల్సిందే!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకోవాలని సీపీఐ, సీపీఎం హితవు పలికాయి. తెలంగాణ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్లో పేరు లేకున్నా 22 సార్లు ప్రస్తావన వచ్చినందున నైతిక బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు కె.రామకృష్ణ, పి.మధు మంగళవారం వేర్వేరు ప్రకటనలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున రాష్ట్ర ప్రజల గౌరవప్రతిష్టలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినందునే ఆంగ్లో ఇండియన్ సంతతికి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కలిసినట్టు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతి నిత్యం జాతికి నీతులు ఉద్బోధించే వ్యక్తులు చేతల్లోనూ నీతి నిజాయితీలు చూపాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది తానో కాదో చెప్పి ఆతర్వాత ఫోన్ టాపింగ్ వ్యవహారమై కేసు నమోదు చేయాలని కోరారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం కేసులో కుట్రదారులెవరో, పాత్రదారులెవరో ప్రజలకు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. -
చంద్రబాబు కేసీఆర్ మధ్య రాజీ: చాడ
కరీంనగర్ : 'ఓటుకు నోటు' కేసును తెలంగాణ ప్రభుత్వం నీరుగారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు విషయంలో పెద్దలను వదిలి క్రింది స్థాయి వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ కుదిరినట్లు ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి సీపీఐ అండగా ఉంటూ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. -
లోకేశ్ అనుచరుడికి ఏసీబీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరికి అవినీతి నిరోధకశాఖ నోటీసులు జారీ చేసింది. తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన పుల్లారావు యాదవ్, మనోజ్, సుధీర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిలకు కూడా సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులందాయి. సోమవారం ఉదయం 10.30కల్లా విచారణకు హాజరు కావాల్సిందిగా వారిని ఏసీబీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌తో పాటు వేం డ్రైవర్, పనిమనిషి, కుటుంబ సన్నిహితుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఏసీబీ వర్గాల సమాచారం. డబ్బులకు సంబంధించి ‘ముఖ్య’మైన వ్యక్తుల పాత్రలను కృష్ణకీర్తన్ వెల్లడించినట్టు తెలిసింది. ఆ క్రమంలో లోకేశ్ ప్రధాన అనుచరుడైన ప్రదీప్ పాత్ర వెలుగు చూడటంతో అతన్ని విచారించనున్నారు. రేవంత్ పలుమార్లు గన్‌మెన్‌ను వదిలి రహస్యంగా వెళ్లినట్లు ఏసీబీ వద్ద సమాచారముంది. ఈ నేపథ్యంలో రేవంత్ డ్రైవర్ విచారణ కీలకంగా మారింది. రేవంత్ పాత్ర, కదలికలపై అతన్ని ప్రశ్నించనున్నారు. అజ్ఞాతంలోనే జిమ్మీబాబు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు ఏసీబీ నోటీసులందిన తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మీబాబు ఇప్పటికీ అజ్ఞాతం వీడటం లేదు. ప్రత్యేక బృందం 15 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించడం లేదు. డబ్బుల వ్యవహారంలో జిమ్మీదే కీలక పాత్ర అని ఏసీబీ వద్ద ప్రాథమిక సమాచారముంది. దాంతో టీడీపీలోని అతని సన్నిహితులను విచారించడంలో భాగంగానే సుధీర్, మనోజ్, పుల్లారావులకు నోటీసులిచ్చినట్టు తెలుస్తోంది. -
అన్నీ డొంకతిరుగుడు సమాధానాలే!
* ఏసీబీ తొలి రోజు కస్టడీ విచారణలో సండ్ర దాటవేత ధోరణి * ప్రతి కాల్‌నూ గుర్తుంచుకోలేనంటూ బదులు * కీలకమైన ప్రశ్నలపట్ల మౌనం * అతికష్టం మీద కొంత సమాచారం సేకరణ * సీఎం కేసీఆర్‌తో ఏసీబీ డీజీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో సూత్రధారుల్ని కనిపెట్టేందుకు అవినితి నిరోధకశాఖ (ఏసీబీ) కసరత్తు మరింత ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో ఐదో నిందితుడైన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన రెండు రోజుల అనుమతిలో భాగంగా గురువారం తమ కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...ఆయన్నుంచి అతికష్టం మీద కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. అయితే కొన్ని కీలకమైన ప్రశ్నలపట్ల కూడా దాటవేత ధోరణి అవలంబించినట్లు సమాచారం. ఈ కేసులో కీలక వ్యక్తులకు సంబంధించి రెండో రోజైన శుక్రవారం కచ్చితమైన వివరాలు రాబట్టాలని ఏసీబీ యోచిస్తోంది. కరువైన సమాధానం... ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మేరకు ఏసీబీ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో జరిగిన ఈ విచారణలో సండ్ర నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎం.మల్లారెడ్డి నేతృత్వంలోని అధికారులు శతవిధాలుగా ప్రయత్నించారు. ఉదయం ఏసీబీ కార్యాలయానికి రాగానే సండ్రకు కాఫీ ఇచ్చి అధికారులు కుశల ప్రశ్నలు వేశారు. అనంతరం చిన్నగా కేసుకు సంబంధించిన విషయాలను ఆయన వద్ద ప్రస్తావించారు. అయితే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సండ్ర నుంచి చిత్రమైన సమాధానాలు వచ్చినట్లు సమాచారం. నోటీసుల జారీ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఏసీబీ అధికారులకు చెప్పిన విషయాలనే పునారావృతం చేసినట్లు తెలిసింది. సెబాస్టియన్‌తో సాగించిన ఫోన్ సంభాషణలను ఆయన ముందుంచి కొన్ని పిన్ పాయింట్ ప్రశ్నలు వేయగా వాటిలో కొన్నింటి కి గుర్తులేదని, మరికొన్నింటి విషయంలో సండ్ర మౌనం వహించారని సమాచారం. ఈ కాల్స్ మాట్లాడింది మీరే కదా అని ఏసీబీ వేసిన ప్రశ్నకు... ‘ఏమో మాట్లాడి ఉండొచ్చు. నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేను, టీటీడీ బోర్డు సభ్యుడిని. నాకు రోజూ చాలా కాల్స్ వస్తాయి. టీటీడీ సభ్యుడిని కాబట్టి చాలా మంది రెకమండ్ కోసం ఫోన్లు చేస్తుంటారు. అన్నింటినీ గుర్తుపెట్టుకోలేను’ అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు తయారు చేసుకున్న ప్రశ్నావళిలో కొన్నింటికి సంబంధించి కొంత సమాచారాన్ని సండ్ర నుంచి రాబట్టగలిగినట్లు ఏసీబీ వర్గాల సమాచారం. అంతా ‘తర్ఫీదు’ ప్రకారమే... కస్టడీలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పందించిన తీరుపట్ల ఏసీబీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొదటిసారి తామిచ్చిన నోటీసులకు, ఆ తర్వాత అరెస్టుకు మధ్య అంతరంలో ఆయన ‘తర్పీదు’ పొంది నట్లు భావిస్తోంది. ఏపీలోని విజయవాడ, చికి త్స పొందినట్లు చెబుతున్న రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో సండ్ర ‘శిక్షణ’ పొందినట్లు ఏసీబీ అంచనాకొచ్చింది. ఈ శిక్షణలో కొందరు టీడీపీ నేతలతోపాటు మానసిక నిపుణులు, ఏపీ పోలీసుల ఉన్నతాధికారులు బాగా తర్పీదు ఇచ్చినట్లు అనుమానిస్తోంది. కస్టడీలో భాగంగా గురువారం విచారించగా సండ్ర వ్యవహరశైలి అచ్చం అదే విధంగా ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ కేసుకు సంబంధించి తాజా పరిస్థితిని ఏసీబీ డీజీ ఏకే ఖాన్.. సీఎం కేసీఆర్‌కు వివ రించారు. గురువారం సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఏకేఖాన్తోపాటు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసుతోపాటు రంజాన్ పండుగకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాట్లను చర్చించినట్లు సమాచారం. బెయిల్ పిటిషన్‌పై విచారణ 13కు వాయిదా ఈ కేసులో సండ్ర దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ నెల 13కు వాయిదా వేశారు. సండ్ర పిటిషన్‌పై గురువారం విచారణ జరగగా.. సండ్ర ఏసీబీ కస్టడీలో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఏసీబీ తరఫు న్యాయవాది కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. సండ్ర టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారని.. పలుకుబడి కలిగిన ఆయన బయట ఉంటే దర్యాప్తును అడ్డుకునే అవకాశం ఉందని పేర్కొంటూ ఏసీబీ ఇప్పటికే కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. -
తర్వాత ఎవరి వంతో..!
* ఓటుకు కోట్లు కేసులో టీటీడీపీ నేతల్లో గుబులు * సండ్ర అరెస్ట్‌తో నాయకుల బెంబేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను చూసి బెంబేలెత్తుతున్నారు. తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్టు చేయడం, కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఈ కేసుతో సంబంధాలు ఉన్న నేతలంతా తమ వంతు కూడా వస్తుందా అన్న భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో గడిపి షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని ఏసీబీ అరెస్టు చేసి విచారించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో తేలిపోయింది. సండ్రను ఏసీబీ విచారిస్తే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్‌రెడ్డిని ఇప్పటికే 2 పర్యాయాలు విచారించిన ఏసీబీ మరోసారి విచారణకు పిలవనుంది. ఆయనను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో టీడీపీలోని మరికొందరు నాయకులు ఆందోళనలో పడిపోయారు. తమ అభ్యర్థి గెలుపునకు అవసరమైన 2 ఓట్లకే పరిమితం కాకుండా, ప్రభుత్వాన్ని అస్థిర పరిచే వ్యూహంతో పెద్దఎత్తున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధపడిందన్న సమాచారం బయటకు పొక్కిన సంగతి తెలిసిందే. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల టీడీపీ నాయకులు కొందరు టచ్‌లోకి వెళ్లారని, కొందరికి డబ్బులు కూడా ముట్టాయని చెబుతున్నారు. ఇదే సమయంలో స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడడంతో మిగిలిన వారంతా జాగ్రత్త పడినా.. టీడీపీ నాయకులు పన్నిన వ్యూహంపై ప్రభుత్వం ఆగ్రహంగానే ఉందని, ఈ కేసుతో పరోక్ష సంబంధం ఉన్న వారినీ ఉపేక్షించరన్న వార్తలతో టీటీడీపీ నేతలకు వెన్నులో చలి మొదలైంది. సండ్ర తర్వాత వేం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేస్తారని, ఇక ఆ తర్వాత వంతు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. -
రేపు రాష్ట్రపతిని కలవనున్న ఏపీ మంత్రులు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసే విషయంపై ప్రణబ్‌తో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ఓటుకు కోట్లు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాల్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. శనివారం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్నిప్రణబ్ దర్శించుకున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ప్రణబ్ సువర్ణ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'సిగ్గు పడాల్సింది పోయి మీసం మెలేస్తాడా?'
హన్మకొండ(వరంగల్): ఓటుకు కోట్లు కేసులో బెయిల్‌పై విడుదలైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సిగ్గుపడాల్సింది పోయి, మీసం మెలేస్తాడా?, ఏం గొప్ప పనిచేశాడని హైదరాబాద్ నిండా పోస్టర్లు, ర్యాలీలు..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. గురువారం వరంగల్‌కు వచ్చిన ఆయన హన్మకొండలోని సుందరయ్యభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అవినీతి కంపుతో రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీ మారడం సరికాదన్నారు. ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలు, పద్ధతులు నచ్చక పార్టీలు మారేవారు.. ఇప్పుడేమో పదవుల కోసం పార్టీలు మారుతున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధించడం కష్టమేనన్నారు. సామాజిక సమానత్వం పాటించినప్పుడే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు అవి లేవన్నారు. -
'బాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ'
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ అని ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో చంద్రబాబు వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రజల్లోకి వెళ్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దేవాలయాలు తిరగడం మానేసి రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధాని హైదరాబాద్ నగరంలో హార్స్ రేసింగ్ క్లబ్ లను మూయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. -
'వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా ?'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు మధ్య క్విడ్ ప్రోకో ఏంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదని టీ సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇద్దరి సీఎంల మధ్య ఒప్పందం ఏమైనా కుదిరిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ నేరమే.. ఓటుకు కోట్లు నేరమే.. అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో అవినీతికి పాల్పడిన.. ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనని ఆయన అన్నారు. ఈ వ్యవహారం కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించింది కాదని.. రెండు రాష్ట్రాలకు చెందిందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇన్ని రోజులైనా ఈ కేసు ఎందుకు నీరుగారుతోందో అర్థం కావడం లేదన్నారు. టీఆర్ఎస్, టీడీపీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఎదురుదాడి చేసుకుంటున్నాయని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
ఇంతకీ సండ్ర ఎక్కడ..?
జిల్లాలో సర్వత్రా ఆసక్తి ఆస్పత్రిలో చేరినట్లు ఏసీబీకి లేఖ ఎక్కడున్నది సమాచారం ఇవ్వని ఎమ్మెల్యే విశాఖ, విజయవాడలో అంటూ పుకార్లు ఖమ్మం :ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ విచారణకు హాజరు కాకుండా ఎక్కడ ఉన్నారనేది.. ప్రస్తుతం జిల్లాలో ప్రధానంగా సాగుతున్న చర్చనీయంశం! ఈనెల 19న సాయంత్రం లోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆయనకు నోటీసులు పంపిన విషయం విదితమే. అయితే ఆయన మాత్రం ఆరోగ్యం సరిగ్గా లేనందున ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని.. ఈపరిస్థితులతో ‘మీ వద్దకు రాలేకపోతున్నా, కోలుకున్న వెంటనే మీ వద్దకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తా.. లేదా మీరు నేనున్న ఆస్పత్రికి వస్తే కావాల్సిన సమాచారం ఇస్తా’ అంటూ ఏసీబీకి లేఖ రాశారు. లేఖలో సండ్ర ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారో పేర్కొనకపోవడంతో అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్నది జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఏసీబీ ఓటుకు కోట్లు వ్యవహారంలో దూకుడుగా ముందుకు వెళ్తుండడంతో సండ్ర ముందుస్తుగా విచాణరణకు హాజరు కాకుండా న్యాయపరంగా సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తర్వాత నేరుగా ఓటుకు కోట్లు విషయంలో సండ్ర అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఏసీబీ భావిస్తోంది. దీంతో ఏసీబీ విచారణకు హాజరైతే.. సమాచారం తీసుకున్న తర్వాత మరింత విచారణ కోసం అరెస్టు చేస్తుందా..? అని ఆలోచించిన సండ్ర వ్యూహాత్మకంగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది. మూడు రోజులు ఆయన విశాఖపట్నంలో ఉన్నట్లు, ఆతర్వాత విజయవాడకు వచ్చారని, హైదరాబాద్‌లోని ఉన్నారని ఇలా రకరకాల ప్రచారం జిల్లాలో సాగుతోంది. శుక్రవారం ఖచ్చితంగా ఆయన ఏసీబీకి విచారణకు హాజరవుతారని ఆయన నుంచి ఏసీబీ ఏం రాబడుతుంది.. ? ఆయన ఎలా వ్యవహరిస్తారు..? అని జిల్లాలోని పలు రాజకీయ పార్టీల నేతలు, శ్రేణులు ప్రధానంగా టీడీపీ కేడర్ ఆసక్తిగా టీవీ చానెళ్ల ముందు ఎదురు చూశారు. గడువు వరకు ఆయన రాకపోవడం అంతకు కొంత సమయం ముందే ఏసీబీకి లేఖ పంపడంతో అసలు సండ్ర ఎక్కడ ఉన్నారని టీడీపీ శ్రేణులు కూడా ఆరా తీశాయి. సత్తుపల్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు రోజంతా ఆయన ఎక్కడ ఉన్నారు..? అని జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో ఉన్న నేతలతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలోని ఒక్కరిద్దరు ప్రధాన నేతలకు మాత్రమే ఆయన ఎక్కడున్నారని సమాచారం తెలిసినట్లు తెలిసింది. సండ్ర రెండు నెంబర్లు, ఆయన వెంట నిత్యం ఉండే ప్రధాన అనుచర నేతలు సెల్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఎక్కడన్నది ఏసీబీకి కూడా అంతు చిక్కడం లేదు. అయితే ఏసీబీ రాసిన నోట్లో మాత్రం ఆస్పత్రికి వస్తే మీరు కావాల్సిన సమాచారం ఇస్తానని పేర్కొన్న సండ్ర.. ఏసీబీ అధికారులకు తాను ఎక్కడ ఉన్నానన్న సమాచారం ఫోన్లో ఏమైనా చెప్పారా..? అని కూడా ప్రచారం సాగుతోంది. ఏసీబీ ఏం చేస్తుందో..? సండ్ర లేఖతో ఏసీబీ తదుపరి చర్యలు ఏం తీసుకుంటుందోనని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఎక్కడున్నది సమాచారం తెలుసుకొని అదుపులోకి తీసుకుంటారా..? లేక ఏ రకంగా ఏసీబీ ముందుకు వెళ్తుందన్నది చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సండ్ర సమాచారం ఇస్తే అక్కడికి ఏసీబీ ఎలా వెళ్తుంది..? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? వేచి చూడాల్సిందే. సండ్ర లేఖపై ఏసీబీ శనివారం స్పందించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లయితే అక్కడి సీఎం స్కెచ్లోనే భాగంగా సండ్ర ఏసీబీకి లేఖ రాశారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా ఓటుకు కోట్లు వ్యవహారంలో సండ్ర ఏసీబీకి ఆస్పత్రిలో చికత్స పొందుతున్నాని నోట్ రాయడం జిల్లాలో ప్రధాన చర్చకు దారితీసింది. వారం రోజులుగా సండ్ర జిల్లాలోని ఆ పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకుండా పోవడంతో ఏసీబీ ఏంచేస్తుందోనని వారిలో ఆందోళన నెలకొంది. -
సండ్ర ఎక్కడ..?
-
కోర్టుకు చేరిన స్టీఫెన్ సన్ వాంగ్మూలం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగూల్మం శుక్రవారం సీల్డ్ కవర్ లో ప్రత్యేక కోర్టుకు చేరింది. వాంగూల్మం సర్టిఫైడ్ కాపీ కోసం ఏసీబీ అధికారులు, రేవంత్ రెడ్డి న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా స్టీఫెన్సన్ కుమార్తె జెస్సికా, బంధువు మార్క్‌టేలర్ వాంగ్మూలాలను బుధవారం ఏసీబీ నమోదు చేసింది. టీడీపీ ముడుపుల వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న స్టీఫెన్ సన్ వాంగూల్మంలో ఏముందోనని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతల పేర్లతోపాటు కీలక సమాచారాన్ని ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో స్టీఫెన్ సన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. -
కోర్టుకు చేరిన స్టీఫెన్ సన్ వాంగ్మూలం
-
వాట్ ఏ 'సిట్' ?
'ఓటుకు కోట్లు'పై సమాధానం చెప్పమంటే చంద్రబాబు 'సిట్' అంటున్నారు. పొరుగు రాష్ట్రం సీఎంపై తెలుగు తమ్ముళ్లు పెట్టిన కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం వేశారు. ముడుపుల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో 'బాస్' ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది టీఆర్ఎస్ కుట్ర అంటూ పల్లవి అందుకున్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో బాబు మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో బట్టబయలు కావడంతో 'సెక్షన్ 8' బయటకు తీశారు. 'ఫోన్ ట్యాపింగ్' అంటూ హస్తినకు పరుగెత్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు నుంచి భరోసా దొరక్కపోవడంతో ఉత్తి చేతులతో ఉసూరుమంటూ తిరిగొచ్చారు. తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచడంతో బెంబేలెత్తిన బాబు హడావుడిగా 'సిట్' ఏర్పాటు చేశారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని నిరూపించేందుకు ఏసీబీ సమాయత్తమవుతున్న తరుణంలో 'సిట్'తో ఎదురుదాడికి దిగారు. ఆరంభం నుంచే ఆయనది 'ఎటాకింగ్' స్వభావమేనని బాబును బాగా ఎరిగిన వారికి తెలిసిన విషయమే. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమని రేవంత్ కు తాను చెప్పలేదని చంద్రబాబు ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ముడుపుల కేసులో జైలుకెళ్లిన రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయనూలేదు. ఆడియో టేపుల్లో వాయిస్ మీదేనా అడిగితే... 'వాట్ ఐ యామ్ సేయింగ్' అంటూ సాగదీస్తారే కానీ సమాధానం చెప్పరు. గట్టిగా అడిగితే 'నేను ముఖ్యమంత్రిని. నన్నే ప్రశ్నిస్తారా' అంటూ కన్నెర్ర జేస్తారు. సీఎం తప్పు చేస్తే విచారించే హక్కు దర్యాప్తు సంస్థలకు లేదా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు ఎలాంటి తప్పు చేసినా మౌనంగా ఉండాలా, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుంటే తప్పా, అధికారం ముసుగులో తప్పుడు పనులు చేసినా ఎవరూ మాట్లాడకూడదా, అడ్డంగా దొరికినా అధికారం ఉందన్న ఒకే ఒక్క కారణంతో వదిలేయాలా, ఉమ్మడి రాజధానిలో ఉన్నారన్న కారణంతో నేరాన్నినమోదు చేయకూడదా, నేరారోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి విచారణ ఎదుర్కొకూడదా. నోటీసులు తీసుకోమని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అన్నది సామాన్యుడి ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామని చెబుతున్న టీడీపీ సర్కారు వాటిని ఎప్పుడు బయటపెడుతుందో. ప్రధానికి రాసిన లేఖలో మత్తయ్య ఫోన్య ట్యాపింగ్ ప్రస్తావన తప్పా మిగతా 119 ఫోన్లు ట్యాప్ అయిన ప్రస్తావన ఎక్కడా లేదే. నన్ను అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే అఖరి రోజుని చంద్రబాబు అనడం ఏ ధోరణికి సంకేతం. తమ రాష్ట్ర పోలీసులే ఉండాలని, హైదరాబాద్ లో ఏపీ పోలీసు స్టేషన్లు పెడతామని ఏపీ కేబినెట్ అనడంలో ఆంతర్యం ఏమిటి. తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న సాకుతో గవర్నర్ పై టీడీపీ మంత్రులు నోరుపారేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా. టీడీపీ సంక్షోభాన్ని ప్రజలపై రుద్దడం ఎంతవరకు సమంజసం? తాను చట్టానికి అతీతుడిని అన్నట్టుగా చంద్రబాబు వ్యహరిస్తున్నారు. తాను సీఎంను కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ తరహా ధోరణి ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదనేది ప్రజాస్వామ్యవాదుల భావన. బాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటారో చూడాలి. -
రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ 24కి వాయిదా
పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు ఆదేశం తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో మత్తయ్య పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24 కు వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం తీర్పు వెలువరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులు ముట్టజెప్పే ప్రయత్నాలు చేయడంతో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్‌రెడ్డి తదితరులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం సోమవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ వ్యాజ్యాలు బుధవారం హైకోర్టు ముందు విచారణకు వచ్చాయి. తాజాగా దాఖలయ్యే ప్రతీ బెయిల్ పిటిషన్‌ను కూడా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు కోర్టు ముందుంచేందుకు వీలుగా వారం పాటు వాయిదా వేయడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి, తదితరులు బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న మత్తయ్య తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగంలోకి టీ అడ్వొకేట్ జనరల్.. ఇదిలా ఉంటే ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. సంచలనాత్మకంగా మారిన ఈ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ ఇస్తే తలెత్తే పరిణామాలు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకున్న మీదట బెయిల్ పిటిషన్‌పై ఏజీ ద్వారా వాదనలు వినిపించాలని టీ సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. ఏసీబీ తరఫు వాదనలు వినిపించేందుకు స్పెషల్ పీపీ ఉన్నప్పటికీ, రిస్క్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఉన్న సీఎం కేసీఆర్.. అడ్వొకేట్ జనరల్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించనున్నట్లు తెలిసింది. ఏసీబీ కోర్టులో రేవంత్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రానే హైకోర్టులోనూ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. -
'ఓటుకు కోట్లు' కేసు బాబు వ్యక్తిగతం..కానీ
-
గంటన్నరపాటు స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన ఫిర్యాదుదారు.. నామినేటెడ్ ఆగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్ సన్ వాగ్మూలాన్ని బుధవారం ఏసీబీ కోర్టు నమోదు చేసుకుంది. దాదాపు గంటన్నరపాటు స్టీఫెన్సన్ ఇచ్చిన వాగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. ఆ సమయంలో కోర్టు హాలులోకి ఇతరులు ఎవ్వరినీ అనుమతించలేదు. స్టీఫెన్సన్ నోటి నుంచి వెలువడిన ప్రతి అక్షరాన్ని లిఖిత పూర్వకంగానే కాకుండా రికార్టు చేసినట్లు తెలిసింది. ఆ తరువాత నోట్లు పట్టుబడిన ఇంటి యజమాని మార్క టేలర్, స్టీఫెన్ సన్ కుమార్తె జెస్సికా ఇచ్చిన వాగ్మూలాలను న్యాయమూర్తి రికార్డు చేశారు. మార్క్ టేలర్ 26 నిమిషాలపాటు, జెస్సికా 10 నిమిషాలపాటు న్యాయమూర్తి ముందు మాట్లాడారు. నోట్ల కట్టలతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టయిన రోజు ఆ ఇంట్లో స్టీఫెన్ సన్ తోపాటు మార్క్, జెస్సికాలుకూడా ఉన్నట్లు తెలిసిందే. కాగా, కోర్టు నుంచి స్టేట్మెంట్ సర్టిఫైడ్ కాపీ ఆధారంగా ముందుకు సాగనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. స్టీవెన్సన్ను కోర్టుకు తీసుకువచ్చే సమయంలో పోలీసులు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. వాగ్మూలాల నమోదు అనంతరం అంతే భద్రతతో స్టీవెన్ సన్, ఆయన కూతురు జెస్సికా, మార్క్ టేలర్ లను వారి ఇంటికి తరలించారు. -
గంటన్నరపాటు స్టీఫెన్సన్ వాగ్మూలం
-
'ఏపీ పరువు మంటగలిపారు'
-
'లంచం ఇవ్వజూపి ఏపీ పరువు మంటగలిపారు'
అనంతపురం: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వజూపి, దానిని కప్పిపుచ్చుకునేందుకు కుట్రలకు పాల్పడున్నారని, అసలు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాల అంశం ఎక్కడుందని నిలదీశారు. బాబు కుటిల చర్యలు ఏపీ పరువును మంటగలపడంతోపాటు ప్రయోజనాలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని విమర్శించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని తెలుగు ప్రజల మధ్య ఉద్రక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా 'ఆడియో టేపుల్లో వాయిస్ నాది కాదు' అని చంద్రబాబు చెప్పలేకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
'ఓటుకు కోట్లు' కేసు బాబు వ్యక్తిగతం..కానీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 లోని సెక్షన్-8 పై వివాదాలు సృష్టించవద్దని ఏపీ నాయకులను ఉద్దేశించి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 'ఓటుకు నోటు' కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యక్తిగతమైన అంశమని అన్నారు. ఈ కేసు విషయమై మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సంబంధించిన కేసును రెండు ప్రాంతాల తగాదాగా చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసును అవకాశంగా తీసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్థమన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాల మధ్య గొడవ జరగలేదని ఆయన గుర్తుచేశారు. ఈ నెల 21 న ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
రేవంత్ బెయిల్ పై విచారణ 24కు వాయిదా
-
రేవంత్ బెయిల్ పై విచారణ 24కు వాయిదా
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఈ నెల 29 వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన సంగతి తెలిసిందే. -
ఆ 20 మంది ఎవరు?
-
ఏసీబీ ఎదుట హాజరైన నరేందర్‌రెడ్డి
-
కేసును పక్కదారి పట్టించేందుకు ప్లాన్
-
ఏసీబీ ఎదుట హాజరైన నరేందర్‌రెడ్డి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి నేడు ఏసీబీ అధికారులు హాజయ్యారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణ కోసం ఆయన బుధవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ముడుపుల వ్యవహారంలో ఆయన పాత్ర, సూత్రధారులు ఎవరు, ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బులెవరు ఇచ్చారనే దానిపై నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశముంది. నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన నివాసానికి వెళ్లారు. అయితే గుండె వ్యాధితో బాధపడుతున్నందున ఇప్పుడు రాలేనని ఆయన విజ్ఞప్తి చేయడంతో అధికారులు వెనక్కి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఏసీబీ ఎదుట హాజయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్ రెడ్డి గెలుపు కోసమే బేరసారాలు జరుపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఈ ఉదయం నరేందర్ రెడ్డిని కలిశారు. ఈ కేసులో మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. -
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?
-
ఏసీబీ ఎదుట హాజరుకానున్న నరేందర్‌రెడ్డి
-
ఆ 20 మంది ఎవరు?
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో 'దేశం' నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి వారెంట్లు పొందినట్లు సమాచారం రావడంతో ఆ పార్టీ నాయకులు వణుకుతున్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా భావిస్తున్న మరో 20 మంది దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేయనుంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద వీరందరినీ దశలవారీగా విచారణకు రావాలని నోటీసులు జారీ చేయనుంది. వీరిలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు, శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఒక మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర దేశం నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ ఎప్పుడు ఎవరికి నోటీసులు జారీ చేస్తుందోనని టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలోనైనా 'బాస్'కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశముందని సమాచారం. -
పోలీసే కాదు... పోస్ట్ వచ్చినా హడలే!
* బెంబేలెత్తుతున్న ఏపీ సీఎం, ఆంతరంగికులు * ‘ఓటుకు నోటు’ నోటీసులు వస్తాయని భయం * పరిశీలించనిదే టపా తీసుకోవద్దని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ అవుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఆయన చుట్టూ ఉన్న వారికి కొత్త భయం పట్టుకుంది. తెలంగాణ ఏసీబీ, పోలీసులే కాదు చివరకు పోస్ట్ (తపాలా) పేరు చెప్పినా వారు ఉలిక్కిపడుతున్నారు. సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంతో పాటు ఆంతరంగికులకు పోస్టు ద్వారా వచ్చే లేఖలను కూడా క్షుణ్ణంగా పరిశీలించనిదే స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయా చోట్ల ఉండే ఉద్యోగులతో పాటు ఇన్వార్డ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. సీఎం నివాసం, కార్యాలయంతో పాటు ఇతర చోట్లకూ నిత్యం పదుల సంఖ్యలో వినతి పత్రాలు, ఫిర్యాదులు తదితరాలు పోస్టు ద్వారా వస్తుంటాయి. వీటిని అక్కడ ఉండే ఉద్యోగులు, ఇన్వార్డ్ సెక్షన్లవారు తీసుకుని ఎక్నాలెడ్జ్మెంట్స్పై స్టాంపులు వేస్తుంటారు. ఆ తరవాత కవర్లు తెరిచి ఆయా లేఖల్లో ఉన్న అంశాలను పరిశీలించే సంబంధిత విభాగాలకు, అవసరమైతే సీఎం ఇతర ప్రముఖుల దృష్టికి పంపిస్తుంటారు. ఇది నిత్యకృత్యంగా జరిగే పరిణామమే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు పోస్టు ద్వారానూ నోటీసులు పంపే అవకాశం లేకపోలేదని కొందరు చంద్రబాబుకు సూచించారు. ఈ నేపథ్యంలో పోస్ట్ పేరు చెప్తే చాలు అంతా ఉలిక్కిపడుతున్నారు. -
కేసును పక్కదారి పట్టించేందుకు పక్కా ప్లాన్
* ఉచ్చు బిగుస్తుండటంతో రోజంతా హైడ్రామా నడిపిన ఏపీ సీఎం చంద్రబాబు * మంత్రులు, ఎంపీలు, అధికారులతో భేటీ * తనకు నోటీసిచ్చే అధికారం లేదంటూనే మరోవైపు కేసీఆర్‌పై ఉన్న కేసులపై వాకబు * యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందన్న మంత్రి యనమల.. ముల్లును ముల్లుతోనే తీస్తామన్న అచ్చెన్నాయుడు * మేం కేసులు పెడితే కేసీఆర్ ప్రభుత్వం కూలుతుందంటూ హడావుడి * సీఎస్, డీజీపీలను గవర్నర్ వద్దకు పంపిన బాబు * ఏసీబీపై మైండ్‌గేమ్ కథ నడిపిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) మరో అడుగు ముందుకు వేయనుందన్న విషయం తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానాహడావుడి చేశారు. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేయబోతోందన్న సమాచారం మంగళవారం సచివాలయంలో హైడ్రామా నడిపించారు. అసలు కేసును పక్కదారి పట్టించడానికి కొత్త ప్లాన్ రచించారు. ఏ క్షణంలోనైనా ఏసీబీ నోటీసులు జారీ చేయనుందన్న సమాచారంతో ఉలిక్కిపడిన చంద్రబాబు మంగళవారం ఉదయం ఇంట్లోనే డీఐజీ రాముడు, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధతోపాటు ఇతర ఉన్నతాధికారులతో రహస్య మంతనాలు సాగించారు. మధ్యాహ్నం సచివాలయానికి రాగానే అందుబాటులో ఉన్న మధ్యాహ్నం సచివాలయానికి రాగానే గృహనిర్మాణంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్న మంత్రులను, కొందరు ఎంపీలను హడావుడిగా పిలిపించి సుదీర్ఘ భేటీలు జరిపారు. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, మృణాళిని, పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు గరికపాటి రామ్మోహన్రావు, సీఎం రమేష్ తదితరులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధ ఇతర అధికారులతో విడతల వారీగా చర్చించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌పై నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు. ఉన్న పరిస్థితుల్లో పక్కదారి పట్టించడమొక్కటే మార్గమన్న సలహాల మేరకు కొత్త వ్యూహానికి పదునుపెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీకి చెందిన నేతలకు భద్రత లేదన్న ఆరోపణలకు పదునుపెట్టడంతోపాటు హైడ్రామా నడిపించారు. అసలు కేసును పక్కదారి పట్టించేలా హైదరాబాద్‌లో ఆంధ్రులకు రక్షణ లేదనీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులను హైదరాబాద్‌లో పెట్టడం ద్వారా భద్రతను తామే పర్యవేక్షిస్తామంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును, డీజీపీ జేవీ రాముడును గవర్నర్ వద్దకు పంపించారు. దాంతోపాటు కేసులకు కేసుతోనే సమాధానమంటూ మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. సీఎంతో సమావేశం అనంతరం మంత్రులు వరుస పరంపరగా మీడియాతో మాట్లాడుతూ యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందనీ, ఏపీలో కేసీఆర్‌పై నమోదైన కేసులపై సిట్‌ను ఏర్పాటు చేశామని, కేసీఆర్‌కు నోటీసులిస్తామంటూ రకరకాల ప్రకటనలు గుప్పిస్తూ రోజంతా హడావిడి చేశారు. కేసీఆర్‌పై నమోదైన కేసులపై నోటీసులిస్తామన్న లీకుల ద్వారా చంద్రబాబుకు నోటీసులివ్వకుండా ఆగిపోతారన్న భావనతో విపరీతమైన ప్రచారం చేస్తూ మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. చంద్రబాబుకు నోటీసులిచ్చే అధికారం లేదని ఒకవైపు చెబుతూనే, నోటీసులిస్తే సంక్షోభం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకేసి ఫోన్‌ట్యాపింగ్ జరిగినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని ప్రకటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సందర్భంగా అందుకు సంబంధించి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. మరోవైపు పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు నోటీసు ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరగడంతో ఆయన రోజంతా చంద్రబాబు కార్యాలయంలోనే ఉండిపోయారు. -
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?
న్యూఢిల్లీ: 'ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు గొప్ప అర్థం ఉంది. టీడీపీ మంత్రులు మాట్లాడేది ఎలాంటి స్వేచ్ఛ గురించి? చంద్రబాబు విచ్చలవిడి అవినీతికి స్వేచ్ఛ కావాలా?' అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో తమ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు గగ్గోలు పెట్టడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షన్- 8 అమలుచేయాల్సిన అవసరం లేదన్న వినోద్.. ఉమ్మడి రాజధానిలో విద్వేషాలు హెచ్చరిల్లినప్పుడుగానీ, పౌర హక్కులకు భంగం వాటిల్లడంకానీ, ఆస్తుల విధ్వంసం లేదా ఇతరత్రా హింసాయుత పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే విభజన చట్టంలోని సెక్షన్- 8 అమలుచేయాల్సి వస్తుందని, అదికూడా తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించిన తర్వాతే గవర్నర్ తుదినిర్ణయం తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ఓటుకు నోటు వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందికాబట్టి తెలంగాణ ఏసీబీ బాబుపై చర్య తీసుకోదని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని వినోద్ అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోవడం సహజమన్నారు. -
బాస్‌కు కావాలి.. ఒక బకరా!
-
బాస్‌కు కావాలి.. ఒక బకరా!
* ఓటుకు నోటులో బలి పశువు కోసం అన్వేషణ * 15 రోజులుగా అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు * ‘బాస్’ స్థానంలో మరొకరిని ప్రవేశపెట్టే ప్రయత్నాలు * టీటీడీపీ నేతతో స్వచ్ఛంద అంగీకార వాంగ్మూలం ఇప్పించే వ్యూహం * అలా చేస్తే ఎదురుదెబ్బ తగలవచ్చన్న అధికారులపై ఆగ్రహం * స్టీఫెన్‌సన్‌తో ఫోన్ సంభాషణను టీఆర్ఎస్పై తోసేయాలని ఆంతరంగికుల సలహా * ఏసీబీ వద్ద ఇంకెన్ని ఆధారాలున్నాయో తెలియకుండా అలా చేయలేమన్న అధికారులు * మీరు సలహాలివ్వరు, నా ఆలోచనల్ని ఆచరణలో పెట్టనివ్వరంటూ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానినుంచి బయటపడటం కోసం ఉన్న మార్గాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఎరగా చూపిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రోజునుంచి... మరీ ముఖ్యంగా తాను మాట్లాడిన ఆడియో టేపులు బయటకుపొక్కినప్పటి నుంచి ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూ... ఏం చేస్తే బయటపడగలుగుతామని అధికారులను ఆరా తీస్తున్నారు. వీడియో టేపుల్లో రేవంత్‌రెడ్డి చెప్పిన ‘బాస్’ స్థానంలో తాను కాకుండా మరొకరిని ప్రవేశపెడితే చట్టపరంగా ఎలా ఉంటుందని కూడా ఆయన ఆరా తీసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయినందున ‘బాస్’ తానేనని తెలంగాణ టీడీపీలోని ఒక నేత ద్వారా స్వచ్ఛంద అంగీకార వాంగ్మూలం ఇప్పించి... న్యాయమూర్తి ముందు ప్లీడెడ్ గిల్టీగా చేయించడంవల్ల ఎదురయ్యే అంశాలపైనా ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఏసీబీ నుంచి నోటీసులు రాకముందే దీని నుంచి బయటపడం లేదా నోటీసులు అందిన తర్వాత చేయాల్సిన పనులపైనా తనకు అనుకూలమైన సీనియర్ అధికారులతోపాటు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. గత పక్షం రోజులుగా చేస్తున్నట్టే సోమవారం కూడా చంద్రబాబు తన నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుకు నోటు కేసు పూర్వాపరాలు, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయాలన్న విషయాలపైన చర్చలు జరిపారు. బలమైన ఆధారాలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కారణంగా రేవంత్‌రెడ్డి ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని వారు చెప్పారు. అయితే రేవంత్‌రెడ్డి ఇప్పటివరకూ ఎక్కడా చంద్రబాబు పేరు చెప్పకపోవడం, బాస్ ఎవరో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నోరు విప్పకపోవడం కలిసొచ్చే అంశాలుగా న్యాయవాదులు వివరించారు. అయితే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో తనకేమాత్రం సంబంధం లేదని చెబితే తప్ప చంద్రబాబు ఇందులో నుంచి బయటపడటానికి అవకాశాలు లేవని తెలిపారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో ఎవరినైనా తెరమీదకు తేవడం ద్వారా తాను బయటపడటానికి ఉన్న మార్గాలపైనే దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. అలాగే తెలంగాణకు చెందిన ఒక నేత ద్వారా మీడియా ముందు మాట్లాడించాలని సూచించారు. అయితే రేవంత్‌రెడ్డి చెబుతున్న బాస్ స్థానంలో మరో తెలంగాణ నేతను ఇరికించడంవల్ల అసలుకే మోసం జరిగే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని సీనియర్ అధికారులు విశ్లేషించి చెప్పడంతో చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రతి విషయానికీ అడ్డం చెప్పడంకాదు బయటపడే మార్గాలేవో చెప్పాలంటూ దబాయించినట్టు సమాచారం. టీఆర్ఎస్ మీదికి మళ్లించేద్దాం.... నామిటేడెట్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో నేరుగా ఫోన్లో సంభాషణలకు సంబంధించి ఆడియో టేపుల విషయంలో ఎలా స్పందించాలి? కోర్టు ద్వారా ఏసీబీని అడ్డుకోవడానికి ఉన్న మార్గాలపై చంద్రబాబు న్యాయవాదులను వివరాలు కోరారని తెలిసింది. ఫోన్ సంభాషణలకు సంబంధించి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక అంత త్వరగా న్యాయస్థానానికి చేరే అవకాశాలు లేవని వారు వివరించారు. ఆ టేపులో ఉన్న సంభాషణను టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మార్చి, వారిపై ఎదురుదాడి చేయమని తన ఆంతరంగికులు సలహా ఇచ్చినట్లు సీఎం అధికారులతో చెప్పినట్లు తెలిసింది. టేపులో ఎక్కడా ఎమ్మెల్సీ ఎన్నికలు, టీడీపీకి మద్దతు, నగదు ప్రస్తావనలు లేని అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని వారికి స్పష్టం చేశారు. స్టీఫెన్సన్ నామినేటెడ్ ఎమ్మెల్యే కావడంతో... ఎమ్మెల్సీ ఎన్నికల సహా పలు అంశాల్లో తమను అనుకూలంగా ఉండాల్సిందిగా టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఆయనపై ఒత్తిడి తేవడంతోపాటు బెదిరింపులకు దిగినట్లు ప్రచారం చేద్దామనే ఆలోచనను సీఎం ఈ సమావేశంలో బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే స్టీఫెన్సన్ టీ-టీడీపీ శ్రేణుల్ని ఆశ్రయించారని, వారు ఆయనకు భయపడాల్సింది లేదంటా భరోసా ఇచ్చినట్లు చెప్పడానికి వీలుందా? అని అడిగినట్టు తెలిసింది. ఏసీబీ వద్ద మరె లాంటి ఆధారాలున్నాయో తెలియనందున ఇప్పటికిప్పుడు స్పందించలేమని అధికారులు చెప్పారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ‘మీరు సలహాలు, సూచనలు ఇవ్వరు. నా ఆలోచనల్ని ఆచరణలో పెట్టనివ్వరు’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని అర్ధంతరంగా ముగించినట్లు తెలుస్తోంది. -
జైలు నుంచి ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియటంతో చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తరలించారు. ఉదయసింహా, సెబాస్టియన్ లను కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది. -
చంద్రబాబు చూపిన ఆశతోనే..!
-
ముగిసిన రేవంత్ కస్టడీ,కోర్టుకు తరలింపు
-
ముగిసిన రేవంత్ రెడ్డి కస్టడీ: నేడు కోర్టుకు తరలింపు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీ నేటి (సోమవారం)తో ముగియనుంది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేదిగా ఉందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి గతంలో పేర్కొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మరికొన్ని రోజులు రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సోమవారం అత్యంత కీలక పరిణామాలు జరుగనున్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది. చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో స్టీఫెన్సన్ వాంగ్మూలం కీలకం కానుంది. రూ.5 కోట్లు లంచం తీసుకుని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేసిన స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఏసీబీ ఇప్పటికే కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ సోమవారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో తనను ఎవరెవరు, ఏవిధంగా ప్రలోభపెట్టారు, ఎవరెవరు, ఏ హామీలిచ్చారన్న వివరాలను స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశముంది. చంద్రబాబు తనతో ఎప్పుడు, ఎవరి ద్వారా ఫోన్లో మాట్లాడారో చెప్పనున్నారు. ఇక రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్లు ఉపయోగించిన ఫోన్ల కాల్ డేటా, స్టీఫెన్సన్ ఫోన్లో రికార్డయిన సంభాషణలు, రహస్య కెమెరాల వీడియో ఫుటేజీలను ఇప్పటికే కోర్టు ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నుంచి ప్రాథమిక నివేదిక ఇప్పటికే ఏసీబీకి అందింది. పూర్తిస్థాయి నివేదికలను ఎఫ్ఎస్ఎల్ సోమవారం కోర్టుకు సమర్పిస్తుందని అధికారవర్గాలు చెప్పాయి. ఈ నివేదిక కోర్టుకు అందితే విచారణ మరింత వేగవంతం కానుంది. -
‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్
-
నేడు స్టీఫెన్సన్ వాంగ్మూలం
-
చంద్రబాబు చూపిన ఆశతోనే..!
- ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో రేవంత్ బేరసారాలు - టీటీడీపీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు హామీ - ఆయన సూచన మేరకే ఎమ్మెల్యేలతో మంతనాలు - ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న వ్యూహం? .. టీటీడీపీ నేతల్లో విస్తృత చర్చ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తానన్న పార్టీ అధినేత చంద్రబాబు హామీ మేరకే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి బేరసారాలు జరిపారా..!? పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న ఉద్దేశంతోనే ఈ కొనుగోళ్లకు దిగారా..? ఈ ప్రశ్నలకు తెలంగాణ టీడీపీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రె స్ పార్టీల్లో తనకు తెలిసిన ఎమ్మెల్యేలతో మా ట్లాడి టీడీపీ అభ్యర్థికి ఓటేసేలా రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఆయన సూచించిన అభ్యర్థికే టికెట్ ఇస్తానని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి మరోమారు అవకాశమివ్వాలన్న ఎర్రబెల్లి, ఎల్.రమణ తదితర సీనియర్ నేతల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. నర్సారెడ్డి ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయలేరని, ఆయనకు అవకాశమిచ్చి ఓటమిపాలు కావడం ఎందుకని బాబు ప్రశ్నించినట్లు సమాచారం. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే వ్యూ హంతో ముందుకు వెడుతున్నామని వివరించినట్లు తెలిసింది. దీంతోపాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతలను ఎర్రబెల్లి, ఎల్.రమణ, సండ్ర వెంకటవీరయ్యలకు బాబు అప్పగించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఆర్థిక వనరులు సమకూరుస్తారని హామీ ఇచ్చారు. అయితే.. పార్టీ నుంచి సమాచారం బయటకు పొక్కకుండా తమకు బాధ్యతలు అప్పగించారే తప్ప ఆపరేషన్ సాగుతున్న తీరు తమకు ఏ దశలోనూ తెలియదని ఓ సీనియర్ నేత పేర్కొనడం గమనార్హం. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే తెలంగాణలో పార్టీని రేవంత్ ముందుండి నడిపిస్తారని చంద్రబాబు తన సన్నిహితులతో చెప్పినా టీటీడీపీ నేతలకు మాత్రం చెప్పకుండా రహస్యంగా ఉంచారు. అసలేం జరిగింది..? తెలంగాణ టీడీపీలో బహిరంగంగానే రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. మండలి ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు సమయంలోనే వాటి మధ్య పెద్ద డ్రామా జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నర్సారెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఎర్రబెల్లి ప్రయత్నించారు. కానీ వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని రేవంత్ పట్టుబట్టారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన భేటీ సందర్భంగా ‘ఎన్నికల్లో నిలబడడానికి సరిపడా బలమే లేదు.. ఎలా గెలుస్తాం, గెలుపు కోసం ఎవరేం చేస్తారు?’ అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సమయంలో తాను ఎలాగైనా రెండు ఓట్లను (ఇద్దరు ఎమ్మెల్యేలను) సంపాదిస్తానని రేవంత్ ధీమాగా చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా డబ్బుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అరికెలను రేసు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఖర్చు పెట్టడం తన వల్ల కాదని అరికెల వెనక్కి తగ్గడంతో ఎర్రబెల్లి కూడా చేతులు ఎత్తేశారని.. ఇది రేవంత్‌కు కలిసి వచ్చిందని అంటున్నారు. ఎనిమిది మందికి గాలం.. ఎన్నికల్లో అవసరమైన ధనం సమకూర్చేందుకు బాబు అంగీకరించడంతో అభ్యర్థి ఎన్నికకు అవసరమైన రెండు ఓట్లకే పరిమితం కాకుండా.. ఏకంగా ఎనిమిది మందికి రేవంత్ గాలం వేశారు. వారిలో అత్యధికులు ఆమోదయోగ్యంగా ఉన్నారని బాబుకు సమాచారమిచ్చారు. ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులతో సొమ్ము సమకూర్చేలా మాట్లాడుకున్నారు. ఈ వ్యవహారంలో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు.. నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారు. చివరికి బండారం బయటపడింది. ఎంత ఖర్చయినా సరే సాధ్యమైనన్ని ఓట్లు సంపాదించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన బాబుకు వచ్చిందని.. దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందని టీటీడీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు బాగా పనిచేస్తున్నావంటూ రేవంత్‌ను చంద్రబాబు అభినందించారని చెబుతున్నారు. ఈ ఒక్క ఎమ్మెల్సీని గెలిపిస్తే తెలంగాణ టీడీపీలో తనకిక తిరుగుండదని సన్నిహితుల వద్ద గొప్పలు పోయిన రేవంత్ అత్యుత్సాహమే కొంప ముంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
నేడు స్టీఫెన్సన్ వాంగ్మూలం
- కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించనున్న ఏసీబీ - ఆడియో, వీడియో రికార్డులపై నివేదికను కోర్టుకు సమర్పించనున్న ఎఫ్ఎస్ఎల్ - ఇక విచారణ మరింత వేగవంతం - నేడు స్టీఫెన్సన్ వాంగ్మూలం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోమవారం అత్యంత కీలక పరిణామాలు జరుగనున్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది. చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో స్టీఫెన్సన్ వాంగ్మూలం కీలకం కానుంది. రూ.5 కోట్లు లంచం తీసుకుని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేసిన స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఏసీబీ ఇప్పటికే కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ సోమవారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో తనను ఎవరెవరు, ఏవిధంగా ప్రలోభపెట్టారు, ఎవరెవరు, ఏ హామీలిచ్చారన్న వివరాలను స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశముంది. చంద్రబాబు తనతో ఎప్పుడు, ఎవరి ద్వారా ఫోన్లో మాట్లాడారో చెప్పనున్నారు. ఇక రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్లు ఉపయోగించిన ఫోన్ల కాల్ డేటా, స్టీఫెన్సన్ ఫోన్లో రికార్డయిన సంభాషణలు, రహస్య కెమెరాల వీడియో ఫుటేజీలను ఇప్పటికే కోర్టు ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నుంచి ప్రాథమిక నివేదిక ఇప్పటికే ఏసీబీకి అందింది. పూర్తిస్థాయి నివేదికలను ఎఫ్ఎస్ఎల్ సోమవారం కోర్టుకు సమర్పిస్తుందని అధికారవర్గాలు చెప్పాయి. ఈ నివేదిక కోర్టుకు అందితే విచారణ మరింత వేగవంతం కానుంది. -
‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్
- అవకాశం ఉన్న అంశాల్లో కేసుల నమోదుకు నిర్ణయం - పాత విషయాలు తిరగదోడమని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు - కేసీఆర్, తెలంగాణ అధికారులపై ఏపీలో నమోదైన 70 కేసులు - వీటిలో నోటీసుల జారీకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని స్పష్టీకరణ - తనకు ‘నోటీసులు జారీ’ అంశంపై రాష్ట్ర ఏసీబీ అధికారులతో చర్చ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో పీకల్లోతున కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడి (కౌంటర్ ఎటాక్)కి దిగాలని యోచిస్తున్నారు. వీలున్నంత వరకు తెలంగాణ సర్కారు, నేతలను ఇబ్బందులకు గురిచేయాలని వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నుంచి తనకు నోటీసులు రావడానికి ముందే దీన్ని కార్యరూపంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏపీ సీఎం ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఈ మేరకు తనకు నోటీసులు జారీఅయ్యేలోపే తెలంగాణ నేతలు, అధికారులపై కేసుల నమోదుకు గల అవకాశాలను పరిశీలించాలని కోరినట్టు సమాచారం. మరోవైపు తనకు నోటీసులు జారీ అయిన పక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై వరుసగా మూడోరోజూ రాష్ట్ర ఏసీబీ అధికారులతో సీఎం చర్చించారు. అన్నీ సిద్ధం చేయండి... ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు సీఎం చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతుండటంతో కౌంటర్ ఎటాక్‌పై ఆయన దృష్టి పెట్టారు. ఈ నోటీసులు జారీ అయ్యేలోపే తెలంగాణ నేతలు, అధికారులపై కేసుల నమోదు అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారుల్ని సీఎం ఆదేశించారు. ‘ఓటుకు నోటు’ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తరవాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలు, అధికారులపై టీడీపీ శ్రేణులు, నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తును సాకుగా చూపి ఆయా నేతలు, అధికారులకు నోటీసులు జారీ చేసే అంశాలను పరిశీలించడంతోపాటు జారీ చేసే అవకాశముంటే వాటిని సిద్ధం చేసి ఉంచాల్సిందిగా సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణకు చెందిన నేతలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై గతంలో ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఏవైనా కేసులు నమోదై ఉన్నాయా? ప్రస్తుతం అవి ఏ స్థితిలో ఉన్నాయి? తదితర అంశాలనూ ఆరా తీసి సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఆయా కేసులకు సంబంధించిన బాధితులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలను సిద్ధం చేయడంతోపాటు తాజాగా వారితో ఫిర్యాదులు చేయించి... తెలంగాణకు చెందిన వారిపై కేసులు నమోదు చేయడానికున్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. నోటీసులు జారీ అయితే ఏం చేద్దాం.. ఇదిలా ఉండగా ‘ఓటుకు నోటు’ కేసులో నోటీసులు జారీ అయితే అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రాష్ట్ర ఏసీబీ అధికారులతో చర్చించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని (సీఆర్పీసీ 164 స్టేట్మెంట్) తెలంగాణ ఏసీబీ అధికారులు సోమ, మంగళవారాల్లో మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసే అవకాశముంది. దీంతోపాటు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెలుగులోకొచ్చిన వివరాలు, కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాలతో న్యాయస్థానంలో సమగ్ర నివేదిక సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫోన్ సంభాషణల ఆడియో టేపుతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతోపాటు మరికొందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు అనుమతి కోరుతూ మెమో దాఖలు చేసేందుకు తెలంగాణ ఏసీబీ కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసే అవకాశముంది. దీంతో వీటిని ఎదుర్కోడమెలా? అనే అంశాలపై ఆయా అధికారులు, న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చించినట్టు తెలిసింది. -
బాబు ప్రమేయాన్ని నమ్ముతున్నాం
- ఓటుకు నోటు స్కాంపై కిషన్‌రెడ్డి - ఆయన ప్రమేయం టేపులతో సహా ప్రజల ముందు కనిపిస్తోంది - దీనిపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కమిటీకి నివేదిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయమున్నట్లు టేపులతో సహా ప్రజల ముందు కనిపిస్తోందని... దాన్ని తాము కూడా విశ్వసిస్తున్నట్లు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోవాల్సిందేనని, తప్పు చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం కాపాడబోదని స్పష్టం చేశారు. దోషులుగా ఎవరు తేలితే వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. పార్టీ నేతలు ఎస్.మల్లారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డిలతో కలసి శనివారం విలేకరుల సమావేశంలో, అనంతరం ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఓటుకు నోటు కేసు విషయమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమ పార్టీ కేంద్ర కమిటీకి నివేదిస్తున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం కూడా నివేదికలు తెప్పించుకుంటుందని, ఈ విషయంలో చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చే నివేదికలపై ఆధారపడటంలేదన్నారు. ఈ కేసు విషయమై కేంద్రం ఎక్కడా తొందరపాటుకు గురికాకుండా విచక్షణతో వ్యవహరిస్తోందన్నారు. గవర్నర్ కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపుతున్నారన్నారు. పార్టీపరంగా తాము చెప్పాల్సింది చెబుతున్నట్లు వివరించారు. అంతిమంగా తప్పు ఎవరూ చేసినా బీజేపీ ఉపేక్షించబోదని, అలాంటి వారికి భరోసా ఇవ్వబోమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే కొన్ని పార్టీల నాయకులు వారికి నచ్చిన మాదిరిగా మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కేసులో అంతిమంగా న్యాయం వెలువడుతుందన్నారు. కాగా, ఈ కేసును కొన్ని రాజకీయ పార్టీలు ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుతున్నాయని... దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. రాజకీయంగా ప్రజలను విద్వేషపూరితం చేసి పబ్బం గడుపుకునే పరిస్థితి కల్పించడం మంచిదికాదన్నారు. యోగాను వ్యతిరేకించడం తగదు.... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం దేశాలు కూడా యోగాను అభ్యసించాలని నిర్ణయిస్తుంటే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం రాష్ట్రంలో యోగాను వ్యతిరేకించడం తగదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. యోగా మతపరమైన కార్యక్రమం కాదని, యోగాకు మతం రంగు పులమరాదని సూచించారు. -
గుబులు.. గుబులుగా ఆ ఎమ్మెల్యేలు!
గులాబీ ఎమ్మెల్యేల గుండెలు అదురుతున్నాయి.. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోను సంభాషణలు రికార్డయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వణుకుడు ఎందుకనుకోవద్దు సుమా.. వీరిలో కొందరు టీడీపీ జరిపిన బేరసారాల్లో ఉన్న వారే. అందుకే ఈ భయమంతా..! ఎమ్మెల్సీ ఎన్నికలు తమ ప్రాణం మీదికి తెచ్చాయని లబోదిబో మంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు వల విసరడం.. పేరాశతో కొందరు వారికి చిక్కడం చక చకా జరిగిపోయాయి. నేరుగా సంప్రదించడమే కాదు.. ఫోన్లలోనూ ఓటు క్రాసింగుపై ముచ్చట్లు నడిచాయి. ఇంకేముంది .. తమ ఫోన్లూ రికార్డు అయ్యాయేమో ..? తమ జాతకాలు అధినేతకు చేరాయేమో అన్న శంక వీరిని పట్టి పీడిస్తోంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాలకు చెందిన కొందరు గులాబీ ఎమ్మెల్యేలను టీడీపీ బుట్టలో వేసుకుందన్న వార్తలు గుప్పుమనడంతో .. ఎక్కడ తమ వ్యవహారం బట్టబయలు అవుతుందోనన్న ఆందోళన వీరిని స్థిమితంగా ఉండనీయడం లేదు. ఒక వేళ ఇవేవీ బయటకు రాకున్నా.. అధినేత వద్ద ఉన్న తమ జాతకాలు ఎక్కడ తమ తలరాతలను మారుస్తాయోనని బెంబేలెత్తుతున్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నవారే కాదు... ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేల్లోనూ ఈ ఆందోళన కనిపిస్తోంది...!! -
‘బాబుగారు మాట్లాడతారు’
-
ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు
- రేవంత్ సహా నిందితుల సెల్ఫోన్లు, ఆడియో, వీడియో టేపులు కూడా - ఏసీబీ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు - బాబు సంభాషణపై నిగ్గుతేల్చనున్న ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు - 2, 3 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు బాగోతం రెండు, మూడు రోజుల్లో బట్టబయలుకానుంది! ఈ కేసులో ఏసీబీ అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో సీడీలతోపాటు నిందితులైన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సీసీటీవీ రికార్డులు, కంప్యూటర్ పరికరాలను విశ్లేషణ కోసం ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపింది. ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు పంపిన వాటిలో రాజకీయ ప్రముఖులు మాట్లాడినవిగా చెబుతున్న 14 ఆడియో టేపులు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా స్టీఫెన్సన్ సోదరుడి ఇంట్లో నడిచిన రూ. 5 కోట్ల డీల్ తతంగం, రూ. 50 లక్షల అడ్వాన్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీలు, రేవంత్‌రెడ్డితోపాటు మిగతా ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపారు. నిందితులతో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ వివిధ సందర్భాల్లో మాట్లాడేందుకు వాడిన మొబైల్‌ఫోన్ సహా 21 ఫోన్లు, 3 సోనీ డిజిటల్ రికార్డర్లు, సీపీయూ, హార్డ్‌డిస్క్‌లను పరీక్షల కోసం పంపించారు. దీంతో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన మాటలపై చంద్రబాబు అండ్ కో చెపుతున్నట్టుగా ‘ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను తెచ్చి అతికించారా... చంద్రబాబే మాట్లాడారా ...’ అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చనున్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి, చినబాబు లోకేశ్, ఎంపీలు, తెలుగుదేశం పోషకులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు మాట్లాడిన రికార్డుల నాణ్యతను కూడా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వనున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వ చ్చాక కూడా రికార్డుల్లో ఉన్న మాటలు తమవి కావంటే సంబంధిత వ్యక్తుల మాటలను మరోసారి రికార్డు చేసి నిజాలను బహిర్గతం చేస్తారు. సోమవారం నాటికి వీటికి సంబంధించిన నివేదిక రావచ్చని ఓ అధికారి తెలిపారు. స్టీఫెన్సన్ స్టేట్మెంట్ సేకరించే పనిలో.. చంద్రబాబు ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి అండ్ కో తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాతపూర్వకంగా ఏసీబీని ఆశ్రయించి ఓటుకు కోట్ల కేసును తెరపైకి తెచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. సోమవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసు తీవ్రతను కోర్టు ముందు ఉంచేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ న్యాయమూర్తికి సమర్పించాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శని, ఆదివారాల్లో స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చే సి సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. పసుపు శిబిరంలో ఆందోళన... ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఆయన జైలుపాలైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రూ. 50 లక్షలు తీసుకెళ్లారని స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ రికార్డులతో తేటతెల్లమైంది. ఫోన్ రికార్డులు బయటపడ్డప్పటి నుంచి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పొంతన లేకుండా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల చుట్టూ చెక్కర్లు కొడుతున్నా పసుపు శిబిరంలో ఆందోళన మాత్రం తగ్గలేదు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన రికార్డింగ్‌లతోపాటు ఆయన తనయుడు లోకేశ్ నాలుగో నిందితుడుగా ఉన్న మత్తయ్యతో మాట్లాడిన రికార్డులు కూడా ఏసీబీ వద్ద ఉన్నట్లు తేలడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
‘బాబుగారు మాట్లాడతారు’
- ‘బాస్’తో మాట్లాడించింది ఓ కేంద్ర మంత్రి సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా సాగించిన బేరసారాల్లో ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి భాగస్వామ్యం బయటపడింది. ఎమ్మెల్యేలతో మాట్లాడడం దగ్గరి నుంచి కొనుగోళ్లకు సొమ్మును సమకూర్చేదాకా ఆయన కీలకపాత్ర పోషించినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో కీలక వ్యక్తిగా పరిగణించే ఈ కేంద్ర మంత్రి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసింది. అంతేకాదు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘బాబుగారు మాట్లాడుతారు' అంటూ మాట్లాడించిందీ ఆ కేంద్ర మంత్రేనని గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆ కేంద్ర మంత్రి భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఆడియో, వీడియోలతో కేంద్ర హోంశాఖకు ఏసీబీ ఒక నివేదిక అందజేసినట్లు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచమిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రికి భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ దూత నేరుగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరవేసినట్లు అత్యున్నత అధికారవర్గాల సమాచారం. ఈ ఆధారాల మేరకు ఆ కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రేవంత్ అరెస్టు కావడానికి కొద్ది గంటల ముందు ఈ కేంద్ర మంత్రి పలు దఫాలుగా స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఆ క్రమంలోనే ‘బాబుగారు మాట్లాడుతార’ంటూ స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడించింది ఈ కేంద్ర మంత్రేనని ఆడియో రికార్డులను పరిశీలించిన ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. బాబుకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో ఈ కేంద్ర మంత్రిని కూడా కీలక వ్యక్తిగా పరిగణిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5కోట్ల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తుగా రూ.50 లక్షల చొప్పున అడ్వాన్స్‌గా ఇచ్చే వ్యవహారంలో ఈ కేంద్ర మంత్రిది కీలకపాత్ర అని ఏసీబీ నిర్ధారించింది. పోలింగ్‌కు రెండురోజుల ముందు.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ కేంద్ర మంత్రి పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. అనుమానం వచ్చిన కొందరు ఎమ్మెల్యేల కాల్‌డేటాను తీసుకుని పరిశీలించిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా విచారణ జరిపిన ఏసీబీ ఆ కేంద్ర మంత్రికీ భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చింది. ఈ కేంద్ర మంత్రి తన గన్‌మెన్, వ్యక్తిగత సిబ్బం దితో పాటు ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో పనిచేసే సిబ్బంది, చంద్రబాబు అధికారిక నివాసంలో పనిచేసే సిబ్బంది ఫోన్ల ద్వారా ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించారు. పోలింగ్‌కు 4 రోజుల ముందు నుంచి ఈ కేంద్ర మంత్రి ఎవరి ఫోన్ల ద్వారా ఏయే ఎమ్మెల్యేతో ఎంత సేపు మాట్లాడారన్న పూర్తి వివరాలు ఏసీబీ కేంద్రానికి అందజేసిన నివేదికలో ఉన్నాయి. ఇద్దరు సహచర రాజ్యసభ సభ్యులతోనూ ఆయన మంతనాలు జరిపారని, డబ్బు సమకూర్చేందుకు ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలతోనూ మాట్లాడారని పేర్కొన్నట్లు తెలిసింది. ఆయన ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసిన తీరుపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీ ఒకరు ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంతో కలిసి ఫైవ్‌స్టార్ హోటల్‌కు.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు అంటే రేవంత్ అరెస్టు కావడానికి కొద్ది గంటల ముందు చంద్రబాబుతో కలసి ఈ కేంద్ర మంత్రి 2 గంటల పాటు మాదాపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేసిన టీడీపీ-బీజేపీ శాసనసభ్యులతో గడిపారు. ఏసీబీ ఆ హోటల్ నుంచి వీడియో ఫుటేజీలను సేకరిం చింది. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడమే కాకుండా నిధుల సేకరణకూ ఈ కేంద్ర మంత్రి తన పలుకుబడిని వినియోగించారని ఏసీబీ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో వివరించింది. ఆయన తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ల ద్వారా టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడారని నిరూపించేందుకు కాల్‌డేటాను నివేదికకు జత చేసింది. దాంతోపాటు మే చివరివారంలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను.. కేసులో రెండో నిందితుడు సెబాస్టియన్ తమ కస్టడీలో వెల్లడించిన అంశాలను, కేంద్ర మంత్రికి సంబంధించి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా నివేదికకు జతచేసింది. రేవంత్ గన్మెన్లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ పలుమార్లు కేంద్ర మంత్రి ప్రస్తావన వచ్చింది. మే చివరివారంలో రేవంత్, కేంద్ర మంత్రి ఎన్నిసార్లు కలిశారు వంటి వివరాలు వారి వాంగ్ములంలో ఉన్నాయి. -
'బాబును ఏ1, రేవంత్ ను ఏ2 గా చేర్చాలి'
నల్గొండ: ఓటుకు రూ. 5 కోట్ల కేసులో చంద్రబాబునాయుడిని ఏ-1 ముద్దాయిగా, ఈ ఘటనతో సంబంధమున్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో షర్మిల మలివిడత పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గవర్నర్, రాష్ట్రపతిలను ఇప్పటికే కలిసి ఫిర్యాదు చేశారన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెప్పడం కాదని, తక్షణమే ఆ పని చేయాలని, చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చి, అరెస్టు చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఒక పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి మారే అంశానికి కూడా తక్షణమే పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రేవంత్‌రెడ్డిని ఏ-2 ముద్దాయిగా, ప్రలోభాలతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలన్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి సరిగా వ్యవహరించాలని పొంగులేటి అన్నారు. (చౌటుప్పల్) -
ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
* ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రుల హాజరు * మీడియాకు అనుమతి నిరాకరణ * బెయిల్ గడువు ముగిసిన అనంతరం జైలుకు రేవంత్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్‌పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు కానీయలేదు. కేవలం కెమెరాలను మాత్రమే కాసేపు అనుమతించి బయటకు పంపారు. ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్... పోలీస్ ఎస్కార్ట్ అనుసరించగా పార్టీ నాయకులు, అభిమానుల కోలాహలం మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం 8 గంటలకు భార్య గీత, కుమార్తెతో కలసి నిశ్చితార్థ వేదికకు చేరుకొని 10 గంటల వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిశ్చితార్థానికి హాజరైన అతిథులను పలకరిస్తూ గడిపారు. నిశ్చితార్థానికి హాజరైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ.. రేవంత్‌రెడ్డి దంపతులు, నిశ్చితార్థం జరుగుతున్న నైమిష, సత్యనారాయణరెడ్డిలతో ఆత్మీయంగా గడిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, బి.కె. పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, దానం నాగేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సినీనటి కవిత తదితరులు హాజరై రేవంత్ కుమార్తెను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసిన రేవంత్... 3 గంటలకు తిరిగి నివాసానికి చేరుకున్నారు. గంటసేపు కుటుంబ సభ్యులతో గడిపిన రేవంత్‌రెడ్డి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బెయిల్ గడువు ఉండటంతో ఆలోపే తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లారు. -
రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం
-
ఆ మసి మనకెందుకు....?
-
'బాస్' పక్కన రేవంత్
హైదరాబాద్ : ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'బాస్' పక్కన కూర్చున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయి తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డి తొలిసారిగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. తన కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన చంద్రబాబు పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నారు. అయితే వాళ్లిద్దరూ చిరునవ్వు నవ్వడమే తప్ప...పలకరించుకోలేదు. కాగా రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా ఆయనకు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని సూచించింది. విచారణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయరాదని స్పష్టం చేసింది. దాంతో కోర్టు నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన అతిథులను పలకరించలేకపోయారు. మరోవైపు సివిల్ డ్రెస్‌లో ఏసీబీ అధికారులు నిఘా కొనసాగింది. రేవంత్ కదలికలపై వారు దృష్టి పెట్టారు. బెయిల్ మంజూరు చేస్తాం, కానీ రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించిన విషయం తెలిసందే. -
నిఘా నీడలో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్థం గురువారం నిఘా నీడలో జరిగింది. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రేవంత్ ఏకైక కూతురు నైమిశరెడ్డి నిశ్చితార్థం సత్యనారాయణరెడ్డితో జరిగింది. భీమవరానికి చెందిన వెంకట్‌రెడ్డి, లక్ష్మీపార్వతి కుమారుడు సత్యనారాయణ ఫారెన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. రేవంత్ కూతురు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, లోకేష్, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తదితరులు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు. మరోవైపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం చర్లపల్లి జైలు నుంచి రేవంత్ నేరుగా ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కుమార్తెతో కలిసి... నేరుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం నిఘా నీడలోకి వెళ్లింది. సివిల్ డ్రెస్‌లో ఏసీబీ అధికారులు రేవంత్‌ను పరిశీలించారు. బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు నిశ్చితార్థం వేడుకలో నేతలెవరితోనూ మాట్లాడవద్దని రేవంత్ ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
నిఘా నీడలో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
-
ఎన్ కన్వెన్షన్ హాల్‌కు రేవంత్ రెడ్డి
-
ఎన్ కన్వెన్షన్ హాల్‌కు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కుమార్తె నిశ్చితార్థం సందర్భంగా ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి ఉదయం 6గంటలకు బయటకు వచ్చారు. మీడియా సహా రాజకీయ నేతలను కలవకూడదని షరతులు విధించడంతో ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆయన కుమార్తె నిశ్చితార్థం జరగనుంది. తన ఇంటి వద్ద నుంచి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డితో కలిసి నిశ్చితార్థ వేదికకు బయల్దేరారు. -
ఎదురుదాడిలో దొరికిపోయిన బాబు
-
తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు. కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్న ఆయనకు అభిమానులు పూలతో స్వాగతం పలికారు. -
దొరికిన దొంగ.. బాబు: కేసీఆర్
- ఏపీ సీఎంపై కేసీఆర్ ఫైర్ - దేశంలోనే అత్యంత వరస్ట్ అవినీతిపరుడు - పీకల్లోతు ఊబిలో ఇరుక్కున్నడు - ఎమ్మెల్యేల కొనుగోళ్లకు స్వయంగా ఐదు టీడీపీ ముఠాలను రంగంలోకి దించిండు - వాటిలో రేవంత్ ముఠా పట్టుబడింది - మేమెవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదు - ఫిరాయింపుల చట్టం టీడీపీకి వర్తించదా? - బాబును, టీడీపీ దొంగలను కేంద్రం కాపాడుతుందనుకోనన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘చంద్రబాబు దొరికిన దొంగ. ఆయన దేశంలోనే అత్యంత వరస్ట్ అవినీతిపరుడు. పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబును, ఎమ్మెల్యే కొనుగోళ్లలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ దొంగలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని అనుకోవడం లేదు. ఏపీ సీఎం ప్రయత్నాలు చూసి రాష్ర్ట ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్న సందేహంతో చర్యలు తీసుకున్నాం. పార్టీని కాపాడుకున్నాం. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం రాత్రి కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చేసిందంతా చేసి అరిచి, పెడబొబ్బలు పెడుతున్న దొంగలను కేంద్రం కాపాడుతుందని అనుకోవడం లేదని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. ‘‘చాలా ఉంది బాగోతం. అదంతా ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతా.. తెలంగాణ ప్రభుత్వాధినేతగా నాకు వచ్చే సమాచారం నాకు వస్తది.. నేను ఏది చెప్పాలి.. ఏది చెప్పకూడదు వేరే విషయం.. చంద్రబాబు పీకల్లోతుల్లో కూరుకుపోయి ఉన్నడు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని వివరించిన ఆయన.. రేవంత్ వ్యవహారం బయటపడిన తర్వాతే ఫోన్లు ట్యాప్ అయిన విషయం బాబుకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు పెద్ద గొంతుతో అరిస్తే అయిపోదు. ఫిరాయింపులు మీకు వర్తించవా? ఎస్పీవెరైడ్డి ఏ పార్టీలో గెలిచాడు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు. కొత్తపల్లి గీత ఏ పార్టీ.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోలేదా? నువ్వు చేర్చుకుంటే నీతి.. ఇతరులది కాదా? వీరంతా టీడీఎల్పీ సమావేశాలకు హాజరు కావడం లేదా? నీతివంతునివే అయితే, ముందు వీటికి సమాధానం చెప్పు’ అని సీఎం నిలదీశారు. నామినేషన్ల దాఖలు నాటికే మూడు పార్టీలను సంప్రదించి తమకున్న సంఖ్యను బట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగామన్నారు. అయితే చంద్రబాబుకు ఉన్నది 16 ఓట్లే అయినా ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది ఎవరు.. ఎన్నికల్లో చివరకు ఏం జరిగింది.. నోట్ల కట్టతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తర్వాతే ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొచ్చిందా’’ అని ప్రశ్నించారు. టేపుల్లో ఉన్నది ఆయన గొంతు కాదా? ‘చంద్రబాబు పలువురు నేతలతో మాట్లాడారా లేదా? స్టీఫెన్సన్కు రేవంత్ డబ్బిచ్చాడా లేదా? చంద్రబాబు కూడా స్టీఫెన్‌తో మాట్లాడాడా.. లేదా? ఏసీబీకి స్టీఫెన్సన్ ఫిర్యాదు చేశాకే కదా.. ఏసీబీ రంగంలోకి దిగింది. ట్యాపింగ్ చేశారంటాడు.. కట్ అండ్ పేస్ట్ అంటాడు.. అది బాబు గొంతేనా కాదా?’ అని సీఎం కే సీఆర్ నిలదీశారు. చట్టం తనపని చేస్తుందన్న కేసీఆర్.. చంద్రబాబును దొరికిన దొంగ అని అభివర్ణించారు. ‘‘రాజకీయాలను మలినం చేశారు. ఏపీలో చంద్రబాబు బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిండేమో కానీ, ఇక్కడ తెలంగాణ ప్రజల దీవేనతో అధికారంలోకి వచ్చాం. మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పే అధికారం చంద్రబాబుకు ఎక్కడిది? ఏపీలో నువ్వు బీజేపీ మద్దతుతో గెలిచావ్. ఇక్కడ మేం ప్రజాస్వామయ్య బద్దంగా గెలిచాం. నువ్వు కాదు, నీ జేజెమ్మ కూడా ఏం చేయలేదు. మా వెంట్రుక కూడా పీకలేరు’’ అని కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీకి నేనేందుకు వెళ్తున్న..నాకేం ఖర్మ.. ఈ కేసుల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి నాకెవరూ ఫోన్ చేయలేదు. చేస్తరని కూడా నేను అనుకోవడం లేదు. ఇలాంటి ముడుపుల కేసులకు ప్రధాని మోదీ మద్దతిస్తారని నేన నుకోను’ అని ఆయన అన్నారు. ‘‘ఎమ్మెల్యే ఓట్లనే రూ. 5 కోట్లకు కొనుగోలు చేయడం ఎంత నీచమైన విషయం. చేసిన తప్పును కప్పి పుచ్చుకోడానికి ఇంత గతి ఎందుకయ్యా.. సమస్య నీది.. నీ సమస్యను ఇరు రాష్ర్ట ప్రజల సమస్యగా ఎందుకు మార్చుతున్నారని లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ ఇప్పటికే అన్నడు. ఆంధ్ర ప్రజలు ఆంధ్రలో.. తెలంగాణ ప్రజలు తెలంగాణలో సంతోషంగా ఉన్నరు. వాళ్లకు నీ మసిని ఎందుకు పూస్తున్నవయ్యా.. కుమ్మక్కులకు, కుంభకోణాలకు పెట్టిన పేరు చంద్రబాబు. నేను ఓ పోరాటయోధుడిని.. ఎవరో పెట్టిన పార్టీని గుంజుకుని సీఎంను కాలె. నేను ఓ పార్టీ వ్యవస్థాపకుడిని.. నేను దేనికోసమైతే పోరాడానో దాన్ని పొందాను. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నా’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకుంటే తాను కూడా జైలుకు వెళ్లే వాడినన్నారు. అన్నీ బయటకు వస్తాయి.. ‘‘పైసలెక్కడి నుంచి వచ్చినయి..ఎవరెవరితో మాట్లాడారు.. అవన్నీ బయటకువస్తయి. స్టీఫెన్సన్ను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. స్వతంత్ర ఎమ్మెల్యే అయితే పైసలు పెట్టి కొంటవా? వాళ్లు(టీడీపీ నేతలు) చాలా ప్రయత్నం చేశారు. తొలుత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నరు. నాకు సమాచారం వచ్చింది. ఓరే సన్నాసి.. మీ కథ అయిపోయిందని నేను అలర్ట్ చేసిన. వాళ్లు ఎమ్మెల్యేల కాళ్లు చేతులు పట్టుకుని క్యాంపునకు తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మాకు మద్దతివ్వాలని డిసైడ్ అయింది. సీపీఐ, సీపీఎం వాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక తెలంగాణ ఎమ్మెల్యేలను బెదిరించడం, భయపెట్టడం మీకు చేతకాదని.. చంద్రబాబే రంగంలోకే దిగాడు. ఐదు ముఠాలను ఏర్పాటు చేశాడు.. అందులో ఓ ముఠా పట్టుబడింది. మిగిలిన ముఠాలు బొక్కలో ముడుచుకుపోయాయి’’ అని సీఎం కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అతిథివి మాత్రమే.. ‘‘నువ్వు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నువ్వు తెలంగాణలో ఏమీ(నో బడీ) కాదు. మాట్లాడితే ఉమ్మడి రాజధాని అంటావ్. ఇది కేవలం మీకు సదుపాయాలు కల్పించేందుకు ఉన్న రాజధాని మాత్రమే. పదేళ్ల వరకు.. పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. నువ్వు తెలంగాణలో కేవలం అతిథి ముఖ్యమంత్రి. ఏపీలో కార్యాలయాలు లేవు కాబట్టి.. అక్కడ కట్టుకునే వరకు మాత్రమే ఇక్కడ ఉండటానికి అవకాశమిచ్చాం. ఇది నీ హక్కు కాదు. నీ పరిపాలన పరిధిలోకి హైదరాబాద్రాదు. తెలంగాణ ముఖ్యమంత్రి పరిధిలోకి వస్తుంది. ఏపీ డీజీపీ ఏపీ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. కేవలం సదుపాయాలు కల్పించేందుకే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తే దాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణను శాసిస్తావనుకుంటావా?’’ అని చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
కేంద్రం మౌనం..!
- హస్తినలో చంద్రబాబుకు దక్కని భరోసా! - కాపాడాలని ప్రధాని తదితరులను కోరిన ముఖ్యమంత్రి - ఫోన్ల ట్యాపింగ్‌పై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు ఆశించిన భరోసా ఢిల్లీ పెద్దల నుంచి లభించలేదని తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టెలిఫోన్ సంభాషణ ఆడియో టేపులు బయటపడిన నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు బుధవారం వరుసగా కేంద్రంలోని కీలక నేతలందరినీ కలిశారు. అయితే పలు అంశాలకు సంబంధించి ఆయన చేసుకున్న విన్నపాలకు కేంద్రంలోని భాగస్వామ్య ప్రభుత్వం నుంచి ఆశించిన భరోసా లభించలేదని చెబుతున్నారు. బుధవారం ఉదయం కేబినెట్ సమావేశం ఉండడంతో మధ్యాహ్నం తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలను సీఎం కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యతో ఉదయం 8.30 నుంచి 9.30 వరకు భేటీ అయ్యారు. ఓటుకు నోటు పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం కొరియా ప్రతినిధులతో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఒక ప్రైవేటు హోటల్లో సమావేశమైన బాబు.. ఆ తర్వాత పార్టీలోని కీలక నేతలు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడులతో సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ పరంగా కేంద్రంపై ఎలాంటి ఒత్తిళ్లు తేవాలి? ఏయే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి? తదితర అంశాలపై చర్చించారు. సాయంత్రం 4.15కు ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్న చంద్రబాబు దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఓటుకు నోటు సంబంధిత సంఘటనలను సుదీర్ఘంగా వివరించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు పూర్తిస్థాయిలో అప్పగించాలని కోరారు. అలాగే తమ ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి పరికరాలు తెప్పించారని తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8 అమలుపై, ట్యాపింగ్‌పై పరిశీలిస్తామన్న ప్రధానమంత్రి.. బాబును కేసు నుంచి బయటపడేసే అంశంపై మాత్రం మౌనం వహించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానమంత్రి నివాసం నుంచి బయటకు వచ్చిన సమయంలో చంద్రబాబు గంభీర వదనంతో కనిపించారు. ఉదయం నుంచీ తీవ్ర ఒత్తిడిలో కనిపించిన బాబు.. రాత్రి వరకు ఆందోళనతోనే కనిపించారు. రాత్రి 9 గంటలకు ఏపీ భవన్లో విలేకరుల సమావేశం సందర్భంగా.. మీడియా ప్రశ్నలకు అసహనంతో, ఆగ్రహంగా బదులిచ్చారు. టీడీపీ నేతల్లో టెన్షన్: చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో టీడీపీ నేతలంతా టెన్షన్లో కనిపించారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం కలిసిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ప్రధాని ఎలా ప్రతిస్పందించారు? పరిస్థితి ఏమిటని ఇక్కడి నేతలు ఢిల్లీలోని పార్టీ నేతలకు ఫోన్లు చేసి ఆరా తీశారు. -
కేసీఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరిరోజు
- నన్ను ఏ రూల్ కింద అరెస్టు చేస్తారు? - ఉమ్మడి రాజధానిలో నీ పెత్తనమేమిటి? - నేనూ ముఖ్యమంత్రినే.. నాకూ ఆత్మగౌరవం ఉంది - తప్పుడు వీడియోలు సృష్టిస్తే ఊరుకుంటాననుకున్నారా? - ఎన్డీటీవీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: తనను అరెస్టు చేయటానికి సాహసిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి అదే చివరి రోజవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను అరెస్టు చేస్తుందన్న భయం లేదని, ఏ రూల్ ప్రకారం తనను అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బుధవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 63 మంది మాత్రమే ఉన్న పార్టీ ఐదుగురు ఎమ్మెల్సీలను ఎలా పోటీకి పెట్టిందని ప్రశ్నించారు. ఇది నైతికమేనా అని ఆయన అడిగారు. ఎన్నికలు ప్రకటించి.. ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఏదైనా ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి కానీ, ఏసీబీకి ఇందులో తలదూర్చే అధికారం ఎక్కడుందని చంద్రబాబు అన్నారు. ‘ఏసీబీ ఉంది కదా అని ఎవరిపైనైనా దాడులు చేయవచ్చు.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు.. స్టింగ్ ఆపరేషన్ చేయవచ్చు.. మీ టీవీ చానల్లో నాపై ఓ వీడియో తయారు చేసి నా ప్రతిష్టను దిగజార్చవచ్చనుకుంటే కుదరదు. మీ టీమ్.. మీ టీవీ న్యూస్ చానల్ తప్పుడు డాక్యుమెంట్‌ను ప్రసారం చేయటం ఏ రకమైన నైతికత? ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని దర్యాప్తు ఏజెన్సీలకు సమర్పించాలి కానీ టీవీ న్యూస్ చానల్‌కు లీక్ చేస్తారా’’ అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీవీ చానళ్లను, ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవటానికి కలిసి మాట్లాడుకుందామని గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు కేసీఆర్‌ను కోరానని కానీ ఆయన స్పందించనే లేదన్నారు. సమస్యల పరిష్కారం తమ వల్ల కాకపోతే.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేద్దామని.. దాని వల్ల కూడా కాకుంటే కేంద్రం ద్వారా పరిష్కరించుకుందామని ఎన్ని సార్లు చెప్పినా కేసీఆర్ విననే లేదని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఆయనకేం అధికారం ఉందని ప్రశ్నించారు. ‘నీకు పోలీసులుంటే నాకు పోలీసులున్నారు.. నీకు ఏసీబీ ఉంటే.. నా కు ఏసీబీ ఉంది..’ అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అరెస్టు చేస్తుందా అన్న ప్రశ్నకు చంద్రబాబు జవాబిస్తూ.. ‘‘నేనెందుకు భయపడాలి? ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారు? ఒకవేళ అందుకు సాహసిస్తే మాత్రం కేసీఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజవుతుంది. నేను ఎన్నికైన సీఎంని. నాకు ఆత్మగౌరవం ఉంది’’ అని అన్నారు.