సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment