ACB Special court
-
వరంగల్‌లో ఏసీబీ ప్రత్యేక కోర్టు
వరంగల్ లీగల్: వరంగల్‌లో ఏసీబీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో సంతోషపడటమే కాకుండా సమగ్రంగా సద్వినియోగం చేసుకునే విధంగా న్యాయవాదులు తర్ఫీదు పొందాలని అన్నారు. ఏసీబీ కోర్టుతోపాటు హనుమకొండ జిల్లాకు సబ్ కోర్టు, ఉభయ జిల్లాలకు ఈ– సేవా కేంద్రం, రాష్ట్రంలోనే తొలిసారి పాత రికార్డులను భద్రపర్చడం కోసం డిజిటైజేషన్ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఇక్కడ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.వినోద్‌కుమార్, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్‌రావు, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఆనంద్‌మోహన్, శ్యాంసుందర్‌రెడ్డి, సభ్యులు జయాకర్, జనార్ధన్, డాక్టర్ యాకస్వామి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి టీడీపీ లాయర్లు మళ్లీ సమయం కోరగా, మార్చి 11కి విచారణను కోర్టు వాయిదా వేసింది. గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో టీడీపీ న్యాయవాదులు నెట్టుకొస్తున్నారు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నిస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలను కూడా లోకేష్ పట్డించుకోలేదు. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్‌కి నోటీసులు జారీ కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లోకేష్ లెక్కచేయలేదు. నేటి విచారణలో మరోసారి టీడీపీ లాయర్లు వాయిదా కోరారు. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చ్ 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. జ్యోతిని చంచల్గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని జజ్యోతి తరపు నన్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. దీంతో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధింస్తున్నామని కోర్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్ -
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
Nara Lokesh: రెడ్‌బుక్ కేసు విచారణ నేడు
విజయవాడ, సాక్షి: నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటీసులు అందుకోకపోవడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువగళం పేరిట యాత్ర చేపట్టిన నారా లోకేష్.. ముగింపు రోజున పలు ఇంటర్వ్యూల్లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. దీంతో గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్‌ను ఆదేశించింది. మెమోలో ఏముందంటే.. యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. ఆ వాంగ్మూలాలు తప్పేనంటూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. లోకేష్‌పై కోర్టు సీరియస్ రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులును లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో చేసేది లేక రిజిస్టర్ పోస్టులో సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపింది. -
ఏసీబీ కోర్టు సీరియస్..లోకేష్ కు బిగ్ షాక్
-
లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందజేసింది. కాగా యువగళం ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని అన్నారు. ఏసీబీ న్యాయమూర్తి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ తన మెమోలో పేర్కొంది. స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ తదితర కేసులలో అప్పటి సీఎంహోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారు. చదవండి: బెడిసికొట్టిన యువగళం ముగింపు సభ ప్లాన్.. అయితే ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్‌లో పేర్లు రికార్డు చేశానని, తమప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు. 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం లోకేష్ తప్పుబట్టడంపై న్యాయవర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షుల బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్‌కు జారీ చేసిన 41ఏ నోటీసుల్లో పేర్కొన్న షరతులకుcrime in విరుద్దమని సీఐడీ తెలిపింది. -
ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేయాలని నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)ని మంగళవారం ఆదేశించింది విజయవాడ అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు). ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని పిటిషన్లో సీఐడీ కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. -
‘ఫైబర్‌నెట్’ నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని ఆ పిటిషన్లో కోరింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రూ.330 కోట్ల ఫైబర్‌నెట్ మొదటి దశ ప్రాజెక్ట్ కాంట్రాక్టును అప్పటి సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కేటాయించారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఏ–1గా వేమూరి హరికృష్ణ, ఏ–11గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ–25గా చంద్రబాబును పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు ఈ కేసులోని నిందితులకు ఏపీ, తెలంగాణలో ఉన్న ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను రాష్ట్ర హోం శాఖ ఆమోదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాటి అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఆ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ చర్యలు చేపట్టనుంది. ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తులు.. నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల ఇంటి స్థలం, ఆయన డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లో ఉన్న ఓ ఫ్లాట్. మరో నిందితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్, ఆయన భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి. -
ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీఐడీ సోమవారం ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్లోనూ ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలని కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. సీఐడీ ప్రతిపాదనల్లో ఉంది ఏంటంటే.. ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సీఐడీ ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. -
Nov 2nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings & Political Updates 17:30 PM, నవంబర్ 02 2023 BRS పార్టీలో చేరనున్న కాసాని జ్ఞానేశ్వర్ బాబూ.. మీకో దండం.. ► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని ► రేపు ఉదయం బీఆర్ఎస్లో చేరనున్న కాసాని ► గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక ► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. 17:00 PM, నవంబర్ 02 2023 రేపటి దాకా ఆస్పత్రిలోనే చంద్రబాబు.! ► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ► ఉదయం 11 గంటలకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు ► రేపు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు 16:45 PM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై మరో కేసు నమోదు ► టిడిపి హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు ► APMDC ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ ► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు ► ఏ3గా చింతమనేని, ఏ4 గా దేవినేని ఉమ ► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు ► ఇప్పటి వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు ► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు 15:45 PM, నవంబర్ 02 2023 జనసేనలో ఏం జరుగుతోంది? ► పవన్ కళ్యాణ్ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు ► నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? ► పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు? ► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్, దిలీప్ సుంకర ఎందుకు దూరమయ్యారు? ► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ పసుపులేటి పద్మావతి ఎందుకు పార్టీవైపు చూడడం లేదు? ► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ వెనక ఏం జరుగుతోంది? ► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది? ► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యతలేంటీ? 15:25 PM, నవంబర్ 02 2023 నారా వారిది అబద్దాల ఫ్యాక్టరీ : YSRCP ► సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ► పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 15:25 PM, నవంబర్ 02 2023 కాసాని దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన తెలుగుదేశం ► తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని అధిష్టానాన్ని ప్రశ్నించిన కాసాని.! ► మీకో దండం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటేనా అని ప్రశ్నించిన కాసాని ► కాసాని ప్రకటనను ఇప్పటివరకు ఖండించలేకపోతోన్న తెలుగుదేశం అధిష్టానం ► ఎందుకు పోటీ చేయలేకపోతుందో చెప్పలేకపోతోన్న చంద్రబాబు, లోకేష్ ► హైదరాబాద్‌లో చాలా బలంగా ఉన్నామంటూ ర్యాలీలు చేసిన వారు పోటీకి ఎందుకు భయపడ్డారు? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో గత ఎన్నికల్లో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్ కోసం ఎందుకు కుటిల ప్రయత్నాలు ► చంద్రబాబు ఏం చేస్తున్నారో నిన్న ఢిల్లీలో బయటపెట్టిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ► తెలంగాణలో చంద్రబాబును ఎవరూ నమ్మబోరన్న డాక్టర్ లక్ష్మణ్ ► బీజేపీని బ్లాక్మెయిల్ చేసేలా ఉంటోన్న చంద్రబాబు చర్యలు 15:20 PM, నవంబర్ 02 2023 బాబు విడుదల తర్వాత తేడా కొడుతున్న నెంబర్లు ► తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు ► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు ► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్ ► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం ► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు ► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టిడిపి నేతలు ► తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ ఇచ్చేది 10కి మించబోవంటున్న టిడిపి నేతలు ► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టిడిపి నేతలు ► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ 15:15 PM, నవంబర్ 02 2023 భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా? ► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు ► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ ► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను ► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర ► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు? ► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు? ► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా? 14:55 PM, నవంబర్ 02 2023 చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టిడిపి చెప్పిన రోగాల జాబితా ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, నడుము తట్టుకోలేదు, వీపరీతంగా నొప్పి ఉంది : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ ►మరి, వీటన్నింటికి సరైన ట్రీట్మెంట్ ఇప్పుడయినా చేయిస్తున్నారా? : YSRCP ►ఇన్ని సమస్యలున్నా.. చంద్రబాబు 14గంటల పాటు ర్యాలీ చేశారా? : YSRCP 14:35 PM, నవంబర్ 02 2023 మ్యానిఫెస్టోను అలా విజయవంతంగా మరిచిపోయారు.! ► నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టిడిపి, జనసేన గత వారం ఘనంగా ప్రచారం ► అక్టోబర్ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్, పవన్ కళ్యాణ్ ► చంద్రబాబు జైల్లో (అక్టోబర్ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన ► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్ ఇటలీకి జంప్, కోరస్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి జంప్ ► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్ ► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు ► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP 14:29 PM, నవంబర్ 02 2023 స్కిల్ అంతా స్కామే : ఆర్థికమంత్రి బుగ్గన ►విజయవాడలో ఆర్థికమంత్రి బుగ్గన ►స్కిల్ స్కామ్ GST వల్ల బయట పడింది ►2018 లోనే మన రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు ►GST, SEBI, ED విచారణ చేసిన స్కామ్ ఇది ►2017 నుండి ఈ కేసులో విచారణ జరుగుతోంది ►అలాంటి కేసు CID విచారణ చెయ్యకూడదా..? ►అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? ►5 రోజుల్లోనే ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..? ►డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..? ►370 కోట్ల కి డిజైన్ టెక్ ఈరోజు కి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు ►సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది ►అనంతపురం JNTU సెంటర్ లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి ►ఎంత చూసిన ఈ స్కామ్ లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు ►పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి ►కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..? ►విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు 14:12 PM, నవంబర్ 02 2023 పయ్యావులకు బోలెడు అనుమానాలు ►స్కిల్ కేసుపై పయ్యావుల కేశవ్ పరిశోధన ►90%-10% అనేదే కాదని చెబుతున్నారు, మరో 5 రాష్ట్రాలు చేశాయి ►MOUపై తేదీ లేకుండా సంతకం పెట్టారని ఆరోపిస్తున్నారు ►ప్రధాన కంపెనీ జర్మనీలో ఉంది, సీమన్స్ కు మీరు లేఖ రాశారా? ►గ్రాంట్ ఇన్ ఎయిడ్ కు బదులు గ్రాంట్ ఇన్ కైండ్ అని రాసుకున్నారు. పదాలు మార్చినా.. ఆరోపణలు చేస్తారా? ►అయ్యా.. కేశవా.. ఇదే ఆర్గ్యుమెంట్ కోర్టు ముందు వినిపిస్తారా? : YSRCP ►ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే.. 17a ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని ఎందుకు వాదిస్తున్నారు? ►తప్పు చేయలేదు అన్న ఏకవాక్యాన్ని కోర్టు ముందు ఎందుకు వినిపించడం లేదు? 14:09PM, నవంబర్ 02 2023 చంద్రబాబు కేరాఫ్ AIG ►చంద్రబాబుకు వైద్య పరీక్షలు ప్రారంభించిన ప్రత్యేక వైద్య బృందం ►ముందుగా చర్మ సంబంధ వైద్య పరీక్షలు ►దాంతో పాటు సాధారణ పరీక్షలు చేయనున్న వైద్యులు ►వెన్నుముక సంబంధిత వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు 3 నుంచి 4 గంటల సమయం 13:29PM, నవంబర్ 02 2023 టీడీపీ ఖేల్ ఖతం ►చంద్రబాబు ఒక దొంగ.. ప్రజల డబ్బులు దోచేశాడు ►దొంగ అయిన చంద్రబాబు బయటకు వస్తే జనాలు ఏం ఆదరిస్తారు? ►40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేమ్ ఆడుతున్నాడు ►ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు ►అనేక రోగాలు ఉన్నాయి అని కోరితే కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది ►లోకేష్ వల్ల కాకపోవడంతో పురందేశ్వరి బీజేపీ ముసుగులో బాబు కోసం పని చేస్తున్నారు ►టీడీపీ పని అయిపొయింది.. ఇక కోలుకోదు :::విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్లు 12:53PM, నవంబర్ 02 2023 మళ్లీ 4 వారాలకు చంద్రబాబు జైలుకే! ►చంద్రబాబు హయాంలో అడ్డగోలు అవినీతి జరిగింది ►బాబు నిజాయితీపరుడు అయితే జైలుకు ఎందుకు వెళ్లారు? ►కన్ను బాగోలేదనే బెయిల్ ఇచ్చారు ►మళ్లీ నాలుగు వారాల తర్వాత జైలుకు రమ్మన్నారు ►అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర ప్రారంభ సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు ఇదీ చదవండి: బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే! 12:29PM, నవంబర్ 02 2023 ఆధారాలివ్వండి ►ఏపీ హైకోర్టులో సంజయ్, పొన్నవోలుపై పిల్ ►ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ పిటిషన్ ►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? ►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి ►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న ►విచారణ 8వ తేదీకి వాయిదా 12:07PM, నవంబర్ 02 2023 బాబుకు వైద్య పరీక్షలు ►హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సుమారు 4 గంటలు పట్టే అవకాశం 11:54AM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ►అరెస్ట్ తర్వాత నిన్న హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ ►ర్యాలీపై హైదరాబాద్ లో కేసు నమోదు ►ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు ►పనిగట్టుకుని జనసమీకరణ చేపట్టిన తెలుగుదేశం నేతలు ►చంద్రబాబు ర్యాలీ యాత్రలను సమర్థించుకున్న అచ్చెన్నాయుడు 10:30AM, నవంబర్ 02 2023 ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేశ్ ►హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్ ►మరికాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్న చంద్రబాబు ►చంద్రబాబు వెళ్తున్న దృష్ట్యా ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు 08:20AM, నవంబర్ 02 2023 వైద్యపరీక్షలు చేయించుకోనున్న చంద్రబాబు ►ప్రత్యేక విమానంలో నిన్న హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ►జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి ►నిన్న చంద్రబాబును కలిసిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం ►వైద్యుల సూచన మేరకు నేడు ఏఐజీకి ►హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం 07:18AM, నవంబర్ 02 2023 ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ దూకుడు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం ►ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదన ►సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదన ►ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు ►ఈ కేసులో ఎ 1 గా వేమూరి హరికృష్ణ, ఎ 11 గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఎ -25 గా చంద్రబాబునాయుడి పేర్లు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్ కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్ధులు అటాచ్ చేయాలని ప్రతిపాదన ►తుమ్మల గోపీచంద్ మరియు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇల్లులు అటాచ్ ►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్న సీఐడీ ఇదీ చదవండి: చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు 07:13AM, నవంబర్ 02 2023 అదనపు షరతుల పిటిషన్‌పై నిర్ణయం రేపే ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సీఐడీ అనుబంధ పిటిషన్ ►బెయిల్‌కు మరికొన్ని షరతులు విధించాలని కోర్టుకు విజ్ఞప్తి ►బుధవారం కొనసాగిన వాదనలు ► సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న బాబు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ►కోర్టు ఉత్తర్వులను చంద్రబాబు ఉల్లంఘించారని.. జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారన్న సీఐడీ తరఫు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►ప్రత్యేక పరిస్థితుల్లోనే చంద్రబాబుకి కోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చిందని గుర్తు చేసిన ఏఏజీ ► శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామన్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:59AM, నవంబర్ 02 2023 మళ్లీ ఢిల్లీకి వెళ్లిన లోకేష్‌పై సెటైర్లు ►మళ్లీ నిన్న ఢిల్లీకి వెళ్లిపోయిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు మీద ఉన్న కేసులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకేనన్న ప్రచారం ►వ్యక్తిగత పని మీద అని టీడీపీ వివరణ ►నవంబర్ 8న సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై తీర్పు.. 9న ఫైబర్కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►పదుల సంఖ్యలో పిటిషన్లపై చర్చ కోసమేనంటూ ప్రచారం ►మళ్లీ.. అరెస్ట్ భయంతోనేనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు 06:49AM, నవంబర్ 02 2023 చంద్రబాబు కోసం జనాలు.. టీడీపీ నేతల తంటాలు ►జైలు జీవితం తర్వాత కరకట్ట ఇంటి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు ►యథేచ్ఛగా కోర్టు షరతులను ఉల్లంఘించిన చంద్రబాబు ►మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు చంద్రబాబు యాత్రల పేరిట హడావిడి ►నిన్న సాయంత్రం హైదరాబాద్‌కు చేరిక ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా టీడీపీ భారీ ర్యాలీ ►జనసమీకరణలో పోటీ పడ్డ తెలుగుదేశం నాయకులు 06:40AM, నవంబర్ 02 2023 స్కిల్డ్ దొంగ.. చంద్రబాబు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అవినీతికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►సీఎంగా ఉన్న టైంలో ప్రభుత్వ ఖజానా నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ►కొల్లగొట్టిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని ఆధారాలు సమర్పించిన సీఐడీ ►సెప్టెంబర్ 09వ తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్టోబర్ 31 సాయంత్రం మధ్యంతర బెయిల్ మీద విడుదల ►52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ►కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలతో వరుస పిటిషన్లు ►చివరకు ఏపీ హైకోర్టులో స్వల్ఫ ఊరట ►షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ►నాలుగు వారాల తర్వాత.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5గం.లోపు జైల్లో సరెండర్ కావాలని చంద్రబాబుకి ఆదేశం ►కేవలం మానవతా ధృక్పథం.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇస్తున్నామన్న హైకోర్టు ►కంటి సర్జరీ కోసం బెయిల్.. ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనద్దని ఆదేశం ►షరతులు ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక -
Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand Petitions Court Hearings And Political Updates 09:00PM, అక్టోబర్ 27, 2023 మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశాం ►జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. ►మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ►అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ►కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. ►మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది. ►చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. 15:00 PM, అక్టోబర్ 27, 2023 సోమవారం హైకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్.! ► సోమవారం హైకోర్టు సీజే బెయిల్ పిటిషన్‌ను విచారిస్తారన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పిన చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఏ కోర్టు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసిన న్యాయమూర్తి ►చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లూథ్రా 14:50 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల్లో అక్రమాలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ల పై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ లాయర్లు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్ లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►ఏ34గా ఉన్న నారాయణ అకౌంట్ లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరఫు న్యాయవాది 14:40 PM, అక్టోబర్ 27, 2023 జైలు నుంచి రాసిన లేఖలో చంద్రబాబు ఏం కోరారంటే..! ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►జైల్లో నన్ను చంపాలని కొందరు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారు ►నన్ను చంపాలని మావోయిస్టులు లేఖ రాసినట్లు నాకు తెలిసింది ►అసంబద్ధ సంఘటనలను ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ ►తన హత్య కోసం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చంద్రబాబు అనుమానం ► ఆకాశ రామన్న ఉత్తరంలో సంచలన విషయాలు ఉన్నాయన్న చంద్రబాబు ►నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపుకోటకు చెందిన ఓ నిందితుడు పెన్ కెమెరాతో జైలులో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు ►కొందరు ఆగంతకులు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసిరేశారు ►జైలులో మొత్తం 2200 మంది ఉన్నారు, వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులు ►2019 జూన్ 25వ తేదీన నా సెక్యూరిటీని తగ్గించారు ►2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది ►2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరోసారి రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ ►అంగళ్లులో పోలీసులపై టిడిపి కార్యకర్తలు చేసిన దాడిని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు ►అల్లర్లు జరిగేలా తాను ఎలా రెచ్చగొట్టిన విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు ►ప్రతీ బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాడో బయటకు చెప్పని చంద్రబాబు 14:35 PM, అక్టోబర్ 27, 2023 కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►ఏపీ : హైకోర్టులో స్కిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ ►ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 14:20 PM, అక్టోబర్ 27, 2023 పిటిషన్లే పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్య రెండు పిటిషన్ల దాఖలు ►రెండు పిటిషన్లను నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి ►టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై పిటిషన్లు 14:05 PM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు కోసం పిటిషన్ల వెల్లువ ►కోర్టులను ప్రభావితం చేసేలా పిటిషన్లతో వెల్లువెత్తుతున్న చంద్రబాబు మనుష్యులు ►చంద్రబాబు అరెస్ట్ అక్రమ నిర్బంధమని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు 13:45 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డాటా పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడీ కాల్ డేటా అంశంపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ ►కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు ఉద్దేశ్యాలు సరిగా లేవని తెలిపిన CID 13:45 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►వర్ల రామయ్య లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ ►టీడీపీ అకౌంట్స్, ఫండ్స్ వివరాలు సీఐడీ కోరటాన్ని.. సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ 13:25 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై వాదనలు ఇలా.. ►కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై తీర్పు చేసిన ఏసీబీ కోర్టు ►ఈనెల 31వ తేదీన తీర్పు వెల్లడించిన ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం ►చంద్రబాబును విచారించిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుంది ►దర్యాప్తు అధికారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు బయటకి రావు ►మా పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదు ►కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారులు వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదు ►చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు అరెస్టు అక్రమం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ►చంద్రబాబు ని అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు ►ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్ లు, వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదు ►చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు ►చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకి అరెస్టు చేసినట్లు చెప్పారు ►సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ►ఇదే విషయాన్ని హైకోర్టు సమర్ధించింది ►ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్దం ►దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయి ►అందువల్ల కాల్ డేటా రికార్డు పిటీషన్ కొట్టివేయాలి 13:15 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల కేసు.. ఏసీబీ కోర్టులో వాదనలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాదులు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►గురునానక్ కాలనీలోని ఎస్బీఐలో ఉన్న ఏ34 గా ఉన్న నారాయణ అకౌంట్లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరపు న్యాయవాది ►మధ్యాహ్నం నుండి వాదనలు కొనసాగే అవకాశం 12:20 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా పిటిషన్ తీర్పు రిజర్వ్ ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►తీర్పు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 12:06 PM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్‌పై మొదలైన వాదనలు ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ►మొదలైన వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 12:00 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►చంద్రబాబు ను అరెస్టు చేసి జైలుకు పంపించటం అక్రమ నిర్భమేనని వాదన ►హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన హైకోర్టు 11:45 PM, అక్టోబర్ 27, 2023 నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు ►జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో ప్రస్తావన ►తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు ►మావోయిస్టులు తనను చంపాలని లేఖ రాసినట్లు నాకు తెలిసింది(లేఖలో చంద్రబాబు) ►అసంబద్ధ సంఘటనల్ని ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►ఈ నెల 25న లేఖ రాసిన చంద్రబాబు 11:22 AM, అక్టోబర్ 27, 2023 ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ ►ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ►ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గురువారం రాత్రి హాజరైన మంత్రి అంబటి ►అంబటి బస చేసిన హోటల్‌ను ముట్టడించి చంద్రబాబు నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు ►అంబటి కాన్వాయ్‌పైకి 10 మంది కుర్రాలు కర్రలతో దూసుకొచ్చిన వైనం ►పోలీసుల ఎంట్రీతో తమ్ముళ్ల పరుగులు 10:58 AM, అక్టోబర్ 27, 2023 ప్లీజ్ ప్లీజ్.. సోమవారం దాకా వద్దు ►స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►నాట్ బిఫోర్ మీ అనేసిన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►బిత్తరపోయిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారని చెప్పిన న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా తాము విజ్ఞప్తి చేసుకుంటామన్న లాయర్లు ►విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్‌కే వదిలేసిన న్యాయమూర్తి 10:50 AM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ ►బాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్ లూథ్రా ►నాట్ బిఫోర్ మీ అనేసిన న్యాయమూర్తి ►వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని వెల్లడి ►ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి ►మరో జడ్జి ముందుకు వెళ్లనున్న చంద్రబాబు పిటిషన్ 10:46 AM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్లో బాబు లాయర్ల వాదన ఇది ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదన ►సీఐడీ తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ►కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై నిన్న(అక్టోబర్ 26, గురువారం) కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడి న్యాయవాదులు ►అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడీ ►ఇరువర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డ్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న విచారణ 10:23 AM, అక్టోబర్ 27, 2023 అత్యవసర విచారణ లేదు ►అనారోగ్యం పేరుతో హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ►వెంటనే విచారించాలంటూ హౌజ్‌మోషన్ ద్వారా హైకోర్టును కోరిన చంద్రబాబు లాయర్లు ►అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్ బెంచ్ 09:05 AM, అక్టోబర్ 27, 2023 నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 08:17 AM, అక్టోబర్ 27, 2023 బాబుకి కంటి సర్జరీ అవసరం లేదు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని జైలు అధికారులకు చెప్పిన చంద్రబాబు ►చంద్రబాబు పరీక్షించిన రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు ►ఇప్పటికిప్పుడు కంటి సర్జరీ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ వైద్యుడు ►ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేసిన జైలు అధికారులు 07:15 AM, అక్టోబర్ 27, 2023 తాత అవినీతి గురించి దేవాన్ష్‌కు చెప్పలేదా భువనేశ్వరమ్మా? ►తాత చంద్రబాబు ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడట! ►కానీ, స్కిల్ అవినీతితో అరెస్టై జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదట ►తాత విదేశాలకు వెళ్లారని భువనేశ్వరి చెబుతోందట ►నన్నపనేని రాజకుమారి ఈ ప్రశ్న అడగడం.. దానికి భువనేశ్వరి ఇలాంటి సమాధానం ఇవ్వడం ►‘నిజం గెలవాలి’ యాత్రలో తిరుపతిలో ఇలాంటి విచిత్రమైన డిబేట్ నడిచింది మరి! ► చంద్రబాబు అరెస్టు తర్వాత దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమే అండగా నిలిచారని భువనేశ్వరి చెబుతుండడం గమనార్హం 07:03 AM, అక్టోబర్ 27, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ► గతంలోనే పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు ► ప్రతివాదుల్ని మెన్షన్ చేయకపోవడంతో మళ్లీ పిటిషన్ వేయాలని జడ్జి సూచన ►జడ్జి సూచనతో తిరిగి ఫైల్ చేసిన చంద్రబాబు లాయర్లు ►పిటిషన్‌పై గురువారం(26వ తేదీన) ఏసీబీ కోర్టులో విచారణ.. శుక్రవారానికి వాయిదా ► పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన ► పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు 06:55 AM, అక్టోబర్ 27, 2023 హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ► నేడు విచారణ చేపట్టనున్న దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ►న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా లిస్టింగ్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరణ ► హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ►ఈ నెల 19న విచారణ జరిపి వెకేషన్ బెంచ్‌కు కేటాయించిన హైకోర్టు ధర్మాసనం ►చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు అధికారుల్ని ఆదేశించిన కోర్టు 06:42 AM, అక్టోబర్ 27, 2023 వివిధ కోర్టులో బాబు పిటిషన్ల పరిస్థితి ఇది ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న 06:35 AM, అక్టోబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @48 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 48వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూథ్రా వాదనలు పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను నవంబర్ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసిన ధర్మాసనం ఆ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్‌నెట్ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును నవంబర్ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా.. తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు ముందుకు జరపాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని.. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. సెక్షన్17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ప్రస్తావన ఉండబోదని.. నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది. ఇదీ చదవండి: అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు మరోవైపు ఫైబర్ నెట్ కేసు పిటిషన్‌ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకూ ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి వస్తే.. అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఏసీబీ కోర్టులోనూ.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్‌ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్ ఫార్మట్‌లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. ►కాల్ డేటా రికార్డింగ్స్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించగా.. ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు -
Oct 20th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates 20:49, అక్టోబర్ 20, 2023 మనసంతా బాబే.! ► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే ► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు? ► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది? 19:49, అక్టోబర్ 20, 2023 రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు ► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు 19:39, అక్టోబర్ 20, 2023 యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ? ► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం? గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని? పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది? పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు? అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు 19:19, అక్టోబర్ 20, 2023 ముఖ్యమంత్రి ఆశలకు మంగళం ► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్ ► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం ► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే ► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు ► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి ► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి ► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది ► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం ► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది ► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు ► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు ► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా ► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే ► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా ► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా 18:18, అక్టోబర్ 20, 2023 2 ములాఖత్ లకు ఓకే ►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్‌లను ఒకటికి కుదించిన జైలు అధికారులు ►లీగల్ ములాఖత్‌లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్‌లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు ►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు 17:20 అక్టోబర్ 20, 2023 నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు ►ఏసీబీ కోర్టులో ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా ►పైబర్‌నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా ►సుప్రీంకోర్టులో ఫైబర్‌నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో ►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా ►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి 15:10, 20 అక్టోబర్ 20, 2023 హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఖాళీ ►బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్ఎస్: రావుల ►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు 14:05 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా ►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం ►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 13:55 అక్టోబర్ 19, 2023 టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం ►చంద్రబాబు అరెస్ట్‌తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్ ►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ ►సగం సినిమా షూటింగ్‌లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్‌ను నెట్టేసిన పవన్ ► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి ►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం ►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట ►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు 13:34 అక్టోబర్ 19, 2023 స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత! డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు.. ►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు ►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు? ►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా! ► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు ►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే ►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. - మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5 — YSR Congress Party (@YSRCParty) October 20, 2023 13:06 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ ►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు ►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు 12:55 అక్టోబర్ 19, 2023 ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్ ►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్ ►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్‌పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు ►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి ►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి ►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు ►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ ►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం ►పవన్ కల్యాణ్‌కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి ►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి ►టీడీపీ రెబల్స్‌కు జనసేనలోకి పంపకూడదు ►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి ►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి 12:32 అక్టోబర్ 19, 2023 లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి ►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు ►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు ►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు ►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు ►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు ►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి ►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 11:22 అక్టోబర్ 19, 2023 క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు ►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి ►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి ►క్వాష్ పిటిషన్‌పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం ►క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ ►17ఏ సెక్షన్‌పైనా సాగిన వాడీవేడి వాదనలు ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు సుప్రీం నో ► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ ►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు 10:59 అక్టోబర్ 19, 2023 ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు సిద్ధార్థ లూథ్రా వాదనలు: ►పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ►ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం -- ►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా ► సరేనన్న ధర్మాసనం ► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం 10:49 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ ►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ములాఖత్‌లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్లో కోరిన లాయర్లు ► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ►సరైన లీగల్ ఫార్మట్‌లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన 10:15 అక్టోబర్ 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌నెట్ స్కాం ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 09:45 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ ►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు ►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్ ►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం ►నేడు లీగల్ ములాఖత్‌ల పిటిషన్‌పైనా విచారణ జరిగే అవకాశం 08:55 అక్టోబర్ 19, 2023 బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు ►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది? మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? ►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? ►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా? 08:36 AM, అక్టోబర్ 20, 2023 తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ ►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ►స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు ►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు ►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ ►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం ►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన 08:15 AM, అక్టోబర్ 20, 2023 టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే! ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు ►నవంబర్ 1 వరకు రిమాండ్‌లోనే చంద్రబాబు ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు ►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు ►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 07:43 AM, అక్టోబర్ 20, 2023 సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ ►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్ ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు ► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 07:30, అక్టోబర్ 19, 2023 అన్నీ నిజాలే చెప్పాలి ► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 07:10 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబుకు భద్రతా అనుమానాలు ►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు ►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు ►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం ►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు ►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి ►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు ►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి 07:10 AM, అక్టోబర్ 20, 2023 వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు ►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు ► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు ►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం ►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు 06:55 AM, అక్టోబర్ 20, 2023 వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ ►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం? ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►సుప్రీంలో ఫైబర్‌నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్ ► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్ 06:35 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబు రిమాండ్ @41 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్‌ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్‌కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 -
స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఇంకోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. నవంబర్ 1వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు అధికారులు. ఆ సమయంలో ఆరోగ్యం ఎలా ఉంది? అని చంద్రబాబును ఏసీబీ జడ్జి ఆరా తీశారు. అయితే తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన జడ్జికి చెప్పారు. దీంతో అధికారుల్ని జడ్జి వివరణ కోరారు. మెడికల్ టీం ఉందని, ఎప్పటికప్పుడు ఆయనకు వైద్యపరీక్షలు జరుపుతోందని అధికారులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశిస్తూ.. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పడంతో.. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు సూచించింది. అలాగే చంద్రబాబు రాసే లేఖను సీల్ చేసి తనకు పంపాలని అధికారుల్ని జడ్జి ఆదేశించారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
బాబుకు టవర్ ఏసీ ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు టవర్ ఏసీ సదుపాయం కల్పించాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాబు ఉంటున్న బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అందులో భాగంగా ఆయన గదిలో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. వాతావరణం కారణంగా బ్యారెక్‌లో ఉక్కపోతగా ఉండటంతో ఇప్పటికే తనకున్న చర్మ సమస్యల కారణంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. అయితే జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు జైలు నిబంధనలు అనుమతించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వైద్యుల సూచనల మేరకు తన బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ శనివారం రాత్రి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం ఆన్లైన్లో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయాధికారి రాజమండ్రి జైలు అధికారులు, వైద్యులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉందని వైద్యులు కోర్టుకు తెలిపారు. ఇది కాకుండా చంద్రబాబుకు మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని వైద్యులను కోర్టు ప్రశ్నించింది. మరే ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం స్కిన్ అలర్జీతో మాత్రమే ఆయన బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున స్పెషల్ పీపీ యడవల్లి నాగ వివేకానంద వాదనలు వినిపించారు. చంద్రబాబుకున్న స్కిన్ అలర్జీ సమస్యను లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని వైద్యులు సిఫారసు చేశారని కోర్టుకు వివరించారు. న్యాయాధికారి స్పందిస్తూ.. చంద్రబాబు అభ్యర్థనపై మీరేమంటారని వివేకానందను ప్రశ్నించారు. నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని వివేకానంద చెప్పారు. దీంతో న్యాయాధికారి రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఎంత సేపట్లో ఏసీ సదుపాయం ఏర్పాటు చేయగలరని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. దీన్ని న్యాయాధికారి రికార్డ్ చేశారు. -
చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబుకి ఉన్న చర్మ సమస్యల కారణంగా.. ప్రభుత్వ వైద్యుల సూచనల్ని జైలు అధికారులు పాటించేలా ఆదేశించాలంటూ శనివారం రాత్రి హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు బాబు తరపు లాయర్లు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహా బ్లాక్‌లో ఆయన ఉంటున్న ప్రత్యేక గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడారు ఏసీబీ న్యాయమూర్తి. చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలపగా.. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా? అని జడ్జి అడిగారు. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకి లేవని వైద్యులు, న్యాయమూర్తికి తెలిపారు. దీంతో.. చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఉంటున్న బ్యారక్‌లో ఏసీ ఏర్పాటు చేయించాలని, వైద్యుల సూచనల్ని తప్పకుండా అమలు చేయాలని అధికారుల్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద ‘‘కోర్టు ఆదేశాల్ని తూ.చా. తప్పకుండా పాటిస్తామ’ని తెలిపారు. దీంతో ఈ రాత్రికే చంద్రబాబు కోసం ఏసీ(టవర్ ఏసీ) ఏర్పాటు చేయనున్నారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలు, అసత్యాలు ప్రచారంలోకి రావడంతో.. జైళ్ల శాఖ స్పందించింది. ఆయన్ని పరీక్షించిన వైద్య బృందంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనుమానాల్ని నివృత్తి చేయించింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. ఆయన యాక్టివ్గానే ఉన్నారని.. ఆస్పత్రి అవసరం లేదని తెలిపింది. రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే స్కిన్ ఎలర్జీ కారణంగా కూల్ ఎన్విరాన్మెంట్ సిఫార్సు చేశామని వైద్యులు తెలిపారు. ఆ వెంటనే చంద్రబాబు తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. జైలులో ఏసీ ఏర్పాటు చేయించేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఏసీ ఏర్పాటు చేయకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. స్కిన్ ఎలర్జీ కారణంగా చల్లని ప్రదేశంలో చంద్రబాబు ఉంటే సరిపోతుందన్న ప్రభుత్వ డాక్టర్ల సూచనల్ని పిటిషన్లో ప్రస్తావించారు బాబు లాయర్లు. -
బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
సాక్షి, విజయవాడ: వరుసబెట్టి పిటిషన్లు.. న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు.. అయినా కొనసాగుతున్న పిటిషన్ల పర్వం. దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉంది. ఈ సమయంలో ఆయన తరపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. సీఐడీ తరపు న్యాయవాదులతో తాజాగా దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో.. సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు. వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో లాయర్ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను జడ్జి ప్రశ్నించారు. మరోవైపు లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది. దీంతో.. న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ‘లేరు’అని చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. దీంతో.. న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. -
ఇన్నర్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు బుధవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌లో తదుపరి ముందుకెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి సమయం ఇచ్చే ప్రసక్తేలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏదైనా కేసులో వాదనలు వినిపించాల్సి ఉంటే ఒక్కరోజు మాత్రమే గడువునివ్వడం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద వాదించారు. అప్పటివరకు రక్షణ కల్పించండి.. అంతకుముందు సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదనలు వినిపిస్తూ.. 2022లో కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వడంగానీ, విచారణకు పిలవడంగానీ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరువాతే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించి చంద్రబాబు కస్టడీకి అనుమతినిస్తే తాము దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని చెప్పారు. డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే తాము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. విచారణను ఈ నెల 16కి వాయిదా వేయాలని, అప్పటివరకు రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు.. తరువాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విచారణను 16కి వాయిదా వేస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు గతంలో దాఖలు చేసిన పిటిషన్లోనే తాము అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ నెలరోజులుగా ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిందని తెలిపారు. పీటీ వారెంట్‌పై విచారణ కొనసాగించుకోవచ్చునని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసుకు, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సారూప్యత ఉందని వివరించారు. చంద్రబాబు కోరుకున్న విధంగా ఈ కేసులో ఏ రక్షణ కల్పించినా, గత ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించినట్లవుతుందని చెప్పారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై జరుగుతున్న విచారణను కొనసాగనివ్వాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఏరకంగాను ముందుకెళ్లొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ముదివీడు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అలాగే ఈ కేసులో చంద్రబాబుపై అదేరోజు వరకు పీటీ వారెంట్ కూడా దాఖలు చేయబోమని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. వాయిదాకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు సైతం అభ్యంతరం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ కుంభకోణంలో బెయిలివ్వాలని చంద్రబాబు పిటిషన్.. నేడు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, సీఐడీ దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కస్టడీ తరువాత తాను దాఖలు చేస్తున్న తొలి బెయిల్ పిటిషన్ ఇదేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించనుంది. -
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. బెయిల్ పిటిషన్‌పై మూడు రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారమే ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి.. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించారు. అంతేకాదు.. చంద్రబాబును మరోసారి కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసిన సంగతి విదితమే. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని ఏపీ సీఐడీ తరపున వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. -
స్కిల్ కార్పొరేషన్‌కు, టీడీపీకి ఒకరే ఆడిటర్
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ ఆడిటర్‌నే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కూడా ఆడిటర్‌గా నియమించడం వెనుక ప్రజాధనం కొల్లగొట్టాలన్న ఎత్తుగడ ఉందని న్యాయస్థానానికి సీఐడీ తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల అక్రమ మళ్లింపులో దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించిన ఆధారాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ కేసులో నిందితుడు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా మూడో రోజు శుక్రవారం విచారించింది. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిధుల అక్రమ మళ్లింపునకే టీడీపీకి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు రెండింటికీ వెంకటేశ్వరరావును ఆడిటర్‌గా నియమించారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపించారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా డిజైన్‌టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి చేరినట్టు సీఐడీ అధికారులు గుర్తించారన్నారు. దీనిపై ఈ నెల 10న విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వరరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసిందన్నారు. టీడీపీ ఖాతాల్లో చేరిన రూ.27 కోట్లతోపాటు అక్రమంగా తరలించిన మిగిలిన నిధులపై రాబట్టిన కీలక ఆధారాలపై చంద్రబాబును సీఐడీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీడీపీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఐటీ రిటర్న్స్‌ను మాత్రమే సీఐడీ డౌన్లోడ్ చేసిందని, బ్యాంకుల నుంచి రికార్డులు తీసుకోలేదన్నారు. బ్యాంకర్ల నుంచి రికార్డులు తీసుకున్నారని చెబుతున్న చంద్రబాబు న్యాయవాదుల వాదనలో వాస్తవం లేదన్నారు. గతంలో రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన, సహాయ నిరాకరణ చేసి విలువైన సమయాన్ని వృథా చేశారని తెలిపారు. కాబట్టి చంద్రబాబును కనీసం మూడు రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని ఏఏజీ కోరారు. సీఎం హోదాలో ఉంటూ కుట్రపూరితంగా వ్యవహరించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుందన్నారు. సీఐడీ నోటీసులు జారీ చేసిన కీలక సాక్షులు చంద్రబాబుకు పీఎస్‌గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని విదేశాలకు పరారైన విషయాన్ని ఆయన మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర కీలక సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. 13 మంది నిందితులు బెయిల్‌పై ఉన్నారు.. చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వండి చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల సంఘానికి టీడీపీ సమర్పించిన రిటర్న్స్‌లు, రికార్డులను తప్పుగా అన్వయిస్తున్నారన్నారు. ఈ కేసులో ఇప్పటికే 13మంది నిందితులు బెయిల్‌పై బయట ఉన్నందున చంద్రబాబుకు కూడా బెయిల్ మంజూరు చేయాలన్నారు. వాదనల సందర్భంగా న్యాయస్థానంపై చంద్రబాబు తరఫు న్యాయవాది దూబే చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి తప్పుబట్టారు. సీడీ ఫైల్ లేకుండా విచారిస్తున్నారని దూబే వాదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ తన టేబుల్‌పై ఉన్న సీడీ ఫైల్‌ను చూపిస్తూ ఇదేమిటి అన్ని ప్రశ్నించారు. న్యాయస్థానంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దాంతో కంగుతిన్న దూబే తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది. -
టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్‌కు ఒక్కరే అడిటర్
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఇరపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ(శుక్రవారం) అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తుది వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టారాయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్కిల్ స్కామ్‌లో టీడీపీ ఖాతాలోకి మళ్లిన నిధుల వ్యవహారాన్ని నిన్న వాదనల సందర్భంగా డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి.. మూడవ రోజు వాదనలోనూ సంచలనాలు వెలుగులోకి తెచ్చారు. టీడీపీకి.. స్కిల్ స్కామ్‌లో ఆడిటర్‌గా పని చేసిన వ్యక్తి ఒక్కరేనని.. ఆయన్ని విచారిస్తే కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలియజేశారు ఏఏజీ పొన్నవోలు. ఈ కేసులో టీడీపీ అడిటర్ వెంకటేశ్వర్లుని విచారించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకి రావాలని ఆయనకి నోటీసులిచ్చాం. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పోరేషన్‌కి ఆడిటర్ గా పనిచేశారు. ఈ రెండింటికీ ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మల్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారు. తద్వారా చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. పైగా సీఎం హోదాని చంద్రబాబు అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారు. జీవో నెంబర్ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు దిగమింగారు. కాబట్టి.. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది అని పొన్నవోలు కోర్టులో వాదించారు. ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సి ఉందని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారాయన. చంద్రబాబు సహకరించలేదు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత.. చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు గత రెండు రోజులకస్టడీలో సీఐడీకి సహకరించలేదు. సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి విచారించడానికి అవకాశమివ్వండి. [di చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వండి. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అని కోర్టును కోరారాయన. ఇక బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించారన్న చంద్రబాబు లాయర్ల ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు స్పందించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఐటీ రిటర్స్ని మాత్రమే డౌన్ లోడ్ చేశాం. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదని స్పష్టత ఇచ్చారాయన. -
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్‌యిన చంద్రబాబు రిమాండ్‌ను ఈ నెల 19 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో ఆయన మరో 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు వర్చువల్‌గా చంద్రబాబు హాజరయ్యారు. కాగా, చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపు మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇవాళ కూడా ఇరుపక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు. చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ . -
Oct 5th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:05 PM, అక్టోబర్ 05 2023 మెదక్ : చంద్రబాబునాయుడిని జనమే బ్యాన్ చేశారు : మంత్రి హరీష్ రావు ► మెదక్ జిల్లా సభలో మాట్లాడిన తెలంగాణ మంత్రి హరీష్‌రావు ► కులాలు, జాతుల గురించి చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదు ► చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు ► చివరకు ప్రజలు ఆయన్నే బ్యాన్ చేశారు, ఇప్పుడు జైలుకు పంపారు ► చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దు 6:00 PM, అక్టోబర్ 05 2023 ఎట్టకేలకు ఢిల్లీ వదిలిన లోకేష్ ► ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 22 రోజుల పాటు ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► రఘురామకృష్ణరాజుతో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చలు జరిపిన లోకేష్ ► వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, ఎంపీ రఘురామ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తండ్రి చంద్రబాబును ములాఖత్‌లో కుటుంబసభ్యులతో పాటు కలవనున్న లోకేష్ ► చంద్రబాబుకు మరో 14 రోజులు పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం ► ఆదివారం మళ్లీ లోకేష్ ఢిల్లీకి వెళ్లిపోతాడని ప్రచారం ► సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు లాయర్లతో కలిసి వెళ్లనున్న నారా లోకేష్ 5:10 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు నేర చరిత్రపై YSRCP విమర్శలు ► పదవిని అడ్డుపెట్టుకుని రూ.6 లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శ ► దోపిడిలో లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు వాటా ఉందని విమర్శ Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money! Costarring his coterie of co-looters Guru - Mr Ramoji Rao Biological Son - Mr @NaraLokesh Adopted Son - Mr @PawanKalyan And… pic.twitter.com/tuQHUCEFPy — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 5:00 PM, అక్టోబర్ 05 2023 రేపు ACB కోర్టులో చంద్రబాబు బెయిల్‌పై వాదనలు ► విజయవాడ : చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా ► రేపు మధ్యాహ్నం బాబు న్యాయవాది దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న AAG పొన్నవోలు ► రేపు మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ PT వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 4:45 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్ ► హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసుపై ముగిసిన వాదనలు ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వు ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు ► స్కిల్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, పార్థసాని ఇప్పటికే పరారీలో ఉన్నారు ► చంద్రబాబు ప్రమేయంతోనే వారిద్దరూ పరారైనట్లు మాకు సమాచారం ఉంది ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు ► చంద్రబాబు బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు 4:45 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం నిధులన్నీ చంద్రబాబు ఖాతాలకు చేరాయి : సజ్జల ► స్కిల్ స్కామ్ కేసులో CID ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు తెలిపింది ► స్కామ్‌లో డబ్బులు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లినట్టు CID ఆధారాలు సేకరించింది ► ఈ కుంభకోణంలో లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పాత్ర కీలకంగా ఉందని CID దర్యాప్తులో తేలింది ► NDA కూటమి నుంచి బయటకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది ► టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలి ► అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలి ► చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదు కోర్టు ► ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదు : సజ్జల 4:38 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు 4:31 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా ► రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ► రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటానన్న న్యాయమూర్తి ► ఇవాళ హోరాహోరీగా సాగిన ఇరుపక్షాల వాదనలు 2:50 PM, అక్టోబర్ 05 2023 బుద్ధా వెంకన్న కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్న పిటిషన్ ► పేర్నినాని పెట్టిన కేసుపై హైకోర్టును ఆశ్రయించిన బుద్ధా వెంకన్న ► వల్లభనేని వంశీ, కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్నపై కేసు ► గన్నవరం ఆత్కూరు స్టేషన్లో కేసు పెట్టిన పేర్నినాని ► బుద్దా వెంకన్నకు 41A కింద నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు 2:50 PM, అక్టోబర్ 05 2023 బండారు కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి బండారు పిటిషన్ ► తనపై పెట్టిన కేసును సవాలు చేసిన టిడిపి నేత బండారు ► బండారు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు సూచన ► ఇటీవల మంత్రి రోజాపై నీచ వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు ► మహిళలను కించపరిచినవారు బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవన్న మంత్రి రోజా ❝ స్త్రీ కన్నీటి బొట్టు గురించి చాగంటి వారి ప్రవచనం ❞ pic.twitter.com/6rshDIRACU — Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023 2:45 PM, అక్టోబర్ 05 2023 లంచ్ తర్వాత వాదనలు పునఃప్రారంభం ► ఏపీ హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు ► ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:15 PM, అక్టోబర్ 05 2023 తెలుగుదేశం, జనసేనలకు YSRCP చురకలు ► ఎన్నికలు రాగానే ప్యాకేజీ రాజకీయాలా? ► ఇవేం పార్టీలు, ఇవేం పొత్తులు : అంబటి జనసేన రాజకీయ పార్టీ కాదు ! తెలుగుదేశం బలహీనపడినప్పుడు వాడే బలం మందు! @PawanKalyan @naralokesh @JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 5, 2023 1:50 PM, అక్టోబర్ 05 2023 బాబు బయటకు వస్తే.. సాక్ష్యాధారాలు తారుమారే ► ఏపీ హైకోర్టు: ఫైబర్‌గ్రిడ్ కేసు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరు అనటం సరికాదు ► పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చంద్రబాబు ప్రమేయం గుర్తించాం ► అందుకే నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చాం ► టెరా సాప్ట్ కు పనులు ఇవ్వటం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయి ► నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు 1:40 PM, అక్టోబర్ 05 2023 మద్ధతివ్వండి ప్లీజ్.. CPIని రిక్వెస్ట్ చేసిన TDP ► గుంటూరు జిల్లా CPI కార్యాలయానికి వెళ్లిన TDP నాయకులు ► ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌తో TDP నేతల భేటీ ► TDP బృందంలో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ ► ఈ నెల 7న జరిగే శాంతి ర్యాలీకు CPI మద్దతు కోరిన TDP నాయకులు 1:20 PM, అక్టోబర్ 05 2023 ఓట్ల కోసం కక్కుర్తి పడతారా? మీలో మీకైనా కనీస గౌరవముందా? ► తెలుగుదేశం, జనసేన నాయకులపై YSRCP విమర్శలు ► మీలో మీకే గౌరవం లేదు, ప్రజలను ఏం గౌరవిస్తారని ప్రశ్న మనసులో లేని ప్రేమ, అభిమానాన్ని నటిస్తూ అధికారం కోసం @JaiTDP, @JanaSenaParty పొత్తు పెట్టుకున్నాయి. కానీ.. ఎంత సీనియర్ నటులైనా లేని గౌరవాన్ని అన్నివేళలా నటించడం సాధ్యం కాదు కదా..? చంద్రబాబుని గాడు అని @PawanKalyan సంభోదిస్తే.. ఆ పవన్ కళ్యాణ్‌ని మరింత వెటకారంగా గాడూ అంటూ నందమూరి… pic.twitter.com/VXuaS4QYhQ — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 1:10 PM, అక్టోబర్ 05 2023 కార్పోరేషన్ తప్పు చేస్తే.. చంద్రబాబుకేంటీ సంబంధం : బాబు లాయర్ వాదన ► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు ► దూబే : సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► న్యాయమూర్తి : చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ కార్పోరేషనుకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల సంగతేంటీ? ► దూబే : స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తయింది ► బ్యాంకు గ్యారెంటీలను స్కిల్ కార్పోరేషన్‌కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది ► సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పోరేషనే తప్ప.. ప్రభుత్వం కాదు ► స్కిల్ కార్పోరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది ► అక్కడ అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉన్నట్టు? : దూబే 12:50 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ అగర్వాల్ వాదనలు ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ► ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను నిబంధనలు ప్రకారమే బిడ్డర్‌కు ఇచ్చారు ► ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదు, ► ఈ కేసులో కొందరికి బెయిల్ లభించింది ► చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలి : లాయర్ అగర్వాల్ 12:38 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పాత్రకు ఇవే ఆధారాలు : ACB కోర్టులో పొన్నవోలు ► విజయవాడ : రెండో రోజు ACB కోర్టులో సంచలన నిజాలు బయటపెట్టిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ► నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులని దిగమింగారు ► చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పణ ► ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టిడిపి ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఆధారాల సమర్పణ ► రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ACB కోర్టుకు సమర్పణ ► దీనికి సంబంధించిన ఆడిటర్‌ను విచారణకు పిలిచాం ► ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారు ► డొల్ల కంపెనీలని సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని వివరించిన పొన్నవోలు 12:30 PM, అక్టోబర్ 05 2023 ఫైబర్‌నెట్ స్కాంలో చంద్రబాబుదే కీలక పాత్ర ► ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంలో వాదనలు ► తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్ ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► చంద్రబాబు నాయుడు బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించాలన్న AG శ్రీరామ్ 12:30 PM, అక్టోబర్ 05 2023 భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి : YSRCP ► భువనేశ్వరీ ఇటీవల చేసిన ప్రకటనపై నారుమల్లి పద్మజ విమర్శలు ►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా? ►హెరిటేజ్‌లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు ►దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి, ఆస్తుల అఫిడవిట్లపై విచారణ జరపాలి ►బండారు సత్యనారాయణ లాంటి కీచకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతన్నారు ►ఇలాంటి వారిని ఎవరు ప్రోత్సాహిస్తున్నారు? ►ఒక మహిళ కన్నీరు తమకు సంతోషాన్నిస్తోందని అంటున్నారంటే టీడీపీ వారి పైశాచికత్వాన్ని ఏం అనాలి? ►భువనేశ్వరి సభలో ఒక పిల్లాడితో చండాలంగా మాట్లాడించారు ►భువనేశ్వరి చప్పట్లు కొడుతుంటే అసలు వీరు మహిళలేనా అనిపిస్తోంది ►చంద్రబాబు చేసిన స్కాంలలో కూడా భువనేశ్వరి పాత్ర ఉందనే అనుమానం వస్తోంది ►విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగినప్పుడు ఈ భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? 12:24 PM, అక్టోబర్ 05 2023 బెయిల్ ఇవ్వొద్దు, కస్టడీకి అప్పగించండి : CID లాయర్ పొన్నవోలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే ► కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుంది ► బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన అదనపు అడ్వకేట్ జనరల్ 12:10 PM, అక్టోబర్ 05 2023 ఇవ్వాళ ACB కోర్టు ముందుకు చంద్రబాబు ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్‌పై నేడు కోర్టు నిర్ణయం ► ఇవాళ ACB కోర్టు ముందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు హాజరు ► ఈ సాయంత్రానికి రాజమండ్రికి నారా లోకేష్ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే నారా లోకేష్ 12:04 PM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారు ► రూ.27 కోట్లు నేరుగా టిడిపి ఖాతాలో జమ అయ్యాయి ► ఆర్టికల్ 14 ని ప్రస్తావించిన పొన్నవోలు ► న్యాయం ముందు అందరూ సమానమే.... ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే ► ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? ► ఇది మామూలు కేసు కాదు...తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు ► చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు 11:43 AM, అక్టోబర్ 05 2023 జైల్లో చంద్రబాబు, క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల కుస్తీలు ► కృష్ణా జిల్లా : పెనమలూరు టీడీపీలో టిక్కెట్ చిచ్చు ► ఇటీవల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్న దేవినేని గౌతమ్ ► జనసేన మద్ధతుతో పెనమలూరు టిడిపి టిక్కెట్ దేవినేని గౌతమ్‌కు ఇస్తారని ప్రచారం ► పార్టీలో పరిస్థితుల పై నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్ అసహనం ► దేవినేని గౌతమ్‌కు టిడిపి టికెట్ ఇస్తే.. పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా : బోడే ► క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని పార్టీ క్యాడర్ అంగీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా 11:43 AM, అక్టోబర్ 05 2023 ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై కోర్టుకు ఫిర్యాదు ► విజయవాడ : ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ► ఎల్లో మీడియా తప్పుడు కథనాలను కోర్టు ముందు ప్రస్తావించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ► ACB జడ్జి తనపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ తప్పుడు కథనాలు రాశారని తెలిపిన పొన్నవోలు ► తప్పుడు కవరేజీపై కోర్టు ఆగ్రహం ► విచారణ జరుగుతున్న హాలులో న్యాయవాదులు కాకుండా ఇంకెవరూ వుండకూడదని న్యాయమూర్తి ఆదేశం 11:40 AM, అక్టోబర్ 05 2023 TDP, జనసేన అట్టర్‌ఫ్లాప్: జోగి రమేష్ ► తాడేపల్లి : టీడీపీ, జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం ► టీడీపీ, జనసేన కలిసిన తర్వాత పెట్టిన మీటింగ్ ప్లాప్ అయింది ► పవన్ మీటింగ్ అట్టర్ ప్లాప్ షోలా మారిపోయింది ► పవన్ తాట తీస్తానని చెప్పి రెండు చోట్లా ఓడిపోయాడు ► ఎలాంటి విలువలు, విశ్వసనీయత లేని మనిషి పవన్ ► రంగాను చంపించిన వారికి అమ్ముడుపోతావా పవన్? ► కాపుల కోసం పోరాడిన ముద్రగడను చంద్రబాబు వేధించారు ► పవన్ మీటింగ్ పెడితే కనీసం రెండు వేల మంది రాలేదు ► చేసిన తప్పుకు చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు టీడీపీ, జనసేన పార్టీల కలయిక వైరస్ లాంటిది కాబట్టే.. రెండు పార్టీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. - మంత్రి జోగి రమేష్ #PackageStarPK#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/FwjhTPedU2 — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 11:35 AM, అక్టోబర్ 05 2023 NDA నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే : పవన్ కళ్యాణ్ ► నాకు చాలా ఇబ్బందులున్నాయి ► NDAలో భాగస్వామి ఉండి కూడా.. నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపాను ► వంద శాతం నా మద్ధతు ఎందుకు ప్రకటించానంటే.. ► ఎందుకంటే తెలుగుదేశం చాలా బలహీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ► తెలుగుదేశం నాయకులు చాలా బలహీనంగా ఉన్నారు ► మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేన పోరాట పటిమ టిడిపికి అవసరం కాబట్టి మద్ధతిచ్చాను #PawanaKalyan #TDP #JanaSenaParty pic.twitter.com/DAH2BJIgjd — Vattikoti Vishnu (@Vattikoti1989) October 5, 2023 11:30 AM, అక్టోబర్ 05 2023 NDAకు పవన్ కళ్యాణ్ రాం రాం.! ► తెలుగుదేశం కోసం పవన్‌కళ్యాణ్ NDAకు గుడ్‌బై ► ప్రకటించిన జాతీయ న్యూస్ ఏజెన్సీ ANI Actor, Politician Pawan Kalyan exits NDA to support Chandrababu Naidu Read @ANI Story | https://t.co/K8qOh21K9Y#PawanKalyan #NDA #ChandrababuNaidu pic.twitter.com/Ojlq1ylmg1 — ANI Digital (@ani_digital) October 5, 2023 11:20AM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో రిమాండ్ మెమో ► విజయవాడ : చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ మెమో దాఖలు చేసిన CID ► 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేసిన సీఐడీ 11:00AM, అక్టోబర్ 05 2023 ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ అగర్వాల్, లూథ్రా 10:40AM, అక్టోబర్ 05 2023 బాబు స్కీంలు ఇవ్వలేదు.. స్కాంలు చేశారు ►చంద్రబాబు స్కీం లు ఇవ్వలేదు, స్కాంలకు పాల్పడ్డారు ►తాను కట్టిన జైల్లో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారు ►మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారును ఉరి తీయాలి ►మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే నాలుక చీరేస్తాం ►పవన్ కల్యాణ్ కొట్టే.. సినిమా డైలాగ్ లకు వైఎస్సార్సీపీ భయపడదు :::వంగపండు ఉష, రాష్ట్ర సంస్కృతిక విభాగం అధ్యక్షురాలు 10:24AM, అక్టోబర్ 05 2023 కోర్డుకి చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►సీఐడీ తరపున నిన్న బలమైన వాదనలు వినిపించిన ఏఏజీ ►స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది ►స్కిల్ స్కామ్ ఫిక్షన్ కాదు.. ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారం ►బాబు చేసిన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి ►చెప్పినట్లు చేయాలని అధికారులను బెదిరించారు ►బాబు ఆదేశాలతోనే.. మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారయ్యారు ►బెయిల్‌పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేయొచ్చని వాదనలు ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్‌పై ప్రారంభం కానున్న వాదనలు 09:56AM, అక్టోబర్ 05 2023 ముందస్తుపై కాసేపట్లో వాదనలు ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►మరికాసేపట్లో వాదనలు ప్రారంభం ►ఫైబర్ నెట్ కుంభకోణంలో కేసులో నిందితుడిగా చంద్రబాబు ►ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు 09:22AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఉంటుందా? ►స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు ►26 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ 7691గా బాబు ►సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►రెండుసార్లు పొడిగించిన ఏసీబీ కోర్టు ►రిమాండ్‌లో, సీఐడీ కస్టడీ ఇంటరాగేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు పడలేదని స్వయంగా జడ్జికి చెప్పిన చంద్రబాబు 09:00AM, అక్టోబర్ 05 2023 పరిటాల సునీతపై కేసు నమోదు ►టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటా సునీతపై కేసు నమోదు ►శ్రీసత్యసాయి కనగానపల్లి లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహణ ►సునీతతో పాటు తనయుడు శ్రీరామ్ సహా 119 మందిపై కేసు 08:29AM, అక్టోబర్ 05 2023 నేడు రాజమండ్రికి లోకేష్? ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టితో పూర్తి కానున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ► బ్లూ జీన్ యాప్ ద్వారా ఏసీబీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న అధికారులు ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ జరుగనున్న విచారణ ►నేడు రాజమండ్రి రానున్న నారా లోకేష్? ►రేపు చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 08:08AM, అక్టోబర్ 05 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో నిందితుడిగా చంద్రబాబు నాయుడు ►ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►నేడు విచారణకు వచ్చే అవకాశం 07:53AM, అక్టోబర్ 05 2023 తాడు లేని బొంగరంగా.. టీడీపీ ►అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమల ►యనమలే పార్టీకి దిక్కంటూ వార్తలు ►టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. ►తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే.. కొడుకు పలాయనం చిత్తగించాడు. ►టీడీపీ క్యాడర్ అడ్రస్సే లేదు ::: వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమలే దిక్కంటూ వస్తున్న వార్తలు చూస్తుంటే టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే, కొడుకు పలాయనం చిత్తగించాడు. క్యాడర్ అడ్రస్సే లేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2023 07:48AM, అక్టోబర్ 05 2023 డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టిందట! ►మహానేత వైఎస్సార్‌పై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ►వైఎస్సార్ మేరు పర్వతం.. పవన్ కంకర కుప్ప ►ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేది పవన్.. ప్రజలకోసం జీవించిన వ్యక్తి వైఎస్సార్ ►2009 నాటికి నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు..కానీ జగన్ అప్పటికే కడప ఎంపీ ►నువ్వు అంత గొప్పోడివి అయితే ప్రజలు ఓడించరు కదా!. ►సొల్లు కబుర్లు మానేసి నాలుగు ఓట్ల కోసం ట్రై చేయు నువ్వెంత? నీ స్థాయి ఎంత? మేరు పర్వతం ముందు కంకర కుప్పంత! వైయస్సార్ తో నీకు పోలికా? ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేసిన నీకు ప్రజలకోసం జీవించిన మహానేతతో పోలిక దేనికీ @Pawankalyan? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టకూడదు. నువ్వు చెప్పిన 2009 నాటికి… pic.twitter.com/pmEetPK8K1 — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:26AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రిలో పోలీసుల అలర్ట్ ►ఛలో రాజమండ్రి పేరిట టీడీపీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పిలుపు ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు పర్మిషన్ లేదని నిన్ననే స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చర్యలను ఉపేక్షించమని హెచ్చరిక ►144 సెక్షన్‌తో పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు ►రాజమండ్రిలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు 07:18AM, అక్టోబర్ 05 2023 సూత్రధారి చంద్రబాబే: ఏఏజీ సుధాకర్‌రెడ్డి ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై నేడు కూడా కొనసాగనున్న విచారణ ►నేడు ఉదయం 11.15 గంటలకి ప్రారంభం కానున్న వాదనలు ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి సంబంధం లేదని వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►చంద్రబాబుకి కనీసం కండిషనల్ బెయిల్ అయినా ఇవ్వాలని కోరిన దూబే ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలని కోరిన పొన్నవోలు ►చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారని ప్రస్తావన ►తీవ్రమైన ఆర్ధిక నేరాలలో బెయిల్ ఇవ్వకూడదన్న సుప్రీం తీర్పుని ఉదహరించిన పొన్నవోలు ►చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో సహకరించలేదని వివరణ ►చంద్రబాబుని మరో అయిదు రోజుల కస్ఢడీకి ఇవ్వాలని కోరిన పొన్నవోలు ►పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడం వెనక చంద్రబాబు హస్తముందన్న పొన్నవోలు ►ఇరువర్గాల వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా ►చంద్రబాబు బెయిల్, కస్టడీ విచారణల తర్వాత ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 06:58AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ ►చంద్రబాబు బెయిల్, కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►నిన్న సుదీర్ఘంగా సాగిన ఇరువైపుల వాదనలు ►నేటికి విచారణ వాయిదా వేసిన కోర్టు 06:52AM, అక్టోబర్ 05 2023 రిమాండ్ పొడిగింపుపై నేడు ఆదేశాలు ►నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►పొడిగింపుపై ఆదేశాలు ఇవ్వనున్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ►వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ►ఇంతకు ముందు రెండుసార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్‌గానే ప్రవేశపెట్టిన వైనం ►రిమాండ్ పొడిగింపు కోరుతూ.. మెమో దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు 06:40AM, అక్టోబర్ 05 2023 జైల్లో భద్రంగా చంద్రబాబు ►జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబు ►స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక వసతులు ►ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు ►కోర్టు అనుమతితో.. ఇంటి భోజనానికి అనుమతి ►కుటుంబ సభ్యులతో ములాఖత్‌లు 06:30AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @26 ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏపీ సీఐడీ అరెస్ట్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ►26వ రోజుకి చేరిన చంద్రబాబు రిమాండ్ -
Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates 07:28 PM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు 05:44 PM, అక్టోబర్ 04, 2023 ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం ►ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి ►ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి ►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు ►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు ►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు ►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి ►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 05:07 PM, అక్టోబర్ 04, 2023 స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు 04:05 PM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టు: సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు ►సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు ►కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం ►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు ►శ్రీనివాస్ పాస్‌పోర్ట్ సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి 03:47 PM, అక్టోబర్ 04, 2023 ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు 03:39 PM, అక్టోబర్ 04, 2023 ►స్కిల్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా ►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు 03:03 PM, అక్టోబర్ 04, 2023 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి ►చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది ►స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు ►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది ►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది ►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు ►స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం ►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి ►స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు ►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం ►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ ►సీమెన్స్‌తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు 02:54 PM, అక్టోబర్ 04, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:30 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్ ►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి ►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు ►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:26 PM, అక్టోబర్ 04, 2023 నారా ఫ్యామిలీకి పరామర్శలు ►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 01:21 PM, అక్టోబర్ 04, 2023 అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా ►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ 01:15 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు లాయర్ సుదీర్ఘ వాదనలు ►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు ► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది ► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు ► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు ► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది? ► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే 01:00 PM, అక్టోబర్ 04, 2023 విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు ►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్ దూబే ►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే ►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే ►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు ►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు ►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది 12:53 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ► చంద్రబాబు పిటిషన్ విచారణ.. అడిషినల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు చేరుకున్నారు ► ప్రస్తుతం బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ దూబే 12:18 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ ►బెయిల్ పిటిషన్‌పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్ ప్రమోద్‌కుమార్ దూబే ►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు ►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. ►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది ►ఆ కమిటీలో చంద్రబాబు లేరు ►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది ►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు ►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు ►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది? ►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు? 12:00 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌కు పోలీసుల నోటీసులు ►జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు ►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ ►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా ►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం ►నోటీస్‌లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు ►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది ►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం ►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం 11:50 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్‌పై మొదలైన వాదనలు ►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు ►బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి ►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్ ప్రమోద్‌కుమార్ దుబే ►అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ ► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు 11:45 AM, అక్టోబర్ 04, 2023 హైకోర్టులో నారాయణ పిటిషన్ విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు ►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ ►ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►క్వాష్ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి ►విచారణ ఎల్లుండికి వాయిదా 11:15 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు స్పెషల్ జీపీ వివేకానంద ►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) వివేకానంద ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద ► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు 11:05 AM, అక్టోబర్ 04, 2023 ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు ►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి ►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన ►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ ►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు 10:47 AM, అక్టోబర్ 04, 2023 వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ ►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ► ఇంటరాగేషన్‌లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ ► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ ►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ ► స్కిల్ స్కాంలో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ 10:14 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం? ►ఎన్ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్‌కాట్ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్ అసోషియేషన్ ►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరగాల్సిన విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ ►బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన ►సుప్రీంలో ఎస్ఎల్పీ పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు ►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు ►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత 09:45 AM, అక్టోబర్ 04, 2023 తూర్పు గోదావరిలో 144 సెక్షన్: ఎస్పీ జగదీష్ ►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు ►గురువారం నిర్వహించేందుకు ప్లాన్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్ ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్ అని స్పష్టీకరణ ►144 సెక్షన్‌తో పాటు పోలీస్ సెక్షన్ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన 09:04 AM, అక్టోబర్ 04, 2023 టీడీపీ వర్గాల్లో టెన్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు ►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి ►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్ ►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు ►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన 08:50 AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా ►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో వినతి ►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ►ఇదే కేసులో.. నిన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 08:20 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌లాంటి చెత్త నేత లేడు! ►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..? ►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు. ►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ 07:38 AM, అక్టోబర్ 04, 2023 బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న ► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ ► అరెస్ట్.. ఆపై కండిషనల్ బెయిల్ మీద విడుదల ► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం ►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు. ►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వయసు పెరగ్గానే సరిపోదు.. కాస్త జ్ఞానం, ఇంగితం కూడా ఉండాలి. మంత్రి రోజా గారి గురించి నువ్వు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు.. మీ ఇంట్లో భార్య లేదా కూతురిని ఉద్దేశించి అంటే నీకు ఎలా ఉంటుంది బండారు సత్యనారాయణ? టీడీపీ నేతలు కాస్త నోరు… pic.twitter.com/4QPXKD69oc — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:30AM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్ ►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ ►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 07:25AM, అక్టోబర్ 04, 2023 నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ ► ఇవాళ్టి వరకు(అక్టోబర్ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ►నేడు మళ్లీ జరగనున్న వాదనలు 07:15AM, అక్టోబర్ 04, 2023 నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం ►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ ►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ ►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్ ►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ 06:52AM, అక్టోబర్ 04, 2023 10న సీఐడీ ముందుకు లోకేష్ ►అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌కు హైకోర్టు ఆదేశం ►లోకేష్‌పై మూడు కేసులు, రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం ►అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ 06:50AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో బాబుకి దక్కని ఊరట ►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్, చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సోమవారానికి(అక్టోబర్ 9వ తేదీకి) వాయిదా ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం ►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్ స్కాం, అంగళ్లు, రింగ్ రోడ్ ►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ విచారణ 06:46AM,అక్టోబర్ 04, 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు @25 ►సీఎంగా ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ ►సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ ► రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ► ఖైదీ నెంబర్ 7691గా స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక వసతులు ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు ► నేటితో (అక్టోబర్ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ