Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Naidu Arrest Scam Cases ACB Court Hearings October 04 Live Updates - Sakshi
Sakshi News home page

Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Wed, Oct 4 2023 6:57 AM | Last Updated on Fri, Oct 6 2023 10:39 AM

Chandrababu Naidu Arrest Scam Cases Court Hearings Oct 04 Updates - Sakshi

LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates

07:28 PM, అక్టోబర్‌ 04, 2023
ఫైబర్‌ నెట్‌ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా
రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు

05:44 PM, అక్టోబర్‌ 04, 2023

ఏబీఎన్‌, టీవీ-5 తీరుపై  ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
►ఏబీఎన్‌,  టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
►ఏబీఎన్‌, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి
►ఏబీఎన్‌, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి
►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు
►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు
►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు
►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్‌,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి
►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా
►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.

05:07 PM, అక్టోబర్‌ 04, 2023
స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు

04:05 PM, అక్టోబర్‌ 04, 2023
ఏసీబీ కోర్టు:
 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు
►సీమెన్స్‌ కంపెనీ పేరుతో స్కిల్‌ స్కామ్‌కు పాల్పడ్డారు
►కేబినెట్‌ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం
►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్‌ విదేశాలకు పారిపోయారు
►శ్రీనివాస్‌ పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి

03:47 PM, అక్టోబర్‌ 04, 2023
ఏపీ హైకోర్టులో ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు విచారణ
►చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ
►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు
►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు

03:39 PM, అక్టోబర్‌ 04, 2023
►స్కిల్‌ స్కాంలో లోకేష్‌ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు

03:03 PM, అక్టోబర్‌ 04, 2023
సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు
►స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేయాలి
►చంద్రబాబుకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
►శ్రీనివాస్‌, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది
►స్కిల్‌ స్కాంలో రూ.371 కోట్ల  ప్రజాధనం దుర్వినియోగం
►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు
►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది
►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది
►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది
►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు
►స్కిల్‌ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం
►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి
►స్కిల్‌ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్‌ స్టోరీ కాదు
►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం
►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్‌ సంస్థతో ఎంవోయూ
►సీమెన్స్‌తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు

02:54 PM, అక్టోబర్‌ 04, 2023
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

01:30 PM, అక్టోబర్‌ 04, 2023
చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్
►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి
►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు
►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి
►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు
►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

01:26 PM, అక్టోబర్‌ 04, 2023
నారా ఫ్యామిలీకి పరామర్శలు
►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ 
► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

01:21 PM, అక్టోబర్‌ 04, 2023
అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్
►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్
►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా
►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్

01:15 PM, అక్టోబర్‌ 04, 2023
చంద్రబాబు లాయర్‌ సుదీర్ఘ వాదనలు
►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే
► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు
►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు
►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు
► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి
► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించింది
► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు
► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు
► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది
► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు
► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు
► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు
► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది?
► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది
►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే

01:00 PM, అక్టోబర్‌ 04, 2023
విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు
►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్‌ దూబే
►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే
►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే
►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు
►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు
►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది

12:53 AM, అక్టోబర్‌ 04, 2023
ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి
► చంద్రబాబు పిటిషన్‌ విచారణ.. అడిషినల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు చేరుకున్నారు
► ప్రస్తుతం బెయిల్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్‌ దూబే

12:18 AM, అక్టోబర్‌ 04, 2023
చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు
►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ
►బెయిల్ పిటిషన్‌పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్‌ ప్రమోద్‌కుమార్‌ దూబే
►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు
►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు
►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు
►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి.
►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది
►ఆ కమిటీలో చంద్రబాబు లేరు
►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు
►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది
►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు
►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు
►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు
►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.‍. అవసరం ఏముంది?
►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది
►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు  ఎలా పెడతారు?

12:00 AM, అక్టోబర్‌ 04, 2023
పవన్‌కు పోలీసుల నోటీసులు
►జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు 
►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు 
►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ 
►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా
►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ 
►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం 
►నోటీస్‌లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు
►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది
►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం
►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం

11:50 AM, అక్టోబర్‌ 04, 2023
చంద్రబాబు పిటిషన్‌పై మొదలైన వాదనలు
►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు 
►బెయిల్‌ పిటిషన్‌తో పాటు కస్టడీ, పీటీ వారెంట్‌ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి
►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్‌ ప్రమోద్‌కుమార్‌ దుబే
►అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ
► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు

11:45 AM, అక్టోబర్‌ 04, 2023
హైకోర్టులో నారాయణ పిటిషన్‌ విచారణ వాయిదా
►మాజీ మంత్రి నారాయణ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
►ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ఏ2గా నారాయణ
► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు
►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్‌
►ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు 
►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
►క్వాష్‌ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి
►విచారణ ఎల్లుండికి వాయిదా

11:15 AM, అక్టోబర్‌ 04, 2023
ఏసీబీ కోర్టుకు స్పెషల్‌ జీపీ వివేకానంద

►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్‌ ప్లీడర్‌) వివేకానంద
►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ
►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద
► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు

11:05 AM, అక్టోబర్‌ 04, 2023
ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా
►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే
►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు
►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు
►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి
►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన
►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ
►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు
►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు

10:47 AM, అక్టోబర్‌ 04, 2023
వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ
►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ
►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే
► ఇంటరాగేషన్‌లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ
► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ
►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్‌
► స్కిల్‌ స్కాంలో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్‌

10:14 AM, అక్టోబర్‌ 04, 2023
చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం?
►ఎన్‌ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్‌కాట్‌ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్‌ అసోషియేషన్‌
►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై జరగాల్సిన విచారణ
►స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ
►బెయిల్‌ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన
►సుప్రీంలో ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు
►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు
►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత


09:45 AM, అక్టోబర్‌ 04, 2023
తూర్పు గోదావరిలో 144 సెక్షన్‌: ఎస్పీ జగదీష్‌
►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు
►గురువారం నిర్వహించేందుకు ప్లాన్‌
►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్‌
►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్‌ అని స్పష్టీకరణ
►144 సెక్షన్‌తో పాటు పోలీస్‌ సెక్షన్‌ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన

09:04 AM, అక్టోబర్‌ 04, 2023
టీడీపీ వర్గాల్లో టెన్షన్‌
►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు
►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి
►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్‌
►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు
►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన

08:50 AM, అక్టోబర్‌ 04, 2023
సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు
►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ
►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ 
►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా 
►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్
►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో  చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న   రామకృష్ణారెడ్డి 
►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది 
►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న   రామకృష్ణారెడ్డి 
►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో  వినతి
►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్  ధర్మాసనం 
►ఇదే కేసులో.. నిన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

08:20 AM, అక్టోబర్‌ 04, 2023
పవన్‌లాంటి చెత్త నేత లేడు!
►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..?
►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు.
►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు.
:::వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్

07:38 AM, అక్టోబర్‌ 04, 2023
బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న
► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ
► అరెస్ట్‌.. ఆపై కండిషనల్‌ బెయిల్‌ మీద విడుదల
► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం
►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు.
►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు

07:30AM, అక్టోబర్‌ 04, 2023
ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్
►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ
►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 

07:25AM, అక్టోబర్‌ 04, 2023
నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
►స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ
► ఇవాళ్టి వరకు(అక్టోబర్‌ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు
►నేడు మళ్లీ జరగనున్న వాదనలు

07:15AM, అక్టోబర్‌ 04, 2023
నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ 
►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ
►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం
►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ
►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ
►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్
►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ

06:52AM, అక్టోబర్‌ 04, 2023
10న సీఐడీ ముందుకు లోకేష్‌

►అక్టోబర్‌ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌కు హైకోర్టు ఆదేశం
►లోకేష్‌పై మూడు కేసులు, రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ స్కాం
►అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్‌ మరో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

06:50AM, అక్టోబర్‌ 04, 2023
సుప్రీంలో బాబుకి దక్కని ఊరట

►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్‌, చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సోమవారానికి(అక్టోబర్‌ 9వ తేదీకి) వాయిదా
►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం
►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్‌ స్కాం, అంగళ్లు, రింగ్‌ రోడ్‌
►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ

06:46AM,అక్టోబర్‌ 04, 2023
రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు @25

►సీఎంగా ఉన్న టైంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు
►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ 
►సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్‌
► రిమాండ్‌ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)  ప్రత్యేక న్యాయస్థానం
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో జ్యూడీషియల్‌ రిమాండ్‌ మీద చంద్రబాబు
► ఖైదీ నెంబర్‌ 7691గా స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక వసతులు
► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు
► నేటితో (అక్టోబర్‌ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్‌ 
► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement