ponguru narayana
-
ఎవరిని వదిలిపెట్టం.. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే సాకేష్ పై దాడి..
-
ఖజానాలో డబ్బుల్లేవు.. ఇప్పుడేమీ చేయలేం
పాలకొల్లు సెంట్రల్: ఖజానాలో డబ్బుల్లేవని.. ఇప్పట్లో పనులేవీ చేయలేమని మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లు గందరగోళంగా ఉన్నాయన్నారు. వీటిని సరిచేద్దామంటే ఖజానాలో నిధులు లేవని, ఇప్పట్లో ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు.నిధులు లేనందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. డబ్బులుంటే అన్ని పథకాలూ ఒకేసారి అమలు చేసేవాళ్లమని, డబ్బులు లేకపోవడంతో చంద్రబాబు చాణక్యంతో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 7,150 మంది టిడ్కో లబ్ధిదారుల్లో 640 మంది బ్యాంకు రుణాలు తీసుకోలేదని, వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ప్రపంచ బ్యాంక్ వద్దన్నది.. అయినా అమరావతే రాజధాని
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణసాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమరావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్ జోన్లో ఉందని, రాజధాని డిజైన్ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు. -
టీడీఆర్ బాండ్ల స్కామ్‌లో కారుమూరిని ‘ఫిక్స్’ చేద్దాం
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల జారీ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇరికించాలన్న లక్ష్యంతో గురువారం శాసన సభలో పెద్ద చర్చే జరిగింది. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవకతవకలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పడం, ఇందులో కారుమూరిని ‘ఫిక్స్’ చేయాలని కొందరు సభ్యులు కోరడం, నివేదిక రాగానే అలాగే చేద్దామని మంత్రి చెప్పడం చూస్తే అంతా ఓ ప్రణాళిక ప్రకారం చర్చ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గురువారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ గడిచిన ఐదేళ్లలో 3,301 టీడీఆర్ బాండ్లు జారీ చేశారని చెప్పారు. తణుకు, విశాఖ, గుంటూరు, తిరుపతిలో బాండ్ల జారీలో ఆరోపణలు రావడంతో శాఖాపరంగా, ఏసీబీతో కూడా విచారణ చేయిస్తున్నామన్నారు. తణుకులో 27.96 ఎకరాలకు రూ.63.24 కోట్లకు బాండ్లు జారీ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.754.67 కోట్లకు జారీ చేశారన్నారు. అంటే రూ.691.43 కోట్ల స్కామ్ జరిగిందని, ఇందుకు బాధ్యులైన ముగ్గురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసామని మంత్రి వివరించారు. రాబోయే 15 రోజులు బాండ్ల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యేలు అరిమిల్లి రాధాకృష్ణ, గోరంట్ల బుచ్చెయ్యచౌదరి మాట్లాడుతూ.. సూత్రధారులపై చర్యలు తీసుకోవాలే తప్ప చిన్న చిన్న ఉద్యోగులపై కాదని అన్నారు. తణుకు స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హస్తముందని, ఆయన్ని ఖచి్చతంగా ఈ కేసులో ఇరికించాల్సిందే (ఫిక్స్)నని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి బదులిస్తూ విచారణ నివేదిక రాగానే తప్పకుండా కారుమూరిని ఫిక్స్ చేద్దామని చెప్పారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో కూడా అప్పటి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేద్దామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 3.13 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పట్టణాల్లో వసతులు మెరుగుపరుస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధిలో మౌలిక వసతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో 20 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ సహా రాష్ట్రంలోని 20 యూడీఏల పరిధిలో వేసిన లే అవుట్లలో విద్యుత్తు, రోడ్లు, తాగు నీరు, పార్కులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడం యూడీఏలో ప్రధాన లక్ష్యమన్నారు. నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణకు కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలు జరిగాయని చెప్పారు. దీనిపైనా విచారణ చేయించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిలిచిపోయిన ఎంఐజీ, టిడ్కో గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగు నీరందించడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5,300 కోట్లు కేటాయించామని, ఈ నిధుల్లో గత ప్రభుత్వం రూ.240 కోట్లే వెచ్చి0చిందన్నారు. మిగిలిన నిధుల వినియోగానికి కాల పరిమితిని పెంచాలని ఆ బ్యాంకుకు లేఖ రాసినట్టు చెప్పారు. 2023–24లో వచ్చిన రూ.1100 కోట్లను కూడా దారి మళ్లించిందన్నారు. ఈ సమావేశంలో డీటీసీపీ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ ఆనందరావు పాల్గొన్నారు. -
‘రింగ్’లో మింగారు!
సాక్షి, అమరావతి: రాజధాని.. ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ పెద్దలు చెలరేగిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేసి తమ భూముల విలువ భారీగా పెంచుకున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా ఉన్న పొంగూరు నారాయణ బరితెగించి వ్యవహరించారు.లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో నారా లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. సీఐడీ దర్యాప్తులో ఈ కుంభకోణం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు కానుక..లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా కరకట్ట మీద ఉన్న తన అక్రమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఆ ఇంటిని ఉచితంగా ఇచ్చినట్లు ఆయన చెబుతుండగా నాడు చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు.తమ భూముల విలువ పెరిగేలా..ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించగా మార్కెట్ ధర రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. తద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ అమరావతి పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని లెక్కతేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ రూ.24 కోట్లకు చేరుతుంది. సీఆర్డీఏ తొలి అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో నారాయణ అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్పించారు. పవన్ కళ్యాణ్‌కు 2.40 ఎకరాలుజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిలో వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలో ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. ఏ1 చంద్రబాబు.. ఏ2 నారాయణ.. ఏ14 లోకేశ్ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీదిఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు తొలుత 94 కి.మీ. పొడవుతో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని గుర్తించిన టీడీపీ పెద్దలు అలైన్‌మెంట్‌ను మార్చేశారు. 3 కి.మీ. దక్షిణం వైపు జరిపేసి తాడికొండ, కంతేరు, కాజాలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని వెళ్లేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను ఆమోదించుకున్నారు.ఐఆర్ఆర్ కేసులో నిందితులుఏ–1: చంద్రబాబుఏ–2: నారాయణఏ–3: లింగమనేని రమేశ్ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్)ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ఏ–14: నారా లోకేశ్ -
అమరావతికి రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పాత మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధానిలో నిర్మాణాలు చేపడతామన్నారు.మూడు దశల్లో రాజధాని పనులు పూర్తి చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రపంచంలో ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. అత్యుత్తమ డిజైన్ రూపొందించి సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేసియా తదితర దేశాలను సందర్శించామన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని, తొలిదశలో భాగంగా రూ.48 వేల కోట్లతో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు.తొలిదశ పనులకు గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు రూ.9 వేల కోట్ల చెల్లింపులు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తైనట్లు పేర్కొన్నారు. తొలి దశలో సిటీ నిర్మాణం పూర్తి చేసి రెండో దశలో మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. రాజధాని విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌నే ఇప్పుడూ అమలు చేస్తామని, అయితే అంచనా వ్యయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉందన్నారు. 217 చ.కి.మీ మేర అమరావతి నిర్మాణం రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వగా అదే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఎలాంటి వివాదాలు లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మొత్తం 217 చ.కి.మీ విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపడతామని, సుమారు 3,600 కి.మీ మేర రోడ్లు నిరి్మస్తామని వివరించారు.రూ.48 వేల కోట్లతో చేపట్టిన ఈ తొలిదశ పనులు పూర్తవగానే రెండో దశలో గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఖర్చు గత మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనా వేశామని, మరోసారి టెండర్లు పిలిచి సవరించే అవకాశం ఉందన్నారు. అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియ చేస్తామన్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, సీడీఎంఏ శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు ఎన్వీఆర్కే ప్రసాద్, సీహెచ్ ధనుంజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై అంచనాలకు ఆదేశం అన్న క్యాంటీన్లను మూడు వారాల్లోగా వంద చోట్ల పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా 184 చోట్ల ప్రారంభించినట్లు చెప్పారు. వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
అత్యుత్తమ రాజధానిగా అమరావతి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి, ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలోని తన స్వగృహంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2015 జనవరిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు అందజేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములను రాజధాని ఏర్పాటుకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. వివిధ దశల్లోనే నిలిచిపోయిన భవనాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సుమారు రెండున్నరేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషిచేస్తామన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట..ఇక 2014 నుంచి 2019 వరకు తమ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలోని 114 మున్సిపాల్టీల్లో పెద్దఎత్తున పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన క్షణాల్లోనే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి చార్జీలు కూడా ప్రజల నుంచి వసూలుచేయలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్త పన్నుతో ప్రజలు బాగా ఇబ్బందులుపడ్డారని మంత్రి చెప్పారు. అధికారులతో సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో టిడ్కో ఇళ్ల పూర్తిపై దృష్టిసారిస్తామని.. అలాగే, అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చిస్తామన్నారు. -
మాస్టారూ.. ఎవరీమె?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేతగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల వేళ సత్యాన్ని సమాధిచేసి తన రాజకీయ పదవి కోసం తాళి కట్టిన భార్యనే కాదనుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణతో మూడు దశాబ్దాల పాటు అన్యోన్య దాంపత్య జీవితం పంచుకున్న ఆమె ప్రస్తుతం ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక భార్య, కుమార్తెను మాత్రమే చూపారు. రెండో భార్య ఆమె కుమార్తెను చూపించకపోవడంతో గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారాయణ మహిళలను వంచించిన విషయంలో సింహపురి మహిళలకు ఏమని సమాధానం చెబుతారు.తప్పుల కుప్ప.. ఆ ‘అఫిడవిట్’ టీడీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ చిక్కుల్లో పడ్డాడు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను సవాల్ చేస్తూ తన నామినేషన్ పత్రంతో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఒక భార్య ఉన్న వారే రాజ్యాంగబద్ధ పదవులకు అర్హులు. ఇంకో భార్య ఉన్నప్పటికీ విడాకులు అయినా ఇచ్చి ఉండాలి. అయితే నారాయణ విద్యా సంస్థల అధినేతగా నారాయణ వ్యక్తిగత జీవితం ‘తెరిచిన పుస్తకం’. నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఇలా.. 2014లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన భార్య పి. రమాదేవిగా, శారిణి (రెండో భార్య ఇందిర కుమార్తె), కుమారుడు నిషింత్‌ను డిపెండెంట్లుగా చూపించారు. వీరు కొడుకు, కూతురు అయినప్పటికి మిగతా ఐఐఐలోవారు తన సంతానంగా సృష్టంగా పేర్కొనకపోవడం విశేషం. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడివిట్లో కేవలం తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. అయితే అంతకు ముందే కుమారుడు నిషాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమార్తె శారిణిని అఫిడవిట్లో సంతానంగా, డిపెండెంట్లుగా పేర్కొనకపోవడం గమనార్హం. 2024లో (ప్రస్తుతం)ఇలా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. కానీ ఎక్కడా కుమార్తెలు ఉన్నట్లుగా చూపించకపోగా, శారిణి, సింధూర వద్ద అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్లో చూపించడం గమనార్హం. ఇందిర నారాయణ రెండో భార్యే? పొంగూరు ఇందిర రెండో భార్యే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 1996లో ఏర్పాటు చేసిన నారాయణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంస్థలో ఇందిర భర్త పొంగూరు నారాయణగా ఆమె చైర్మన్ హోదాతో ఉన్నట్లు ట్రస్ట్ బోర్డులో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు నిర్థారణ చేస్తున్నాయి. ఇందిర నిర్వహణ కమిటీలో కూడా కోశాధికారిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో మాత్రం ఎన్నికల కోసం ఆమెతో రాజీనామా చేయించారు.2011 నుంచి 2020 వరకు నారాయణ ఎడ్యుకేషన్ సోసైటికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లో లావాదేవీల విషయంలో కూడా ఇందిర సంతకం ఉంది. అయితే ఆమెతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనే ఆధారాల్లేవు. ఆమె పాస్‌పోర్టు పరిశీలించినా నారాయణ భార్యగా తేటతెల్లం అవుతుంది. ఆమె పేరుతో ఉన్న ఆస్తుల రిజిస్టర్ డాక్యుమెంట్లను పరిశీలించినా ఇదే విషయం ప్రస్ఫుటం అవుతుంది.ఇందిర కుమార్తె శారిణి పాస్‌పోర్ట్‌లో తన తండ్రి నారాయణగా ఉన్నట్లు సమాచారం. అయితే నారాయణ మంత్రి అయ్యాక వీకీపీడియాలో మాత్రం భార్య రమాదేవి, కుమార్తెలు సింధూర, శారిణి, కుమారుడు నిషాంత్ (లేట్) అనే విషయాలు నమోదు చేసి ఉండడం విశేషం. కన్యాదానం చేసి.. తర్వాత మసి పూసి నారాయణ గతంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కొంత కాలానికి కుమారుడు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తర్వాత కొన్నాళ్లకు తన కుమార్తె శారిణి (రెండో భార్య కుమార్తె)కి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో వివాహం జరిగింది.ఆ వివాహ సందర్భంలో నారాయణ, ఇందిర దంపతులుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. అలాగే నారాయణ ఎడ్యుకేషనల్ సోసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్‌గా శారిణి, రవితేజగా వ్యవహరిస్తున్నారు. అన్ని సందర్భాల్లో ఇందిరను భార్యగా చూపిస్తున్న నారాయణ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం చూపించకపోవడం విశేషం. టీడీపీకి ఆర్థిక దన్ను టీడీపీకి నారాయణ ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ చంద్రబాబు అండతో రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. అనేక అవినీతి బాగోతాల్లో నారాయణ పాత్రధారుడుగా ఉన్నారు. ఇక విద్యా సంస్థల్లో అయితే పేపర్ల లీకేజీల నుంచి అనేక అడ్డదారులు తొక్కారు. వీటి నుంచి బయటపడాలని 2019లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణ అవినీతి బాగోతాలన్నీ బయటపడ్డాయి. ఈ కేసులన్నీ మెడకు చుట్టుకోవడంతో కేసుల నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికల్లో గెలవాలని రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సైతం దాదాపు రూ.900 కోట్ల ఎన్నికల ఫండ్‌ను అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.నెల్లూరు సిటీలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టిన ఒక సామాన్యుడిపై ఓడిపోతాననే భయంతో రూ.100 కోట్లు వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నారాయణ ఎన్నికల అక్రమాలపై ఇప్పుడు వైఎస్సార్సీపీ దృష్టి సారించింది. 2014లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌పై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో వైఎస్సార్సీపీ నేతలు దృష్టి సారించలేదు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఆయన వ్యక్తిగత అఫిడవిట్‌పై దృష్టి కేంద్రీకరించలేదు.తాజాగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ గతంలో, ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తన అఫిడవిట్లలో తనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానం ఉన్నట్లు ఎక్కడా చూపించకపోవడంపై నిశితంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ప్రధానంగా నారాయణ భార్యగా రికార్డుల్లో ఉన్న ఇందిరతో విడాకులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు.ఆయనకు ముగ్గురు సంతానం అనేదానికి సైతం ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కుమారుడు చనిపోయినప్పటికీ ముగ్గురు సంతానం అనే నిబంధన నారాయణకు వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ నియమావళి చెబుతోంది. వీటిపై దృష్టిసారించిన వైఎస్సార్సీపీ నారాయణ అఫిడవిట్‌పై పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఆస్తుల్లోనూ తప్పుడు సమాచారమే? దేశ వ్యాప్తంగా నారాయణ విద్యాసంçస్థలను నెలకొల్పి వేలకోట్ల ఆస్తులను సొంతం చేసుకున్న నారాయణ ఎన్నికల ఆఫిడవిట్లో ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కుటుంబ ఆస్తులు విలువ రూ.824.05 కోట్లుగా చూపారు. ఆయన తోపాటు మొదటి భార్య రమాదేవి పేరిట ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి పేర్లతో అప్పులు కూడా రూ.189.59 కోట్లుగా చూపారు. కానీ దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్న నారాయణ అఫిడవిట్లో కొన్నింటినే చూపారని చెప్పుకోవాలి. కేసుల్లో దిట్ట నారాయణపై అఫిడవిట్లో చూపిన ప్రకారం ఎనిమిది కేసులు నమోదయిన్నాయి. నారాయణ తమ్ముడు భార్య నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ స్టేషన్లో వరకట్నం, వేధింపుల కేసు నమోదు చేయించింది. అలాగే చిత్తూరులో ప్రశ్నాపత్రాల లీక్ చేసిన అభియోగంతో కేసు నమోదయింది.అలాగే నారాయణ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో కడప జిల్లా బి కోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. మిగిలిన ఐదు కేసులు అమరావతితో భూముల విషయంలో సీఐడీ కేసులు నమోదు చేసింది.. అమరావతి భూముల మాస్టర్ డిజైనింగ్ అక్రమాలు, దళితుల భూములు కొనుగోలు, మంత్రిగా తన విధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై సీఐడీ కేసులు నమోదు చేసినట్లు చూపారు. నామినేషన్ స్క్రూట్నిలో అభ్యంతరాలు నెల్లూరులోని శుక్రవారం జరిగిన నామినేషన్ల స్క్రూట్ని సమయంలో నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి నారాయణ నామినేషన్ సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్‌పై స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పలు అభ్యంతరాలను తెలిపారు. నారాయణకు రెండు పెళ్లిళ్లు అధికారికంగా అయినట్లు పలు ఆధారాలతో సహ రిటర్నింగ్ అధికారికి చూపించారు. అఫిడవిట్లో రెండో భార్యను ఎక్కడ చూపించలేదని. రెండో భార్య కుమార్తె శారిణి ఉన్నట్లు చూపించారు.నారాయణ ఎడ్యుకేషన్ సోసైటీ ఏర్పాటు నుంచి ఆయన భార్యగా ఇందిరను చూపించారని, కుమార్తె శారిణి కూడా సోసైటి మేనేజ్మెంట్ మెంబర్‌గా ఉందని, వారి పాస్‌పోర్ట్‌లు పరిశీలించినా వాస్తవాలు తెలుస్తాయయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయా అభ్యంతరాల ఆధారంగా నారాయణ నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి ఆ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
మాకు ఇదేమి ఖర్మ నారాయణా..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భారీగా ఫీజులు చెల్లించి తమ విద్యా సంస్థల్లో పిల్లలకు మంచి విద్యను అందించాల్సిన టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన స్కూళ్లు, కాలేజీలను రాజకీయాలకు వేదికగా మార్చేశారు. చంద్రబాబు బినామీగా, టీడీపీ నేతగా, మాజీ మంత్రిగా చిరపరిచితుడైన నారాయణ ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నారాయణ విద్యా సంస్థల్లోనే రాజకీయ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. సంస్థలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఎన్నికల పనులు చేయిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్ఛిన ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. ఈ దఫా ఓటు టీడీపీకే వెయ్యాలని ప్రాథేయపడేలా చేస్తున్నారు. బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి.. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన నారాయణ నాలుగున్నరేళ్లపాటు నెల్లూరుకు ముఖం చాటేశారు. ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో ఈసారి టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన విద్యాసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి లాగారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోజువారీ విధుల నుంచి తప్పించి ఎన్నికల విధులు అప్పజెప్పినట్లు సమాచారం. దాదాపు 500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిపి నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ బృందంతో గతంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల వెరిఫికేషన్ చేయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్కొచ్చే ఓటీపీ అడగడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా, నారాయణ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తున్నారు. ప్రతి రోజూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి.. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల అడ్రెస్లు సేకరించి, ఒక్కొక్కరూ రోజుకు ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. తల్లిదండ్రులతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ దఫా ఓట్లు టీడీపీకే వేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే తమ యాజమాన్యం ఒత్తిడిపై వచ్చామని, ఏమీ అనుకోవద్దని ప్రాధేయపడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు దిగి విద్యా సంస్థల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నారు. మాట వినకపోతే డిస్మిస్ లేదా బదిలీ ఉన్నత చదువులు చదివిన తమకు వేతనం తక్కువైనప్పటికీ గౌరవప్రదమైన ఉద్యోగం అని చెప్పుకునేందుకు ఎక్కువ మంది నారాయణ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఏళ్ల తరబడి అదే సంస్థలో పని చేస్తున్నారు. నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్ఛిన 2019 నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ పనులకు వాడుకుంటున్నారు. ఉద్యోగులను భయపెట్టి మరీ ఎన్నికల పనులు చేయిస్తున్నారని విద్యాసంస్థ ఉద్యోగులు, ఉపా«ద్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తిరస్కరించిన ఉద్యోగులను పలు సాకులతోఉద్యోగం నుంచి తొలగించడమో, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడమో చేస్తున్నారని ఓ ఉద్యోగి వాపోయారు. -
ఎన్నికల ప్రచారానికి జనసేన జెండాలు వద్దు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచినా నెల్లూరు నగరంలో మాత్రం ఆ రెండు పార్టీల కలయికకు పచ్చనేతలు ససేమిరా అంటున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి ఎన్నికల సమరానికి వెళ్లేందుకు టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి కూడా కేవలం టీడీపీ జెండాతోనే వెళుతున్నారు. ఓవైపు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం టీడీపీ నేతలు అవమానించినా వారితో కలిసి పనిచేయాలని పిలుపునివ్వడంతో ఏం చేయాలో అర్థంకాక జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆశలు ఆవిరై.. జనసేన నెల్లూరు నగర సీటుపై మొదటి నుంచి ఆశలు పెంచుకుంది. జిల్లాలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో టీడీపీతో పొత్తు కుదిరితే నెల్లూరు సీటు తమకే వస్తుందని ఆ పార్టీ నేత మనుక్రాంత్‌రెడ్డి ఎంతగానో ఆశపడ్డారు. అందుకు తగినట్లుగానే పార్టీ కీలకనేత నాదెండ్ల మనోహర్‌తో సన్నిహితంగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర సీటు టీడీపీ అధినేత చంద్రబాబు బినామీగా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఓకే చేయడంతో జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నారాయణ టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినప్పటికీ జనసేన నేతలను పూచికపుల్లలా తీసేశాడు. నియోజకవర్గ పరిధిలో జరిగే ఏ కార్యక్రమాలకూ వారిని ఆహ్వానించడం లేదు. దీంతో జనసేన నేతలు నారాయణతో కలవలేక తమకు జరుగుతున్న అవమానాలకు మనస్సులోనే కుంగిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామంటూ గుర్రుగా ఉన్నారు. కోవర్టును పెట్టి.. మాజీ మంత్రి నారాయణ ఆది నుంచి జనసేనలో చీలిక తెచ్చేందుకు పావులు కదిపాడు. ఆ పార్టీలో తన కోవర్టును ఏర్పాటు చేసుకుని రెండు గ్రూపులుగా విడిపోయేలా చేశాడు. మనుక్రాంత్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని కూడగట్టి పార్టీ నేతలను విడగొట్టేలా తన కోవర్టును ఉపయోగించాడు. అనుకున్నట్లే కోవర్టు ద్వారా మనుక్రాంత్ను దెబ్బతీశాడు. జిల్లాలో ‘గ్లాసు’ను పట్టించుకోకుండా చేసి నారాయణ తన పంతం నెగ్గించుకున్నాడు. -
నారాయణ ‘నల్ల’ పుట్ట!
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్‌స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్‌స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఎన్‌స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్‌స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్‌స్పై నిర్వాకాలు ఇవిగో.. నిధులు మళ్లించేందుకే.. నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు. అమరావతి భూ దందా.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్‌స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్‌స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్‌స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్‌స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్‌లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు. ఓ వ్యాపార సంస్థ ఎన్‌స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్‌స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్‌స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు. నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్‌స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 కోట్ల పన్నుల ఎగవేత లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్‌స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్‌ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మాజీ మంత్రి పొంగూరు నారాయణ నివాసంలో పోలీసుల తనిఖీలు
-
టీడీపీ నేత నారాయణపై పొంగూరు ప్రియ ఫైర్
-
మళ్ళీ వెలుగులోకి టీడీపీ నారాయణ బండారం.. మరదలు ప్రియా షాకింగ్ నిజాలు
-
మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు
-
మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారాయణ ఒక ఉమనైజర్.. అతడిని ఎవరు నమ్మొద్దంటూ మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు పొంగూరు ప్రియ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. నేను చాలా ఆవేదనతో ఈ వీడియో పెడుతున్నాననంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న మాజీ మంత్రి నారాయణను నెల్లూరు ప్రజలు నమ్మి దయచేసి మోసపోవద్దు. ఇంట్లో ఆడవాళ్లని వేధిస్తూ టార్చర్‌కు గురిచేసే నారాయణ ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రియ ప్రశ్నించారు. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడని.. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నానని.. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడని గతంలో కూడా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: ‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ -
‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకుని రానున్న ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాగా జనసేన నేతలు మాత్రం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ స్థానాన్ని వదులుకుంటే ‘గ్లాసు’ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్రకటించినట్లు ప్రచారం ఉంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు కుంపటి రగులుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో నూతన జిల్లాలో జనసేన పార్టీ స్థానం ఎక్కడనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా నారాయణకు ఎసరు పెట్టే అవకాశం ఉండడంతో సీటు కోసం గ్లాసుకు ఖరీదు కట్టినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నెల్లూరు నగర సీటు వదులుకుంటే జనసేనకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ‘ఉనికి’పాట్లు ప్రస్తుతం జిల్లాలో అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఆ రెండు పార్టీలకు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ప్రజల మద్దతు లేకపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తు ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ రెండు పార్టీల పొత్తు జిల్లాలో వికటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఏ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తారనే అంశంపై స్పష్టత లేనప్పటికీ జిల్లాలో జనసేనకు సీటు కావాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. సీటు వదులుకుంటే బంపర్ ఆఫర్ ప్రస్తుతం జనసేన నేతలు నెల్లూరు నగర నియోజకవర్గం సీటు కావాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం ఉండగా, నాదెండ్ల మనోహర్ ద్వారా నగర సీటు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నెల్లూరు నగర సీటు జనసేనకు కేటాయించే పరిస్థితి వస్తే మాజీ మంత్రి నారాయణను ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ ప్రకటించుకున్న నారాయణ తన సొంత ఎన్నికల టీంను రంగంలోకి దింపి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఉన్న పళంగా సీటు జనసేనకు కేటాయిస్తే తన పరువు పోతుందని భావించి జనసేనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. జిల్లాలో నెల్లూరు నగర సీటు తప్పించి ఏ సీటు అడిగినా టీడీపీ అధినేత చంద్రబాబును ఒప్పించడమే కాకుండా జనసేన అభ్యర్థికి అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తం తానే చూసుకుంటాననడంతోపాటు జనసేన నేతలకు మరో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఆఫర్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జనసేన నేతలు ప్యాకేజీ ఆఫర్‌తో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. నెల్లూరు నగరం సీటు కాకుంటే నెల్లూరు రూరల్ సీటుపై దృష్టిపెడుతున్నట్లు కూడా మరో ప్రచారం ఉంది. నెల్లూరు రూరల్ సీటు ఆశిస్తే తప్పక టీడీపీ అధినేతను ఒప్పించి, ఎన్నికల ఖర్చు, ప్యాకేజీ కూడా ఇప్పించేందుకు మాజీ మంత్రి నారాయణ తెర వెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది. మరి జనసేనకు ప్యాకేజీ ఆఫర్ ఎంత మేర పనిచేస్తుందో వేచి చూడాలి. జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా 8 (నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, ఉదయగిరి, కావలి, కందుకూరు) నియోజకవర్గాలకు పరిమితమైంది. ఈ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు పెద్దగా ఆదరణ లేదు. పైగా ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా ప్రస్తుతం లేరు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్‌రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌తో ఉన్న అనుబంధం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పొత్తుతో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మనుక్రాంత్‌రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఇదేమి పని ‘నారాయణా’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ఎన్నికల ఉచ్చులో ఇరుక్కున్నారు. తమ విద్యాసంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాజకీయంలో సమిధలైపోతున్నారు. వారి చేత నారాయణ ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ సిబ్బంది, ఉపాధ్యాయులకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తున్నారు. మూడురోజుల క్రితమే నెల్లూరు నగరం మూలాపేట డివిజన్లో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న నారాయణ సంస్థ ఉద్యోగినికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాజాగా మంగళవారం నగరంలోనే 42వ డివిజన్ మన్సూర్‌నగర్‌లో ఇదే తరహాలో నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయుడు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండగా స్థానికులు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎన్ టీంగా ఏర్పాటు నారాయణ టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు నెల్లూరుకు ముఖం చాటేసిన ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన కోసం పనిచేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రావడంలేదు. దీంతో తన విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రంగంలోకి దింపుతున్నారు. దాదాపు 150 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ బృందంలోని వారితో నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్‌కు వచ్చే ఓటీపీని కూడా అడుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. తమ ఓట్లు తొలగిస్తారని స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. నెల్లూరు నగరంలో మూడు రోజుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు దేహశుద్ధి చేయించుకొన్నారు. ఇదేం ఖర్మ నారాయణా.. అంటున్న ఉద్యోగులు నారాయణ విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా అనేక మంది పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు నారాయణ టీడీపీకి ఆర్థికంగా తోడ్పాటు అందిçస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బినామీగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో నారాయణను చంద్రబాబు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే ఏదో ఒక సాకుతో ఉద్యోగం నుంచి తొలగించడం.. లేదా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం చేస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇప్పుడు ఉద్యోగులు ప్రజల చేతిలో తన్నులు తింటున్నారు. మాకు ఇదేం ఖర్మ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మాజీ మంత్రి నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. : పొంగూరి ప్రియ
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. -
Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates 07:28 PM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు 05:44 PM, అక్టోబర్ 04, 2023 ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం ►ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి ►ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి ►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు ►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు ►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు ►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి ►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 05:07 PM, అక్టోబర్ 04, 2023 స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు 04:05 PM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టు: సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు ►సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు ►కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం ►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు ►శ్రీనివాస్ పాస్‌పోర్ట్ సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి 03:47 PM, అక్టోబర్ 04, 2023 ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు 03:39 PM, అక్టోబర్ 04, 2023 ►స్కిల్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా ►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు 03:03 PM, అక్టోబర్ 04, 2023 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి ►చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది ►స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు ►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది ►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది ►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు ►స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం ►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి ►స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు ►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం ►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ ►సీమెన్స్‌తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు 02:54 PM, అక్టోబర్ 04, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:30 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్ ►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి ►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు ►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:26 PM, అక్టోబర్ 04, 2023 నారా ఫ్యామిలీకి పరామర్శలు ►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 01:21 PM, అక్టోబర్ 04, 2023 అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా ►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ 01:15 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు లాయర్ సుదీర్ఘ వాదనలు ►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు ► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది ► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు ► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు ► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది? ► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే 01:00 PM, అక్టోబర్ 04, 2023 విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు ►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్ దూబే ►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే ►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే ►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు ►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు ►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది 12:53 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ► చంద్రబాబు పిటిషన్ విచారణ.. అడిషినల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు చేరుకున్నారు ► ప్రస్తుతం బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ దూబే 12:18 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ ►బెయిల్ పిటిషన్‌పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్ ప్రమోద్‌కుమార్ దూబే ►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు ►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. ►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది ►ఆ కమిటీలో చంద్రబాబు లేరు ►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది ►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు ►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు ►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది? ►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు? 12:00 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌కు పోలీసుల నోటీసులు ►జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు ►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ ►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా ►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం ►నోటీస్‌లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు ►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది ►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం ►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం 11:50 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్‌పై మొదలైన వాదనలు ►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు ►బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి ►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్ ప్రమోద్‌కుమార్ దుబే ►అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ ► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు 11:45 AM, అక్టోబర్ 04, 2023 హైకోర్టులో నారాయణ పిటిషన్ విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు ►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ ►ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►క్వాష్ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి ►విచారణ ఎల్లుండికి వాయిదా 11:15 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు స్పెషల్ జీపీ వివేకానంద ►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) వివేకానంద ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద ► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు 11:05 AM, అక్టోబర్ 04, 2023 ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు ►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి ►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన ►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ ►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు 10:47 AM, అక్టోబర్ 04, 2023 వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ ►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ► ఇంటరాగేషన్‌లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ ► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ ►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ ► స్కిల్ స్కాంలో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ 10:14 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం? ►ఎన్ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్‌కాట్ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్ అసోషియేషన్ ►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరగాల్సిన విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ ►బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన ►సుప్రీంలో ఎస్ఎల్పీ పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు ►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు ►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత 09:45 AM, అక్టోబర్ 04, 2023 తూర్పు గోదావరిలో 144 సెక్షన్: ఎస్పీ జగదీష్ ►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు ►గురువారం నిర్వహించేందుకు ప్లాన్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్ ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్ అని స్పష్టీకరణ ►144 సెక్షన్‌తో పాటు పోలీస్ సెక్షన్ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన 09:04 AM, అక్టోబర్ 04, 2023 టీడీపీ వర్గాల్లో టెన్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు ►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి ►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్ ►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు ►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన 08:50 AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా ►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో వినతి ►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ►ఇదే కేసులో.. నిన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 08:20 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌లాంటి చెత్త నేత లేడు! ►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..? ►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు. ►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ 07:38 AM, అక్టోబర్ 04, 2023 బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న ► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ ► అరెస్ట్.. ఆపై కండిషనల్ బెయిల్ మీద విడుదల ► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం ►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు. ►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వయసు పెరగ్గానే సరిపోదు.. కాస్త జ్ఞానం, ఇంగితం కూడా ఉండాలి. మంత్రి రోజా గారి గురించి నువ్వు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు.. మీ ఇంట్లో భార్య లేదా కూతురిని ఉద్దేశించి అంటే నీకు ఎలా ఉంటుంది బండారు సత్యనారాయణ? టీడీపీ నేతలు కాస్త నోరు… pic.twitter.com/4QPXKD69oc — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:30AM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్ ►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ ►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 07:25AM, అక్టోబర్ 04, 2023 నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ ► ఇవాళ్టి వరకు(అక్టోబర్ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ►నేడు మళ్లీ జరగనున్న వాదనలు 07:15AM, అక్టోబర్ 04, 2023 నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం ►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ ►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ ►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్ ►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ 06:52AM, అక్టోబర్ 04, 2023 10న సీఐడీ ముందుకు లోకేష్ ►అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌కు హైకోర్టు ఆదేశం ►లోకేష్‌పై మూడు కేసులు, రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం ►అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ 06:50AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో బాబుకి దక్కని ఊరట ►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్, చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సోమవారానికి(అక్టోబర్ 9వ తేదీకి) వాయిదా ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం ►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్ స్కాం, అంగళ్లు, రింగ్ రోడ్ ►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ విచారణ 06:46AM,అక్టోబర్ 04, 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు @25 ►సీఎంగా ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ ►సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ ► రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ► ఖైదీ నెంబర్ 7691గా స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక వసతులు ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు ► నేటితో (అక్టోబర్ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్‌వర్క్‌ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్‌స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
దోపిడీకి రాచబాట
రాజధాని అమరావతిని చంద్రబాబు తన అవినీతికి అక్షయపాత్రగా మార్చుకున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన అవినీతికి సాధనంగా చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. అందుకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. కేవలం కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో చినబాబు లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లుకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. ఇంతటి భారీ అవినీతికి రాచబాట వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక గూడు పుఠాణీ ఇలా సాగింది. –సాక్షి, అమరావతి చంద్రబాబు అలైన్‌మెంట్‌కు కన్సల్టెన్సీ ద్వారా రాజముద్ర సీఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంపై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది. అంటే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి నిర్మించాల్సి వస్తుంది. దాంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలు ఉన్న తాడికొండ, కంతేరు, కాజలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజలలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తీసుకొచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. తాడికొండ, కంతేరు, కాజలలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ ఖరారు చేసింది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, ఆయన బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజలలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. కాగా మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి–కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప–ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్‌రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం–కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఏ–1 చంద్రబాబు, ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రింగ్‌రోడ్డు కుంభకోణంపై సీఐడీ సమగ్ర దర్యాప్తు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని రమేశ్, ఏ–4 లింగమనేని రాజశేఖర్, ఏ–5 అంజినీ కుమార్, ఏ–6గా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. -
ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇన్నాళ్లు పెండింగ్‌లోనా..!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంలో 2020లో సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాలు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏడాది పెండింగ్‌లో ఉండటం తామెన్నడూ చూడలేదని తెలిపింది. ఇదే సమయంలో వాదనలు వినిపించేందుకు నారాయణ, ఇతరుల తరఫు న్యాయవాదులు మరోసారి సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలానే వాయిదాలు కోరుతుంటే, నారాయణ తదితరులను అరెస్ట్ చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తామని, అప్పుడు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమని నారాయణ తదితరులకు హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒకవైపు ముందస్తు బెయిల్ పిటిషన్లు, మరో వైపు కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడంపైనా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఎలా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేస్తారని, అవి ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. ఇలాంటి ఫైలింగ్‌ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారు... తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. నారాయణ తదితరుల తరఫు న్యాయవాదులు ఎస్.ప్రణతి, అజయ్ తదితరులు స్పందిస్తూ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ తరఫున వాదనలు వినిపించాల్సి ఉందని, వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీనియర్ న్యాయవాది పేరుతో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది కాలంగా ఇలాగే ఈ వ్యాజ్యాల్లో విచారణను సాగదీస్తూ వస్తున్నారని తెలిపారు. అరెస్ట్‌పై స్టేను అడ్డం పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారని కోర్టుకు ఏఏజీ నివేదించారు. ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ, ఇలా పదే పదే వాయిదాలు కోరుతుంటే ఏఏజీ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నారాయణ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దాదాపు ఏడాదిగా ముందస్తు బెయిల్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం ఎన్నడూ చూడలేదని, ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి నారాయణ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ, రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయవచ్చునని, ఇందుకు సంబంధించిన తీర్పులను వాదనల సమయంలో కోర్టు ముందుంచి, సంతృప్తికర వివరణ ఇస్తామని తెలిపారు. ఆమె వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి వాయిదాలు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. వాయిదాలు ఇవ్వడం ఇదే చివరి సారి అని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఏక కాలంలో రెండు పిటిషన్లా.. సీఐడీ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ 2022 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయన సమీప బంధువులు, బినామీలు తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు వేశారు. నారాయణ కూడా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ 2023లో క్వాష్ పిటిషన్ వేశారు. 2022లో ముందస్తు బెయిల్ కోసం నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పట్లో విచారించిన హైకోర్టు, కేన్సర్ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో స్పందించిన హైకోర్టు, సీఆర్పీసీ 41ఏను అనుసరించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ వ్యాజ్యాల్లో విచారణ పలుమార్లు వాయిదా పడింది. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో నారాయణ తదితరులు ఏదో ఒక కారణం చూపుతూ వాయిదాల మీద వాయిదాలు కోరుతూ వచ్చారు. దర్యాప్తు సంస్థ న్యాయవాదులు కూడా ఒకటి రెండు సార్లు వాయిదాలు అడిగారు.