
సాక్షి, అమరావతి: మాల్ ప్రాక్టీస్ తప్పు కాదని టీడీపీ చెప్పగలదా? అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారని.. తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని సజ్జల హెచ్చరించారు.
చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే..
మాల్ ప్రాకిస్ట్‌పై వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఎన్నడూ ఇంతవేగంగా చర్యలు తీసుకున్నది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే చర్యలు తీసుకోవద్దా? ఓ మాఫియాలా ఏర్పడి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాజకీయ కక్ష అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. నారాయణ ఆ సంస్థలకు సంబంధం లేదంటారా.?. ఇప్పుడు అల్లుడు, కూతురు డైరెక్టర్లు అంటున్నారు. అయితే వాళ్లని అరెస్ట్ చేయొచ్చా.? నారాయణ గైడ్ చేసి నేరం చేయించాడని గిరిధర్ చెప్తున్నాడు. మరి అతను నేరం చేయలేదా?.ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా చంద్రబాబు’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment