సాక్షి, తిరుపతి: ఏపీ మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. రుషికొండపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టించిన భవనం చూసి చంద్రబాబు సంతోషపడ్డారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి అని కామెంట్స్ చేశారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయి. ఒక మాఫీయ రాజ్యం ఏలుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారు
వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ కట్టడాలు చేయలేదు. కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారు. వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోపడ్డారు. వైఎస్ జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అసెంబ్లీ భవనాలు చూస్తే నీ పాలన అర్థం అవుతుంది. వైఎస్ జగన్ చేసిన వేల కోట్ల సంక్షేమంతో నీవు పోల్చుకోగలవా చంద్రబాబు?. సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదు. ఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు ప్రతీరోజు అప్పు చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి. వైఎస్ జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయి.
ఈ నేలపై చంద్రబాబుకు ఏ రోజు మమకారం లేదు. ఎన్నికలు కూడా త్వరగా వచ్చేట్లు ఉన్నాయి. పటిష్టమైన కార్యకర్తలతో పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఇదే మా తొలిఅడుగు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం చేస్తాం. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment