కూటమి నేతల దౌర్జన్యాలకు తగిన గుణపాఠం చెబుతాం: భూమన | YSRCP Leaders Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

కూటమి నేతల దౌర్జన్యాలకు తగిన గుణపాఠం చెబుతాం: భూమన

Jan 30 2025 3:08 PM | Updated on Jan 30 2025 3:12 PM

YSRCP Leaders Serious Comments On CBN Govt

సాక్షి, తిరుపతి: కూటమి నేతల ఉడత బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ బెదిరే అవకాశమే లేదని హెచ్చరించారు పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని కౌంటరిచ్చారు. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మున్సిపల్ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఫిబ్రవరి మూడో తేదీన తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి శేఖర్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ తరపున బరిలో దింపుతాం. సౌమ్యుడైన శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే స్థానిక కూటమి నాయకులు ఫోన్లు చేసి బెదిరించారు. మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఎలా పోటీ చేస్తావ్ నీ అంతు చూస్తాం అని శేఖర్ రెడ్డిని బెదిరిస్తున్నారు.

ఇలాంటి ఉడత బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ బెదిరే అవకాశమే లేదు. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. మీరు భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు తిరుపతిలోనే ఉంటారు. ఆ సునామీని మీరు తట్టుకోలేరు’ అంటూ హెచ్చరించారు.

మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయాలని చంద్రబాబుపై కుప్పం వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ హయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందజేశారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో గ్రామ సచివాలయాలను నిర్మించారు, గ్రామ స్వరాజ్య పాలన సాగించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వైఎస్‌ జగన్‌ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement