
సాక్షి, తిరుపతి: వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ పట్టు నిలుపుకుంది. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్‌పై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 20 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. 25 మంది కౌన్సిలర్లలో 20 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో, టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.
అయితే, అవిశ్వాస తీర్మానానికి ముందే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ చేతులెత్తేశారు. ఇక, టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ రామ్‌కుమార్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఇక, ఈరోజు ఉదయమే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్స్ కౌన్సిల్ హాల్‌కు బయలుదేరారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జ్ రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వాహనాలలో 20 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ నక్కా భాను ప్రియపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ చేసిన కుట్రను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తిప్పి కొట్టారు.