అర్ధరాత్రి అరాచకం.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్‌ | YSRCP MLC Sipai Subramanyam Kidnapped | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అరాచకం.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌

Published Tue, Feb 4 2025 7:07 AM | Last Updated on Tue, Feb 4 2025 10:41 AM

YSRCP MLC Sipai Subramanyam Kidnapped

సాక్షి, తిరుపతి జిల్లా: కూటమి ప్రభుత్వం అరాచకం పరాకాష్టకు చేరింది. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్‌ చేశారు. ఎమ్మెల్సీని కిడ్నాప్‌ చేసిన టీడీపీ నేత రవి నాయుడు.. దుర్మార్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినాసరే అధికార దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది.

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక నేటికి( మంగళవారం) వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వీయూ ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది.

కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్‌సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. 

తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్‌ను  టీడీపీ గూండాలు చితకబాదారు. అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్‌లపై కూటమి రౌడీలు దాడికి పాల్పడ్డారు.  రెండు కార్లను ధ్వంసం చేశారు. 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసి బెదిరించాలని కూటమి నేతలు ప్రయత్నం చేశారు. 

తిరుపతిలో టీడీపీ గూండాల అరాచకం

కార్పొరేటర్‌ సతీమణి కిడ్నాప్‌నకు యత్నం
తిరుపతి 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ అనీల్‌ రాయల్‌ సతీమణి మమతను కూటమి నేతలు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు.  తిరుపతిలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ నాయకులు సోమవారం ఉదయం కిడ్నాప్‌ చేశారు. వారిలో అనీష్‌ రాయల్‌ కూడా ఉన్నారు. ఆయన కూటమి నేతలకు లొంగడని అనీష్‌ రాయల్‌ భార్యను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు.

సమాచారం తెలసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు వెంటనే అనీష్‌ రాయల్‌ సతీమణి మమతను ఆర్‌సీ రోడ్డులోని రాయల్‌ నగర్‌లో పారీ్టకి చెందిన నాయకుడి ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఆ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో భూమన అభినయ్‌ రెడ్డికి సమాచారం ఇచ్చారు.

వెంటనే అభినయ్‌ రెడ్డి, నాయకులు అక్కడకు చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకుని కార్లను ధ్వంసం చేశారు. అభినయ్‌ డ్రైవర్, టౌన్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ వాసు యాదవ్, పార్టీ నాయకుడు కౌసిక్‌లపై దాడి చేయగా, అభినయ్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత అభినయ్‌ రెడ్డి ఎంపీ గురుమూర్తికి ఫోన్‌ చేశారు. వెంటనే ఎంపీ గురుమూర్తి, కొంతమంది వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సమాచారంతో పోలీసులు రాగా, మమతను సురక్షితంగా భూమన కరుణాకర రెడ్డి ఇంటికి చేర్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement